కరెంట్ అఫైర్స్ (నవంబర్ 9 -16) బిట్ బ్యాంక్
1. అస్సాంలో విద్యుత్ పంపిణీ వ్యవస్థ అభివృద్ధి కోసం ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఎంత రుణం మంజూరు చేసింది?
1) 28 మిలియన్ డాలర్లు
2) 48 మిలియన్ డాలర్లు
3) 38 మిలియన్ డాలర్లు
4) 48 కోట్ల డాలర్లు
- View Answer
- సమాధానం: 2
వివరణ: 2014లో అస్సాంలో విద్యుత్ పంపిణీ అభివృద్ధికి ఆసియా అభివృద్ధి బ్యాంక్ 300 మిలియన్ డాలర్ల రుణం మంజూరు చేసింది. 2015లో మొదటి విడతగా 50 మిలియన్ డాలర్లు, 2016లో రెండో విడతగా 48 మిలియన్ డాలర్లు విడుదల చేసింది. ఆసియా అభివృద్ధి బ్యాంకు1966లో మనీలా కేంద్రంగా ఏర్పడింది. ఇండియా ఈ బ్యాంకులో 1966లో సభ్యత్వం పొందింది. ప్రస్తుతం ADB లో 67 దేశాలకు సభ్యత్వం ఉంది.
- సమాధానం: 2
2. ఇటీవల ఏ రాష్ట్రం పర్యాటక రంగం అభివృద్ధి కోసం ‘యాత్ర అనే సంస్థ’తో అవగాహన ఒప్పందం చేసుకుంది?
1) ఉత్తరాఖండ్
2) హర్యానా
3) బీహార్
4) రాజస్థాన్
- View Answer
- సమాధానం: 1
3. ప్రతిష్టాత్మక ‘RSF -TV5’ మొండె (Monde) పత్రికా స్వేచ్ఛ పురస్కారం 2016నకు ఎంపికైనది ఎవరు?
1) నజిబా ఆయుబీ
2) జీనత్ బేడోయ
3) జహినా రషిద్
4) హది అబ్దుల్లా
- View Answer
- సమాధానం: 4
వివరణ: RSF - Reporters sans frontieres/ Reporters with out borders. RSF అనేది ఒక అంతర్జాతీయ, లాభాపేక్ష లేని సంస్థ. ప్రతికా స్వేచ్ఛను కాపాడటం లక్ష్యంగా పారిస్‌లో ఈ సంస్థను స్థాపించారు. సరిహద్దులకు అతీతంగా పనిచేసిన జర్నలిస్టులకు ఈ పురస్కారాలు అందిస్తారు.
- సమాధానం: 4
4. ఇటీవల కేరళకు చెందిన ‘ఫండ్ ట్రస్టీ అండ్ అడ్వేజరి కమిషన్’ కు చైర్మన్‌గా ఎంపికైంది ఎవరు?
1) ఉషా తోరట్
2) ప్రకాష్ బక్షి
3) వినోద్ రాయ్
4) ఉర్జిత్ పటేల్
- View Answer
- సమాధానం: 3
వివరణ: FTAC సంస్థ చైర్మన్‌గా వినోద్ రాయ్‌ను కేరళ ప్రభుత్వం నియమించింది. ఈ సంస్థలో ఉషా తోరట్, ప్రకాశ్ బక్షిలను ఇతర సభ్యులుగా నియమించారు.
- సమాధానం: 3
5. దేశంలోనే తొలి LNG తో నడిచే బస్సును ఎక్కడ ప్రారంభించారు?
1) త్రివేండ్రం
2) కోయంబత్తూరు
3) కాన్పుర్
4) పూణె
- View Answer
- సమాధానం: 1
వివరణ: పెట్రోనెట్ LNG లిమిటెడ్, టాటా మోటార్స్ కలిసి ఈ బస్సును తయారు చేశాయి. పెట్రోనెట్ LNG సంస్థ GAIL, ONGC, IOC, BPCL ల జాయింట్ వెంచర్. దేశంలో తొలి LNG టెర్మినల్‌ను గుజరాత్‌లోని ‘దహెజ్’ అనే ప్రాంతంలో ఏర్పాటు చేశారు. రెండో టెర్మినల్‌ను కొచ్చిలో ఏర్పాటు చేశారు.
- సమాధానం: 1
6. ఇటీవల భారతదేశాన్ని సందర్శించిన బ్రిటన్ ప్రధాన మంత్రి ఎవరు?
1) థెరిసా మే
2) డేవిడ్ కామరూన్
3) గోర్డాన్ బ్రౌన్
4) గోల్డ్ మైర్
- View Answer
- సమాధానం: 1
వివరణ: బ్రిటన్ దేశానికి ఎంపికైన రెండో మహిళ ప్రధాని థెరిసా మే. తన భారత్ పర్యటనలో భాగంగా ‘మేదో సంపత్తి హక్కులు’, ఇరు దేశాల మధ్య వ్యాపార అభివృద్ధికి ద్వైపాక్షిక సహకారం అంశాలపై ఇండియాతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
- సమాధానం: 1
7. ప్రధాన మంత్రి యువ యోజన లక్ష్యం ఏమిటి?
1) యువతకు ఉద్యోగాల కల్పన
2) యువతను సినిమా రంగంలోకి ఆహ్వానించటం
3) యువతకు వ్యవస్థాపకత విద్యా, శిక్షణ ఇవ్వటం
4) యువతను సేంద్రియ వ్యవసాయం వైపు తరలించటం
- View Answer
- సమాధానం: 3
వివరణ: ప్రధానమంత్రి యువ యోజన పథకం కాలపరిమితి 5 సంవత్సరాలు. 3050 సంస్థలలో 7 లక్షల మంది విద్యార్థులకు రూ. 499.94 కోట్ల వ్యయంతో శిక్షణ ఇస్తారు.
- సమాధానం: 3
8. 9వ అంతర్జాతీయ రెగ్యులేటరి కోపరేషన్ ఫర్ హెర్బల్ మెడిసిన్ (IRCH) సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు?
1) గోవా
2) ముంబయి
3) న్యూఢిల్లీ
4) కోల్కత్తా
- View Answer
- సమాధానం: 3
వివరణ: కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్యర్యంలో ‘9వ IRCH’ సమావేశాన్ని న్యూఢిల్లీలో నిర్వహించారు. IRCHను 2006లో ఏర్పాటు చేశారు. హెర్బల్ మందుల నిర్వహణ, నియంత్రణ, వాటి వాడకం వల్ల వచ్చే లాభాలు, నష్టాల గురించి ప్రజలకు తెలియజేయటం IRCH విధి.
- సమాధానం: 3
9. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రసూతి సెలవులను 6 నెలల నుంచి 9 నెలలకు పెంచింది?
1) కర్ణాటక
2) తమిళనాడు
3) తెలంగాణ
4) కేరళ
- View Answer
- సమాధానం: 2
10. న్యూక్లియర్ స్లపయర్స్ గ్రూప్‌లో ఉండే సభ్యదేశాలు ఎన్ని?
1) 18
2) 28
3) 38
4) 48
- View Answer
- సమాధానం: 4
వివరణ: 1974లో ఇండియా అణు పరీక్షలు జరిపిన నేపథ్యంలో న్యూక్లియర్ స్లపయర్స్ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. సియోల్‌లో జరిగిన NSG సమావేశాలలో 48 దేశాలకు గాను 47 దేశాలు ఇండియాకు సభ్యత్వం ఇవ్వటానికి అంగీకరించాయి. చైనా అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (NPT) మీద సంతకం చేసిన తర్వాత మాత్రమే భారత్‌కు NSG లో సభ్యత్వం ఇవ్వాలని విటో చేసింది.
- సమాధానం: 4
11. ప్రతిష్టాత్మక జమాన్లాల్ బజాజ్ ఫౌండేషన్ పురస్కారం-2016నకు ఎంపికైనది ఎవరు?
1) మెహన్ హిరాభాయ్ హిరాలాల్
2) డా. నన్నపనేని మంగాదేవి
3) షేక్ రాచేడ్ షున్నౌచి
4) పై అందరూ
- View Answer
- సమాధానం: 4
వివరణ: జమన్‌లాల్ బజాజ్ గౌరవార్థం 1977లో ఈ పురస్కారాన్ని ప్రారంభించారు. ఈ పురస్కారాన్ని శాస్త్ర సాంకేతికత, మహిళలు, పిల్లలు, అంతర్జాతీయ అంశాల మీద నిర్వహిస్తారు. ఈ పురస్కారం కింద రూ.10,00,000 నగదు, ఒక ట్రోఫి, ఒక ప్రశంసాపత్రం ప్రదానం చేస్తారు. మెహన్ హిరాభాయ్ హిరాలాల్, శ్రీబోన్ బేహరి విష్ణు నింబాకర్, నన్నపనేని మంగా దేవి, హేక్ రాచడ్ షున్నొచీలు (ట్యునీషియా) పురస్కారానికి ఎంపికయ్యారు.
- సమాధానం: 4
12. ప్రతిష్టాత్మక కాళిదాస్ సమ్మాన్ పురస్కారం 2015-16నకు ఎంపికైంది ఎవరు?
1) ప్రొ. రాజ్ బిసరియా
2) అబ్దుల్లా సమిర్
3) పొ.అట్లారి మురళి
4) పొ.రీలా ముఖర్జీ
- View Answer
- సమాధానం: 1
వివరణ: 1980లో కాళిదాస సమ్మాన్ పురస్కారాన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. శాస్త్రీయ నృత్యం, శాస్త్రీయ సంగీతం, థియెటర్ వంటి అంశాల్లో ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రొ.రాజ్ బిసరియా ఈ పురస్కారానికి ఎంపికయ్యాడు.
- సమాధానం: 1
13. అమెరికాకు 45వ అద్యక్షుడుగా ఎంపికైంది ఎవరు?
1) బరాక్ ఒబామా
2) హిల్లరీ క్లింటన్
3) డోనాల్డ్ ట్రంప్
4) ఆల్గోర్
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఇటీవల అమెరికాలో జరిగిన 58వ అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించాడు. అమెరికా అధ్యక్షుడుగా ఎంపికైన 45వ వ్యక్తి ట్రంప్. అమెరికా ఎలక్టొరల్ కాలెజ్లో 538 ఎలక్టర్లు ఉంటారు. అందులో ట్రంప్‌కు అనుకులంగా 273, హిల్లరీకి అనుకూలంగా 218 ఓట్లు వచ్చాయి.
- సమాధానం: 3
14. ప్రపంచంలో తొలి తేలికైన సింథటిక్ నానో రోబోట్‌ను తయారు చేసింది ఎవరు?
1) డా. జుయిచిరోతైంగ్
2) డా.జీన్ యావోటాంగ్
3) డా.డెన్నిస్ బ్రే
4) డా. కారిముల్లస్
- View Answer
- సమాధానం: 2
వివరణ: హాంకాంగ్ యూనివర్సిటీకి చెందిన డా.జిన్ యవొటాంగ్ బృందం ప్రపంచంలోనే తొలి సింథటిక్ నానో రోబోట్‌ను అభివృద్ధి చేసింది. దీని పరిమాణం రక్తకణం అంత ఉంటుంది. శరీరంలో ఉన్న ట్యూమర్స్ తొలగించటంలో ఇది సహాయం చే స్తుంది.
- సమాధానం: 2
15. ‘హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సిన్’ ను ఏ వ్యాధి నివారణకు వాడుతారు?
1) ఎయిడ్స్
2) స్వైన్‌ఫ్లూ
3) గర్భాశయ ముఖద్వార క్యాన్సర్
4) చికెన్ గున్యా
- View Answer
- సమాధానం: 3
వివరణ: దేశంలో తొలిసారిగా ఈ వ్యాక్సిన్‌ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన రాష్ట్రం ఢిల్లీ. ప్రజా ఆరోగ్య పథకం కింద 11 నుంచి 13 సంవత్సరాల వయస్సు ఉన్న బాలికలకు ‘హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సిన్’ ను ఉచితంగా వేస్తారు.
- సమాధానం: 3
16. ఇటీవల నాసా ఏ ఉల్క మీద నీటి జాడలు కనుగొంది?
1) Psyche
2) Trojans
3) Ceres
4) Pallas
- View Answer
- సమాధానం: 1
వివరణ: హవాయిలోని ఇన్ఫ్రారెడ్ టెలిస్కోప్ సహాయం ద్వారా ‘Psyche’ అనే ఆస్టరాయిడ్ మీద నీటి జాడలను నాసా గుర్తించింది.
- సమాధానం: 1
17. ప్రపంచ వాతవరణ సంస్థ ప్రకారం అత్యంత వేడి సంవత్సరం ఏది?
1) 2011
2) 2013
3) 2015
4) 2016
- View Answer
- సమాధానం: 3
వివరణ: 2015లో అత్యధిక వడగాలులు, అసాధారణ వర్షపాతం, త్రీవమైన కరువులు, అసాధారణ ఉష్ణ తుఫానులు సంభవించాయి. 1950లో ప్రపంచ వాతవరణ సంస్థను జెనీవాలో ప్రారంభించారు. ఈ సంస్థలో 191 సభ్యదేశాలు ఉన్నాయి.
- సమాధానం: 3
18. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏ ప్రాంతాలకు సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టంను విస్తరించింది?
1) టైరప్
2) చాంగ్ లాంగ్
3) లాంగ్ డింగ్
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
వివరణ: అస్సాంకు సరిహద్దుగా ఉన్న అరుణాచల్‌ప్రదేశ్‌లోని మూడు జిల్లాలకు సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టంను విస్తరించింది. NSCN-IM, NSCN-K సంస్థలు ఈ ప్రాంతంలో దోపిడీలు, భయాన క వాతావరణం సృష్టిస్తున్నాయి.
- సమాధానం: 4
19. ఇటీవల ఏ రాష్ట్రంలోని కొండ ప్రాంతాల్లో నూతన నిర్మాణాలపై నిషేధం విధించారు?
1) ఉత్తరాఖండ్
2) బీహార్
3) మేఘాలయ
4) జమ్మూ & కాశ్మీర్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఉత్తరాఖండ్ హైకోర్టుఉత్తరాఖండ్లోని కొండలు, పర్వతాలు, మంచు పర్వతాల్లో నూతన నిర్మాణాల కోసం చెట్లు నరకటంపై పూర్తిగా నిషేధం విధించింది. గంగోత్రి, యమునోత్రి హిమానీ నదాల 25 కి.మీ. వ్యాసార్థంలో కొత్త నిర్మాణాలు చేపట్టరాదు. 10 కి.మీ. వ్యాసార్థాలు శిలాజ ఇంధనాలు మండిచరాదు.
- సమాధానం: 1
20. ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఎవరు?
1) కెవిన్ రూడ్
2) మాల్క్ం టర్నుబుల్
3) సుతాన్ జహరీర్
4) బెర్నార్డ్ కాజెనైవ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఆస్ట్రేలియా పారిస్ వాతవరణ మార్పు ఒప్పందంను ఇటీవల అంగీకరించింది. కాలుష్య ఉద్గారాలను 26-28% వరకు 2030 లోపు తగ్గిస్తామని ఆస్ట్రేలియా ప్రభుత్వం అంగీకరించింది.
- సమాధానం: 2
21. ఇటీవల అపోలో టైర్స్ 5వ ప్లాంట్‌ను ఎక్కడ ఏర్పాటు చేయనుంది?
1) శ్రీ సిటీ
2) కందుకూరు
3) హసన్
4) విజయనగరం
- View Answer
- సమాధానం: 1
వివరణ: అపోలో టైర్స్ రూ.525 కోట్ల వ్యయంతో తన 5వ ప్లాంట్‌ను నెల్లూరులోని శ్రీ సిటీలో ఏర్పాటు చేయనుంది.
- సమాధానం: 1
22. ప్రతిష్టాత్మక గొల్డెన్ పికాక్ పురస్కారం ‘కార్పొరేట్ గవర్నెన్స్’లో ఎంపికైన సంస్థ ఏది?
1) ONGC
2) IOC
3) SAIL
4) BPCL
- View Answer
- సమాధానం: 3
వివరణ: కార్పొరేట్ గవర్నెన్స్‌లో గొల్డెన్ పికాక్ పురస్కారానికి SAIL ఎంపికైంది. SAIL వార్షిక టర్నోవర్ రూ.43,337 కోట్లు. దీని చైర్మన్ పి.కె.సింగ్.
- సమాధానం: 3
23. ప్రతిష్టాత్మక గొల్డ్స్మిత్ పురస్కారానికి ఎంపికైంది ఎవరు?
1) డేవిడ్ కామెరాన్
2) విలియం డిగ్భి
3) ఊల్సిహేగ్
4) మైక్ మెకార్మాక్
- View Answer
- సమాధానం: 4
వివరణ: మైక్ మెకార్మాక్రాసిన సోలార్ బోన్స్ పుస్తకానికి ఈ పురస్కారం లభించింది. ఈ పురస్కారం కింద 10,000 పౌండ్లు నగదు బహమతి లభిస్తుంది.
- సమాధానం: 4
24. అంధుల T20 ప్రపంచకప్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులైనది ఎవరు?
1) వీరేంద్ర సెవ్వాగ్
2) రాహుల్ ద్రవిడ్
3) మెక్ గ్రాత్
4) గిల్ క్రిస్ట్
- View Answer
- సమాధానం: 2
వివరణ: రెండవ అంధుల T20 ప్రపంచ కప్‌కు రాహుల్ ద్రవిడ్‌ను అంబాసిడర్‌గా నియమించారు.
- సమాధానం: 2
25. ‘World science day for peace and development- 2016’ ను ఏ రోజున నిర్వహిస్తారు?
1) నవంబర్ 8
2) నవంబర్ 9
3) నవంబర్ 10
4) నవంబర్ 11
- View Answer
- సమాధానం: 3
వివరణ: ప్రజల నిత్య జీవితంలో సైన్స్‌ను భాగం చేస్తూ సమాజ అభివృద్ధికి, ప్రపంచ శాంతి కోసం వాడాలని ఈ దినంను జరుపుకుంటారు.
- సమాధానం: 3
26. ఇటీవల ఏ నది నీటి వల్ల పంజాబ్, హర్యానాల మధ్య వివాదం ఏర్పడింది?
1) రావి
2) చీనాబ్
3) సింధూ
4) జీలమ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: Punjab termination of agreements act 2004 ను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. రావి - బియాస్ నది నీటిని పంజాబ్ హర్యానాతో పంచుకోవాలని, సట్లెజ్ - యమునా నది లింక్ కెనాల్ నిర్మాణానికి అడ్డంకులను కల్గించరాదని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది.
- సమాధానం: 1
27. అంతర్జాతీయ పోటీ నెట్ వర్క్ సమావేశాన్ని 2018లో ఎక్కడ నిర్వహించనున్నారు.
1) బీజింగ్
2) సింగపూర్
3) న్యూఢిల్లీ
4) ఉలాన్ బాటర్
- View Answer
- సమాధానం: 3
వివరణ: 2016లో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ సింగపూర్ ఆధ్వర్యంలో సింగపూర్‌లో అంతర్జాతీయ పోటీ నెట్వర్క్ సమావేశాన్ని నిర్వహించారు. 2017లో పోర్చుగల్‌లో ఈ సమావేశం నిర్వహించనున్నారు. 2018లో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో నిర్వహిస్తారు.
- సమాధానం: 3
28. ఇటీవల ఏ రాష్ట్రంలో ‘ముఖ్యమంత్రి శిక్షక్ సమ్మాన్ యోజన’ పథకాన్ని ప్రారంబించారు?
1) ఛత్తీస్‌ఘడ్
2) హర్యానా
3) పంజాబ్
4) హిమాచల్‌ప్రదేశ్
- View Answer
- సమాధానం: 4
వివరణ: పాఠశాలలో 100% ఫలితాలను సాధించడం కోసం హిమాచల్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది.
- సమాధానం: 4
29. జాతీయ విద్యా దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?
1) నవంబర్ 7
2) నవంబర్ 9
3) నవంబర్ 11
4) నవంబర్ 13
- View Answer
- సమాధానం: 3
వివరణ: భారత స్వతంత్య్ర సమరయోధుడు, మొదటి కేంద్ర విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జన్మదినం అయిన నవంబర్ 11న ప్రతి సంవత్సరం జాతీయ విద్యా దినోత్సవాన్ని నిర్వహిస్తారు.
- సమాధానం: 3
30. ‘నవ కేరళ మిషన్’ కింద కేరళలో ప్రారంభించిన పథకాలు ఏవి?
1) హరిత కేరళం
2) ఆర్ధ్రం
3) లైఫ్ ఏ మిషన్
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
వివరణ: నవ కేరళ మిషన్‌ను గవర్నర్ పి.సదాశివం ప్రారంభించారు. ఈ మిషన్‌లో హరిత కేరళం, ఆర్ధ్రం, లైఫ్ ఏ మిషన్ పథకాలు ఉన్నాయి. హరిత కేరళం పథకంలో భాగంగా సేంద్రీయ వ్యవసాయ అభివృద్ధి, నీటి పారుదల సౌకర్యాల కల్పన, ఆర్ధ్రం కింద ప్రభుత్వ ఆసుపత్రుల నాణ్యతను పెంచి అందరికీ అందుబాటులోకి తీసుకురావడం, లైఫ్ ఏమిషన్ కింద ఇళ్లు లేని వారికి ఇళ్ల నిర్మాణం కోసం సహాయం చేసి వారి జీవన నాణ్యత పెంచటం.
- సమాధానం: 4
31. ఇటీవల పోర్బ్స్ విడుదల చేసిన ఆసియాలో అత్యంత సంపద కల్గిన 50 కుటుంబాల్లో తొలిస్థానంలో ఉన్న కుటుంబం?
1) అంబానీ కుటుంబం
2) లీ కుటుంబం
3) కోవాక్ కుటుంబం
4) చీరావనోత్ కుటుంబం
- View Answer
- సమాధానం: 2
వివరణ: దక్షిణ కొరియాకుచెందిన ‘సామ్ సంగ్’ కంపెనీ లీ కుటుంబం ఆధ్వర్యంలో ఉంది. ఈ కుటుంబం 29.6 బిలియన్ డాలర్ల సంపద విలువతో తొలి స్థానంలో ఉంది. రెండో స్థానంలో థాయ్‌లాండ్‌కు చెందిన చేరవనోంత్ కుటుంబం ఉంది. ఈ కుటుంబం ఆధీనంలో Charoen Pokphand group సంస్థ ఉంది. ఈ సంస్థ సంపద విలువ 27.7 బిలియన్ డాలర్లు. మూడో స్థానంలో అంబానీ కుటుంబం 25.8 బిలియన్ డాలర్లు సంపద కల్గి ఉంది. నాల్గవ స్థానంలో కొవాక్ కుటుంబం (హంకాంగ్) 25.2 బిలియన్ డాలర్లు.
- సమాధానం: 2
32. ప్రతిష్టాత్మక కర్ణాటక లలితా కళా అకాడమీ ప్రదానం చేసే జీవితకాల సాఫల్య పురస్కారం 2016నకు ఎంపికైంది ఎవరు?
1) మృణాళిని ముఖర్జీ
2) మృదులా సేన్
3) మార్టా జాకిమౌఇచ్జ్
4) సారా పావాలిజ్
- View Answer
- సమాధానం: 3
వివరణ: పోలాండ్‌కు చెందిన ఇండాలజిస్ట్ మార్టా జాకి మౌఇజ్ (Marta Jakimowicz) కర్ణాటక లలితా కళా అకాడమీ ప్రదానం చేసే జీవిత కాల సాఫల్య పురస్కారానికి ఎంపికైంది. ఈ పురస్కారం కింద రూ.50,000 నగదు బహుమతి లభిస్తుంది. భారత సంస్కృతికి సంబంధించిన పురాణాలను పొలిష్ భాషలోకి అనువదించింది. ఆమెతో పాటు బాబురావ్ వినోదిని, కె.కె. మకాళి కూడా ఈ పురస్కారానికి ఎంపికయ్యారు.
- సమాధానం: 3
33. ‘ఉత్తరాఖండ్ రత్న’ పురస్కారానికి ఎంపికైంది ఎవరు?
1) ఎన్.డి. తివారీ
2) వాజ్‌పేయి
3) హరిష్ రావత్
4) నరేంద్ర మోడీ
- View Answer
- సమాధానం: 1
34. ఇంటర్ పోల్‌కు నూతన అద్యక్షుడిగా ఎంపికైంది ఎవరు?
1) మిరైల్లే బల్లె స్త్రజ్జి
2) ఖూ బూన్ హై
3) జాన్ స్కొబర్
4) మెంగ్ హెంగ్వై
- View Answer
- సమాధానం: 4
వివరణ: చైనా ప్రజా భద్రత డిప్యూటీ మంత్రి మెంగ్ హెంగ్వై (Meng Hongwei) ఇంటర్ పోల్‌కు నూతన అధ్యక్షుడిగా ఎంపికయ్యాడు. ఇతని పదవీకాలం 4 సంవత్సరాలు. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్‌లోని లైయాన్ (lyon)లో ఉంది.
Interpol : International criminal police organization
- సమాధానం: 4
35. ప్రపంచ నిమోనియా దినోత్సవంను ఏ రోజున నిర్వహిస్తారు?
1) నవంబర్ 8
2) నవంబర్ 12
3) నవంబర్ 16
4) నవంబర్ 20
- View Answer
- సమాధానం: 2
వివరణ: హెమోఫిలస్ ఇన్‌ప్లూయింజా టైప్-బి, స్ట్రెప్టోకాకస్ న్యూమోనియే అనే రెండు రకాల నిమోనియా ప్రాణాంతకమైనది. నిమోనియా బారినపడి పతి 20 సెకనులకు ఒక చిన్నారిమరణిస్తున్నారు. ప్రజల్లో నిమోనియా పట్ల అవగాహన పెంచటానికి ఈ దినోత్సవంను నిర్వహిస్తున్నారు.
- సమాధానం: 2
36. 32వ జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ హై జంప్‌లో జాతీయ రికార్డును నెలకొల్పింది ఎవరు?
1) సతీష్ చంద్ర
2) తేజస్వీని శంకర్
3) బానోత్ రాజు నాయక్
4) కైలాష్ చౌహన్
- View Answer
- సమాధానం: 2
వివరణ: 32వ జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 2.26 మీ. హై జంప్ చేసి 17 సంవత్సరాల తేజస్వీని శంకర్ నూతన జాతీయ రికార్డునునెలకొల్పాడు.
- సమాధానం: 2
37. రెండవ బ్రిక్స్ కమ్యూనికేషన్ మంత్రుల సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు?
1) బెంగళూరు
2) షాంఘై
3) ఫోర్తలేజా
4) కజన్
- View Answer
- సమాధానం: 1
38. ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?
1) నవంబర్ 13
2) నవంబర్ 11
3) నవంబర్ 9
4) నవంబర్ 7
- View Answer
- సమాధానం: 1
వివరణ: ప్రజల్లో కిడ్నీ సంబంధిత వ్యాధుల మీద అవగాహన కల్పించటం కోసం 1998 నుంచి ప్రతి సంవత్సరం నవంబర్ 13న ప్రపంచ కిడ్నీ దినోత్సవం నిర్వహిస్తున్నారు.
- సమాధానం: 1
39. ప్రతిష్టాత్మక స్టీఫెన్ ఎడ్బర్గ్ క్రీడా సూర్ఫి పురస్కారానికి ఎంపికైనది ఎవరు?
1) ఆండిముర్రే
2) నోవాక్ జకొవిచ్
3) రోజర్ ఫెదరర్
4) రాఫెల్ నాదల్
- View Answer
- సమాధానం: 3
వివరణ: అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రోఫెషనల్ (ATP) ప్రతి సంవత్సరం వివిధ కేటగిరిలో పురస్కారాలు అందిస్తుంది. మాజీ ప్రపంచ నెంబర్ వన్ టెన్నిస్ క్రీడాకారుడు స్ట్టీఫెన్ ఎడ్బర్గ్ గౌరవార్థం ఈ పురస్కారాన్ని నెలకొల్పారు.
- సమాధానం: 3
40. జాతీయ పబ్లిక్ సర్వీస్ బ్రాడ్ కాస్టింగ్ దినోత్సవంను ఏ రోజున నిర్వహించారు?
1) నవంబర్ 20
2) నవంబర్ 16
3) నవంబర్ 14
4) నవంబర్ 12
- View Answer
- సమాధానం: 4
వివరణ: నవంబర్ 12, 1947న మొదటిసారి గాంధీ ఆల్ ఇండియా రేడియో కార్యాలయాన్ని సందర్శించి, ఇండియాకు వలస వచ్చి కురుక్షేత్రలో స్థిర నివాసం ఏర్పరుచుకున్న వారిని ఉద్దేశించి ప్రసంగించారు. దీనిని పురస్కరించుకొని జాతీయ పబ్లిక్ సర్వీస్ బ్రాడ్ కాస్టింగ్ దినంను నిర్వహిస్తారు.
- సమాధానం: 4
41. జాతీయ పిల్లల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు?
1) నవంబర్ 10
2) నవంబర్ 14
3) నవంబర్ 18
4) నవంబర్ 8
- View Answer
- సమాధానం: 2
42. ప్రపంచ మధుమేహ దినోత్సవంను ఏ రోజున నిర్వహించుకుంటారు?
1) నవంబర్ 18
2) నవంబర్ 14
3) నవంబర్ 10
4) నవంబర్ 8
- View Answer
- సమాధానం: 2
వివరణ: మధుమేహం గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలనేఉద్దేశంతో 1991లో తొలిసారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని జరుపుకోవాలని సూచించింది.
- సమాధానం: 2
43. అంతర్జాతీయ సహన దినోత్సవంను ఏ రోజున నిర్వహించుకుంటారు?
1) నవంబర్ 8
2) నవంబర్ 12
3) నవంబర్ 16
4) నవంబర్ 20
- View Answer
- సమాధానం: 3
వివరణ: ప్రజల్లో అసహనం పెరగకుండా చూడటం, సహనం పట్ల అవగాహన కల్పించటానికి 1995 నుంచి ఈ దినంను నిర్వహించుకుంటున్నారు.
- సమాధానం: 3
44. జాతీయ పత్రిక దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహించుకుంటారు?
1) నవంబర్ 16
2) నవంబర్ 15
3) నవంబర్ 14
4) నవంబర్ 13
- View Answer
- సమాధానం: 1
వివరణ: మొదటి ప్రెస్ కౌన్సిల్ సలహా మేరకు 1966 సంవత్సరంలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ప్రారంభించారు. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.
- సమాధానం: 1
45. అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్‌కు నూతన అధ్యక్షుడుగా ఎంపికైంది ఎవరు?
1) డేవిడ్ బ్రినే
2) నరేంద్ర బాత్ర
3) కెన్ రీడ్
4) ఉర్జిత్ సింగ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఐర్లాండ్‌కు చెందిన డేవిడ్ బ్రీన్, ఆస్ట్రేలియాకు చెందిన కెన్రీడ్ను ఓడించి నరేంద్ర బాత్ర అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్‌కు అధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు. నరేంద్ర బాత్రకు ఆసియా, ఆఫ్రికా, సెంట్రల్ అమెరికా నుంచి మద్ధతు లభించింది. అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్‌లోని లాసన్నేలో ఉంది.
- సమాధానం: 2
46. అండర్ - 8 ప్రపంచ కప్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌తో బంగారు పతకాన్ని సాధించినది ఎవరు?
1) తాజముల్ ఇస్లాం
2) చైత్రా కృష్ణిన్
3) హజెరా సయ్యద్
4) కవితా కొండ
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఇటలీలో జరిగిన అండర్ - 8 ప్రపంచ కప్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని కాశ్మీర్‌కు చెందిన తాజముల్ ఇస్లాం అనే బాలిక గెలుచుకుంది.
- సమాధానం: 1
47. 7వ ప్రపంచ క్యారమ్ ఛాంపియన్‌షిప్‌లో ఏ దేశ జట్టును ఓడించి ఇండియా పతకాన్ని గెలుచుకుంది?
1) బంగ్లాదేశ్
2) జపాన్
3) శ్రీలంక
4) సింగపూర్
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఇండియాకు చెందిన ఎస్.అపూర్వ, కాజోల్ కూమారి శ్రీలంక జట్టును ఓడించి బంగారు పతకాన్ని సాధించారు.
- సమాధానం: 3
48. ఇటీవల ఫార్చూన్ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఈ యేటి మేటి వ్యాపార వేత్త ఎవరు?
1) లారీ పేజ్
2) మార్క్ జుకర్ బర్గ్
3) సత్య నాదెళ్ల
4) జెఫ్ బిజోస్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఈ నివేదికలో తొలి స్థానంలో ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్, రెండో స్థానంలో అమెజాన్ సీఈఓ జెఫ్ బిజోస్, మూడో స్థానంలో మారి దిల్లాన్ (Utra Beauty ,CEO), నాల్గో స్థానంలో లారీ పేజ్ (CEO, Alphabet), 5వ స్థానంలో సత్య నాదెళ్ల (micosoft, CEO) ఉన్నారు.
- సమాధానం: 2
49. ప్రతిష్టాత్మక గ్లోబల్ సిటిజన్ పురస్కారానికి ఎంపికైంది ఎవరు?
1) సతీష్ రెడ్డి
2) సుదర్శనమ్ శర్మ
3) రహమత్ ఆలీ
4) ఇంతీయాజ్ సోలిమన్
- View Answer
- సమాధానం: 4
వివరణ: లండన్‌లో జరిగిన 10వ గ్లోబల్ రెసిడెన్స్, సిటిజన్ కాన్ఫరెన్స్‌లో గివర్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు భారత సంతతికి చెందిన దక్షిణాఫ్రికా పౌరుడు ఇంతియాజ్ సోలిమన్కు గ్లోబల్ సిటిజన్ పురస్కారాన్ని ప్రదానం చేశారు.
- సమాధానం: 4