కరెంట్ అఫైర్స్ ( మార్చి 17 - 24, 2017 ) బిట్ బ్యాంక్
1. దేశంలో సిజేరియన్ ఆపరేషన్లు అత్యధికంగా జరుగుతున్న రాష్ట్రం ఏది ?
1) ఆంధ్రప్రదేశ్
2) తెలంగాణ
3) మహారాష్ట్ర
4) తమిళనాడు
- View Answer
- సమాధానం: 2
వివరణ: జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే - 4 ప్రకారం దేశంలో ఎక్కువ సిజేరియన్ ప్రసవాలు తెలంగాణ (58 శాతం), ఆంధ్రప్రదేశ్ (40.1 శాతం) రాష్ట్రాల్లో జరుగుతున్నాయి.
- సమాధానం: 2
2. 18 ఏళ్ల లోపే తల్లులవుతున్న వారి సంఖ్య ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉంది ?
1) ఆంధ్రప్రదేశ్
2) తెలంగాణ
3) మహారాష్ట్ర
4) గోవా
- View Answer
- సమాధానం: 1
వివరణ: కేంద్రం నిర్వహించిన సర్వే ప్రకారం 18 ఏళ్లలోపే తల్లి అవుతున్న వారు ఆంధ్రప్రదేశ్‌లో 11.8 శాతం, తెలంగాణలో 10.6 శాతంగా ఉన్నారు.
- సమాధానం: 1
3. జాతీయ ఉత్తమ ఇంధన పొదుపు పురస్కారానికి ఎంపికైన సంస్థ ఏది ?
1) ఓఎన్జీసీ
2) ఏపీఎస్ఆర్టీసీ
3) టీఎస్ ఆర్టీసీ
4) గుజరాత్ ఆయిల్ కార్పొరేషన్
- View Answer
- సమాధానం: 3
వివరణ: న్యూఢిల్లీలో జరిగిన అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్ టేకింగ్ 61వ వార్షిక సర్వసభ్య సమావేశంలో టీఎస్ ఆర్టీసీకి ఉత్తమ ఇంధన పొదుపు పురస్కారం ప్రదానం చేశారు. 4 - 10 వేల బస్సుల కేటగిరీలో 5.5 కేఎంపీఎల్ సాధించినందుకు గాను సంస్థకు ఈ అవార్డు లభించింది.
- సమాధానం: 3
4. దేశంలో ఉన్న ఆర్థిక సంస్థల సంఖ్యలో తెలంగాణ స్థానం ఎంత ?
1) 6
2) 9
3) 12
4) 16
- View Answer
- సమాధానం: 3
వివరణ: తెలంగాణదేశంలో ఉన్న ఆర్థిక సంస్థల సంఖ్యలో 12వ స్థానంలో, వాటిల్లో ఉద్యోగం లేదా ఉపాధి పొందుతున్న వారి సంఖ్యలో 10వ స్థానంలో ఉంది.
- సమాధానం: 3
5. ఆంధ్రప్రదేశ్‌లో బహిరంగ మలవిసర్జన రహిత ప్రాంతంగా ఇటీవల ఏ జిల్లాను ప్రకటించారు ?
1) ప్రకాశం
2) నెల్లూరు
3) కృష్ణా
4) విజయనగరం
- View Answer
- సమాధానం: 1
వివరణ: నెల్లూరు జిల్లాలోని 46 మండలాలు, 940 గ్రామ పంచాయతీలలో 2, 87,587 మరుగుదొడ్లు నిర్మించారు.
- సమాధానం: 1
6. ఇటీవల ఏ ప్రాంతంలో మొగల్ నిర్మాణ శైలికి చెందిన గార్డెన్‌ను కనుగొన్నారు ?
1) గోల్కొండ కోట
2) దౌలతాబాద్ కోట
3) మైసూర్ ప్యాలెస్
4) బీదర్ కోట
- View Answer
- సమాధానం: 1
వివరణ: హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలో 300 ఏళ్ల నాటి మొఘల్ గార్డెన్‌ను పురావాస్తు పరిశోధకులు కనుగొన్నారు.
- సమాధానం: 1
7. ఇటీవల ‘మెట్రో పాలిటన్ నగరం’ గుర్తింపు పొందినది ఏది ?
1) అకోలా
2) నాగ్‌పూర్
3) విజయవాడ
4) వరంగల్
- View Answer
- సమాధానం: 3
8. భారత పరిశ్రమల సమాఖ్య నుంచి హరిత పురస్కారం పొందిన సంస్థ ?
1) బీపీసీఎల్
2) ఐఓసీ
3) జీహెచ్ ఎంసీ
4) లాలాగూడ రైల్వే వర్క్‌షాప్
- View Answer
- సమాధానం: 4
వివరణ: నీరు, ఇంధన పొదుపు, పునరుత్పాదన - పునర్వినియోగం తదితర 8 అంశాల్లో ఉత్తమ విధానాలు అవలంబిస్తున్నందుకు గాను లాలాగూడ రైల్వే వర్క్‌షాప్ భారత పరిశ్రమల సమాఖ్య నుంచి హరిత పురస్కారం పొందింది.
- సమాధానం: 4
9. తెలంగాణ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని మండలాలకు విస్తరించింది ?
1) 80
2) 110
3) 130
4) 140
- View Answer
- సమాధానం: 2
వివరణ: 150 మండలాల్లో అమలవుతోన్న పల్లె ప్రగతి కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం మరో 110 మండలాలకు విస్తరించింది. దీంతో పల్లె ప్రగతి మండలాల సంఖ్య 260కి చేరింది. ఈ కార్యక్రమం కింద ప్రజలకు జీవనోపాధి కల్పించటం, పంటలకు గిట్టుబాటు ధరల వచ్చేలా చర్యలు చేపడతారు.
- సమాధానం: 2
10. భారత్ ఇటీవల ఏ దేశంతో సాంఘిక భద్రత ఒప్పందం కుదుర్చుకుంది?
1) దక్షిణాఫ్రికా
2) బ్రెజిల్
3) కెనడా
4) అర్జెంటీనా
- View Answer
- సమాధానం: 2
వివరణ: బ్రెజిల్‌తో కలిపి భారత్ ఇప్పటి వరకు 18 దేశాలతో సాంఘిక భద్రతా ఒప్పందం కుదుర్చుకుంది.
- సమాధానం: 2
11. రైల్వేల అభివృద్ధి కోసం భారత్ ఇటీవల ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది ?
1) చిలీ
2) బ్రెజిల్
3) ఆస్ట్రేలియా
4) పెరూ
- View Answer
- సమాధానం: 3
వివరణ: రైల్వేల్లో అవస్థాపన సౌకర్యాల అభివృద్ధి కోసం ఆస్ట్రేలియాలోని మోనాష్ యూనివర్సిటీతో భారతీయ రైల్వే ఒప్పందం కుదుర్చుకుంది.
- సమాధానం: 3
12. వుమెన్ ఇన్ పాలిటిక్స్ - 2017 నివేదికలో భారత్ స్థానం ?
1) 50
2) 80
3) 110
4) 148
- View Answer
- సమాధానం: 4
వివరణ: వుమెన్ ఇన్ పాలిటిక్స్ - 2017 నివేదికనుఇంటర్ పార్లమెంటరీ యూనియన్, యూఎన్ వుమెన్ సంయుక్తంగా రూపొందించాయి. 193 దేశాలను పరిగణలోకి తీసుకొని తయారు చేసిన ఈ నివేదికలో భారత్ 148వ స్థానంలో నిలిచింది.
- సమాధానం: 4
13. వాంగనూయ్ నది ఏ దేశంలో ఉంది ?
1) న్యూజిలాండ్
2) కెనడా
3) చిలీ
4) పెరూ
- View Answer
- సమాధానం: 1
వివరణ: వాంగనూయ్ న్యూజిలాండ్ దేశంలోని మూడో అతిపెద్ద నది. ఇటీవల ఓ వ్యక్తికి ఉండే చట్టబద్ధ్ద హక్కులను ఈ నదికి కల్పించారు. స్థానిక మావోరీ ఐవీ తెగ ప్రజలు ఈ నదిని తమ పూర్వీకుడిగా భావిస్తారు.
- సమాధానం: 1
14. ఎయిర్ బస్ సంస్థ ఆసియాలో తొలి శిక్షణ సంస్థను ఎక్కడ స్థాపించింది ?
1) బీజింగ్
2) జకర్తా
3) టోక్యో
4) న్యూఢిల్లీ
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఫ్రాన్స్‌కు చెందిన విమానాల తయారీ సంస్థ ఎయిర్ బస్ ఆసియాలో తొలి శిక్షణ సంస్థను న్యూఢిల్లీలో ఏర్పాటు చేసింది.
- సమాధానం: 4
15. ఫోర్బ్స్ శ్రీమంతుల జాబితా - 2017లో అగ్రస్థానంలో ఉన్నదెవరు?
1) బిల్ గేట్స్
2) వారెన్ బఫెట్
3) జెఫ్ బెజోస్
4) మార్క్ జుకెర్‌బర్గ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఈ నివేదిక ప్రకారం 86 బిలియన్ డాలర్ల సంపదతో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రపంచ శ్రీమంతుల జాబితాలో మొదటి స్థానంలో ఉన్నారు. బెర్క్ షైర్ హాథ్ వే చీఫ్ వారెన్ బఫెట్ రెండో స్థానంలో, అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ మూడో స్థానంలో ఉన్నారు.
- సమాధానం: 1
16. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో సభ్యులుగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) సానియా మిర్జా
2) జ్వాలా గుత్తా
3) అనసూయ బెన్
4) మిథాలీ రాజ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: భారత బ్యాడ్మింటిన్ క్రీడాకారిణి జ్వాలా గుత్తా మిరయు మాజీ ఐఏఎస్ అధికారి బి.వి.పాపారావులను స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సభ్యులుగా నియమించింది.
- సమాధానం: 2
17. రక్త నమూనాల ద్వారా ఆటిజంను గుర్తించే విధానాన్ని కనుగొన్న సంస్థ ఏది ?
1) Rensselaer polytechnic institute
2) University of california
3) Agharkar research institute
4) S.N.Bose National centre for Basic Science
- View Answer
- సమాధానం: 1
వివరణ: అమెరికాకు చెందిన Rensselaer polytechnic institute రక్త నమూనాల ద్వారా ఆటిజంను గుర్తించే విధానాన్ని అభివృద్ధి చేసింది.
- సమాధానం: 1
18. " మై స్టోరీ " పుస్తక రచయిత ఎవరు ?
1) క్రిస్ గేల్
2) రికీ పాంటింగ్
3) సచిన్ టెండూల్కర్
4) మైఖేల్ క్లార్క్
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఆస్ట్రేలియా క్రికెట్ మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ ‘‘మై స్టోరీ’’ పేరుతో స్వీయ చరిత్రను రచించారు. ఈ పుస్తకాన్ని కోల్‌కత్తాలో ఆవిష్కరించారు.
- సమాధానం: 4
19. గ్లోబల్ మిలినీయమ్ సమ్మిట్‌ను ఎక్కడ నిర్వహించారు ?
1) న్యూఢిల్లీ
2) దుబాయి
3) సింగపూర్
4) పారిస్
- View Answer
- సమాధానం: 2
వివరణ: యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, ఆఫీస్ ఆఫ్ ఇంటర్నేషనల్ ప్రాగ్రామ్, ఐఐఎమ్ అహ్మదాబాద్, శ్రీరాం కాలేజ్ ఆఫ్ కామర్స్ సంయుక్తంగా గ్లోబల్ మిలీనియమ్ సమ్మిట్‌ను దుబాయిలోనిర్వహించాయి.
- సమాధానం: 2
20. ఆర్బీఐ ఎంత విలువగల ప్లాస్టిక్ కరెన్సీని ముద్రించనున్నట్లు ఇటీవల ప్రకటించింది?
1) రూ. 100
2) రూ. 50
3) రూ. 10
4) రూ. 1000
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఆర్బీఐ రూ.10 విలువ గల ప్లాస్టిక్ కరెన్సీని మొదట కొచ్చి, మైసూర్, జైపూర్, షిమ్లా, భువనేశ్వర్లలో ప్రవేశపెట్టనుంది.
- సమాధానం: 3
21. బిజినెస్ ఎక్సలెన్స్ అండ్ రీసెర్చ్ గ్రూప్ ప్రదానం చేసిన ఉమెన్ ఐకాన్ పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు ?
1) వందనా శర్మ
2) రాణి ముఖర్జీ
3) శారదా దేవి
4) నేహాలీ శర్మ
- View Answer
- సమాధానం: 1
వివరణ: బిజినెస్ ఎక్సలెన్స్ అండ్ రీసెర్చ్ గ్రూప్ మరియు నాన్ యాంగ్ టెక్నాలజీ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ సంయుక్తంగా ఉమెన్ ఐకాన్ పురస్కారాన్ని ప్రదానం చేస్తాయి. ఈ ఏడాది ప్రకటించిన అవార్డుల్లో భారత్ నుంచి వందనా శర్మ ( సామాజిక వేత్త ), రేవతి సిద్ధార్థ రాయ్ ( సామాజిక వేత్త ), డా. శ్రీమతి కేశన్ ( ఎయిరో స్పేస్ ) సహా 11 మంది మహిళలు ఈ అవార్డుకు ఎంపికయ్యారు.
- సమాధానం: 1
22. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా ఇటీవల ఎవరు బాధ్యతలు చేపట్టారు ?
1) యశ్పాల్ ఆర్య
2) త్రివేంద్ర సింగ్ రావత్
3) అరవింద్ పాండే
4) ప్రకాశ్ పంత్
- View Answer
- సమాధానం: 2
23. నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కర్మఛారీస్ కి కొత్త చైర్మన్‌గా ఎవరు ఎంపికయ్యారు ?
1) మనోహర్ వర్మ
2) అరవింద్ ఘోష్
3) పి.బి. పంత్
4) మన్హర్ వాల్జీభాయ్ జాలా
- View Answer
- సమాధానం: 4
వివరణ: నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కర్మఛారీస్ ని 1993లో ప్రత్యేక చట్టం ద్వారా ఏర్పాటు చేశారు.
- సమాధానం: 4
24. ఇండియన్ - అమెరికన్ ప్రశంసా దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
1) మార్చి 6
2) మార్చి 10
3) మార్చి 16
4) మార్చి 20
- View Answer
- సమాధానం: 3
వివరణ: 2017 ఫిబ్రవరిలో భారత్‌కు చెందిన కూచిబొట్ల శ్రీనివాస్ అమెరికాలో హత్యకు గురయ్యాడు. అమెరికాలో భవిష్యత్తులో జాతి వివక్ష హత్యలు జరగకూడదనే ఉద్దేశంతో ఆ దేశంలోని కాన్సాస్ రాష్ట్రం మార్చి 16ని ఇండియన్ - అమెరికన్ ప్రశంసా దినోత్సవంగా ప్రకటించింది.
- సమాధానం: 3
25. అంతర్జాతీయ బౌద్ధమత సమావేశం - 2017ను ఎక్కడ నిర్వహించారు ?
1) రాజ్‌గిర్
2) వైశాలి
3) పాటలీ పుత్ర
4) కుందలవనం
- View Answer
- సమాధానం: 1
వివరణ: రాజ్‌గిర్ (బిహార్) లోని నవ్ నలంద మహావీర్ డీమ్డ్ యూనివర్సిటీలో మూడు రోజుల పాటు అంతర్జాతీయ బౌద్ధమత సమావేశాన్ని నిర్వహించారు. వీటిని టిబెట్ బౌద్ధమత గురువు దలైలామా ప్రారంభించారు.
- సమాధానం: 1
26. భారత దేశంలో తయారైన తొలి రైలుని ఏ రైల్వే జోన్లో ప్రవేశపెట్టారు?
1) దక్షిణ మధ్య రైల్వే
2) దక్షిణ రైల్వే
3) తూర్పు రైల్వే
4) పశ్చిమ రైల్వే
- View Answer
- సమాధానం: 4
వివరణ: రూ. 43.23 కోట్ల వ్యయంతో చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో మేధా ైరె లును తయారు చేశారు. ఇది భారత్‌లో తయారైన తొలి రైలు. గరిష్ఠంగా 110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల ఈ రైలుని పశ్చిమ రైల్వే పరిధిలోని దాదార్ - బొరివల్లి మధ్య ప్రవేశపెట్టారు.
- సమాధానం: 4
27. As You Sow అనే సంస్థ సర్వే ప్రకారం అర్హతకు మించి ఆదాయం పొందుతున్న సీఈవోల జాబితాలో చోటు కలిగిన భారతీయ సీఈవో ఎవరు ?
1) విజయ్ గంగూలీ
2) రాజేంద్ర జడేజా
3) సందీప్ మథ్రాని
4) ఇంద్రా నూయీ
- View Answer
- సమాధానం: 3
వివరణ: జనరల్ గోత్రా ప్రాపర్టీస్ సీఈవో సందీప్ మథ్రాని ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నారు. 2016లో ఆయన ఆర్జించిన ఆదాయం 39.2 బిలియన్ డాలర్లు కాగా అందులో 26 మిలియన్ డాలర్లు అదనంగా చెల్లించినవని నివేదిక పేర్కొంది.
- సమాధానం: 3
28. మౌడా సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ ఎక్కడ ఉంది ?
1) ఛత్తీస్‌గఢ్
2) మహారాష్ట్ర
3) కేరళ
4) మధ్యప్రదేశ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలో ఎన్టీపీసీ మౌడా సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ స్టేజ్ - 2ను నిర్మించింది.
- సమాధానం: 2
29. ప్రతిష్టాత్మక ఎన్ఎస్ఎఫ్ కెరీర్ పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు ?
1) రామనాథన్ శర్మ
2)రాజిందర్ సింగ్ చౌతాలా
3)అన్షుమాలీ శ్రీవాత్సవ
4) నరేష్ అగర్వాల్
- View Answer
- సమాధానం: 3
వివరణ: భారత సంతతికి చెందిన కంప్యూటర్ శాస్త్రవేత్త అన్షుమాలీ శ్రీవాత్సవ అమెరికా జాతీయ సైన్స్ ఫౌండేషన్ ప్రదానం చేసే కెరీర్ పురస్కారానికి ఎంపికయ్యారు.
- సమాధానం: 3
30. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు చేపట్టారు ?
1) యోగి ఆదిత్యనాథ్
2) రామ్ నాయక్
3) అఖిలేష్ యాదవ్
4) మాయావతి
- View Answer
- సమాధానం: 1
వివరణ: బీజేపీకి చెందిన యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర 32వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన అసలు పేరు అజయ్ మోహన్ బిష్త్.
- సమాధానం: 1
31. భారత్‌లో అతిపొడవైన రోడ్డు టన్నెల్‌ను ఎక్కడ ప్రారంభించారు ?
1) చెన్నై - నాగర్ కొయిల్
2) విజయవాడ - అమరావతి
3) చెనాని - నాశ్రీ
4) ముంబయి - పూణె
- View Answer
- సమాధానం: 3
వివరణ: జమ్ము - శ్రీనగర్ జాతీయ రహదారి ప్రాజెక్టులో భాగంగా చెనాని - నాశ్రీ మధ్య 9 కి.మీ. పొడవైన రోడ్డు టన్నెల్‌ను నిర్మించారు. దీనిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
- సమాధానం: 3
32. ప్రపంచ ఆర్థిక ఫోరం విడుదల చేసిన 100 యువ ప్రపంచ నాయకుల జాబితాలో చోటు సంపాదించిన భారతీయుడు ఎవరు ?
1) విజయ్ శేఖర్ శర్మ
2) శృతి శిబులాల్
3) అంబరిష్ మిత్రా
4) పైవారందరూ
- View Answer
- సమాధానం: 4
వివరణ: ప్రపంచ ఆర్థిక ఫోరం ఏటా 40 సంవత్సరాల కన్నా తక్కువ వ యస్సుగల 100 మంది యువ నాయకుల జాబితాను రూపొందిస్తుంది. ఈ ఏడాది జాబితాలో భారత్ నుంచి ఐదుగురు చోటు సంపాదించారు. వీరు విజయ్ శేఖర్ శర్మ (పేటీఎం), శృతి శిబులాల్ (తమారా హాస్పటల్ ), అంబరిష్ మిత్ర (బ్లిప్పర్ ), హిందోల్ సేన్ గుప్తా (జర్నలిస్ట్ ), రిత్విక భట్టాచార్య అగర్వాల్ (స్వనితి ఇనిషియేటివ్ )
- సమాధానం: 4
33. బ్లూమ్ బర్గ్ గ్లోబల్ హెల్త్ ఇండెక్స్ 2017లో తొలిస్థానంలో ఉన్న దేశం ?
1) ఐస్‌ల్యాండ్
2) ఇటలీ
3) స్విట్జర్లాండ్
4) సింగపూర్
- View Answer
- సమాధానం: 2
వివరణ: 163 దేశాలతో రూపొందించిన ఈ జాబితాలో ఇటలీ తర్వాతి స్థానంలో ఐస్‌ల్యాండ్, స్విట్జర్లాండ్, సింగపూర్, ఆస్ట్రేలియా ఉన్నాయి.
- సమాధానం: 2
34. రిలయన్స్ కమ్యూనికేషన్స్‌లో విలీనమైన సంస్థ ఏది ?
1) ఐడియా
2) వొడాఫోన్
3) టీ24
4) ఎయిర్‌సెల్
- View Answer
- సమాధానం: 4
35. ఇటీవల ఏ దేశ శాస్త్రవేత్తలు నూతన వైఫై వ్యవస్థను అభివృద్ధి చేశారు ?
1) నెదర్లాండ్స్
2) స్వీడన్
3) కెనడా
4) ఆస్ట్రియా
- View Answer
- సమాధానం: 1
వివరణ: నెదర్లాండ్స్‌కు చెందిన ఐండ్వో వెన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఇన్ఫ్రా రెడ్ కిరణాల ఆధారంగా వంద రెట్లు ఎక్కువ వేగం గల వైఫై వ్యవస్థను అభివృద్ధి చేశారు.
- సమాధానం: 1
36. దేశంలోని ఏ రాష్ట్రంలో ఆర్సెనిక్ కాలుష్యం ఎక్కువగా ఉంది ?
1) గోవా
2) మధ్యప్రదేశ్
3) పశ్చిమ బెంగాల్
4) తెలంగాణ
- View Answer
- సమాధానం: 3
వివరణ: పశ్చిమ బెంగాల్‌లోని భూగర్భ జలాల్లో ఆర్సెనిక్ కాలుష్యం అధికంగా ఉందని కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య శాఖ ప్రకటించింది. ఇటీవల కేంద్రం నిర్వహించిన సర్వే ప్రకారం ఆ రాష్ట్రంలో 1.04 కోట్ల మంది ప్రజలు ఆర్సెనిక్ కాలుష్యం బారిన పడ్డారు. తరువాతి స్థానంలో బిహార్ ( 16.88 లక్షలు ), అసోం ( 14.88 లక్షలు ) రాష్ట్రాలు ఉన్నాయి.
- సమాధానం: 3
37. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం భూగర్భ జలాల్లో ఎంత శాతం ఆర్సెనిక్ ఉంటే ప్రమాదకరం కాదు ?
1) 1 ఎంజీ
2) 0.8 ఎంజీ
3) 0.5 ఎంజీ
4) 0.1 ఎంజీ
- View Answer
- సమాధానం: 4
వివరణ: ప్రపంచ ఆరోగ్య సంస్థ మంచినీటి నాణ్యత ప్రమాణాలు - 2011 ప్రకారం లీటరు నీటిలో 0.1 ఎంజీ ఆర్సెనిక్ ఉంటే ప్రమాదకరం కాదు.
- సమాధానం: 4
38. ఇటీవల దేశంలో ఏ నదికి వ్యక్తిగత చట్టబద్ధ హక్కులు కల్పించారు ?
1) గంగా
2) సింధు
3) బ్రహ్మపుత్ర
4) గోదావరి
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఉత్తరాఖండ్ రాష్ట్ర హైకోర్టు గంగా - యమున నదులను వ్యక్తులుగా గుర్తిస్తూ చట్టబద్ధ హక్కులు కల్పించింది. రాజ్యాంగం ప్రకారం ఓ వ్యక్తికి ఉండే సర్వ హక్కులు ఈ న దులకు కలుగుతాయి.
- సమాధానం: 1
39. బీఎన్పీ పారిబాస్ ఓపెన్ టెన్నిస్ సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు ?
1) స్టాన్ వావ్రింకా
2) రోజర్ ఫెదరర్
3) రాఫెల్ నాదల్
4) జకోవిచ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: కాలిఫోర్నియాలో జరిగిన బీఎన్పీ పారిబాస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ సింగిల్స్ ఫైనల్లో స్టాన్ వావ్రింకాను ఓడించి రోజర్ ఫెదరర్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. మహిళల సింగిల్స్ టైటిల్ ను ఎలెనా వెస్నినా దక్కించుకుంది.
- సమాధానం: 2
40. అంతర్జాతీయ సంతోష దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
1) మార్చి 16
2) మార్చి 17
3) మార్చి 18
4) మార్చి 20
- View Answer
- సమాధానం: 4
వివరణ: 2013 నుంచి ఏటా మార్చి 20న అంతర్జాతీయ సంతోష దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచంలో అత్యంత సంతోషకర దేశాల జాబితాలో నార్వే తొలి స్థానంలో ఉండగా డెన్మార్క్, ఐస్‌ల్యాండ్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ జాబితాలో భారత్ 122వ స్థానంలో ఉంది.
- సమాధానం: 4
41. ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
1) మార్చి 16
2) మార్చి 18
3) మార్చి 20
4) మార్చి 24
- View Answer
- సమాధానం: 3
వివరణ: Nature forever society of india and eco - sys action foundation సంయుక్తంగా ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని మార్చి 20న నిర్వహిస్తున్నాయి. మానవ జీవితంలో పక్షుల ప్రాముఖ్యాన్ని తెలియజేసేందుకు ఈ రోజు వివిధ కార్యక్రమాల నిర్వహిస్తారు.
- సమాధానం: 3
42. ప్రపంచంలో అత్యంత చౌకైన నగరం ఏది ?
1) ఆల్మతి
2) లాగోస్
3) బెంగళూరు
4) కరాచి
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఎకనామిస్ట్ ఇంటర్నేషనల్ యూనిట్ (EIU) వరల్డ్ వైడ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ - 2017 ప్రకారం కజకిస్తాన్‌లోని ఆల్మతి నగరం అత్యంత చౌకైన నగరాల జాబితాలో తొలి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో లాగోస్ ( నైజీరియా ), మూడో స్థానంలో బెంగళూరు (భారత్), నాలుగో స్థానంలో కరాచీ (పాకిస్తాన్) ఉన్నాయి. ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరం సింగపూర్.
- సమాధానం: 1
43. ఫోర్బ్స్ మ్యాగజైన్ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రపంచంలో ఎక్కువ బిలియనీర్లు గల దేశం?
1) అమెరికా
2) చైనా
3) జర్మనీ
4) భారత్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఫోర్బ్స్ నివేదిక ప్రకారం అమెరికాలో 565 మంది బిలియనీర్లు ఉన్నారు. రెండో స్థానంలో ఉన్న చైనాలో 319 మంది, మూడో స్థానంలో ఉన్న జర్మనీలో 114 మంది, నాలుగో స్థానంలో ఉన్న భారత్‌లో 101 మంది బిలియనీర్లు ఉన్నారు.
- సమాధానం: 1
44. ఫోర్బ్స్ ప్రపంచ ధనవంతుల జాబితా - 2017లో తొలి స్థానంలో ఎవరు ఉన్నారు ?
1) వారెన్ బఫెట్
2) జెఫ్ బెజోస్
3) బిల్ గేట్స్
4) ముఖేశ్ అంబానీ
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఫోర్బ్స్ నివేదిక ప్రకారం బిల్‌గేట్స్ సంపద 86 బిలియన్ డాలర్లు. రెండవ స్థానంలో ఉన్న వారెన్ బఫెట్ సంపద 75.6 బిలియన్ డాలర్లు. అమెజాన్ ఛైర్మన్ జెఫ్ బెజోస్ 72.8 బిలియన్ డాలర్ల సంపదతో మూడో స్థానంలో ఉన్నారు.
- సమాధానం: 3
45. ప్రపంచీకరణ (Globalization ) పై భారత్ - యూఏఈ రెండవ సమావేశం ఎక్కడ జరిగింది ?
1) న్యూఢిల్లీ
2) గోవా
3) దుబాయి
4) అబుదాబి
- View Answer
- సమాధానం: 3
వివరణ: ప్రపంచీకరణపై భారత్ - యూఏఈ రెండవ సమావేశం మార్చి 20న దుబాయిలో జరిగింది.
- సమాధానం: 3
46. ప్రపంచ ఉత్తమ టీచర్ ( The Global Teacher Prize ) పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు ?
1) ఐవాన్ జ్యోక్స్
2) జేమ్స్ బెల్లెనాక్
3) థామస్ పికెట్టి
4) మ్యాగీ మెక్ డొనెల్
- View Answer
- సమాధానం: 4
వివరణ: సమాజంలో మార్పుకు కృషి చేసిన టీచర్లను గుర్తించేందుకు దుబాయికి చెందిన వర్కేయ్ ఫౌండేషన్ ఈ పురస్కారాన్ని ప్రారంభించింది. అవార్డు కింద 1 మిలియన్ డాలర్ల నగదు బహుమతి అందజేస్తారు. కెనడాలో క్యూబెక్ ప్రాంతంలోని సల్యూత్ కమ్యూనిటీలో మార్పు తీసుకొచ్చేందుకు మ్యాగీ మెక్ డొనెల్ 6 ఏళ్ల పాటు కృషి చేసి విజయం సాధించింది.
- సమాధానం: 4
47. ప్రతిష్టాత్మక కీర్తి చక్ర పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు ?
1) మేజర్ రోహిత్ సూరి
2) నాయిబ్ సుబేదార్ విజయ్ కుమార్
3) కార్పొరల్ గురుసేవక్ సింగ్
4) మేజర్ రామచంద్రసింగ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: పాక్ ఆక్రమిత కశ్మీర్లో నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్‌లో పాల్గొన్న మేజర్ రోహిత్ సూరికి కేంద్ర ప్రభుత్వం కీర్తిచక్ర పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఈ దాడుల్లో పాల్గొన్న నాయిబ్ సుబేదార్ విజయ్ కుమార్ శౌర్య చక్ర పురస్కారానికి ఎంపికయ్యారు. పఠాన్‌కోట్ ఉగ్రదాడిలో పోరాడి మరణించిన కార్పొరల్ గురుసేవక్ సింగ్ శౌర్యచక్రకు ఎంపికయ్యారు.
- సమాధానం: 1
48. ఆసియా వాకింగ్ రేస్ చాంపియన్‌షిప్ 20 కి.మీ. విభాగంలో కాంస్య పతక విజేత ఎవరు ?
1) కిమ్ హ్యూన్ - సబ్
2) జియోర్గియ్ షైకో
3) కె.టి. ఇర్ఫాన్
4) మోరి హ్యూన్ - చాంగ్
- View Answer
- సమాధానం: 3
వివరణ: జపాన్‌లోని నొమిలో నిర్వహించిన ఆసియా వాకింగ్ రేసు 20 కి.మీ. విభాగంలో కొరియాకు చెందిన కిమ్ హ్యూన్ - సబ్ బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. కజకిస్తాన్‌కు చెందిన జియోర్గియ్ షైకో రెండో స్థానంలో నిలిచి వెండి పతకాన్ని గెలుచుకున్నాడు. భారత్‌కు చెందిన కె.టి. ఇర్ఫాన్ మూడో స్థానంలో నిలిచి కాంస్యం సాధించాడు.
- సమాధానం: 3
49. అంతర్జాతీయ అడవుల దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
1) మార్చి 21
2) మార్చి 20
3) మార్చి 19
4) మార్చి 18
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 2012 నవ ంబర్ 28న ఒక తీర్మానం ద్వారా మార్చి 21ని ప్రపంచ అడవుల దినోత్సవంగా ప్రకటించింది. మానవ జీవితంలో అడవుల ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఏటా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు.
- సమాధానం: 1
50. అంతర్జాతీయ జాతి వివక్షత నిర్మూలన దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
1) మార్చి 21
2) మార్చి 20
3) మార్చి 19
4) మార్చి 18
- View Answer
- సమాధానం: 1
వివరణ: 1960లో దక్షిణాఫ్రికాలోని షార్వే విల్లేలో జరిగిన శాంతి ప్రదర్శనపై పోలీసులు జరిపిన కాల్పుల్లో 69 మంది చనిపోయారు. ఈ ఘటనను ఖండిస్తూ 1966లో ఐరాస సాధారణ సభ ఒక తీర్మానం ద్వారా మార్చి 21ని అంతర్జాతీయ జాతి వివక్షత నిర్మూలన దినోత్సవంగా ప్రకటించింది.
- సమాధానం: 1