కరెంట్ అఫైర్స్ (సెప్టెంబర్ 1-7)బిట్ బ్యాంక్
1. గ్రీన్ టర్మ్ అహెడ్ మార్కెట్ (GTAM) పేరుతో పునరుత్పాదక ఇంధన రంగం కోసం ప్రపంచంలోనే మొదటి ప్రత్యేక ఉత్పత్తి మార్కెట్‌ను ఎవరు ప్రారంభించారు?
1) పీయూష్ గోయల్
2) రాజ్ కుమార్ సింగ్
3) రవిశంకర్ ప్రసాద్
4) గిరిరాజ్ సింగ్
- View Answer
- సమాధానం: 2
2. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) విడుదల చేసిన “యాక్సిడెంటల్ డెత్స్ అండ్ సూసైడ్స్ ఇన్ ఇండియా (ADSI) 2019” అనే నివేదిక ప్రకారం 2019 లో ప్రమాదకరమైన డ్రైవింగ్, మొత్తం రోడ్డు ప్రమాదాల కారణంగా అత్యధిక మరణాలు నమోదైన నగరం ఏది?
1) కోల్‌కతా
2) బెంగళూరు
3) చెన్నై
4) ఢిల్లీ
- View Answer
- సమాధానం: 4
3. వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ పథకంతో (సెప్టెంబర్ 2, 2020 నాటికి) ఎన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అనుసంధానమై ఉన్నాయి?
1) 26
2) 32
3) 24
4) 22
- View Answer
- సమాధానం: 1
4. పాంగ్ లాబ్సోల్ పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు?
1) త్రిపుర
2) అస్సాం
3) మేఘాలయ
4) సిక్కిం
- View Answer
- సమాధానం: 4
5. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 51వ ఎడిషన్ నవంబర్ 20 నుంచి 28 వరకు ఏ రాష్ట్రం/ కేంద్ర పాలిత ప్రాంతంలో జరుగుతుంది?
1) ఢిల్లీ
2) తెలంగాణ
3) మహారాష్ట్ర
4) గోవా
- View Answer
- సమాధానం: 1
6. సొంత బీమా సంస్థను ఏర్పాటు చేయడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల బీమా రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (ఐఆర్డీఏ) నుండి అనుమతి పొందింది?
1) ఆంధ్రప్రదేశ్
2) తెలంగాణ
3) మధ్యప్రదేశ్
4) హర్యానా
- View Answer
- సమాధానం: 1
7. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు వారి పనితీరును మెరుగుపరిచే అవకాశాన్ని పొందడానికి కేంద్ర కేబినెట్ ఆమోదించిన మిషన్ ఏది?
1) మిషన్ కర్మయోగి
2) మిషన్ శ్రమయోగి
3) మిషన్ జీవన్ జ్యోతి
4) మిషన్ మజ్దూర్
- View Answer
- సమాధానం: 1
8. ఇంగ్లిష్, ఉర్దూలతో పాటు కింది భాషలలో ఏది జమ్ము-కశ్మీర్ అధికారిక భాషగా చేర్చారు?
1) కాశ్మీరీ
2) డోగ్రి
3) హిందీ
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
9. లోతట్టు నీటి వాణిజ్యం & రవాణా కోసం ప్రోటోకాల్ కింద బంగ్లాదేశ్ నుంచి మొదటి లోతట్టు షిప్పింగ్ కార్గో అందుకున్న రాష్ట్రం ఏది?
1) పశ్చిమ బెంగాల్
2) అస్సాం
3) అరుణాచల్ ప్రదేశ్
4) త్రిపుర
- View Answer
- సమాధానం: 4
10. మొదటిసారిగా పిల్లల వార్తాపత్రిక ‘ది యంగ్ మైండ్స్’ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
1) తమిళనాడు
2) పశ్చిమ బెంగాల్
3) అస్సాం
4) మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 3
11. 17వ ఆసియాన్-ఇండియా ఆర్థిక మంత్రుల సమావేశానికి వియత్నాం పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి ట్రాన్ తువాన్ అన్హ్తో పాటు ఎవరు అధ్యక్షత వహించారు?
1) రవిశంకర్ ప్రసాద్
2) అనురాగ్ ఠాకూర్
3) నితిన్ గడ్కరీ
4) పీయూష్ గోయల్
- View Answer
- సమాధానం: 1
12. కోవిడ్-19 మహమ్మారిపై పోరాడటానికి జపాన్ అత్యవసర రుణంగా భారత్‌కు ఎంత అందిస్తోంది?
1) JP ¥ 125 బిలియన్
2) JP ¥ 100 బిలియన్
3) JP ¥ 75 బిలియన్
4) JP ¥ 50 బిలియన్
- View Answer
- సమాధానం: 1
13. రాష్ట్రంలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
1) అడ్వాన్స్డ్ మెటీరియల్స్ అండ్ ప్రాసెసెస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్
2) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ
3) ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయోసోర్స్ టెక్నాలజీ
4) సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్
- View Answer
- సమాధానం: 2
14. న్యూ ఢిల్లీలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రైబల్ రీసెర్చ్ ఏర్పాటు చేయడానికి గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖతో ఏ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది?
1) మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్
2) ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ విశ్వవిద్యాలయం
3) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్
4) గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్
- View Answer
- సమాధానం: 3
15. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో త్రైపాక్షిక సరఫరా గొలుసు పునరుద్ధరణ ఇనిషియేటివ్ (SCRI)ను ప్రారంభించడానికి ఈ కింది దేశాలలో ఏది అంగీకరించింది?
1) ఇండియా-ఆస్ట్రేలియా-జపాన్
2) ఇండియా-యునైటెడ్ స్టేట్స్-ఆస్ట్రేలియా
3) ఇండియా-యునైటెడ్ కింగ్డమ్-జపాన్
4) చైనా-పాకిస్తాన్-బంగ్లాదేశ్
- View Answer
- సమాధానం: 1
16. ఏ నగరంలో మొదటి మెట్రో లైన్ కోసం యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ €650 మిలియన్ పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది?
1) కోయంబత్తూర్
2) పాట్నా
3) కాన్పూర్
4) నోయిడా
- View Answer
- సమాధానం: 3
17. కైలాస్-మానససరోవర్ వద్ద క్షిపణి స్థలాన్ని ఏ దేశం నిర్మిస్తుంది?
1) పాకిస్తాన్
2) నేపాల్
3) భారత్
4) చైనా
- View Answer
- సమాధానం: 4
18. డాక్టర్ ద్వారకనాథ్ కోట్నిస్ యొక్క కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించాలని ఏ దేశం యోచిస్తోంది?
1) జర్మనీ
2) చైనా
3) యునైటెడ్ కింగ్డమ్
4) జపాన్
- View Answer
- సమాధానం: 2
19. ఫోరెన్సిక్ అకౌంటింగ్, ఇన్వెస్టిగేషన్ కోసం ప్రమాణాల సమితిని విడుదల చేయడానికి ప్రణాళిక చేసిన ప్రపంచంలో మొదటి దేశం ఏది?
1) భారత్
2) చైనా
3) జపాన్
4) జర్మనీ
- View Answer
- సమాధానం: 1
20. మంచి నాణ్యమైన వస్త్ర రంగంలో సహకారం కోసం కేంద్ర మంత్రివర్గం ఏ దేశంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
1) డెన్మార్క్
2) యునైటెడ్ స్టేట్స్
3) జపాన్
4) జర్మనీ
- View Answer
- సమాధానం: 3
21. భూగర్భ శాస్త్రం, ఖనిజ వనరుల రంగంలో భారతదేశం ఏ దేశంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
1) రష్యా
2) ఫిన్లాండ్
3) నార్వే
4) స్వీడన్
- View Answer
- సమాధానం: 2
22. యూఎన్ ఉమెన్, యూఎన్డీపీ విడుదల చేసిన నివేదిక ప్రకారం 2021లో ఎంత మంది మహిళలు, బాలికలు తీవ్ర పేదరికం వైపునకు గురవుతారు?
1) 35 మిలియన్లు
2) 47 మిలియన్లు
3) 29 మిలియన్లు
4) 56 మిలియన్లు
- View Answer
- సమాధానం: 2
23. నవంబర్ 30న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఓ) ప్రభుత్వ పెద్దల మండలి శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించడానికి ఏ దేశం ప్రణాళిక వేసింది?
1) చైనా
2) జర్మనీ
3) రష్యా
4) భారత్
- View Answer
- సమాధానం: 4
24. వర్చువల్ జి20 విదేశాంగ మంత్రుల అసాధారణ సమావేశాన్ని నిర్వహించిన దేశం ఏది?
1) దక్షిణ కొరియా
2) మెక్సికో
3) సౌదీ అరేబియా
4) టర్కీ
- View Answer
- సమాధానం: 3
25. ప్రధాన దేశీయ, ప్రపంచ సంస్థలతో, నెదర్లాండ్స్ ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ ఎన్ని ఒప్పందాలు కుదుర్చుకుంది?
1) 15
2) 12
3) 10
4) 8
- View Answer
- సమాధానం: 4
26. ఆసియా, పసిఫిక్ కోసం ఆహార, వ్యవసాయ సంస్థ ప్రాంతీయ సదస్సు 35వ సెషన్‌ను ఏ దేశం నిర్వహించింది?
1) భారత్
2) బంగ్లాదేశ్
3) భూటాన్
4) నేపాల్
- View Answer
- సమాధానం: 3
27. రూ. 10,000 కోట్లు విలువైన దీర్ఘకాలిక సిండికేట్ రుణాల కోసం వేదాంత ఏ బ్యాంకుతో భాగస్వామ్యం కలిగి ఉంది?
1) పంజాబ్ నేషనల్ బ్యాంక్
2) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
3) ఐసీఐసీఐ బ్యాంక్
4) కెనరా బ్యాంక్
- View Answer
- సమాధానం: 2
28. ఫ్యూచర్ గ్రూప్‌ను ఏ సంస్థ రూ. 24,713 కోట్లకు కొనుగోలు చేసింది?
1) రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్
2) ఆరోగ్య రిటైల్ వెంచర్స్ లిమిటెడ్
3) సుందరం రిటైల్ వెంచర్స్ లిమిటెడ్
4) హిందూస్తాన్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్
- View Answer
- సమాధానం: 1
29. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ విడుదల చేసిన డేటా ప్రకారం, 2020-2021 యొక్క Q1 (ఏప్రిల్-జూన్ 2020) లో భారత జీడీపీ వృద్ధిలో సంకోచం ఎంత?
1) 16.5%
2) 14.7%
3) 23.9%
4) 10.6%
- View Answer
- సమాధానం: 3
30. మెర్కామ్ క్యాపిటల్ ప్రకారం ప్రపంచంలోనే అతిపెద్ద సౌర విద్యుత్ ఉత్పత్తి ఆస్తి యజమాని ఏ సంస్థ?
1) ఇన్వెనర్జీ
2) ఎనెల్ గ్రీన్ పవర్
3) ఎస్బీ ఎనర్జీ
4) అదానీ గ్రీన్ ఎనర్జీ
- View Answer
- సమాధానం: 4
31. 2020 సంవత్సరానికి రాబోబ్యాంక్ టాప్ 20 గ్లోబల్ డెయిరీ జాబితాలో ప్రవేశించిన మొదటి భారతీయ డెయిరీ సంస్థ ఏది?
1) విజయ డెయిరీ
2) కేఎస్ఈ లిమిటెడ్
3) అముల్ డెయిరీ
4) దూద్‌సాగర్ డెయిరీ
- View Answer
- సమాధానం: 3
32. ఆర్బీఐ విడుదల చేసిన రివైజ్డ్ ప్రియారిటీ సెక్టార్ లెండింగ్ (పీఎస్ఎల్) మార్గదర్శకాల ప్రకారం ఏ రంగాలలో రుణ పరిమితిని రెట్టింపు చేశారు?
1) పునరుత్పాదక శక్తి
2) ఆరోగ్య మౌలిక సదుపాయాలు
3) విద్య
4) (1), (2) రెండూ
- View Answer
- సమాధానం: 4
33. భారతీయ రైతులు & యూఏఈ ఆహార పరిశ్రమల మధ్య అంతరాన్ని తగ్గించడానికి ప్రారంభించిన ఇ-మార్కెట్ వేదిక పేరు ఏమిటి?
1) అగ్రిటోడ్
2) అగ్రినోవా
3) అగ్రిటెక్
4) అగ్రియోటా
- View Answer
- సమాధానం: 4
34. ఎస్బీఐ ఎకోవ్రాప్ అంచనా ప్రకారం ఆర్థిక సంవత్సరం 2020-21లో భారత జీడీపీ ఎంత?
1) (-) 10.9%
2) (-) 2.5%
3) (-) 11.2%
4) (-) 13.8%
- View Answer
- సమాధానం: 1
35. పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద సౌర చెట్టును అభివృద్ధి చేసిన సంస్థ ఏది?
1) నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్
2) సెంట్రల్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్గనైజేషన్
3) సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్
4) సెంట్రల్ గ్లాస్ సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్
- View Answer
- సమాధానం: 3
36. భారతీయ రైల్వే అభివృద్ధి చేసిన రిమోట్ కంట్రోల్డ్ మెడికల్ ట్రాలీ పేరు ఏమిటి?
1) టెలిబోట్
2) వార్డ్‌బోట్
3) టెక్బాట్
4) మెడ్బోట్
- View Answer
- సమాధానం: 4
37. డేటా ప్రొటెక్షన్ ప్రాజెక్ట్ కోసం చెక్ రిపబ్లిక్కు చెందిన పార్దుబిస్ విశ్వవిద్యాలయంతో ఏ సంస్థ సహకరించింది?
1) ఐఐటీ మద్రాస్
2) ఐఐటీ గాంధీనగర్
3) ఐఐటీ గువాహటి
4) ఐఐటీ ఢిల్లీ
- View Answer
- సమాధానం: 3
38. “ఆహార వ్యవస్థల కోసం జాతీయంగా నిర్ణయించిన సహకారాన్ని (ఎన్డీసీ) మెరుగుపరచడం” అనే నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది?
1) ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం
2) అంతర్జాతీయ కార్మిక సంస్థ
3) ఐక్యరాజ్యసమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ
4) ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం
- View Answer
- సమాధానం: 1
39. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (THE) విడుదల చేసిన ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్ 2021 లో భారతీయ సంస్థలలో అగ్రస్థానంలో ఉన్న సంస్థ ఏది?
1) బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్, పిలాని
2) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, అహ్మదాబాద్
3) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), రోపర్
4) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ), బెంగళూరు
- View Answer
- సమాధానం: 4
40. కేరళ, పశ్చిమ బెంగాల్ పరిశోధకులు సిస్టోమస్ గ్రాసిలస్ అనే కొత్త చేపను ఏ నదిలో గుర్తించారు?
1) గంగా నది
2) సింధు నది
3) బ్రహ్మపుత్ర నది
4) యమునా నది
- View Answer
- సమాధానం: 1
41. ఆరోగ్య విభాగంలో భారత రెండో ఉత్తమ యాప్‌గా నిలిచినది ఏది?
1) Fitbit
2) Fooducate
3) iMumz
4) My Diet
- View Answer
- సమాధానం: 3
42. వేగవంతమైన ఇంటర్నెట్ను అందించడానికి 2020 సెప్టెంబర్‌లో స్పేస్ఎక్స్ ఎన్ని స్టార్‌లింక్ ఉపగ్రహాలను ప్రయోగించింది?
1) 60
2) 50
3) 25
4) 30
- View Answer
- సమాధానం: 1
43. బొగ్గు రంగంలో హరిత కార్యక్రమాల కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్టీరింగ్ కమిటీ చైర్మన్ ఎవరు?
1) వినోద్ పాల్
2) వీకే సారస్వత్
3) అనిల్ కుమార్ జైన్
4) రమేష్ చంద్
- View Answer
- సమాధానం: 2
44. విద్యార్థులలో సైబర్ భద్రతపై అవగాహన కల్పించడానికి సైబర్ పీస్ ఫౌండేషన్‌తో భాగస్వామ్యం కలిగిన సంస్థ ఏది?
1) ట్విట్టర్
2) వాట్సాప్
3) ఫేస్బుక్
4) ఇన్స్టాగ్రామ్
- View Answer
- సమాధానం: 2
45. లాంగ్ మార్చి2ఎఫ్ క్యారియర్ రాకెట్లో పునర్వినియోగ ప్రయోగాత్మక అంతరిక్ష నౌకను ఇటీవల ప్రయోగించిన దేశం ఏది?
1) స్పెయిన్
2) జర్మనీ
3) చైనా
4) భారత్
- View Answer
- సమాధానం: 3
46. హిందూస్తాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు?
1) హేమంత్ ఖాత్రి
2) వి.కె.సక్సేనా
3) అరుణ్ కుమార్ శుక్లా
4) రవీందర్ సింగ్ ధిల్లాన్
- View Answer
- సమాధానం: 1
47. జీవిత బీమా కంపెనీల కోసం ఇండెక్స్ లింక్డ్ ఉత్పత్తులను అధ్యయనం చేయడానికి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) ఏర్పాటు చేసిన 6 మంది సభ్యుల వర్కింగ్ గ్రూపునకు ఎవరు నాయకత్వం వహిస్తారు?
1) దినేష్ పంత్
2) వై శ్రీనివాస రావు
3) మనీష్ కుమార్
4) జోస్ సీ జాన్
- View Answer
- సమాధానం: 1
48. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీకి మొదటి మహిళా డైరెక్టర్ జనరల్ ఎవరు?
1) సుజాత సింగ్
2) దేవయాని ఖోబ్రగడే
3) మీరా శంకర్
4) ఉషా పాధీ
- View Answer
- సమాధానం: 4
49. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీటీఐ) నూతన చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) కె.ఎన్. శాంత్ కుమార్
2) వినీత్ జైన్
3) అవీక్ సర్కార్
4) విజయ్ కుమార్ చోప్రా
- View Answer
- సమాధానం: 3
50. సౌత్ ఇండియన్ బ్యాంక్ ఎండీ, సీఈఓగా ఎవరు నియమితులయ్యారు?
1) వి. జి. మాథ్యూ
2) మురళి రామకృష్ణన్
3) అచల్ కుమార్ గుప్తా
4) ప్రదీప్ ఓం గాడ్బోలే
- View Answer
- సమాధానం: 2
51. రైల్వే బోర్డు మొదటి సీఈఓగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు?
1) బి.పి. సందీప్ నందా
2) రమేష్ కుమార్ సింగ్
3) పి.ఎస్. పవన్ మిశ్రా
4) వీకే యాదవ్
- View Answer
- సమాధానం: 4
52. బెల్జియన్ గ్రాండ్ ప్రిక్స్ 2020 ను ఎవరు గెలుచుకున్నారు?
1) చార్లెస్ లెక్లర్క్
2) లూయిస్ హామిల్టన్
3) వాల్టెరి బాటాస్
4) సెబాస్టియన్ వెటెల్
- View Answer
- సమాధానం: 2
53. 2020 ఆన్లైన్ FIDE చెస్ ఒలింపియాడ్‌లో చాంపియన్‌షిప్ (బంగారు పతకం) గెలుచుకున్న దేశం ఏది?
1) రష్యా
2) భారత్
3) యూఎస్ఏ
4) (1), (2) రెండూ
- View Answer
- సమాధానం: 4
54. లెబనాన్ కొత్త ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు?
1) ముస్తఫా ఆదిబ్
2) ఇమ్రాన్ అజీజ్
3) యాకుబ్ అడిడ్
4) మహ్మద్ ముస్తఫా
- View Answer
- సమాధానం: 1
55. సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (సీఎఫ్ఐ) 2021లో మొట్టమొదటి సైక్లింగ్ శిఖరాగ్ర సమావేశాన్ని ఏ నగరంలో నిర్వహించడానికి ప్రణాళిక వేసింది?
1) ఢిల్లీ
2) ముంబై
3) బెంగళూరు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
56. 2020లో "పోషన్ మాహ్" లేదా "న్యూట్రిషన్ నెల"గా నిర్వహించే నెల ఏది?
1) అక్టోబర్
2) ఆగస్టు
3) సెప్టెంబర్
4) డిసెంబర్
- View Answer
- సమాధానం: 3
57. ప్రపంచ కొబ్బరికాయ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?( 2020 సంవత్సరానికి థీమ్ " Invest in Coconut to save the world")
1) అక్టోబర్ 19
2) జూలై 29
3) సెప్టెంబర్ 2
4) ఆగస్టు 31
- View Answer
- సమాధానం: 3
58. ‘ఎక్సలెన్స్ ఇన్ ఎనర్జీ మేనేజ్మెంట్’ 21వ జాతీయ అవార్డులలో ‘నేషనల్ ఎనర్జీ లీడర్’, ‘ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫిషియెంట్ యూనిట్’ అవార్డులను గెలుచుకున్న విమానాశ్రయం ఏది?
1) ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం
2) ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం
3) కుషోక్ బకులా రింపోచీ విమానాశ్రయం
4) రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం
- View Answer
- సమాధానం: 4
59. ప్రతి సంవత్సరం ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ స్వచ్ఛంద దినోత్సవాన్ని ఎప్పుడు పాటిస్తారు?
1) నవంబర్ 15
2) జూలై 2
3) అక్టోబర్ 18
4) సెప్టెంబర్ 5
- View Answer
- సమాధానం: 4
60. ‘ది ప్రెసిడెన్షియల్ ఇయర్స్’ పేరుతో పుస్తకాన్ని రచించినది ఎవరు?
1) రామ్ నాథ్ గోవింద్
2) ప్రతిభాపటిల్
3) అబ్దుల్ కలాం
4) ప్రణబ్ ముఖర్జీ
- View Answer
- సమాధానం: 4
61. “ది బిగ్ థాట్స్ ఆఫ్ లిటిల్ లవ్” అనే పుస్తకాన్ని ఎవరు రాశారు?
1) నసీరుద్దీన్ షా
2) కరణ్ జోహార్
3) రిషి కపూర్
4) ఆయుష్మాన్ ఖుర్రానా
- View Answer
- సమాధానం: 2
62. ‘ది కామన్వెల్త్ ఆఫ్ క్రికెట్: A Lifelong Love Affair with the Most Subtle and Sophisticated Game Known to Humankind’ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు?
1) సుజిత్ ముఖర్జీ
2) హర్ష భోగ్లే
3) ఎడ్ స్మిత్
4) రామచంద్ర గుహ
- View Answer
- సమాధానం: 4
63. “ది వన్ అండ్ ఓన్లీ స్పార్కెల్లా” అనే పుస్తక రచయిత ఎవరు?
1) లీనా డన్హామ్
2) బెన్ అఫ్లెక్
3) చానింగ్ టాటమ్
4) టామ్ హాంక్స్
- View Answer
- సమాధానం: 3
64. ప్రపంచ మేధో సంపత్తి సంస్థ (WIPO), కార్నెల్ విశ్వవిద్యాలయం, ఇన్సీడ్ బిజినెస్ స్కూల్ విడుదల చేసిన గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2020 యొక్క 13వ ఎడిషన్‌లో భారత్ ర్యాంక్ ఎంత?
1) 48
2) 84
3) 36
4) 72
- View Answer
- సమాధానం: 1
65. 2020 డిసెంబర్లో పోప్ ఫ్రాన్సిస్ విడుదల చేయబోయే పుస్తకం పేరు ఏమిటి?
1) “Ave Maria”
2) “Let Us Dream”
3) “Beloved Amazonia”
4) “Aperuit illis”
- View Answer
- సమాధానం: 2