కరెంట్ అఫైర్స్ (సెప్టెంబర్ 22 - 30) బిట్ బ్యాంక్
1. ఇటీవల అంతర్జాతీయ కార్మిక సంస్థ ఏ ప్రాంతంలో రెండు రోజుల సమావేశాన్ని నిర్వహించింది?
1) భువనేశ్వర్
2) హైదరాబాద్
3) ముంబయి
4) వారణాసి
- View Answer
- సమాధానం: 1
వివరణ: అంతర్జాతీయ కార్మిక సంస్థ, ఒడిశా ప్రభుత్వం సంయుక్తంగా జాతీయ సమావేశాన్ని రెండు రోజుల పాటుభువనేశ్వర్లో నిర్వహించాయి.
- సమాధానం: 1
2. ఇటీవల ఐక్యరాజ్య సమితి శరణార్థుల సమస్యలపై మొట్టమొదటి సదస్సును ఎక్కడ నిర్వహించింది?
1) పారిస్
2) టొరంటో
3) న్యూయార్క్
4) రియోడిజనిరో
- View Answer
- సమాధానం: 3
వివరణ: UNHCR శరణార్థుల సమస్యలపై మొట్టమొదటి సదస్సునున్యూయార్క్లో నిర్వహించింది. దేశంలో తీ్రవవాదం, అంతర యుద్ధం మొదలగు కారణాల వలన 65.3 మిలియన్ ప్రజలు తమ ఇంటిని, దేశాన్ని వదిలి శరణార్థులుగా మారారు.
- సమాధానం: 3
3. వైజాగ్ - చెన్నై పారిశ్రామిక కారిడార్ నిర్మాణానికి 631 మిలియన్ డాలర్ల రుణం మంజూరు చేసిన బ్యాంక్ ఏది?
1) IMF
2) ADB
3) BRICS
4) IBRD
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఇండియాలో మొదటి తీర ప్రాంత పారిశ్రామిక కారిడార్‌ను ైవైజాగ్ - చెన్నైల మధ్య నిర్మించనున్నారు. ఈ పారిశ్రామిక కారిడార్ నిర్మాణం కోసం ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ADB)631 మిలియన్ డాలర్ల (రూ.4228.9 కోట్లు) రుణం మంజూరు చేసింది.
- సమాధానం: 2
4. ఉత్తరాఖండ్‌లో 100 మెగా వాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్న సంస్థ ఏది?
1) అదానీ పవర్
2) రిలయన్స్ పవర్
3) విప్రోపవర్ ఇన్ఫ్రా
4) రే పవర్ ఇన్ఫ్రా
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఉత్తరాఖండ్‌లోని తెహసిల్ - భగవాన్ పూర్ ప్రాంతంలో 100 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌ను ఫిబ్రవరి 2017 లోపు రే పవర్ ఇన్ఫ్రా పూర్తి చేయనుంది.
- సమాధానం: 4
5. కింది వానిలో ఏ రాష్ట్రం ఉత్తమ ప్రద ర్శన ప్రాజెక్టు పురస్కారం 2015 నకు ఎంపికైంది?
1) తెలంగాణ
2) హిమాచల్ ప్రదేశ్
3) హర్యానా
4) కర్ణాటక
- View Answer
- సమాధానం: 2
వివరణ: హిమాచల్ప్రదేశ్రాష్ట్రం రూ.580 కోట్లతో పర్యాటక రంగ అభివృద్ధికి కృషి చేసినందుకుగాను ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఆర్థిక సహాయంతో ప్రారంభించిన ‘‘ ఉత్తమ ప్రదర్శన ప్రాజెక్టు’’ కు ఎంపికైంది.
- సమాధానం: 2
6. భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌కు డెరైర్టర్గా ఎంపికైన మొదటి మహిళ ఎవరు?
1) రాగిణి బహుగుణ
2) డా. కవితా కృష్ణన్
3) ఆనంది రామలింగం
4) నందితా మెహతా
- View Answer
- సమాధానం: 3
వివరణ: బీహెచ్ఎల్ కు నూతన డెరైక్టర్‌గా ఆనంది రామలింగం నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఆనంది రామలింగం మిలిటరీ కమ్యూనికేషన్ స్ట్రాటజిక్ బిజినెస్ యూనిట్‌కి జనరల్ మేనేజర్‌గా ఉన్నారు.
- సమాధానం: 3
7. ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధి కోసం సౌహార్ధ రాయబారిగా ఎవరినినియమించుకున్నది ?
1) ఛత్రపతి శంభాజీరాజే భోన్స్లే
2) రితేష్ దేశ్‌ముఖ్
3) గణేష్ చంద్ర సావర్కర్
4) యుద్ధవీర్ వోడయార్
- View Answer
- సమాధానం: 1
వివరణ: రాజ్యసభ ఎంపీ ఛత్రపతి శివాజి వంశానికి చె ందిన ఛత్రపతి శంభాజీరాజే భోన్స్లేను మహారాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగ అభివృద్ధి కోసం సౌహార్ధ రాయబారిగా నియమించుకుంది.
- సమాధానం: 1
8. అస్సోం రాష్ట్రంలో అంతర్గత జల రవాణాభివృద్ధికి ప్రపంచ బ్యాంక్ ఎంత రుణం జారీ చేసింది?
1) రూ. 100 కోట్లు
2) రూ. 500 కోట్లు
3) రూ. 1000 కోట్లు
4) రూ. 2000 కోట్లు
- View Answer
- సమాధానం: 3
9. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2019 లోపు ఎన్ని గృహాలు నిర్మించనున్నారు?
1) 10 లక్షలు
2) 50 లక్షలు
3) 1 కోటి
4) 1.5 కోట్లు
- View Answer
- సమాధానం: 3
వివరణ: 1985లో రాజీవ్‌గాంధీ ఇందిరా ఆవాస్ యోజన (IAY)ను ప్రారంభించాడు. ఇందిరా ఆవాస్ యోజన కింద 2015-16 ఆర్థిక సంవత్సరం పూర్తి అయ్యేలోపు 38 లక్షల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకొని, అందులో భాగంగా 10 లక్షల ఇళ్లలను పూర్తిగా నిర్మించారు. ఇటీవల ఇందిరా ఆవాస్ యోజన పేరును ప్రధానమంత్రి ఆవాస్ యోజనగా మార్చారు.
- సమాధానం: 3
10. ఇటీవల ఇండియా విజయవంతంగా ప్రయోగించిన క్షిపణి పేరు ఏమిటి?
1) బారక్ -8
2) హైందవి -10
3) గెటో -3
4) తయ్యిహామ్- 3
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఇజ్రాయిల్, ఇండియా సంయుక్తంగా అభివృద్ధి చేసిన బారక్-8 క్షిపణిని ఒడిశాలోని చాందిపూర్ ITR సెంటర్లో విజయవంతంగా ప్రయోగించారు. బారక్-8 బరువు 270 కేజీలు, ఎత్తు 4.5 మీ., 60 కేజీల పేలోడ్‌ను 2 మాక్‌ల వేగంతో తీసుకెళ్లగలదు. బారక్-8 ఉపరితలం నుంచి గగనతంలోకి ప్రయోగించే దీర్ఘ శ్రేణిక్షిపణి.
- సమాధానం: 1
11. ‘‘ ప్రధానమంత్రి జన ఔషధి యోజన’’ కింద ఎన్ని జనరిక్ జన ఔషద కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు ?
1) 5000
2) 3000
3) 2000
4) 1500
- View Answer
- సమాధానం: 2
వివరణ: ప్రధానమంత్రి జన ఔషధి యోజన కింద డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మా సూటికల్స్ 3000 జనరిక్ జన ఔషధ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది.
- సమాధానం: 2
12. ఇటీవల UN ఆధ్వర్యంలో ‘సూపర్ బగ్’ ఒప్పందం మీద ఎన్ని దేశాలు సంతకం చేశాయి?
1) 193
2) 183
3) 153
4) 123
- View Answer
- సమాధానం: 1
వివరణ: యూఎన్ఓ తయారుచేసిన ‘‘ ఔషధాల ద్వారా అంటు వ్యాధులు నిరోధించే’’ (సూపర్ బగ్) ఒప్పందం మీద 193 దేశాలు సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం మీద సంతాకాలు చేసిన దేశాలు 2 సంత్సరాల్లోపు వ్యాధుల నిర్మూలన కార్యచరణ ప్రణాళికను యూఎన్ఓకు సమర్పించాలి.
- సమాధానం: 1
13. ప్రతిష్టాత్మక గ్రీన్ ఆపిల్ పురస్కారానికి ఎంపికైన గ్రామం ఏది?
1) దోంజా గ్రామం
2) గోవర్ధన్ గ్రామం
3) సీతా నగరం
4) బుర్రిపాలెం
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఇస్కాన్ సంస్థ అభివృద్ధి చేసిన గోవర్ధన్ ఎకో విలేజ్ ప్రతిష్టాత్మక గ్రీన్ ఆపిల్ పురస్కారానికి ఎంపికైంది. 1994 యూకేలో గ్రీన్ ఆర్గనైజేషన్‌ను ప్రారంభించారు. ఈ సంస్థ పర్యావర ణాన్ని కాపాడుతున్న, పర్యావరణ రక్షణ చర్యలు చేపడుతున్న సంస్థలకు, ప్రాంతాలకు ఈ పురస్కారాన్ని అందిస్తుంది.
- సమాధానం: 2
14. ‘‘అంతర్జాతీయ అణు ఆయుధాల నిరాయుధీకరణ’’ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?
1) అక్టోబర్ 2
2) సెప్టెంబర్ 29
3) సెప్టెంబర్ 28
4) సెప్టెంబర్ 26
- View Answer
- సమాధానం: 4
వివరణ: యూఎన్ఓ 2014లో మొదటిసారిగా అంతర్జాతీయ అణు ఆయుధాల నిరాయుధీకరణ దినోత్సవాన్ని సెప్టెంబర్ 26న నిర్వహించింది. అణు ఆయుధాల వల్ల వచ్చే దుష్ఫలితాలను పౌర సమాజంకు, వివిధ ప్రభుత్వాలకు తెలియజేసేందుకు ఈ దినోత్సవాన్ని ప్రారంభించారు.
- సమాధానం: 4
15. ఇటీవల ఐక్యరాజ్య సమితి వ్యాపార అభివృద్ధి సంస్థ (UNCTAD) నకు సలహాదారుగా ఎవరు నియమితులైనారు?
1) నిర్మలా సీతారామన్
2) జెఫ్ బెజొస్
3) జాక్‌మా
4) కునాల్ బహల్
- View Answer
- సమాధానం: 3
వివరణ: 1964లో UNCTADని స్థాపించారు. ఇందులో 194 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. ఆలీబాబా గ్రూప్ చైర్మన్ జాక్‌మాను UNCTAD యువజన వ్యవస్థాపకత, చిన్న వ్యాపారాల అభివృద్ధి కోసం ప్రత్యేక సలహాదారుడుగా నియమించారు.
- సమాధానం: 3
16. భారతదేశంలో ప్రపంచ బ్యాంక్ శాఖకు నూతన అధిపతిగా ఎంపికైంది ఎవరు?
1) ఇదా స్వరరాయ్
2) తకుయా కామట
3) జునైద్ అహమ్మద్
4) మహమ్మద్ యూనస్
- View Answer
- సమాధానం: 3
17. ప్రపంచంలో తొలిసారిగా డ్రైవర్ రహిత బోట్లను ఎక్కడ ప్రారంభించాయి?
1) టొరంటో
2) ఆమస్టర్ డ్యామ్
3) రోటర్ డ్యామ్
4) సూయజ్ కాలువ
- View Answer
- సమాధానం: 2
వివరణ: మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఆమస్టర్ డ్యామ్ ఇనిస్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్డ్ మెట్రొపాలిటన్ సోలుష్యన్ సంయుక్తంగా డ్రైవర్ రహిత బోట్ ప్రాజెక్టును విజయవంతంగా ప్రయోగించాయి. ఆమస్టర్ డ్యామ్‌ను వెనిస్ ఆఫ్ ది నార్త్‌గా పిలుస్తారు. ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో ఆమస్టర్ డ్యామ్‌ను 2010లోచేర్చారు.
- సమాధానం: 2
18. ఇటీవల గూగుల్ వివిధ మెసెంజర్లకు పోటీగా ప్రారంభించిన మెసెంజర్ ఏది?
1) ALLO
2) HELLO
3) HIKE
4) ZOTO
- View Answer
- సమాధానం: 1
వివరణ: వాట్స్ప్, ఫేస్బుక్ మెసెంజర్లకు దీటుగా గూగుల్ ‘ALLO’ ను ప్రారంభించింది. దీనితో పాటుగా ‘గూగుల్ ట్రిప్స్’ అనే ట్రావెల్గైడ్ అప్లికేషన్‌ను ప్రారంభించారు. గత నెలలో ‘గూగుల్ డుయో’ అనే వీడియో కాలింగ్ అప్లికేషన్‌ను ప్రారంభించింది.
- సమాధానం: 1
19. దేశంలో మొట్టమొదటి అంతరాష్ట్ర నదుల అనుసంధాన ప్రాజెక్టు పేరు ఏమిటి?
1) పట్టి సీమ ప్రాజెక్టు
2) గంగా- కల్యాణ్ ప్రాజెక్టు
3) కేన్ - బెట్వా ప్రాజెక్టు
4) లూని- బాని ప్రాజెక్టు
- View Answer
- సమాధానం: 3
వివరణ: దేశంలో మొదటి అంతరాష్ట్ర నదుల అనుసంధాన ప్రాజెక్టును కేన్ -బెట్వా నదుల పై నిర్మించనున్నారు. ప్రాజెక్ట్ వ్యయం రూ. 10,000 కోట్లు. ఈ ప్రాజెక్ట్ ద్వారా మధ్యప్రదేశ్‌లో 3.5 లక్షల హెక్టార్లకు, ఉత్తరప్రదేశ్‌లో 14000 హెక్టార్లకు నీరు అందుతుంది. దీని వల్ల ‘ పన్నా టైగర్ రిజర్వ్’ లో 10 శాతం భూమి నీట మునుగుతుంది.
- సమాధానం: 3
20. ప్రపంచ పర్యాటక దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు?
1) సెప్టెంబర్ 23
2) సెప్టెంబర్ 27
3) సెప్టెంబర్ 30
4) అక్టోబర్ 2
- View Answer
- సమాధానం: 2
వివరణ: యూఎన్ (UN)ప్రపంచ టూరిజం ఆర్గనైజేషన్ ప్రతి సంవ త్సరం సెప్టెంబర్ 27న పర్యాటక రంగ దినోత్సవాన్ని 1980 నుంచి నిర్వహిస్తుంది.
- సమాధానం: 2
21. ‘‘ North eastern of counsil: a story of sagacity and success’’ పుస్తక రచయిత ఎవరు?
1) డా. జితేంద్ర సింగ్
2) సంజీవ్ బారూ
3) అజిత్ దోవల్
4) రాకేష్ చంద్ర
- View Answer
- సమాధానం: 1
22. టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ఇచ్చే ప్రపంచ యూనివర్సిటీల ర్యాకింగ్స్లో ఇండియా నుంచి చోటు సంపాదించిన యూనివర్సిటీలు ఎన్ని ?
1) 5
2) 19
3) 25
4) 31
- View Answer
- సమాధానం: 4
వివరణ: టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ఇచ్చిన ప్రపంచ యూనివర్సిటీల ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానంలో ఉన్న విద్యాసంస్థ ‘‘యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్. తర్వాతి స్థానాల్లో కాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఉన్నాయి. ఈ జాబితాలో ఇండియా నుంచి 31 యూనివర్సిటీలు చోటు సంపాదించుకున్నాయి. ఇందులో ముఖ్యమైనవి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఐఐటీ బాంబే.
- సమాధానం: 4
23. ఇండియాలో 100 మిలియన్ రిజిస్టర్డ్ వినియోగదారులు ఉన్న సంస్థగా ఆవిర్భవించిన ఈ - కామర్ ్స సంస్థ ఏది ?
1) అమెజాన్
2) ఫ్లిప్‌కార్ట్
3) స్నాప్‌డీల్
4) బిగ్ బాస్కెట్
- View Answer
- సమాధానం: 2
వివరణ: అమెరికా, చైనా తర్వాత ఒకే దేశంలో 100 మిలియన్ల వినియోగదారులు ఉన్న ఏకైక సంస్థగా ఫ్లిప్‌కార్ట్ ఆవిర్భవించింది.
- సమాధానం: 2
24. ఫోర్బ్స్ విడుదల చేసిన ఇండియాలోని 100 మంది ధనవంతుల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న వ్యక్తి ఎవరు?
1) దిలిప్ సంఘ్వీ
2) హిందుజా కుటుంబం
3) ముఖేశ్ అంబానీ
4) అజీమ్ ప్రేమ్‌జీ
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఫోర్బ్స్ ప్రకారం ముఖేశ్ అంబానీ ఆస్తుల విలువ 22.7 బిలియన్ డాలర్లు, తర్వాతి స్థానాల్లో దిలిప్ సంఘ్వీ (16.9 బిలియన్ డాలర్లు), హిందుజా కుటుంబం (15.2 బిలియన్ డాలర్లు) , అజీమ్ ప్రేమ్‌జీ (15 బిలియన్ డాలర్లు).
- సమాధానం: 3
25. 89 వ ఆస్కార్ అకాడమీ పురస్కారాలకు ఇండియా నుంచి పంపించనున్న చిత్రం ఏది?
1) విసరానై
2) అజహర్
3) బహుబలి
4) సరబ్జిత్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ‘ లాక్ ఆప్’ అనే నవల ఆధారంగా నిర్మించిన ‘ విసరానై (Visaranai)అనే తమిళ చిత్రాన్ని 2017లో జరిగే 89 వ ఆస్కార్ అకాడమీ పురస్కారాలకు పంపించనున్నారు. ఈ చిత్రం మూడు జాతీయ పురస్కారాలు గెలుచుకుంది.
- సమాధానం: 1
26. ప్రతిష్టాత్మక'Knight of the order of arts and letters ' పురస్కారానికి ఎంపికైంది ఎవరు?
1) రాకేష్ చంద్ర
2) సాజిద్ నదియాద్ వాలా
3) అశాభోంస్లే
4) శ్యాం ముఖర్జీ
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఫ్రాన్స్ ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మక Knight of the order of arts and lettersపురస్కారానికి సాజిద్నదియాద్ వాలాఎంపికయ్యాడు. కళలు, సంస్కృతి, సాహిత్య రంగంలో ఉత్తమ ప్రతిభ చూపిన వారికి ఈ పురస్కారాన్ని ఇస్తారు.
- సమాధానం: 2
27. ‘‘ లలిత్ అర్పణ్ సమ్మాన్ - 2016’’ పురస్కారానికి ఎంపికైంది ఎవరు?
1) చైత్ర అంబడిపూడి
2) సంగీత కట్టి
3) కౌశికి చక్రబర్తి
4) శుభా ముద్గల్
- View Answer
- సమాధానం: 4
వివరణ: లలిత్ అర్పణ్ ఉత్సవాలలో భాగంగా దేశంలోని కళలు, సంస్కృతి, శాస్త్రీయ సంగీతం అభివృద్ధికి కృషి చేసిన వారికి లలిత్ అర్పణ్ సమ్మాన్ పురస్కారాలు ప్రదానం చేస్తారు. ఈ సంవత్సరం హిందుస్థానీ సంగీత విధ్వాంసురాలు అయిన శుభా ముద్గల్‌కు ఈ పురస్కారాన్ని ఇచ్చారు.
- సమాధానం: 4
28. 10 వ క్లింటన్ గ్లోబల్ సిటిజన్ పురస్కారానికి ఎంపికైంది ఎవరు?
1) గోర్డాన్ బ్రౌన్
2) లారీ ఎల్లిసన్
3) ఆది గోద్రే జ్
4) లక్ష్మి మిట్టల్
- View Answer
- సమాధానం: 3
వివరణ: 2007లో క్లింటన్ గ్లోబల్ సిటిజన్ పురస్కారాలు ప్రారంభించారు. గోద్రేజ్ గ్రూప్ చైర్మన్ ఆది గోద్రేజ్నకు ఈ పురస్కారాన్ని ఇచ్చారు.
- సమాధానం: 3
29. ఇటీవల యూఎస్‌లో ఇండియా రాయబారిగా నియమితులైనది ఎవరు?
1) నవతేజ్ సర్నా
2) సంజీవ్ బారూ
3) మెహన్ కజారియా
4) రాజేంద్ర శుక్లా
- View Answer
- సమాధానం: 1
వివరణ: ప్రస్తుతం బ్రిటన్‌లో భారత్ హై కమిషనర్‌గా పనిచేస్తున్న నవతేజ సర్నాను అమెరికాకు రాయబారిగా అరుణ్ కూమార్ సింగ్ స్థానంలో నియమించారు.
- సమాధానం: 1
30. ప్రపంచ రేబిస్ దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు?
1) సెప్టెంబర్ 22
2) సెప్టెంబర్ 25
3) సెప్టెంబర్ 28
4) సెప్టెంబర్ 30
- View Answer
- సమాధానం: 3
వివరణ: రేబిస్ వ్యాధికి వ్యాక్సిన్ కనుగొన్న శాస్త్రవేత్త లూయిస్ పాశ్చర్ వర్ధంతి (సెప్టెంబర్ 28)ని ప్రపంచ రేబిస్ దినంగా UNO నిర్వహిస్తుంది.
- సమాధానం: 3
31. ‘‘ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్’’ నకు నూతన అధ్యక్షుడుగా ఎంపికైనది ఎవరు?
1) సతీష్ కూమార్ అగ్నిహోత్రి
2) విజయ్ కేల్కర్
3) గిరిష్ చంద్ర గుప్తు
4) రాకేష్ రంజన్ ప్రసాద్
- View Answer
- సమాధానం: 2
32. ఓబైదుల్లా ఖాన్ హెరిటెజ్ హాకీ కప్ 2016ను గెలుచుకున్నది ఎవరు?
1) రైల్వేస్
2) ఎయిర్ ఇండియా
3) ఓఎన్జీసీ
4) బీపీసీఎల్
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఓబైదుల్లా ఖాన్ హెరిటెజ్ హాకీ కప్ విజేతలకు రూ.51 లక్షల నగదు బహుమతి ఇస్తారు. 2016 కప్ విజేత బీపీసీఎల్. మొదటి రన్నరప్ ఎయిర్ ఇండియా, రెండో రన్నరప్ ఓఎన్జీసీ. ఈ కప్‌లో మొదటి రన్నరప్‌నకు రూ.21 లక్షలు, రెండో రన్నరప్‌నకు రూ. 11 లక్షలు బహుమతిగా ఇస్తారు.
- సమాధానం: 4
33. మొట్టమొదటి అంతర్జాతీయ సిక్కుల సమావేశం ఎక్కడ నిర్వహించారు?
1) పాట్నా
2) భువనేశ్వర్
3) ఛండీఘర్
4) పుణె
- View Answer
- సమాధానం: 1
వివరణ: సిక్కుల మత గురువు గురుగోవింద్ సింగ్ 350వ జన్మదినం సందర్భంగా పాట్నాలో 3 రోజుల పాటు మొదటి అంతర్జాతీయ సిక్కుల సమావేశాన్ని బీహార్ ప్రభుత్వం నిర్వహించింది. గురుగోవింద్ సింగ్ 1666లో పాట్నా నగరంలో జన్మించారు.
- సమాధానం: 1
34. దేశంలో కుటుంబ నియంత్రణ కోసం ‘‘ మిషన్ పరివార్ వికాస్’’ పథకాన్ని ఎన్ని జిల్లాలలో ప్రారంభించారు ?
1) 50
2) 80
3) 115
4) 145
- View Answer
- సమాధానం: 4
వివరణ: కేంద్ర ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జె.పి. నద్ద‘‘ మిషన్ పరివార్ వికాస్’’ పథకాన్ని 7 రాష్ట్రాలలోని 145 జిల్లాలలో ప్రారంభించారు. ఈ 7 రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్, జార్ఖండ్, అస్సాం .
- సమాధానం: 4
35. ' Incredible india tourism investors summit ' ఎక్కడ నిర్వహించారు ?
1) ముంబయి
2) న్యూఢిల్లీ
3) హైదరాబాద్
4) పూణె
- View Answer
- సమాధానం: 2
వివరణ: కేంద్ర పర్యాటక శాఖ, టూరిజం ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కాన్ఫిడరేషన్ ఇండియా ఇండస్ట్రీస్ (CII)సంయుక్తంగా ఈ సమావేశాన్ని నిర్వహించాయి.
- సమాధానం: 2
36. ఇటీవల ఆప్ఘనిస్థాన్ ప్రభుత్వం ఏ తీవ్రవాద సంస్థతో శాంతి ఒప్పందం కుదుర్చుకుంది?
1) ఆల్‌ఖైదా
2) తాలిబాన్
3) హిజ్చ్-ఇ- ఇస్లామి
4) హక్కాని నెట్వర్క్
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఆప్ఘనిస్థాన్‌లో రెండవ పెద్ద తీవ్రవాద సంస్థ హిజ్చ్-ఇ- ఇస్లామిసంస్థతో ప్రభుత్వం శాంతి ఒప్పందం కుదుర్చుకుంది. 1975లో ఘల్బుద్దిన్ హెక్మత్యర్ ‘ఈ సంస్థను ఏర్పాటు చేశారు.
- సమాధానం: 3
37. 8వ ఇండియా- రష్యా సంయుక్త సైనిక విన్యాసాలు ఎక్కడ ప్రారంభించారు?
1) చాందిపూర్
2) లడఖ్
3) వ్ల్యాడి వోస్టాక్
4) సోచి
- View Answer
- సమాధానం: 3
వివరణ: 2003 నుంచిఇంద్ర పేరుతో ఇండియా-రష్యా సంయుక్తంగా రెండు సంవత్సరాలకు ఒక్కసారి సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. ఈ సంవత్సరం రష్యాలోని వ్ల్యాడి వోస్టాక్లో 11 రోజుల పాటు సైనిక విన్యాసాలు నిర్వహించారు.
- సమాధానం: 3
38. ప్రతిష్టాత్మక మాక్ ఆర్థర్ ఫెలోషిప్‌నకు ఎంపికైన ఇండో- అమెరికన్ ఎవరు?
1) మను ప్రకాశ్
2) డా. సతీష్‌రెడ్డి
3) ఎమ్. శ్రీధరన్
4) డా. సంగీత
- View Answer
- సమాధానం: 1
వివరణ: అమెరికా పౌరులు లేదా అమెరికాలో నివ సిస్తున్న వ్యక్తులు వివిధ రంగాలలోచూపిన ప్రతిభకుగాను మాక్ ఆర్థర్ ఫౌండేషన్ ప్రతి సంవత్సరం 20-30 మందికి మాక్ ఆర్థర్ ఫెలోషిప్ఇస్తుంది. ఈ సంవత్సరం మను ప్రకాష్, సుబాష్ ఖోత్ అనే ఇండో- అమెరికన్ శాస్త్రవేత్త ఎంపికయ్యారు.
- సమాధానం: 1
39. పతిష్టాత్మక'Right livelihood' పురస్కారానికి ఎంపికైంది ఎవరు?
1) బ్లాక్ మర్చంట్
2) బచ్పన్ బచావో ఆందోళన్
3) సేవా నిరతి
4) వైట్ హెల్మెట్స్
- View Answer
- సమాధానం: 4
వివరణ: 1980లో రెట్ లైవ్లిహుడ్ (Right livelihood) పురస్కారాన్ని’ జర్మన్-స్వీడిష్ ‘జాకబ్ వాన్ ఉయెక్స్కుల్ ఏర్పాటుచేశారు. సిరియా అంతర్యుద్ధంలో ప్రజలు కాపాడుతున్నందుకు గానుఈ పురస్కారానికి సిరియాకు చెందిన వైట్ హెల్మెట్స్అనే సంస్థ ఎంపికైంది. ఈ సంస్థతో పాటు స్వెత్లానా గన్నుష్కిన (రష్యా), మొజన్ హసన్ (ఈజిప్ట్), కుమ్ హరియత్ (టర్కిష్ వారపత్రిక) ఈ పురస్కారానికి ఎంపికయ్యాయి.
- సమాధానం: 4
40. ప్రపంచ నదుల దినోత్సవంను ఏ రోజున నిర్వహిస్తారు?
1) సెప్టెంబర్ చివరి ఆదివారం
2) అక్టోబర్ మొదటి ఆదివారం
3) అక్టోబర్ చివరి ఆదివారం
4) నవంబర్ చివరి ఆదివారం
- View Answer
- సమాధానం: 1
41. ‘‘ క్లార్క్ ఆర్ బవిన్ వైల్డ్ లైఫ్ లా ఎన్ఫోర్స్మెంట్ ’’ పురస్కారం 2016 నకు ఎంపికైంది ఎవరు?
1) సునీతా నారాయణ్
2) రితేష్ సారోతియా
3) అనుపమ్ మిశ్రా
4) వందనా శివ
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఇండియాకు చెందిన రితేష్ సారోతియా, సంజయ్‌దత్ అనే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు ఈ పురస్కారానికి ఎంపికయ్యారు.
- సమాధానం: 2
42. మొట్టమొదటి జెిస్సీ ఓవెన్స్ ఒలింపిక్స్ స్పిరిట్ పురస్కారానికి ఎంపికైంది ఎవరు?
1) డిగో మారడోనా
2) పీలే
3) మహమ్మద్ అలీ
4) మైఖెల్ ఫెల్ప్స్
- View Answer
- సమాధానం: 3
వివరణ: 2016లో ప్రారంభించిన జెస్సీ ఓవెన్స్ ఒలింపిక్స్ స్పిరిట్ పురస్కారాన్ని ప్రముఖ బాక్సర్ మహమ్మద్ అలీకి ప్రదానం చేశారు.
- సమాధానం: 3
43. ‘సిటిజన్ అండ్ సోసైటీ ’ పుస్తక రచయిత ఎవరు?
1) కుల్దీప్ నయ్యర్
2) వీరప్ప మొయిలీ
3) హమీద్ అన్సారీ
4) ప్రణబ్ ముఖర్జీ
- View Answer
- సమాధానం: 3
44. ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?
1) సెప్టెంబర్ 18
2) సెప్టెంబర్ 20
3) సెప్టెంబర్ 22
4) సెప్టెంబర్ 26
- View Answer
- సమాధానం: 4
వివరణ: 2011 ఇండోనేషియాలో మొదటిసారిగా ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవాన్ని IFEH కౌన్సిల్ నిర్విహించింది.
2016 థీమ్: ‘‘ పొగాకు నియంత్రణ.. ప్రపంచ పొగాకు మహమ్మారికి ఒక స్పందన ’’
IFEH: International Federation of Environmental Health Council
- సమాధానం: 4
45. ఇటీవల ‘‘ ఇండియా వ్యాపార, సాంస్కృతిక ఉత్సవం ’’ ఎక్కడ నిర్వహించారు ?
1) సిడ్నీ
2) ఇస్తాంబుల్
3) డర్బన్
4) యాంగ్జౌహ
- View Answer
- సమాధానం: 4
వివరణ: చైనాలో భారతదేశ వారోత్సవాల్లో భాగంగాఇండియా వ్యాపార, సాంస్కృతిక ఉత్సవంను యాంగ్జౌహలో నిర్వహించారు.
- సమాధానం: 4
46. ప్రపంచ హృదయ దినోత్సవంను ఏరోజున నిర్వహిస్తారు?
1) సెప్టెంబర్ 23
2) సెప్టెంబర్ 26
3) సెప్టెంబర్ 29
4) అక్టోబర్ 3
- View Answer
- సమాధానం: 3
వివరణ: ప్రజలలో గుండె సంబంధ వ్యాధులపై అవగాహన కల్పించడానికి పపంచ ఆరోగ్య సంస్థ, World Heart Federation సంయుక్తంగా ఈ దినోత్సవాన్ని ప్రారంభించాయి. ప్రతి సంవత్సరం గుండె జబ్బుల ద్వారా 17.3 మిలియన్ ప్రజలు మరణిస్తున్నారు.
- సమాధానం: 3
47. ప్రపంచ సముద్ర దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు?
1) సెప్టెంబర్ 29
2) సెప్టెంబర్ 27
3)సెప్టెంబర్ 25
4) సెప్టెంబర్ 22
- View Answer
- సమాధానం: 1
వివరణ: 1978లో సముద్ర భద్రత ఆవశ్యకత గురించి తెలియజేయటానికి మొదటిసారి ప్రపంచ సముద్ర దినోత్సవాన్ని నిర్వహించారు.
- సమాధానం: 1
48. అంతర్జాతీయ అనువాద దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు?
1) సెప్టెంబర్ 20
2) సెప్టెంబర్ 23
3) సెప్టెంబర్ 26
4) సెప్టెంబర్ 30
- View Answer
- సమాధానం: 4
వివరణ: 1953 సెప్టెంబర్ 30న మొట్టమొదటి అంతర్జాతీయ అనువాద దినోత్సవాన్ని నిర్వహించారు.
- సమాధానం: 4
49. ఇండియా ఇంటర్నేషనల్ సముద్ర ఆహార ప్రదర్శన ఎక్కడ నిర్వహించారు?
1) త్రివేండ్రం
2) విశాఖపట్నం
3) కోల్‌కతా
4) ముంబయి
- View Answer
- సమాధానం: 2
వివరణ: 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఇండియా సముద్ర ఉత్పత్తుల విలువ 4.7 బిలియన్ డాలర్లు. దీనిని 2020లోపు 10 బిలియన్ డాలర్లకు పెంచాలనే లక్ష్యంను ఈ సమావేశంలో నిర్ణయించారు.
- సమాధానం: 2
50. దక్షిణాసియా డిజిటల్ మీడియా పురస్కారాలలో ‘‘ బెస్ట్ రీడర్ ఎంగేజ్మెంట్ ’’ కేటగిరీలో వెండి పురస్కారాన్ని గెలుచుకున్న న్యూస్ పేపర్ ఏది ?
1) ది హిందూ
2) దినమలర్
3) టైమ్స్ ఆఫ్ ఇండియా
4) దేశాభిమాని
- View Answer
- సమాధానం: 1
వివరణ: వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ న్యూస్ పేపర్స్ అండ్ న్యూస్ పబ్లిషర్స్, గూగుల్ సంయుక్తంగా ఈ పురస్కారాలు ప్రకటించాయి. హిందూ గ్రూపునకు చెందిన స్పోర్ట్స్ స్టార్ లైవ్. కామ్ లో Ask Ashwin contest కి సిల్వర్ పురస్కారం లభించింది.
- సమాధానం: 1