కరెంట్ అఫైర్స్(2019, ఫిబ్రవరి 22-28)
1. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన 5వ ద్వీప అభివృద్ధి సంస్థ సమావేశం ఏ రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతంలో జరిగింది?
1. న్యూఢిల్లీ
2. అండమాన్, నికోబార్ దీవులు
3. పశ్చిమ బంగా
4. తమిళనాడు
- View Answer
- సమాధానం: 1
2. న్యూఢిల్లీలో జరిగిన 5వ ద్వీప అభివృద్ధి సంస్థ సమావేశంలో ఏ దీవి సీప్లేన్ ఆపరేషన్‌కు ఎంపికైంది?
1. లక్షద్వీప్
2. అమినిదివి దీవులు
3. అండమాన్, నికోబార్
4. షహీద్ ద్వీప్ ఐలెండ్
- View Answer
- సమాధానం: 4
3. అర్హులైన నిరుద్యోగులకు నెలకు రూ.3వేల భృతిని ఇచ్చందుకు తెలంగాణ ప్రభుత్వం కేటాయించిన మొత్తం?
1. రూ. 1810 కోట్లు
2. రూ. 1610 కోట్లు
3. రూ. 1510 కోట్లు
4.రూ. 1410 కోట్లు
- View Answer
- సమాధానం: 1
4. రెండు కోస్ట్ గార్డు జిల్లాల రాష్ట్రంగా ఆవిర్భవించిన తమిళనాడులో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం రెండవ కోస్టు గార్డ్ జిల్లాను ఎక్కడ ప్రారంభించింది?
1. కడలూరు
2. తూత్తుకుడి
3. నాగపట్నం
4. చెన్నై
- View Answer
- సమాధానం: 2
5. డిజిటల్ ఇండియా అవార్డ్స్ ప్రకటించిన రాష్ట్ర/ కేంద్ర పాలిత ప్రాంతవెబ్త్న్ర విభాగంలో ప్లాటినమ్ అవార్డు అందుకున్న ప్రభుత్వం?
1. కేరళ
2. త్రిపుర
3. మధ్యప్రదేశ్
4. న్యూఢిల్లీ
- View Answer
- సమాధానం: 2
6. శక్తి, పర్యావరణం( ఎనర్జీ - ఎన్విరాన్మెంట్) పై మూడు రోజుల ప్రదర్శన, అంతర్జాతీయ సదస్సుకు వేదికైన రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతం?
1. తమిళనాడు
2. పశ్చిమ బంగా
3. ఛండీగఢ్
4. న్యూఢిల్లీ
- View Answer
- సమాధానం: 4
7. మద్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక శిక్షణ కలిగిన శునకాలను వినియోగిస్తున్న తొలిరాష్ట్రం?
1. ఆంధ్రప్రదేశ్
2. పశ్చిమ బంగా
3. బిహార్
4. తెలంగాణ
- View Answer
- సమాధానం: 3
8. 12వ ద్వివార్షిక ఇంటర్నేషనల్ ఎరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఎగ్జిబిషన్- ‘ఎరో ఇండియా 19’ను రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ఎక్కడ ప్రారంభించారు?
1. కోల్‌కతా
2. ముంబై
3. బెంగళూరు
4. హైదరాబాద్
- View Answer
- సమాధానం: 3
9. ‘ఎరో ఇండియా 2019’ లో దేశీయంగా తయారైన యుద్ధ విమానం ‘తేజస్’ కు కో-పెలైట్ గా వ్యవహరించిన తొలి మహిళ?
1. పీవీ. సింధు
2. సైనా నేహ్వాల్
3. జ్వాలా గుత్తా
4. సానియా మిర్జా
- View Answer
- సమాధానం: సి
10. జాతీయ యుద్ధ స్మారకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడ ఆవిష్కరించారు?
1. కన్యాకుమారి
2. న్యూఢిల్లీ
3. శ్రీనగర్
4. ముంబై
- View Answer
- సమాధానం: 2
11.కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సురేశ్ ప్రభు ‘ఏవియేషన్ కాంక్లేవ్ 2019’ను ఎక్కడ ప్రారంభించారు?
1. ముంబై
2. న్యూఢిల్లీ
3. చెన్నై
4. పూణె
- View Answer
- సమాధానం: 2
12. మహాత్మా గాంధీ జీవితం, భావజాలం ఆధారంగా న్యూఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్(ఐఐసీ)లో మూడు రోజుల పాటు సాగిన ఉత్సవం పేరు?
1. శబ్ధోంకీ భాగ్
2. కజ్లీ తీజ్
3. వర్డ్స్ ఇన్ ద గార్డెన్
4. ఫీస్ట్ ఆఫ్ అవర్ మిరకిల్స్
- View Answer
- సమాధానం: 3
13. ఆసియాలో అతిపెద్ద బయోటెక్నాలజీ, లైఫ్ సెన్సైస్ ఫోరం-‘బయోఏషియా 2019’ 16వ ఎడిషన్ ఎక్కడ ప్రారంభమైంది?
1. హైదరాబాద్, తెలంగాణ
2. విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
3. పట్నా, బిహార్
4.రాంఛీ, జార్ఖండ్
- View Answer
- సమాధానం: 1
14. నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ -2019 సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించిన యాప్?
1. ఖేలో ఇండియా యాప్
2. మైగౌ యూప్
3. ఉమంగ్ యాప్
4. సేవా యాప్
- View Answer
- సమాధానం: 1
15. భారత్‌తో ఇంటర్నేషనల్ సోలార్ అలయెన్స్(ఐఎస్ఏ) ముసాయిదా ఒప్పందంపై సంతకం చేసిన 72వ దేశంగా ఆవిర్భవించిన దేశం?
1. స్వాజీలాండ్
2. అర్జెంటీనా
3. దక్షిణ సూడాన్
4. ఇజ్రాయెల్
- View Answer
- సమాధానం: 2
16. ఐసీటీ ఇంక్యుబేటర్ల వ్యాపార కేంద్రాన్ని ఏర్పాటు చేయటానికి భారత్ ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది?
1. అఫ్గనిస్తాన్
2. శ్రీలంక
3. బంగ్లాదేశ్
4. భూటాన్
- View Answer
- సమాధానం: 2
17. ప్రతిష్ఠాత్మక ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ సివిల్ మెరిట్’ను స్పెయిన్ ప్రభుత్వం ఎవరికి ప్రదానం చేసింది?
1. రామ్‌నాథ్ కోవింద్
2. నరేంద్ర మోదీ
3. సుష్మా స్వరాజ్
4. నిర్మలా సీతారామన్
- View Answer
- సమాధానం: 3
18. సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్, భారత హజ్ యాత్రికుల కోటాను 1.75 లక్షల నుంచి ఎంతకు పెంచారు?
1. 3 లక్షలు
2. 2.5 లక్షలు
3. 2.75 లక్షలు
4. 2 లక్షలు
- View Answer
- సమాధానం: 4
19. గ్లోబల్ బిజినెస్ సమిట్‌కు ఆతిథ్యమిచ్చిన రాష్ట్రం/ కేంద్ర పాలిత ప్రాంతం?
1. కర్ణాటక
2. ఛండీగఢ్
3. పాండిచ్ఛేరి
4. న్యూఢిల్లీ
- View Answer
- సమాధానం: 4
20. సింధూ జలాల పంపకాన్ని ఏ దేశంతో నిలిపివేయాలని భారత్తీర్మానించుకుంది?
1. భూటాన్
2. నేపాల్
3. అఫ్గనిస్తాన్
4. పాకిస్తాన్
- View Answer
- సమాధానం: 4
21. భారత్ తొలిసారిగా హాజరవుతున్న ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో-ఆపరేషన్ విదేశీ వ్యవహారాల మంత్రుల సమావేశానికి ఆతిథ్యమిచ్చిన దేశం?
1. ఇరాన్
2. యూఏఈ
3. ఇరాక్
4. సౌదీ అరేబియా
- View Answer
- సమాధానం: 2
22. థాయ్‌లాండ్‌లో జరిగిన ఆసియా పసిఫిక్ ప్రాంత అతిపెద్ద బహుళజాతి సైనిక వ్యాయామం పేరు?
1.ఎకూవెరిన్
2. కోబ్రా గోల్డ్
3. యుధ్ అభ్యాస్
4. శత్రుజిత్
- View Answer
- సమాధానం: 2
23. నెలరోజులపాటు జరిగే ‘ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’కు ఆతిథ్యమిచ్చే నగరం?
1. కొలంబో, శ్రీలంక
2. గయ, భారత్
3. ఖాట్మండు, నేపాల్
4. థింపూ, భూటాన్
- View Answer
- సమాధానం: 3
24. భారత్-దక్షిణ కొరియా బిజినెస్ సింఫోజియం ఎక్కడ జరిగింది?
1. సియోల్
2. బుసాన్
3. న్యూఢిల్లీ
4. ముంబై
- View Answer
- సమాధానం: 1
25. ‘పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2019’ నివేదిక జాబితాలో అగ్రస్థానం దక్కించుకున్న దేశం?
1.యూఏఈ
2. భారత్
3. అమెరికా
4. జర్మనీ
- View Answer
- సమాధానం: 1
26. దక్షిణ కొరియాలో జరిగిన 14వ ఎడిషన్-సియోల్ శాంతి పురస్కార వేడుకలో పురస్కారాన్ని ఎవరు అందుకున్నారు?
1. మూన్ జేయ్-ఇన్
2. గిమ్హె హియో సియోంగ్ గోన్
3. రామ్‌నాథ్ కోవింద్
4. నరేంద్ర మోదీ
- View Answer
- సమాధానం: 4
27. 46.6 మిలియన్ల పెరుగుదల లోపం గల శిశువులతో ‘గ్లోబల్ న్యూట్రిషన్ రిపోర్ట్ ఇండెక్స్’లో అగ్రస్థానంలో నిలిచిన దేశం?
1. బంగ్లాదేశ్
2. పాకిస్తాన్
3.ై నెజీరియా
4. భారత్
- View Answer
- సమాధానం: 4
28. ఫేస్బుక్ కోసం ఎకానిమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్(ఈఐయూ) రూపొందించిన ‘ఇంక్లూజివ్ ఇంటర్నెట్ ఇండెక్స్ 2019’ లో భారత్ ర్యాంక్?
1. 25
2. 47
3. 30
4. 50
- View Answer
- సమాధానం: 2
29. 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోకి ఆర్థిక మంత్రిత్వ శాఖఎంత క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ని ప్రకటించింది?
1. రూ. 48,239 కోట్లు
2. రూ. 47,239 కోట్లు
3. రూ. 40,239 కోట్లు
4. రూ. 49,239 కోట్లు
- View Answer
- సమాధానం: 1
30. వరుసగా నాలుగో సారి గ్లోబల్ టాప్ ఎంప్లాయర్లో అగ్రస్థానం దక్కించుకున్న సంస్థ?
1. యాపిల్
2. మైక్రోసాఫ్ట్
3. గూగుల్
4. టీసీఎస్
- View Answer
- సమాధానం: 4
31. ఆర్బీఐతో పాటు ఏ బ్యాంక్ 75 బిలియన్ డాలర్లు స్వాప్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది?
1. అగ్రికల్చరల్ బ్యాంక్ ఆఫ్ చైనా
2. బ్యాంక్ ఆఫ్ జపాన్
3. బ్యాంక్ ఆఫ్ చైనా
4. హెచ్ఎస్బీసీ
- View Answer
- సమాధానం: 2
32. భారత్ ముడి చక్కెరను ఐదేళ్లలో తొలిసారి కొనుగోలు చేసిన దేశం?
1. ఇరాక్
2. ఒమన్
3. ఇరాన్
4. బంగ్లాదేశ్
- View Answer
- సమాధానం: 3
33. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆవిష్కరించిన భారతదేశపు తొలి హ్యూమనాయిడ్ పోలీస్ రోబో పేరు?
1. కేపీ-బాట్
2. కేఎల్-బాట్
3. పోల్-బాట్
4. కేఎల్-హ్యూమ్
- View Answer
- సమాధానం: 1
34. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్లాగ్‌షిప్ ప్రోగ్రామ్ మేక్ ఇన్ ఇండియా ద్వారా తయారు కానున్న కొత్త ఎఫ్-21 ఫైటర్ జెట్‌ను ఆవిష్కరించిన దేశం?
1. యూకే
2. అమెరికా
3. రష్యా
4. ఫ్రాన్స్
- View Answer
- సమాధానం: 2
35. అత్యంత అరుదైన కాన్వెక్స్ వెంటెడ్ హార్న్డ్ జాతి ఎరుపు రంగుకప్పను శాస్త్రవేత్తలు ఇటీవల ఏ రాష్ట్రంలో కనుగొన్నారు?
1. తమిళనాడు
2. అరణాచల్‌ప్రదేశ్
3. ఆంధ్రప్రదేశ్
4. కేరళ
- View Answer
- సమాధానం: 2
36. వాతావరణ మార్పు కారణంగా అంతరించిన ప్రపంచపు తొలి క్షీరదం అయిన గోదుమ రంగు ఎలుక- బ్రాంబుల్ కే మెలోమిస్ ఏ దేశానికి చెందింది?
1. శ్రీలంక
2. ఇండోనేషియా
3.ఆస్ట్రేలియా
4. నేపాల్
- View Answer
- సమాధానం: 3
37. అమెరికాలోని ప్లోరిడాలో స్పేస్ ఎక్స్ ద్వారా ప్రయోగించిన ఇజ్రాయిల్ తొలి మూన్ ల్యాండర్ పేరు?
1. బెరిషీట్
2. ల్యూనార్షీట్
3. ల్యూన్శాట్
4. ల్యూన్షీట్
- View Answer
- సమాధానం: 1
38. ఏ రాష్ట్రప్రభుత్వం కోతినివచ్చే ఏడాదికి వర్మిన్(పంట నాశిని) గా ప్రకటించింది?
1. కేరళ
2. ఆంధ్రప్రదేశ్
3. హిమాచల్ ప్రదేశ్
4. మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 3
39. కొత్తగా ఏర్పాటైన డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ సెక్రటిరీ (అదనపు బాధ్యత)గా ఎవరు నియమితులయ్యారు?
1. భాస్కర్ ఖుల్బే
2. తరుణ్ శ్రీధర్
3. ప్రదీప్ కుమార్ సిన్హా
4. ఇందర్జీత్ సింగ్
- View Answer
- సమాధానం: 2
40. జస్టిస్ ఉమానాథ్ సింగ్ ఏ రాష్ట్రానికి తొలి లోకాయుక్తగా నియమితులయ్యారు?
1. సిక్కిం
2. మణిపూర్
3. నాగలాండ్
4. మేఘాలయ
- View Answer
- సమాధానం: 3
41. నేషనల్ బుక్ ట్రస్ట్(ఎన్ బీటీ) ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు?
1. సందీప్ జోషి
2. సంతోష్ రాయ్
3. బల్దియో హరీశ్ శర్మ
4. గోవింద్ ప్రసాద్ శర్మ
- View Answer
- సమాధానం: 4
42. బీసీసీఐ(బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా) తొలి అంబుడ్స్మేన్గా సుప్రీం కోర్టు ఎవరిని నియమించింది?
1. విజయ్ కేశవ్ గోఖలే
2. రాజీవ్ త్రివేది
3. డీకే. జైన్
4. టీఎస్. గురునాథం
- View Answer
- సమాధానం: 3
43. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో ‘హైయెస్ట్ క్యాచ్ ఆఫ్ ఎ క్రికెట్ బాల్’ తో సరికొత్త గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌ను నెలకొల్పిన అలీసా హేలీ ఏ దేశానికి చెందింది?
1. ఆస్ట్రేలియా
2. ఇంగ్లండ్
3. ఐర్లాండ్
4. న్యూజిలాండ్
- View Answer
- సమాధానం: 1
44. దక్షిణాఫ్రికాలో టెస్ట్ సిరీస్‌ను గెలిచిన మొదటి ఆసియా జట్టుగా ఆవిర్భవించిన జట్టు?
1. వెస్టిండీస్
2. ఆస్ట్రేలియా
3. భారత్
4. శ్రీలంక
- View Answer
- సమాధానం: 4
45. అంతర్జాతీయ టి20 చరిత్రలో నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా ఆవిర్భవించిన రషీద్ ఖాన్ ఏ దేశానికి చెందిన వాడు?
1. భారత్
2. అఫ్గనిస్తాన్
3. పాకిస్తాన్
4. బంగ్లాదేశ్
- View Answer
- సమాధానం: 2
46. ఐసీసీ-మహిళలటీ20 ప్రపంచ కప్‌కు ఏ దేశం ఆతిథ్యమివ్వనుంది?
1. ఇంగ్లండ్
2. భారత్
3. న్యూజిలాండ్
4. ఆస్ట్రేలియా
- View Answer
- సమాధానం: 4
47. 2019, ఫిబ్రవరి 22న జరుపుకున్న వరల్డ్ థింకింగ్ డే నేపథ్యం?
1. వివేకం
2. విజ్ఞానం
3. నాయకత్వం
4. అవగాహన
- View Answer
- సమాధానం: 3
48. 91వ అకాడమీ అవార్డుల్లో ఎక్కువ అవార్డులు దక్కించుకున్న చిత్రం?
1. బ్లాక్ పాంథర్
2. బొహిమియన్ రాప్సోడీ
3. గ్రీన్ బుక్
4. రోమ
- View Answer
- సమాధానం: 2
49. 91వ అకాడమీ అవార్డుల్లో బెస్ట్ ఒరిజినల్ స్కోర్ అవార్డు దక్కించుకున్న తొలి సూపర్ హీరో చిత్రం?
1. అక్వామేన్
2. అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్
3. వండర్ ఉమెన్
4. బ్లాక్ పాంథర్
- View Answer
- సమాధానం: 4
50. ఉత్తమ చిత్రం విభాగంలో ఆస్కార్ పురస్కారం దక్కించుకున్న చిత్రం?
1.బొహిమియన్ రాప్సోడీ
2. గ్రీన్ బుక్
3. రోమ
4. ఫస్ట్ మేన్
- View Answer
- సమాధానం: 2