కరెంట్ అఫైర్స్(2019, ఏప్రిల్ 12 - 18)
1. డబ్ల్యూహెచ్ఓ నివేదిక ‘పొలిటికల్ లీడర్స్ పొజిషన్ అండ్ యాక్షన్ ఆన్ ఎయిర్ క్వాలిటీ ఇన్ ఇండియా 2014-2019’ ప్రకారం ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరం?
1) పాట్నా
2) గయ
3) కాన్పూర్
4) ఫరిదాబాద్
- View Answer
- సమాధానం: 3
2. ఎన్నికల సయమంలో బయోపిక్‌లు, ప్రచార సామగ్రిని ప్రదర్శించడాన్ని ఎన్నికల సంఘం ఏ ఆర్టికల్ ప్రకారం నిషేధించింది?
1) ఆర్టికల్ 374
2) ఆర్టికల్ 414
3) ఆర్టికల్ 294
4) ఆర్టికల్ 324
- View Answer
- సమాధానం: 4
3. ఓటర్లలో ఎన్నికల విధానంపై అవగాహన కల్పించడానికి దేశంలోనే తొలిసారిగా ‘ఓటర్ పార్క్’ ఎక్కడ ప్రారంభమైంది?
1) హైదరాబాద్, తెలంగాణ
2) నాగ్‌పూర్, మహారాష్ట్ర
3) ఫరిదాబాద్, హరియాణా
4) గుర్గావ్, హరియాణా
- View Answer
- సమాధానం: 4
4. భారతదేశంలో సంప్రదాయక నేత ఆకృతుల పరిరక్షణకు మైక్రోసాఫ్ట్ ప్రారంభించిన ఇనిషియేటివ్?
1) వీవ్డ్రాఫ్ట్
2) వీవ్ఇట్
3) రీవీవ్
4) అంతరన్
- View Answer
- సమాధానం: 3
5. ఏ పాలసీ కాలపరిమితిని 2019 ఏప్రిల్ 1 నుంచి తదుపరి ఉత్తర్వుల వెల్లడించే వరకు పొడిగించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది?
1) డ్రగ్ పాలసీ ఆఫ్ ఇండియా -2013
2) ఎనర్జీ పాలసీ ఆఫ్ ఇండియా-2014
3) న్యూ యూరియా పాలసీ-2015
4) నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్- 2016
- View Answer
- సమాధానం: 3
6. 2021-2024లో 5 రాకెట్లను మోసుకెళ్లే ఏ ప్రయోగ వాహనం- నాలుగో దఫా కార్యక్రమాన్ని కొనసాగించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం లభించింది?
1) శాటిలైట్ లాంచ్ వెహికల్( ఎస్ఎల్వీ)
2) ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (ఏఎస్ఎల్వీ)
3) పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్( పీఎస్ఎల్వీ)
4) జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్(జీఎస్ఎల్వీ)
- View Answer
- సమాధానం: 4
7. ఇండియన్ కోస్ట్ గార్డ్ తీరప్రాంత(ఆఫ్‌షోర్) గస్తీ నౌక ‘వీర’ ను ఎక్కడ అప్పగించారు?
1) విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
2) ముంబై, మహారాష్ట్ర
3) కొచ్చి, కేరళ
4) విజయనారాయణపురం, తమిళనాడు
- View Answer
- సమాధానం: 1
8. వైస్ అడ్మిరల్ ఎం.ఎస్. పవార్ అధ్యక్షతన డీబ్రీఫ్ ఆఫ్ ఇండియన్ నేవీ కోస్టల్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ ‘సీ విజిల్’ ఎక్కడ జరిగింది?
1) చెన్నై
2) కోల్‌కతా
3) కొచ్చి
4) న్యూఢిల్లీ
- View Answer
- సమాధానం: 4
9. న్యూఢిల్లీలో నిర్వహించిన ‘ఫారిన్ ఆఫీస్ కన్సల్టేషన్స్’లో రాజకీయ, వాణిజ్య, శాస్త్ర, సాంస్కృతిక సహకారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచుకోడానికి అంగీకరించిన రెండు దేశాలు?
1) భారత్, కెనడా
2) భారత్, నెదర్లాండ్స్
3) భారత్, అమెరికా
4) భారత్, ఫ్రాన్స్
- View Answer
- సమాధానం: 2
10. నౌకలు, ఓడ రేవుల మధ్య ఎలక్ట్రానిక్ సమాచారాన్ని ఇచ్చుపుచ్చుకునేందుకు వీలుగా ఓ కొత్త నియమాన్ని రూపొందించిన సంస్థ?
1) ఇంటర్నేషనల్ మ్యారిటైం లా ఇన్స్టిట్యూట్
2) వరల్డ్ మ్యారిటైం యూనివర్సిటీ
3) యూరోపియన్ మ్యారిటైం సేఫ్టీ ఏజెన్సీ
4) ఇంటర్నేషనల్ మ్యారిటైం ఆర్గనైజేషన్
- View Answer
- సమాధానం: 4
11.భారత్- ఆసియాన్ దేశాల మధ్య సముద్రరంగాన్ని బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన 21వ ‘ఆసియాన్-భారత్ సీనియర్ అఫీషియల్స్ మీటింగ్(ఎస్ఓఎం)’ను ఎక్కడ నిర్వహించారు?
1) వియంటియానే, లావోస్
2) న్యూఢిల్లీ, భారత్
3) జకర్తా, ఇండోనేషియా
4) నాంఫెన్, కంబోడియా
- View Answer
- సమాధానం: 2
12. జీ-20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల 2019 వార్షిక వసంత(స్ప్రింగ్) సమావేశం ఏ నగరంలో జరిగింది?
1) వాషింగ్టన్ డీసీ, అమెరికా
2) సియోల్, దక్షిణ కొరియా
3) బ్రెజిలియా, బ్రెజిల్
4) మాస్కో, రష్యా
- View Answer
- సమాధానం: 1
13. అబూదాబీ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్(ఏడీఐబీఎఫ్)-2019కు గౌరవ అతిథిగా ఎంపికైన దేశం?
1) శ్రీలంక
2) థాయిలాండ్
3) భారత్
4) బంగ్లాదేశ్
- View Answer
- సమాధానం: 3
14. ఏ రంగంలో అభివృద్ధి కోసం భారత్, డెన్మార్క్ ఒప్పందం కుదుర్చుకున్నాయి?
1) పునరుత్పాదక శక్తి
2) రక్షణ, ఆరోగ్యం
3) మౌలికవసతులు
4) వాతావరణం, వాతావరణ సైన్స్
- View Answer
- సమాధానం: 1
15. బయోటెక్నాలజీ విద్య, శిక్షణ పరిశోధనా రంగాల్లో నిర్దిష్ట ప్రణాళికాభివృద్ధి కోసం భారత్‌తో ఒప్పందం కుదుర్చుకున్న దేశం?
1) యూకే
2) బ్రెజిల్
3) స్వీడన్
4) నార్వే
- View Answer
- సమాధానం: 2
16. భారత్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా సంయుక్తంగా విడుదల చేసిన తపాలా స్టాంప్ థీమ్?
1) భారత్, కొరియా 10వ వార్షికోత్సవం
2) హైబిస్కస్ విథ్ రైస్ 1946
3) క్వీన్ హర్ హ్వాంగ్-ఓక్ ఆఫ్ కొరియా
4) గోల్డ్ క్రౌన్ ఆఫ్ ది సిల్లా డైనాస్టీ 1946
- View Answer
- సమాధానం: 3
17. ప్రభుత్వం, వ్యాపారం, సమాజ భవిష్యత్తుపై ప్రపంచపు సంభాషణను శక్తిమంతం చేయడానికి జరిగే ప్రపంచపు తొలి కృత్రిమ మేథ సదస్సుకు ఆతిథ్యమివ్వనున్న నగరం?
1) జపాన్
2) చైనా
3) అమెరికా
4) యూఏఈ
- View Answer
- సమాధానం: 4
18. 'Llanfairpwllgwyngyllgogerych wyrndrobwllllantysiliogogogoch' or Llanfairpwlల్యాన్ఫెయిర్పివిల్ రైల్వే స్టేషన్ ప్రపంచంలోనే అత్యంత పొడవైన పేరున్న(ఎక్కువ అక్షరాలున్న) స్టేషన్‌గా ఆవిర్భవించింది. ఇది ఏ దేశంలో ఉంది?
1) వేల్స్
2) నార్తన్ ఐర్లాండ్
3) స్కాట్లాండ్
4) ఇంగ్లండ్
- View Answer
- సమాధానం: 1
19. శాంతికాముక కార్యకలాపాల కోసం భారత్‌కు ఏ సంస్థ 38 మిలియన్ డాలర్ల (అత్యధిక మొత్తం) రుణాన్ని ఇచ్చింది?
1) ఐక్యరాజ్య సమితి
2) ప్రపంచ వాణిజ్య సంస్థ
3) నాటో(నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్)
4) అసోసియేషన్ ఆఫ్ సాత్ఈస్ట్ ఏషియన్ నేషన్స్
- View Answer
- సమాధానం: 1
20. గూగుల్, ఏ నగరంలో తొలి ఆఫ్రికా కృత్రిమ మేధ(ఏఐ) ప్రయోగశాలను ప్రారంభించింది?
1) మోన్రోవియా, లైబీరియా
2) బమాకో, మాలి
3) అబుజా, నైజీరియా
4) అఖ్రా, ఘనా
- View Answer
- సమాధానం: 4
21. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రకారం మార్చి 29 నాటికి బ్యాంక్ క్రెడిట్ ఎంత శాతం పెరిగింది?
1) 13.24%
2) 11.42%
3) 12.31%
4) 14.21%
- View Answer
- సమాధానం: 1
22. ఫోర్బ్స్ తొలి సారిగా నిర్వహించిన ప్రపంచ అత్యుత్తమ బ్యాంక్ సర్వే ప్రకారం భారత్‌లో వినియోగదారులచే నంబర్ 1 బ్యాంక్‌గా గుర్తింపు పొందిన బ్యాంక్?
1) డీబీఎస్ బ్యాంక్
2) ఐసీఐసీఐ బ్యాంక్
3) హెచ్డీఎఫ్సీ బ్యాంక్
4) ఐడీఎఫ్సీ బ్యాంక్
- View Answer
- సమాధానం: 3
23. వ్యవసాయ, చిన్న, సన్న మధ్య తరహా పరిశ్రమలు, చిరు వ్యాపారాలను ప్రోత్సహించడానికి భారతీయ స్టేట్ బ్యాంక్ ఏ బ్యాంకింగ్ సంస్థతో తొలి ‘కో- ఆరిజినేషన్ లోన్ అగ్రిమెంట్’ ను కుదుర్చుకుంది?
1) టాంజిరైన్
2) పైసాలో (PAISALO) డిజిటల్ లిమిటెడ్
3) ఫస్ట్ డెరైక్ట్
4) యూఎస్ఏఏ
- View Answer
- సమాధానం: 2
24. బులియన్ రిఫైనర్ ఎంఎంటీసీ- పీఏఎంపీ ఇండియాతో భాగస్వామ్యం అనంతరం గూగుల్ పేతో దేన్ని కొనుగోలు చెయ్యొచ్చు?
1) బంగారం
2) విదేశీ బాండ్లు
3) షేర్లు
4) హై-ఈల్డ్ బాండ్లు
- View Answer
- సమాధానం: 1
25. అమెరికాకు చెందిన ఫైనాన్షియల్ టెక్నాలజీ ‘విబ్మో’ను 70 మిలియన్ల డాలర్లతో చేజిక్కించుకున్న డిజిటల్ చెల్లింపుల సంస్థ?
1) పేయూ
2) పేపల్
3) గూగుల్‌పే
4) పేటీయం
- View Answer
- సమాధానం: 1
26. ఏ రంగం పునరుద్ధరణ కోసం టాటా ట్రస్ట్స్, మైక్రోసాఫ్ట్ ఇండియా మధ్య ఒప్పందం కుదిరింది?
1) చేనేత సమూహాలు
2) వ్యవసాయం, సంబంధిత రంగాలు
3) ఉత్పత్తి రంగం
4) అటవీ, మత్స్య రంగం
- View Answer
- సమాధానం: 1
27. భారత్‌లోనే తొలి ఫారిన్ ఇంటరాక్టివ్ బర్డ్ పార్క్‌ను ముంబైలో ప్రారంభించిన సంస్థ?
1) ఎస్సెల్ వరల్డ్ లీజర్ ప్రై. లి.
2) అక్వాటికా ఇండియా ప్రై. లి.
3) నిక్కో పార్క్స్ అండ్ రిసార్ట్స్ లిమిటెడ్
4) తుకుజీ-నీ-వాడీ ప్రై. లి.
- View Answer
- సమాధానం: 1
28. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ లోకల్ ఎన్విరాన్మెంటల్ ఇనిషియేటివ్స్ (ఐసీఎల్ఈఐ) నిర్వహించిన 4వ ‘రెసిలెంట్ సిటీస్ ఏషియా పసిఫిక్ కాంగ్రెస్ 2019’ ఎక్కడ జరిగింది?
1) కోల్‌కతా
2) పూణె
3) ముంబై
4) న్యూఢిల్లీ
- View Answer
- సమాధానం: 4
29.ఆసియా అభివృద్ధి బ్యాంక్(ఏడీబీ) నుంచి అత్యధికంగా 3 బిలియన్ డాలర్ల సావరిన్ లోన్లను పొందిన దేశం?
1) అమెరికా
2) సౌదీ అరేబియా
3) భారత్
4) యూఏఈ
- View Answer
- సమాధానం: 3
30. దేశంలో అతిపెద్ద ఏటీఎం నెట్వర్క్ తో కార్డ్ ఆధారిత కార్యకలాపాల కోసం ఈఎంవీ చిప్, పిన్‌లకు మారిన తొలి ప్రభుత్వ రంగ బ్యాంక్?
1) ఇండియన్ బ్యాంక్
2) కెనరా బ్యాంక్
3) బ్యాంక్ ఆఫ్ బరోడా
4) భారతీయ స్టేట్ బ్యాంక్
- View Answer
- సమాధానం: 2
31. ఏ దేశ టెలికాం శాటిలైట్ స్పేస్ ఎక్స్- ఫాల్కన్ హెవీ రాకెట్ తొలి కమర్షియల్ లాంచ్‌ను ప్రారంభించింది?
1) ఇరాన్
2) సౌదీ అరేబియా
3) యూఏఈ
4) ఒమన్
- View Answer
- సమాధానం: 2
32. బ్లాక్‌హోల్ (కృష్ణబిలం) తొలి చిత్రాన్ని తీయడం కోసం ఖగోళశాస్త్రజ్ఞులు ఉపయోగించిన టెలిస్కోప్ పేరు?
1) ఈవెంట్ హొరైజాన్ టెలిస్కోప్
2) ఫర్మీ గామా-రే స్పేస్ టెలిస్కోప్
3) హార్డ్ ఎక్స్‌రే మాడ్యులేషన్ టెలిస్కోప్
4) ల్యూనార్ బేస్డ్ అల్ట్రావెలైట్ టెలిస్కోప్
- View Answer
- సమాధానం: 1
33. 67 వేల సంవత్సరాల కిందట భూమిమీద నివసించిన ‘హోమో లుజోనెన్సిస్’గా పేర్కొంటున్న జాతిని శాస్త్రవేత్తలు ఎక్కడ కనుగొన్నారు?
1) థాయ్‌లాండ్
2) ఇండోనేషియా
3) ఫిలిప్పీన్స్
4) మనీలా
- View Answer
- సమాధానం: 3
34. ప్రమాదకర రసాయనాలను పసిగట్టే స్పెక్ట్రోమీటర్ ఆవిష్కరణ గురించి ఇటీవల ఏ జర్నల్(పత్రిక) లో ప్రచురితమైంది?
1) జేఏఎంఏ
2) డిస్కవరీ
3) సైన్స్
4) నేచర్ కమ్యూనికేషన్స
- View Answer
- సమాధానం: 4
35. కాలిఫోర్నియాలో మొదటి టెస్ట్ ఫ్లైట్‌ను పూర్తి చేసుకున్న ప్రపంచపు అతిపెద్ద విమానం?
1) స్ప్రూస్ గోస్
2) స్ట్రాటోలాంచ్ రోక్
3) తుపులేవ్ తు-160
4) ఆంటోనోవ్ ఆన్-124
- View Answer
- సమాధానం: 2
36.ప్రపంచంలోనే తొలి సాయుధ ఉభయచర తరంగ పడవ(డ్రోన్ బోట్) ‘మెరైన్ లిజార్డ్’ను అభివృద్ధి చేసిన దేశం?
1) ఇజ్రాయిల్
2) చైనా
3) యూకే
4) భారత్
- View Answer
- సమాధానం: 2
37. చైనాలోని సుజౌ జూ లో ఇటీవల మరణించిన అరుదైన ప్రపంచపు అతిపెద్ద సాఫ్ట్‌షెల్ తాబేలు(టర్టిల్) పేరు?
1) యాంగ్ట్జీ
2) ఐబీరియన్
3) కోహూలన్
4) అల్పాకా
- View Answer
- సమాధానం: 1
38. డిఫెన్స్ ఫైనాన్స్ సెక్రెటరీగా ఎవరు నియమితులయ్యారు?
1) సందీప్ కమార్ ఝా
2) సంతోష్ కుమార్ కటారియా
3) హరి కుమార్ గోయల్
4) గార్గీ కౌల్
- View Answer
- సమాధానం: 4
39.జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ వైస్ చాన్సలర్‌గా నియమితులైన తొలి మహిళ?
1) నజ్మా హెప్తుల్లా
2) కలీఫ్ అహ్మద్
3) నజ్మా అక్తర్
4) తలత్ అహ్మద్
- View Answer
- సమాధానం: 3
40. పాలస్తీనా ప్రధానిగా ఇటీవల ప్రమాణస్వీకరం చేసినవారు?
1) మొహమ్మద్ ఇష్తయే
2) మహ్మౌద్ అలౌల్
3) మహ్మౌద్ అబ్బాస్
4) సయెబ్ ఎరికత్
- View Answer
- సమాధానం: 1
41. ఇటీవల విదేశీ వ్యవహారాల మంత్రి ఏర్పాటు చేసిన ఇండో-పసిఫిక్ వింగ్‌కు నేతృత్వం వహిస్తున్నది?
1) విజయ్ గోఖలే
2) సుష్మా స్వరాజ్
3) విక్రమ్ దొరైస్వామి
4) నరేంద్ర మోదీ
- View Answer
- సమాధానం: 3
42.అమెరికాకు చెందిన నేషనల్ జియోస్పేషియల్ అడ్వైజరీ కమిటీ (ఎన్జీఏసీ)లో నియమితులైన తొలి భారతీయుడు?
1) ప్రశాంత్ జోషి
2) సంజయ్ కుమార్
3) నారాయణన్
4) అనామికా దాస్
- View Answer
- సమాధానం: 2
43.2019 సంవత్సరానికి షార్ట్-హౌల్ రన్ విభాగంలో ఆసియాలోనే ఉత్తమ అథ్లెటిక్ కోచ్‌గా ప్రఖ్యాతిగాంచిన ఎనీ నురానీ ఏ దేశానికి చెందినవారు?
1) భారత్
2)ఇండోనేసియా
3) రష్యా
4) బ్రెజిల్
- View Answer
- సమాధానం: 2
44. అంతర్జాతీయ హాకీ సమాఖ్య(ఎఫ్ఐహెచ్) హెల్త్ అండ్ సేఫ్టీ కమిటీ అధ్యక్షుడిగా నియమితులైన తొలి భారతీయుడు?
1) వి.కె.మల్హోత్రా
2) నీలం కపూర్
3) పి. ఆర్. శ్రీజేశ్
4) డాక్టర్. బి.కె.నాయక్
- View Answer
- సమాధానం: 4
45. బాక్సింగ్ ప్రపంచ కప్ 2019 ఎక్కడ జరిగింది?
1) మనీలా, ఫిలిప్పీన్స్
2) న్యూయార్క, అమెరికా
3) వాషింగ్టన్ డీసీ, అమెరికా
4) కలోన్, జర్మనీ
- View Answer
- సమాధానం: 4
46. కలోన్ బాక్సింగ్ ప్రపంచ కప్ 2019లో 54 కిలోల విభాగంలో బంగారు పతక విజేత?
1) మీనా కుమారీ మైస్నం
2) ప్వీలావ్ బసుమాతరే
3) సాక్షీ చౌదరి
4) పింకీ రాణి
- View Answer
- సమాధానం: 1
47. ద్వైపాక్షిక సంబంధాలను ప్రోత్సహించినందుకు గాను రష్యా అత్యున్నత పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోసల్’ ఎవరికి లభించింది?
1) సుష్మా స్వరాజ్
2) నిర్మలా సీతారామన్
3) రామ్‌నాథ్ కోవింద్
4) నరేంద్ర మోదీ
- View Answer
- సమాధానం: 4
48. ప్రతిష్టాత్మక సరస్వతీ సమ్మాన్ 2018 పురస్కారం పొందిన తెలుగు కవి కె. శివారెడ్డి- కవితా సంకలనం పేరు?
1) అంతార్జనం
2) అజేయం
3) పక్కకి ఒత్తిగిలితే
4) మోహనా! ఓ మోహనా
- View Answer
- సమాధానం: 3
49. అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ నోబుల్ అవార్డుతో ఎవరిని సత్కరించింది?
1) సుధాంశు కుమార్
2) రాకేశ్ మఖీజ
3) కెన్నెత్ ఎం. డ్యుబర్స్టైన్
4) కరోలిన్ బి. కెన్నెడీ
- View Answer
- సమాధానం: 1
50. భారత్ యూకే మధ్య బీమా సంబంధాలను ప్రోత్సహించినందుకు గుర్తింపుగా ‘ఫ్రీడం ఆఫ్ ది సిటీ ఆఫ్ లండన్’ పురస్కారం ఎవరికి లభించింది?
1) ఎం. శశికళ
2) ఎ.కె. దాస్
3) అలీస్ జి. వైద్యన్
4) రవీ మితల్
- View Answer
- సమాధానం: 3