కరెంట్ అఫైర్స్ (నవంబర్ 25 -31) బిట్ బ్యాంక్
1. ఇటీవల సరోగసీ వ్యాపారంనుపూర్తిగా నిషేదించిన దేశం ఏది?
1) శ్రీలంక
2) భారత్
3) నేపాల్
4) బంగ్లాదేశ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: భారతదేశంలో సరోగసీ వ్యాపారాన్ని పూర్తిగా నిషేధించారు. నిస్వార్థంతో కూడిన సరోగసీకి మాత్రమే అనుమతి ఇచ్చారు. మహిళలు దోపిడీకి గురికాకుండా రక్షణ కల్పించటం, సరోగసీ ద్వారా పుట్టిన పిల్లల హక్కులను కాపాడటం ఈ చట్టం ముఖ్య ఉద్దేశం.
- సమాధానం: 2
2. ఇటీవల ‘షాంఘై ఉత్సవం’ 2016ను ఎక్కడ నిర్వహించారు?
1) షాంఘై
2) న్యూఢిల్లీ
3) ఇంఫాల్
4) ఐజ్వాల్
- View Answer
- సమాధానం: 3
వివరణ: పర్యాటక రంగ అభివృద్ధి కోసం మణిపూర్ ప్రభుత్వంషాంఘై ఉత్సవాలను ఇంఫాల్‌లో ‘డెస్టినేషన్ మణిపూర్’ అనే థీమ్‌తో నిర్వహించింది.
- సమాధానం: 3
3. దేశంలో అతిపెద్ద ఎక్స్‌ప్రెస్ హైవేను ఏ ప్రాంతాల మధ్య ప్రారంభించారు?
1) ఆగ్రా - లక్నో
2) ఢిల్లీ - ముంబయి
3) న్యూఢిల్లీ - కన్యా కూమారి
4) కోల్‌కతా - భువనేశ్వర్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఆగ్రా-లక్నోల మధ్య 302 కి.మీ. మేర ఆరు లేన్ల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేను ప్రారంభించారు. జెట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను కూడా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడానికి అనువుగా దీనిని నిర్మించారు.
- సమాధానం: 1
4. వాతవరణ మార్పు ఇండెక్స్-2017లో భారత్ స్థానం?
1) 8
2) 12
3) 16
4) 20
- View Answer
- సమాధానం: 4
వివరణ: జర్మనీకి చెందిన Germanwatch and Climate Action Network, యురోప్ పబ్లికేషన్ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం ఇండియా ర్యాంకు 20. అర్జెంటీనా 36, బ్రెజిల్ 40 ర్యాంకులతో ఉన్నాయి.90%Co2 ఉద్గారాలు అభివృద్ధి చెందిన, చెందుతున్న 58 దేశాల నుంచే వెలువడుతున్నట్లు ఈ సంస్థ ప్రకటించింది.
- సమాధానం: 4
5. నేషనల్ జియోగ్రాఫిక్ ట్రావెల్ మేగజీన్ ప్రకటించిన జాబితాలో మొదటి స్థానంలో ఉన్న ప్రాంతం ఏది?
1) యాంకరెజ్
2) బజా కాలిఫోర్నియా జాతీయ సముద్ర పార్క్
3) బ్యాన్ఫ్
4) అల్బర్టా
- View Answer
- సమాధానం: 1
వివరణ: ప్రపంచంలో అత్యుత్తమ నగరాల ప్రకృతి, సంస్కృతికి సంబంధించిన విషయాలను పరిగణనలోకి తీసుకొని ఈ నివేదిక తయారు చేశారు. ఈ నివేదికలో తొలిస్థానంలో యాంకరెజ్ పోర్ట్ (USA), రెండో స్థానంలో బజా కాలిఫోర్నియా జాతీయ సముద్ర పార్క్ (మెక్సికో) మూడు, నాల్గో స్థానాల్లో బ్యాన్ఫ్, ఆల్బర్టా (కెనడా), కాంటన్ (స్విట్జర్లాండ్) ఉన్నాయి.
- సమాధానం: 1
6. ఆసియా -పసిఫిక్ ఆర్థిక సహకార సమావేశం-2016 ను ఎక్కడ నిర్వహించారు?
1) లీమా
2) బీజింగ్
3) సిడ్నీ
4) కాంటన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: "Quality growth and human development " అనే థీమ్‌తో ఈ సమావేశాన్ని పెరు రాజధాని లీమాలో నిర్వహించారు.
- సమాధానం: 1
7. ప్రపంచంలో తొలి బాలీవుడ్ థీమ్ పార్క్ ఎక్కడ ప్రారంభించారు?
1) న్యూఢిల్లీ
2) బీజింగ్
3) దుబాయి
4) టెల్ అవివ్
- View Answer
- సమాధానం: 3
8. ఇటీవల ‘ఇస్లామిక్ బ్యాంకింగ్’ ఏర్పాటుకు అనుమతి ఇచ్చిన దేశం ఏది?
1) ఇరాన్
2) భారత్
3) ఇండోనేషియా
4) ఇజ్రాయిల్
- View Answer
- సమాధానం: 2
వివరణ: సాధారణ బ్యాంకుల్లో ‘ఇస్లామిక్ విండో’ ఏర్పాటుకు ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. ఈ వ్యవస్థలో వడ్డీ రహిత లావాదేవీలు నిర్వహిస్తారు.
- సమాధానం: 2
9. ''Gem and jewellery export promotion council" 2018నకు వైస్‌చైర్మన్‌గా ఎంపికైన దేశం ఏది?
1) దక్షిణాఫ్రికా
2) ఆస్ట్రేలియా
3) వెనెజులా
4) భారత్
- View Answer
- సమాధానం: 4
వివరణ: Kimberley Process Certification Scheme సంస్థకు వ్యవస్థాపక సభ్యత్వ దేశం ఇండియా. 2018నకు ఈ సంస్థకు వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తుంది.
- సమాధానం: 4
10. ఉమెన్ ఇన్ ఇండియా-అన్ హియర్డ్ స్టోరిస్ పేరుతో వర్చ్యువల్ ఎగ్జిబిషన్ ప్రారంభించిన సంస్థ ఏది?
1) గూగుల్
2) ఫేస్బుక్
3) ఇన్స్టాగ్రామ్
4) ట్విట్టర్
- View Answer
- సమాధానం: 1
వివరణ: గూగుల్ ఆర్ట్స్ అండ్ క ల్చర్ విభాగం ఇండియాలో ప్రముఖ స్త్రీల చరిత్రను ఫోటోగ్రాఫ్, వీడియోలతో ఏర్పాటు చేసిన వర్చువల్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించింది. సింధూ నాగరికతలోని మాతృదేవత నుంచి ప్రస్తుత నాయకులు, కళాకారులు, డాక్టర్ల ఫోటోలను ప్రదర్శించారు.
- సమాధానం: 1
11. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని ఏ ప్రాంతంలో 5 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌ను ప్రారంభించారు?
1) విజయవాడ
2) అమరావతి
3) గొల్లగూడెం
4) మంగళంపల్లి
- View Answer
- సమాధానం: 3
వివరణ: పశ్చిమ గోదావరి జిల్లాలోని గొల్లగూడెం గ్రామంలో 37 ఎకరాల విస్తీర్ణంలో రూ.37.58 కోట్లు వ్యయంతో 5 MW సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ ప్లాంట్ ద్వారా ప్రతి సంవత్సరం 8.06 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.
- సమాధానం: 3
12. ‘INS చెన్నై’ను నిర్మించిన షిప్ బిల్డింగ్ సంస్థ ఏది?
1) మజగావ్ డాక్
2) కొచ్చిన్ షిప్‌యార్డ్
3) హిందుస్థాన్ షిప్‌యార్డ్
4) గార్డెన్ రీచ్ షిప్‌యార్డ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ‘INS చెన్నై’ ను మజగావ్‌డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ నిర్మించింది. ఇది కోలకతా తరగతికి చెందిన చివరి గెడైడ్ క్షిపణి విధ్వంసక నౌక. ఈ షిప్లో బ్రహ్మోస్, బరాక్-8 క్షిపణులను మొహరించారు. ఈ నౌక పశ్చిమ నావెల్ కమాండ్‌లో విధులు నిర్వహిస్తుంది.
- సమాధానం: 1
13. జికా వైరస్‌ను నిరోధించడానికి ‘జికా రెప్లికాన్ వ్యవస్థ’ను అభివృద్ధి చేసిన సంస్థ ఏది?
1) యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్
2) సౌత్ వెస్ట్ యూనివర్సిటీ ఆఫ్ చాంగ్ కింగ్
3) ది యూనివర్సిటీ ఆఫ్ లీవెన్
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
వివరణ: రిప్లికాన్ వ్యవస్థలో వైరస్ తన లాంటి వైరస్‌ను ఉత్పత్తి చేసుకుంటుంది. ఈ వ్యవస్థలో ఉన్నప్పుడు కొన్ని జీన్లను నాశనం చేయడం వలన వైరస్ ప్రమాద రహితంగా మారుతుంది.
- సమాధానం: 4
14. మొదటి బార్క్లేస్ ATP ప్రపంచ టూర్ టైటిల్‌ను గెలుచుకుంది ఎవరు?
1) ఆండీ ముర్రే
2) నోవాక్ జకొవిచ్
3) రోజర్ ఫెదరర్
4) నాదల్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఈ పోటలో నోవాక్ జకొవిచ్ను ఓడించి ఆండిముర్రే విజేతగా నిలిచాడు.
- సమాధానం: 1
15. అంతర్జాతీయ మహిళలపై హింస నిర్మూలన దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?
1) నవంబర్ 20
2) నవంబర్ 25
3) నవంబర్ 30
4) డిసెంబర్ 5
- View Answer
- సమాధానం: 2
16. ‘14వ ప్రవాసీ భారతీయ దివస్’ 2017కు ముఖ్య అతిధి ఎవరు?
1) ఫ్రాంకొయిస్ హొలాండ్
2) కీత్ రోలే
3) ఆంటోనియో కొస్టా
4) w. డేవ్ కామరూన్
- View Answer
- సమాధానం: 3
వివరణ: బెంగళూరులో జరిగే 14వ ప్రవాసీ భారతీయ దివస్ 2017కు ముఖ్య అతిథిగా పోర్చుగల్ ప్రధాన మంత్రి అంటోనియో కొస్టా రానున్నారు. సురినామ్ దేశ ఉపాధ్యక్షుడు మైఖెల్ ఆశ్విన్ ఆదిన్ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరుకానున్నారు.
- సమాధానం: 3
17. కేంద్ర విద్యా-పరిశోధన సంస్థల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎంత మూలధనం కేటాయించింది?
1) రూ.500 కోట్లు
2) రూ. 1000 కోట్లు
3) రూ.1500 కోట్లు
4) రూ.2000 కోట్లు
- View Answer
- సమాధానం: 2
వివరణ: కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో, ఆర్థిక సహాయంతో నడిచే సంస్థల్లో ఆవస్థాపన, పరిశోధన సౌకర్యాల కల్పన కోసం హైయ్యర్ ఎడ్యుకేషన్ ఫైనాన్సింగ్ ఏజెన్సీ (HEFA) ని రూ.1000 కోట్లతో ఏర్పాటు చేశారు.
- సమాధానం: 2
18. ఇటీవల యురోపియన్ ఆర్గైనె జేషన్ ఫర్ న్యూక్లియర్ రిసెర్చ్ (CERN)లో అసోసియేట్ సభ్యురాలుగా చేరిన దేశం ఏది?
1) కెనడా
2) ఆస్ట్రేలియా
3) ఇండియా
4) చైనా
- View Answer
- సమాధానం: 3
19. ప్రపంచంలో అత్యంత ఖరీదైన చిల్లర వ్యాపారం జరిగే ప్రాంతం ఏది?
1) అప్పర్ 5 అవెన్యూ
2) కాజ్వే బే
3) న్యూ బాండ్ స్ట్రీట్
4) గింజా
- View Answer
- సమాధానం: 1
వివరణ: ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ కుష్మాన్ అండ్ వేక్ ఫిల్డ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం న్యూయార్క్‌కు చెందిన అప్పర్ 5 అవెన్యూ అత్యంత ఖరీదైన చిల్లర వ్యాపార ప్రాంతంగా నిలిచింది. తర్వాత స్థానాల్లో కాజ్వే బే, అవెన్యూడెస్ చాంప్స్ ఏల్య్సీస్, న్యూ బ్రాండ్ స్ట్రీట్, గింజా. ఈ జాబితాలో ఢిల్లీలోని ఖాన్ మార్కెట్ 28వ స్థానంలో ఉంది.
- సమాధానం: 1
20. మొట్ట మొదటి ప్రపంచ సంసృ్కత పురస్కారం 2015నకు ఎంపికైంది ఎవరు?
1) రామ్ కరణ్ శర్మ
2) శతవధాని గణేష్
3) మధిలా ప్రసాద్ త్రిపాఠి
4) మహచక్రి సిరిందోర్న్
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్ సంస్కృత పురస్కారాలను ప్రారంభించింది. మొదటి ప్రపంచ సంస్కృత పురస్కారం 2015నకు థాయ్‌లాండ్ యువరాణి మహచక్రి సిరిందోర్న్ ఎంపికైంది. రెండో సంస్కృత పురస్కారానికి అమెరికన్ లింగ్విస్ట్, ఇండాలజిస్ట్ ప్రొఫెసర్ జార్జ్ కార్డ్నా ఎంపికయ్యారు.
- సమాధానం: 4
21. ఇంటర్ ఫెయిత్ లీడర్షిప్ పురస్కారానికి ఎంపికైంది ఎవరు?
1) సలీమ్ ఉద్ దిన్
2) డేవిడ్ శర్మ
3) డా. సంగీత భాటియా
4) ఫ్రాంక్ ఇస్లాం
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఈ పురస్కారాన్ని ఇంటర్ ఫెయిత్ కాన్ఫరెన్స్ ఆఫ్ మెట్రోపాలిటన్ వాషింగ్టన్ ప్రారంభించింది. భారత సంతతికి చెందిన పారిశ్రామిక వేత్త ఫ్రాంక్ ఇస్లామ్ ది ఇంటర్ ఫెయిత్ లీడర్ షిప్ పురస్కారానికి ఎంపికయ్యాడు.
- సమాధానం: 4
22. ప్రతిష్టాత్మక భట్ పుస్తక పురస్కారం 2016నకు ఎంపికైంది ఎవరు?
1) అక్షయ్ ముకుల్
2) రవిష్ కుమార్
3) సాగరికా గౌస్
4) రాజ్దిప్ సర్దేశాయ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: Times of India సీనియర్ జర్నలిస్టు అక్షయ్ రాసిన "Geeta press and making of hindu India " పుస్తకానికి శక్తి భట్ పురస్కారం లభించింది. ఈ పురస్కారం కింద రూ.2 లక్షల నగదు బహుమతి లభిస్తుంది.
- సమాధానం: 1
23. ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ ప్రదానం చేసే ఇన్ఫోసిస్ పురస్కారం-2016నకు ఎంపికైంది ఎవరు?
1) ప్రొ.వి. కుమారన్
2) ప్రొ. సునిల్ అమరిత్
3) డా. గగన్‌దీప్ కాంగ్
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఈ పురస్కారాలు 6 కేటగిరిల్లో ్రపదానం చేస్తారు. అవి కంప్యూటర్ సైన్స్, హ్యుమనిటిస్, లైఫ్ సైన్స్, గణితం, భౌతిక శాస్త్రం, సాంఘిక శాస్త్రం. ఈ పురస్కారాలకు ఎంపికైన ప్రతి ఒక్కరికి రూ.65 లక్షల నగదు బహుమతి, 22 క్యారెట్ల గోల్డ్ మెడల్, ప్రశంసా పత్రం ఇస్తారు. కంప్యూటర్ సైన్స్‌లో ప్రొ.వి.కుమరన్, హ్యుమానిటీస్‌లో సునిల్ అమారిత్, లైఫ్ సైన్స్‌లో డా. గగన్‌దీప్, గణితంలో అక్షయ వెంకటేష్, భౌతిక శాస్త్రంలో అనిల్ భరద్వాజ్, సాంఘిక శాస్త్రంలో ప్రొ. కైరన్ మున్షీ ఈ పురస్కారాలకు ఎంపికయ్యారు.
- సమాధానం: 4
24. ఫిక్కికి నూతన అధ్యక్షుడుగా ఎంపికైంది ఎవరు?
1) హర్షవర్ధన్ నెఓతి
2) పంకజ్ పటెల్
3) స్వాతి పిరమల్
4) ప్రకాష్ హిందుజా
- View Answer
- సమాధానం: 2
వివరణ: ప్రస్తుత ఫిక్కి చైర్మన్ హర్షవర్ధన్ నియోటీ స్థానంలో నూతన అధ్యక్షుడుగా పంకజ్ పటేల్ ఎంపికయ్యాడు.
- సమాధానం: 2
25. జాతీయ పాల దినోత్సవంను ఏ రోజున నిర్వహిస్తారు?
1) నవంబర్ 14
2) నవంబర్ 20
3) నవంబర్ 26
4) నవంబర్ 30
- View Answer
- సమాధానం: 3
వివరణ: 26 నవంబర్, 2014న తొలిసారి శ్వేత విప్లవ పితామహుడు వర్గీస్ కురియన్ జన్మదినంను జాతీయ పాల దినోత్సవంగా జరుపుకున్నారు.
- సమాధానం: 3
26. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు?
1) నవంబర్ 20
2) నవంబర్ 26
3) నవంబర్ 30
4) డిసెంబర్ 6
- View Answer
- సమాధానం: 2
వివరణ: 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ, రాజ్యాంగంను ఆమోదించింది. 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమలులోకి వచ్చింది. నవంబర్ 19, 2015న భారత ప్రభుత్వం నవంబర్ 26ను రాజ్యాంగ దినంగా జరుపుకోవాలని నిర్ణయించింది.
- సమాధానం: 2
27. 68వ ఎన్సీసీ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహించారు?
1) నవంబర్ 18
2) నవంబర్ 22
3) నవంబర్ 27
4) నవంబర్ 30
- View Answer
- సమాధానం: 3
28. దేశంలో తొలి ఈ- విధాన్ వ్యవస్థను ఏ నియోజక వర్గంలో ప్రారంభించారు?
1) పాలంపూర్
2) పాలమూరు
3) పాత ఢిల్లీ
4) వడోదర
- View Answer
- సమాధానం: 1
వివరణ: పేపర్ రహిత పాలన, డిజిటల్ ఇండియాలో భాగంగా హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పాలంపూర్ నియోజక వర్గంలో తొలి ఈ-విధాన్ వ్యవస్థను ప్రారంభించారు.
- సమాధానం: 1
29. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు చక్రాల వాహనాలకు ‘ఆటో-డిప్పర్’ను తప్పనిసరి చేసింది?
1) తెలంగాణ
2) కర్ణాటక
3) ఛత్తీస్‌ఘడ్
4) హర్యానా
- View Answer
- సమాధానం: 4
వివరణ: కేంద్ర మోటార్ వాహనాల చట్టం 1989, రూల్ నెం 106 ప్రకారం హర్యానా రాష్ట్రం నాలుగు చక్రాల వాహనాలకు ఆటో డిప్పర్ తప్పనిసరి చేసింది.
- సమాధానం: 4
30. ‘5వ అంతర్జాతీయ పర్యాటక రంగ మార్ట్’ను ఎక్కడ నిర్వహించారు?
1) గోవా
2) ఇంఫాల్
3) షిల్లాంగ్
4) కన్యాకుమారి
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఈశాన్య రాష్ట్రాల్లో పర్యాటక రంగ అభివృద్ధి కోసం, దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించటం కోసం ప్రతి సంవత్సరం దీనిని నిర్వహిస్తారు.
- సమాధానం: 2
31. ఇటీవల ఎయిర్టెల్ మొదటి పేమెంట్ బ్యాంక్‌ను ఎక్కడ ఏర్పాటు చేసింది?
1) మహారాష్ట్ర
2) తమిళనాడు
3) రాజస్థాన్
4) పశ్చిమ బెంగాల్
- View Answer
- సమాధానం: 3
వివరణ: రాజస్థాన్‌లో ఎయిర్ టెల్ తొలి పేమెంట్ బ్యాంక్‌ను ప్రారంభించింది. ఆధార్ కార్టు అనుసంధానంతో అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. ఖాతాదారుడు మొబైల్ నెంబర్ అతడి అకౌంట్ నెంబర్‌గా పనిచేస్తుంది. ఈ బ్యాంక్‌లో ఖాతాదారుడికి 7.25% వడ్డీ, 1 లక్ష ప్రమాద బీమా ఇస్తారు.
- సమాధానం: 3
32. ఇటీవల బీబీసీ విడుదల చేసిన అత్యంత ప్రభావితం చేసే స్త్రీల జాబితా 2016లో టాప్ 100లో చోటు సంపాదించుకున్న భారతీయ మహిళ ఎవరు?
1) చందా కొచ్చర్
2) అరుంధతీ భట్టా చార్య
3) సన్నీ లియోన్
4) దీపికా పదుకొనె
- View Answer
- సమాధానం: 3
వివరణ: బీబీసీ గత 4 సంవత్సరాల్లో స్త్రీలు వారి రంగాల్లో చేసిన కృషిని గుర్తిస్తూ ఈ జాబితాను తయారు చేసింది. ఈ జాబితాలో సన్నిలియోన్‌తో పాటు మరో నలుగురు భారతీయ మహిళలు ఎంపికయ్యారు. వారు గౌరి చిందార్కర్ (School in the cloud), మల్లిక శ్రీనివాసన్ (TAFE), నేహసింగ్, సాలు మరద తిమ్మక్క. పర్యావరణవేత్త సాలు మరద తిమ్మక్క గత 80 సంవత్సరాల్లో 8000ల మొక్కలు నాటింది.
- సమాధానం: 3
33. ప్రతిష్టాత్మక ‘అంతర్జాతీయ పత్రిక స్వేచ్ఛ’ పురస్కారానికి ఎంపికైంది ఎవరు?
1) మాలిని సుబ్రమణ్యం
2) ఆరోన్ పూరీ
3) ఆయేషా ఫారిది
4) వర్షా భోంస్లే
- View Answer
- సమాధానం: 1
వివరణ: ‘ కమిటీ టు ప్రొటెక్షన్ జర్నలిస్టు’ సంస్థ పత్రికా స్వేచ్ఛ పురస్కారాన్ని ప్రదానం చేస్తుంది. నక్సల్ ప్రభావిత ప్రాంతం( బ్రస్తర్)లో పోలీసుల దౌర్జన్యాలు, మహిళలపై లైంగిక హింస, మైనర్లను ఆకారణంగా జైలులో పెట్టడం, చట్ట వ్యతిరేక హత్యలు, జర్నలిస్టుల మీద దాడులు వంటి సమాచారంను ప్రాణాలకు తెగించి సేకరించినందుకు మాలిని సుబ్రమణ్యంకు ఈ పురస్కారం ప్రదానం చేశారు.
- సమాధానం: 1
34. నేషనల్ హైవే ఆథారిటీ ఆఫ్ ఇండియాకు నూతన చైర్మన్‌గా ఎంపికైంది ఎవరు?
1) రాఘవ్ చంద్ర
2) యుద్ధ్ వీర్ సింగ్ మాలిక్
3) నందన్ శర్మ
4) అబ్దుల్ మరా
- View Answer
- సమాధానం: 2
35. 13వ ప్రపంచ రోబోట్ ఓలింపియాడ్ను ఎక్కడ నిర్వహించారు?
1) ఇజ్రాయిల్
2) టర్కీ
3) కెనడా
4) భారత్
- View Answer
- సమాధానం: 4
వివరణ: గ్రేటర్ నోయిడాలో నిర్వహించిన ఒలింపియాడ్‌కు 54 దేశాల నుంచి 2000 మంది ప్రతినిధులు హాజరయ్యారు. రోబోటిక్ టెక్నాలజీని వాడి చెత్త నిర్వహణ, తగ్గించటం, రీసైకిల్‌కు సరైన మార్గాన్ని అన్వేషించటం వంటి అంశాలను ఈ సభలో చర్చించారు. ఇండియా స్టెమ్ ఫౌండేషన్ జాతీయ సైన్స్ మ్యూజియం కౌన్సిల్‌తో కలిసి ఈ సమావేశాన్ని నిర్వహించింది.
- సమాధానం: 4
36. అంతర్జాతీయ పాలస్తీనా ప్రజల సంఘీభావ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?
1) నవంబర్ 15
2) నవంబర్ 19
3) నవంబర్ 25
4) నవంబర్ 29
- View Answer
- సమాధానం: 4
37. ‘వంగల ఉత్సవం’ ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు?
1) పంజాబ్
2) గుజరాత్
3) మేఘాలయ
4) ఒడిశా
- View Answer
- సమాధానం: 3
వివరణ: మేఘాలయలోని గారో తెగల ప్రజలు పంటలు బాగా పండాలని సూర్య దేవుని పూజిస్తూ వంగల పండుగను జరుపుకుంటారు.
- సమాధానం: 3
38. QS గ్రాడ్యుయేట్ ఉపాధి ర్యాంకింగ్ 2017 జాబితాలో తొలిస్థానంలో ఉన్న సంస్థ ఏది?
1) స్టాన్‌ఫర్డ్
2) మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
3) సింఘా యూనివర్సిటీ
4) ది యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఈ జాబితాలో తొలిస్థానంలో స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ, రెండో స్థానంలో మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మూడో స్థానంలో సింఘా యూనివర్సిటీ, నాల్గో స్థానంలో ది యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ ఉన్నాయి. ఇండియా నుంచి IIT ఖరగ్‌పూర్ 81-90వ స్థానంలో ఉంది.
- సమాధానం: 1
39. షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశం 2017నకు నాయకత్వం వహించే దేశం ఏది?
1) ఇజ్రాయిల్
2) చైనా
3) టర్కీ
4) రష్యా
- View Answer
- సమాధానం: 3
వివరణ: 2017లో జరిగే Shanghai cooperation organization energy club కు టర్కీ నాయకత్వం వహించనుంది.
- సమాధానం: 3
40. ఇటీవల ICC హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు సంపాదించుకున్న మహిళ ఎవరు?
1) సారా టైలర్
2) కరెన్ రొల్టెన్
3) ఈసోబెల్ జాయిసీ
4) రోసాలై బిర్చ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ICC హాల్ ఆఫ్ ఫెమ్లో చోటు సంపాదించుకున్న కరెన్ రొల్టెన్ 81వ వ్యక్తి, 6వ మహిళ.
- సమాధానం: 2
41. రూ. 500, రూ. 10 నాణేలను కేంద్ర ప్రభుత్వం ఎవరి గౌరవార్థం విడుదల చేసింది?
1) గురుగోవింద్ సింగ్
2) చైతన్య ప్రభు
3) కబీర్
4) మిదాచాయ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: శ్రీ చైతన్య ప్రభు 500వ జయంతి సందర ్భంగా రూ. 500, రూ. 10 నాణేలను కేంద్ర సాంస్కృతిక శాఖ విడుదల చేసింది.
- సమాధానం: 2
42. 10వ ఆసియా - పసిఫిక్ స్క్రీన్ పురస్కారాలలో ఉత్తమ ప్రదర్శన పురస్కారానికి ఎంపికైంది ఎవరు?
1) షారుఖ్ ఖాన్
2) నసీరుద్దీన్ షా
3) ఓంపురి
4) మనోజ్ బాజ్‌పేయి
- View Answer
- సమాధానం: 4
వివరణ: 10వ ఆసియా-పసిఫిక్ స్క్రీన్ పురస్కారాలు బ్రిస్బేన్‌లో జరిగాయి. ‘ఆలిఘర్ ’ సినిమాలో నటనకుగాను మనోజ్ బాజ్‌పేయి ఉత్తమ ప్రదర్శన పురస్కారానికి ఎంపికయ్యాడు.
- సమాధానం: 4
43. ‘‘ Rajiv Murder: Hidden Truths and Priyanka-Nalini Meeting’’ పేరుతో పుస్తకాన్ని రాసింది ఎవరు?
1) నళిని శ్రీహరన్
2) ప్రియాంక గాంధీ
3) వైగో
4) ఏకలవ్యన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: నళిని శ్రీహరన్ తన జీవిత చరిత్రను ఈ పేరుతో రాసింది. ఇందులో తన జీవితం, రాజీవ్‌గాంధీ హత్య గురించి ఉన్నాయి. ఈ పుస్తక రచనలో సహాయం చేసిన వ్యక్తి ఏకలవ్యన్.
- సమాధానం: 1
44. దేశంలో అంతర్జాతీయ పిల్లల ఉత్సవం విండ్మిల్-2017ను ఎక్కడ నిర్వహించనున్నారు?
1) హైదరాబాద్
2) బెంగళూరు
3) ముంబయి
4) కోల్‌కతా
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఈవెంట్ క్యాపిటల్, ట్రైబ్ ఏషియా సంస్థలు సంయుక్తంగా విండ్మిల్ అంతర్జాతీయ పిల్లల ఉత్సవాలను ముంబయిలో నిర్వహించనున్నాయి. తొలి ఉత్సవాలను బెంగళూరులో 2015లో నిర్వహించారు.
- సమాధానం: 3
45. ఇటీవల ఏ నగరంలో టపాసుల అమ్మకంపై సుప్రీం కోర్టు నిషేధం విధించింది?
1) ముంబయి
2) న్యూఢిల్లీ
3) కోల్‌కతా
4) చెన్నై
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఢిల్లీలో వాతావరణ కాలుష్య తీవ్రత పెరగడంతో టపాసుల క్రయ విక్రయాలపై నిషేధం విధించారు.
- సమాధానం: 2
46. ఇటీవల ‘‘ అన్నపూర్ణ రసోయి’’ పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది?
1) గోవా
2) బీహార్
3) మహారాష్ట్ర
4) రాజస్థాన్
- View Answer
- సమాధానం: 4
వివరణ: బడుగు బలహీన వర్గాల వారికి తక్కువ ధరతో పోషకాహారం అందించాలనే లక్ష్యంతో రాజస్థాన్ ప్రభుత్వం ఈ పథకంను ప్రారంభించింది.
- సమాధానం: 4
47. ఏ దేశ శాస్త్రవేత్తలు కృత్రిమ 3డీ ఊపిరితిత్తుల మోడల్‌ను తయారు చేశారు?
1) ఇండియా
2) చెక్ రిపబ్లిక్
3) ఆస్ట్రేలియా
4) జర్మనీ
- View Answer
- సమాధానం: 2
వివరణ: చెక్ రిపబ్లిక్కు చెందిన బర్నో యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఈ 3డీ మోడల్ ఊపిరితిత్తులను తయారుచేశారు. దీని వలన ఆస్త్మా, ఉబ్బసం వంటి వ్యాధుల నివారణ, చికిత్స సులభతరం అవుతుంది.
- సమాధానం: 2
48. అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్ (IBA) నుంచి ‘‘ లెజెండ్ పురస్కారం’’ అందుకున్న బాక్సర్ ఎవరు?
1) మేరీకోమ్
2) సరితా దేవి
3) విజేందర్ సింగ్
4) వికాస్ యాదవ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్‌లో ఉంది. ఈ సంస్థ 1946లో ఏర్పాటు చేశారు.
- సమాధానం: 1
49. భారతదేశంలో తొలి నీటి ఉత్సవాలు ఎక్కడ నిర్వహించారు?
1) విశాఖ పట్నం
2) కొచ్చి
3) పూణె
4) మంగళూరు
- View Answer
- సమాధానం: 3
వివరణ: పూణెకు చెందిన ‘ఫిన్కిక్ అడ్వెంచర్ సంస్థ’ ఈ ఉత్సవాలు ప్రారంభించింది. సముద్ర జీవుల ఆవాసం, వాటి ఆవశ్యకతను ప్రజలకు తెలియజేయటానికి, వాటి సంరక్షణ కోసం ఈ ఉత్సవాలు నిర్వహించారు.
- సమాధానం: 3
50. ప్రతిష్టాత్మక యునెస్కో సలోన్ పోటీలో ఉత్తమ షార్ట్ ఫిల్మ్‌గా ఎంపికైనది ఏది?
1) ఆగస్య
2) మ్యూజికల్ పియనో
3) డార్క్ ఐలాండ్
4) ఒక రాత్రి
- View Answer
- సమాధానం: 2
వివరణ: Toonz media group తీసిన షార్ట్ ఫిల్మ్ ‘మ్యూజికల్ పియనో’ యునెస్కో సలోన్ యూత్ వీడియో పోటీలు-2016 నకు ఎంపికైంది.
- సమాధానం: 2