కరెంట్ అఫైర్స్ మార్చి (8 – 15) బిట్ బ్యాంక్
1. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
1) మార్చి 8
2) మార్చి 10
3) మార్చి 12
4) మార్చి 14
- View Answer
- సమాధానం: 1
వివరణ: 1975లో ఐక్యరాజ్య సమితి మార్చి 8ని మహిళా దినోత్సవంగా ప్రకటించింది. అయితే దీనికి ఎన్నో ఏళ్ల ముందు నుంచి కూడా అనేక దేశాల్లో మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. తొలిసారిగా అమెరికాలో 1909లో ఫిబ్రవరి 28ని మహిళా దినోత్సవంగా పాటించారు. పురుషులతో సమానంగా మహిళల హక్కులు సాధించే లక్ష్యంతో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు.
Theme : Press For Progress
-
2. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం ఎంతకు చేరుకుందని ఇటీవల ప్రవేశపెట్టిన సామాజిక, ఆర్థిక సర్వే వెల్లడించింది?
1) రూ.1,23,664
2) రూ.1,42,054
3) రూ.75,560
4) రూ. 2 లక్షలు
- View Answer
- సమాధానం: 2
వివరణ: 2017-18 ఆంధ్రప్రదేశ్ సామాజిక, ఆర్థిక సర్వేని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మార్చి 8న అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దీని ప్రకారం 2017-18 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో తలసరి ఆదాయం 14.87 శాతం పెరుగుదలతో రూ.1,42,054కు చేరుకుంది. 2016-17లో ఇది రూ.1,23,664 గా ఉంది.
- సమాధానం: 2
3. స్థిర ధరల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) ఎన్ని కోట్ల రూపాయలుగా నమోదైనట్లు 2017-18 ఆర్థిక సర్వే పేర్కొంది?
1) రూ.6,07,388 కోట్లు
2) రూ.5,46,104 కోట్లు
3) రూ. 8,03,873 కోట్లు
4) రూ.7,35,709 కోట్లు
- View Answer
- సమాధానం: 1
వివరణ: స్థిర ధరల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) రూ. 6,07,388 కోట్లుగా నమోదైనట్లు 2017-18 ఆర్థిక సర్వే పేర్కొంది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి ఇది రూ.5,46,104 కోట్లుగా ఉంది.
- సమాధానం: 1
4. ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్)లో తీసుకొచ్చిన సంస్కరణల వల్ల అవినీతి, దుబారా బాగా తగ్గి 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఎన్ని కోట్లు ఆదా అయినzzzzట్టు ఆంధ్రప్రదేశ్, సామాజిక ఆర్థిక సర్వే వెల్లడించింది ?
1) రూ.3 వేల కోట్లు
2) రూ. 2,500 కోట్లు
3) రూ. 500 కోట్లు
4) రూ. 1,525.87 కోట్లు
- View Answer
- సమాధానం: 4
వివరణ: ప్రజా పంపిణీ వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణల వల్ల అవినీతి, దుబారా తగ్గి 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.1,525.87 కోట్లు ఆదా అయినట్టు ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వేలో ప్రభుత్వం పేర్కొంది.
- సమాధానం: 4
5. 2017-18 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి రేటు ఎంత శాతానికి చేరుకుందని ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సామాజిక, ఆర్థిక సర్వే పేర్కొంది?
1) 11.22 శాతం
2) 10 శాతం
3) 12 శాతం
4) 13 శాతం
- View Answer
- సమాధానం: 1
వివరణ: 2017-18 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి రేటు 11.22 శాతానికి చేరుకుందని ఆర్థిక సర్వే వెల్లడించింది.
- సమాధానం: 1
6. 2017-18 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సర్వే ప్రకారం.. వ్యవసాయ రంగం వృద్ధి రేటు ఎంత శాతంగా నమోదైంది ?
1) 8.49 శాతం
2) 9.11 శాతం
3) 17.76 శాతం
4) 6.4 శాతం
- View Answer
- సమాధానం: 3
వివరణ: 2017-18 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సర్వే ప్రకారం.. రాష్ట్రంలో వ్యవసాయ రంగం 17.76 శాతం, పారిశ్రామిక రంగం 8.49 శాతం, సేవా రంగం 9.11 శాతం స్థూల వ్యయం వృద్ధిని కనబరిచాయి. మత్స్య రంగం 6.4 శాతం fffవృద్ధి సాధించాయి.
- సమాధానం: 3
7. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలతో వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టింది?
1) రూ.1,91,063 కోట్లు
2) రూ.1,56,999 కోట్లు
3) రూ.1,74,453 కోట్లు
4) రూ. 1,25,000 కోట్లు
- View Answer
- సమాధానం: 1
వివరణ: 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.1,91,063 కోట్లతో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 21.70 శాతం ఎక్కువ. అలాగే ఈ ఏడాది తొలిసారి మిగులు బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. రూ.5,235 కోట్లను మిగులుగా చూపింది. రూ.19,078 కోట్లతో వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ లో నిరుద్యోగ భృతి పథకానికి రూ.వెయ్యి కోట్లు కేటాయించారు.
- సమాధానం: 1
8. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ అంచనాల ప్రకారం రాష్ట్రంలో తలసరి అప్పు ఎంతగా ఉండనుంది?
1) రూ. లక్ష
2) రూ. 75 వేలు
3) రూ.47,511
4) రూ. 25,506
- View Answer
- సమాధానం: 3
వివరణ: 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రుణం రూ.2,49,435 కోట్లకు చేరుకుంటుందని బడ్జెట్ అంచనాల్లో ఆర్థిక శాఖ పేర్కొంది. రాష్ట్ర జీడీపీలో ఈ అప్పులు 28.66 శాతంగా ఉంటాయని పేర్కొంది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సవరించిన బడ్జెట్ అంచనాల్లో రాష్ట్ర అప్పును రూ.2.25 లక్షల కోట్లుగా ప్రకటించారు. అంటే... గణాంకాల ప్రకారం చూస్తే ఏడాది కాలంలో రూ.24,201 కోట్ల రుణాలు పెరిగే అవకాశమున్నట్లు అంచనా వేశారు. రాష్ట్ర జనాభా 5.25 కోట్లుగా తీసుకుంటే.. 2018-19 కాలానికి తలసరి అప్పు రూ.47,511లుగా ఉంటుందని పేర్కొన్నారు.
- సమాధానం: 3
9. దేవధర్dfd ట్రోఫీ – 2018ని ఏ జట్టు గెలుచుకుంది?
1) భారత్ - బి
2) కర్ణాటక
3) ముంబై
4) ఢిల్లీ
- View Answer
- సమాధానం: 1
వివరణ: ధర్మశాల వేదికగా జరిగిన దేవధర్ ట్రోఫీ ఫైనల్లో భారత్ – బి.. కర్ణాటకను ఓడించి టైటిల్ కైవసం చేసుకుంది.
- సమాధానం: 1
10. కింది వారిలో ఇటీవల ఉబెర్ ఇండియా ప్రచారకర్తగా ఎవరు నియమితులయ్యారు?
1) రోహిత్ శర్మ
2) విరాట్ కోహ్లీ
3) యువరాజ్ సింగ్
4) అజింక్య రహానే
- View Answer
- సమాధానం: 2
వివరణ: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఇటీవల ఉబెర్ ఇండియా ప్రచారకర్తగా నియమితులయ్యారు. ఉబెర్ భారత్ లో బ్రాండ్ అంబాసిడర్ ను నియమించుకోవటం ఇదే తొలిసారి.
- సమాధానం: 2
11. కన్ స్ట్రక్షన్ ఇండస్ట్రీస్ డెవలప్ మెంట్ కౌన్సిల్ (సీఐడీసీ) విశ్వకర్మ అవార్డ్స్ – 2018లో బెస్ట్ కన్ స్ట్రక్షన్స్ ప్రాజెక్టు విభాగంలో పురస్కారం పొందిన విమానాశ్రయం ఏది?
1) విజయవాడ విమానాశ్రయం
2) తిరుపతి విమానాశ్రయం
3) విశాఖపట్నం విమానాశ్రయం
4) బేగంపేట్ విమానాశ్రయం
- View Answer
- సమాధానం: 1
వివరణ: కన్ స్ట్రక్షన్ ఇండస్ట్రీస్ డెవలప్ మెంట్ కౌన్సిల్(సీఐడీసీ) విశ్వ కర్మ అవార్డులు – 2018లో బెస్ట్ కన్ స్ట్రక్షన్స్ ప్రాజెక్టు విభాగంలో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం పురస్కారం దక్కించుకుంది. సీఐడీసీ నీతి ఆయోగ్ పరిధిలో పనిచేస్తుంది.
- సమాధానం: 1
12. ఇటీవల ఏ రాష్ట్రం మహిళా స్టార్టప్ లను ప్రోత్సహించేందుకు దేశంలోనే తొలి ఇంక్యుబేషన్ సెంటర్ వీ – హబ్ liను ప్రారంభించింది?
1) ఆంధ్రప్రదేశ్
2) తెలంగాణ
3) మధ్యప్రదేశ్
4) హిమాచల్ ప్రదేశ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: మహిళా స్టార్టప్ లను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా వీ –హబ్ (Women Hub)ను ప్రారంభించింది. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని దీన్ని ప్రారంభించింది.
- సమాధానం: 2
13. తెలంగాణ రైతు సమితి కార్పొరేషన్ చైర్మన్ గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు?
1) పోచారం శ్రీనివాస్ రెడ్డి
2) కోదండరామ్
3) మైనంపల్లి హన్మంతరావు
4) గుత్తా సుఖేందర్ రెడ్డి
- View Answer
- సమాధానం: 4
వివరణ: తెలంగాణ రైతు సమితి కార్పొరేషన్ చైర్మన్ గా నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి నియమితులయ్యారు. ఎండీగా వ్యవసాయ శాఖ కమిషనర్, డైరెక్టర్లుగా ఉద్యానశాఖ డైరెక్టర్, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్, ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి ఉంటారు.
- సమాధానం: 4
14. ఏ జిల్లాలో బేటీ బచావో బేటీ పఢావో కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేసినందుకు కలెక్టర్ యోగితా రాణా ఇటీవల ప్రధాన మంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు?
1) వరంగల్
2) కరీంనగర్
3) హైదరాబాద్
4) నల్గొండ
- View Answer
- సమాధానం: 3
వివరణ: మహిళా దినోత్సవం సందర్భంగా రాజస్థాన్ లో మార్చి 8న నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ యోగితా రాణా బేటీ బచావో బేటీ పఢావో అవార్డుని అందుకున్నారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్న దేశవ్యాప్తంగా 10 జిల్లాల కలెక్టర్లకు అవార్డులు అందజేశారు.
- సమాధానం: 3
15. త్రిపుర నూతన ముఖ్యమంత్రిగా ఇటీవల ఎవరు ప్రమాణం చేశారు?
1) మాణిక్ సర్కార్
2) విప్లవ్ కుమార్ దేవ్
3) కన్రాడ్ సంగ్మా
4) నెఫ్యూ రియో
- View Answer
- సమాధానం: 2
వివరణ: త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. 60 సీట్లున్న అసెంబ్లీలో 59 సీట్లకు ఎన్నికలు జరిగాయి. బీజేపీ కూటమి 44 స్థానాల్లో గెలుపొందింది. సీపీఎం 16 స్థానాలకే పరిమితమై అధికారాన్ని కోల్పోయింది. ముఖ్యమంత్రిగా బీజేపీకి చెందిన విప్లవ్ కుమార్ దేవ్ మార్చి 9న ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల నాగాలాండ్ నూతన ముఖ్యమంత్రిగా నెఫ్యూ రియో, మేఘాలయ సీఎంగా కన్రాడ్ సంగ్మా బాధ్యతలు చేపట్టారు.
- సమాధానం: 2
16. ఇటీవల చైనా ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రక్షణ శాఖకు ఎన్ని బిలియన్ డాలర్లు కేటాయించింది?
1) 175 బిలియన్ డాలర్లు
2) 200 బిలియన్ డాలర్లు
3) 46 బిలియన్ డాలర్లు
4) 120 బిలియన్ డాలర్లు
- View Answer
- సమాధానం: 1
వివరణ: చైనా ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రక్షణ శాఖకు 175 బిలియన్ డాలర్లు (రూ.11 లక్షల కోట్లు) కేటాయించింది. భారత రక్షణ శాఖ బడ్జెట్ (46 బిలియన్ డాలర్లు)తో పోలిస్తే ఈ కేటాయింపులు మూడు రెట్లు అధికం.
- సమాధానం: 1
17. ఇటీవల ఏ రాష్ట్రం ప్రత్యేక జెండాను ఆవిష్కరించింది?
1) బిహార్
2) కేరళ
3) కర్ణాటక
4) ఒడిశా
- View Answer
- సమాధానం: 3
వివరణ: కర్ణాటక రాష్ట్రం కోసం రూపొందించిన అధికారిక జెండాను ఆ రాష్ట్ర సీఎం సిద్దరామయ్య ఆవిష్కరించారు. ‘నాద ధ్వజ’గా పేర్కొంటున్న ఈ జెండాలో పసుపు, తెలుపు, ఎరుపు వర్ణాలతోపాటు మధ్యలో రాష్ట్ర చిహ్నమైన ‘గండభేరుండ’ ఉంటుంది. దేశంలో జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి మాత్రమే ప్రత్యేక జెండా ఉంది.
- సమాధానం: 3
18. వింగ్స్ ఇండియా ఏరోస్పేస్ సదస్సు ఇటీవల ఎక్కడ జరిగింది?
1) హైదరాబాద్
2) విశాఖపట్నం
3) బెంగళూరు
4) చెన్నై
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) సంయుక్త ఆధ్వర్యంలో బేగంపేట విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా 2018 ఏరోస్పేస్ సదస్సు మార్చి 8 నుంచి 11 వరకు జరిగింది. ఈ సదస్సులో 10 దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు. 125 కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి.
- సమాధానం: 1
19. అజ్లాన్ షా హాకీ కప్ – 2018ని ఇటీవల ఏ జట్టు గెలుచుకుంది?
1) భారత్
2) ఆస్ట్రేలియా
3) ఇంxhaగ్లాండ్
4) పాకిస్థాన్
- View Answer
- సమాధానం: 2
వివరణ: మలేషియాలో జరిగిన అజ్లాన్ షా హాకీ టోర్నీని 12వ సారి ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. రన్నరప్ గా ఇంxhaగ్లండ్ నిలిచింది. గతంలో ఇంగ్లండ్ రెండు సార్లు అజ్లాన్ షా టైటిల్‌ను గెలుచుకుంది. ఈ టోర్నీలో భారత్ ఐదో స్థానంలో నిలిచింది.
- సమాధానం: 2
20. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా వ్యవస్థాపక చైర్మన్ మావో జెడాంగ్ తర్వాత చైనా అధ్యక్ష పదవిలో జీవితకాలం కొనసాగనున్న నేతగా రికార్డు సృష్టించనున్నదెవరు?
1) షీ జిన్ పింగ్
2) లీ కెకియాంగ్
3) వాంగ్ యాంగ్
4) లీ ఝాన్సు
- View Answer
- సమాధానం: 1
వివరణ: చైనా శాశ్వత అధ్యక్షుడిగా షీ జిన్‌పింగ్ కొనసాగనున్నారు. ఓ వ్యక్తి అధ్యక్షుడిగా రెండు కంటే ఎక్కువ సార్లు పనిచేయకూడదంటూ ఉన్న పరిమితిని ఎత్తివేసే రాజ్యాంగ సవరణకు చైనా పార్లమెంట్ మార్చి 11న ఆమోదం తెలిపింది. దీంతో... కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా వ్యవస్థాపక చైర్మన్ మావో జెడాంగ్ తర్వాత అధ్యక్ష పదవిలో జీవితకాలం కొనసాగనున్న నేతగా జిన్‌పింగ్ రికార్డు సృష్టించనున్నారు.
- సమాధానం: 1
21. ప్రతిష్టాత్మక ప్రిట్జ్ కర్ పురస్కారం – 2018 ని ఇటీవల ఎవరు గెలుచుకున్నారు?
1) ప్రేమ్ నాథ్
2) ప్రవీణా మెహతా
3) సతీష్ గుజ్రాల్
4) బాలకృష్ణ విఠల్ దాస్ దోషి
- View Answer
- సమాధానం: 4
వివరణ: ప్రముఖ ఆర్కిటెక్ట్ బాలకృష్ణ విఠల్ దాస్ దోషి.. ప్రతిష్ఠాత్మక ప్రిట్జ్కర్ పురస్కారాన్ని గెలుచుకున్నారు. ఈ గౌరవం దక్కించుకున్న తొలి భారతీయుడు ఆయనే. ప్రిట్జ్కర్ పురస్కారం ఆర్కిటెక్ట్ రంగంలో నోబెల్‌తో సమానం.
- సమాధానం: 4
22. ఇటీవల కన్నుమూసిన ప్రఖ్యాత గాయకుడు ప్యారేలాల్ వడాలీ.. ఏ భాషలో పాటలు పాడారు?
1) బెంగాలీ
2) పంజాబీ
3) ఒడియా
4) హిందీ
- View Answer
- సమాధానం: 2
వివరణ: ప్రఖ్యాత పంజాబీ సూఫీ గాయకుడు ప్యారేలాల్ వడాలీ ఇటీవల మృతిచెందారు. పంజాబీ సూఫీ గాయకుల ద్వయంగా ఖ్యాతిగాంచిన ప్యారేలాల్ తన అన్న పూరన్ చంద్ వడాలీతో కలిసి అనేక పాటలు పాడారు.
- సమాధానం: 2
23. కింది వారిలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎవరు?
1) ఇమ్మాన్యుయెల్ మెక్రాన్
2) ఎడ్వర్డ్ ఫిలిప్పె
3) ట్రన్ డాయ్ క్వాంగ్
4) వ్లాదిమిర్ పుతిన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ భారత్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా భారత్, ఫ్రాన్స్ మధ్య రూ. 81,000 కోట్ల విలువైన 14 ఒప్పందాలు కుదిరాయి. రక్షణ, భద్రత, అణు ఇంధనం, రహస్య సమాచార పరిరక్షణ, ఇండో - పసిఫిక్ ప్రాంతంలో సహకారం, ఉగ్రవాద నిర్మూలన వంటి ఒప్పందాలపై సంతకాలు జరిగాయి.
- సమాధానం: 1
24. బేటీ బచావో, బేటీ పడావో కార్యక్రమాన్ని 161 జిల్లాల నుంచి ఎన్ని జిల్లాలకు విస్తరించనున్నారు?
1) 500
2) 640
3) 750
4) 350
- View Answer
- సమాధానం: 2
వివరణ: మార్చి 8న బేటీ బచావో, బేటీ పడావో పథకాన్ని విస్తరించే ప్రణాళికలో భాగంగా నేషనల్ న్యూట్రిషన్ మిషన్ (ఎన్ఎన్ఎం)ను రాజస్థాన్‌లోని జంజునులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. బేటీ బచావో, బేటీ పడావో కార్యక్రమాన్ని 161 జిల్లాల నుంచి దేశవ్యాప్తంగా 640 జిల్లాలకు విస్తరించనున్నట్లు ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రకటించారు.
- సమాధానం: 2
25. దేశ చరిత్రపై పాఠ్యపుస్తకాల్లో ఉన్న అంశాలపై అధ్యయనం mommచేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ?
1) శాంతా కుమార్ కమిటీ
2) దినేశ్ శర్మా కమిటీ
3) కమ్లేశ్ చంద్ర కమిటీ
4) కేఎన్ దీక్షిత్ కమిటీ
- View Answer
- సమాధానం: 4
వివరణ: దేశ చరిత్రపై పాఠ్యపుస్తకాల్లో ఉన్న అంశాలపై అధ్యయనం కోసం కేఎన్ దీక్షిత్ కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీలో 14 మంది సభ్యులు ఉన్నారు. కేఎన్ దీక్షిత్... ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జాయింట్ డైరెక్టర్ జనరల్ గా పనిచేశారు.
- సమాధానం: 4
26. అంతర్జాతీయ సోలార్ అలయన్స్ (ఐఎస్ఏ) తొలి వ్యవస్థాపక సదస్సు ఇటీవల ఏ నగరంలో జరిగింది?
1) న్యూఢిల్లీ
2) బెంగళూరు
3) అహ్మదాబాద్
4) పూణె
- View Answer
- సమాధానం: 1
వివరణ: సోలార్ ఇంధనాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో 121 దేశాలను ఒకే వేదికపైకి తీసుకురావాలన్న ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్(ఐఎస్ఏ)ను ఏర్పాటు చేశారు. ఈ కూటమి వ్యవస్థాపక సదస్సు మార్చి 11న న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగింది. ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మక్రాన్ పాల్గొన్నారు. తొలి సదస్సులో ఆరు దేశాల ఉపాధ్యక్షులు, ఉప ప్రధానులతోపాటు 19 దేశాల నుంచి మంత్రుల స్థాయి బృందాలు పాల్గొన్నాయి.
- సమాధానం: 1
27. ఆదరణ పేరుతో బీసీలకు చేతివృత్తుల ఉపకరణాలు అందించే పథకాన్నిఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది?
1) తెలంగాణ
2) ఆంధ్రప్రదేశ్
3) కర్ణాటక
4) తమిళనాడు
- View Answer
- సమాధానం: 2
వివరణ: వెనుకబడిన తరగతుల వారి చేతివృత్తులను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదరణ పథకాన్ని పునరుద్ధరించింది. ఆదరణ – 2 పేరుతో బీసీలకు చేతివృత్తుల ఉపకరణాలు అందించేలా పథకం తీసుకొచ్చింది. రూ. 10 వేలు, రూ.20వేలు, రూ.30 వేలు.. ఇలా మూడు శ్లాబుల్లో పథకాన్ని అమలు చేస్తారు. ఏవైనా ఉపకరణాలకు రూ.30 వేలు దాటితే.. వారికి ఆదరణ ప్లస్ అనే పథకాన్ని వర్తింప జేస్తారు.
- సమాధానం: 2
28. ధ్వని కంటే పదిరెట్లు అధిక వేగంతో దూసుకెళ్లే హైపర్ సోనిక్ క్షిపణి కింజాల్ (డాగర్)ను ఇటీవల ఏదేశం విజయవంతంగా పరీక్షించింది?
1) రష్యా
2) అమెరికా
3) భారత్
4) పాకిస్థాన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ధ్వని కంటే పదిరెట్లు అధిక వేగంతో దూసుకెళ్లే హైపర్ సోనిక్ క్షిపణి కింజాల్ (డాగర్)ను రష్యా ఇటీవల విజయవంతంగా పరీక్షించింది. మిగ్ – 31 సూపర్ సోనిక్ ఇంటర్ సెప్టర్ ద్వారా దాన్ని ప్రయోగించినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. ఈ క్షిపణిని 2017 డిసెంబర్ 1న సైన్యానికి అందించినట్లు తెలిపారు.
- సమాధానం: 1
29. బ్యాంక్ అకౌంట్, మొబైల్ నంబర్ తో ఆధార్ అనుసంధానం గడువుని సుప్రీం కోర్టు ఇటీవల ఎప్పటి వరకు పొడగించింది?
1) 2018, మార్చి 31
2) 2018, జూన్ 30
3) 2018 డిసెంబర్ 31
4) నిరవధికంగా పొడగింపు
- View Answer
- సమాధానం: 4
వివరణ: బ్యాంక్, అకౌంట్, మొబైల్ నంబర్ తో ఆధార్ అనుసంధానం గడువుని సుప్రీం కోర్టు నిరవధికంగా పొడగించింది. ఆధార్ రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తు దాఖలైన పిటిషన్లపై తీర్పు వెలువరించే వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. అయితే.. సబ్సిడీలు, ఆధార్ చట్టంలోని సెక్షన్ 7 కింద అందే ప్రయోజనాలు మాత్రం మార్చి 31 లోపే ఆధార్ లింక్ చేసుకోవాలని ప్రకటించింది.
- సమాధానం: 4
30. బిగ్ బ్యాంగ్ థియరీని ప్రతిపాదించిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త ఎవరు?
1) స్టీఫెన్ హాకింగ్
2) ఆల్బర్ట్ ఐన్ స్టీన్
3) రిచర్డ్ ఫిన్ మాన్
4) లియోనార్డ్ సస్ కిన్డ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: విశ్వ రహస్యాలను ఛేదించిన ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ఇటీవల 76 ఏళ్ల వయసులో కన్నుమూశారు. గడిచిన 55 సంవత్సరాలుగా అత్యంత అరుదైన నాడీకణ వ్యాధితో బాధపడుతు పక్షవాతానికి గురై చక్రాల కుర్చీకే పరిమితమైన ఆయన.. కేంబ్రిడ్జ్ లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆధునిక ప్రపంచంలో ఎక్కువ మందికి తెలిసిన భౌతిక శాస్త్రవేత్తల్లో ఒకరు ఆల్బర్ట్ ఐన్ స్టీన్ కాగా.. రెండోవారు స్టీఫెన్ హాకింగ్. న్యూటన్ ప్రతిపాదించిన గురుత్వాకర్షణ సిద్ధాంతానికి ప్రతిగా ఐన్ స్టీన్ సాపేక్షతా సిద్ధాంతాన్ని నిర్వచించారు. మరో అడుగు ముందుకేసి బిగ్ బ్యాంగ్ థియరీని కూడా ప్రతిపాదించారు. కృష్ణ బిలాలపై ఆయన శోధించి వెల్లడించిన అంశాలు ప్రస్తుతం ప్రామాణికంగా నిలుస్తున్నాయి.
- సమాధానం: 1
31. ఇటీవల విడుదలైన గ్లోబల్ స్మార్ట్ సిటీ పర్ఫామెన్స్ ఇండెక్స్ సర్వేలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ నగరం ఏది?
1) హైదరాబాద్
2) బెంగళూరు
3) భువనేశ్వర్
4) ఢిల్లీ
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఒడిశా రాజధాని భువనేశ్వర్‌కు ప్రపంచ స్మార్ట్ సిటీల జాబితాలో 20వ స్థానం దక్కింది. జునిపర్ రీసెర్చ్ అనే సంస్థ ఇంటెల్ సాయంతో ‘గ్లోబల్ స్మార్ట్ సిటీ పర్ఫామెన్స్ ఇండెక్స్’ పేరుతో నిర్వహించిన సర్వే ఫలితాలను తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో చోటు సాధించిన ఏకైక భారతీయ నగరం భువనేశ్వర్.
- సమాధానం: 3
32. ఇటీవల ఏ రాష్ట్రంలో రైతులు కిసాన్ లాంగ్ మార్చ్ పేరుతో భారీ ఆందోళన నిర్వహించారు?
1) ఆంధ్రప్రదేశ్
2) తెలంగాణ
3) ఉత్తరప్రదేశ్
4) మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 4
వివరణ: అఖిల భారత కిసాన్ సభ ఆధ్వర్యంలో మహరాష్ట్రలో వేలాది మంది రైతులు రాజధాని ముంబైని ముట్టడించారు. 180 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించి ముంబైకి చేరుకున్నారు. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చింది. రైతుల డిమాండ్లలో దాదాపు అన్నింటినీ నెరవేరుస్తామని హామీ ఇచ్చింది.
- సమాధానం: 4
33. కింది వారిలో ఏ హాస్య నటుడిని టీఎస్ఆర్ కాకతీయ లలిత కళాపరిషత్ ఇటీవల హాస్య నట బ్రహ్మ అవార్డుతో సత్కరించింది?
1) బ్రహ్మానందం
2) సునీల్
3) ప్రియదర్శ్
4) సప్తగిరి
- View Answer
- సమాధానం: 1
వివరణ: 1,100 సినిమాల్లో నటించిన ప్రముఖ హాస్యనటుడు కె.బ్రహ్మానందాన్ని ‘హాస్య నట బ్రహ్మ’ అవార్డుతో సత్కరించారు. టీఎస్ఆర్ కాకతీయ లలిత కళాపరిషత్ ఆధ్వర్యంలో మార్చి 11న మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందజేశారు.
- సమాధానం: 1
34. టీబీ ఫ్రీ ఇండియా ప్రచార ఉద్యమాన్ని ఇటీవల ఎవరు ప్రారంభించారు?
1) నరేంద్ర మోదీ
2) రామ్ నాథ్ కోవింద్
3) వెంకయ్య నాయుడు
4) జేపీ నడ్డా
- View Answer
- సమాధానం: 1
వివరణ: క్షయ వ్యాధి రహిత భారత్‌ను సాధించే దిశగా టీబీ ఫ్రీ ఇండియా ప్రచార ఉద్యమాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ మార్చి 13న ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా 2025 నాటికి దేశాన్ని క్షయ రహితంగా మార్చడమే తమ లక్ష్యమని, ఇందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మోదీ స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా 2030 నాటికి టీబీని నియంత్రించాలని లక్ష్యంగా పెట్టుకున్నారని, కానీ మనదేశంలో ఐదేళ్ల ముందుగానే అంటే 2025 నాటికే దీనిని సాధించాలని నిర్దేశించుకున్నామని చెప్పారు.
- సమాధానం: 1
35. 2018–19 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు ఎంత శాతంగా నమోదు కావచ్చని ప్రపంచ బ్యాంక్ ఇటీవల అంచనా వేసింది?
1) 7.3 శాతం
2) 7 శాతం
3) 6.5 శాతం
4) 8 శాతం
- View Answer
- సమాధానం: 1
వివరణ: భారత్ వృద్ధి తీరు బాగుందని, వచ్చే ఆర్థిక సంవత్సరం (2018 ఏప్రిల్–2019 మార్చి) భారత్‌వృద్ధి రేటు 7.3 శాతంగా నమోదవుతుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. 2019-20లో ఈ రేటు 7.5 శాతంగా ఉంటుందని పేర్కొంది.
- సమాధానం: 1
36. పరాగ్ అగర్వాల్.. ఇటీవల ఏ సోషల్ మీడియా సంస్థ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గా నియమితులయ్యారు?
1) ఫేస్ బుక్
2) ట్వీటర్
3) లింక్ డన్
4) టెలిగ్రామ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ‘ట్వీటర్’ తాజాగా పరాగ్ అగర్వాల్‌ను చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా (సీటీవో) నియమించుకుంది. ఈయన ఆడమ్ మెస్జింగర్ స్థానాన్ని భర్తీ చేశారు. అగర్వాల్ ఐఐటీ–బాంబే పూర్వ విద్యార్థి. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ లో పీహెచ్డీ పూర్తిచేశారు.
- సమాధానం: 2
37. నేపాల్ అధ్యక్షురాలిగా ఇటీవల రెండోసారి ఎవరు ఎన్నికయ్యారు?
1) విద్యా దేవి భండారి
2) ఖడ్గ ప్రసాద్ ఓలి
3) కుమారి లక్ష్మీ రాయ్
4) మహేంద్ర
- View Answer
- సమాధానం: 1
వివరణ: నేపాల్ అధ్యక్షురాలిగా విద్యా దేవి భండారీ మార్చి 13న రెండోసారి ఎన్నికయ్యారు. ప్రస్తుత అధ్యక్షురాలు, లెఫ్ట్ కూటమి అభ్యర్థి అయిన భండారీ... నేపాలీ కాంగ్రెస్ అభ్యర్థి కుమారి లక్ష్మీ రాయ్‌పై గెలుపొందారు. 1994, 1999లో రెండు సార్లు నేపాల్ పార్లమెంట్‌కు ఎన్నికైన భండారీ 2015లో నేపాల్ తొలి మహిళా అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు.
- సమాధానం: 1
38. జాతీయ రహదారుల వినియోగదారుల కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆవిష్కరించిన మొబైల్ యాప్ ఏది?
1) సుహానా సఫర్
2) సుభ్ సఫర్
3) సుభ్ యాత్ర
4) సుఖద్ యాత్ర
- View Answer
- సమాధానం: 4
వివరణ: జాతీయ రహదారుల వినియోగదారుల కోసం సుఖద్ యాత్ర, టోల్ ఫ్రీ అత్యవసర నెంబర్ 1033 ని ప్రారంభించింది. కేంద్ర రోడ్డు రవాణా, షిప్పింగ్, నీటి వనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ యాప్ ని ఆవిష్కరించారు.
- సమాధానం: 4
39. ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితా – 2018 ప్రకారం భారత్ లో యంగెస్ట్ బిలియనీర్ గా గుర్తింపు సాధించిన వారు ఎవరు?
1) విజయ్ శేఖర్ శర్మ
2) సచిన్ బన్సాల్
3) రాహుల్ శర్మ
4) ఎక్తా కపూర్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితా – 2018 ప్రకారం.. పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ 39 ఏళ్ల వయసులో యంగెస్ట్ ఇండియన్ బిలియనీర్ గా నిలిచారు. ఈ నివేదిక ప్రకారం ఆయన సంపద విలువ 1.7 బిలియన్ డాలర్లు.
- సమాధానం: 1
40. మాస్టర్ కార్డ్ ఇండెక్స్ ఉమెన్ ఎంటర్ ప్రెన్యూయర్స్ – 2018 జాబితాలో భారత్ ఎన్నో ర్యాంకులో నిలిచింది?
1) 52
2) 46
3) 57
4) 25
- View Answer
- సమాధానం: 1
వివరణ: మాస్టర్ కార్డ్ ఇండెక్స్ 57 దేశాలతో ఉమెన్ ఎంటర్ ప్రెన్యూయర్స్ – 2018 ర్యాంకింగ్స్ ను విడుదల చేసింది. ఇందులో భారత్ 52వ స్థానంలో నిలిచింది. ఘనా తొలి స్థానం, రష్యా రెండో స్థానం, ఉగాండా మూడో స్థానంలో నిలిచాయి.
- సమాధానం: 1
41. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని స్వచ్ఛ శక్తి – 2018 కార్యక్రమాన్ని ఏ నగరంలో నిర్వహించారు?
1) బెంగళూరు
2) న్యూఢిల్లీ
3) ఇండోర్
4) లక్నో
- View Answer
- సమాధానం: 4
వివరణ: కేంద్ర ప్రభుత్వం, ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని లక్నోలో స్వచ్ఛ శక్తి – 2018 కార్యక్రమాన్ని నిర్వహించాయి.
- సమాధానం: 4
42. కేంద్ర ప్రభుత్వం ఇటీవల వెల్లడించిన గణాంకాల ప్రకారం 2017 డిసెంబర్ నాటికి దేశంలో అన్ని బ్యాంకుల్లో కలిపి నిరర్ధక ఆస్తులు (ఎన్ పీఏలు) ఎన్ని కోట్ల రూపాయలున్నాయి?
1) రూ.6.09 లక్షలు
2) రూ.8.41 లక్షలు
3) రూ.9.21 లక్షలు
4) రూ.7.66 లక్షలు
- View Answer
- సమాధానం: 2
వివరణ: 2017 డిసెంబర్ నాటికి దేశంలోని అన్ని బ్యాంకుల్లో కలిపి నిరర్ధక ఆస్తులు రూ.8.40,958 కోట్లకు చేరాయని కేంద్ర ప్రభుత్వం ఇటీవల వెల్లడించింది. ఇందులో అత్యధికం రూ.2 లక్షల కోట్ల మేర భారతీయ స్టేట్ బ్యాంక్ లోనే ఉన్నాయి.
- సమాధానం: 2
43. పూర్తిగా సోలార్ విద్యుత్ ని వినియోగిస్తున్న దేశంలోని తొలి కేంద్ర పాలిత ప్రాంతం ఏది?
1) డయూ
2) లక్షదీప్
3) అండమాన్ అండ్ నికోబార్
4) చండీగఢ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: పూర్తిగా సోలార్ విద్యుత్ ని వినియోగిస్తున్న దేశంలోని తొలి కేంద్ర పాలిత ప్రాంతంగా డయూ నిలిచింది. మూడేళ్లలో సోలార్ విద్యుత్ ఉత్పత్తిని పెంచి.. ప్రజల గృహ అవసరాలకు సరిపోయే స్థాయిలో సరఫరా చేస్తోంది.
- సమాధానం: 1
44. ప్రపంచ కిడ్నీ దినోత్సవం – 2018ని ఎప్పుడు నిర్వహించారు?
1) మార్చి 8
2) మార్చి 9
3) మార్చి 7
4) మార్చి 12
- View Answer
- సమాధానం: 1
వివరణ: కిడ్నీల ఆరోగ్యం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు 2018 మార్చి 8న ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని నిర్వహించారు. 2006 నుంచి ఏటా మార్చి రెండో గురువారం ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు.
2018 Theme: Kidneys and Women’s Health
- సమాధానం: 1
45. జాతీయ ప్రజాప్రతినిధుల కాన్ఫరెన్స్ – 2018 ఇతివృత్తం ఏమిటి?
1) లెజిస్లేటర్స్ ఫర్ లివింగ్
2) వియ్ ఫర్ డెవలప్ మెంట్
3) వి ఆర్ లెజిస్లేటర్స్
4) ఇండియా అండ్ లెజిస్లేటర్స్
- View Answer
- సమాధానం: 2
వివరణ: వియ్ ఫర్ డెవలప్ మెంట్ ఇతివృత్తంతో మార్చి 10న పార్లమెంటు సెంట్రల్ హాలులో జాతీయ ప్రజాప్రతినిధుల సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రులు, ఎంపీలు, రాష్ట్రాలకు చెందిన శాసన సభ్యుల్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. అత్యంత వెనకబడ్డ జిల్లాల అభివృద్ధికి పాటుపడటం సామాజిక న్యాయం దిశగా అడుగులు వేయడమేనని ఈ సందర్భంగా మోదీ పేర్కొన్నారు. ఆ క్రమంలో దేశంలోని 115 వెనకబడ్డ జిల్లాల అభివృద్ధి కోసం చట్ట సభ్యులు కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
- సమాధానం: 2
46. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) తదుపరి చీఫ్ గా ఇటీవల ఎవరు నామినేట్ అయ్యారు?
1) మోహన్ చందక్
2) నీలం కపూర్
3) హార్ష్ భాల్
4) సితాన్షు కార్
- View Answer
- సమాధానం: 4
వివరణ: పీఐబీ ప్రస్తుత చీఫ్ పదవీకాలం 2018 ఏప్రిల్ 30తో ముగియనుంది. ఆయన తర్వాత ఈ పదవి చేపట్టేందుకు ఆల్ ఇండియా రేడియో న్యూస్ సర్వీస్ డివిజన్ డైరెక్టర్ జనరల్ సితాన్షు కార్ నామినేట్ అయ్యారు. మే 1న ఆయన బాధ్యతలు చేపడతారు.
- సమాధానం: 4
47. బ్యాంకుల మోసాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్ని కోట్లకుపైగా రుణాలకు పాస్ పోర్ట్ ను తప్పనిసరి చేసింది?
1) రూ.50 కోట్లు
2) రూ.75 కోట్లు
3) రూ.100 కోట్లు
4) రూ.150 కోట్లు
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఇటీవల రుణాల ఎగవేసి, విదేశాలకు పారిపోతున్న వారి సంఖ్య పెరుగుండటంతో.. ఈ తరహా మోసాలను తగ్గించేందుకు రూ.50 కోట్లకుపైగా రుణాలు పొందేందుకు పాస్ పోర్ట్ ను తప్పనిసరి చేస్తు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
- సమాధానం: 1
48. బహుళ దేశాల తొలి నావికా విన్యాసాలు మైల్స్ – 18 ఇటీవల ఏ ప్రాంతంలో జరిగాయి?
1) అండమాన్ సీ
2) రెడ్ సీ
3) పెర్షియన్ గల్ఫ్
4) అరేబియన్ సీ
- View Answer
- సమాధానం: 1
వివరణ: బహుళ దేశాల తొలి నావికా విన్యాసాలు మైల్స్ – 2018 ఇటీవల మూడు రోజుల పాటు అండమాన్ సముద్రంలో జరిగాయి. 8 దేశాలకు చెందిన 11 నౌకలు, భారత్ కు చెందిన 9 నౌకలు ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి.
- సమాధానం: 1
49. ప్రతిష్టాత్మక గోదావరి గౌరవ్ అవార్డు – 2017ని ఇటీవల ఎవరికి ప్రదానం చేశారు?
1) నసీరుద్దీన్ షా
2) పంకజ్ కపూర్
3) నానా పటేకర్
4) అమోల్ పాలేకర్
- View Answer
- సమాధానం: 4
వివరణ: ప్రముఖ నటుడు అమోల్ పాలేకర్.. ప్రతిష్టాత్మక గోదావరి గౌరవ్ అవార్డు – 2017ను అందుకున్నారు. గోల్ మాల్, చోటీ సీ బాత్, చిట్చోర్ వంటి చిత్రాలతో అమోల్ మంచి గుర్తింపు సాధించారు.
- సమాధానం: 4
50. చిలీ నూతన అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు?
1) సెబాస్టియన్ పినెరా
2) మిచెల్లే బాచెలెట్
3) కార్లోస్ ఇబానెజ్ డెల్ కాంపో
4) ఫిలెపే లార్రాయిన్ బాస్కునాన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: రాజకీయ నాయకుడిగా మారిన వ్యాపారవేత్త సెబాస్టియన్ పినెరా .. ఇటీవల చిలీ నూతన అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆయన ఈ పదవి చేపట్టడం ఇది రెండోసారి.
- సమాధానం: 1