కరెంట్ అఫైర్స్ (ఫిబ్రవరి 8 - 14 ) బిట్ బ్యాంక్
1. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల కొత్తగా ఎన్ని కరువు మండలాలను ప్రకటించింది ?
1) 10
2) 15
3) 25
4) 33
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఫిబ్రవరి 14న ఏపీ ప్రభుత్వం కొత్తగా 33 కరువు మండలాలను ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరవు మండలాల సంఖ్య 301కి చేరింది (2016 ఖరీఫ్‌లో 268 కరువు మండలాలను ప్రభుత్వం ప్రకటించింది).
- సమాధానం: 4
2. టిబెట్ బౌద్ధ మత గురువు దలైలామా ఇటీవల ఏ ప్రాంతంలో నైతిక విలువల కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ?
1) విజయవాడ
2) ముంబై
3) హైదరాబాద్
4) బెంగళూరు
- View Answer
- సమాధానం: 3
వివరణ: భారత్ పర్యటనలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన దలైలామా మాదాపూర్‌లో నైతిక విలువల కేంద్రాన్ని ప్రారంభించారు.
- సమాధానం: 3
3. అంతర్జాతీయ ఎడారి ఉత్సవాలు-2017ను ఎక్కడ నిర్వహించారు ?
1) దుబాయ్
2) జై సల్మర్
3) లాస్ వేగాస్
4) టక్సన్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఈ ఉత్సవాలను జై సల్మర్లో మూడు రోజుల పాటు నిర్వహించారు. ఇందులో బీఎస్ఎఫ్కు చెందిన 48 ఒంటెలు పాలుపంచుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఒంటెల పోలో పందేలు, టాటూ పెయింటింగ్, టగ్ ఆఫ్ వార్ పోటీలు నిర్విహ స్తారు.
- సమాధానం: 2
4. తెలంగాణ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఇటీవల నిర్వహించిన సర్వేలో ప్రతి వంద మంది గర్భిణుల్లో ఎంత మంది రక్తహీనతతో బాధపడుతున్నారు?
1) 62 మంది
2) 52 మంది
3) 42 మంది
4) 32 మంది
- View Answer
- సమాధానం: 1
వివరణ: సర్వే ప్రకారం 15-40 సంవ త్సరాల మధ్య వయసున్న ప్రతి ముగ్గురిలో ఒకరు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. బాలామృతం, ఆరోగ్య లక్ష్మీ పథకాల కింద నమోదైన వారిలో కేవలం 20.08 శాతం మంది మాత్రమే లబ్ధి పొందుతున్నారని తేలింది.
- సమాధానం: 1
5. ఏ రాష్ట్రంలో ఎయిమ్స్ ఏర్పాటుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది ?
1) తెలంగాణ
2) ఆంధ్రప్రదేశ్
3) కేరళ
4) మధ్యప్రదేశ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: తెలంగాణ రాజధాని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎయిమ్స్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. 2017-18 బడ్జెట్లో గుజరాత్, జార్ఖండ్ రాష్ట్రాలకు ఎయిమ్స్ మంజూరు చేస్తున్నట్లు పేర్కొంది.
- సమాధానం: 1
6. కెనడా ఇటీవల ప్రారంభించిన సిటిజన్ సైన్స్ ఆస్ట్రోనాట్ పథకం ద్వారా 2018లో అంతరిక్షంలోకి వెళ్లనున్న భారత మహిళ ఎవరు ?
1) కవితా నాయర్
2) శారదా విలియమ్స్
3) పమేలా చర్డ్స్
4) షావ్న పాండ్య
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఈ ప్రోగ్రామ్ కోసం 3200 మంది ప్రతిభావంతుల నుంచి ఇద్దరిని ఎంపిక చేశారు. అందులో ఒకరు షావ్న పాండ్య. భారత సంతతికి చెందిన ఈమె ఆల్బర్టా యూనివర్సిటీ ఆసుపత్రిలో న్యూరోసర్జన్‌గా పనిచేస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఆమె అంతరిక్షంలో బయో మెడిసిన్, మెడికల్ సైన్స్ మీద పరిశోధన చేయనున్నారు.
- సమాధానం: 4
7. అంతర్జాతీయ మేథో సంపత్తి సూచీలో భారత్ స్థానం ?
1) 10
2) 25
3) 43
4) 45
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఆవిష్కరణ యొక్క మూలాలు అనే పేరుతో గ్లోబల్ ఇంటలెక్చుల్ ప్రాపర్టీ సెంటర్ (జీఐపీసీ) అంతర్జాతీయ మేథో సంపత్తి ఇండెక్స్‌ను విడుదల చేసింది. 45 దేశాలతో కూడిన ఈ జాబితాలో భారత్ 43వ స్థానంలో నిలిచింది. తొలి మూడు స్థానాల్లో అమెరికా, యూకే, జర్మనీ ఉన్నాయి.
- సమాధానం: 3
8. తొలి జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సుని ఎక్కడ నిర్వహించారు ?
1) హైదరాబాద్
2) విశాఖపట్నం
3) విజయవాడ
4) బెంగళూరు
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఫిబ్రవరి 10-12 వరకూ 3 రోజుల పాటు ఈ సదస్సు జరిగింది. ఈ సమావేశాలకు ముఖ్య అతిథిగా బౌద్ధ మత గురువు దలైలామా, బంగ్లాదేశ్ పార్లమెంట్ స్పీకర్ శిరిన్ షార్మన్ చౌదరి హాజరయ్యారు.
- సమాధానం: 3
9. సోమాలియా నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎంపికయ్యారు ?
1) మొహమ్మద్ అబ్దుల్లాహీ ఫర్మోజా
2) హసన్ షేక్ మహమ్మద్
3) షరీఫ్ షేక్ అహమ్మద్
4) మహమ్మద్ ఉస్మాన్ జహరి
- View Answer
- సమాధానం: 1
10. గోదావరి జలాల పరిపూర్ణ వినియోగం - తెలంగాణ జాతీయ దృక్పథం అనే ఆంగ్ల పుస్తక రచయిత ?
1) సురేశ్ ప్రభు
2) వెదిరె శ్రీరాం
3) కె.తారకరామారావు
4) ఉమాభారతి
- View Answer
- సమాధానం: 2
వివరణ: రాజస్థాన్ నదీ జలాల అథారిటీ ఛైర్మన్ వెదిరె శ్రీరాం ఈ పుస్తకాన్ని రచించారు.
- సమాధానం: 2
11. రాకాసి అలలపై అధ్యయనం కోసం దృష్టి లైఫ్ సేవింగ్ ఏజెన్సీ ఇటీవల ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది ?
1) నాసా
2) ఇస్రో
3) యూరో స్పేస్ ఏజెన్సీ
4) చైనీస్ స్పేస్ ఏజెన్సీ
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఇస్రో, దృష్టి లైఫ్ సేవింగ్ ఏజెన్సీ సంస్థలు సంయుక్తంగా గోవా బీచ్‌లో రాకాసి అలలపై అధ్యయనం చేయనున్నాయి.
- సమాధానం: 2
12. ఇటీవల A గ్రేడ్ హోదా పొందిన విమానాశ్రయం ఏది ?
1) వరంగల్ ఎయిర్పోర్ట్
2) సేలం ఎయిర్పోర్ట్
3) నాగపూర్ ఎయిర్పోర్ట్
4) విశాఖపట్నం ఎయిర్పోర్ట్
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఏడాదిలో ప్రయాణికుల సంఖ్య 20 లక్షలు దాటిన విమానాశ్రయాలకు A గ్రేడ్ హోదా ఇస్తారు. ఈ సంఖ్యను అధిగమించిన విశాఖపట్నం విమానాశ్రయం ఈ హోదా అందుకుంది.
- సమాధానం: 4
13. విజయవాడ మెట్రో రైలు నిర్మాణం కోసం రూ.2,600 కోట్ల రుణం ఇచ్చేందుకు ముందుకు వచ్చిన దేశం ఏది ?
1) జర్మనీ
2) జపాన్
3) థాయ్‌లాండ్
4) కెనడా
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఈ ప్రాజెక్టు వ్యయంలో 20 శాతం కేంద్ర ప్రభుత్వం భరిస్త్తుండగా రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.300 కోట్లు ఖర్చు చేయనుంది.
- సమాధానం: 1
14. ఇటీవల ఏ రాష్ట్రంలో యురేనియం నిల్వలను గుర్తించారు ?
1) రాజస్థాన్
2) కశ్మీర్
3) సిక్కిం
4) మేఘాలయ
- View Answer
- సమాధానం: 4
వివరణ: మేఘాలయలోని డొమైసియాత్, వాహ్కిన్, లోస్టోయిన్ తదితర ప్రాంతాల్లో యురేనియం నిల్వలను గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 8న ప్రకటించింది.
- సమాధానం: 4
15. మహిళల ఇండోర్ 2000 మీ. పరుగు పందెంలో ప్రపంచ రికార్డ్ నెలకొల్పింది ఎవరు ?
1) సోనియా ఓ సులివాన్
2) గాబ్రియెల్ స్జబో
3) గెంజేబే డిబాబా
4) జేన్ బిసెర్గి
- View Answer
- సమాధానం: 3
వివరణ: స్పెయిన్‌లో జరిగిన ఐఏఏఎఫ్ వరల్డ్ ఇండోర్ టూర్లో 5 నిమిషాల 23 సెకండ్లలో 2 వేల మీటర్ల పరుగుని పూర్తి చేసిన గెంజేబే డిబాబా సరికొత్త రికార్డు సృష్టించింది.
- సమాధానం: 3
16. వీరప్పన్ - చేజింగ్ ది బ్రిగండ్ పుస్తక రచయిత ఎవరు ?
1) వెదిరె శ్రీరామ్
2) కె.విజయ్ కుమార్
3) రాజ్‌నాథ్ సింగ్
4) రాజేంద్ర ఠాకూర్
- View Answer
- సమాధానం: 2
వివరణ: విజయ్ కుమార్ నేతృత్వంలోని స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఆపరేషన్ కొకూన్ ద్వారా 2004లో వీరప్పన్‌ను అంతమొందించింది.
- సమాధానం: 2
17. ఏ ప్రాంతంలో లభించే టేకుకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జీఐ) ట్యాగ్ లభించనుంది ?
1) తమిళనాడు
2) గోవా
3) తెలంగాణ
4) కేరళ
- View Answer
- సమాధానం: 4
వివరణ: నిలాంబుర్ కేరళలో మాత్రమే లభించే అత్యంత నాణ్యత కలిగిన టేకు. అయితే మార్కెట్లో దీని పేరుతో అనేక ఉత్పత్తులు వస్తున్న విషయాన్ని గుర్తించిన నిలాంబుర్ టేక్ హరిటేజ్ సొసైటీ, కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయం సహాయంతో జీఐ ట్యాగ్ కోసం పయత్నించింది. వారు సమర్పించిన వివరాలను పరిశీలించిన ఇంటలెక్చుల్ ప్రాపర్టీ రైట్స్ (ఐపీఈ) దీనికి జీఐ ట్యాగ్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
- సమాధానం: 4
18. ప్రపంచంలో తొలి బ్రెయిలీ అట్లాస్‌ను తయారు చేసిన సంస్థ ఏది ?
1) NATMO
2) NASA
3) ESA
4) JAXA
- View Answer
- సమాధానం: 1
వివరణ: జాతీయ అట్లాస్ మరియు ది మాటిక్ మ్యాపింగ్ ఆర్గనైజేషన్ సంస్థ తొలి బ్రెయిలీ అట్లాస్‌ను తయారు చేసింది.
- సమాధానం: 1
19. జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
1) ఫిబ్రవరి 10
2) ఫిబ్రవరి 15
3) ఫిబ్రవరి 20
4) ఫిబ్రవరి 25
- View Answer
- సమాధానం: 1
వివరణ: ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం భారత్‌లో 220 మిలియన్ల (22 కోట్లు) మంది పిల్లలు (1-14 ఏళ్ల లోపు) నులి పురుగులకు ప్రభావితం అయ్యే పరిస్థితుల్లో ఉన్నారు. 1-19 ఏళ్ల మధ్య ఉన్న పిల్లల్లో నులి పురుగుల వల్ల ఎదుగుదల ఉండదు. అందుకే పిల్లల ఆరోగ్య రక్షణ, నులి పురుగుల నివారణకు జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను అందరికీ వివరించేందుకు ఏటా ఫిబ్రవరి 10న జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని నిర్వహిస్తారు.
- సమాధానం: 1
20. సెబీ నూతన ఛైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు ?
1) యుకే సిన్హా
2) అజయ్ త్యాగి
3) ఎమ్.దామోదరన్
4) సి.వి.భావే
- View Answer
- సమాధానం: 2
వివరణ: సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా-సెబీని 1988లో ఏర్పాటు చేశారు. సెబీ ఛైర్మన్ పదవి కాలం 5 ఏళ్లు. అజయ్ త్యాగి నియామకానికి ముందు యుకే సిన్హా సెబీ ఛైర్మన్‌గా వ్యవహరించారు.
- సమాధానం: 2
21. అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు కలిగిన అతి కొద్ది దేశాల జాబితాలో ఇటీవల చేరిన దేశం ?
1) చైనా
2) జర్మనీ
3) జపాన్
4) భారత్
- View Answer
- సమాధానం: 4
వివరణ: అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ (ఏఏడీ) వ్యవస్థ కలిగిన ఇంటర్ సెప్టర్ మిసైల్‌ను భారత్ ఫిబ్రవరి 9న విజయంతంగా పరీక్షించింది. ఒడిశాలోని అబ్దుల్ కలాం డిఫెన్స్ బేస్ నుంచి ఈ పరీక్షను నిర్వహించింది. ఈ మిసైల్ పొడవు 7.5 మీటర్లు, బరువు 1.2 టన్నులు. ఇందులో నావిగేషన్ వ్యవస్థతో పాటు ఎలక్ట్రో మెకానికల్ యాక్టివేటర్ పరిజ్ఞానాన్ని పొందుపరిచారు. (ఏఏడీ వ్యవస్థలున్న దేశాలు : అమెరికా, రష్యా, ఇజ్రాయెల్, భారత్ )
- సమాధానం: 4
22. బ్రిక్స్ 2017 సమావేశాలు ఎక్కడ నిర్వహించనున్నారు ?
1) చైనా
2) రష్యా
3) దక్షిణాఫిక్రా
4) బ్రెజిల్
- View Answer
- సమాధానం: 1
వివరణ: మంచి భవిష్యత్తు కోసం బలమైన భాగస్వామ్యం అనే నినాదంతో చైనాలో 2017 సెప్టెంబర్‌లో బిక్స్ ్రసమావేశాల జరగనున్నాయి.
- సమాధానం: 1
23. ఐక్యరాజ్య సమితి ప్రారంభించిన బ్లూ హార్ట్ కాంపెయిన్కు ఎంపికైన భారతీయుడు ఎవరు ?
1) రాజు అనంతశర్మ
2) కైలాస్ కైర్
3) సతిందర్ సర్తాజ్
4) మాస్టర్ సలీమ్
- View Answer
- సమాధానం: 3
వివరణ: మానవ అక్రమ రవాణకు వ్యతిరేకంగా UNDOC ఆధ్వర్యంలో ఐరాస ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించింది. పంజాబ్ జానపద గాయకుడు సతిందర్ సర్తాజ్ ఇందులో పాల్గొంటారు. UNDOC(United Nations Office On Drugs and Crimes) విభాగాన్ని ఐక్యరాజ్య సమితి 1997లో ఏర్పాటు చేసింది.
- సమాధానం: 3
24. భారత్‌లో జరగనున్న ఫిఫా అండర్ - 17 ప్రపంచ కప్ మస్కట్ పేరు ?
1) గోలు
2) ఖేలియో
3) సాంగై
4) మిథున్
- View Answer
- సమాధానం: 2
వివరణ: అముర్ జాతికి చెందిన ఖేలియో చిరుతపులిని ఫిఫా అండర్ -17 ప్రపంచ కప్ మస్కట్‌గా ఎంపిక చేశారు. ఈ చిరుతపులి అరుదైన మరియు అంతరించిపోతున్న అడవి జంతువుల జాబితాలో ఉంది. ఇది హిమాలయాల పర్వత పాదాల దగ్గర, దక్షిణాసియాలో ఎక్కువగా కనిపిస్తుంది.
- సమాధానం: 2
25. ఎమ్ఆర్ఐ స్కాన్‌ను ఎవరు తయారు చేశారు ?
1) జర్ద్ డైమండ్
2) రోజర్ గిల్లామిన్
3) చార్లెస్ బెస్ట్
4) సర్ పీటర్ మాన్స్ ఫీల్డ్
- View Answer
- సమాధానం: 4
వివరణ: యూకేకు చెందిన భౌతిక శాస్త్రవేత్త సర్ పీటర్ మాన్స్ ఫీల్డ్ ఎమ్ఆర్ఐ స్కాన్ పరికరాన్ని తయారు చేసినందుకు గాను మెడిసిన్‌లో నోబెల్ బహుమతి పొందారు. ఆయన ఫిబ్రవరి 9న మరణించారు.
- సమాధానం: 4
26. అమన్ - 17 పేరుతో బహుళ దేశ నౌకా విన్యాసాలు నిర్వహించిన దేశం ఏది ?
1) సౌదీ అరేబియా
2) ఇరాన్
3) పాకిస్తాన్
4) మలేషియా
- View Answer
- సమాధానం: 3
వివరణ: కరాచీ తీరంలో ఫిబ్రవరి 10 నుంచి 14 వరకూ ఈ నౌక విన్యాసాలు జరిగాయి. ఇందులో మొత్తం 37 దేశాలు పాలుపంచుకున్నాయి.
- సమాధానం: 3
27. అంబాసిడర్ కారు బ్రాండ్‌ని కొనుగోలు చేసిన సంస్థ ఏది ?
1) హోండా
2) ఫోర్డ్
3) ప్యూగోట్
4) బెంజ్
- View Answer
- సమాధానం: 3
వివరణ: సి.కె.బిర్లా కంపెనీకి చెందిన హిందూస్థాన్ మోటార్స్ అంబాసిడర్ బ్రాండ్‌ను ఫ్రెంచ్ కంపెనీ ప్యూగోట్ రూ.80 కోట్లకు కొనుగోలు చేసింది.
- సమాధానం: 3
28. సెంటర్ ఫర్ ఏషియా పసిఫిక్ నుంచి ఆర్డర్ ఆఫ్ మెరిట్ పురస్కారానికి ఎంపికైన ఎయిర్‌పోర్టు ఏది ?
1) రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం
2) అన్నాదురై అంతర్జాతీయ విమానాశ్రయం
3) కెంపే గౌడ అంతర్జాతీయ విమానాశ్రయం
4) ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఆసియా - పసిఫిక్ ప్రాంతంలో అతి తక్కువ కర్బన ఉద్గారాలు విడుదల చేస్తున్న ఎయిర్పోర్ట్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (హైదరాబాద్).
- సమాధానం: 1
29. ప్రపంచంలో అతి పెద్ద ఇసుక కోటను నిర్మించి గిన్నిస్ బుక్ లోకి స్థానం పొందింది ఎవరు ?
1) జీమ్ డెనెవాన్
2) జోమా మాన్గ్ర మ్
3) ఎలినోయస్
4) సుదర్శన్ పట్నాయక్
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఒడిశాలోని పూరీ తీరంలో 14.84 మీటర్ల ఎత్తయిన ఇసుక కోటను నిర్మించిన సుదర్శన పట్నాయక్ గిన్నిస్ బుక్‌లో రికార్డు నమోదు చేశారు. పట్నాయక్ ఇప్పటి వరకూ 23 ప్రపంచ రికార్డులను నెలకొల్పారు.
- సమాధానం: 4
30. ముగా కొకూన్ తయారీ కోసం అభయారణ్యంను ప్రారంభించనున్న రాష్ట్రం ఏది ?
1) కర్ణాటక
2) అసోం
3) కేరళ
4) మిజోరం
- View Answer
- సమాధానం: 2
31. రెండవ అంతర్జాతీయ సుగంధ ద్రవ్యాల కాన్ఫరెన్స్‌ను ఎక్కడ నిర్వహించారు ?
1) కౌలాలంపూర్
2) బాలి
3) కొవలమ్
4) బటేవియా
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఈ కాన్ఫరెన్స్ కేరళలోని కొవలమ్లో జరిగింది. అఖిల భారత సుగంధ ద్రవ్యాల ఎగుమతి దారుల ఫోరమ్, కొచ్చిన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ సంయుక్తంగా ఈ సమావేశాలను నిర్వహించాయి.
- సమాధానం: 3
32. భారత్ ఏ అంతర్జాతీయ సంస్థతో కలిసి అతివాద భావజాల వ్యాప్తి నిరోధానికి కాన్ఫరెన్స్ నిర్వహించనుంది ?
1) ఆసియాన్
2) యూరోపియన్ యూనియన్
3) సార్క్
4) బ్రిక్స్
- View Answer
- సమాధానం: 1
33. ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ రంగంలో నూతన ఆవిష్కరణల కోసం కేంద్ర ప్రభుత్వం ఎంత మూల ధనంతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనుంది ?
1) రూ.9,800 కోట్లు
2) రూ.8,800 కోట్లు
3) రూ.7,900 కోట్లు
4) రూ.6,831 కోట్లు
- View Answer
- సమాధానం: 4
34. ఫెడరేషన్ ఆఫ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ (ఫిఫా)కు సౌహార్ధ రాయబారిగా ఎవరు నియమితులయ్యారు ?
1) పీలే
2) డిగో మారడోనా
3) బెక్‌హమ్
4) జిందాన్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఫుట్‌బాల్ క్రీడాభివృద్ధి, విస్తృత ప్రచారం కోసం ఫుట్ బాల్ మాజీ ప్లేయర్ డిగో మారడోనాను సౌహార్ధ రాయబారిగా ఫిఫా నియమించింది.
- సమాధానం: 2
35. ట్వంటీ-20 ప్రపంచ అంధుల క్రికెట్ కప్ - 2017 విజేత ఎవరు ?
1) పాకిస్తాన్
2) ఇంగ్లండ్
3) భారత్
4) బంగ్లాదేశ్
- View Answer
- సమాధానం: 3
వివరణ: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన టీ-20 అంధుల క్రికెట్ కప్ ఫైనల్లో పాకిస్తాన్ ఓడించి భారత్ విజేతగా నిలిచింది. ఈ టోర్నీ సౌహార్ధ రాయబారిగా మాజీ క్రికెటర్ రాహుల్ డ్రవిడ్ వ్యవహరించారు.
- సమాధానం: 3
36. జాతీయ ఉత్పాదకత వారోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు ?
1) ఫిబ్రవరి 12 - 18
2) ఫిబ్రవరి 2 - 8
3) మార్చి 12 - 18
4) మార్చి 2 - 8
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఫిబ్రవరి 12న జాతీయ ఉత్పాదకత వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏటా ఫిబ్రవరి 12 నుంచి 18 వరకూ వారోత్సవాలు నిర్వహిస్తారు.
- సమాధానం: 1
37. దేశంలో నీటిపై తేలియాడే తొలి స్కూల్‌ని ఎక్కడ ప్రారంభించారు ?
1) చిల్కా సరస్సు
2) కొల్లేరు సరస్సు
3) సాంబార్ సరస్సు
4) లోక్తక్ సరస్సు
- View Answer
- సమాధానం: 4
వివరణ: మణిపూర్ రాజధాని ఇంఫాల్‌కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగోల్సాబీ లేక్ ఆఫ్ చంపు ఖాంగ్పాక్ గ్రామం వద్ద ఉన్న లోక్తక్ సరస్సులో దేశంలోనే తొలినీటిపై తేలియాడే పాఠశాలను ప్రారంభించారు.
- సమాధానం: 4
38. ప్రపంచంలోనే అత్యంత పొడవైన, ఎత్తయిన సైకిల్ మర్గాన్ని ఎక్కడ ప్రారంభించారు ?
1) కెనడా
2) చైనా
3) జపాన్
4) స్వీడన్
- View Answer
- సమాధానం: 2
వివరణ: 5 మైళ్ల పొడవు, 16 అడుగుల వెడల్పుతో అతి పెద్ద సైకిల్ మార్గాన్ని చైనా నిర్మించింది.
- సమాధానం: 2
39. 70వ బ్రిటిష్ అకాడమీ సినిమా అవార్డుల్లో ఉత్తమ చిత్రం పురస్కారం పొందిన సినిమా ఏది ?
1) లాలా ల్యాండ్
2) మాంచెస్టర్ బై సీ
3) మూన్ లైట్
4) లయన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఈ అవార్డుల్లో లాలా ల్యాండ్ మొత్తం 5 కేటగిరీల్లో అవార్డులు గెలుచుకుంది. ఉత్తమ దర్శకుడు - డామెన్ చా జెల్లా (లాలా ల్యాండ్), ఉత్తమ నటి - ఎమ్మా స్టోన్ (లాలా ల్యాండ్)ఎంపికయ్యారు.
- సమాధానం: 1
40. 59వ గ్రామీ పురస్కారాలలో ఉత్తమ ఆల్బమ్ అవార్డు దేనికి దక్కింది ?
1) బై మూన్ డే
2) ది లైఫ్ ఆఫ్ పాబాల్
3) అడెల్ 25
4) కలరాంగ్ బుక్
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఇంగ్లీష్ భాషలోని సంగీతాన్ని గుర్తించేందుకు గ్రామీ పురస్కారాలను 1958లో ప్రారంభించారు. 1959 నుంచి ఈ అవార్డులను ప్రదానం చేస్తున్నారు. 2017 సంవత్సరానికి గాను ఉత్తమ ఆల్బమ్-25 అడెల్, ఉత్తమ రికార్డింగ్ - హెల్లో (25 అడెల్), సాంగ్ ఆఫ్ ద ఇయర్ - హెల్లో (25 అడెల్), పాప్ సోలో పర్ఫార్మెన్స్ - హల్లో (25 అడెల్)ఎంపికయ్యాయి.
- సమాధానం: 3
41. జర్మనీ నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎంపికయ్యారు ?
1) జోచి గౌచ్క్
2) హోర్ట్స్ సీ హోఫర్
3) క్రిస్టియన్ ఉల్ఫ్
4) ఫ్రాంక్ - వాల్టర్ స్టెయిన్ మిరై
- View Answer
- సమాధానం: 4
42. అసోచామ్ నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు ?
1) సునిల్ కనోరియా
2) స్వాతి పిరమల్
3) సందీప్ జాజోడియా
4) సుదీప్ వర్మ
- View Answer
- సమాధానం: 3
వివరణ: దేశీయ మరియు విదేశీ వ్యాపార అభివృద్ధి కోసం అసోచామ్ సంస్థను 1920లో ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.
- సమాధానం: 3
43. ఏ భారతీయ నౌకలో మొదటి సారి సోలార్ విద్యుత్ వ్యవస్థ ఏర్పాటు చేశారు ?
1) ఐఎన్ఎస్ విరాట్
2) ఐఎన్ఎస్ సర్వేక్షక్
3) ఐఎన్ఎస్ విక్రాంత్
4) ఐఎన్ఎస్ విక్రమాదిత్య
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఐఎన్ఎస్ సర్వేక్షక్లో 300 వాట్ల సామర్థ్యం గల 18 సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేశారు. వీటి ద్వారా 5.4 kw శక్తి ఉత్పత్తి అవుతుంది.
- సమాధానం: 2
44. ప్రపంచ రేడియో దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
1) ఫిబ్రవరి 13
2) ఫిబ్రవరి 10
3) ఫిబ్రవరి 8
4) ఫిబ్రవరి 4
- View Answer
- సమాధానం: 1
వివరణ: మానవ ప్రగతిలో రేడియో సేవలు చిరస్మరణీయమని యునెస్కో 2011లో ప్రకటించింది. ఆ ఏడాది నుంచి ఏటా ఫిబ్రవరి 13న రేడియో దినోత్సవాన్ని జరుపుతున్నారు.
- సమాధానం: 1
45. 11వ అంతర్జాతీయ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఎగ్జిబిషన్ - ఏరో ఇండియా 2017 ని ఎక్కడ నిర్వహించారు ?
1) అహ్మదాబాద్
2) కోట
3) వీలర్
4) బెంగళూరు
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఏరో ఇండియా షోని ప్రతి రెండు సంవత్సరాలకోసారి బెంగళూరులోని యలహంకలో నిర్వహిస్తారు. ఇందులో దేశ విదేశీ ప్రతినిధులు, కంపెనీలు పాల్గొంటాయి. పారిస్ ఎయిర్ షో ప్రపంచంలోని అతిపెద్దది కాగా ఏరో ఇండియా షో రెండో అతిపెద్ద ఎయిర్ షో.
- సమాధానం: 4
46. అంతర్జాతీయ నాణేల ప్రదర్శనను ఎక్కడ నిర్వహించారు ?
1) అహ్మదాబాద్
2) మధురై
3) తిరువనంతపురం
4) విశాఖపట్నం
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఇందులో 500 ప్రాంతాలకు చెందిన 2,500కు పైగా నాణేలను ప్రదర్శించారు. 310 దేశాల నాణేలను సేకరించి గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించిన జస్టిన్ గిల్ బర్గ్ లోపెజ్ సేకరణలను కూడా ఈ ఎగ్జిబిషన్లో ప్రదర్శించారు.
- సమాధానం: 3
47. యునెస్కో ప్రకృతి ఉత్సవాలను ఇటీవల ఎక్కడ నిర్వహించారు ?
1) హిమాచల్ ప్రదేశ్
2) ఉత్తరాఖండ్
3) ఉత్తరప్రదేశ్
4) మేఘాలయ
- View Answer
- సమాధానం: 1
వివరణ: యునెస్కో, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సహకారంతో హిమాచల్ ప్రదేశ్‌లోని గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్కులో ఫిబ్రవరి 11 నుంచి 13 వరకు ప్రకృతి ఉత్సవాలను నిర్వహించింది.
- సమాధానం: 1
48. న్యూజిలాండ్ గ్రాండ్ ప్రీ ఫార్ములా వన్ 2017 టైటిల్ విజేత ఎవరు ?
1) పెడ్రో పీక్వెట్
2) జెహన్ దరువల
3) మార్కస్ ఆర్మ్‌స్ట్రాంగ్
4) హ్యారి హయెక్
- View Answer
- సమాధానం: 2
వివరణ: న్యూజిలాండ్ గ్రాండ్ ప్రీ ఫార్ములా వన్ టైటిల్ గెలుచుకున్న తొలి భారత రేసర్ జెహన్ దరువల. ఇతడు ఫోర్స్ ఇండియా ఫార్ములా వన్‌కు చెందిన డ్రైవర్.
- సమాధానం: 2
49. పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆల్ ఇండియా నేషనల్ స్టైల్ కబడ్డీ ఛాంపియన్షిప్ టైటిల్ విజేత ఎవరు ?
1) హర్యానా
2) రైల్వేస్
3) ఓఎన్జీసీ
4) బీపీసీఎల్
- View Answer
- సమాధానం: 1
వివరణ: తొలిసారి నిర్వహించిన ఈ పోటీలు హర్యానాలో జరిగాయి. ఫైనల్స్‌లో రైల్వేస్‌ను ఓడించి హర్యానా విజేతగా నిలిచింది. టైటిల్ గెలుచుకున్న జట్టుకి రూ. కోటి, రన్నరప్‌కు రూ.50 లక్షలు, రెండవ రన్నరప్‌కు రూ.25 లక్షల నగదు బహుమతి అందజేశారు.
- సమాధానం: 1
50. ప్రపంచ చెస్ ఫెడరేషన్ (ఫిడే) నుంచి క్యాండిడేట్ మాస్టర్ టైటిల్‌కు ఎవరు ఎంపికయ్యారు ?
1) కుష్ భగత్
2) శ్యామూల్ రెషిస్కీ
3) పాల్ కీర్స్
4) ఓస్ట్ బెర్న్స్టీయిన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఫిడే 2002లో క్యాండిడేట్ మాస్టర్ ను ప్రారంభించింది. ఒకే సీజన్లో 2,200 పాయింట్లు సాధించిన చెస్ ప్లేయర్‌కు ఈ టైటిల్‌ను ప్రదానం చేస్తారు.
- సమాధానం: 1