కరెంట్అఫైర్స్(ఫిబ్రవరి - 1st వీక్) బిట్‌బ్యాంక్
1. ఒక రోజును ‘బేటీ బచావో–బేటీ పడావో’ నేపథ్యం కోసం కేటాయించి, మూడు రోజుల పాటు నర్మదా మహోత్సవ్‌ను ఏ రాష్ట్రం జరుపుకుంది?
1) మహారాష్ట్ర
2) గుజరాత్
3) మధ్యప్రదేశ్
4) పంజాబ్
- View Answer
- సమాధానం: 3
2. శ్రీరామ్‌చంద్ర మిషన్, హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ 75వ వార్షికోత్సవం సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన మందిరాన్ని ఎక్కడ ప్రారంభించారు?
1) కోల్‌కతా, పశ్చిమ బెంగాల్
2) విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
3) హైదరాబాద్, తెలంగాణ
4) భువనేశ్వర్, ఒడిశా
- View Answer
- సమాధానం: 3
3. ఇటీవల రామ్సర్ సైట్లో చేరిన నందూర్ మాధమేశ్వర్ ఏ రాష్ట్రంలో ఉంది?
1) మహారాష్ట్ర
2) పశ్చిమబెంగాల్
3) అస్సాం
4) మధ్యప్రదేశ్
- View Answer
- సమాధానం: 1
4. విఖ్యాత స్కాట్లాండ్ ఫుట్‌బాల్ క్లబ్ రేంజర్స్ ఎఫ్సీకి ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని పొందిన తొలి భారత మహిళా ఫుట్‌బాల్ క్రీడాకారిణి ఎవరు?
1) లోయితోంగ్బామ్ ఆశలతా దేవి
2) న్గాంగోమ్ బాలాదేవి
3) ఓనింబెంబెం దేవి
4) నజ్ఞానబాం స్వీటీ దేవి
- View Answer
- సమాధానం: 2
5. బార్కా అకాడమీ కప్–ఆసియా పసిఫిక్ 2020 ఏ దేశంలో జరగనుంది?
1) జకర్తా, ఇండోనేషియా
2) కౌలాలంపూర్, మలేషియా
3) బ్రిస్బేన్, క్వీన్స్‌ల్యాండ్, ఆస్ట్రేలియా
4) గుర్గావ్, హర్యానా, భారత్
- View Answer
- సమాధానం: 4
6. పాకిస్తాన్‌తో పాటు, పంటలకు పెద్ద నష్టం కలిగించే మిడతలు దారుణంగా దాడి చేసిన కారణంగా మిడతలను ‘జాతీయ అత్యవసర పరిస్థితి’గా ప్రకటించిన దేశం ఏది?
1) భారత్
2) అఫ్ఘనిస్తాన్
3) సోమాలియా
4) ఉగాండా
- View Answer
- సమాధానం: 3
7. యూఎన్డీపీ విడుదలచేసిన భారతదేశ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల నివేదిక–2019లో ‘మంచి పని, మంచి ఆర్థిక వృద్ధి’ విభాగంలో అత్యధిక పనితీరు కనబర్చిన రాష్ట్రం ఏది?
1) ఆంధ్రప్రదేశ్
2) తెలంగాణ
3) కర్ణాటక
4) తమిళనాడు
- View Answer
- సమాధానం: 2
8. మూడో ‘గ్లోబల్ పొటాటో కాంక్లేవ్’ఎక్కడ జరిగింది?
1) న్యూఢిల్లీ, ఢిల్లీ
2) హైదరాబాద్, తెలంగాణ
3) ముంబై, మహారాష్ట్ర
4) గాంధీనగర్, గుజరాత్
- View Answer
- సమాధానం: 4
9. అడ్డూ టూరిజం జోన్ స్థాపించడానికి భారతదేశం 2.49 మిలియన్ డాలర్ల విలువైన అవగాహన ఒప్పందంపై ఏ దేశంతో కలిసి సంతకం చేసింది?
1) శ్రీలంక
2) బంగ్లాదేశ్
3) థాయ్‌లాండ్
4) మాల్దీవులు
- View Answer
- సమాధానం: 4
10. 2020 జనవరిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ వైరస్ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోన్న నేపథ్యంలో ‘ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితి’ (గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ) అని ప్రకటించింది?
1) ఎబోలా వైరస్
2) నావల్ కరోనా వైరస్
3) నిఫా వైరస్
4) రుబెల్లా వైరస్
- View Answer
- సమాధానం: 2
11. 2020 ఫిబ్రవరిలో ‘గడప వద్దకే పెన్షన్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది?
1) తెలంగాణ
2) ఆంధ్రప్రదేశ్
3) ఒడిశా
4) ఉత్తరప్రదేశ్
- View Answer
- సమాధానం: 2
12. అంతర్జాతీయ సూరజ్కండ్ క్రాఫ్ట్స్ మేళా –2020, 34వ ఎడిషన్‌లో ‘థీమ్ స్టేట్’గా ఎంపికైన భారతీయ రాష్ట్రం ఏది?
1) అరుణాచల్‌ప్రదేశ్
2) ఉత్తరప్రదేశ్
3) ఆంధ్రప్రదేశ్
4) హిమాచల్‌ప్రదేశ్
- View Answer
- సమాధానం: 4
13. ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం నేపథ్యం ఏమిటి?
1) చిత్తడి నేలలు, జీవవైవిధ్యం
2) కార్బన్ సింక్లు వంటివి చిత్తడి నేలలు
3) చిత్తడి నేలలు, వాతావరణ మార్పు
4) వరద తగ్గింపు కోసం చిత్తడి నేలలు
- View Answer
- సమాధానం: 1
14. అంతర్జాతీయ కోల్‌కతా బుక్ ఫెయిర్–2020, 44వ ఎడిషన్ సందర్భంగా విడుదలైన ‘వై వు ఆర్ సేయింగ్ నో సీఎఎ, నో ఎన్ఆర్సీ, నో ఎన్పీఆర్’ అనే పుస్తక రచయిత ఎవరు?
1) అశోక్ గెహ్లాట్
2) పినరై విజయన్
3) రాజింద్ కౌర్ భట్టల్
4) మమతా బెనర్జీ
- View Answer
- సమాధానం: 4
15. ఖతార్ కొత్త ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు?
1) ఖలీఫా బిన్ హమాన్ అల్ తని
2) హమాద్ బిన్ ఖలీఫా అల్ తని
3) అబ్దుల్లా బిన్ ఖలీఫా అల్ తని
4) షేక్ ఖలీద్ బిన్ ఖలీఫా బిన్ అబ్దుల్లాజిజ్ అల్ తని
- View Answer
- సమాధానం: 4
16. ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఐజీఐఏ)లో మహిళల భద్రతను ఉద్దేశించి ప్రారంభించిన క్యాబ్ సర్వీస్?
1) శక్తి ది పవర్
2) శక్తి ఆన్ ఫోర్స్
3) మిత్ర శక్తి
4) ఉమెన్ విత్ వీల్స్
- View Answer
- సమాధానం: 4
17. 2019 డిసెంబర్లో నీతి ఆయోగ్ ఆదర్శ జిల్లాల ర్యాంకింగ్‌లో అగ్రస్థానంలో ఉన్న జిల్లా ఏది?
1) విజయనగరం, ఆంధ్రప్రదేశ్
2) చందౌలీ, ఉత్తరప్రదేశ్
3) బలంగిర్, ఒడిశా
4) వై.ఎస్.ఆర్. కడప, ఆంధ్రప్రదేశ్
- View Answer
- సమాధానం: 2
18.వరల్డ్ స్టీల్ అసోసియేషన్ (డబ్ల్యూఎస్ఎ) 2019 ప్రకారం ఉక్కు ఉత్పత్తి ఆధారంగా భారతదేశ ర్యాంక్ ఎంత?
1) 3
2) 2
3) 1
4) 5
- View Answer
- సమాధానం: 2
19. శిలీంధ్ర వ్యాధుల చికిత్సకు అవసరమైన చమురు ఆధారిత జౌషధ క్యారియర్‌ను ఏ సంస్థ పరిశోధకులు అభివృద్ధి చేశారు?
1) ఐఐటీ హైదరాబాద్
2) ఐఐటీ మద్రాస్
3) ఐఐటీ ఢిల్లీ
4) ఐఐటీ కాన్పూర్
- View Answer
- సమాధానం: 1
20. ఇరాక్ కొత్త ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు?
1) మహ్మద్ తవ్ఫిక్ అల్లావి
2) ఆదిల్ అబ్దుల్ మహదీ
3) హైదర్ అల్ అబదీ
4) నౌరి అల్ మాలికి
- View Answer
- సమాధానం: 1
21. పశ్చిమబెంగాల్లోని కోల్‌కతాలో జరిగిన అంతర్జాతీయ కోల్‌కత బుక్ ఫెయిర్ 2020 (ఐకెబీఎఫ్) 44వ ఎడిషన్‌లో ఫోకల్ థీమ్ ఉన్న దేశం ఏది?
1) బంగ్లాదేశ్
2) చైనా
3) జపాన్
4) రష్యా
- View Answer
- సమాధానం: 4
22. న్యూఢిల్లీలో జరిగిన ప్రపంచ సుస్థిరాభివృద్ధి శిఖరాగ్ర సమావేశం (డబ్ల్యూఎస్డీఎస్) 2020 నేపథ్యం ఏమిటి?
1) టువర్డ్స్ 2020 గోల్స్: మేకింగ్ ద కౌంట్
2) టువర్డ్స్ 2025 గోల్స్: మేకింగ్ ఇట్ కౌంట్
3) టువర్డ్స్ 2030 గోల్స్: మేకింగ్ ద డెకడ్ కౌంట్
4) టువర్డ్స్ 2030 ఎస్డీజీ గోల్స్: మేకింగ్ ద డెకడ్ కౌంట్
- View Answer
- సమాధానం: 3
23. న్యూఢిల్లీలో జరిగిన దక్షిణాసియా సదస్సు 12వ ఎడిషన్ నేపథ్యం ఏమిటి?
1) ముందు దేశం : విధాన ప్రాంతీయ అవగాహన
2) ముందు సోదరత్వం : విధాన ప్రాంతీయ కుట్రదారులు
3) ముందు ఇరుగుపొరుగువారు : విధాన ప్రాంతీయ అవగాహన
4) ముందు స్నేహం : విధాన ప్రాంతీయ అవగాహన
- View Answer
- సమాధానం: 3
24. సీఐఐ 125వ వార్షికోత్సవ వేడుకలో రాష్ట్రంలోని హరిత పరిశ్రమల కోసం డైరెక్ట్ కన్సంట్ టు ఆపరేట్ (సీటీఓ) పథకాన్ని ప్రకటించిన భారతీయ రాష్ట్రం ఏది?
1) ఆంధ్రప్రదేశ్
2) తెలంగాణ
3) కర్ణాటక
4) తమిళనాడు
- View Answer
- సమాధానం: 4
25. భారతీయ ప్రజలలో వార్త అక్షరాస్యతను ప్రోత్సహించడానికి లాభాపేక్షలేని సంస్థ ‘ఇంటర్‌న్యూస్‌కు’ 1 మిలియన్ డాలర్లను ఇవ్వడానికి ఏ భారీ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది?
1) ఫెస్బుక్
2) ఆపిల్
3) మైక్రోసాఫ్ట్
4) గూగుల్
- View Answer
- సమాధానం: 4
26. ఇటీవల ప్రత్యేక కేటగిరీ మహిళల అబార్షన్‌కు 20 వారాల నుంచి ఎన్ని వారాల వరకు గడువును కేంద్ర కేబినేట్ పెంచింది?
1) 24 వారాలు
2) 21 వారాలు
3) 22 వారాలు
4) 25 వారాలు
- View Answer
- సమాధానం: 1
27. భారతదేశంలోనే తొలిసారిగా ‘హ్యాపీ బనానస్’ బ్రాండ్ పేరుతో 980 మెట్రిక్ టన్నుల అరటిపండ్లను తీసుకువెళ్లే ‘ఫ్రూట్ ట్రైన్’ను ప్రారంభించిన రాష్ట్రం ఏది?
1) పశ్చిమబెంగాల్
2) ఉత్తరప్రదేశ్
3) కర్ణాటక
4) ఆంధ్రప్రదేశ్
- View Answer
- సమాధానం: 4
28. టోక్యో ఒలింపిక్స్–2020లో టీమ్ ఇండియా గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఉండటానికి ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఎ) ఎవరిని ఆహ్వానించింది?
1) సచిన్ టెండుల్కర్
2) మేరీకామ్
3) అభినవ్ బింద్రా
4) సౌరవ్ గంగూలీ
- View Answer
- సమాధానం: 4
29. జాతీయ అమరవీరుల దినోత్సవాన్ని ఏ రోజున పాటిస్తారు?
1) జనవరి 26
2) జనవరి 27
3) జనవరి 29
4) జనవరి 30
- View Answer
- సమాధానం: 4
30. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) ‘ఎకనామిక్ అవుట్‌లుక్ సర్వే 2020’ ప్రకారం 2019–20 సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి ఎంత?
1) 5.4%
2) 5.3%
3) 5.0%
4) 5.1%
- View Answer
- సమాధానం: 3
31. బలహీనమైన మానవ మెదడు సంకేతాల నుంచి అర్థవంతమైన ఇంగ్లీష్ భాషగా మార్చే కొత్త కృత్రిమ మేధస్సు సాంకేతికతను ఏ భారతీయ సంస్థ అభివృద్ధి చేసింది?
1) ఐఐటీ బొంబాయి
2) ఐఐటీ మద్రాస్
3) ఐఐటీ కలకత్తా
4) ఐఐటీ ఢిల్లీ
- View Answer
- సమాధానం: 2
32. అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్ ‘స్ట్రాండ్జా’–2020, 71వ ఎడిషన్ ఎక్కడ జరిగింది?
1) న్యూఢిల్లీ, భారత్
2) వాషింగ్టన్ డి.సి., యునైటెడ్ స్టేట్స్ (యూ.ఎస్.)
3) బీజింగ్, చైనా
4) సోఫియా, బల్గేరియా
- View Answer
- సమాధానం: 4
33. మహారాష్ట్రలోని పూణెలో జరిగిన కార్యక్రమంలో £4 మిలియన్ల ‘ఇన్నోవేషన్ ఛాలెంజ్ ఫండ్’ను ప్రారంభించిన దేశం ఏది?
1) ఫ్రాన్స్
2) యునైటెడ్ కింగ్డమ్
3) రష్యా
4) నెదర్లాండ్స్
- View Answer
- సమాధానం: 2
34. ఏటా ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం ఏ రోజున పాటిస్తారు?
1) జనవరి 31
2) ఫిబ్రవరి 2
3) ఫిబ్రవరి 4
4) ఫిబ్రవరి 5
- View Answer
- సమాధానం: 2
35. తీర భద్రతా వ్యాయామం ‘మాట్ల అభియాన్’ను ఐదు రోజుల పాటు భారత్‌లోని ఏ రాష్ట్ర నావికాదళం నిర్వహించింది?
1) ఒడిశా
2) పశ్చిమబెంగాల్
3) ఆంధ్రప్రదేశ్
4) గుజరాత్
- View Answer
- సమాధానం: 2
36. చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ కృష్ణమూర్తి సుబ్రమణియన్ విడుదల చేసిన ఎకనామిక్ సర్వే ప్రకారం ఎఫ్వై21 సంవత్సరానికి దేశ ఆర్థిక వృద్ధి ఎంత ఉంటుందని అంచనా వేశారు?
1) 4.5–5%
2) 5.0–5.5%
3) 5.5–6%
4) 6.0–6.5%
- View Answer
- సమాధానం: 4
37. కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు(సీబీఐసీ) చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) రమేశ్ సింగ్
2) పవన్ శర్మ
3) సురేశ్ సేథ్
4) అజిత్ కుమార్
- View Answer
- సమాధానం: 4
38. ఐటీ దిగ్గజం ఐబీఎం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా ఎవరు నియమితులయ్యారు?
1) అరవింద్ కృష్ణ
2) విజయ కృష్ణ
3) అరవింద్ సుబ్రమణ్యమ్
4) శివ మీనన్
- View Answer
- సమాధానం: 1
39. ఏటా జనవరి 30న పాటించే ప్రపంచ కుష్టు వ్యాధి దినోత్సవం–2020 నేపథ్యం ఏమిటి?
1) శూన్య అంగవైకల్యం
2) వివక్ష, న్యూనత, పక్షపాతంను తొలగించు
3) కుష్టు వ్యాధి గురించి మీరు ఏమనుకుంటున్నారో అది కాదు
4) బాలురు, బాలికలలో శూన్య వైకల్యం
- View Answer
- సమాధానం: 3
40. భారతదేశంలో నావల్ కరోనా వైరస్‌ను ‘రాష్ట్ర విపత్తు’గా ప్రకటించిన మొదటి రాష్ట్రం ఏది?
1) తెలంగాణ
2) తమిళనాడు
3) ఉత్తరప్రదేశ్
4) కేరళ
- View Answer
- సమాధానం: 4
41. సౌత్ ఇండియన్ పెన్, పెన్ ఇండియా ఆధ్వర్యంలో ప్రజాస్వామిక ఆదర్శవాదానికి సంబంధించి పీఈన్ గౌరీ లంకేష్ అవార్డు–2019, 2వ ఎడిషన్‌ను గెలుచుకున్న జర్నలిస్ట్?
1) రవనిష్ కుమార్
2) పి. మహమ్మూద్
3) యూసఫ్ జమీల్
4) ప్రణయ్ రాయ్
- View Answer
- సమాధానం: 3
42. అంతర్జాతీయ కోల్‌కతా బుక్ ఫెయిర్ 2020(ఐకేబీఎఫ్) 44వ ఎడిషన్ అధికారిక మస్కట్ ఏమిటి?
1) టైటో
2) కకపో
3) కగు
4) మిసైట్
- View Answer
- సమాధానం: 1
43. భారతదేశం నుంచి ఎన్ని చిత్తడి నేలలను రామ్సర్ సైట్లుగా ఇటీవల ప్రకటించారు?
1) 16
2) 10
3) 12
4) 14
- View Answer
- సమాధానం: 2
44. 2020 ఫిబ్రవరిలో ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (పీఎంఎంవీవై) అమలులో భాగంగా మొదటి స్థానం గెలుచుకున్న భారతీయ నగరం, రాష్ట్రం ఏది?
1) హైదరాబాద్, తెలంగాణ
2) చెన్నై, తమిళనాడు
3) అహ్మదాబాద్, గుజరాత్
4) ఇండోర్, మధ్యప్రదేశ్
- View Answer
- సమాధానం: 4
45. భారత నావికాదళం ఉష్ణమండల తుఫాను అవా, వరదలతో దెబ్బతిన్న మడగాస్కర్కు మద్దతు ఇవ్వడానికి, సహాయం చేయడానికి ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి?
1) ఆపరేషన్ బ్లూవేల్
2) ఆపరేషన్ పాంథర్
3) ఆపరేషన్ విజయ్
4) ఆపరేషన్ వనిల్లా
- View Answer
- సమాధానం: 4
46. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తర్వాత ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి తమ రాష్ట్రంలో వర్చువల్ పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభించారు?
1) తెలంగాణ
2) మధ్యప్రదేశ్
3) ఒడిశా
4) హర్యానా
- View Answer
- సమాధానం: 3
47. బెల్జియంలోని బ్రస్సెల్స్‌లో ప్రతిష్టాత్మక ‘ఆయుర్వేద రతన్ అవార్డు–2020’ను ఎవరికి ప్రదానం చేశారు?
1) రాజేష్ కొటేచా
2) పర్తాప్ చౌహాన్
3) బలేందు ప్రకాశ్
4) కృష్ణ చంద్ర చునేకర్
- View Answer
- సమాధానం: 2
48. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఇండియా (టీఐఐ) నిర్వహించిన ‘పారదర్శకత బడ్జెట్ ప్రక్రియ నివేదిక 2.0’లో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది?
1) ఆంధ్రప్రదేశ్
2) ఉత్తరప్రదేశ్
3) అస్సాం
4) పశ్చిమ బెంగాల్
- View Answer
- సమాధానం: 3
49. కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్)కు చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) విజయ్ సర్కార్
2) ప్రమోద్ అగర్వాల్
3) రాజీవ్ దీక్షిత్
4) శివ నదార్
- View Answer
- సమాధానం: 2
50. భారతదేశంలోని రెండో అతిపెద్ద గిరిజన పండుగ/కార్నివాల్ నాగోబా జాతర ఏ రాష్ట్రంలో జరిగింది?
1) చత్తీస్‌గఢ్
2) మధ్యప్రదేశ్
3) ఒడిశా
4) తెలంగాణ
- View Answer
- సమాధానం: 4