కరెంట్అఫైర్స్ (అక్టోబర్ 9 - 16, 2017) బిట్ బ్యాంక్
1.5వ ఇండియా వాటర్ వీక్ - 2017 థీమ్ ఏంటి ?
1) Water and energy for inclusive growth
2) Water and india
3) water for tomorrow
4) indian lands and water
- View Answer
- సమాధానం: 1
వివరణ: న్యూఢిల్లీలో అక్టోబర్ 10 నుంచి 15 వరకు జరిగిన 5వ ఇండియా వాటర్ వీక్ కార్యక్రమాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రారంభించారు. 13 దేశాల నుంచి 1500 మంది ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మానవాభివృద్ధిలో నీటి ప్రాముఖ్యత, జల సంరక్షణపై చర్చించారు.
- సమాధానం: 1
2. దేశంలోని ఏ నగరంలో టపాసుల అమ్మకాన్ని సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిషేధించింది ?
1) బెంగళూరు
2) న్యూఢిల్లీ
3) కోల్ కత్తా
4) హైదరాబాద్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతం (NCR)లో తాత్కాలికంగా టపాసుల అమ్మకాలను సుప్రీంకోర్టు నిషేధించింది. నగరంలో కాలుష్యం పరిణామం దృష్ట్యాఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.
- సమాధానం: 2
3. తెలంగాణలో బేటీ పడావ్ - బేటీ బచావో కార్యక్రమ ప్రచారకర్తగా ఎవరు నియమితులయ్యారు ?
1) సమంత
2) రాశీ ఖన్నా
3) రకుల్ ప్రీత్ సింగ్
4) మాధురీ దీక్షిత్
- View Answer
- సమాధానం: 3
వివరణ: సినీ నటి సమంతను చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించిన తెలంగాణ ప్రభుత్వం ఇటీవల రాష్ట్రంలో బేటీ బచావో - బేటీ పడావో కార్యక్రమానికి సినీనటి రకుల్ ప్రీత్ సింగ్‌ను అంబాసిడర్‌గా నియమించింది. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్త బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ ను 2015లో కేంద్ర ప్రభుత్వం నియమించింది.
- సమాధానం: 3
4. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (PBL) మూడో సీజన్ వేలంలో అత్యధిక మొత్తం దక్కించుకున్న ప్లేయర్ ఎవరు ?
1) పీవీ సింధు
2) సైనా నెహ్వాల్
3) కిడాంబి శ్రీకాంత్
4) హెచ్ఎస్ ప్రణయ్
- View Answer
- సమాధానం: 4
వివరణ: పీబీఎల్ మూడో సీజన్ వేలంలో కొత్త ఫ్రాంచైజీ అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్ జట్టు.. హెచ్ఎస్ ప్రణయ్‌ను అత్యధికంగా 62 లక్షల రూపాయలకు సొంతం చేసుకుంది. గత సీజన్లో ప్రణయ్‌కు 25 లక్షలే లభించాయి. పీబీఎల్ లో మొత్తం 8 జట్లు ఉన్నాయి.
- సమాధానం: 4
5. ఫోర్బ్స్మ్యాగజైన్ ఇటీవల విడుదల చేసిన India's 100 richest - 2017 జాబితాలో తొలి స్థానంలో ఉన్న వ్యాపారవేత్త ఎవరు ?
1) ముకేష్ అంబానీ
2) అజీమ్ ప్రేమ్ జీ
3) హిందూజా సోదరులు
4) లక్ష్మీ మిట్టల్
- View Answer
- సమాధానం: 1
వివరణ: Indias 100 richest - 2017 జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. ఇందులో 38 బిలియన్ డాలర్ల సంపదతో రిలియన్స ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబాని తొలి స్థానంలో ఉన్నారు. 19 బిలియన్ డాలర్లతో అజీమ్ ప్రేమ్ జీ రెండో స్థానంలో, 18.4 బిలియన్ డాలర్లతో హిందూజా సోదరులు మూడో స్థానంలో, 16.5 బిలియన్ డాలర్ల సంపదతో లక్ష్మీ మిట్టల్ నాలుగో స్థానంలో ఉన్నారు.
- సమాధానం: 1
6. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ‘‘ముఖ్యమంత్రి సామూహిక వివాహక యోజన’’ను ప్రారంభించింది ?
1) మధ్యప్రదేశ్
2) ఉత్తరప్రదేశ్
3) పశ్చిమబెంగాల్
4) కేరళ
- View Answer
- సమాధానం: 2
వివరణ: ‘‘ముఖ్యమంత్రి సామూహిక వివాహక యోజన’’ను ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రభుత్వం ఒక్కో జంట పెళ్లి కోసం 35 వేల రూపాయలు వెచ్చిస్తుంది. అలాగే వారికి మొబైల్ ఫోన్లు, గృహావసర వస్తువులను ఉచితంగా అందిస్తుంది. కనీసం పది జంటలకు తక్కువ కాకుండా సామూహిక వివాహ కార్యక్రమాలను నిర్వహిస్తారు.
- సమాధానం: 2
7. దేశంలో డిజిటల్ అక్షరాస్యత కోసం ఉద్దేశించిన ‘‘ప్రధాన మంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షరత అభియాన్’’ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ?
1) ఆంధ్రప్రదేశ్
2) తెలంగాణ
3) గుజరాత్
4) తమిళనాడు
- View Answer
- సమాధానం: 3
వివరణ: ‘‘ప్రధాన మంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షరత అభియాన్-PMGDISHA’’ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా మార్చి 2019 నాటికి దేశవ్యాప్తంగా 6 కోట్ల గ్రామీణ కుటుంబాలను డిజిటల్ అక్షరాస్యులుగా చేయాలన్నది లక్ష్యం.
- సమాధానం: 3
8. దేశంలో పరిశోధన, అభివృద్ధి(R&D)ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ఏది ?
1) VAJRA
2) I& SKILL
3) TECH INDIA
4) PMI
- View Answer
- సమాధానం: 1
వివరణ: దేశంలో పరిశోధన, అభివృద్ధి(R&D)ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం VAJRA(Visiting Advanced Joint Research) పథకాన్ని 2017 జనవరిలో ప్రారంభించింది. పథకం కింద దేశంలో వివిధ సంస్థలు, విశ్వవిద్యాలయాల్లోని ఆర్ అండ్ డీ విభాగాల్లో విదేశీ శాస్త్రవేత్తలు భాగస్వామ్యులయ్యేలా ప్రోత్సహిస్తారు. ఈ పథకం కింద 260 మంది విదేశీ శాస్త్రవేత్తలు దరఖాస్తు చేసుకున్నారు. పథకం కింద ఏడాదికి వెయ్యి మంది శాస్త్రవేత్తలను ఎంపిక చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం.
- సమాధానం: 1
9. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్ర ధనుష్(IMI) పథకం ముఖ్య ఉద్దేశం ఏమిటి ?
1) పిల్లలకు, గర్భిణులకు టీకాలు ఇవ్వడం
2) మహిళల్లో ఆర్థిక స్వావలంబన
3) పర్యావరణ రక్షణ
4) అటవీ జంతువుల సంరక్షణ
- View Answer
- సమాధానం: 1
వివరణ: 2018 డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా 90 శాతానికిపైగా టీకాలు ఇవ్వడమే లక్ష్యంగా కేంద్ర ఆరోగ్య శాఖ ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్ర ధనుష్(IMI) పథకాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా 2 ఏళ్ల లోపు పిల్లలు, గర్భిణులకు వ్యాధి నిరోధక టీకాలు ఇస్తారు. ఇంతకముందు కేంద్ర ప్రభుత్వం మిషన్ ఇంద్ర ధనుష్ కార్యక్రమాన్ని 2014 డిసెంబర్లో ప్రారంభించింది.
- సమాధానం: 1
10. వరల్డ్ ఓపెన్ అండర్ -16 స్నూకర్ చాంపియన్‌షిప్ మహిళల టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు ?
1) అనుపమ రామచంద్రన్
2) కీర్తనా పండియన్
3) అల్బినా లెష్చక్
4) అలగ్జాండ్రియా రియాబినియా
- View Answer
- సమాధానం: 1
వివరణ: వరల్డ్ ఓపెన్ అండర్ - 16 స్నూకర్ చాంపియన్‌షిప్ టోర్నమెంట్ రష్యాలో జరిగింది. ఈ టోర్నీ మహిళల ఫైనల్స్‌లో భారత్‌కే చెందిన కీర్తనా పండియన్ను ఓడించి అనుపమ రామచంద్రన్ టైటిల్‌ను గెలుచుకుంది.
- సమాధానం: 1
11. తొలి BIMSTEC విపత్తు నిర్వహణ విన్యాసాలు - 2017ను ఇటీవల ఏ నగరంలో నిర్వహించారు ?
1) కొలంబో
2) న్యూఢిల్లీ
3) ఢాకా
4) నెపిడా
- View Answer
- సమాధానం: 2
వివరణ: తొలి BIMSTEC విపత్తు నిర్వహణ విన్యాసాలు - 2017 న్యూఢిల్లీలో జరిగాయి. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాల(NDRF) నేతృత్వంలో ఈ విన్యాసాలు జరిగాయి. విపత్తు నిర్వహణలో బిమ్ స్టెక్ దేశాల మధ్య సహకారం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
BIMSTEC -Bay of Bengal Initiative for Multi - Sectoral Technical and Economic Cooperation. దీన్ని 1997లో ఏర్పాటు చేశారు. కేంద్ర కార్యాలయం బంగ్లాదేశ్‌లోని ఢాకాలో ఉంది.
- సమాధానం: 2
12. అంతర్జాతీయ సంస్థ బ్రాండ్ ఫైనాన్స్ ఇటీవల విడుదల చేసిన నేషన్ బ్రాండ్ రిపోర్ట్ - 2017లో భారత్ ఏ ర్యాంకులో నిలిచింది ?
1) 1
2) 3
3) 8
4) 7
- View Answer
- సమాధానం: 3
వివరణ: గతేడాది ఇదే నివేదికలో 7వ స్థానంలో ఉన్న భారత్.. 2017 ర్యాంకింగ్‌సలో 8వ స్థానంలో నిలిచింది. మొత్తం 100 దేశాలతో కూడిన ఈ జాబితాలో అమెరికా తొలి స్థానంలో, రెండో స్థానంలో చైనా, మూడో స్థానంలో జర్మనీ, నాలుగో స్థానంలో జపాన్ నిలిచాయి. దేశీయ బ్రాండ్ల విలువ ఆధారంగా ఈ ర్యాంకులు కేటాయించారు.
- సమాధానం: 3
13. యూఎస్ - ఇండియా బిజినెస్ కౌన్సిల్ (USIBC) ప్రెసిడెంట్‌గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) సీమా వర్మా
2) నిక్కీ హేలీ
3) ఈనం గంభీర్
4) నిషా బిశ్వాల్
- View Answer
- సమాధానం: 4
వివరణ: యూఎస్ - ఇండియా బిజినెస్ కౌన్సిల్ అధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన అమెరికన్ నిషా బిశ్వాల్ నియమితులయ్యారు. ఆమె 2013-2017 వరకు అమెరికా ప్రభుత్వంలో దక్షిణ, మధ్య ఆసియా సహాయ కార్యదర్శిగా పనిచేశారు. ఈ సమయంలో భారత్ - అమెరికా మధ్య వ్యాపార సంబంధాల బలోపేతం కోసంఆమెవిశేషంగా కృషి చేశారు.
- సమాధానం: 4
14. 18 సంవత్సరాలలోపు వయసున్న భార్యతో శృంగారం నేరమని ఇటీవల తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు ఐపీసీలోని ఏ సెక్షన్‌కు సవరణలు చేసింది ?
1) 375
2) 275
3) 175
4) 426
- View Answer
- సమాధానం: 1
వివరణ: 18 ఏళ్ల లోపు వయసున్న భార్యతో శృంగారం అత్యాచారంగానే పరిగణించబడుతుందని సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పునిచ్చింది. నేరం రుజువైతే 10 ఏళ్ల జైలు లేదా జీవితకాలం కారాగార శిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుందని జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. మైనర్ భార్యతో శృంగారం నేరం కాదని భారత శిక్షా స్మృతి సెక్షన్ 375లోని మినహాయింపు - 2 చెబుతోందని.. చట్టంలో ఇలాంటి మినహాయింపులివ్వడం నిరంకుశమని పేర్కొంది. ఈ సెక్షన్ రాజ్యాంగంలోని అధికరణం 14,15,21లను ఉల్లంఘిస్తోందని చెప్పింది.
- సమాధానం: 1
15. వరల్డ్ పేమెంట్ రిపోర్ట్ - 2017 ప్రకారం 2016-20 మధ్య కాలంలో భారత్‌లో డిజిటల్ పేమెంట్స్ ఎంత శాతం మేర పెరగనున్నాయి ?
1) 20 శాతం
2) 30 శాతం
3) 26.2 శాతం
4) 36 శాతం
- View Answer
- సమాధానం: 3
వివరణ: వరల్డ్ పేమెంట్ రిపోర్ట్ - 2017ను కేప్ జెమిని, బీఎన్పీ పారిబాస్ సంస్థలు సంయుక్తంగా రూపొందించారుు. ఈ నివేదిక ప్రకారం 2016-20 మధ్య కాలంలో డిజిటల్ పేమెంట్స్‌లో ప్రపంచంలో చైనా అత్యధికంగా 36 శాతం వృద్ధి నమోదు చేయనుంది. ఇదే కాలంలో భారత్ 26.2 శాతం వృద్ధి నమోదు చేయనుంది.
- సమాధానం: 3
16. 2018లో రష్యాలో జరగనున్న 21వ ఫిఫా ప్రపంచ కప్‌కు ఏ దేశం తొలిసారి అర్హత సాధించింది ?
1) నైజీరియా
2) సెర్బియా
3) ఉరుగ్వే
4) ఐస్లాండ్
- View Answer
- సమాధానం: 4
వివరణ: తొలిసారి ఫిఫా ప్రపంచ కప్‌కు అర్హత సాధించిన ఐస్లాండ్ .. ఈ గుర్తింపు సాధించిన తొలి అతి చిన్న దేశంగా రికార్డు సృష్టించింది. ఆ దేశ జనాభా కేవలం 3 లక్షల 30 వేలు. ఐస్‌లాండ్‌తో పాటు పనామా కూడా ఫిఫా ప్రపంచ కప్‌కు తొలిసారి అర్హత సాధించింది.
- సమాధానం: 4
17. అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని (International day of Girl child) ఏ తేదీన నిర్వహిస్తారు ?
1) అక్టోబర్ 11
2) ఆగస్టు 13
3) సెప్టెంబర్ 15
4) నవంబర్ 11
- View Answer
- సమాధానం: 1
వివరణ: బాలికలకు మెరుగైన జీవితం, విద్య, అవకాశాలను అందించేందుకు ఐక్యరాజ్య సమితి 2011 నుంచి ఏటా అక్టోబర్ 11న అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్నినిర్వహిస్తోంది. సమాజంలో బాలికల హక్కులు, ఎదుర్కుంటున్న సమస్యల పరిష్కారం కోసం ఈ రోజు ప్రత్యేక కార్యక్రమాలు చేపడతారు.
- సమాధానం: 1
18. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా - FTII ఛైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు ?
1) అమితాబ్ బచ్చన్
2) అనుపమ్ ఖేర్
3) గజేంద్ర చౌహాన్
4) గోవింద
- View Answer
- సమాధానం: 2
వివరణ: ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా నియమితులయ్యారు. ఇంతకముందు గజేంద్ర చౌహాన్ ఈ స్థానంలో ఉన్నారు. ఎఫ్టీఐఐ కార్యాలయం పుణేలో ఉంది. అనుపమ్ ఖేర్ 500కుపైగా చిత్రాల్లో నటించారు. 2004లో పద్మశ్రీ, 2016లో పద్మ విభూషణ్ పురస్కారాలు అందుకున్నారు.
- సమాధానం: 2
19. నైపుణ్య శిక్షణ కోసం భారత్ యువతీ, యువకులను ఏ దేశానికి పంపేందుకు ఒప్పందం కుదుర్చుకుంది ?
1) ఆస్ట్రేలియా
2) అమెరికా
3) జపాన్
4) ఇజ్రాయెల్
- View Answer
- సమాధానం: 3
వివరణ: యువతను టెక్నికల్ ఇంటర్న్స్‌గా జపాన్‌కు పంపేందుకు భారత్ ఆ దేశంతో టెక్నికల్ ఇంటర్న్ ట్రెరుునింగ్ ప్రోగ్రామ్ - TITPపైసహకార ఒప్పందం కదుర్చుకుంది. దీని ప్రకారం జపాన్‌లో 3 నుంచి 5 ఏళ్ల పాటు ఉపాధి శిక్షణ కోసం 3 లక్షల మంది భారత యువతను ఆ దేశానికి పంపిస్తుంది.
- సమాధానం: 3
20. కేంద్ర కేబినెట్ ఇటీవల ఆమోదం తెలిపిన SANKALP, STRIVE పథకాల అమలుకు ఎవరు ఆర్థిక సహాయం అందించనున్నారు ?
1) ఆసియా అభివృద్ధి బ్యాంక్
2) రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా
3) ప్రపంచ బ్యాంక్
4) ఫెడరల్ బ్యాంక్
- View Answer
- సమాధానం: 3
వివరణ: 6,655 కోట్ల రూపాయల ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సాయంతో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాల్లో వ్యవస్థాగత సంస్కరణలు తీసుకొచ్చేందుకు సంకల్ప్(skill Acquisition and Knowledge Awareness for Livelihood Promotion Programme), స్ట్రైవ్ ( kill Strengthening for industrial value enhancement) పథకాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
- సమాధానం: 3
21. ప్రయాణికుల కోసం నెలలో వంద గంటలు ఉచిత సైకిల్ రైడ్ సౌకర్యం కల్పించిన ప్రజా రవాణా సంస్థ ఏది ?
1) టీఎస్ ఆర్టీసీ
2) చెన్నై మెట్రో రైల్
3) ఢిల్లీ మెట్రో రైల్
4) ఏపీఎస్ ఆర్టీసీ
- View Answer
- సమాధానం: 2
వివరణ: చెన్నై మెట్రో రైల్ (CMRL) తన ప్రయాణికుల కోసం ఫ్రీ బైసైకిల్ రైడ్ స్కీమ్‌ను ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా ప్రయాణికులు నెలలో వంద గంటలు ఉచిత సైకిల్ రైడ్ సేవలు పొందవచ్చు. పర్యావరణ హిత ప్రయాణాన్ని ప్రోత్సహించేందుకు సీఎంఆర్ఎల్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
- సమాధానం: 2
22. The Inequalities of hunger పేరుతో ఇటీవల విడుదలైన గ్లోబల్ హంగర్ ఇండెక్స్ - 2017లో భారత్ ఏ స్థానంలో నిలిచింది ?
1) 119
2) 109
3) 85
4) 100
- View Answer
- సమాధానం: 4
వివరణ: ది ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రిసర్చ్ ఇన్సిస్టిట్యూట్ (IFPRI) ది గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌ను విడుదల చేస్తుంది. 2017 సంవత్సరానికి గాను 119 దేశాల జాబితాతో విడుదల చేసిన ర్యాంకింగ్‌సలో భారత్ 31.4 స్కోరుతో 100వ స్థానంలో నిలిచింది.
- సమాధానం: 4
23. ఇజ్రాయెల్ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారని ఆరోపిస్తూ ఇటీవల యునెస్కో నుంచి ఏ దేశం వైదొలిగింది ?
1) అమెరికా
2) జపాన్
3) రష్యా
4) చైనా
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఇజ్రాయెల్ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారని ఆరోపిస్తూ అమెరికా యునెస్కో నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. ఇజ్రాయెల్ కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. యునెస్కోలో పాలస్తీనా సభ్యత్వం అంశంపై తలెత్తిన భేదాభిప్రాయాల నేపథ్యంలో రెండు దేశాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.
పాలస్తీనా 1988లో స్వతంత్ర్యం ప్రకటించుకున్నా అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇప్పటికీ పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించడం లేదు.
- సమాధానం: 1
24. చైనాలో భారత రాయబారిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) సయ్యద్ అక్బరుద్దీన్
2) గౌతం బంబావాలే
3) టీపీ శ్రీనివాసన్
4) విజయ్ గోఖలే
- View Answer
- సమాధానం: 2
వివరణ: విజయ్ గోఖలే స్థానంలో ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి గౌతం బంబావాలే చైనాలో భారత రాయబారిగా నియమితులయ్యారు. ఆయన 1984 బ్యాచ్‌కు చెందిన అధికారి. ఇంతకముందు ఆయన పాకిస్తాన్లో భారత హై కమిషనర్‌గా పనిచేశారు.
- సమాధానం: 2
25. ఎంపిక చేసిన గ్రామాల్లో పౌరులందరికీ పోస్టల్ లైఫ్ ఇన్సురెన్స్ అందించేందుకు ఉద్దేశించిన ‘‘సంపూర్ణ బీమా గ్రామ్ యోజన’’ను ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎవరు ?
1) మనోజ్ సిన్హా
2) రవిశంకర్ ప్రసాద్
3) ప్రకాశ్ జవదేకర్
4) నిర్మలా సీతారామన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ‘‘సంపూర్ణ బీమా గ్రామ్ యోజన’’ను కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి మనోజ్ సిన్హా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని జిల్లాల్లో కనీసం వంద కుటుంబాలు ఉన్న ఓ గ్రామాన్ని ఈ పథకం కోసం ఎంపిక చేస్తారు. ఆ తర్వాత గ్రామంలోని అన్ని కుటుంబాలకు రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సురెన్స్ పాలసీ అందిస్తారు. ఈ పాలసీ ఇంతవరకు కేవలం ప్రభుత్వ, సెమీ గవర్నమెంట్ ఉద్యోగులకు మాత్రమే అందుబాటులో ఉండేది.
- సమాధానం: 1
26. దేశంలో లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ మార్కెట్ ఏర్పాటు కోసం భారత్ ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకోనుంది ?
1) రష్యా
2) అమెరికా
3) జపాన్
4) ఇరాన్
- View Answer
- సమాధానం: 3
వివరణ: దేశంలో Liquefied natural gas(LNG) మార్కెట్‌ను భారత్ జపాన్ తో కలిసి ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం ఆ దేశంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకునేందుకు కేంద్ర కేబినెట్ ఇటీవల ఆమోదం తెలిపింది. ఎల్ఎన్జీ మార్కెట్లో జపాన్ ప్రపంచంలో అతిపెద్ద దిగుమతిదారు కాగా భారత్ 4వ అతిపెద్ద దిగుమతిదారుగా ఉంది.
- సమాధానం: 3
27. మిత్ర శక్తి - 2017 పేరుతో భారత్, శ్రీలంక సంయుక్త సైనిక శిక్షణ విన్యాసాలను ఇటీవల ఎక్కడ నిర్వహించారు ?
1) విశాఖపట్నం
2) పుణె
3) హంబంథోటా హార్బర్
4) కొలంబో హార్బర్
- View Answer
- సమాధానం: 2
వివరణ: భారత్, శ్రీలంక 5వ మిత్ర శక్తి - 2017 సంయుక్త సైనిక శిక్షణ విన్యాసాలు పుణెలోని అవుంద్ మిలటరీ స్టేషన్లో అక్టోబర్ 13న ప్రారంభయ్యాయి. ఇవి అక్టోబర్ 26 వరకు కొనసాగాయి. కౌంటర్ టైస్ట్ ఆపరేషన్సను సంయుక్తంగా నిర్వహించడంపై ఈ విన్యాసాలు నిర్వహించారు.
- సమాధానం: 2
28. అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు ?
1) అక్టోబర్ 15
2) మార్చి 8
3) సెప్టెంబర్ 15
4) నవంబర్ 15
- View Answer
- సమాధానం: 1
వివరణ: గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయ అభివృద్ధిలో గ్రామీణ మహిళల పాత్రను గుర్తిస్తూ ఐక్యరాజ్య సమితి ఏటా అక్టోబర్ 15న అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకోవాలని 2007 డిసెంబర్ 18న తీర్మానించింది. దీంతో 2008 అక్టోబర్ 15న తొలి అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు.
2017 Theme: Challenges and opportunities in climate - resilient agriculture for gender equality and the empowerment of rural women and girls.
- సమాధానం: 1
29. ఐక్యరాజ్య సమితి విద్యా, విజ్ఞాన(శాస్త్రీయ), మరియు సాంస్కృతిక సంస్థ (యునెస్కో) డెరైక్టర్ జనరల్‌గా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు ?
1) ఆడ్రే అజోలే
2) ఇరినా బొకోవా
3) హమాద్ బిన్ అబ్దులాజిజ్ - కవారీ
4) సౌమ్యా స్వామినాథన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఫ్రాన్స్ సాంస్కృతిక, సమాచార శాఖ మాజీ మంత్రి ఆడ్రే అజోలే యునెస్కో డెరైక్టర్ జనరల్‌గా ఎన్నికయ్యారు. ఇందుకోసం జరిగిన ఎన్నికలో ఆమె హమాద్ బిన్ అబ్దులాజిజ్ - కవారీపై గెలుపొందారు. అజోలేకు ముందు ఇరినా బోకోవా యునెస్కో డెరైక్టర్ జనరల్‌గా ఉన్నారు.
- సమాధానం: 1
30. వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ - WWEతో ఒప్పందం కుదుర్చుకున్న తొలి భారతీయ మహిళ ఎవరు ?
1) బబితా కుమారి
2) వినేశ్ ఫోగట్
3) సాక్షి మాలిక్
4) కవితా దేవి
- View Answer
- సమాధానం: 4
వివరణ: హర్యానాకు చెందిన కవితా దేవి ఇటీవల WWEతో ఒప్పందం కుదుర్చుకుంది. పవర్ లిఫ్టర్‌గా అనేక పోటీల్లో పాల్గొన్న ఆమె గ్రేట్ కాలీగా గుర్తింపు పొందిన దలిప్ సింగ్ రాణా వద్ద రెజ్లింగ్ శిక్షణ పొందింది. 2016 సౌత్ ఆసియాన్ గేమ్స్‌లో 75 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో కవితా దేవి స్వర్ణం గెలుపొందింది.
- సమాధానం: 4
31. ఇటీవల ఏ అధునాతన యుద్ధ నౌకను కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు ?
1) INS Kiltan
2) INS Kamorta
3) INS Kadmatt
4) INS Kavaratti
- View Answer
- సమాధానం: 1
వివరణ: సముద్ర అడుగు భాగంలో ఉన్న జలాంతర్గాములను గుర్తించి ధ్వంసం చేసేందుకు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఐఎన్ఎస్ కిల్తాన్ను రూపొందించారు. విశాఖపట్నంలోని నావల్ డాక్ యార్డ్‌లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ యుద్ధ నౌకను భారత నౌక దళంలో ప్రవేశపెట్టారు. ప్రాజెక్టు - 28 కింద నిర్మించ తలపెట్టిన నాలుగు యాంటి సబ్ మెరైన్ యుద్ధ నౌకల్లో కిల్తాన్ మూడోది. కమోర్తా, కద్మత్లు ఇప్పటికే సేవలు అందిస్తుండగా నాలుగోది కవరత్తి త్వరలో సిద్ధం కానుంది.
- సమాధానం: 1
32. 2015-16 సంవత్సరానికిగాను ఇందిరా గాంధీ జాతీయ సమగ్రతా అవార్డుని ఎవరికి ప్రకటించారు ?
1) టీఎం కృష్ణ
2) కై లాశ్ సత్యర్థి
3) ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
4) ప్రణబ్ ముఖర్జీ
- View Answer
- సమాధానం: 1
వివరణ: 2015-16 సంవత్సరానికిగాను ఇందిరా గాంధీ జాతీయ సమగ్రతా అవార్డుని కర్ణాటక సంగీత గాత్ర విద్వాంసుడు టీఎం కృష్ణకు ప్రకటించారు. 2016లో టీఎం కృష్ణ రామన్ మెగ్ససె అవార్డు అందుకున్నారు.
- సమాధానం: 1
33. ఏ సంస్థ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని అక్టోబర్ 16న ప్రపంచ ఆహార దినోత్సవాన్ని నిర్వహిస్తారు ?
1) WHO
2) WTO
3) FAO
4) ICRISAT
- View Answer
- సమాధానం: 3
వివరణ: FAO - Food and Agriculture Organization.
FAO సంస్థను 1945 అక్టోబర్ 16న ఏర్పాటు చేశారు. దీన్ని పురస్కరించుకొని ఏటా ఈ రోజున అంతర్జాతీయ ఆహార దినోత్సవాన్ని నిర్వహిస్తారు. సస్టెనెయిబుల్ డెవలప్మెంట్ గోల్ (SDG) 2 లో భాగంగా 2030 నాటికి ప్రపంచ వ్యాప్తంగా జీరో హంగర్ లక్ష్యాన్ని అందుకోవాలని ఐరాస నిర్దేశించింది. జీరో హంగర్ చాలెంజ్‌ను 2012లో అప్పటి ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్‌కీ మూన్ ప్రారంభించారు.
- సమాధానం: 3
34. ‘‘అన్నపూర్ణ రాసోయ్ యోజన’’ పేరుతో పేదలకు తక్కువ ధరకే నాణ్యమైన ఆహారాన్ని అందించే పథకాన్ని ఏ రాష్ట్రం అమలు చేస్తోంది ?
1) రాజస్తాన్
2) గుజరాత్
3) బిహార్
4) ఛత్తీస్ గఢ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ‘‘అన్నపూర్ణ రాసోయ్ యోజన’’ పేరుతో పేదలకు తక్కువ ధరకే నాణ్యమైన ఆహారాన్ని అందించే పథకాన్ని రాజస్తాన్ ప్రభుత్వం 2016 డిసెంబర్లో ప్రారంభించింది. తొలుత కేవలం ఎంపిక చేసిన ప్రధాన నగరాల్లోనే ప్రారంభమైన ఈ పథకాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వసుంధర రాజే ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా 195 పట్టణ ప్రాంతాలకు విస్తరించారు. పథకం కింద 5 రూపాయలకే అల్పాహారం, 8 రూపాయలకే భోజనం అందిస్తున్నారు.
- సమాధానం: 1
35. ఇటీవల ఏ అంశంపై ఇచ్చిన తీర్పుకు గాను యాక్సెస్ నౌ అనే సంస్థ సుప్రీంకోర్టు ధర్మాసనానికి ‘‘హీరోస్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అండ్ కమ్యూనికేషన్స సర్వైలెన్స్’’ అనే గౌరవ పురస్కారాన్ని ప్రకటించింది ?
1) బీఎస్ - 4
2) మైనర్ భార్యతో కాపురం
3) గోప్యత హక్కు
4) దోషులుగా తేలిన ప్రజాప్రతినిధులపై నిషేధం
- View Answer
- సమాధానం: 3
వివరణ: వ్యక్తిగత గోప్యతను ప్రాథమిక హక్కుగా గుర్తిస్తు ఆగస్టు 24న అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జే ఎస్ ఖేహర్ నేతృత్వంలోని 9 మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. దీంతో ధర్మాసనంలోని న్యాయమూర్తులకు యాక్సెస్ నౌ అనే అంతర్జాతీయ సంస్థ ‘‘హీరోస్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అండ్ కమ్యూనికేషన్స సర్వైలెన్స్’’ అనే గౌరవ పురస్కారాన్ని ప్రకటించింది. యాక్సెస్ నౌ డిజిటల్ హక్కుల కోసం పోరాడుతున్న సంస్థ.
- సమాధానం: 3
36. సింగపూర్‌కు చెందిన ప్రతిష్టాత్మక పురస్కారం బీ ఇన్సపైర్డ్కు ఎంపికై న భారత సంస్థ ఏది ?
1) ఎన్‌జేఎస్ ఇంజినీర్స్
2) ఎన్టీపీసీ
3) తెలంగాణ జాగృతి
4) బ్లూ క్రాస్
- View Answer
- సమాధానం: 1
వివరణ: పుణెకు చెందిన ఎన్‌జేఎస్ ఇంజినీర్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ వారణాసిలో గంగానదిలో వ్యర్థాలను తొలగిస్తు జీవావరణాన్ని కాపాడేందుకు కృషి చేస్తుంది. ఇందుకు గుర్తింపుగా సింగపూర్ అందించే ప్రతిష్టాత్మక బీ ఇన్స్ పైర్డ్ పురస్కారానికి ఎంపికైంది.
- సమాధానం: 1
37. దేశంలోని ఏ రైల్వే స్టేషన్ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్, భారత పరిశ్రమల సమాఖ్య నుంచి తొలి హరిత స్టేషన్ గుర్తింపు పొందింది ?
1) సికింద్రాబాద్
2) వరంగల్
3) విశాఖపట్నం
4) చెన్నై రైల్వే స్టేషన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ - 2017 సమావేశంలో జైపూర్ లో జరిగింది. ఇందులో భాగంగా ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్, భారత పరిశ్రమల సమాఖ్య.. సికింద్రాబాద్‌ను దేశంలోనే తొలి హరిత స్టేషన్‌గా ప్రకటించారుు. ఈ విధానాన్ని ఈ ఏడాదే ప్రారంభించారు.
- సమాధానం: 1
38. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో పర్యాటకాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు ఏ ప్రాంతంలో ఆక్టోపస్ వ్యూ పాయింట్‌ను ఏర్పాటు చేసింది ?
1) ఆమ్రాబాద్ టైగర్ రిజర్వు
2) కవ్వాల్ టైగర్ రిజర్వు
3) హరిణ వనస్థలి పార్క్
4) నాగార్జున సాగర్
- View Answer
- సమాధానం: 1
వివరణ: హైదరాబాద్ - శ్రీశైలం హైవే మార్గంలోని ఆమ్రాబాద్ టైగర్ రిజర్వు అటవీ ప్రాంతంలో నల్లమల ప్రకృతి సోయగాలు, కృష్ణా తీర సొగసులు, లోయల అందాలను తిలకించేందుకు వీలుగా అక్టోబస్ వ్యూ పాయింట్‌ను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ వ్యూ పాయింట్ నుంచి చూస్తే కృష్ణా నది ఆక్టోపస్‌లా మెలికలు తిరిగి కనిపిస్తుండటంతో ఆ పేరు పెట్టారు.
- సమాధానం: 1
39. ఏ రాష్ట్రంలో చౌక ధరల దుకాణాలను అన్న విలేజ్ మాల్స్‌గా మార్చనున్నారు ?
1) తమిళనాడు
2) తెలంగాణ
3) ఆంధ్రప్రదేశ్
4) కేరళ
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఆంధ్రప్రదేశ్‌లోని రేషన్ దుకాణాలను అన్న విలేజ్ మాల్స్‌గా మార్చే ప్రతిపాదనలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల ఆమోదం తెలిపారు. తొలి దశలో 6,500 దుకాణాలను విలేజ్ మాల్స్‌గా మార్చనున్నారు. రిలయన్స, ఫ్యూచర్ గ్రూప్ భాగస్వామ్యంతో వీటిని ఏర్పాటు చేస్తారు. ఇందుకు అయ్యే వ్యయంలో 50 శాతాన్ని రేషన్ డీలర్లు భరించాలి. 25 శాతం ప్రభుత్వం అందిస్తుంది. మరో 25 శాతాన్ని ముద్ర రుణంగా అందిస్తారు.
- సమాధానం: 3
40. నౌకాదళంలో 29 ఏళ్ల పాటు సేవలందించిన టీయూ - 142 యుద్ధ విమాన మ్యూజియంను ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు ?
1) విశాఖపట్నం
2) పూణె
3) కోల్‌కత
4) హైదరాబాద్
- View Answer
- సమాధానం: 1
వివరణ: నౌకదళానికి చెందిన టీయూ - 142 యుద్ధ విమానం కార్గిల్ యుద్ధంతో పాటు పలు కీలక ఆపరేషన్లలో 29 ఏళ్ల పాటు సేవలందించింది. ఈ యుద్ధ నౌకను గతేడాది సేవల నుంచి తొలగించారు. విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌లో దీని మ్యూజియం ఏర్పాటుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల శంకుస్థాపన చేశారు. దీంతో పాటు కురుసురా జలాంతర్గామి మ్యూజియంను ఏర్పాటు చేస్తున్నారు.
- సమాధానం: 1
41. 2017-18లో భారత వృద్ధి రేటు ఎంత శాతంగా ఉంటుందని ప్రపంచ బ్యాంకు ఇటీవల వెల్లడించింది ?
1) 6 శాతం
2) 7 శాతం
3) 8 శాతం
4) 9 శాతం
- View Answer
- సమాధానం: 2
వివరణ: ప్రపంచ బ్యాంకు ఇటీవల దక్షిణాసియా ఆర్థిక స్థితిగతుల (South asia economic focus - 2017) నివేదికను విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2017-18)లో భారత్ వృద్ధి 7 శాతానికే పరిమితం అవుతుందని ఇందులో పేర్కొంది. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలుతో తలెత్తిన సమస్యలు ఇందుకు కారణమని వెల్లడించింది. 2018-19లో భారత్ వృద్ధి రేటు 7.3 శాతానికి చేరవచ్చని అంచనా వేసింది.
- సమాధానం: 2
42. టాటా టెలీ సర్వీసెస్ మొబైల్ కార్యకలాపాలు ఏ సంస్థలో విలీనం కానున్నాయి?
1) ఐడియా
2) ఎయిర్ టెల్
3) జియో
4) బీఎస్ ఎన్ ఎల్
- View Answer
- సమాధానం: 2
వివరణ: రుణభారంతో కుంగుతున్న టాటా టెలీసర్వీసెస్ మొబైల్ కార్యకలాపాలను విలీనం చేసుకోనున్నట్లు భారతీ ఎయిర్టెల్ ఇటీవల ప్రకటించింది. దీంతో సంస్థకు 19 సర్కిళ్లలో ఉన్న 4 కోట్ల మందికిపైగా కస్టమర్లు ఎయిర్‌టెల్‌కు బదిలీ అవుతారు. ఈ ఒప్పందంతో ఎయిర్ టెల్ కస్టమర్ల సంఖ్య 32 కోట్లకు చేరుతుంది.
- సమాధానం: 2
43. ఇటీవల భూమికి అతి సమీపంగా వచ్చిన శకలం(Asteroid)కు శాస్త్రవేత్తలు పెట్టిన పేరు ఏమిటి ?
1) 2012 TC4
2) 1 Ceres
3) 31 Euphrosyne
4) 704 Interamnia
- View Answer
- సమాధానం: 1
వివరణ: 2012 TC4 శకలం అక్టోబర్ 12న భూమికి సమీపంగా దూసుకెళ్లింది. యాబై నుంచి వంద అడుగుల పరిణామంలో ఉన్న ఈ శకలం గంటకు 16 వేల మైళ్ల వేగంతో అంటార్కిటికాకు 27 వేల మైళ్ల ఎత్తు నుంచి దూసుకెళ్లింది. ఐదేళ్ల క్రితం అమెరికాలోని హవాయి హాలియకల అబ్జర్వేటరిలోని పాన్ - స్టార్స్ టెలిస్కోప్ ద్వారా 2012 TC4ను శాస్త్రవేత్తలు గుర్తించారు.
- సమాధానం: 1
44. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఏ విశ్వవిద్యాలయం వందేళ్ల వేడుకలో పాల్గొన్నారు ?
1) పట్నా యూనివర్సిటీ
2) ఉస్మానియా యునివర్సిటీ
3) ఢిల్లీ యూనివర్సిటీ
4) మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ
- View Answer
- సమాధానం: 1
వివరణ: బిహార్‌లోని పట్నా యూనివర్సిటీ వందేళ్ల వేడుకలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. తద్వారా ఈ యూనివర్సిటీ వందేళ్ల చరిత్రలోజరిగిన వేడుకలకు హాజరైన తొలి ప్రధానిగా గుర్తింపు పొందారు. ఈ సందర్భంగా.. దేశంలోని 10 ప్రైవేటు యూనవర్సిటీలు, 10 ప్రభుత్వ యూనివర్సిటీలు, కలిపి మొత్తం 20 యూనివర్సిటీలను అత్యుత్తమంగా మార్చేందుకు ఐదేళ్ల కాలానికి 10 వేల కోట్ల రూపాయలు కేటాయించనున్నట్లు ప్రధాని ప్రకటించారు.
- సమాధానం: 1
45. 3వ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స ఫెస్టివల్ - 2017ను ఎక్కడ నిర్వహించారు ?
1) న్యూఢిల్లీ
2) చెన్నై
3) బెంగళూరు
4) కోల్ కతా
- View Answer
- సమాధానం: 2
వివరణ: 3వ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ - 2017 అక్టోబర్ 13 - 16 వరకు చెన్నైలో జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సెన్సైస్, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, విజ్ఞాన భారతీ సంయుక్తంగా ఈ ఫెస్ట్ నిర్వహించారుు.
- సమాధానం: 2
46. అమెరికాకు చెందిన ఖరీదైన బైకుల తయారీ సంస్థ హార్లే డేవిడ్సన్ భారత్ లోని ఏ నగరంలో యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది ?
1) న్యూఢిల్లీ
2) బెంగళూరు
3) హైదరాబాద్
4) విజయవాడ
- View Answer
- సమాధానం: 1
వివరణ: న్యూఢిల్లీలో ఏర్పాటు చేయనున్న హార్లేడేవిడ్ సన్ యూనివర్సిటీ ద్వారా టెక్నికల్, నాన్ టెక్నికల్ కోర్సులలో శిక్షణ ఇస్తారు. అలాగే శిక్షణ పొందిన వారికి ఉద్యోగాలు, డీలర్‌షిప్‌లు ఇస్తామని సంస్థ ప్రకటించింది. హార్లే డేవిడ్సన్ ఇప్పటికే ఆసియా పసిఫిక్ ప్రాంతంలో మూడు యూనివర్సిటీలను ఏర్పాటు చేసింది. ఢిల్లీలో ఏర్పాటు చేసేది నాలుగోది.
- సమాధానం: 1
47. మయన్మార్‌లో జరిగిన ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ అండర్ - 15 మహిళల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు ?
1) సామియా సిద్ధిఖీ
2) విడ్జాజా స్టెఫానీ
3) మేఘనా రెడ్డి
4) కే భార్గవి
- View Answer
- సమాధానం: 1
వివరణ: మయన్మార్‌లో జరిగిన ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ అండర్ - 15 మహిళల సింగిల్స్ ఫైనల్లో.. భారత్‌కు చెందిన సామియా సిద్ధిఖీ(హైదరాబాదీ ప్లేయర్), ఇండోనేషియాకు చెందిన విడ్జజా స్టెఫానిని ఓడించి పసిడి పతకాన్ని గెలుచుకుంది.
- సమాధానం: 1
48. బ్రెస్ట్ మిల్క్ ఫౌండేషన్ - BMF,అమారా పేరుతో ఇటీవల తల్లి పాల నిధి కేంద్రాన్ని ఏ నగరంలో ప్రారంభించింది ?
1) హైదరాబాద్
2) బెంగళూరు
3) పట్నా
4) రాయ్ పూర్
- View Answer
- సమాధానం: 2
వివరణ: స్వచ్ఛంద సంస్థ బ్రెస్ట్ మిల్క్ ఫౌండేషన్, ఫోర్టిస్ లా ఫెమ్మె ఆస్పత్రి సంయుక్తంగా న్యూఢిల్లీలో తొలిసారి తల్లి పాల నిధి కేంద్రాన్ని ప్రారంభించాయి. తల్లి పాల కొరత ఉన్న అప్పుడే పుట్టిన శిశువులకు పాలు అందించేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇటీవల రెండో కేంద్రాన్ని బెంగళూరులో ప్రారంభించారు.
- సమాధానం: 2
49. షాంఘై ఓపెన్ ఏటీపీ మాస్టర్స్ సీరీస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు ?
1) రోజర్ ఫెదరర్
2) రాఫెల్ నాదల్
3) నొవాక్ జకోవిచ్
4) జో విల్ ఫ్రిడ్ సోంగా
- View Answer
- సమాధానం: 1
వివరణ: షాంఘై ఓపెన్ ఏటీపీ మాస్టర్ సీరీస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్.. స్పెయిన్‌కు చెందిన రాఫెల్ నాదల్‌ను ఓడించి టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఈ విజయంతో అత్యధిక సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుల జాబితాలో ఇవాన్ లెండిల్ ( 94 టైటిల్స్) సరసన ఫెడరర్ సంయుక్తంగా రెండో స్థానానికి చేరుకున్నాడు. అమెరికాకు చెందిన జిమ్మీ కానర్స్ 109 టైటిళ్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.
- సమాధానం: 1
50. తియాన్ జిన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు ?
1) సెరెనా విలియమ్స్
2) మారియా షరపోవా
3) అర్యానా సబలెంకా
4) మాడిసన్ కీస్
- View Answer
- సమాధానం: 2
వివరణ: చైనాలో జరిగిన తియాన్ జిన్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో రష్యాకు చెందిన మారియా షరపోవా... బెలారస్‌కు చెందిన అర్యానా సబలెంకాను ఓడించి టైటిల్ ను గెలుచుకుంది. గతేడాది డోపింగ్‌లో పట్టుబడి 15 నెలల నిషేధం ఎదుర్కొన్న షరపోవా ఈ ఏడాది ఏప్రిల్ లో పునరాగమనం చేసింది.
- సమాధానం: 2