కరెంట్ అఫైర్స్ మార్చి (24 – 31) బిట్ బ్యాంక్
1. ఇటీవల ఏ రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రతరంగా మారింది?
1) అమెరికా-చైనా
2) భారత్-చైనా
3) భారత్ - పాకిస్తాన్
4) అమెరికా - రష్యా
- View Answer
- సమాధానం: 1
వివరణ: ప్రపంచ వాణిజ్య మార్కెట్లో దిగ్గజ దేశాలైన అమెరికా, చైనాలు పరస్పరం సుంకాలు విధించుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా ఉత్పత్తులపై 6,000 కోట్ల డాలర్ల భారీ సుంకాలు విధించారు. ట్రంప్ చర్యలకు ప్రతీకారంగా చైనా కూడా అమెరికా ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను విధించింది. మొత్తం 123 వస్తువులపై 300 కోట్ల డాలర్ల విలువైన సుంకాలు విధించింది. రెండు దేశాల మధ్య ముదిరిన ఈ వివాదం.. అన్ని దేశాలను కుదిపేసే ప్రమాదం ఉంది.
- సమాధానం: 1
2. దేశంలో ఫిక్స్ డ్ బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ ను వాడుతున్న నగరాల్లో.. అత్యంత వేగవంతమైన నెట్ స్పీడ్ లభిస్తున్న నగరంగా నిలిచిన సిటీ ఏది ?
1) హైదరాబాద్
2) చెన్నై
3) బెంగళూరు
4) విశాఖపట్నం
- View Answer
- సమాధానం: 2
వివరణ: దేశంలో ఫిక్స్ డ్ బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ ను వాడుతున్న నగరాల్లో చెన్నై అత్యంత వేగవంతమైన నెట్ స్పీడ్ లభిస్తున్న నగరంగా నిలిచింది. బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్నం వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అమెరికాలోని సీటెల్ కేంద్రంగా పనిచేస్తున్న ఊక్లా సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ వేగాన్ని గణించింది.
- సమాధానం: 2
3. ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ – 2018 మహిళల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు?
1) పీవీ సింధు
2) సైనా నెహ్వాల్
3) తై జు యింగ్
4) అకానె యమగుచి
- View Answer
- సమాధానం: 3
వివరణ: ప్రపంచ బ్యాడ్మింటన్ మహిళల నంబర్ వన్, చైనీస్ తైపీకి చెందిన తై జు యింగ్.. ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేతగా నిలిచింది. ఫైనల్లో జపాన్ కు చెందిన ప్రపంచ రెండో ర్యాంకర్ అకానె యమగుచిని ఓడించి టైటిల్ సొంతం చేసుకుంది. పురుషుల సింగిల్స్ టైటిల్ ను చైనాకు చెందిన షి యూకి గెలుచుకున్నాడు.
- సమాధానం: 3
4. ఇటీవల శ్రీలంకలో జరిగిన నిదహాస్ టీ 20 క్రికెట్ టోర్నీ విజేత ఎవరు?
1) భారత్
2) శ్రీలంక
3) బంగ్లాదేశ్
4) పాకిస్తాన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్ల మధ్య శ్రీలంకలో జరిగిన నిదహాస్ టీ 20 టోర్నీలో భారత్ విజేతగా నిలిచింది. ఫైనల్లో బంగ్లాదేశ్ ను ఓడించి భారత్ టైటిల్ కైవసం చేసుకుంది. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డుని భారత ప్లేయర్ వాషింగ్టన్ సుందర్ దక్కించుకున్నాడు.
- సమాధానం: 1
5. తెలంగాణలోని ఏ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కృషి విజ్ఞాన కేంద్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల వెబ్ కాస్టింగ్ ద్వారా ప్రారంభించారు?
1) పోచంపల్లి
2) సంగారెడ్డి
3) జహీరాబాద్
4) బెల్లంపల్లి
- View Answer
- సమాధానం: 4
వివరణ: తెలంగాణలోని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని బూదాకలాన్ శివారులో ఏర్పాటు చేసిన కృషి విజ్ఞాన కేంద్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల వెబ్ కాస్టింగ్ ద్వారా ప్రారంభించారు. దేశంలో 25 కృషి విజ్ఞాన కేంద్రాలు మంజూరు కాగా.. రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, బెల్లింపల్లికి కృషి విజ్ఞాన కేంద్రాలు మంజూరయ్యాయి. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని ఏకలవ్వ ఫౌండేషన్ సంస్థను కూడా ఆన్ లైన్ ద్వారా మోదీ అదే రోజు ప్రారంభించారు.
- సమాధానం: 4
6. గొల్లపూడి శ్రీనివాస్ పురస్కారానికి ఇటీవల ఎవరిని ఎంపిక చేశారు?
1) ఆర్ నారాయణమూర్తి
2) కొంకణా సేన్
3) రాజమౌళి
4) నందిని సిద్ధారెడ్డి
- View Answer
- సమాధానం: 2
వివరణ: గొల్లపూడి శ్రీనివాస్ అవార్డుకు "ఎ డెత్ ఇన్ ది గుంజ్’ పేరుతో ఇంగ్లీష్, బెంగాలీ భాషల్లో చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకురాలు కొంకణా సేన్ ఎంపికయ్యారు.
- సమాధానం: 2
7. 8వ వరల్డ్ వాటర్ ఫోరమ్ సదస్సు ఇటీవల ఏ దేశంలో జరిగింది?
1) భారత్
2) రష్యా
3) బ్రెజిల్
4) అమెరికా
- View Answer
- సమాధానం: 3
వివరణ: బ్రెజిల్ లోని బ్రెసీలియాలో మార్చి 18 నుంచి 23 వరకు 8వ వరల్డ్ వాటర్ ఫోరమ్ సదస్సు జరిగింది. 15 దేశాధినేతలు, 300 మంది మేయర్లు, వందలాది మంది నిపుణులు, 40 వేల మంది ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ప్రపంచ నీటి అభివృద్ధి – 2018 పేరుతో ఐక్యరాజ్య సమితి రూపొందించిన నివేదికపై ప్రధానంగా చర్చించారు.
2018 Theme: Sharing Water
-
8. ఓఫికన్ నక్షత్రాల కూటమిలో కొత్త బ్లాక్ హోల్స్ ను కనుగొన్న రష్యన్ వ్యోమగాములు వాటికి ఎవరి పేరు పెట్టారు?
1) స్టీఫెన్ హాకింగ్
2) రేమండ్ డావిస్
3) రెయిన్ వీస్
4) కిప్ ఎస్ థార్న్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఓఫికన్ నక్షత్రాల కూటమిలో కొత్త బ్లాక్ హోల్స్ ను కనుగొన్న రష్యన్ వ్యోమగాములు.. వాటికి ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ పేరు పెట్టారు. మాస్కో స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కొంత కాలంగా నక్షత్రాల కూటమిలో గామా కిరణాల పేలుళ్లను పరిశీలిస్తున్నారు. నక్షత్రాలు కూలిపోవటం వల్లే పేలుడు సంభవించిందని, దాని స్థానంలో బ్లాక్ హోల్స్ ఏర్పడ్డాయని వెల్లడించారు.
- సమాధానం: 1
9. ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ లో జరిగే కామన్వెల్త్ క్రీడలు - 2018 ప్రారంభ వేడుకల మార్చ్ ఫాస్ట్ లో భారత జెండా పతాకధారిగా ఎవరు వ్యవహరించారు?
1) పీవీ సింధు
2) సైనా నెహ్వాల్
3) మను భాకర్
4) సుశీల్ కుమార్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ లో జరిగే కామన్వెల్త్ క్రీడలు – 2018 ప్రారంభ వేడుకల మార్చ్ ఫాస్ట్ లో భారత జెండాను చేబూనే అవకాశం భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకి దక్కింది. కాగా గత మూడు కామన్వెల్త్ క్రీడల్లో మార్చ్ ఫాస్ట్ పతాకధారి అవకాశాలను షూటర్లే దక్కించుకున్నారు. 2006లో ప్రస్తుత కేంద్ర క్రీడామంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, 2010లో అభినవ్ బింద్రా, 2014లో విజయ్ కుమార్ పతాకధారులగా వ్యవహరించారు.
- సమాధానం: 1
10. ఆసియా బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ – 2018 టైటిల్ విజేత ఎవరు ?
1) భాస్కర్
2) పంకజ్ అడ్వాని
3) ఆదిత్య మెహతా
4) గీత్ సేథి
- View Answer
- సమాధానం: 2
వివరణ: భారత స్టార్ క్యూయిస్ట్ పంకజ్ అడ్వాని ఆసియా బిలియర్డ్స్ చాంపియన్ షిప్ లో టైటిల్ నిలబెట్టుకున్నాడు. ఫైనల్లో పంకజ్ భారత్ కే చెందిన భాస్కర్ ను ఓడించి మరోసారి విజేతగా నిలిచాడు. దీంతో ఒకే సీజన్ లో ఆసియా టైటిల్ తో పాటు వరల్డ్ చాంపియన్ షిప్ టైటిల్ ను నిలబెట్టుకున్న తొలి భారత ఆటగాడిగా పంకజ్ నిలిచాడు.
- సమాధానం: 2
11. ఇటీవల పసిఫిక్ మహాసముద్రంలో కూలిన తియాంగాంగ్ – 1 స్పేస్ స్టేషన్ ఏ దేశానికి చెందినది?
1) అమెరికా
2) జపాన్
3) రష్యా
4) చైనా
- View Answer
- సమాధానం: 4
వివరణ: గతి తప్పిన చైనా అంతరిక్ష కేంద్రం తియాంగాంగ్ – 1 ఇటీవల పసిఫిక్ మహాసముద్రంలో కూలిపోయింది. వాతావరణ రాపిడి కారణంగా అధికశాతం గాలిలోనే మండిపోగా, కొన్ని శకలాలు దక్షిణ పసిఫిక్ సముద్రం మధ్యభాగంలో పడ్డాయని చైనా మ్యాన్డ్ స్పేస్ ఇంజినీరింగ్ కార్యాలయ అధికారులు ప్రకటించారు.
- సమాధానం: 4
12. ఫార్ములావన్ పవర్ బోట్ రేసింగ్ లో ప్రసిద్ధి చెందిన ఎఫ్1హెచ్2వో ప్రపంచ చాంపియన్ షిప్ కు భారత్ లోని ఏ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది?
1) హైదరాబాద్
2) కోచి
3) చెన్నై
4) అమరావతి
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఫార్ములావన్ పవర్ బోట్ రేసింగ్ లో ప్రసిద్ధి చెందిన ఎఫ్1హెచ్2వో ప్రపంచ చాంపియన్ షిప్ కు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఆతిథ్యం ఇవ్వనుంది. అమరావతిలోని భవానీ ఐలాండ్ లో ఎఫ్1హెచ్2వో ప్రపంచ చాంపియన్ షిప్ నిర్వహించాలని నిర్వాహకులు నిర్ణయించారు. ఈ మేరకు ఎనిమిది ప్రతిష్టాత్మక వేదికల్లో భారత్ పేరుని కూడా చేరుస్తూ షెడ్యూల్ వెలువరించారు. 2018 వరల్డ్ చాంపియన్ షిప్ లో భాగంగా నవంబర్ 22 – 24 వరకు అమరావతిలో ఈ పోటీలు జరగుతాయి.
- సమాధానం: 4
13. ఆసియాలోనే అతిపెద్దదైన తులిప్ గార్డెన్ భారత్ లోని ఏ రాష్ట్రంలో ఉంది?
1) జమ్ము కశ్మీర్
2) హిమాచల్ ప్రదేశ్
3) కర్ణాటక
4) ఢిల్లీ
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఆసియాలోనే అతి పెద్దదైన తులిప్ గార్డెన్ పర్యాటకుల సందర్శనార్థం మార్చి 26న తిరిగి ప్రారంభమైంది. జమ్ము కశ్మీర్ లోని దాల్ సరస్సు ఒడ్డున ఉన్న ఈ గార్డెన్ ను 25 ఎకరాల్లో 40 వేల రకాల వెరైటీ, రంగు రంగుల పూల మొక్కలతో అధికారులు సుందరంగా తీర్చిదిద్దారు.
- సమాధానం: 1
14. కేంద్ర ఆర్థిక శాఖ అంచనా ప్రకారం 2025 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ ఎన్ని లక్షల కోట్లకు చేరుకోనుంది?
1) రూ.325 లక్షల కోట్లు
2) రూ. 250 లక్షల కోట్లు
3) రూ. 450 లక్షల కోట్లు
4) రూ.500 లక్షల కోట్లు
- View Answer
- సమాధానం: 1
వివరణ: వచ్చే ఏడేళ్లలో అంటే.. 2025 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ 5 లక్షల కోట్ల డాలర్లు(రూ.325 లక్షల కోట్లు)కు చేరుకోనుందని కేంద్ర ఆర్థిక శాఖ అంచనా వేసింది. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన సీఐఐ గ్లోబల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ సమ్మిట్ లో ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి సుభాష చంద్ర గార్గ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం భారత్ 2.5 లక్షల కోట్ల డాలర్ల జీడీపీతో ప్రపంచంలో ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది.
- సమాధానం: 1
15. కేంద్ర ఎన్నికల కమిషన్ రాయబారిగా ఇటీవల నియమితులైన భారత క్రికెటర్ ఎవరు?
1) రాహుల్ ద్రావిడ్
2) సచిన్ టెండూల్కర్
3) సౌరవ్ గంగూలీ
4) మహేంద్ర సింగ్ ధోని
- View Answer
- సమాధానం: 1
వివరణ: భారత క్రికెట్ మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్.. కేంద్ర ఎన్నికల కమిషన్ రాయబారిగా నియమితులైనట్లు కేంద్ర ఎన్నికల కమిషనర్ ఓం ప్రకాశ్ రావత్ ప్రకటించారు. ప్రస్తుతం ద్రావిడ్.. భారత్ అండర్ -19 క్రికెట్ జట్టు కోచ్ గా వ్యవహరిస్తున్నారు. ద్రావిడ్ శిక్షణలోనే ఇటీవల భారత యువ ఆటగాళ్లు అండర్ -19 టైటిల్ ను కైవసం చేసుకున్నారు.
- సమాధానం: 1
16. ఇటీవల సిడ్నీలో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్ షూటింగ్ – 2018 టోర్నీలో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో స్వర్ణం సాధించిన భారత షూటర్ ఎవరు?
1) మహిమా అగర్వాల్
2) మను భాకర్
3) జీనా ఖిట్టా
4) ఎలవెనిల్ వలరివాన్
- View Answer
- సమాధానం: 2
వివరణ: జూనియర్ ప్రపంచ కప్ షూటింగ్లో 16 ఏళ్ల భారత షూటర్ మనూ భాకర్.. రెండు స్వర్ణాలు సాధించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో 235.9 పాయింట్లు స్కోర్ చేసి బంగారు పతకం కైవసం చేసుకుంది. టీమ్ విభాగంలో మను, దేవాన్షి, మహిమ అగర్వాల్ బృందం బంగారు పతకం దక్కించుకుంది.
- సమాధానం: 2
17. 2018 టీబీ నివారణ దినోత్సవం ఇతివృత్తం ఏంటి?
1) వాంటెడ్ – లీడర్స్ ఫర్ ఏ టీబీ – ఫ్రీ వరల్డ్
2) గెయిర్ అప్టూ ఎండ్
3) ట్రాన్స్ ఫార్మింగ్ ద ఫైట్
4) ఐ ఆమ్ స్టాపింగ్ టీబీ
- View Answer
- సమాధానం: 1
వివరణ: ప్రపంచ క్షయ నివారణ దినోత్సవాన్ని ఏటా మార్చి 24న నిర్వహిస్తారు. టీబీ నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
2018 Theme : Wanted: Leaders for a TB-free world
- సమాధానం: 1
18. ఇటీవల మణిపూర్ లో జరిగిన 105వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ లో మోస్ట్ ఇన్ఫర్మేటివ్ పెవిలియన్ అవార్డుని ఏ సంస్థకు ప్రకటించారు?
1) ఇస్రో
2) డీఆర్డీఓ
3) బార్క్
4) వీఎస్ఎస్సీ
- View Answer
- సమాధానం: 2
వివరణ: మణిపూర్ లోని ఇంఫాల్ లో ఉన్న మణిపూర్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన 105వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ లో మోస్ట్ ఇన్ఫర్మేటివ్ పెవిలియన్ అవార్డుని డీఆర్డీఓకు ప్రకటించారు. ఈ సమావేశాల్లో డీఆర్డీవో తన ఆవిష్కరణలను ప్రదర్శించి.. అవార్డుకి ఎంపికైంది.
- సమాధానం: 2
19. ప్రపంచంలోనే అతిపొడవైన మట్టిరాళ్ల గుహను ఇటీవల భారత్ లోని ఏ రాష్ట్రంలో గుర్తించారు?
1) మేఘాలయ
2) కర్ణాటక
3) అరుణాచల్ ప్రదేశ్
4) ఆంధ్రప్రదేశ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ప్రపంచంలోనే అతిపొడవైన మట్టిరాళ్ల గుహ – క్రెమ్ పూరిని ఇటీవల మేఘాలయలోని ఈస్ట్ కాశీ హిల్స్ లో గుర్తించారు. దీని పొడవు 24,583 మీటర్లు.
- సమాధానం: 1
20. 5వ ఇండియన్ మెయిజ్ (మొక్కజొన్న) సమ్మిట్ – 2018ని ఇటీవల ఏ నగరంలో నిర్వహించారు ?
1) ఇండోర్
2) ఉదయ్ పూర్
3) న్యూఢిల్లీ
4) నిజామాబాద్
- View Answer
- సమాధానం: 3
వివరణ: 5వ ఇండియన్ మెయిజ్ సమ్మిట్ – 2018ని ఇటీవల దేశ రాజధాని న్యూఢిల్లీలో నిర్వహించారు. మొక్కజొన్న దిగుబడులు పెంచడం, సాగులో నూతన విధానాల వినియోగం తదితర అంశాలపై ఈ సమావేశాల్లో చర్చించారు.
- సమాధానం: 3
21. యునెస్కో కార్యనిర్వాహక బోర్డు భారత ప్రతినిధిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు?
1) జేఎస్ రాజ్ పుట్
2) రవిశ్ కుమార్
3) సూరజ్ గుప్తా
4) ప్రియాంక్ సేన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఎన్ సీఆర్ టీ మాజీ డైరెక్టర్, ప్రొఫెసర్ జేఎస్ రాజ్ పుట్.. యునెస్కో కార్యనిర్వాహక బోర్డులో భారత ప్రతినిధిగా ఇటీవల నియమితులయ్యారు. ఆయన నాలుగేళ్ల పాటు ఈ పదవిలో ఉంటారు. ఈ బోర్డులో మొత్తం 58 మంది సభ్యులు ఉంటారు.
- సమాధానం: 1
22. పెరూ నూతన అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు బాధ్యతలు చేపట్టారు?
1) మరిసాల్ ఎస్పినోజా
2) మెర్సిడిస్ అరాఓజ్
3) మార్టిన్ విజ్ కర్రా
4) పబ్‌లో కుస్ జిన్సికీ
- View Answer
- సమాధానం: 3
వివరణ: అవినీతి ఆరోపణలతో పెడ్రో పబ్‌లో కుస్ జిన్సికి ఇటీవల పెరూ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో మార్టిన్ విజ్ కర్రా ఆ దేశ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.
- సమాధానం: 3
23. దేశంలోనే వంద శాతం సోలార్ విద్యుత్ తో కూడిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కలిగిన తొలి జిల్లా ఏది?
1) కోల్ కత్తా
2) చెన్నై
3) బెంగళూరు
4) సూరత్
- View Answer
- సమాధానం: 4
వివరణ: గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ జిల్లా వంద శాతం సోలార్ విద్యుత్ తో కూడన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కలిగిన తొలి జిల్లాగా గుర్తింపు పొందింది. జిల్లాలో ఉన్న 52 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పూర్తిగా వంద శాతం సోలార్ విద్యుత్ తో అనుసంధానం చేశారు.
- సమాధానం: 4
24. ఇటీవల జరిపిన 12వ ఎడిషన్ ఎర్త్ అవర్ – 2018లో డబ్ల్యూడబ్ల్యూఎఫ్ – ఇండియా చేపట్టిన కాంపెయిన్ పేరేమిటి?
1) గివ్ అప్టూ గివ్ బ్యాక్
2) సేవ్ అర్త్ ఫర్ ఫ్యూచర్
3) సేవ్ అర్త్ సేవ్ లైఫ్
4) నేచర్ ఇంపార్టెంట్
- View Answer
- సమాధానం: 1
వివరణ: మార్చి 24న 12వ ఎడిషన్ ఎర్త్ అవర్ నిర్వహించారు. ఇందులో భాగంగా అవసరం లేని విద్యుత్ లైట్లను రాత్రి 8.30 నుంచి 9.30 వరకు గంట సేపు ఆర్పివేశారు. భూతాపాన్ని తగ్గించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏటా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది Give Up to Give Back పేరుతో క్యాంపెయిన్ చేపట్టారు.
- సమాధానం: 1
25. 2018 ఫార్ములావన్ ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్ టోర్నమెంట్ విజేత ఎవరు?
1) కిమి రైకోనెన్
2) మాక్స్ వెర్స్ స్టాపెన్
3) లూయిస్ హామిల్టన్
4) సెబాస్టియన్ వెటెల్
- View Answer
- సమాధానం: 4
వివరణ: 2018 ఫార్ములా వన్ ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్ టోర్నమెంట్ లో జర్మనీకి చెందిన ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటల్ విజేతగా నిలిచాడు.
- సమాధానం: 4
26. జాతీయ హరిత ట్రిబ్యునల్ యాక్టింగ్ చైర్ పర్సన్ గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) జావద్ రహీమ్
2) మోహిత్ అరోరా
3) దీపక్ మిశ్రా
4) ఆర్ ఎస్ రాథోర్
- View Answer
- సమాధానం: 1
వివరణ: జస్టిస్ జావద్ రహీమ్ ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్టింగ్ చైర్ పర్సన్ గా ఇటీవల సుప్రీం కోర్టు నియమించింది. 2012 నుంచి 2017 చివరి వరకు జస్టిస్ స్వతంత్ర కుమార్ ఎన్ జీ టీ చైర్మన్ గా వ్యవహరించారు.
- సమాధానం: 1
27. భారత ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు?
1) కే విజయ్ రాఘవన్
2) ముఖేశ్ మహేశ్వరి
3) త్రిలోక్ నాథ్ దాస్
4) ఆర్ చిదంబరం
- View Answer
- సమాధానం: 1
వివరణ: భారత ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ గా 16 ఏళ్ల పాటు సేవలందించిన ఆర్ చిదంబరం ఇటీవల పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో ప్రముఖ జీవశాస్త్ర నిపుణుడు కే విజయ్ రాఘవన్ నూతన ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ గా బాధ్యతలు చేపట్టారు. 1999లో అప్పటి ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి.. ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ పోస్టుని ఏర్పాటు చేశారు.
- సమాధానం: 1
28. కింది వాటిలో ఏ దేశం, భారత్ మధ్య కూల్ ఈఎమ్ఎస్ సేవలను ఇటీవల తపాలా శాఖ ప్రారంభించింది?
1) బ్రెజిల్
2) చైనా
3) జపాన్
4) అమెరికా
- View Answer
- సమాధానం: 3
వివరణ: తపాలా శాఖ మార్చి 29 న భారత్, జపాన్ మధ్య కూల్ ఈఎమ్ఎస్ (ఎక్స్ ప్రెస్ మెయిల్ సర్వీసెస్) సేవలను ప్రారంభించింది. ఈ విధానం ప్రకారం జపాన్ నుంచి భారత్ కు ఆహార ఉత్పత్తులను వ్యక్తిగత అవసరాల కోసం దిగుమతి చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ విధానం ఢిల్లీలోనే అందుబాటులో ఉంది.
- సమాధానం: 3
29. దేశంలో అత్యధిక గిరిజన ప్రాంతాలకు సురక్షిత మంచినీటి వ్యవస్థలను కలిగి ఉన్న రాష్ట్రం ఏది?
1) మధ్యప్రదేశ్
2) ఒడిశా
3) రాజస్తాన్
4) జార్ఖండ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: కేంద్ర గిరిజన శాఖ మంత్రి జశ్వంత్ సిన్హ్ భాబోర్ ఇటీవల లోక్ సభలో వెల్లడించిన వివరాల ప్రకారం... దేశంలోనే అత్యధికంగా మధ్యప్రదేశ్ లో 55,770 గిరిజన ఆవాసాల్లో సురక్షిత మంచినీరు అందుబాటులో ఉంది. 52,427 ఆవాసాలతో ఒడిశా రెండో స్థానంలో, 53,476తో జార్ఖండ్ మూడో స్థానంలో ఉన్నాయి.
- సమాధానం: 1
30. 65వ జాతీయ చలనచిత్ర పురస్కారాల సెంట్రల్ ప్యానెల్ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు?
1) శేఖర్ కపూర్
2) ఇమ్ తియాజ్ హుస్సేన్
3) అనిరుధ్ రాయ్ చౌదరి
4) పి శేషాద్రి
- View Answer
- సమాధానం: 1
వివరణ: సీనియర్ డైరెక్టర్ శేఖర్ కపూర్ 65వ జాతీయ చలనచిత్ర పురస్కారాల సెంట్రల్ ప్యానెల్ చైర్మన్ గా నియమితులయ్యారు. ఇందులో 10 మంది సభ్యులు ఉంటారు.
- సమాధానం: 1
31. నూతన డైరెక్టర్ జనరల్ బోర్డర్ రోడ్స్ గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు?
1) ఎస్ కే శ్రీవాత్సవ
2) దీపక్ జైన్
3) హర్పాల్ సింగ్
4) సంజీవ్ కుమార్
- View Answer
- సమాధానం: 3
వివరణ: లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్ నూతన డైరెక్టర్ జనరల్ బోర్డర్ రోడ్స్ గా ఇటీవల నియమితులయ్యారు. ఆయన కార్ప్స్ ఆఫ్ ఇంజినీర్స్ లో 1982లో చేరారు.
- సమాధానం: 3
32. 17వ సబ్ జూనియర్ జాతీయ ఉషు ఛాంపియన్ షిప్ – 2018 ఇటీవల ఏ రాష్ట్రంలో జరిగింది?
1) హిమాచల్ ప్రదేశ్
2) పంజాబ్
3) జమ్ము అండ్ కశ్మార్
4) సిక్కిం
- View Answer
- సమాధానం: 3
వివరణ: 17వ సబ్ జూనియర్ జాతీయ ఉషు చాంపియన్ షిప్ – 2018 పోటీలు ఇటీవల జమ్ము అండ్ కశ్మీర్ లో జరిగాయి. 37 జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. భారత సైన్యానికి చెందిన జట్లు కూడా ఈ పోటీల్లో పాల్గొన్నాయి. జమ్ము అండ్ కశ్మీర్ స్పోర్స్ కౌన్సిల్ తో కలిసి ఉషు అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఈ పోటీలు నిర్వహించింది.
- సమాధానం: 3
33. కేంద్ర ప్రభుత్వం 2018-19 బడ్జెట్ లో ప్రకటించిన ఆయుష్మాన్ భారత్ పథకానికి సీఈవోగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) సూరజ్ గుప్తా
2) కామినేని శ్రీనివాస్
3) కీర్తి పాల్ సక్సేనా
4) ఇందూ భూషణ్
- View Answer
- సమాధానం: 4
వివరణ: దేశంలోని పేదలకు రూ. 5 లక్షల వరకు ఆరోగ్య బీమా ను అందించేందుకు ఉద్దేశించిన ఆయుష్మాన్ భారత్ పథకం సీఈవోగా ఇందూ భూషణ్ ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆయన ఈ పదవిలో రెండేళ్లు ఉంటారు. ఈ పథకం ద్వారా 10 కోట్ల మందికి ప్రయోజనం చేకూరుతుందని కేంద్రం అంచనా వేసింది.
- సమాధానం: 4
34. మయన్మార్ నూతన అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు?
1) విన్ యింట్
2) టిన్ యావ్
3) యింట్ స్వే
4) హెన్రీ వాన్ థియో
- View Answer
- సమాధానం: 1
వివరణ: అంగ్ సాన్ సూకీ ప్రధాన అనుచరుడు విన్ యింట్.. మయన్మార్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. టిన్ యావ్ రాజీనామా చేయడంతో జరిగిన ఎన్నికల్లో ఆయన గెలుపొందారు.
- సమాధానం: 1
35. ఇస్రో జీశాట్ – 6ఏ ఉపగ్రహాన్ని ఇటీవల ఏ రాకెట్ ద్వారా నింగిలోకి చేర్చింది?
1) GSLV-F10
2) GSLV-G10
3) GSLV-F08
4) GSLV-GSAT
- View Answer
- సమాధానం: 3
వివరణ: జీశాట్ – 6ఏ సమాచార ఉపగ్రహాన్ని ఇస్రో.. జీఎస్ఎల్వీ-ఎఫ్08 రాకెట్ ద్వారా మార్చి 29న నిర్దేశిత కక్ష్యలోకి పంపింది. ఈ విజయంతో క్రయోజనిక్ దశ (పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారు) ద్వారా చేసిన ప్రయోగాల్లో వరుసగా ఆరోవిజయాన్ని ఇస్రో నమోదు చేసింది. జీఎస్ఎల్వీ సిరీస్‌లో చేసిన 12 ప్రయోగాల్లో ఇది తొమ్మిదో విజయం. షార్‌నుంచి 63వ ప్రయోగం. జీశాట్-6ఏ సమాచార ఉపగ్రహ ప్రయోగంతో డిజిటల్ మల్టీ మీడియా, మొబైల్ కమ్యూనికేషన్ రంగంలో అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుంది.
- సమాధానం: 3
36. అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?
1) మార్చి 21
2) మార్చి 23
3) మార్చి 25
4) మార్చి 27
- View Answer
- సమాధానం: 1
వివరణ: అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని ఏటా మార్చి 21న నిర్వహిస్తారు. జీవకోటి రక్షణలో చెట్లు పోషించే పాత్రపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏటా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు.
2018 Theme : Forests and Sustainable Cities
- సమాధానం: 1
37. ఈజిప్ట్ నూతన అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు?
1) మౌస్సా మొస్తఫా మౌస్సా
2) అల్ సయీద్ ఎల్ బడావి
3) అబ్దుల్ ఫత్తాహ్ అల్ సిసి
4) అహ్మద్ షాఫిక్ సిసి
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఇటీవల జరిగిన ఈజిప్ట్ అధ్యక్ష ఎన్నికల్లో అబ్దుల్ ఫత్తాహ్ అల్ సిసి భారీ మోజారిటీతో విజయం సాధించారు. ఆయనకు 92 శాతం ఓట్లు వచ్చాయి. దీంతో ఆయన రెండోసారి ఈజిప్ట్ అధ్యక్షడిగా బాధ్యతలు చేపట్టారు.
- సమాధానం: 3
38. మహిళలపై కొనసాగుతున్న వేతన వివక్షకు వ్యతిరేకంగా బ్రిటన్ లోని లేబర్ పార్టీకి చెందిన ఎంపీ స్టెలా క్రీజీ నేతృత్వంలో ప్రారంభమైన ఉద్యమం పేరేమిటి?
1) పేమీటూ
2) పే ట్రాన్స్ పరెంట్
3) పే నౌ
4) పే పేమెంట్స్
- View Answer
- సమాధానం: 1
వివరణ: మహిళలపై కొనసాగుతున్న వేతన వివక్షకు వ్యతిరేకంగా బ్రిటన్‌లోని లేబర్ పార్టీకి చెందిన ఎంపీ స్టెలా క్రీజీ నేతృత్వంలో #paymetoo అనే ఉద్యమం ప్రారంభమైంది. మహిళలకు సమానంగా వేతనాలు ఎందుకు ఇవ్వడం లేదని ఉద్యోగులు యాజమాన్యాలను అడగడమే ఈ ఉద్యమం ప్రధాన ఉద్దేశం. 250కి పైగా ఉద్యోగులు ఉన్న ప్రైవేటు కంపెనీలన్నీ ఒక గంట పనికి మహిళలకు, పురుషులకు చెల్లించే వేతనాల్లో వ్యత్యాసాన్ని తప్పనిసరిగా బయటపెట్టాలంటూ బ్రిటన్ కొత్త చట్టం చేసింది.
- సమాధానం: 1
39. నవలా రచయిత, సంగీత కారుడు కార్లోస్ అల్వరాడో ఇటీవల ఏ దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు?
1) మయన్మార్
2) కోస్టారికా
3) ఈజిప్ట్
4) చిలీ
- View Answer
- సమాధానం: 2
వివరణ: కోస్టారికా అధ్యక్షుడిగా నవలా రచయిత, సంగీతకారుడు కార్లోస్ అల్వరాడో ఎన్నికయ్యారు. ఆయనకు ఎన్నికల్లో 60 శాతానికి పైగా ఓట్లు లభించాయి. కార్లోస్ పాత్రికేయం, రాజనీతి శాస్త్రాల్లో పట్టభద్రుడు.
- సమాధానం: 2
40. కేంద్ర మానవ వనరుల శాఖ ఇటీవల విడుదల చేసిన యూనివర్సిటీ ర్యాంకింగ్స్ లో ఓవరాల్ విభాగంలో ఏ విశ్వవిద్యాలయం అత్యుత్తమంగా నిలిచింది ?
1) ఐఐఎస్సీ
2) ఐఐటీ- మద్రాస్
3) ఐఐఎం-అహ్మదాబాద్
4) ఢిల్లీ ఎయిమ్స్
- View Answer
- సమాధానం: 1
వివరణ: దేశంలోనే అత్యుత్తమ విద్యాసంస్థగా బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) నిలిచింది. ఓవరాల్‌తోపాటు విశ్వవిద్యాలయాల విభాగంలోనూ ఐఐఎస్సీ తొలిస్థానం సాధించింది. అత్యుత్తమ ఇంజినీరింగ్ విద్యాసంస్థగా ఐఐటీ-మద్రాస్, అత్యుత్తమ మేనేజ్మెంట్ విద్యాసంస్థగా ఐఐఎం-అహ్మదాబాద్, అత్యుత్తమ వైద్య విద్యాసంస్థగా ఢిల్లీలోని ఎయిమ్స్ నిలిచాయి.
- సమాధానం: 1
41. యూరో – 4 నుంచి యూరో – 6 ఇంధన వినియోగానికి వెళ్లిన దేశంలోని మొదటి నగరం ఏది?
1) బెంగళూరు
2) ఢిల్లీ
3) హైదరాబాద్
4) కోల్ కత్తా
- View Answer
- సమాధానం: 2
వివరణ: దేశంలో తొలిసారిగా న్యూఢిల్లీలో ఏప్రిల్ 1 నుంచి యూరో-6(బీఎస్-6) ప్రమాణాలు కలిగిన పెట్రోలు, డీజిల్‌ను విక్రయిస్తున్నారు. దీంతో యూరో-4 నుంచి నేరుగా యూరో-6 ఇంధన వినియోగానికి వెళ్లిన మొదటి నగరంగా ఢిల్లీ గుర్తింపు పొందింది.
- సమాధానం: 2
42. జోన్స్ లాంగ్ లాసల్లే ఇటీవల విడుదల చేసిన మూమెంటమ్ ఇండెక్స్ ప్రకారం స్వల్ప కాలంలో వృద్ధి చెందిన అంతర్జాతీయంగా టాప్ 30 నగరాల్లో మొదటి స్థానంలో ఉన్న సిటీ ఏది?
1) బెంగళూరు
2) హైదరాబాద్
3) విశాఖపట్నం
4) ముంబై
- View Answer
- సమాధానం: 2
వివరణ: జోన్స్ లాంగ్ లాసల్లే ఇటీవల విడుదల చేసిన మూమెంటమ్ ఇండెక్స్ ప్రకారం స్వల్ప కాలంలో వృద్ధి చెందిన అంతర్జాతీయంగా టాప్ 30 నగరాల్లో హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. బెంగళూరు రెండో స్థానంలో ఉండగా, పుణె 4, కోల్‌కతా 5, ఢిల్లీ 8, చెన్నై 14, ముంబై 20వ స్థానంలో నిలిచాయి.
- సమాధానం: 2
43. తెలంగాణ జన సమితి పార్టీని ఏర్పాటు చేసిన నాయకుడు ఎవరు?
1) కోదండరామ్
2) చెరుకు సుధాకర్
3) కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
4) జస్టిస్ చంద్రకుమార్
- View Answer
- సమాధానం: 1
వివరణ: తెలంగాణ జేఏసీ చైర్మన్ ఎం.కోదండరాం నేతృత్వంలో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. రాష్ట్రంలో కొనసాగుతున్న అసంతృప్త పాలనకు ప్రత్యామ్నాయంగా ‘తెలంగాణ జన సమితి-టీజేఎస్’ పేరుతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు కోదండరాం ప్రకటించారు.
- సమాధానం: 1
44. ఓక్లా స్పీడ్ టెస్ట్ ఇండెక్స్ – 2018 ప్రకారం ఇంటర్నెట్ డౌన్ లోడ్ స్పీడ్ లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది?
1) 109
2) 123
3) 150
4) 175
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఓక్లా స్పీడ్ టెస్ట్ ఇండెక్స్ – 2018 ప్రకారం ఇంటర్నెట్ డౌన్ లోడ్ స్పీడ్ లో భారత్ 9.01 ఎంబీబీపీఎస్ స్పీడుతో 109వ స్థానంలో నిలిచంది. మొబైల్ డౌన్లోడ్ స్పీడ్‌లో 62.07 ఎంబీపీఎస్‌తో నార్వే అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా, ఫిక్స్డ్ బ్రాడ్‌బాండ్ విభాగంలో 161.53 ఎంబీపీఎస్ స్పీడ్‌తో సింగపూర్ ప్రథమ స్థానంలో ఉంది. భారత్‌లో ఈ స్పీడ్ 20.72.
- సమాధానం: 1
45. ఈశాన్య రాష్ట్రాలకు ఇస్తున్న పారిశ్రామిక పన్ను ప్రోత్సాహకాలను కేంద్ర ప్రభుత్వం ఎప్పటి వరకు పెంచింది?
1) 2019
2) 2020
3) 2021
4) 2022
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఈశాన్య రాష్ట్రాలకు ఇస్తున్న పారిశ్రామిక పన్ను ప్రోత్సాహకాలను కేంద్ర ప్రభుత్వం 2020 మార్చి వరకు పొడిగించింది. దీని కోసం రూ.3,000 కోట్లు కేటాయిస్తూ ప్రధాని నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈశాన్య రాష్ట్రాల పారిశ్రామిక అభివృద్ధి పథకం - 2017 పేరుతో పన్ను ప్రోత్సాహకాలను అందించనున్నారు.
- సమాధానం: 2
46. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతులకు పెట్టుబడి సాయం పథకానికి ఏ పేరు పెట్టింది?
1) రైతులక్ష్మీ
2) రైతునేస్తం
3) రైతుకు సాయం
4) రైతుబంధు
- View Answer
- సమాధానం: 4
వివరణ: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పెట్టుబడి పథకానికి 'రైతుబంధు'అని నామకరణం చేసింది. ఈ పథకం కింద ప్రతి రైతుకి ఒక పంటకి ఎకరానికి నాలుగు వేల రూపాయల పెట్టుబడి సాయం అందుతుంది. ఖరీఫ్, రబీ కలిపి ఏడాదికి ఎకరానికి ఎనిమిది వేల రూపాయలు అందుతాయి.
- సమాధానం: 4
47. తెలంగాణలో ఏ తరగతి విద్యార్థులకు తెలుగు తప్పనిసరి చేస్తూ తీసుకొచ్చిన బిల్లుకి ఇటీవల శాసనసభ ఆమోదం తెలిపింది ?
1) ఒకటి నుంచి 12వ తరగతి వరకు
2) ఒకటి నుంచి 10వ తరగతి వరకు
3) ఒకటి నుంచి 5వ తరగతి వరకు
4) ఒకటి నుంచి 7వ తరగతి వరకు
- View Answer
- సమాధానం: 2
వివరణ: తెలంగాణలో ఒకటి నుంచి పదోతరగతి వరకు తెలుగును తప్పనిసరి చేస్తూ తీసుకొచ్చిన బిల్లుకు శాసనసభ మార్చి 24న ఆమోదం తెలిపింది. దీంతో తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, ఇతర మాధ్యమాలు (ఉర్దూ, తమిళం, మళయాలం), కేంద్ర, అంతర్జాతీయ విద్యాసంస్థల్లో తెలుగును మొదటి భాషగా బోధించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా 2018-19 విద్యా సంవత్సరం నుంచి అన్ని రకాల పాఠశాలల్లో ఒకటి, ఆరో తరగతిల్లో తెలుగును మొదటి భాషగా అమలు చేస్తారు.
- సమాధానం: 2
48. అమెరికా అత్యున్నత పురస్కారం పబ్లిక్ రిలేషన్ వీక్ అవార్డ్ దక్కించుకున్న క్యాంపెయిన్ ఏది?
1) వీ ఆర్ సిక్స్
2) పే మీటూ
3) ఐ ఆమ్ దట్ ఉమెన్
4) మీ టూ ఇన్ ఇండియా
- View Answer
- సమాధానం: 1
వివరణ: అమెరికాలో మైనార్టీలుగా ఉన్న సిక్కుల్లో అవగాహన కల్పించడానికి నిర్వహించిన 'వి ఆర్ సిక్స్'(మేము సిక్కులం) ప్రచారానికి అమెరికా అత్యున్నత పురస్కారం పబ్లిక్ రిలేషన్ వీక్ అవార్డ్ దక్కింది. మైనార్టీ కమ్యూనిటీపై సిక్కులకు అవగాహన కల్పించేందుకు గత ఏడాది ఏప్రిల్‌లో నేషనల్ సిక్ క్యాంపెయిన్(ఎన్ఎస్సీ) అనే స్వచ్ఛంద సంస్థ ఈ ప్రచారాన్ని ప్రారంభించింది.
- సమాధానం: 1
49. 15వ ఆర్థిక సంఘం నూతన సంయుక్త కార్యదర్శిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు?
1) క్రిష్ణ బహదూర్ సింగ్
2) రవి కోటా
3) అనూప్ సింగ్
4) సంజయ్ అడ్లాఖా
- View Answer
- సమాధానం: 2
వివరణ: 1993 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన అధికారి రవి కోటా.. ఇటీవల 15వ ఆర్థిక సంఘం సంయుక్త కార్యదర్శిగా నియమితులయ్యారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 280 ప్రకారం 1951లో భారత ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేశారు. 15వ ఆర్థిక సంఘాన్ని 2017 నవంబర్ 27న ఏర్పాటు చేశారు. దీని చైర్మన్ ఎన్ కే సింగ్.
- సమాధానం: 2
50. నీతి ఆయోగ్ ఇటీవల వెల్లడించిన 101 జిల్లాల ర్యాంకుల్లో.. ఏ జిల్లా అత్యంత వెనుకబడిన జిల్లాగా నిలిచింది ?
1) మెవత్
2) సింగురౌలి
3) కుమ్రంభీమ్ అసిఫాబాద్
4) విజయనగరం
- View Answer
- సమాధానం: 1
వివరణ: దేశంలో అత్యంత వెనుకబడిన 101 జిల్లాల ర్యాంకులను నీతి ఆయోగ్ మార్చి 28న విడుదల చేసింది. ఈ జిల్లాలు ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేపట్టిన ‘ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్’ కార్యక్రమంలో ఉన్నాయి. తాజా ర్యాంకుల్లో హరియాణలోని మెవత్ అత్యంత వెనుకబడిన జిల్లాగా నిలవగా, ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం అత్యుత్తమ పనితీరు కనబరిచింది. మెవత్ తర్వాత మధ్యప్రదే శ్‌లోని సింగురౌలి, తెలంగాణలోని కుమ్రంభీమ్ అసిఫాబాద్ అత్యంత వెనుకబడిన జిల్లాలుగా ఉన్నాయి.
- సమాధానం: 1