కరెంట్ అఫైర్స్ ( మార్చి 1 - 8, 2017 ) బిట్ బ్యాంక్
1. సూర్యుడిపై వాతావరణ అధ్యయనం కోసం రోబోటిక్ స్పేస్ క్రాఫ్ట్‌ను పంపనున్న సంస్థ ఏది ?
1) ఇస్రో
2) నాసా
3) జాక్సా
4) చైనీస్ స్పేస్ ఏజెన్సీ
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఈ రోబో స్పేస్ క్రాఫ్ట్‌ను నాసా 2018లో పంపనుంది. ఇది సూర్యుని ఫోటో స్పియర్ వాతావరణంపై అధ్యయనం చేయనుంది.
- సమాధానం: 2
2. నాల్గవ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం లింగ నిష్పత్తిలో తొలి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది ?
1) కేరళ
2) మేఘాలయ
3) ఛత్తీస్‌గఢ్
4) హర్యానా
- View Answer
- సమాధానం: 1
వివరణ: 4వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం కేరళలో లింగనిష్పత్తి ( ప్రతి వెయ్యి మంది పురుషులకు స్త్రీల సంఖ్య ) 1047గా నమోదైంది. రెండో స్థానంలో ఉన్న మేఘాలయ (1,009), మూడో స్థానంలో ఛత్తీసగడ్ (977) ఉన్నాయి.
- సమాధానం: 1
3. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సిరియాపై ఆంక్షలు విధించకుండా వీటో అధికారాన్ని ఉపయోగించిన దేశం ఏది ?
1) అమెరికా
2) బ్రిటన్
3) ఫ్రాన్స్
4) చైనా
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సిరియాపై ఆంక్షలు విధించేందుకు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రష్యా, చైనా, బొలివియా దేశాలు వీటో చేశాయి. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాలు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయి. సిరియాపై ఆంక్షలు విధించకుండా రష్యా వీటో చేయడం ఇది ఏడోసారి.
- సమాధానం: 4
4. ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ సర్వే ప్రకారం ప్రయాణికుల సేవల కేటగిరీలో ఏ విమానాశ్రయం తొలి స్థానంలో ఉంది ?
1) రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం
2) అన్నాదురై అంతర్జాతీయ విమానాశ్రయం
3) ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం
4) కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం
- View Answer
- సమాధానం: 1
వివరణ: 2016 సంవత్సరానికి గాను హైదారాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికుల సేవల కేటగిరిలో తొలి స్థానంలో నిలిచింది.
- సమాధానం: 1
5. ఇటీవల ఏ రాష్ట్రంలో 50 మైక్రాన్ల లోపు ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం విధించారు ?
1) ఆంధ్రప్రదేశ్
2) తెలంగాణ
3) తమిళనాడు
4) గోవా
- View Answer
- సమాధానం: 2
వివరణ: పర్యావరణ పరిరక్షణ, భూ కాలుష్యాన్ని తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం 50 మైక్రాన్ల లోపు ప్లాస్టిక్ బ్యాగ్‌ల ఉత్పత్తి, నిల్వ, విక్రయం, వినియోగంపై నిషేధం విధించింది.
- సమాధానం: 2
6. ఇటీవల ఏ ప్రాంతంలో లావణి నృత్య ప్రదర్శన చేసి గిన్నిస్ బుక్‌లో రికార్డు నమోదు చేశారు ?
1) ముంబయి
2) పూణె
3) హైదరాబాద్
4) తిరుపతి
- View Answer
- సమాధానం: 3
వివరణ: హైదరాబాద్‌లోని ఎల్బీ స్డేడియంలో మార్చి 5న ఏకకాలంలో 2,200 మంది విద్యార్థినులు లావణి నృత్యాన్ని ప్రదర్శించి గిన్నిస్ బుక్‌లో రికార్డు నమోదు చేశారు. ఈ నృత్యం మహారాష్ట్రకు చెందినది.
- సమాధానం: 3
7. భారతీయ గిరిజన కళల ప్రదర్శన - 2017 ఎక్కడ నిర్వహించారు ?
1) గోవా
2) భోపాల్
3) హైదరాబాద్
4) భువనేశ్వర్
- View Answer
- సమాధానం: 3
వివరణ: భారతీయ గిరిజన కళల ప్రదర్శనను ఆదిరంగ్ మహోత్సవ్ అని కూడా పిలుస్తారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంయుక్తంగా ఈ వేడుకలను హైదరాబాద్‌లో నిర్వహించాయి.
- సమాధానం: 3
8. జెడ్ఎఫ్ టెక్నాలజీస్ సంస్థ భారత్‌లో తొలి అభివృద్ధి కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించింది ?
1) హైదరాబాద్
2) గోవా
3) బెంగళూరు
4) విశాఖపట్నం
- View Answer
- సమాధానం: 1
వివరణ: జర్మనీకి చెందిన జెడ్ఎఫ్ టెక్నాలజీస్ ఆటోమోటివ్ సాఫ్ట్వేర్ ప్రొవైడర్‌గా గుర్తింపు పొందింది.
- సమాధానం: 1
9. డిజిటల్ తెలంగాణ సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏ సంస్థతో ఒప్పందం చేసుకుంది ?
1) యాహూ
2) మైక్రోసాఫ్ట్
3) ఆపిల్
4) గూగుల్
- View Answer
- సమాధానం: 4
వివరణ: మార్చి 3న న్యూఢిల్ల్లీలో తెలంగాణ ప్రభుత్వం, గూగుల్ మధ్య ఒప్పందం కుదురింది. దీని ప్రకారం తెలంగాణలోని గ్రామాల్లో డిజిటల్ అక్షరాస్యత కోసం గూగుల్ సహకారం అందిస్తుంది.
- సమాధానం: 4
10. గ్లాస్గో చిత్రోత్సవం - 2017లో ప్రత్యేక పురస్కారం పొందిన భారతీయ చిత్రం ఏది ?
1) సాలా ఖడూస్
2) లిప్‌స్టిక్ అండర్ మై బురఖా
3) దంగల్
4) మాంజి
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఆడియన్స్ విభాగంలో లిప్‌స్టిక్ అండర్ మై బురఖా చిత్రం గ్లోస్గో పురస్కారం పొందింది. అలంక్రిత శ్రీవాత్సవ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అనుమతి ఇవ్వలేదు.
- సమాధానం: 2
11. జాతీయ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమిషన్‌కు ఛైర్మన్‌గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) రామేశ్వర్ ఓరాన్
2) బాబూలాల్ మరాండి
3) నందకుమార్ సాయి
4) రాజేశ్వర్ ముండా
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మాజీ ఎంపి నంద కుమార్ సాయి జాతీయ ఎస్టీ కమిషన్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఆర్టికల్ 338ఏ ప్రకారం ఈ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఛైర్మన్ పదవీ కాలం 3 సంవత్సరాలు.
- సమాధానం: 3
12. జాతీయ పులుల సంరక్షణ అథారిటీ (NCTA) ఇటీవల ఏ మీడియా సంస్థపై 5 సంవత్సరాల నిషేధం విధించింది ?
1) బిబిసి
2) నేషనల్ జియోగ్రఫిక్
3) యానిమల్ ప్లానెట్
4) జీ ఇంటర్నేషనల్
- View Answer
- సమాధానం: 1
వివరణ: వన్ వరల్డ్ : కిల్లింగ్ ఆఫ్ కన్జర్వేషన్ పేరుతో బిబిసి ఓ డ్యాక్యుమెంటరీని ప్రసారం చేసింది. ఇందులో అస్సాంలోని ఖజిరంగా జాతీయ పార్కుకు సంబంధించి అసత్యాలు ప్రసారం చేశారని నేషనల్ టైగర్ రిజర్వ్ కన్జర్వేషన్ అథారిటీ పేర్కొంది. ఇందుకు గాను బిబిసికి దేశంలోని 50 టైగర్ రిజర్వ్లలోకి 5 ఏళ్ల వరకూ ప్రవేశం లేకుండా ఆ సంస్థ నిషేధం విధించింది.
- సమాధానం: 1
13. రియో ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు ?
1) పాబ్లో కార్రెనో బూస్టా
2) డొమినిక్ థిమ్
3) జూన్ సెబాస్టియన్
4) రాబర్ట్ ఫార్రీ
- View Answer
- సమాధానం: 2
వివరణ: నాల్గో రియో ఓపెన్ 2017 పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఆస్ట్రేలియా టెన్నిస్ ఆటగాడు డొమినిక్ థీమ్ పాబ్లో కార్రెనో బూస్టాను ఓడింటి టైటిల్ సొంతం చేసుకున్నాడు.
- సమాధానం: 2
14. ప్రపంచ మహిళల యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2017ను నిర్వహించనున్న దేశం ఏది ?
1) చైనా
2) బ్రెజిల్
3) భారత్
4) రష్యా
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఈ పోటీలు నవంబర్‌లో జరుగుతాయి. అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్‌ను 1946లో ప్రారంభించారు. దీని ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్‌లోని లాసానేలో ఉంది.
- సమాధానం: 3
15. ప్రపంచ పౌర రక్షణ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
1) మార్చి 7
2) మార్చి 5
3) మార్చి 3
4) మార్చి 1
- View Answer
- సమాధానం: 4
వివరణ: 1990లో జరిగిన అంతర్జాతీయ పౌర రక్షణ సంస్థ సాధారణ సమావేశంలో ఏటా మార్చి 1న అంతర్జాతీయ పౌర రక్షణ దినోత్సవాన్ని జరుపుకోవాలని తీర్మానం చేశారు.
- సమాధానం: 4
16. ప్రపంచ వివక్ష రహిత దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
1) మార్చి 1
2) మార్చి 2
3) మార్చి 3
4) మార్చి 5
- View Answer
- సమాధానం: 1
వివరణ: వివక్ష రహిత సమాజం దిశగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు 2014 నుంచి ఏటా మార్చి 1న ప్రపంచ వివక్ష రహిత దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
- సమాధానం: 1
17. భారత పట్టణాల వ్యవస్థ 2016 వార్షిక సర్వే ప్రకారం దేశంలో ఉత్తమ నగరం ఏది ?
1) పూణె
2) కోల్కత్తా
3) తిరువనంతపురం
4) ముంబయి
- View Answer
- సమాధానం: 3
వివరణ: బెంగళూరుకు చెందిన జనాగ్రహ సెంటర్ ఫర్ సిటిజన్‌షిప్ అండ్ డెమొక్రసి సంస్థ భారత్‌లోని పట్టణ పరిపాలనపై సర్వే నిర్వహించింది. ఇందులో ఉత్తమ పరిపాలన అందిస్తున్న నగరాల జాబితాలో తిరువనంతపురం తొలి స్థానంలో నిలిచింది. పూణె, కోల్కత్తా, ముంబయి నగరాలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
- సమాధానం: 3
18. స్వచ్ఛ భారత్ మిషన్ కింద దేశవ్యాప్తంగా ఎన్ని జిల్లాల్లో బహిరంగ మల విసర్జనను పూర్తిగా నిర్మూలించారు ?
1) 55
2) 69
3) 82
4) 100
- View Answer
- సమాధానం: 4
వివరణ: దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లోని 1.7 లక్షల గ్రామాల్లో బహిరంగ మల విసర్జనను పూర్తిగా నిర్మూలించామని కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రకటించారు.
- సమాధానం: 4
19. గంగానది శుద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఏ సంస్థతో ఒప్పందం చేసుకుంది ?
1) లయన్స్ క్లబ్
2) రోటరీ ఇండియా
3) గూంజ్
4) వినయ్ ఫౌండేషన్
- View Answer
- సమాధానం: 2
వివరణ: నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ఉద్యమంలో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రోటరీ క్లబ్‌తో ఒప్పందం చేసుకుంది. గంగానది పరివాహక ప్రాంతాల్లోని 20 వేల పాఠశాలల్లో వాష్ ఇన్ స్కూల్ అనే పథకాన్ని ప్రారంభించిన రోటరీ క్లబ్ విద్యార్థులకు పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తోంది.
- సమాధానం: 2
20. 29వ అంతర్జాతీయ యోగా ఉత్సవాన్ని ఎక్కడ నిర్వహించారు ?
1) హరిద్వార్
2) వారణాసి
3) రిషికేశ్
4) రుద్ర ప్రయాగ్
- View Answer
- సమాధానం: 3
21. ప్రతిష్టాత్మక రక్షణ మంత్రి పురస్కారానికి ఎంపికైన సైనిక ఆసుపత్రి ఏది ?
1) ఐఎన్హెచ్ఎస్ అశ్విని
2) ఐఎన్హెచ్ఎస్ఐరావతి
3) కమాండ్స్టార్ ఆసుపత్రి
4) ఐఎన్హెచ్ఎస్గాంధి
- View Answer
- సమాధానం: 1
22. ప్రపంచ వ్యాపార సంస్థకు నూతన భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు ?
1) టి.ఎస్. ఠాకూర్
2) ఎస్.కే. సిన్హా
3) లతకృష్ణారావు
4) జె.ఎస్. దీపక్
- View Answer
- సమాధానం: 4
23. సార్క్ జనరల్ సెక్రెటరీగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) అర్జున్ బహదూర్ తాపా
2) అమ్జద్ హుస్సేన్ బిసెయిల్
3) విక్రమ రణతుంగ
4) డా. ఆసిమ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: అర్జున్ బహదూర్ తాపా స్థానంలో పాకిస్తాన్‌కు చెందిన అమ్జద్ హుస్సేన్ సార్క్ జనరల్ సెక్రెటరీగా నియమితులయ్యారు.
- సమాధానం: 2
24. వలసదారుల హక్కులు కాపాడేందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎవరి అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది ?
1) శ్రీ రాజారామ్ సింగ్
2) శ్రీ పార్థ ముఖోపాధ్యాయ
3) శ్రీ అయ్యంగార్
4) శ్రీ వీరేంద్ర మోది
- View Answer
- సమాధానం: 2
వివరణ: వలస దారుల హక్కులను కాపాడేందుకు 18 మంది సభ్యులతో శ్రీ పార్థ ముఖోపాధ్యాయ అధ్యక్షతన కేంద్రం కమిటీని ఏర్పాటు చేసింది.
- సమాధానం: 2
25. ఇటీవల మధ్యాహ్న భోజన పథకాన్ని ఇంటర్ చదివే బాలికలకూ వర్తింపజేసిన రాష్ట్రం ?
1) తెలంగాణ
2) ఆంధ్రప్రదేశ్
3) కర్ణాటక
4) ఢిల్లీ
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఢిల్లీ ప్రభుత్వ పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 12వ తరగతి వరకూ బాలికలకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. పదో తరగతి వరకూ ఉన్న పథకాన్ని 12వ తరగతికి విస్తరించిన తొలి రాష్ట్ర ఢిల్లీ.
- సమాధానం: 4
26. ఫోల్ ఈగల్ పేరుతో సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించిన దేశాలేవి ?
1) భారత్ - రష్యా
2) అమెరికా - ఆస్ట్రేలియా
3) అమెరికా - దక్షిణకొరియా
4) దక్షిణకొరియా - జపాన్
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఈ సైనిక విన్యాసాలను అమెరికా - దక్షిణకొరియా సంయుక్తంగా మార్చి నెలలో 30 రోజుల పాటు నిర్వహించాయి.
- సమాధానం: 3
27. 13వ ఆర్థిక సహకార సంస్థ సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు ?
1) పాకిస్తాన్
2) భారత్
3) మలేషియా
4) తైవాన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: 1985లో పాకిస్తాన్, ఇరాన్, టర్కీ సంయుక్తంగా ఆర్థిక సహకార సంస్థ (Economic Cooperation Organization)ను ఏర్పాటు చేశాయి. ఇందులో ఖజకిస్తాన్, కిర్గిజిస్తాన్, అజర్ైబె జాన్, తాజికిస్తాన్, అఫ్గనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్క్ మెనిస్తాన్ సభ్య దేశాలుగా ఉన్నాయి.
- సమాధానం: 1
28. చైనా నిర్వహించిన ట్రావెల్ ఫెయిర్‌లో ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా ఎంపికైన దేశం ఏది ?
1) శ్రీలంక
2) నేపాల్
3) భారత్
4) సింగపూర్
- View Answer
- సమాధానం: 1
వివరణ: అంతర్జాతీయ ట్రావెల్ ఫెయిర్‌ను చైనాలోని గ్వాంగ్జులో నిర్వహించారు.
- సమాధానం: 1
29. ఉత్తర సూడాన్ దేశానికి నూతన ప్రధానమంత్రిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) ఒమన్ హసన్ అల్ - బషిర్
2)హాసన్ సలేహ్
3)నవాబ్ అలీఖాన్
4) అబ్దుల్ సలీమ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: 1989లో సూడాన్ జాతీయ ఉమ్మా పార్టీ దేశంలో ప్రధానమంత్రి పదవిని రద్దు చేసింది. ఇన్నేళ్ల తర్వాత ప్రస్తుత ఉత్తర సుడాన్ అధ్యక్షుడు ఒమర్ హసన్ అల్ - బషిర్ దేశానికి నూతన ప్రధానమంత్రిగా హసన్ సలేహ్ను నియమించారు.
- సమాధానం: 2
30. జాతీయ రక్షణ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
1) మార్చి 1
2) మార్చి 2
3) మార్చి 3
4) మార్చి 4
- View Answer
- సమాధానం: 3
31. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని ఏ రోజున నిర్విహ స్తారు ?
1) మార్చి 9
2) మార్చి 7
3) మార్చి 6
4) మార్చి 3
- View Answer
- సమాధానం: 4
వివరణ: 2013లో ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ఏటా మార్చి 3న ప్రపంచ వన్య ప్రాణి దినోత్సవాన్ని నిర్వహించాలని తీర్మానించింది. ఈ రోజున వివిధ కార్యక్రమాల ద్వారా వన్య ప్రాణుల సంరక్షణ ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు.
- సమాధానం: 4
32. ఇటీవల ఏ రాష్ట్రం సంస్కృత భాషను పాఠశాల విద్యలో తప్పనిసరి చేసింది ?
1) గుజరాత్
2) ఛత్తీస్‌గఢ్
3) అస్సాం
4) పంజాబ్
- View Answer
- సమాధానం: 3
వివరణ: అస్సాం ప్రభుత్వం పాఠశాలల్లో 8వ తరగతి వరకూ సంస్కృత భాషను తప్పనిసరి చేసింది.
- సమాధానం: 3
33. కురుఖ్ భాషను ఏ ప్రాంతంలో మాట్లాడతారు ?
1) పశ్చిమ బెంగాల్
2) అరుణాచల్ ప్రదేశ్
3) ఉత్తరాఖండ్
4) రాజస్తాన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కురుఖ్ భాషకు అధికారిక హోదా ఇచ్చింది. ద్రవిడ భాషల కూటమి నుంచి సేకరించిన ఈ భాషను ఉత్తర బెంగాల్ ( మిడ్నాపూర్ - పురూలియా )లోని ఓరాన్ తెగ ప్రజలు మాట్లాడతారు. దీన్ని యునెస్కో అంతరించిపోతున్న భాషల జాబితాలో చేర్చింది.
- సమాధానం: 1
34. వన్య ప్రాణుల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా నిర్వహించిన ఆపరేషన్ పేరు ?
1) ఆపరేషన్ రైనో
2) ఆపరేషన్ టైగర్
3) ఆపరేషన్ ఎలిఫేంట్
4) ఆపరేషన్ థండర్ బర్డ్
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఇంటర్ పోల్ (The International Criminal Police Organisation ) ప్రపంచంలోని వివిధ దేశాల్లో జరిగే వన్య ప్రాణుల అక్రమ రవాణాన్ని అరికట్టేందుకు ఆపరేషన్ థండర్ బర్డ్‌ను ప్రారంభించింది. భారత్‌లో పర్యావరణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని వన్యప్రాణి నేర నియంత్రణ బ్యూరో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.
- సమాధానం: 4
35. " Numbers Dolice " పుస్తక రచయిత ఎవరు ?
1) అంజు చోప్రా
2) ఆకాశ్ చోప్రా
3) లలిత్ బానోత్
4) డిన్ జోన్స్
- View Answer
- సమాధానం: 2
వివరణ: భారత్ మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఈ పుస్తకాన్ని రచించారు. దేశంలోని ప్రముఖ క్రికెటర్ల బయోగ్రఫీలను ఇందులో పొందుపరిచారు.
- సమాధానం: 2
36. ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు ?
1) మార్చి 3
2) మార్చి 5
3) మార్చి 7
4) మార్చి 9
- View Answer
- సమాధానం: 1
వివరణ: మొదటి అంతర్జాతీయ వినికిడి సమస్యల నివారణ మరియు పునరావాస సమావేశాన్ని 2007లో బీజింగ్‌లో నిర్వహించారు. ఈ సమావేశాల్లోనే ఏటా మార్చి 3న ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని నిర్వహించాలని తీర్మానం చేశారు.
- సమాధానం: 1
37. మహిళా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు ఫేస్బుక్ సంస్థ ఏ దేశంలో షీ లీడ్స్ టెక్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది ?
1) బంగ్లాదేశ్
2) శ్రీలంక
3) భారత్
4) వియత్నాం
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఈ కార్యక్రమంలో భాగంగా పరిశ్రమలు స్థాపించే ఔత్సాహిక మహిళలకు సంస్థ నిర్వహణలో ఏడాది పాటు సహాయం చేస్తుంది.
- సమాధానం: 3
38. ప్రతిష్టాత్మక మూర్తిదేవి పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు ?
1) విహంగ్ ఎ. నాయక్
2) కుమార్ విశ్వాస్
3) సునీల్ బందోపాద్యాయ
4) వీరేంద్ర కుమార్
- View Answer
- సమాధానం: 4
వివరణ: 2016 సంవత్సరానికి గాను ప్రముఖ కవి, ఎంపీ వీరేంద్ర కుమార్ మూర్తిదేవి పురస్కారాన్ని పొందారు. ఈయన రాసిన హైమావథ భూమియిల్ పుస్తకానికి ఈ అవార్డు దక్కింది.
- సమాధానం: 4
39. ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచ కప్‌లో అత్యధిక మెడల్స్ సాధించిన దేశం ?
1) భారత్
2) జపాన్
3) ఇటలీ
4) చైనా
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఫిబ్రవరి 22 నుంచి మార్చి 4 వరకు న్యూఢిల్లీలో ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచ కప్ జరిగింది. ఇందులో 6 స్వర్ణాలు, 6 రజతాలతో పతకాల పట్టికలో చైనా తొలి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో ఇటలీ (2 స్వర్ణాలు, 3 రజతాలు), మూడో స్థానంలో ఆస్ట్రేలియా, జపాన్ ( 2 స్వర్ణాలు, 1 రజతం ) నిలిచాయి. ఈ క్రీడల్లో భారత్ ఒక స్వర్ణం, 2 రజతాలతో 5వ స్థానంలో నిలిచింది.
- సమాధానం: 4
40. ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ షూటింగ్ కప్‌లో 50 మీటర్ల పిస్టల్ విభాగంలో బంగారు పతకాన్ని సాధించింది ఎవరు ?
1) జీతూ రాయ్
2) హినా సిద్ధు
3) అమన్‌ప్రీత్ సింగ్
4) వాహీద్ గోల్‌ఖాందన్
- View Answer
- సమాధానం: 1
41. దుబాయి టెన్నిస్ చాంపియన్‌షిప్ - 2017 పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు ?
1) ఫెర్నాండో వెర్డాస్మో
2) రోహన్ బోపన్న
3) జీన్ జూలియస్ రోజర్
4) ఆండి ముర్రే
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఈ టోర్నీ పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఫెర్నాండో వెర్ డాస్మోను ఓడించి ఆండీ ముర్రే టైటిల్ సొంతం చేసుకున్నాడు.
- సమాధానం: 4
42. భగోరియా గిరిజన ఉత్సవాలను ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు ?
1) సిక్కిం
2) మధ్యప్రదేశ్
3) మేఘాలయ
4) నాగాలాండ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఈ ఉత్సవాలను మధ్యప్రదేశ్‌లోని రూబా తెగల ప్రజలు నిర్వహిస్తారు.
- సమాధానం: 2
43. దేశంలో అతిపెద్ద జాతీయ జెండాను ఎక్కడ ఆవిష్కరించారు ?
1) అట్టారి
2) వాఘా
3) కార్గిల్
4) సియాచిన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: భారత్ పాకిస్తాన్ సరిహద్దులోని అట్టారి (పంజాబ్ రాష్ట్రం) వద్ద దేశంలోనే అతిపెద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ జెండా స్తంభం పొడవు 110 మీటర్లు, బరువు 55 టన్నులు.
- సమాధానం: 1
44. మయన్మార్ నౌకాదళానికి శిక్షణ ఇవ్వనున్న దేశం ఏది ?
1) చైనా
2) అమెరికా
3) భారత్
4) జపాన్
- View Answer
- సమాధానం: 3
వివరణ: భారత నేవీ మయన్మార్ నౌకాదళానికి శిక్షణ ఇవ్వనుంది.
- సమాధానం: 3
45. భారత్ ఒమన్ దేశాలు ఇటీవల ఏ పేరుతో సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించాయి ?
1) VARUNA - II
2) AL-NAGAH-II
3) AGNI-III
4) ALLAH - III
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఈ విన్యాసాలను హిమాచల్ ప్రదేశ్‌లో నిర్వహించారు. రెండేళ్లకోసారి జరిగే ఈ విన్యాసాలు 14 రోజుల పాటు జరుగుతాయి. 2015లో తొలి విన్యాసాలు ఒమన్ రాజధాని మస్కట్‌లో నిర్వహించారు.
- సమాధానం: 2
46. విజయ బ్యాంకు 2 వేల శాఖను ఎక్కడ ప్రారంభించింది ?
1) కాకినాడ
2) తిరుపతి
3) కడప
4) అనంతపురం
- View Answer
- సమాధానం: 2
47. మెక్సికన్ ఓపెన్ 2017 పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు ?
1) ఆండిముర్రే
2) రాఫెల్ నాదల్
3) జాన్ ఇస్నర్
4) సామ్ క్వేర్రీ
- View Answer
- సమాధానం: 4
వివరణ: 24వ మెక్సికన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ పైనల్లో రాఫెల్ నాదల్‌ను ఓడించి సామ్ క్వేర్రీ టైటిల్ దక్కించుకున్నాడు.
- సమాధానం: 4
48. ఇటీవల ఏ సంస్థ గౌరవార్థం పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేశారు ?
1) యోగొడ సత్సంగ్ మఠ్
2) రామకృష్ణ మఠ్
3) ఇస్కాన్
4) ఆర్ఎస్ఎస్
- View Answer
- సమాధానం: 1
వివరణ: యోగొడ సత్సంగ్ మఠ్‌ను పరమహంస యోగానంద 1917లో ఏర్పాటు చేశారు. ఈ మఠం వందేళ్ల పూర్తి చేసుకున్న సందర్భంగా తపాలా శాఖ రూపొందించిన ప్రత్యేక పోస్టల్ స్టాంప్‌ను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు.
- సమాధానం: 1
49. భారత్ - నేపాల్ సంయుక్త సైనిక విన్యాసాలను ఏ ప్రాంతంలో నిర్వహించారు ?
1) పొఖారా
2) ఖాట్మాండు
3) ఉత్తరాఖండ్
4) బెలూచిస్తాన్
- View Answer
- సమాధానం: 3
వివరణ: సూర్య కిరణ్ - 11 పేరుతో భారత్ - నేపాల్ సంయుక్త సైనిక విన్యాసాలను ఉత్తరాఖండ్‌లోని పితొర్గర్హ్లో నిర్వహించారు. ఈ సైనిక విన్యాసాలను రెండేళ్ల కోసారి నిర్వహిస్తారు.
- సమాధానం: 3
50. ఆస్ట్రేలియా అంతర్జాతీయ చిత్రోత్సవంలో ఉత్తమ నటి పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు ?
1) ఐశ్వర్యరాయ్ బచ్చన్
2) దీపికా పదుకొన్
3) ప్రియాంకా చోప్రా
4) అనుష్క శర్మ
- View Answer
- సమాధానం: 1
వివరణ: సరభ్జిత్ చిత్రంలో నటనకు గాను ఐశ్వర్యరాయ్ ఆస్ట్రేలియా అంతర్జాతీయ చిత్రోత్సవంలో ఉత్తమ నటి పురస్కారం పొందారు.
- సమాధానం: 1