కరెంట్ అఫైర్స్ (నవంబర్ 1 - 8) బిట్ బ్యాంక్
1. ఇటీవల ఏ భారతీయ పండుగను ఐక్యరాజ్యసమితి తొలిసారిగా నిర్వహించింది?
1) దసరా
2) దీపావళి
3) గుడిపడ్వ
4) సంక్రాంతి
- View Answer
- సమాధానం: 1
వివరణ: UNO ప్రధాన కార్యాలయంలో తొలిసారిగా దీపావళి పండుగను నిర్వహించారు.
- సమాధానం: 1
2. మొదటి జాతీయ వాణిజ్య సులభతర కమిటీ సమావేశం ఎక్కడ నిర్వహించారు?
1) ముంబయి
2) హైదరాబాద్
3) న్యూఢిల్లీ
4) కోల్‌కతా
- View Answer
- సమాధానం: 3
వివరణ: ప్రపంచ వాణిజ్య సంస్థ వ్యాపార సులభతర ఒప్పందంను దేశంలో అమలు చేయడానికి NCTF రోడ్ మ్యాప్‌ను తయారు చేసింది. మొదటి నేషనల్ కమిటీ ఆన్ ్రటేడ్ ఫెసిలిటేషన్ సమావేశాన్ని పి.కె.సిన్హా అధ్యక్షతన న్యూఢిల్లీలో నిర్వహించారు.
- సమాధానం: 3
3. ఇటీవల నీతి అయోగ్ ఏ రాష్ట్రంను రైతులకు అత్యంత అనుకూలమైన రాష్ట్రంగా గుర్తించింది?
1) మహారాష్ట్ర
2) గుజరాత్
3) రాజస్థాన్
4) తెలంగాణ
- View Answer
- సమాధానం: 1
వివరణ: నీతి అయోగ్ ఫార్మింగ్ ఇండెక్స్‌ను తయారుచేసింది. ఈ నివేదికలో తొలిస్థానంలో మహారాష్ట్ర, త ర్వాతి స్థానాల్లో గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హర్యానా ఉన్నాయి.
- సమాధానం: 1
4. పాలస్తీనాలోని రమల్లాలో టెక్నోపార్క్‌ను ఏర్పాటు చేయనున్న దేశం ఏది?
1) ఇజ్రాయిల్
2) యుఎస్ఏ
3) చైనా
4) ఇండియా
- View Answer
- సమాధానం: 4
వివరణ: పాలస్తీనాలో ఇండియాటెక్నోపార్క్ను నిర్మించనుంది. దీని ద్వారా నూతన ఉద్యోగాల కల్పన, వ్యాపార అభివృద్ధి, యువ పాలస్తీనియన్లకు వ్యాపార అవకాశాలు లభిస్తాయి.
- సమాధానం: 4
5. ఇటీవల ఏ రాష్ట్రం ఏర్పడి 50 సంవత్సరాలు పూరైన సందర్భంగా స్వర్ణోత్సవాలు జరుపుకుంది?
1) ఆంధ్రప్రదేశ్
2) హర్యానా
3) మధ్యప్రదేశ్
4) మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 2
వివరణ: 1966 నవంబర్ 1న పంజాబ్ నుంచి హర్యానా రాష్ట్రం ఏర్పడింది. 2016కు 50 సంవత్సరాలు పూర్తి కావడంతో స్వర్ణోత్సవాలు నిర్వహించారు. దేశంలో నవంబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవాలు జరుపుకునే రాష్ట్రాలు ఏడు. అవి. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, హర్యానా, కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్.
- సమాధానం: 2
6. ఇటీవల కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ కూలీలకు దినసరి కనీస వేతనం ఎంత నిర్ణయించింది?
1) రూ. 350
2) రూ. 280
3) రూ. 250
4) రూ. 160
- View Answer
- సమాధానం: 1
వివరణ: ప్రస్తుతం వ్యవసాయ కార్మికులకు రూ.160 దినసరి కనీస వేతనం ఇస్తున్నారు. దీనిని కేంద్ర కార్మిక శాఖ రూ.350 లకు పెంచింది.
- సమాధానం: 1
7. ఇటీవల బహిరంగ మలవిసర్జనను పూర్తిగా నిర్మూలించిన రాష్ట్రం ఏది?
1) కేరళ
2) తమిళనాడు
3) తెలంగాణ
4) గోవా
- View Answer
- సమాధానం: 1
వివరణ: స్వచ్ఛ భారత్ మిషన్ కింద దేశంలో బహిరంగ మలవిసర్జనను పూర్తిగా నిర్మూలించిన మొదటి రాష్ట్రం సిక్కిం, రెండవ రాష్ట్రం హిమాచల్‌ప్రదేశ్, మూడవ రాష్ట్రం కేరళ.
- సమాధానం: 1
8. ప్రతిష్టాత్మక రాజారామ్మెహన్ రాయ్ జాతీయ జర్నలిజం పురస్కారం 2016 నకు ఎవరు ఎంపికయ్యారు?
1) బర్ఖాదత్
2) రాజ్‌దీప్ సర్దేశాయ్
3) ర వి శంకర్
4) ఎస్. నిహాల్ సింగ్
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఇండియాలో జర్నలిజం రంగానికి పునాదులు వేసిన వ్యక్తి రాజారామ్మెహన్ రాయ్. ఆయన పేరు మీద జర్నలిజంలో జాతీయ పురస్కారం ఏర్పాటు చేశారు. ఈ పురస్కారం కింద రూ. 1 లక్ష నగదు బహుమతిని ప్రదానం చేస్తారు.
- సమాధానం: 4
9. ఇటీవల స్వచ్ఛ రైల్ మిషన్‌కు సౌహర్థ రాయబారిగా నియమితులైనది ఎవరు?
1) సురేష్ ప్రభు
2) బిందేశ్వర్ పాఠక్
3) యోగేశ్వర్ దత్
4) సాక్షి మాలిక్
- View Answer
- సమాధానం: 2
10. మెక్సికన్ గ్రాండ్ ప్రీ ఫార్ములా వన్ టైటిల్ విజేత ఎవరు?
1) నికో రోస్‌బర్గ్
2) సెబాస్టియన్ వెటెల్
3) లేవిస్ హామిల్టన్
4) డేనియల్ రిక్కియార్డొ
- View Answer
- సమాధానం: 3
11. ఇటీవల ఏ రాష్ట్రం నవంబర్ 1ని ‘‘ పోగాకు వ్యతిరేక దినం’’ గా పాటించింది?
1) హర్యానా
2) ఆంధ్రప్రదేశ్
3) రాజస్థాన్
4) పంజాబ్
- View Answer
- సమాధానం: 4
వివరణ: పంజాబ్‌లో పోగాకు వాడకం తగ్గించడం కోసం సిగరెట్లపై నిషేధం విధించారు. పోగాకు వల్ల వ చ్చే నష్టాల గురించి ప్రజలలో అవగాహన కల్పించటానికి పంజాబ్ నవంబర్ 1న ‘‘పొగాకు వ్యతిరేక దినం ’’ను పాటించింది.
- సమాధానం: 4
12. ప్రపంచ శాఖహార దినోత్సవాన్ని ఏ రోజున నిర్విహ స్తారు?
1) నవంబర్ 1
2) నవంబర్ 3
3) నవంబర్ 5
4) నవంబర్ 9
- View Answer
- సమాధానం: 1
13. ‘‘ సౌర్ సుజల యోజన’’ (Saur Sujala Yojana) ను అమలు చేసిన తొలిరాష్ట్రం ఏది?
1) హర్యానా
2) గుజరాత్
3) ఛత్తీస్‌ఘడ్
4) మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఈ పథకం కింద సోలార్‌తో నడిచే 3 HP, 5 Hp సామర్థ్యం ఉన్న నీటి పంపులను రైతులకు అందిస్తారు. వీటి ధర రూ.3.5 లక్షల నుంచి రూ.4.5 లక్షల వరకు ఉంటుంది. విద్యుత్ సరఫరా లేని మారుమూల ప్రాంతంలో ఈ పథకాన్ని అమలు చేస్తారు.
- సమాధానం: 3
14. ఆసియాలో అతి పెద్ద జంగిల్ సఫారీ ఏది?
1) పాండా సఫారి -చైనా
2) రాయల్ చిత్వన్ జాతీయ పార్క్- నేపాల్
3) నందన్వన్ జూ అండ్ సఫారి
4) రెయిన్ డీర్ సైబీరియా
- View Answer
- సమాధానం: 3
వివరణ: భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆసియాలో అతిపెద్ద జంగిల్ సఫారీని ఛత్తీస్‌ఘడ్‌లో ప్రారంభించారు.నందన్ వన్ జూ అండ్ సఫారి800 ఎకరాల విస్తీర్ణంలో ఉంది.
- సమాధానం: 3
15. ఇండియా ఏ దేశంతో కలిసి నూతన తరం అణురియాక్టర్‌ను అభివృద్ధి చేయనుంది?
1) యూఎస్ఏ
2) యూకే
3) ఫ్రాన్స్
4) రష్యా
- View Answer
- సమాధానం: 4
వివరణ: రష్యా అణుశక్తి కార్పొరేషన్ రోసతోమ్ (Rosatom)తో కలిసి ఇండియా న్యూట్రాన్ రియాక్టరును అభివృద్ధి చేయనుంది.
- సమాధానం: 4
16. దుబాయి అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో జీవితకాల సాఫల్య పురస్కారానికి ఎంపికైంది ఎవరు?
1) జయాబచ్చన్
2) మాధురి దీక్షిత్
3) రేఖ
4) జుహిచావ్లా
- View Answer
- సమాధానం: 3
వివరణ: అంతర్జాతీయ చలన చిత్రోత్సవాన్ని 2004 లో దుబాయ్లోప్రారంభించారు.
- సమాధానం: 3
17. ఇటీవల శాస్త్రవేత్తలు ఏ ప్రాంతంలోఆకుపచ్చని వరిగింజలను కనుగొన్నారు?
1) మహారాష్ట్ర
2) ఛత్తీస్‌ఘడ్
3) తెలంగాణ
4) తమిళనాడు
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఛత్తీస్‌ఘడ్‌లోని దంతరి, దుర్గ జిల్లా రైతులు ఇందిరాగాంధీ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలకు ఆకుపచ్చని వరి విత్తనాల శాంపిల్స్ అందించారు.
- సమాధానం: 2
18. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ బ్యాడి ్మంటన్ టోర్నమెంట్ 2016 విజేత ఎవరు?
1) ప్రతుల్ జోషి
2) ఆదిత్యజోషి
3) సిదార్థ ఠాకూర్
4) ఆనంద్ పవార్
- View Answer
- సమాధానం: 1
వివరణ: బహ్రెయిన్‌లోని సెగయ్య ప్రాంతంలో ‘‘ బహ్రెయిన్ ఇంటర్నెషనల్ బ్యాడి ్మంటన్’’ టోర్నమెంట్‌ను నిర్వహించారు. ఈ టోర్నమెంట్లో ఆదిత్య జోషిని ఓడించి ప్రతుల్ జోషి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ప్రతుల్కి ఇది తొలి అంతర్జాతీయ టైటిల్.
- సమాధానం: 1
19. అంతర్జాతీయ జర్నలిస్టుల హత్యల వ్యతిరేక దినంను ఏ రోజున నిర్వహిస్తారు?
1) నవంబర్ 1
2) నవంబర్ 2
3) నవంబర్ 3
4) నవంబర్ 4
- View Answer
- సమాధానం: 2
వివరణ: 2013నవంబర్ 2న మాలిలో ఇద్దరు ఫ్రెంచ్ జర్నలిస్టులను హత్య చేశారు. జర్నలిస్టుల విధి నిర్వహణలో చేసిన కార్యక్రమాలకు ప్రతీకారంగా హత్యలు జరుగుతున్నాయి.
- సమాధానం: 2
20. 57వ ICANN సాధారణ సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు?
1) హైదరాబాద్
2) మద్రాస్
3) కోల్‌కతా
4) అలహాబాద్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఇంటర్నెట్ ICANN అనే సంస్థ ఆధీనంలో ఉంటుంది. ఈ సంస్థ ఇంటర్నెట్ నిర్వహణ, భద్రత, వివిధ వెబ్సైట్ల పేరులను సూచిస్తుంది.
ICANN- The Internet Corporation of Assigned names and Numbers
- సమాధానం: 1
21. దేశంలో తొలిసారిగా ఏ రాష్ట్రంలో పతి జిల్లాలోసైబర్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేశారు?
1) తెలంగాణ
2) ఆంధ్రప్రదేశ్
3) మహారాష్ట్ర
4) కర్ణాటక
- View Answer
- సమాధానం: 3
వివరణ: ప్రతి సంవత్సరం పెరుగుతున్న సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాలో సైబర్ పోలీసు స్టేషన్లను, ల్యాబ్‌లను ఏర్పాటు చేసింది.
- సమాధానం: 3
22. 2016లో ఇండియాలో అత్యంత ఆకర్షణీయమైన బ్రాండ్‌గా నిలిచిన సంస్థ ఏది?
1) టాటా గ్రూప్
2) ఎల్జీ
3) సామ్సంగ్ మొబైల్స్
4) సోనీ
- View Answer
- సమాధానం: 2
వివరణ: 2016లో అత్యంత ఆక ర్షణీయమైన బ్రాండ్‌గా మొదటి స్థానంలో ఎల్జీ నిలిచింది. తర్వాతి స్థానాల్లో సోనీ, సామ్సంగ్ మొబైల్స్ ఉన్నాయి. టాటా గ్రూప్ 7వ స్థానంలో ఉంది.
- సమాధానం: 2
23. ఇటీవల లెబనాన్ దేశానికి నూతన ప్రధానమంత్రిగా ఎవరు ఎంపికయ్యారు?
1) తమమ్ సలామ్
2) నజీమ్ మికాతి
3) సాద్ హరీరీ
4) ఫౌద్ సినిరో
- View Answer
- సమాధానం: 3
24. ఇటీవల కేంద్ర ప్రభుత్వం గర్భిణీ స్త్రీల రక్షణకోసం ప్రారంభించిన పథకం ఏది?
1) భారత్‌మాత నిర్మల్
2) కిశోర్ బాలిక అభియాన్
3) బేటి రక్షక అభియాన్
4) ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్
- View Answer
- సమాధానం: 4
25. ఇటీవల ఏ సరస్సు రక్షణ కోసం పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆర్.దాల్వని అధ్యక్షతన కమిషన్‌ను ఏర్పాటు చేసింది?
1) లోక్ తక్ సరస్సు
2) లోనార్ సరస్సు
3) కొల్లేరు సరస్సు
4) సాంబార్ సరస్సు
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఈశాన్య రాష్ట్రాల్లో అతి పెద్ద మంచి నీటి సరస్సు లోక్తక్ (మణిపూర్) సరస్సు. ఈ సరస్సు పరిరక్షణ, పర్యాటక రంగం అభివృద్ధి కోసం కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ డా.ఆర్.దాల్వని అధ్యక్షతన ఎస్.పి. వశీష్, డా. బడొలా చందన్ సింగ్, బ్రిజేష్ సిక్కోలతో కమిటీని ఏర్పాటు చేసింది.
- సమాధానం: 1
26. ఇటీవల ఏ రాష్ట్రం బాలికల కోసం ‘సభుజ్ సాథి (Sabooj Sathi)పథకం కింద సైకిల్స్‌ను అందజేసింది?
1) మహారాష్ట్ర
2) పశ్చిమ బెంగాల్
3) బీహార్
4) జార్ఖండ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ప్రభుత్వ, ఎయిడెడ్ విద్యా సంస్థలలో చదివే విద్యార్థినిల కోసం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 4300 సైకిల్స్‌ను అందజేసింది.
- సమాధానం: 2
27. దేశంలోనే తొలి టైటానియం ప్రాజెక్టును ప్రారంభించనున్న సంస్థ ఏది?
1) వేదాంత కంపెనీ
2) సరఫ్ గ్రూప్
3) హిందాల్కో గ్రూప్
4) రెలిగేర్ గ్రూప్
- View Answer
- సమాధానం: 2
వివరణ: సరఫ్ గ్రూప్ ఒడిశా ప్రభుత్వం సహకారంతో గోపాల్పూర్ పోర్ట్ దగ్గర దేశంలోనే తొలి టైటానియం ప్రాజెక్టును ప్రారంభించనుంది. ఈ టైటానియం ప్లాంట్ ద్వారా ప్రతి సంవత్సరం 3600 టన్నులు టైటానియంను, 20000 టన్నుల ముడి ఇనుమును ఉత్పత్తి చేస్తారు.
- సమాధానం: 2
28. ఇటీవల జర్మనీ గ్రీన్ టాలెంట్ పురస్కారానికి ఎంపికైంది ఎవరు?
1) షమిక్ చౌదరి
2) రీటా శర్మ
3) నీతూసింగ్
4) సారాలోపెజ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: సింగపూర్ జాతీయ విశ్వవిద్యాలయంకు చెందిన ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ విద్యార్థిని షమిక్ చౌదరి జర్మనీ గ్రీన్ టాలెంట్ పురస్కారానికి ఎంపికైంది.
- సమాధానం: 1
29. ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ జీవితకాల సాఫల్య పురస్కారానికి ఎంపికైంది ఎవరు?
1) షర్మిష్ఠ దారా
2) ఎల్లెన్ పేజ్
3) మెరిల్ స్ట్రిప్
4) సుసాన్ సార్నడన్
- View Answer
- సమాధానం: 3
వివరణ: హాలీవుడ్ ఫారెన్ ప్రెస్ అసోసియేషన్ 1943 నుంచి సినిమా, టీవీ రంగంలోగొల్డెన్ గ్లోబ్ పురస్కారాన్ని ప్రదానం చే స్తుంది.
- సమాధానం: 3
30. స్విట్జర్లాండ్ ప్రభుత్వం పర్యాటక రంగ అభివృద్ధి కోసం ఎవరిని సౌహర్థ రాయబారిగా నియమించుకుంది?
1) దీపికా పదుకొనే
2) రణవీర్ సింగ్
3) టామ్ క్రూజ్
4) ఎల్లెన్ పేజ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: స్విట్జర్లాండ్ పర్యాటక రంగం స్లోగన్ ‘నేచర్ వాంట్స్ యూ బ్యాక్’. స్విస్ ప్రభుత్వంప్రముఖ బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్‌ను రాయబారిగా నియమించుకుంది.
- సమాధానం: 2
31. ఇటీవల అంతర్జాతీయ లా కమిషన్‌లో సభ్యుడుగా ఎంపికైన భారతీయుడు ఎవరు?
1) గోపాల్ సుబ్రమణ్యం
2) ముకుల్ రోహత్గి
3) కె.కె. గోపాల్
4) అనిరుధ్ రాజ్‌పుత్
- View Answer
- సమాధానం: 4
వివరణ: అంతర్జాతీయ లా కమిషన్ఐక్యరాజ్య సమితి సాధారణ సభకు న్యాయ సలహా ఇచ్చే సంస్థ. ఇందులో 34 మంది న్యాయకోవిదులు ఉంటారు. ఈ కమిషన్‌కు అనిరుధ్ రాజ్‌పుత్ అనే భారతీయ యువ లాయర్ ఎంపికయ్యాడు.
- సమాధానం: 4
32. అంతర్జాతీయ రేడియోలజీ దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు?
1) నవంబర్ 3
2) నవంబర్ 5
3) నవంబర్ 8
4) నవంబర్ 12
- View Answer
- సమాధానం: 3
వివరణ: 1895లో ఎక్స్‌రేను కనుగొన్నారు. వివిధ వ్యాధుల నిర్ధారణలో రేడియోలజీ పాత్రను ప్రజలకు తెలియజేయడం కోసం ఈ దినోత్సవంను నిర్వహించుకుంటారు.
- సమాధానం: 3
33. జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు?
1) నవంబర్ 7
2) నవంబర్ 5
3) నవంబర్ 3
4) నవంబర్ 1
- View Answer
- సమాధానం: 1
34. ‘‘ ఉష్ణమండల పారాసైటాలజీ’’ (Tropicla Parasitology) పై జాతీయ సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు?
1) హైదరాబాద్
2) పుదుచ్చేరి
3) నాగ్‌పూర్
4) కాన్పూర్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఈ సమావేశాన్నిఇండియన్ అకాడమీ ఆఫ్ ట్రోపికల్ పారాసైటాలజీ, JIPMER సంయుక్తంగా నిర్వహించాయి.
- సమాధానం: 2
35. 6వ భారతీయ భాషల ఉత్సవం (సమన్వయ్)ను ఏ ప్రాంతంలో నిర్వహించారు?
1) కాన్పూర్
2) రాంచీ
3) వారణాసి
4) న్యూఢిల్లీ
- View Answer
- సమాధానం: 4
36. ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం ‘ ఇంధన ఆదా’ లో ఇండియాలో తొలిస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?
1) రాజస్థాన్
2) కర్ణాటక
3) మహారాష్ట్ర
4) ఆంధ్రప్రదేశ్
- View Answer
- సమాధానం: 4
వివరణ: ప్రపంచ బ్యాంకు ‘‘ఇండియా రాష్ట్రస్థాయి ఇంధన సామర్థ్యం అమలు సంసిద్ధత’’ పేరుతో నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో ఇంధన ఆదా విభాగంలో ఆంధ్రప్రదే శ్ తొలిస్థానంలో ఉంది. తర్వాత స్థానాలలో రాజస్థాన్, కర్ణాటక, మహారాష్ట్ర ఉన్నాయి.
- సమాధానం: 4
37. ఇండియా-బంగ్లాదేశ్ సంయుక్త సైనిక విన్యాసాలు ఏ పేరుతో నిర్వహించారు?
1) SAMPRITI- 2016
2)INDOBANGLA- 16
3) IBMAITHRI -16
4) MAITHRI - 2016
- View Answer
- సమాధానం: 1
38. మొట్ట మొదటి ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవం ఏ రోజున నిర్వహించారు?
1) నవంబర్ 1
2) నవంబర్ 3
3) నవంబర్ 5
4) నవంబర్ 7
- View Answer
- సమాధానం: 3
వివరణ: 2016 Theme : Effective Education and Evacuation Drills
- సమాధానం: 3
39. బలియాత్ర ఉత్సవాలు ఏ రాష్ట్రంలో నిర్వహించుకుంటారు?
1) తమిళనాడు
2) ఒరిస్సా
3) పశ్చిమ బెంగాల్
4) కేరళ
- View Answer
- సమాధానం: 2
వివరణ: ప్రతి సంవత్సరం కారీ్తక పౌర్ణమి రోజున బలియాత్ర ఉత్సవాలను కటక్‌లో నిర్వహిస్తారు. కార్తికేయుని విగ్రహాలను పూజించి, కార్తీక పౌర్ణమి రోజున మహానదిలో నిమజ్జనం చేస్తారు.
- సమాధానం: 2
40. 12వ అంతర్జాతీయ ఆయిల్ అండ్ గ్యాస్ కాన్ఫరెన్స్ అండ్ ఎగ్జిబిషన్ ఎక్కడ నిర్వహించారు?
1) న్యూఢిల్లీ
2) హైదరాబాద్
3) తిరువనంతపురం
4) ముంబయి
- View Answer
- సమాధానం: 1
వివరణ: Theme: Hydrocarbons to fuel the future choices and challenges
- సమాధానం: 1
41. ఇటీవల ఏ దేశంలో గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు?
1) ఈక్వేడార్
2) క్యూబా
3) ఎస్తోనియా
4) దుబాయ్
- View Answer
- సమాధానం: 4
వివరణ: దుబాయ్‌లో భారత రాయబారి అనురాగ్ భూషణ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించాడు.
- సమాధానం: 4
42. దక్షిణాసియా ఆక్వాటిక్ ఛాంపియన్షిప్ (SAAC) లో 5 స్వర్ణాలు సాధించిన భారతీయుడు ఎవరు?
1) బస్తబ్ తపన్ బోర్డోలోయ్
2) విర్ధవల్ ఖదె
3) సౌరబ్ సంగ్వకర్
4) సాజన్ ప్రకాష్
- View Answer
- సమాధానం: 1
వివరణ: అస్సోంకు చెందిన 15 సంవత్సరాల bastab tapan bordoloi దక్షిణాసియా ఆక్వాటిక్ ఛాంపియన్‌షిప్‌లో 5 స్వర్ణ పతకాలు, ఒక వెండి పతకం సాధించాడు. ఈ క్రీడలు కొలంబోలో నిర్వహించారు.
- సమాధానం: 1
43. కామన్వెల్త్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పురుషుల ఫ్రీస్టైల్ 57 కేజీల విభాగంలో స్వర్ణపతక విజేత ఎవరు?
1) వినోద్
2) సందీప్ తోమర్
3) మనిష్
4) రవీందర్
- View Answer
- సమాధానం: 2
వివరణ: సింగపూర్‌లో జరిగిన కామన్వెల్త్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఇండియామొత్తం 29 పతాకాలను సాధించింది. పురుషుల ఫీస్టైల్57 కేజీల విభాగంలో సందీప్ తోమర్, 70 కేజీల విభాగంలో అమిత్ ధంకర్, 97 కేజీల విబాగంలో సత్యవర్త బంగారు పతకాలు సాధించారు.
- సమాధానం: 2
44. ‘‘An Era of Darkness: The British Empire in India ’’ అనే పుస్తక ర చయిత ఎవరు?
1) అరుణ్ శౌరీ
2) వీరప్ప మొయిలీ
3) డా. శశిథరూర్
4) ఫరూక్ అబ్ధుల్లా
- View Answer
- సమాధానం: 3
45. IABCA పదానం చేసే ‘‘ఆస్ట్రేలియా బిజినెస్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ ’’ గా ఎంపికైన మహిళ ఎవరు?
1) మీనా గణేష్
2) శుబిహుస్సెన్
3) ఉపమ విర్ధి
4) వాణి కొలా
- View Answer
- సమాధానం: 3
వివరణ: IABCA ను సోనియా సాధిఖ్ గాంధీ ఏర్పాటు చేశారు. ఉపమ విర్ధి 2014లో ‘‘ చాయ్ వాలీ’’ అనే వ్యాపారాన్నిప్రారంభించారు.
IABCA: India Australia Business Community Awards
- సమాధానం: 3
46. చారిత్రక యుగంలోనే ఎండిపోయిన ఏ నది ఆనవాళ్లను ఇటీవలIIT ఖరగ్‌పూర్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు ?
1) పూర్ణనది
2) చంద్ర భాగ
3) శారదానది
4) మహకాళి నది
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఒడిశాలోని కొణార్క్ సూర్యదేవాలయంనకు 2 కి.మీ. దూరంలో చంద్రభాగ నది ఆనవాళ్లను IIT ఖరగ్‌పూర్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
- సమాధానం: 2
47. బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగంలో అత్యుత్తమ బ్రాండ్‌గా ఎంపికైన సంస్థ ఏది?
1) LIC
2) SBI
3) ICICI
4) HDFC
- View Answer
- సమాధానం: 1
వివరణ: దేశంలో అత్యంత ప్రజాదరణ కల్గిన ఆర్థిక సంస్థగా LIC మొదటి స్థానంలో ఉంది. HDFC మూడ వ స్థానంలో ఉంది.
- సమాధానం: 1
48. ప్రపంచంలో తొలి హైడ్రోజన్ రైలును ప్రవేశ పెట్టిన దేశం ఏది?
1) కెనడా
2) జర్మనీ
3) ఫ్రాన్స్
4) యూకే
- View Answer
- సమాధానం: 2
వివరణ: హైడ్రోజన్‌తో నడిచే రైలు (Coradia Ilint) ను జర్మనీ ప్రజారవాణా వ్యవస్థలో ప్రవేశపెట్టింది. ఈ రైలు నుంచి అతి తక్కువ నీటి ఆవిరి మాత్రమే బయటకు వెలువడుతుంది.
- సమాధానం: 2
49. WTA Elite సింగిల్స్ విజేత ఎవరు?
1) ఎలినా స్వితొలిన
2) జోహన్న కొంట
3) కార్ల సువారెజ్ నవర్రో
4) పెట్ర క్విటొవా
- View Answer
- సమాధానం: 4
వివరణ: 2016లో జరిగిన WTA Elite సింగిల్స్ పోటిలో ఉక్రేయిన్‌కు చెందిన ఎలినాను ఓడించి పెట్ర క్విటొవా టైటిల్‌ను గెలుచుకుంది.
- సమాధానం: 4
50. గ్లోబల్ బిజినెస్ ఆప్టిమిజం ఇండెక్స్‌లో ఇండియా స్థానం ఎంత?
1) 2వ స్థానం
2) 5వ స్థానం
3) 7వ స్థానం
4) 9వ స్థానం
- View Answer
- సమాధానం: 1
వివరణ: Grant Thornton International అనే బిజినెస్ సంస్థ ఈ ఇండెక్స్‌ను తయారు చేసింది. ఈ నివేదికలో తొలి స్థానంలో ఇండోనేషియా, 2వ స్థానంలో ఇండియా, 3వ స్థానంలో ఫిలిప్పైన్స్ ఉన్నాయి.
- సమాధానం: 1