కరెంట్ అఫైర్స్ నవంబర్ (1 - 7) బిట్ బ్యాంక్
1. రక్షణ రంగంలో సహకారం కోసం భారత్ - రష్యాలు ఏ పేరుతో సంయుక్తంగా సైనిక విన్యాసాలు నిర్వహించాయి ?
1) ముద్ర - 2017
2) ఇంధ్ర - 2017
3) యుద్ధ అభ్యాస్ - 2017
4) మైత్రీ - 2017
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం అనే అంశంపై ఇంధ్ర - 2017 పేరుతో భారత్ - రష్యా సంయుక్తంగా త్రివిధ దళాల విన్యాసాలు నిర్వహించాయి. రష్యాలోని సెర్గీవిస్కీ 249 కంబైడ్య ఆర్మీ రేంజ్, వ్లాదివోస్తోక్‌లోని జపాన్ సముద్ర జలాల్లో అక్టోబర్ 19 నుంచి 29 వరకు జరిగిన ఈ సైనిక విన్యాసాల్లో ఇరు దేశాల త్రివిధ దళాలు పాల్గొన్నాయి.
- సమాధానం: 2
2. భారత్ - కజఖస్తాన్ ఇటీవల ఏ పేరుతో సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించాయి ?
1) ప్రబల్ దోస్తిక్ - 2017
2) దోస్తీ - 2017
3) ఇండో - కజక్ - 2017
4) ఇంధ్ర - 2017
- View Answer
- సమాధానం: 1
వివరణ: హిమాచల్‌ప్రదేశ్‌లోని బాక్లోహ్లో భారత్ - కజఖస్తాన్ రెండవ సంయుక్త సైనిక విన్యాసాలు జరిగాయి. మొదటి సంయుక్త సైనిక విన్యాసాలు 2016లో కజఖస్తాన్‌లో నిర్వహించారు. ప్రబల్ దోస్తిక్ (PRABAL DOSTYK) అంటే ధృడమైన స్నేహం అని అర్థం.
- సమాధానం: 1
3. వ్యవసాయ రంగంలో ఏటా 4 శాతం వృద్ధిని సాధించేందుకు ప్రవేశపెట్టిన రాష్టీయ్ర కృషి వికాస్ యోజన పథకాన్ని ఎప్పటి వరకు పొడగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
1) 2017-18
2) 2019-20
3) 2020-21
4) 2021-22
- View Answer
- సమాధానం: 2
వివరణ: రాష్టీయ్ర కృషి వికాస్ యోజన పథకాన్ని Rashtriya Krishi Vikas Yojana& Remunerative Approaches for Agriculture and Allied sector Rejuvenation (RKVY&RAFTAAR) పేరుతో 2019-20 వరకు పొడగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సాగులో ప్రోత్సాహం, వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించడం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ పథకం అమలు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.15,722 కోట్లు కేటాయించింది.
- సమాధానం: 2
4. పాకిస్తాన్లో భారత హై కమిషనర్‌గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) అజయ్ బిసారియా
2) గౌతం బంబావాలే
3) ముఖ్తా తోమర్
4) నవతేజ్ సర్నా
- View Answer
- సమాధానం: 1
వివరణ: 1987 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి అజయ్ బిసారియా పాకిస్తాన్లో భారత హైకమిషనర్‌గా నియమితులయ్యారు. ఇంతకముందు పాక్‌లో భారత హైకమిషనర్‌గా ఉన్న గౌతం బంబావాలే ఇటీవలే చైనా రాయబారిగా వెళ్లారు.
- సమాధానం: 1
5. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో జరిగిన కామన్వెల్త్ షూటింగ్ చాంపియన్‌షిప్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో స్వర్ణాన్ని సాధించిన భారత షూటర్ ఎవరు ?
1) జీతు రాయ్
2) దీపక్ కుమార్
3) గగన్ నారంగ్
4) హీనా సిద్ధు
- View Answer
- సమాధానం: 4
వివరణ: కామన్వెల్త్ షూటింగ్ చాంపియన్‌షిప్ 10 మీటర్ల ఎరుుర్ పిస్టల్ ఈవెంట్లో 626.6 స్కోరుతో తొలి స్థానంలో నిలిచిన హీనా సిద్ధు స్వర్ణాన్ని గెలుచుకుంది. 10 మీటర్ల ఎయిర్ రైఫల్ ఈవెంట్లో దీపక్ కుమార్ రజతం గెలుచుకున్నాడు.
- సమాధానం: 4
6. బ్లూ ఫ్లాగ్ - 2017 సైనిక విన్యాసాలను ఏ దేశం నిర్వహిస్తుంది ?
1) భారత్
2) ఇజ్రాయెల్
3) అమెరికా
4) జర్మనీ
- View Answer
- సమాధానం: 2
వివరణ: బ్లూ ఫ్లాగ్ పేరుతో ఇజ్రాయెల్ ఏటా రెండుసార్లు బహుళ సైనిక విన్యాసాలను నిర్వహిస్తుంది. 2017 నవంబర్‌లో ఇజ్రాయెల్‌లోని ఉడా ఎయిర్ ఫోర్స్బేస్లో ఈ విన్యాసాలు జరిగాయి. భారత్ ఈ విన్యాసాల్లో తొలిసారి పాల్గొంది. 45 మంది వాయుసేన సిబ్బందితో సీ-130 జే.. ఈ విన్యాసాల్లో పాల్గొంది. భారత్‌తో పాటు ఫ్రాన్స్, జర్మనీ కూడా ఈ విన్యాసాల్లో తొలిసారి పాల్గొన్నాయి.
- సమాధానం: 2
7. కృష్ణ జింకల కోసం ప్రత్యేకంగా సంరక్షణ కేంద్రం ఏర్పాటుకు ఇటీవల ఆమోదం తెలిపిన రాష్ట్రం ఏది ?
1) తెలంగాణ
2) ఉత్తరప్రదేశ్
3) ఆంధ్రప్రదేశ్
4) మధ్యప్రదేశ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఉత్తరప్రదేశ్ అలహాబాద్ యమునా నదీ తీరం వెంట ఉన్న మెజా అడవిలోని 126 హెక్టార్లలో కృష్ణ జింకల సంరక్షణ కేంద్రం ఏర్పాటుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదం తెలిపింది. ఈ ప్రాంతంలో 350 వరకు కృష్ణ జింకలు ఉన్నాయి.
- సమాధానం: 2
8. గ్లోబల్ జండర్ గ్యాప్ ఇండెక్స్ - 2017లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది ?
1) 100
2) 104
3) 108
4) 144
- View Answer
- సమాధానం: 3
వివరణ: వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ విడుదల చేసిన గ్లోబల్ జండర్ గ్యాప్ ఇండెక్స్ - 2017లో భారత్ 108వ స్థానంలో నిలిచింది. గతేడాది ఇదే నివేదికలో 87వ స్థానంలో నిలిచిన భారత్ ఈ సారి 21 స్థానాలు దిగజారింది. విద్య, ఆరోగ్యం, ఆర్థిక అవకాశాలు, రాజకీయ ప్రోత్సాహం వంటి అంశాల్లో పురుషులు, మహిళలకు ఉన్న అవకాశాల్లో తేడాల ఆధారంగా ఈ నివేదికను రూపొందిస్తారు.
2017 నివేదికలో ఐస్లాండ్ జండర్ ఈక్వల్ దేశాల్లో తొలిస్థానంలో నిలిచింది. నార్వే రెండో స్థానంలో, ఫిన్లాండ్ మూడో స్థానంలో, రువాండా నాలుగో స్థానంలో నిలిచాయి.
- సమాధానం: 3
9. చెక్క బొమ్మల తయారీలో ప్రసిద్ధిగాంచిన ఏటికొప్పాక గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది ?
1) తెలంగాణ
2) కర్ణాటక
3) ఆంధ్రప్రదేశ్
4) తమిళనాడు
- View Answer
- సమాధానం: 3
వివరణ: చెక్క బొమ్మల తయారీలో ప్రసిద్ధిగాంచిన ఏటికొప్పాక గ్రామం ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లాలో ఉంది. ది జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ(GIR) ఇక్కడ తయారయ్యే బొమ్మలకు ఇటీవల జియోగ్రాఫిక్ ఇండికేషన్ (GI) ఇచ్చింది. ఏపీ నుంచిఇంతకముందు కొండపల్లి బొమ్మలు, తిరుపతి లడ్డు, బొబ్బిలి వీణ, బంగినపల్లి మామిడికి జీఐ గుర్తింపు పొందాయి.
- సమాధానం: 3
10. 2017 డిసెంబర్ 1 నుంచి అమ్ముడయ్యే కొత్త నాలుగు చక్రాల వాహనాలకు వేటిని తప్పనిసరి చేస్తు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది ?
1) ఫాస్ట్‌టాగ్
2) ఇన్సురెన్స్
3) జీపీఎస్
4) సీఎన్జీ
- View Answer
- సమాధానం: 1
వివరణ: 2017 డిసెంబర్ 1 నుంచి అమ్ముడయ్యే కొత్త నాలుగు చక్రాల వాహనాలకు ఫాస్ట్‌టాగ్‌లను తప్పనిసరి చేస్తు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. టోల్గేట్ల వద్ద చెల్లింపులను డిజిటిల్ పద్ధతిలో చేసేందుకు ఉద్దేశించినవే ఫాస్ట్‌టాగ్‌లు. వీటిని వాహనం ముందు భాగంలోని అద్దంపై అమర్చుతారు. ప్రత్యేక నంబర్‌తో కూడిన ఈ ఫాస్ట్‌టాగ్‌లను ప్రీ పెయిడ్ పద్ధతిలో రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. తద్వారా టోల్గేట్ల వద్ద టాక్స్ చెల్లింపు డిజిటల్ పద్ధతిలో చేయవచ్చు.
- సమాధానం: 1
11. వరల్డ్ ఫుడ్ ఇండియా(WFI) - 2017 సమావేశాలు ఎక్కడ జరిగాయి ?
1) హైదరాబాద్
2) న్యూఢిల్లీ
3) అమృత్సర్
4) విశాఖపట్నం
- View Answer
- సమాధానం: 2
వివరణ: న్యూఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద జరిగిన వరల్డ్ ఫుడ్ ఇండియా - 2017 సమావేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఫుడ్ ప్రాసెసింగ్‌లో భారీగా పెట్టుబడులు ఆకర్షించడం ద్వారా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యంతో ఈ సమావేశాలను నిర్వహించారు. జర్మనీ, జపాన్, డెన్మార్క్ దేశాలు ఈ సమావేశాల నిర్వహణలో భాగస్వామిగా వ్యవహరించాయి.
WFI 2017 Theme : Transforming the food economy
- సమాధానం: 2
12. ప్రతిష్టాత్మక జ్ఞాన్‌పీఠ్ పురస్కారం - 2017ను ఎవరికి ప్రకటించారు ?
1) కృష్ణ సోబతీ
2) జుంపా లహరీ
3) చేతన్ భగత్
4) అనితా దేశాయ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: 53వ జ్ఞాన్‌పీఠ్ పురస్కారానికి ప్రముఖ హిందీ సాహితీవేత్త కృష్ణ సోబతీ ఎంపికయ్యారు. సాహిత్య రంగంలో అందించిన సేవలకుగాను ఆమెకు ఈ పురస్కారం ప్రకటించారు. సోబతీ ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న గుజరాత్లో జన్మించారు. ఆమె రాసిన దార్ సే బిఛుడీ, మిత్రో మర్జానీ, జిందగీనామా తదితర రచనలు ప్రఖ్యాతి గాంచాయి. కృష్ణ సోబతీ ఈ అవార్డు గెలుచుకున్న 8వ మహిళ.
సాహిత్య రంగంలో అత్యున్నత పురస్కారమైన జ్ఞాన్‌పీఠ్‌ను 1961లో స్థాపించారు. 2016లో ఈ పురస్కారాన్ని బెంగాలీ రచయిత శంకాఘోష్కు ప్రకటించారు.
- సమాధానం: 1
13. వరల్డ్ యూత్ ఫోరమ్ - 2017 ఎక్కడ జరిగింది ?
1) భారత్
2) ఇండోనేషియా
3) ఈజిప్ట్
4) యూఏఈ
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఈజిప్టులోని షరమ్ ఎల్ షేక్ నగరంలో వరల్డ్ యూత్ ఫోరమ్ - 2017 జరిగింది. వ్యాపారం, ఆవిష్కరణ, భావి నాయకుల తయారీలో సవాళ్లు, లింగ సమానత్వం, మహళా సాధికారత అంశాల్లో యువత పాత్రపై ఈ సమావేశాల్లో విస్తృతంగా చర్చలు జరిపారు.
- సమాధానం: 3
14. భారత ప్రభుత్వం ప్రపంచంలోనే ఎతైన రోడ్డు మార్గాన్ని ఏ ప్రాంతంలో నిర్మించింది ?
1) లడఖ్
2) అరకు
3) షిల్లాంగ్
4) గుల్మార్గ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: జమ్ముకశ్మీర్‌లోని లడఖ్ ప్రాంతంలో 19,300 అడుగుల ఎత్తులో భారత ప్రభుత్వం రోడ్డు మార్గాన్ని నిర్మించింది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎతైనది. ప్రాజెక్టు హిమాంక్‌లో భాగంగా బోర్డర్ రోడ్స ఆర్గనైజేషన్(BRO) ఈ రోడ్డు మార్గాన్ని పూర్తి చేసింది. లేహ్‌కు 230 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిసుమ్లే, దెమ్చోక్ గ్రామాలను కలుపుతూ నిర్మించిన ఈ రహదారి పొడవు 86 కిలోమీటర్లు.
- సమాధానం: 1
15. సాంస్కృతికవారసత్వ పరిరక్షణ కార్యక్రమం కింద యునెస్కో నుంచి ఆసియా-పసిఫిక్ అవార్డు ఆఫ్ మెరిట్ పొందిన తమిళనాడులోని దేవాలయం ఏది ?
1) మధుర మీనాక్షి దేవాలయం
2) రామేశ్వరం రామనాథస్వామి దేవాలయం
3) తంజావూరు బ్రిహదీశ్వర దేవాలయం
4) శ్రీరంగం రంగనాథస్వామి దేవాలయం
- View Answer
- సమాధానం: 4
వివరణ: శ్రీరంగం రంగనాథస్వామి దేవాలయానికి మెరిట్ విభాగంలో యునెస్కో ఈ అవార్డుని ప్రకటించింది. ఆలయ నిర్మాణం పునరుద్ధరణ, వాననీటి సంరక్షణ, మురుగు నీటి వ్యవస్థల అభివృద్ధికి చేపట్టిన చర్యలకు గాను ఈ దేవాలయానికి యునెస్కో ఈ సాంస్కృతిక వారసత్వ అవార్డుని ప్రకటించింది.
- సమాధానం: 4
16. మహిళల ఆసియా హాకీ కప్ - 2017 టైటిల్ విజేత ఎవరు ?
1) చైనా
2) భారత్
3) మలేషియా
4) పాకిస్తాన్
- View Answer
- సమాధానం: 2
వివరణ: జపాన్‌లో జరిగిన మహిళల ఆసియా హాకీ కప్ ఫైనల్లో చైనాను ఓడించి భారత్ మహిళల జట్టు విజేతగా నిలిచింది. తద్వారా రెండోసారి ఈ కప్‌ను కైవసం చేసుకుంది. మహిళల హాకీ జట్టు మొదటిసారి 2004లో ఆసియా కప్‌ను గెలుచుకుంది. 2017 అక్టోబర్‌లో పురుషుల హాకీ జట్టు ఆసియా హాకి కప్‌ను సొంతం చేసుకుంది.
- సమాధానం: 2
17. చైనా సొంతంగా రూపొందించిన ప్రాంతీయ నావిగేషన్ వ్యవస్థ పేరు ఏమిటి ?
1) బెయ్‌డూ
2) గగన్
3) జీపీఎస్
4) గ్లోనాస్
- View Answer
- సమాధానం: 1
వివరణ: బెయ్‌డూ ప్రాజెక్టు మూడో దశలో భాగంగా చైనా ఇటీవల మార్చి - 3బీ రాకెట్ ద్వారా బెయ్‌డూ - 3M1, బెయ్‌డూ - 3M2 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపింది. 2020 నాటికి ఈ వ్యవస్థ పూర్తిగా చైనాకు అందుబాటులోకి వస్తుంది. ఇప్పటికే అమెరికా(జీపీఎస్), రష్యా(గ్లోనాస్)కు సొంత నావిగేషన్ వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయి. భారత్ ఐఆర్ఎన్ఎస్ఎస్ (గగన్) పేరుతో సొంత నావిగేషన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది.
- సమాధానం: 1
18. ఒడిశాలో ఏ రంగంలో అభివృద్ధికోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రపంచ బ్యాంకుతో 119 మిలియన్ డాలర్ల రుణ ఒప్పందం కుదుర్చుకుంది ?
1) ఉన్నత విద్య
2) వ్యవసాయం
3) పరిశ్రమలు
4) ప్రజా సేవలు
- View Answer
- సమాధానం: 1
వివరణ: Odisha Higher Education Programme for Excellence and Equity(OHEPEE) ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంకుతో ఈ రుణ ఒప్పందం కుదుర్చుకుంది. ఉన్నత విద్య పరిపాలనా అభివృద్ధి, విద్యార్థులు ఉన్నత విద్యలో ఎన్నుకున్న విద్యా సంస్థల్లో ప్రవేశం పొందేలా చేయడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం.
- సమాధానం: 1
19. డీఆర్డీఓ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసి ఇటీవల విజయవంతంగా పరీక్షించిన క్రూయిజ్ క్షిపణి నిర్భయ్ పరిధి ఎంత ?
1) 0 - 1000 కిలోమీటర్లు
2) 1000 - 2000 కిలోమీటర్లు
3) 2000 - 3000 కిలోమీటర్లు
4) 3000 - 4000 కిలోమీటర్లు
- View Answer
- సమాధానం: 1
వివరణ: పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో దేశంలో తయారైన అణ్యాయుధ సామర్థ్యం గల క్రూయిజ్ క్షిపణి నిర్భయ్‌ను భారత్ తొలిసారి విజయవంతంగా పరీక్షించింది. భూ ఉపరితలం నుంచి ప్రయోగించే ఈ సబ్ సోనిక్ క్షిపణి 300 కిలోల బరువు గల అణువార్ హెడ్లను మోసుకెళ్లగలదు.
- సమాధానం: 1
20. భారత్‌లో ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య ఎంత ?
1) 15
2) 17
3) 19
4) 21
- View Answer
- సమాధానం: 4
వివరణ: భారత్‌లో 21 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి. వీటి సంఖ్యను తగ్గించి నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాన్ని పరిశీలిస్తోంది. విలీన ప్రతిపాదనలని పరిశీలించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది.
- సమాధానం: 4
21. ఇటీవల ఏ రాష్ట్రం హిందీ సత్యాగ్రహీలకు జీవితకాలం నెలకు పది వేల రూపాయల పింఛన్ ఇవ్వనున్నట్ల ప్రకటించింది ?
1) పంజాబ్
2) హర్యానా
3) అరుణాచల్ ప్రదేశ్
4) ఉత్తరప్రదేశ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: 1975లో దేశంలో అత్యయిక స్థితి సమయంలో హింధీ భాష ప్రచారం కోసం పంజాబ్ ఆర్య ప్రతినిధి సభ హిందీ సత్యాగ్రహ ఉద్యమాన్ని చేపట్టింది. ఈ ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లిన రాష్ట్రానికి చెందిన హిందీ భాష ఉద్యమకారులకు జీవితకాలం నెలకు పది వేల రూపాయల పింఛన్ ఇవ్వనున్నట్లు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రకటించారు. రాష్ట్రంలో ప్రస్తుతం వీరు 194 మంది వరకు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది.
- సమాధానం: 2
22. కర్ణాటకలో తొలి మహిళా డీజీపీగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) మీరా బోర్వన్కర్
2) సంజుక్తా పరాషార్
3) నీలమణి ఎన్ రాజు
4) అపరాజితా రాయ్
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఆరే కే దుత్తా స్థానంలో 1983 ఐపీఎస్ బ్యాచ్ కర్ణాటక క్యాడర్‌కు చెందిన నీలమణి ఎన్ రాజు ఆ రాష్ట్ర డీజీ ఐజీపీగా ఇటీవల బాధ్యతలు చేపట్టారు. తద్వారా రాష్ట్ర పోలీసు శాఖలో అత్యున్నత పదవి చేపట్టిన మొదటి మహిళగా గుర్తింపు పొందిన ఆమె.. 2020 జనవరి వరకు ఈ పదవిలో ఉంటారు.
- సమాధానం: 3
23. ద కొలిన్‌స డిక్షనరీ వర్డ్ ఆఫ్ ది ఇయర్ - 2017గా ఏ పదాన్ని ఎంపిక చేసింది ?
1) FAKE NEWS
2) BREXIT
3) UNICORN
4) INSTA
- View Answer
- సమాధానం: 1
వివరణ: The Collins Dictionary..Fake News అనే పదాన్ని వర్డ్ ఆఫ్ ద ఇయర్ - 2017గా ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రసంగాల్లో తరచు వినిపించిన ఈ పదం తద్వారా ప్రాచుర్యంలోకి వచ్చింది. 2016లో బ్రెగ్జిట్ పదాన్ని వర్డ్ ఆఫ్ ద ఇయర్‌గా ప్రకటించారు.
- సమాధానం: 1
24. భారత్‌లో అమెరికా రాయబారిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) రిచర్డ్ వర్మా
2) నిక్కీ హేలీ
3) కెన్నెత్ జస్టర్
4) నీల్ చటర్జీ
- View Answer
- సమాధానం: 3
వివరణ: రిచర్డ్ వర్మ స్థానంలో కెన్నెత్ జస్టర్ ఇటీవల భారత్‌లో అమెరికా రాయబారిగా నియమితులయ్యారు. ఈయన ఇంతకముందు అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాల్లో అమెరికా అధ్యక్షుడికి డిప్యుటీ అసిస్టెంట్‌గా వ్యవహరించారు.
- సమాధానం: 3
25. ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు ?
1) నవంబర్ 1
2) నవంబర్ 3
3) నవంబర్ 5
4) నవంబర్ 7
- View Answer
- సమాధానం: 3
వివరణ: 2015 డిసెంబర్లో ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ఏటా నవంబర్ 5న సునామీ అవగాహన దినోత్సవాన్ని నిర్వహించాలని తీర్మానించింది. సునామీ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా ఈ ప్రకృతి విపత్తు సంభవించిన సమయంలో నష్టాన్ని తగ్గించాలన్నది ఈ దినోత్సవం నిర్వహించడం వెనక ముఖ్య ఉద్దేశం.
- సమాధానం: 3
26. ప్రతిష్టాత్మక విష్ణుదాస్ భవే అవార్డు - 2017కు ఎవరు ఎంపికయ్యారు ?
1) మోహన్ జోషి
2) నాజర్
3) నవాజుద్దీన్ సిద్ధిఖీ
4) కై కాల సత్యనారాయణ
- View Answer
- సమాధానం: 1
వివరణ: ప్రముఖ సినీ, టెలివిజన్ నటుడు మోహన్ జోషి ఈ అవార్డుకి ఎంపికయ్యారు. ఆయన ప్రస్తుతం అఖిల భారత మరాఠీ నాట్య పరిషత్ చైర్మన్ గా ఉన్నారు. మరాఠీ థియేటర్‌ను స్థాపించిన విష్ణుదాస్ భవే పేరిట ఈ అవార్డుని ఏర్పాటు చేశారు. పురస్కారం కింద 25 వేల నగదు బహుమతి అందజేస్తారు.
- సమాధానం: 1
27. కేంద్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ సిటీ బస్ సర్వీస్ అవార్డుకి ఎంపికై న నగర పాలక సంస్థ ఏది ?
1) హైదరాబాద్
2) చెన్నై
3) బెంగళూరు
4) సూరత్
- View Answer
- సమాధానం: 4
వివరణ: ప్రైవేటు వాహనాలు, ఆటోల్లో ప్రయాణిస్తున్న వారిలో 87 శాతం మందిని సిటీ బస్సుల వైపు ఆకర్షించినందుకుగాను సూరత్ నగర పాలక సంస్థ కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ నుంచి ఉత్తమ సిటీ బస్ సర్వీస్ అవార్డుకి ఎంపికైంది. మెట్రో రైలు ప్రాజెక్టుని త్వరగా పూర్తి చేసినందుకుగాను కొచి బెస్ట్ అర్బన్ ట్రాన్సపోర్ట్ ఇనిషియేటివ్ అవార్డుకు ఎంపికైంది.
- సమాధానం: 4
28. సంప్రితి(SAMPRITI) పేరుతో భారత్ - బంగ్లాదేశ్ సంయుక్తంగా చేపట్టే సైనిక విన్యాసాలను తొలిసారి ఏ సంవత్సరంలో నిర్వహించారు ?
1) 2011
2) 2013
3) 2015
4) 2017
- View Answer
- సమాధానం: 1
వివరణ: భారత్ - బంగ్లాదేశ్ ఏడో ఎడిషన్ సంప్రితి సైనిక విన్యాసాలు మేఘలయాలోని ఉమ్రోయ్ కంటోన్మెంట్లో నవంబర్ 6 నుంచి నవంబర్ 11 వరకు జరిగాయి. భారత్ నుంచి 20 మంది సైనికులు, బంగ్లాదేశ్ నుంచి 14 మంది సైనికులు ఇందులో పాల్గొన్నారు. 2011లో తొలిసారి ఈ సైనిక విన్యాసాలను నిర్వహించారు.
- సమాధానం: 1
29. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) అశోక్ లవస
2) హస్ముఖ్ అధియా
3) సంజయ్ మిత్రా
4) పీకే సిన్హా
- View Answer
- సమాధానం: 2
వివరణ: అశోక్ లవస స్థానంలో హస్ముఖ్ అధియా ఆర్థిక శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆయన ఇంతకముందు రెవెన్యు శాఖ కార్యదర్శిగా పనిచేశారు. హస్ముఖ్ 1981 ఐఏఎస్ బ్యాచ్ గుజరాత్ క్యాడర్‌కు చెందిన అధికారి.
- సమాధానం: 2
30. అమెరికా ఫెడరల్ రిజర్వ్ తదుపరి చైర్మన్ ఎవరు ?
1) జెరోమ్ పావెల్
2) జానెట్ యెలెన్
3) బెన్ బెర్నాంకే
4) నీల్ చటర్జీ
- View Answer
- సమాధానం: 1
వివరణ: అమెరికా ఫెడరల్ రిజర్వ్ తదుపరి చైర్మన్‌గా జెరోమ్ పావెల్ పేరుని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ప్రస్తుతం ఫెడ్ చైర్మన్ జానెట్ యెలెన్ పదవీ కాలం 2018 ఫిబ్రవరితో ముగిసిన తర్వాత జెరోమ్ పావెల్ బాధ్యతలు చేపడతారు.
- సమాధానం: 1
31. అంతర్జాతీయ వాతావరణ సదస్సు (COP 23) ఇటీవల ఎక్కడ జరిగింది ?
1) భారత్
2) జర్మనీ
3) ఫ్రాన్స్
4) రష్యా
- View Answer
- సమాధానం: 2
వివరణ: జర్మనీలోని బాన్‌లో అంతర్జాతీయ వాతావరణ సదస్సు (కాప్ 23) జరిగింది. వాతావరణ మార్పులను సమర్థంగా ఎదుర్కొనేందుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని భారత్ ఈ సమావేశాల్లో మరోసారి స్పష్టం చేసింది.
కాప్ 23 భారత్ థీమ్ : Conserving now, preserving future
- సమాధానం: 2
32. పేపర్ పరిశ్రమల 13వ అంతర్జాతీయ సమ్మేళనం ఇటీవల భారత్‌లోని ఏ నగరంలో జరిగింది ?
1) ముంబయి
2) హైదరాబాద్
3) న్యూఢిల్లీ
4) విజయవాడ
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఈ సమ్మేళనాన్ని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్దన్ ప్రారంభించారు. పూర్తి స్థాయిలో వ్యర్థాల రీసైకిల్ ద్వారా పేపర్ తయారీ, దేశ ఆర్థిక ప్రగతి, ఉద్యోగ కల్పనలో పేపర్ పరిశ్రమల పాత్ర వంటి అంశాలపై సమ్మేళనంలో చర్చించారు.
- సమాధానం: 3
33. రాష్ట్రాలు, కేంద్రం మధ్య సమన్వయం కోసం ఏర్పాటు చేసిన అంతరాష్ట్ర మండలికి ఎవరు అధ్యక్షులుగా వ్యవహరిస్తారు ?
1) రాష్ట్రపతి
2) ప్రధానమంత్రి
3) హోంమంత్రి
4) రాజ్యసభ చైర్మన్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఏర్పాటైన అంతరాష్ట్ర మండలిని ఇటీవల పునర్ వ్యవస్థీకరించారు. ఇందులో ఆరుగురు కేంద్ర మంత్రులతో పాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉంటారు. అంతరాష్ట్ర మండలిలో ఉన్న కేంద్ర మంత్రులు - రాజ్‌నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరీ, థావర్ చంద్ గెహ్లాట్, నిర్మలా సీతారామన్. మరో 8 మంది కేంద్ర మంత్రులు మండలిలో శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారు.
- సమాధానం: 2
34. ఇటీవల ఢిల్లీలో జరిగిన గ్రేట్ ఇండియా ఫుడ్ స్ట్రీట్ ఉత్సవంలో అక్షయపాత్ర అనే స్వచ్ఛంద సంస్థ తయారు చేసిన ఏ వంటకం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది ?
1) బిర్యానీ
2) మసాలా దోశ
3) డోక్లా
4) కిచిడీ
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఢిల్లీలో జరిగిన ఈ ఉత్సవంలో అక్షయ పాత్ర సంస్థ 918 కేజీలతో కిచిడీని తయారు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. ప్రముఖ చెఫ్ సంజీవ్ కుమార్ నేతృత్వంలో 50 మంది బృందం ఈ కిచిడీని తయారు చేసింది.
- సమాధానం: 4
35. ప్రపంచంలోనే అత్యంత ఎతైన రైలు వంతెనను భారత్‌లోని ఏ నదిపై నిర్మిస్తున్నారు ?
1) చినాబ్
2) సట్లెజ్
3) బ్రహ్మపుత్ర
4) యుమన
- View Answer
- సమాధానం: 1
వివరణ: కశ్మీర్ లోయలోగల చినాబ్ నదిపై 359 మీటర్ల ఎత్తులో ప్రపంచంలోనే అత్యంత ఎతైన రైలు వంతెన నిర్మాణ పనులను భారత్‌కు చెందిన కొంకణ్ రైల్వే ఇటీవల ప్రారంభించింది. ఉధమ్‌పూర్ - శ్రీనగర్ - బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్టులో భాగంగా ఈ రైల్వే వంతెనను నిర్మిస్తున్నారు.
- సమాధానం: 1
36. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం తెలంగాణ ప్రభుత్వం ఏ రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకుంది ?
1) ఒడిశా
2) మహారాష్ట్ర
3) ఆంధ్రప్రదేశ్
4) కర్ణాటక
- View Answer
- సమాధానం: 2
వివరణ: తెలంగాణ ప్రభుత్వం అంతరాష్ట్ర ప్రాజెక్టులపై మహారాష్ట్ర ప్రభుత్వంతో 2016 ఆగస్టులో ఒప్పందం కుదుర్చుకుంది. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టింది. ఇటీవల ఈ ఎత్తిపోతల పథకానికి అంతరాష్ట్ర అనుమతులు ఇస్తు కేంద్ర జల సంఘం ప్రకటన విడుదల చేసింది.
- సమాధానం: 2
37. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ ద్వారా వచ్చే 5 ఏళ్లలో ఎన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించాలన్నది లక్ష్యం ?
1) రూ. 5 వేల కోట్లు
2) రూ. 15 వేల కోట్లు
3) రూ. 20 వేల కోట్లు
4) రూ. 30 వేల కోట్లు
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఢిల్లీలో జరిగిన వరల్డ్ ఫుడ్ ఇండియా - 2017 సదస్సులో తెలంగాణ రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీని ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు విడుదల చేశారు. దీని ద్వారా వచ్చే 5 ఏళ్లలో 20 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు 25 వేల ఉద్యోగాల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ పాలసీ కాలపరిమితి ఐదేళ్లు.
- సమాధానం: 3
38. దేశంలో అధిక బరువు సమస్య ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో తొలి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది ?
1) ఆంధ్రప్రదేశ్
2) తెలంగాణ
3) గోవా
4) తమిళనాడు
- View Answer
- సమాధానం: 1
వివరణ: దేశవ్యాప్తంగా 15 ఏళ్ల నుంచి 49 ఏళ్ల వయసున్న మహిళలు, పురుషుల్లో అధిక బరువు సమస్యలపై సర్వే నిర్వహించిన కేంద్ర ప్రభుత్వం జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో ఈ వివరాలను వెల్లడించింది. దీని ప్రకారం అధిక బరువు సమస్య ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో, తెలంగాణ రెండో స్థానంలో ఉన్నాయి.
- సమాధానం: 1
39. వాస్తు శాస్త్రానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన గ్లిమ్ సెస్ ఆఫ్ వాస్తు అనే గ్రంథాన్ని రచించిన రచయిత ఎవరు ?
1) సోమేశ్ కే శర్మ
2) బీఎన్ రెడ్డి
3) ఎక్కా యాదగిరి
4) నందిని సిద్ధారెడ్డి
- View Answer
- సమాధానం: 2
వివరణ: బీఎన్ రెడ్డిగా సుపరిచితులైన ప్రముఖ వాస్తు శిల్పి, రచయిత, మాజీ ఎంపీ బద్దం నర్సింహారెడ్డి ఇటీవల కన్నుమూశారు. ఆయన 1989, 1996, 1998లో కాంగ్రెస్ నుంచి మూడుసార్లు మిర్యాలగూడ ఎంపీగా గెలిచారు. ఆయన రాసిన పెళ్లి కాని పెళ్లి కథకు ఉత్తమ కథకుడిగా నంది పురస్కారం, రాజీవ్ గాంధీ పురస్కారం లభించాయి.
- సమాధానం: 2
40. ఓడ రేవుల అభివృద్ధి, కొత్త ఓడ రేవుల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టు పేరు ఏమిటి ?
1) సాగర్ మాల
2) భారత్ మాల
3) జల్ సంచార్
4) ఇండో ఓషన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: సాగర్మాల ప్రాజెక్టుని కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రారంభించింది. ఈ పథకం కింద 2,302 కోట్ల రూపాయల ప్రాజెక్టులు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ సహా ఎనిమిది రాష్ట్రాల్లో 47 ప్రాజెక్టులు చేపడుతున్నట్లు కేంద్రం ప్రకటించింది.
- సమాధానం: 1
41. భారత రక్షణ శాఖ ఇటీవల విజయవంతంగా పరీక్షించిన తేలికపాటి గ్లెడ్ బాంబును అభివృద్ధి చేసిన సంస్థ ఏది ?
1) ఇమారత్ పరిశోధన కేంద్రం
2) రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ
3) వాయుసేన
4) పై మూడు
- View Answer
- సమాధానం: 4
వివరణ: తేలికపాటి గ్లెడ్ బాంబును ఈ మూడు సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఈ బాంబులను వాయుసేన విమానాల నుంచి జార విడుస్తారు. 70 కిలోమీటర్లకుపైగా దూరంలో ఉన్న లక్ష్యాలను ఇది అత్యంత కచ్చితత్వంతో ఛేదిస్తుంది.
- సమాధానం: 4
42. జాతీయ అంధుల వన్డే క్రికెట్ టోర్నమెంట్- 2017ను ఏ జట్టు గెలుచుకుంది ?
1) గుజరాత్
2) ఆంధ్రప్రదేశ్
3) మహారాష్ట్ర
4) కర్ణాటక
- View Answer
- సమాధానం: 2
వివరణ: ముంబైలో జరిగిన టోర్నమెంట్ ఫైనల్లో గుజరాత్‌ను ఓడించి ఆంధ్రప్రదేశ్ జాతీయ అంధుల వన్డే క్రికెట్ టైటిల్‌ను గెలుచుకుంది. ప్రపంచ కప్‌ను గెలిచిన జట్టు సారథి అజయ్ రెడ్డి ఏపీ జట్టుకి కెప్టెన్‌గా ఉన్నాడు.
- సమాధానం: 2
43. ఫోర్బ్స్ పత్రిక 2017 సంవత్సరానికి గాను ప్రకటించిన ప్రపంచ వంద మంది అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో చోటు సంపాదించిన భారతీయ మహిళలు ఎవరు ?
1) చందాకొచ్చర్
2) రోష్ని నాడార్ మల్హోత్రా
3) ప్రియాంకా చోప్రా
4) పై ముగ్గురు
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఫోర్బ్స్ పత్రిక 2017 సంవత్సరానికిగాను ప్రకటించిన ప్రపంచ వంద మంది అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో ఐదుగురు భారతీయ మహిళలు చోటు సంపాదించారు. ఐసీఐసీ బ్యాంక్ మేనేజింగ్ డెరైక్టర్ చందాకొచ్చర్, బాలీవుడ్ నటి ప్రియంకా చోప్రా, హెచ్‌సీఎల్ సీఈవో రోష్ని నాడార్ మల్హోత్రాతో పాటు బైయోకాన్ ఎండీ కిరణ్ మజుందర్ షా, హిందుస్తాన్ టైమ్స్ గ్రూప్ చైర్ పర్సన్ శోభన భర్తియా ఉన్నారు.
ఈ జాబితాలో జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ తొలిస్థానంలో, బ్రిటన్ ప్రధాని థెరెసా మే రెండో స్థానంలో, బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకురాలు మిలిండా గేట్స్ మూడో స్థానంలో ఉన్నారు.
- సమాధానం: 4
44. హిట్ రీఫ్రెష్ పుస్తక రచయిత ఎవరు ?
1) సత్య నాదెళ్ల
2) బిల్ గేట్స్
3) సుందర్ పిచాయ్
4) రఘురామ్ రాజన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల రాసిన హిట్ రీఫ్రెష్ పుస్తకాన్ని తెలుగు, హీందీ, తమిళ భాషల్లోకి అనువదించారు. హిందీ ఎడిషన్‌ను హార్పర్ కొలిన్స్.. తెలుగు, తమిళం ఎడిషన్లను వెస్ట్‌లాండ్ బుక్స్ పబ్లిష్ చేశాయి.
- సమాధానం: 1
45. 2018 ఫిబ్రవరిలో భారత్‌లోని ఏ నగరంలో ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్ జరగనుంది ?
1) చెన్నై
2) బెంగళూరు
3) పూణె
4) ముంబై
- View Answer
- సమాధానం: 1
46. ఇంటర్ బ్రాండ్ ఇండియా తాజా నివేదిక ప్రకారం భారత్‌లో అత్యంత బ్రాండ్ విలువ కలిగిన సంస్థ ఏది ?
1) రిలయన్స్
2) టాటా
3) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
4) మహీంద్రా
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఈ సంస్థ నివేదిక ప్రకారం టాటా బ్రాండ్ విలువ రూ.73,944 కోట్లు. రెండో స్థానంలో ఉన్న రిలయన్స బ్రాండ్ విలువ రూ.38,212 కోట్లు, మూడో స్థానంలో ఉన్న ఎయిర్ టెల్ బ్రాండ్ విలువ రూ. 36,927 కోట్లుగా ఉంది.
- సమాధానం: 2
47. ఇటీవల ఏ దేశం అవినీతి ఆరోపణలతో 11 మంది రాజులు, నలుగురు మంత్రులు, 12 మందికిపైగా మాజీ మంత్రులను అరెస్టు చేసింది ?
1) సౌదీ అరేబియా
2) నేపాల్
3) మొనాకో
4) భూటాన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: సౌదీ అరేబియా రాజు మహమ్మద్ బిన్ సల్మాన్ అధ్యక్షతన కొత్తగా అవినీతి వ్యతిరేక కమిషన్‌ను ఏర్పాటు చేసింది. అవినీతి ఆరోపణలపై విచారణ ప్రారంభించిన ఈ కమిషన్ పలువురు అత్యున్నత స్థాయి వ్యక్తులను సైతం అరెస్టు చేసింది.
- సమాధానం: 1
48. భారత్‌లో జరిగిన పానసోనిక్ ఓపెన్ గోల్ఫ్ టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు ?
1) అదితి అశోక్
2) జీవ్ మిల్కా సింగ్
3) శివ్ కపూర్
4) అనిర్బన్ లహరి
- View Answer
- సమాధానం: 3
వివరణ: భారత స్టార్ గోల్ఫర్ శివ కపూర్ ఢిల్లీలో జరిగిన పానసోనిక్ ఓపెన్ టోర్నీ టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఈ ఏడాది శివకపూర్ కు ఇది రెండో ఆసియా టూర్ టైటిల్ కాగా భారత్‌లో మొదటిది.
- సమాధానం: 3
49. విదేశాల్లో పనిచేసే భారతీయులకు ఏ సౌకర్యం కల్పించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది ?
1) ఈఎస్ఐ
2) గృహ రుణం
3) ఉచిత ప్రయాణ సౌకర్యం
4) ప్రావిడెంట్ ఫండ్
- View Answer
- సమాధానం: 4
వివరణ: విదేశాల్లో పనిచేసే భారతీయులకు ప్రావిడెంట్ ఫండ్‌లో చేరే అవకాశాన్ని కల్పించనున్నట్ల కేంద్ర ప్రావిడెంట్ ఫండ్ విభాగం వెల్లడించింది. దీని కోసం కేంద్రం 18 దేశాలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో చేరాలంటే ఆయా దేశాల్లో వారు పొందుతున్న సోషల్ సెక్యురిటీ పథకాన్ని వదులుకోవాల్సి ఉంటుంది.
- సమాధానం: 4
50. న్యూ పెన్షన్ స్కీమ్(NPS)లో చేరేందుకు గరిష్ట వయోపరిమితిని కేంద్రం ఎంతకు పెంచింది ?
1) 60 ఏళ్లు
2) 65 ఏళ్లు
3) 68 ఏళ్లు
4) 70 ఏళ్లు
- View Answer
- సమాధానం: 2
వివరణ: న్యూ పెన్షన్ స్కీమ్‌లో చేరేందుకు60 ఏళ్లుగా ఉన్నగరిష్ట వయో పరిమితిని 65 ఏళ్లకు పెంచుతు పెన్షన్ ఫండ్ నియంత్రణ సంస్థ పీఎఫ్ఆర్డీఏ నిర్ణయం తీసుకుంది.
- సమాధానం: 2