కరెంట్ అఫైర్స్(మే 02 - 09, 2019)
1. ఇటీవల వార్తల్లో నిలిచిన మావ్మ్లా గుహ, థిరియాఘాట్ గుహ ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
1) మహారాష్ట్ర
2) మణిపూర్
3) మిజోరాం
4) మేఘాలయ
- View Answer
- సమాధానం: 4
2. సైనో-ఇండియన్ (చైనా-భారత్) సరిహద్దు వాణిజ్యం - 14 వ ఎడిషన్ కోసం తెరిచిన పర్వత మార్గం?
1) మన పాస్, ఉత్తరాఖండ్
2) బరాలాచా లా, హిమాచల్‌ప్రదేశ్
3) నాథులా, సిక్కిం
4) రోహ్తాంగ్ పాస్, హిమాచల్ ప్రదేశ్
- View Answer
- సమాధానం: 3
3.ఏ ఆధ్యాత్మికవేత్త 750వ జయంతిని పురస్కరించుకుని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు తపాలా బిళ్లను విడుదల చేశారు?
1) మనవల మమునిగల్
2) శ్రీ వేదాంత దేశికన్
3) యమునాచారి
4) నాథముని
- View Answer
- సమాధానం: 2
4. ఇటీవల ఒడిశా, పశ్చిమ బంగా రాష్ట్రాలను అతలాకుతలం చేసిన పాము అని అర్థం వచ్చే ‘ఫణి’ తుఫాను పేరును ఏ దేశం సూచించింది?
1) మాల్దీవులు
2) మయన్మార్
3) ఒమన్
4) బంగ్లాదేశ్
- View Answer
- సమాధానం: 4
5. సుమారు 246 మెట్రిక్ టన్నుల తేనె ఉత్పత్తికి తోడ్పడిన లక్ష తేనెటీగల పెట్టెలను ఏ మిషన్ కింద ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కేవీఐసీ) పంపిణీ చేసింది?
1) హనీ మిషన్
2) హనీ బీ మిషన్
3) మధుర్ మిషన్
4) ఎపికల్చర్ మిషన్
- View Answer
- సమాధానం: 1
6. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్ఎస్సీ)కి చెందిన 1267 అల్‌ఖైదా ఆంక్షల కమిటీ ఇటీవల ఎవరిని ‘అంతర్జాతీయ ఉగ్రవాది’ గా గుర్తించింది?
1) అహ్మద్ ఒమర్ సయీద్ షేక్
2) మసూద్ అజర్
3) ముస్తాక్ అహ్మద్ జర్గార్
4) మౌలానా మొహమ్మద్ అజర్
- View Answer
- సమాధానం: 2
7. ప్రపంచంలోనే తొలిసారిగా ఏ దేశపు జాతీయ చట్టసభ పర్యావరణ, వాతావరణ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది?
1) యూకే
2) నెదర్లాండ్స్
3) జపాన్
4) శ్రీలంక
- View Answer
- సమాధానం: 1
8. ఆసియా సహకార చర్చలు(ఏసీడీ) 16వ మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది?
1) మాస్కో, రష్యా
2) న్యూఢిల్లీ, భారత్
3) దోహా, ఖతార్
4) జకార్తా, ఇండోనేషియా
- View Answer
- సమాధానం: 3
9. షాంఘాయ్ సహకార సంస్ధ(ఎస్సీఓ) రక్షణ మంత్రుల సమావేశం - 2019 ఎక్కడ జరిగింది?
1) బిష్కెక్, కిరిజిస్తాన్
2) బీజింగ్, చైనా
3) దుషాన్బీ, తజకిస్తాన్
4) నూర్- సుల్తాన్, కజకిస్తాన్
- View Answer
- సమాధానం: 1
10.2019 ఆగస్ట్‌లో జరిగే 45వ జీ7 సమ్మిట్‌కు ఆతిథ్యమివ్వనున్న దేశం?
1) జపాన్
2) ఇటలీ
3) ఫ్రాన్స్
4) కెనడా
- View Answer
- సమాధానం: 3
11. వాతావరణ సంక్షోభంపై చర్చించేందుకు ఉద్దేశించిన జీ7 పర్యావరణ మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది?
1) రోమ్, ఇటలీ
2) మెట్జ్, ఫ్రాన్స్
3) ఒట్టావా, కెనడా
4) ప్యారిస్, ఫ్రాన్స్
- View Answer
- సమాధానం: 2
12.ఏ రాజకీయ నాయకుని జీవితం, పనులపై భారత్, బంగ్లాదేశ్ సంయుక్తంగా ఓ చలన చిత్రాన్ని రూపొందించనున్నాయి?
1) ఒబైదుల్ ఖాదర్
2) షేక్ ముజీబుర్ రెహ్మాన్
3) కాజీ నజ్రుల్ ఇస్లాం
4) హుస్సేన్ ముహమ్మద్ ఎర్షాద్
- View Answer
- సమాధానం: 2
13. 11వ ఆర్కిటిక్ మండలి మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది?
1) లప్పీ అరీనా, రొవానీమీ, ఫిన్లాండ్
2) ముంబై, మహారాష్ట్ర, భారత్
3) బెర్జెన్, ఓస్లో, నార్వే
4) నఖా, స్టాక్‌హోం, స్వీడన్
- View Answer
- సమాధానం: 1
14. ఆర్కిటిక్ మండలి పరిశీలక దేశంగా తిరిగి ఎన్నికైన దేశం?
1) రష్యా
2) అమెరికా
3) భారత్
4) శ్రీలంక
- View Answer
- సమాధానం: 3
15. ఇ-మొబిలిటీకి సంబంధించి వివిధ ప్రాజెక్టుల అమలుకు ఎలక్టాన్రిక్స్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్ఏఐ)తో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ?
1) భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్
2) భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్
3) ఎన్టీపీసీ లిమిటెడ్
4) గెయిల్ లిమిటెడ్
- View Answer
- సమాధానం: 2
16. ఇటీవల మృతిచెందిన మద్రాస్, కేరళ హైకోర్టుల మాజీ ప్రధాన న్యాయమూర్తి?
1) జస్టిస్ సుభాషణ్ రెడ్డి
2) జస్టిస్ ఎం. పతంజలి శాస్త్రి
3) జస్టిస్ మెహర్ చాంద్ మహాజన్
4) జస్టిస్ బిజన్ కుమార్ ముఖర్జియా
- View Answer
- సమాధానం: 1
17. ఆసియా అభివృద్ధి బ్యాంక్ అంచనా ప్రకారం 2019లో ఆసియా పసిఫిక్ ప్రాంత వృద్ధి శాతం?
1) 6.5%
2) 6.2%
3) 5.9%
4) 5.7%
- View Answer
- సమాధానం: 4
18. 2018లో భారత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో అత్యధికంగా 52 ప్రాజెక్టులతో అగ్రస్థానంలో నిలిచిన దేశం?
1) అమెరికా
2) యూకే
3) చైనా
4) సౌదీ అరేబియా
- View Answer
- సమాధానం: 2
19. ఆసియా అభివృద్ధి బ్యాంకు బోర్డ్ ఆఫ్ గవర్నర్ల 52 వ వార్షిక సమావేశంలో ఆరోగ్యకరమైన మహాసముద్రాల కోసం కార్యాచరణ ప్రణాళికను ప్రారంభించారు. ఈ సమావేశం ఎక్కడ జరిగింది?
1) ఫ్రాంక్ఫర్ట్, జర్మనీ
2) నాడీ, ఫిజీ
3) మనీలా, ఫిలిప్పీన్స్
4) యొకోహోమా, జపాన్
- View Answer
- సమాధానం: 2
20. ఇండోనేషియా నుంచి దిగుమతి చేసుకున్న ఏ ఉత్పత్తిపై భారత ప్రభుత్వం యాంటీ డంపింగ్ డ్యూటీని విధించింది?
1) స్పె్లండా (Splenda)
2) సాకరైన్
3) స్టీవియా
4) ఐసోమాల్ట్
- View Answer
- సమాధానం: 2
21. మైక్రోసాఫ్ట్ ప్రారంభించిన బ్లాక్‌చైన్ ఆధారిత సేవ పేరు?
1) అజుర్ బ్లాక్‌చైన్ సర్వీస్
2) అబ్రా బ్లాక్‌చైన్ సర్వీస్
3) అర్డోర్ బ్లాక్‌చైన్ సర్వీస్
4) బిట్స్విఫ్ట్ బ్లాక్‌చైన్ సర్వీస్
- View Answer
- సమాధానం: 1
22. భారత పురావస్తు శాస్త్రవేత్తలు ఇటీవల ఏ బౌద్ధ క్షేత్రం సమీపంలో దేశంలోనే అతిపెద్ద శిల్పాన్ని తవ్వితీశారు?
1) హుబ్లీలోని బెళిగళి, కర్ణాటక
2) సూర్యాపేటలోని ఫణిగిరి, తెలంగాణ
3) కన్నూర్‌లోని మణియూర్, కేరళ
4) బెల్గాంలోని చందూర్, కర్ణాటక
- View Answer
- సమాధానం: 2
23. 2029 ఏప్రిల్ 13న భూమి దగ్గరగా వెళ్లే అతిపెద్ద ఉల్క?
1) 101955 బెన్ను
2) 4179 టౌటాటిస్
3) 99942 అపోఫిస్
4) 2062 అటెన్
- View Answer
- సమాధానం: 3
24.ఏ దేశానికి చెందిన ‘కమోవ్ కా 31’ అనే ఏయిర్బార్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ హెలీకాప్టర్‌ను భారత్ సైన్యం పొందనుంది?
1) ఇజ్రాయిల్
2) రష్యా
3) అమెరికా
4) ఫ్రాన్స్
- View Answer
- సమాధానం: 2
25. ’మొమో-3’ అనే తొలి ప్రైవేట్ రాకెట్‌ను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన దేశం?
1) జపాన్
2) ఇజ్రాయిల్
3) రష్యా
4) అమెరికా
- View Answer
- సమాధానం: 1
26. 36 ఏళ్ల సేవల తర్వాత భారత సైన్యానికి చెందిన ఏ ఫ్రంట్‌లైన్ మిసైల్ డెస్ట్రాయర్‌ను ఉపసంహరిస్తున్నారు?
1) ఐఎన్ఎస్ తరంగిణి
2) ఐఎన్ఎస్ కిర్పన్
3) ఐఎన్ఎస్ నిపట్
4) ఐఎన్ఎస్ రంజిత్
- View Answer
- సమాధానం: 4
27. ముంబైలోని మజాగోన్ డాక్‌యార్డ్‌లో ప్రారంభించిన భారత సైన్యానికి చెందిన 4వ స్కార్పీన్-క్లాస్ సబ్‌మెరైన్ (జలంతర్గామి) పేరు?
1) ఐఎన్ఎస్ వేలా
2) ఐఎన్ఎస్ ఖందేరీ
3) ఐఎన్ఎస్ కరంజ్
4) ఐఎన్ఎస్ వాగిర్
- View Answer
- సమాధానం: 1
28. ముంబైలోని బోరివలిలో ఉన్న సంజయ్‌గాంధీ జాతీయ పార్క్(ఎస్జీఎన్పీ)లో ఇటీవల మరణించిన తెల్లపులి పేరు?
1) సిద్ధార్థ్
2) రేణుక
3) బాజీరావ్
4) అవని
- View Answer
- సమాధానం: 3
29. నాసాకు చెందిన ‘డబుల్ ఆస్టరాయిడ్ రీడెరైక్షన్ టెస్ట్’ (డీఏఆర్టీ) స్పేస్‌క్రాఫ్ట్ ఏ ఉల్కను ఢీకొట్టనుంది?
1) అపోలో
2) టౌటాటిస్
3) ఐకారస్
4) డిడిమోస్ బి
- View Answer
- సమాధానం: 4
30. ‘ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సెన్సైస్’ (పీఎన్ఏఎస్) పత్రిక ప్రకారం నాడీ సంబంధ వ్యాధుల చికిత్స కోసం ఏ రసాయనాన్ని ఉపయోగించవచ్చు?
1) థైరాక్సిన్
2) సెరిటోనిన్
3) న్యూరోట్రాన్స్‌మిట్టర్
4) అడ్రినలిన్
- View Answer
- సమాధానం: 2
31. ఎం.జయశ్రీ వ్యాస్‌ను తొలి స్వతంత్ర మహిళా డెరైక్టర్‌గా నియమించిన స్టాక్ ఎక్స్ఛేంజ్?
1) ఇండియా ఇంటర్నేషనల్ ఎక్స్ఛేంజ్ (ఐఎన్ఎక్స్)
2) కలకత్తా స్టాక్ ఎక్స్ఛేంజ్
3) నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా(ఎన్ఎస్ఈ)
4) బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్( బీఎస్ఈ)
- View Answer
- సమాధానం: 4
32. నాటో(నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) సుప్రీం ఎలైడ్ కమాండర్ - యూరోప్గా ఎవరు నియమితులయ్యారు?
1) టాడ్ డి. వోల్టర్స్
2) జెన్స్ స్టోలెన్బెర్గ్
3) స్టూవర్ట్ పీచ్
4) జనరల్ ఆండ్రీ లనాటా
- View Answer
- సమాధానం: 1
33. 15వ ఆర్థిక సంఘం సలహా మండలి సభ్యునిగా నియమితులైన ప్రధాన ఆర్థిక సలహాదారు పేరు ఏమిటి?
1) సందీప్ నారాయణ్ ఝా
2) హరీశ్ సింగ్
3) డాక్టర్ కృష్ణమూర్తి సుబ్రమణ్యన్
4) సంతోష్ మెహతా
- View Answer
- సమాధానం: 3
34.ఉత్తర మెసిడోనియా అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు?
1) స్టీవో పెండరోవోస్కీ
2) జార్జీ ఇవనోవ్
3) నికోలా గ్రూవ్స్కీ
4) జొరాన్ జావ్
- View Answer
- సమాధానం: 1
35. డిజిటల్ పేమెంట్స్ టెక్నాలజీ - వీసా, భారత, దక్షిణాసియా మార్కెటింగ్ హెడ్‌గా ఎవరిని నియమించింది?
1) వసంత్ ఎం.ప్రభు
2) డినైజ్ మోరీసన్
3) రజత్ తనేజా
4) సుజాతా వి. కుమార్
- View Answer
- సమాధానం: 4
36. మేరీలీబోన్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) అధ్యక్షుడిగా నియమితుడైన తొలి బ్రిటిషేతర క్రికెటర్?
1) క్రిస్ గేల్
2) సచిన్ టెండూల్కర్
3) కుమార సంగక్కర
4) సునీల్ గవాస్కర్
- View Answer
- సమాధానం: 3
37. ఆసియా యువ మహిళా హాండ్‌బాల్ ఛాంపియన్షిప్ 2019 8వ ఎడిషన్ ఎక్కడ జరగనుంది?
1) చెన్నై, తమిళనాడు
2) ముంబై, మహారాష్ట్ర
3) కోల్‌కత, పశ్చిమ బంగా
4) జైపూర్, రాజస్థాన్
- View Answer
- సమాధానం: 4
38. రష్యా, డగిస్తాన్లోని కస్పియస్క్లో జరిగిన అలీ అలీవ్ రెజ్లింగ్ టోర్నమెంట్లో విజేతగా నిలిచిన భారత రెజ్లర్?
1) సుశీల్ కుమార్
2) భజరంగ్ పునియా
3) యోగేశ్వర్ దత్
4) జీత్ రామ
- View Answer
- సమాధానం: 2
39. పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రీదీ తన ఆత్మకథను వజహత్ ఎస్.ఖాన్ అనే పాత్రికేయుడుతో కలిసి రచించారు. దాని పేరు?
1) క్రికెట్ యాజ్ ఐ సీ ఇట్
2) క్రికెట్ డిలైట్‌ఫుల్
3) స్పిన్నింగ్ రౌండ్ ద వరల్డ్
4) గేమ్ ఛేంజర్
- View Answer
- సమాధానం: 4
40.ఏషియన్ ఇండివిడ్యువల్ స్వ్కాష్ ఛాంపియన్షిప్ 2019 ఎక్కడ జరిగింది?
1) జకార్తా, ఇండోనేషియా
2) న్యూఢిల్లీ, భారత్
3) కౌలాలంపూర్, మలేషియా
4) బీజింగ్, చైనా
- View Answer
- సమాధానం: 3
41. ఒక్క రోజు అంతర్జాతీయ క్రికెట్లో పాకిస్తాన్ ఓపెనింగ్ స్టాండ్ పేరిట ఉన్న భాగస్వామ్య ప్రపంచ రికార్డును 365 పరుగులతో తిరగరాసిన జాన్ క్యాంప్‌బెల్, షాయ్ హోప్ ఏ దేశానికి చెందినవారు?
1) న్యూజిలాండ్
2) వెస్టిండీస్
3) బంగ్లాదేశ్
4) దక్షిణాఫ్రికా
- View Answer
- సమాధానం: 2
42. 27వ పి.సి. చంద్ర పురస్కారం పొందిన ప్రఖ్యాత హృద్రోగ వైద్యుడు, మానవతావాది?
1) డాక్టర్. నరేశ్ ట్రిహాన్
2) డాక్టర్. దేవీ ప్రసాద్ శెట్టి
3) డాక్టర్. రమాకాంత పాండా
4) డాక్టర్. అమిత్ మిట్టల్
- View Answer
- సమాధానం: 2
43. ఇంటర్నేషనల్ డే ఆఫ్ మిడ్వైఫ్(మంత్రసాని) నేపథ్యం?
1) ఉమెన్ అండ్ న్యూబార్న్ - ది హార్ట్ ఆఫ్ మిడ్వైఫరి
2) మిడ్‌వైవ్స్ - మేకింగ్ ఎ డిఫరెన్స్ ఇన్ ద వరల్డ్
3) మిడ్‌వైవ్స్ - లీడింగ్ ద వే విథ్ క్వాలిటీ కేర్
4) మిడ్‌వైవ్స్ - డిఫెండర్స్ ఆఫ్ ఉమెన్స్ రైట్స్
- View Answer
- సమాధానం: 4
44. ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
1) మే 5
2) మే 6
3) మే 7
4) మే 8
- View Answer
- సమాధానం: 3
45. ప్రపంచ ఆస్తమా దినం - 2019 నేపథ్యం?
1) నెవర్ టూ ఎర్లీ, నెవర్ టూ లేట్. ఇట్స్ ఆల్వేస్ ది రైట్ టైమ్ టు అడ్రస్ ఎయిర్వేస్ డిసీజ్
2) స్టాప్(STOP) ఫర్ ఆస్తమా
3) అలర్జీ అండ్ ఆస్తమా
4) యు కెన్ కంట్రోల్ యువర్ ఆస్తమా
- View Answer
- సమాధానం: 2
46. రెడ్ క్రిసెంట్ డే 2019 లేదా ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం నేపథ్యం?
1) లెస్ నోన్ రెడ్‌క్రాస్ స్టోరీస్
2) లవ్
3) మెమొరబుల్ స్మైల్స్ ఫ్రమ్ అరౌండ్ ద వరల్డ్
4) టుగెదర్ ఫర్ హ్యుమానిటీ
- View Answer
- సమాధానం: 2
47. ‘నైట్ ఆఫ్ ది లీజియన్ ఆఫ్ ఆనర్’ అనే ఫ్రాన్స్ అత్యుత్తమ పౌర పురస్కారం పొందిన ఇస్రో మాజీ చీఫ్?
1) ఉడిపి రామచంద్రరావు
2) కృష్ణస్వామి కస్తూరిరంగన్
3) ఎ. ఎస్. కిరణ్ కుమార్
4) జి. మాధవన్ నాయర్
- View Answer
- సమాధానం: 3
48. ఏ వ్యాసానికి నిలీనా ఎం.ఎస్‌కు 2018 ఇన్వెస్టిగేటివ్ జర్మలిజంలో ‘ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం అవార్డు’ దక్కింది?
1) కోల్గోట్ 2.0
2) లేబర్ అండ్ లేబర్ మూవ్మెంట్స్
3) రేషియల్ అండ్ ఎథినిక్ మైనారిటీస్
4) వర్క్ అండ్ ఫ్యామిలీ
- View Answer
- సమాధానం: 1