కరెంట్ అఫైర్స్ (మే 17 - 23, 2017) బిట్ బ్యాంక్
1. పబ్లిక్ అఫైర్స్ సెంటర్ ఇండెక్స్ - 2017 ద్రవ్యనిర్వహణ విభాగంలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది ?
1) మహారాష్ట్ర
2) ఆంధ్రప్రదేశ్
3) తెలంగాణ
4) కర్ణాటక
- View Answer
- సమాధానం: 3
వివరణ: ద్రవ్య నిర్వహణలో తెలంగాణ మొదటి స్థానం దక్కించుకోగా.. ఆంధ్రప్రదేశ్ 28వ స్థానంలో నిలిచింది. రెవెన్యూ లోటు, మిగులు, ద్రవ్య మిగులు, రుణ భారం, తలసరి అభివృద్ధి వ్యయం, రాష్ట్రాల సొంత పన్నుల ఆదాయం తదితర విషయాలను పరిగణనలోకి తీసుకొని ద్రవ్య నిర్వహణ ర్యాంకులు ప్రకటిస్తారు.
- సమాధానం: 3
2. పబ్లిక్ అఫైర్స్ సెంటర్ ఇండెక్స్ - 2017 "పారదర్శకత, జవాబుదారీతనం" విభాగంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల స్థానం వరుసగా ?
1) 14, 26
2) 15, 27
3) 2, 1
4) 23, 14
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఈ విభాగంలో ఆంధ్రప్రదేశ్ 23వ స్థానంలో నిలవగా, తెలంగాణ 14వ స్థానంలో ఉంది. ఈ - గవర్నెన్స్ సేవలు, ఆర్టీఐ, లోకాయుక్త, ఏసీబీ కేసుల పరిష్కారం, ఎమ్మెల్యేల క్రిమినల్ రికార్డు తదితర అంశాల ఆధారంగా ఈ ర్యాంకులు కేటాయించారు.
- సమాధానం: 4
3. ICT 4D (ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఫర్ డెవలప్మెంట్) అంతర్జాతీయ సదస్సు ఎక్కడ జరిగింది ?
1) న్యూఢిల్లీ
2) హైదరాబాద్
3) ముంబయి
4) బెంగళూరు
- View Answer
- సమాధానం: 2
వివరణ: 9వ ICT 4D సదస్సు హైదరాబాద్‌లో మే 15-18 వరకు జరిగింది. ఐటీ సహాయంతో సుస్థిరాభివృద్ధి అనే అంశంపై జరిగిన ఈ సదస్సులో 74 దేశాలకు చెందిన 800 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. వ్యవసాయం, విద్య, వైద్య రంగాల్లో డిజిటల్ టెక్నాలజీ విస్తృత వినియోగంపై చర్చించారు.
- సమాధానం: 2
4. 2వ దశ రూర్బన్ కార్యక్రమంలో తెలంగాణకు ఎన్ని క్లస్టర్లు మంజూరయ్యాయి ?
1) 2
2) 3
3) 4
4) 1
- View Answer
- సమాధానం: 2
వివరణ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్యాం ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్‌లో భాగంగా 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్రం మంజూరు చేసిన రూర్బన్ క్లస్టర్లలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్, భూపాలపల్లి జిల్లా నాగారం, నాగర్ కర్నూల్ జిల్లా వెన్నెలచర్ల ఉన్నాయి. క్లస్టర్ల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తితో నిధులు వెచ్చిస్తాయి. 2016 ఫిబ్రవరి 21న ప్రారంభించిన ఈ పథకం ముఖ్య ఉద్దేశం గ్రామాల్లో పట్టణస్థాయి వసతులు, ఉపాధి అవకాశాలు కల్పించడం. గ్రామాల నుంచి వలసలు నిరోధించడం.
- సమాధానం: 2
5. సంతోష సూచీ - 2017లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నో స్థానంలో నిలిచింది ?
1) 52
2) 62
3) 72
4) 82
- View Answer
- సమాధానం: 3
వివరణ: ప్రపంచ సంతోష సూచీ - 2017 నివేదికలో ఆంధ్రప్రదేశ్ 72వ స్థానంలో నిలిచిందనిఆ రాష్ట్ర ప్రభుత్వం మే 16న ప్రకటించింది. ఈ నివేదికలో 4.315 స్కోరుతో భారత్ 122వ ర్యాంకులో నిలిచిందని.. 5.388 స్కోరుతో ఉన్న ఆంధ్రప్రదేశ్ ర్యాంకు 72తో సమానమని పేర్కొంది. ఈ సూచీలో శ్రీకాకుళం జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా ప్రకాశం జిల్లా చివరి స్థానంలో ఉంది.
- సమాధానం: 3
6. ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన మధ్యంతర సమీక్ష ప్రకారం 2018లో భారత వృద్ధిరేటు ఎంత ?
1) 8 శాతం
2) 7.8 శాతం
3) 7.3 శాతం
4) 6.8 శాతం
- View Answer
- సమాధానం: 1
7. ప్రపంచ బ్యాంకు ఇటీవల విడుదల చేసిన విద్యుద్దీకరణ ర్యాంకింగ్స్‌లో భారత్ స్థానం ఎంత ?
1) 22
2) 24
3) 26
4) 28
- View Answer
- సమాధానం: 3
వివరణ: 2014 నివేదికలో 99వ స్థానంలో ఉన్న భారత్ ఈ సారి పురోగతి సాధించి 26వ ర్యాంకుకు ఎగబాకింది. 3 ఏళ్ల క్రితం దేశంలో విద్యుత్ సదుపాయం లేని గ్రామాలు 18,452. కాగా.. 2015లో దీన్ దయాల్ ఉపాధ్యాయ్ గ్రామ్ జ్యోతి యోజనను ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం 2 ఏళ్ల కాలంలో 13 వేల గ్రామాలను విద్యుత్ వ్యవస్థతో అనుసంధానం చేసింది. 2022 నాటికి దేశంలోని అన్ని గ్రామాలకు నిరంతర విద్యుత్ సరఫరా చేయడమే ఈ పథకం లక్ష్యం.
- సమాధానం: 3
8. ఇండియన్ గ్రాండ్ ప్రీ అథ్లెటిక్స్ మహిళల 100 మీటర్ల విభాగంలో విజేత ఎవరు ?
1) మెర్లిన్ జోసిఫ్
2) ద్యుతి చంద్
3) హిమశ్రీ రాయ్
4) రాజేశ్వరి గైక్వాడ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: మే 15న న్యూఢిల్లీలో జరిగిన ఫైనల్ రేసుని 11.30 సెకన్లలో పూర్తి చేసిన ఒడిశా స్ప్రింటర్ ద్యుతి చంద్ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. మెర్లిన్ జోసిఫ్ రజతం, హిమశ్రీ రాయ్ కాంస్యం గెలుచుకున్నారు.
- సమాధానం: 2
9. ఇటీవల మరణించిన ఎస్. రామస్వామి ఏ రాష్ట్ర/కేంద్ర పాలిత ప్రాంత మాజీ ముఖ్యమంత్రి ?
1) కేరళ
2) తమిళనాడు
3) లక్షద్వీప్
4) పుదుచ్చేరి
- View Answer
- సమాధానం: 4
వివరణ: పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి ఎస్.రామస్వామి మే 15న మరణించారు. ఆయన 1969 నుంచి 1973 మధ్య కాలంలో డీఎంకే - సీపీఐ సంకీర్ణ ప్రభుత్వంలో హోం మంత్రిగా పనిచేశారు. 1973లో ఏఐఏడీఎంకేలో చేరారు. 1974లో ఏఐఏడీఎంకే - సీపీఐ సంకీర్ణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1992లో కాంగ్రెస్‌లో చేరారు.
- సమాధానం: 4
10. నేషనల్ ఫ్లాట్‌ఫామ్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ 2వ సదస్సు ఏ నగరంలో జరిగింది ?
1) గాంధీనగర్
2) విశాఖపట్నం
3) న్యూఢిల్లీ
4) వారణాసి
- View Answer
- సమాధానం: 3
వివరణ: మే 15-16 తేదీల్లో న్యూఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమాన్ని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు.
Theme : Disaster risk reduction for sustainable development : making india resilient by 2030.
- సమాధానం: 3
11. ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్-2017లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయుడు ఎవరు ?
1) అమిత్ అగర్వాల్
2) సరితమాన్
3) బజ్రంగ్ పునియా
4) సుమిత్ కుమార్
- View Answer
- సమాధానం: 3
వివరణ: పురుషుల 65 కేజీల ఫ్రీ స్టయిల్ విభాగంలో సౌత్ కొరియాకు చెందిన సెంగుయ్లీపై విజయం సాధించిన బజ్రంగ్ పునియా తొలి బంగారు పతకాన్ని సాధించాడు. మహిళల 58 కేజీల విభాగంలో సరితమాన్, పురుషుల 125 కేజీల ఫ్రీ స్టయిల్ విభాగంలో సుమిత్ కుమార్‌లు వెండి పతకాన్ని గెలుచుకున్నారు.
- సమాధానం: 3
12. నందన్ కానన్ జులాజికల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది ?
1) తమిళనాడు
2) ఒడిశా
3) అస్సోం
4) ఉత్తరాఖండ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: భువనేశ్వర్‌లో ఉన్న ఈ పార్కులో దేశంలోనే అత్యధిక సంఖ్యలో తెల్ల పులులు ఉన్నాయి. ఈ పార్కులో మొత్తం 166 జాతులకు చెందిన జంతువులు ఉన్నాయి.
- సమాధానం: 2
13. ప్రపంచంలోనే తేలికైన, చిన్నదైన ఉపగ్రహం కలామ్శాట్ని తయారు చేసిన రిఫత్ షరూక్ ఏ రాష్ట్రానికి చెందినవాడు ?
1) జమ్ము కశ్మీర్
2) తెలంగాణ
3) తమిళనాడు
4) రాజస్తాన్
- View Answer
- సమాధానం: 3
వివరణ: కలామ్‌శాట్ ఉపగ్రహం బరువు 64 గ్రాములు. దీనిని నాసా 2017 జూన్ 21న ప్రయోగించింది. దీంతో నాసా ప్రయోగించిన ఉపగ్రహాన్ని తయారు చేసిన తొలి భారతీయ విద్యార్థిగా రిఫత్ గుర్తింపు పొందాడు. ఈ ఉపగ్రహం 3-డీ ప్రింటెడ్ కార్బన్ ఫైబర్ పనితీరుని పరిశీలిస్తుంది.
- సమాధానం: 3
14. పన్నుల పరిపాలనలో పారదర్శకత కోసం ఏ కేంద్రమంత్రి ఆపరేషన్ క్లీన్ మనీని ప్రారంభించారు ?
1) సుష్మా స్వరాజ్
2) అరుణ్ జైట్లీ
3) నరేంద్ర మోదీ
4) రాజ్‌నాథ్ సింగ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మే 16న ఆపరేషన్ క్లీన్ మనీ ప్రత్యేక పోర్టల్ www.cleanmoney.gov.in ను న్యూఢిల్లీలో ప్రారంభించారు. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఈ పోర్టల్‌ను తయారు చేసింది.
- సమాధానం: 2
15. మధ్యాహ్న భోజన పథకం నాణ్యతను పరిశీలించేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం మా(MAA) కమిటీని ఏర్పాటు చేసింది ?
1) తమిళనాడు
2) ఉత్తరప్రదేశ్
3) కర్ణాటక
4) తెలంగాణ
- View Answer
- సమాధానం: 2
వివరణ: పాఠశాలలో చదువుతున్న వివిధ వర్గాలకు చెందిన పిల్లల తల్లులు (ఆరుగురు) ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. వీరు వంటశాలల పరిశుభ్రత, ఆహార నాణ్యతను పర్యవేక్షిస్తారు.
- సమాధానం: 2
16. ఏ శాస్త్ర విభాగంలో చేసిన కృషికిగాను భారత శాస్త్రవేత్త శ్రీనివాస్ కులకర్ణి ప్రఖ్యాత ఇజ్రాయెల్ డేన్ డేవిడ్ పురస్కారాన్ని అందుకున్నారు ?
1) రసాయనశాస్త్రం
2) గణిత శాస్త్రం
3) జీవశాస్త్రం
4) అంతరిక్ష విభాగం
- View Answer
- సమాధానం: 4
వివరణ: శ్రీనివాస కులకర్ణి ప్రస్తుతం అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఖగోళ భౌతిక శాస్త్ర అధ్యాపకుడిగా పని చేస్తున్నారు.
- సమాధానం: 4
17. ఇటీవల మరణించిన ప్రఖ్యాత గాయకుడు క్రిస్ కార్నెల్ ఏ దేశస్థుడు ?
1) జపాన్
2) ఫ్రాన్స్
3) జర్మనీ
4) అమెరికా
- View Answer
- సమాధానం: 4
వివరణ: ప్రఖ్యాత అమెరికన్ మ్యూజిషియన్, గాయకుడు, పాటల రచయిత క్రిస్ కార్నెల్ ఇటీవల మిచిగాన్‌లో మరణించారు.
- సమాధానం: 4
18. ఏ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యార్థుల కోసం ఇ-టెక్స్ట్‌బుక్ పోర్టల్‌ను ప్రారంభించంది ?
1) కేరళ
2) కర్ణాటక
3) హర్యానా
4) ఆంధ్రప్రదేశ్
- View Answer
- సమాధానం: 3
వివరణ: ప్రస్తుతం 9 నుంచి 12వ తరగతికి సంబంధించిన 26 పుస్తకాలను ఈ పోర్టల్‌లో అందుబాటులో ఉంచింది. వీటిని సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరియు ఆడియో ఫైల్స్గాను మార్చుకోవచ్చు.
- సమాధానం: 3
19. ఇటీవల ఏ కమిటీ గంగానది మృత్తికా నిక్షేపాల నిర్మూలనకై (de-silting) తీసుకోవాల్సిన చర్యలను సిఫార్సు చేసింది ?
1) జె.పి. నడ్డా కమిటీ
2) కె.ఎస్.ఎస్. బె నర్జీ కమిటీ
3) ముకేశ్ సిన్హా కమిటీ
4) మాధ వ్ చితాలే
- View Answer
- సమాధానం: 4
20. స్పేస్ ఎక్స్ ఏ దేశానికి చెందిన అంతరిక్ష సంస్థ?
1) అమెరికా
2) రష్యా
3) జపాన్
4) ఫ్రాన్స్
- View Answer
- సమాధానం: 1
వివరణ: అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ మే 16న ఫ్లోరిడాలోని కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి 6,100 కి లోల బరువున్న భారీ ఉపగ్రహం ఇన్మార్ శాట్-5 ఎఫ్ 4ను ప్రయోగించి విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది.
- సమాధానం: 1
21. ఐపీఎల్ - 10 టైటిల్ విజేత ఎవరు ?
1) రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్
2) ముంబై ఇండియన్స్
3) సన్‌రైజర్స్ హైదరాబాద్
4) కోల్కత్తా నైట్ రైడర్స్
- View Answer
- సమాధానం: 2
వివరణ: మే 21న హైదరాబాద్‌లో జరిగిన ఐపీఎల్ - 10 ఫైనల్లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్‌ను ఓడించి ముంబై ఇండియన్స్ మూడోసారి (2013, 2015, 2017)టైటిల్‌ను గెలుచుకుంది.
- సమాధానం: 2
22. డెన్నిస్ స్వామి ఏ క్రీడకు సంబంధించిన వ్యక్తి ?
1) క్రికెట్
2) హాకీ
3) బాక్సింగ్
4) ఆర్చెరీ
- View Answer
- సమాధానం: 3
వివరణ: డెన్నిస్ స్వామి.. అంతర్జాతీయ బాక్సింగ్ క్రీడాకారుడు. ఆంధ్రప్రదేశ్ తరపున తొలి అర్జున అవార్డు (1968) గ్రహీత. 1960 నుంచి 1970 వరకు పదేళ్ల పాటు జాతీయ చాంపియన్‌గా నిలిచారు. ఆయన మే 16న హైదరాబాద్‌లో కన్నుమూశారు.
- సమాధానం: 3
23. 2014 సంవత్సరానికి గాను ఇందిరా గాంధీ శాంతి పురస్కారం ఎవరు పొందారు?
1) ఇస్రో
2) unhcr
3) ఎంజెలా మోర్కెల్
4) ఎలెన్ జాన్సన్ సిర్లీఫ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఇస్రో ఛైర్మన్ కిరణ్ కుమార్ మే 17న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. 2015 సంవత్సరానికి గాను unhcr, 2013 సంవత్సరానికి గాను ఎంజెలా మోర్కెల్, 2012 సంవత్సరానికి గాను ఎలెన్ జాన్సన్ సిర్లీఫ్ ఈ అవార్డు పొందారు.
- సమాధానం: 1
24. లాన్సెట్ ఆరోగ్య సర్వేలో భారత్ ర్యాంకు ఎంత ?
1) 154
2) 145
3) 164
4) 158
- View Answer
- సమాధానం: 1
వివరణ: వైద్య సదుపాయాల లభ్యత, నాణ్యత లక్ష్యాలను అందుకోవడంలో వెనుకబడ్డ భారత్ ఈ సర్వేలో 154వ స్థానంలో నిలిచింది. ఈ మేరకు 195 దేశాల్లో నిర్వహించిన గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ స్టడీస్ నివేదికను లాన్సెట్ జర్నల్ మే 18న ప్రచురించింది. ఈ నివేదికలో తొలి మూడు స్థానాల్లో స్విట్జర్లాండ్, స్వీడన్, నార్వే నిలువగా అమెరికా తొలిసారి 30వ స్థానానికి పడిపోయింది.
- సమాధానం: 1
25. రైతులకు భూమి వివరాలు అందుబాటులో ఉంచటంతో పాటు పంట వివరాలను ఎప్పటికప్పుడు చేరవేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏ పేరుతో మొబైల్ ఆప్‌ను ప్రారంభించింది ?
1) తెలంగాణ రైతు
2) మన తెలంగాణ - మన భూమి
3) మనభూమి - మనపంట
4) మన తెలంగాణ -మన పంట
- View Answer
- సమాధానం: 3
వివరణ: మే 22న తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ఈ ఆప్‌ని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ రూపొందించింది. ఇది రాష్ట్రస్థాయిలో వ్యవసాయ సమాచార డాటాబేస్గా ఉపయోగపడుతుంది.
- సమాధానం: 3
26. నాసాఇటీవల గుర్తించిన అంతరిక్ష సూక్ష్మ జీవికి ఏ శాస్త్రవేత్త పేరుతో నామకరణం చేసింది ?
1) ఎ.ఎన్. కిరణ్ కుమార్
2) రాధాకృష్ణన్
3) ఏపీజే అబ్దుల్ కలాం
4) సతీశ్ ధావన్
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఈ సూక్ష్మ జీవి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో తప్ప ఇంతవరకు ఎప్పుడు భూమిపై కనిపించలేదు. ఈ జీవికి శాస్త్రవేత్తలు సొలిబెసిల్లస్ కలామీ అని పేరు పెట్టారు. 1963లో కలాం నాసాలో శిక్షణ పొందారు.
- సమాధానం: 3
27. ప్రసూతి ప్రయోజన పథకానికి కేంద్ర కేబినెట్ ఏ రోజున ఆమోదం తెలిపింది ?
1) మే 16, 2017
2) మే 17, 2017
3) మే 18, 2017
4) మే 19, 2017
- View Answer
- సమాధానం: 2
వివరణ: గర్భిణులు, పాలిచ్చే తల్లులకు రూ.6 వేల ఆర్థిక సహాయాన్ని అందించే ప్రసూతి ప్రయోజన పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం మొదటి కాన్పుకు మాత్రమే వర్తిస్తుంది. గర్భవతిగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు రూ.1000, 6 నెలల తర్వాత రూ.2,000, ఆస్పత్రిలో బిడ్డ పుట్టినప్పుడు రూ. 1500, చైల్డ్ బర్త్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు మరో రూ.1500 అందజేస్తారు.
- సమాధానం: 2
28. జనసాంద్రత పరంగా మొదటి స్థానంలో ఉన్న నగరం ఏది ?
1) చెన్నై
2) హైదరాబాద్
3) బెంగళూరు
4) కోల్కత్తా
- View Answer
- సమాధానం: 3
వివరణ: హెచ్ఎండీకు కన్సెల్టెంట్‌గా వ్యవహరిస్తున్న ప్రముఖ సంస్థ లీ అసోసియేట్స్ మే 20న విడుదల చేసిన నివేదిక ప్రకారం జన సాంద్రతలో ముంబై, ఢిల్లీ, బెంగళూరు నగరాలు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. ముంబైలో చదరపు కిలోమీటరుకు 21,000 మంది, ఢిల్లీలో 20,932 మంది, బెంగళూరులో 11,909 మంది నివసిస్తున్నారు. 10,263 మందితో హైదరాబాద్ నాలుగో స్థానంలో ఉంది.
- సమాధానం: 3
29. దేశంలోని ఏ మెట్రో నగరం సోషల్ మీడియా వినియోగంలో మొదటి స్థానంలో ఉంది ?
1) బెంగళూరు
2) న్యూఢిల్లీ
3) ముంబై
4) హైదరాబాద్
- View Answer
- సమాధానం: 1
వివరణ: సోషల్ మీడియా ట్రెండ్స్ అనే సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం సోషల్ మీడియా వినియోగంలో బెంగళూరు మొదటి స్థానంలో నిలవగా ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. హైదరాబాద్‌లో 40 లక్షల మంది సామాజిక మాధ్యమాలు వినియోగిస్తున్నట్లు ఈ సర్వే అంచనా వేసింది.
- సమాధానం: 1
30. దేశంలో తొలి లగ్జరీ రైలు తేజస్‌ను ఏ ప్రాంతాల మధ్య ప్రారంభించారు ?
1) ముంబై - చెన్నై
2) ముంబై - గోవా
3) ముంబై - హైదరాబాద్
4) ముంబై - సికింద్రాబాద్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ముంబైలోని ఛత్రపతి శివాజీ టర్మినల్ నుంచి గోవాలోని కర్మాలి స్టేషన్ల మధ్య నడిచే తొలి తేజస్ రైలుని కేంద్ర మంత్రి సురేశ్ ప్రభు మే 22న ముంబైలో జెండా ఊపి ప్రారంభించారు.
- సమాధానం: 2
31. భారత శాస్త్ర, పరిశోధన సంస్థల్లో ఎన్ఆర్ఐ, విదేశీ శాస్త్రవేత్తలు ఎన్ని నెలలు పనిచేసేలా కేంద్రం "వజ్ర" కార్యక్రమాన్ని ప్రారంభించింది ?
1) 3 నెలలు
2) 4 నెలలు
3) 6 నెలలు
4) 12 నెలలు
- View Answer
- సమాధానం: 1
వివరణ: భారతీయ విద్యార్థులకు విదేశీ పరిశోధనల సంస్కృతిని పరిచయం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వజ్ర( విజిటింగ్ అడ్వాన్స్డ్ జాయింట్ రీసర్చ్) కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో ఎన్ ఆర్ఐ, విదేశీ శాస్త్రవేత్తలు భాగస్వాములవుతారు. వారికి మొదటి నెల రూ.9.7 లక్షలు, తర్వాతి రెండు నెలలకు రూ.6.48 లక్షలు వేతనంగా ఇస్తారు.
- సమాధానం: 1
32. దేశీయ వలసల్లో భారత్ స్థానం ఎంత ?
1) 2
2) 3
3) 4
4) 5
- View Answer
- సమాధానం: 2
వివరణ: అంతర్గత వలసల పర్యవేక్షణ కేంద్రం(ఐడీఎంసీ), నార్వేజియన్ శరణార్థుల మండలి(ఎన్ఆర్సీ) మే 22న విడుదల చేసిన నివేదిక ప్రకారం అత్యధికంగా చైనాలో 74 లక్షల మంది అంతర్గతంగా వలస వెళుతున్నారు. 59 లక్షలతో ఫిలిప్పైన్స్ రెండో స్థానంలో ఉండగా 24 లక్షలతో భారత్ 3వ స్థానంలో ఉంది.
- సమాధానం: 2
33. రైల్వేల్లో స్వచ్ఛత నివేదికలో మొదటి స్థాన ంలో నిలిచిన రైల్వే జోన్ ఏది ?
1) ఆగ్నేయ మధ్య రైల్వే
2) తూర్పు కోస్తా రైల్వే
3) దక్షిణ మధ్య రైల్వే
4) పశ్చిమ రైల్వే
- View Answer
- సమాధానం: 1
వివరణ: కేంద్ర ప్రభుత్వం రైల్వేలో స్వచ్ఛత చర్యల్లో భాగంగా మే 17న ఈ నివేదికను విడుదల చేసింది.
- సమాధానం: 1
34. 2017 జీ 20 లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్ మినిస్టర్ల మీటింగ్‌లో భారత్ తరపున ప్రాతినిధ్యం వహించింది ఎవరు ?
1) రజిత్ పున్హాని
2) బండారు దత్తాత్రేయ
3) సుష్మా స్వరాజ్
4) అరుణ్ జైట్లీ
- View Answer
- సమాధానం: 2
వివరణ: మే 18-19 తేదీల్లో జీ 20 లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్ మినిస్టర్ల సదస్సు జర్మనీలోని బ్యాడ్న్యూనర్లో జరిగింది. భారత్ తరపున ఈ సదస్సులో పాల్గొన్న కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ.. కార్మిక సంక్షేమం కోసం ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు.
Theme : Towards an inclusive feature - shaping the world of work.
- సమాధానం: 2
35. ఎవరెస్ట్ శిఖరాన్ని ఐదు సార్లు అధిరోహించిన మొదటి భారతీయ మహిళ ఎవరు ?
1) అన్షు జమ్సెప్ప
2) లక్పాషెర్పా
3) ప్రేమలత అగర్వాల్
4) మళావత్ పూర్ణ
- View Answer
- సమాధానం: 1
వివరణ: అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన అన్షు జమ్సెప్ప ఐదు రోజుల వ్యవధిలో రెండు సార్లు ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి ఈ రికార్డును నెలకొల్పింది. అంతకముందు మూడు సార్లు ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారు. ఆమె ఇటీవల ఈశాన్య రాష్ట్రాల పర్యాటక రంగానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నామినేట్ అయ్యారు.
- సమాధానం: 1
36. రైల్వే మంత్రిత్వశాఖ ఇటీవల విడుదల చేసిన పరిశుద్ధ రైల్వేస్టేషన్ జాబితా ఏ1 విభాగంలో మొదటి స్థానం పొందిన స్టేషన్ ఏది ?
1) విశాఖపట్నం
2) జమ్ముతవి
3) సికింద్రాబాద్
4) ఆనంద్ విహార్ టర్మినల్
- View Answer
- సమాధానం: 1
వివరణ: 75 స్టేషన్లతో కూడిన ఈ జాబితాలో విశాఖపట్నం స్టేషన్ మొదటి స్థానంలో నిలవగా సికింద్రాబాద్, జమ్ముతావి, విజయవాడ, ఆనంద్‌విహార్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
- సమాధానం: 1
37. లండన్ వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ - 2017కి అర్హత సాధించిన మహ్మద్ అనాస్ ఏ రాష్ట్రానికి చెందినవాడు ?
1) రాజస్తాన్
2) జమ్ముకశ్మీర్
3) పశ్చిమ బెంగాల్
4) కేరళ
- View Answer
- సమాధానం: 4
38. విట్లే అవార్డు - 2017 పొందిన భారతీయ వన్యప్రాణి సంరక్షణ కార్యకర్త (Wildlife activist) ఎవరు ?
1) పూర్ణిమ బర్మన్
2) అరుణ సభనే
3) షారియర్ కబీర్
4) నరేష్ కడ్యన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: విట్లే అవార్డు-2017ను అస్సోం రాష్ట్రానికి చెందిన డా.పూర్ణిమ బర్మన్, కర్ణాటక రాష్ట్రానికి చెందిన సంజయ్ గుబ్బిలకు ప్రకటించారు. అవార్డు కింద వీరు 35 వేల పౌండ్ల ప్రైజ్‌మనీ పొందారు. విట్లే అవార్డుని గ్రీన్ ఆస్కార్ గాను పిలుస్తారు.
- సమాధానం: 1
39. ఇటీవల మరణించిన అనిల్ మాధవ్ ధవే ఏ విభాగానికి కేంద్ర మంత్రిగా పనిచేశారు ?
1) కార్మిక, ఉపాధి కల్పన
2) పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్
3) వైద్య, ఆరోగ్య శాఖ
4) పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ
- View Answer
- సమాధానం: 4
వివరణ: అనిల్ మాధవ్ ధవే నర్మదా నది సంరక్షణకై నర్మదా సమగ్ర అనే సంస్థను ప్రారంభించి ప్రత్యేక గుర్తింపు సాధించారు.
- సమాధానం: 4
40. ఇటీవల మరణించిన రీమాలాగు ఏ రంగానికి చెందిన వారు ?
1) న్యాయ రంగం
2) జర్నలిజం
3) సినీ రంగం
4) రాజకీయ రంగం
- View Answer
- సమాధానం: 3
వివరణ: 2017 మే 18న ముంబైలో మరణించిన రీమాలాగు బాలీవుడ్లో ప్రముఖ చిత్రాలలో తల్లి పాత్ర పోషించారు. ఆమె నటించిన చిత్రాలు హమ్ సాత్ హై, కుచ్ కుచ్ హోతాహై, కల్ హో న హో.
- సమాధానం: 3
41. వరల్డ్ టెలికమ్యూనికేషన్ మరియు ఇన్ఫర్మేషన్ సొసైటీ డే (WTISD) - 2017 థీమ్ ఏంటి ?
1) బిగ్ డేటా ఫర్ బిగ్ ఇంపాక్ట్
2) ఎంటర్పెన్యుర్షిప్ ఫర్ సోషల్ ఇంపాక్ట్
3) రెడ్యుస్ డిజిటల్ డివైడ్
4) ప్రమోట్ డిజిటల్ ఎడ్యుకేషన్ ఫర్ సోషల్ వెల్ఫేర్
- View Answer
- సమాధానం: 1
వివరణ: మొదటి ఇంటర్నేషనల్ టెలిగ్రాఫ్ కన్వెన్షన్ (ITC), ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ప్రారంభించిన సందర్భంగా ఏటా మే 17న ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఇంటర్నెట్, ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ జ్ఞానం, అవకాశాలను అందరికీ తెలియజేయడమే దీని లక్ష్యం.
- సమాధానం: 1
42. ఇండియన్ నేవి 2017 హెచ్ఏడీఆర్ ఎక్సర్సైజ్ '' కరావళి కారుణ్య'' ను ఏ రాష్ట్ర తీరంలో నిర్వహించింది ?
1) ఆంధ్రప్రదేశ్
2) కర్ణాటక
3) కేరళ
4) తమిళనాడు
- View Answer
- సమాధానం: 2
వివరణ: వార్షిక సంయుక్త హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ (HADR) సైనిక విన్యాసాలను కరావళి కారుణ్య పేరుతో భారత నేవీ కర్ణాటకలోని కర్వార్ నావల్ కోస్ట్ స్టేషన్లో మే 18 - 20 వరకు నిర్వహించింది.
- సమాధానం: 2
43. భూమిపై అత్యంత కాలుష్య ప్రాంతం ఏది ?
1) హేండర్సన్ దీవి
2) మలక్కా దీవి
3) సుమత్రా దీవి
4) మారియానో దీవి
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఇన్సిస్టిట్యూట్ ఫర్ మెరైన్ (ది యూనివర్సిటీ ఆఫ్ టాస్మానియా) కు చెందిన శాస్త్రవేత్తలు హెండర్సన్ దీవిని(దక్షిణ ఫసిఫిక్) భూమిపై అత్యంత కాలుష్యం గల ప్రాంతంగా ప్రకటించారు. ప్లాస్టిక్ వ్యర్థాలు కొట్టుకురావడం వల్ల ఈ దీవిలో 17.6 టన్నుల వ్యర్థాలు పోగయ్యాయి.
- సమాధానం: 1
44. బ్రాండ్ ఫైనాన్స్ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం అత్యంత విలువైన భారతీయ బ్రాండ్ ఏది ?
1) ఎల్ఐసీ
2) టాటా గ్రూప్
3) ఎయిర్టెల్
4) అదానీ గ్రూప్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఈ సంస్థ నివేదిక ప్రకారం 13.1 బిలియన్ అమెరికన్ డాలర్ల బ్రాండ్ విలువతో టాటా గ్రూప్ తొలి స్థానంలో ఉంది. 7.7 బిలియన్ అమెరికన్ డాలర్లతో ఎయిర్టెల్ రెండో స్థానంలో, 6.8 బిలియన్ అమెరికన్ డాలర్లతో ఎల్ఐసీ మూడో స్థానంలో ఉన్నాయి.
- సమాధానం: 2
45. Mount Lhotse ను ఇటీవల ఎవరు అధిరోహించారు ?
1) జాన్ విక్టర్
2) అన్షు జామ్సెన్పా
3) షెర్పా మూరి
4) దేబాసిష్ బిస్వాస్
- View Answer
- సమాధానం: 4
వివరణ: ప్రపంచంలో నాల్గవ ఎత్తయిన పర్వతం Mount Lhotse (8516 మీ)ను భారత్‌కు చెందిన దేబాసిష్ బిస్వాస్ అధిరోహించారు.
- సమాధానం: 4
46. ప్రపంచ రక్త పోటు దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
1) మే 17
2) మే 19
3) మే 21
4) మే 23
- View Answer
- సమాధానం: 1
వివరణ: హైపర్ టెన్షన్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 2005 నుంచి ఏటా మే 17న ప్రపంచ రక్తపోటు దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
2017 Theme : Know your numbers
- సమాధానం: 1
47. ప్రతిష్టాత్మక మార్క్ టై్వన్ పురస్కారం - 2017కు ఎవరు ఎంపికయ్యారు ?
1) స్టిఫెన్ కింగ్స్
2) విలియమ్ ఫాల్స్ర్
3) డేవిడ్ లెటర్మాన్
4) సల్మాన్ రష్ది
- View Answer
- సమాధానం: 3
వివరణ: అమెరికా రచయిత మార్క్ టై్వన్ గౌరవార్థం 1998లో ఈ పురస్కారాన్ని ప్రారంభించారు.
- సమాధానం: 3
48. ప్రపంచ మెట్రాలాజీ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు ?
1) మే 18
2) మే 20
3) మే 22
4) మే 24
- View Answer
- సమాధానం: 2
వివరణ: ప్రపంచ మెట్రాలాజీ దినోత్సవం - 2017 Theme : Measurements for transport.
- సమాధానం: 2
49. జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
1) మే 16
2) మే 10
3) మే 20
4) మే 21
- View Answer
- సమాధానం: 4
వివరణ: మే 21న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని ఈ రోజుని Anti Terrorism Dayగా నిర్వహిస్తారు. తీవ్రవాదం వల్ల కలిగే ప్రమాదాలు, నష్టంపై అన్ని వర్గాల ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ రోజున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
- సమాధానం: 4
50. జైపూర్ సాహిత్య ఉత్సవాలు - 2017 ఎక్కడ నిర్వహించారు ?
1) లండన్
2) న్యూయార్క్
3) టొరంటో
4) సిడ్నీ
- View Answer
- సమాధానం: 1