కరెంట్ అఫైర్స్ (జూన్ 9 - 15) బిట్ బ్యాంక్
1. కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రంలోని గ్రామాల్లో ఎల్ఈడీ వీధి దీపాలను ఏర్పాటు చేయనుంది ?
1) తెలంగాణ
2) ఆంధ్రప్రదేశ్
3) గుజరాత్
4) మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 2
వివరణ: దేశంలోనే తొలిసారిగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లోని 7 జిల్లాల్లో వీధి దీపాలకు ఎల్ఈడీ బల్బులను అమర్చనుంది. ఫ్రాన్స్‌కు చెందిన ఏజెన్సీ ఫ్రాంకాయిస్ డి డెవలప్మెంట్తో కలిసి వీటిని ఏర్పాటు చేయనుంది.
- సమాధానం: 2
2. ఇటీవల ఏ దేశం నాటోలో 29వ సభ్యదేశంగా చేరింది ?
1) మాంటెనిగ్రో
2) సెర్బియా
3) టర్కీ
4) అజర్బైజాన్
- View Answer
- సమాధానం: 1
3. ఐసీస్‌తో సంబంధాలు కొనసాగిస్తుందన్న ఆరోపణలతో ఇటీవల ఏ దేశంపై గల్ఫ్ దేశాలు ఆర్థిక ఆంక్షలు విధించాయి ?
1) ఇరాన్
2) సిరియా
3) ఖతార్
4) ఒమన్
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఉగ్రవాద సంస్థ ఐసీస్‌కు ఖతార్ ఆర్థిక సహాయం చేస్తుందని ఆరోపిస్తూ ఆ దేశంపై సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఈజిప్ట్, యూఏఈ ఆర్థిక ఆంక్షలు విధించాయి. యెమెన్, మాల్దీవులు కూడా ఖతార్‌తో సంబంధాలు తెంచుకున్నాయి. గల్ఫ్‌లోని కువైట్, ఒమన్ మాత్రమే ప్రస్తుతం ఖతార్‌తో సంబంధాలు కొనసాగిస్తున్నాయి.
- సమాధానం: 3
4. విజయ బ్యాంకు దేశంలోని ఎన్ని గ్రామాలను డిజిటల్ గ్రామాలుగా మార్చనుంది ?
1) 100
2) 200
3) 300
4) 400
- View Answer
- సమాధానం: 1
వివరణ: విజయాబ్యాంక్ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో 100 పల్లెలను డిజిటల్ గ్రామాలుగా మార్చాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ గ్రామాలలో ఇంటర్నెట్, ఉచిత వైఫై, మొబైల్ చెల్లింపుల సౌకర్యం, ఆన్లైన్ బ్యాంకింగ్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేస్తుంది. గ్రామ ప్రజలందరికీ ఏటీఎం కార్డులను అందిస్తుంది.
- సమాధానం: 1
5. ప్రతిష్టాత్మక అంతర్జాతీయ కళింగ సాహిత్య పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు ?
1) రామచంద్ర సహాని
2) జోగేంద్ర యాదవ్
3) రాజీవ్ సిసోడియా
4) ఆనంద్ నీలకంఠన్
- View Answer
- సమాధానం: 4
వివరణ: కళింగ యువ సాహిత్య పురస్కారానికి హరప్రసాద్ యాదవ్, కళింగ కరుబాకి పురస్కారానికి పారమిత సత్పతి ఎంపికయ్యారు. కళింగ అంతర్జాతీయ సాహిత్య ఉత్సవాలను ఏటా ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో నిర్వహిస్తారు.
- సమాధానం: 4
6. భారతీయ వన్యప్రాణి ట్రస్ట్‌కు సౌహార్థ రాయబారిగా ఎవరు ఎంపికయ్యారు ?
1) కాజల్ అగర్వాల్
2) ఐశ్వర్యారాయ్ బచ్చన్
3) దియా మిర్జా
4) మాధురీ దీక్షిత్
- View Answer
- సమాధానం: 3
వివరణ: ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా దియా మీర్జాను సౌహార్థ రాయబారిగా నియమించింది. ఆమె స్వచ్ఛ భారత్ మిషన్‌కు చెందిన స్వచ్ఛ సాథీ పథకానికి రాయబారిగాను ఉన్నారు.
- సమాధానం: 3
7. డీఆర్డీవో దీర్ఘ శ్రేణి క్షి పణి పరీక్ష కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించనుంది ?
1) శ్రీహరికోట
2) ద క్షిణ అండమాన్
3) కన్యాకుమారి
4) పంబన్ దీవి
- View Answer
- సమాధానం: 2
వివరణ: డీఆర్డీవో దక్షిణ అండమాన్‌లో ఏర్పాటు చేయనున్న దీర్ఘ శ్రేణి క్షిపణి పరీక్ష కేంద్రానికి ఇటీవల జాతీయ వైల్డ్ లైఫ్ బోర్డు అనుమతి ఇచ్చింది.
- సమాధానం: 2
8. ఇటీవల ఏ రాష్ట్రం ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు గ్రీన్ ప్రోటోకాల్‌ను తయారు చేసింది ?
1) తెలంగాణ
2) కేరళ
3) తమిళనాడు
4) హర్యానా
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఈ విధానం ప్రకారం రాష్ట్రంలోని హోటళ్లు సహా వివాహాది శుభకార్యాల్లో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని నిశ్చయించారు.
- సమాధానం: 2
9. శ్రీలంకలో రైల్వేల అభివృద్ధి కోసం రుణాన్ని మంజూరు చేసిన దేశం ఏది ?
1) భారత్
2) చైనా
3) సింగపూర్
4) ఆస్ట్రేలియా
- View Answer
- సమాధానం: 1
వివరణ: శ్రీలంకలో రైల్వేల అభివృద్ధి కోసం భారత్ 318 మిలియన్ డాలర్ల రుణం మంజూరు చేసింది.
- సమాధానం: 1
10. ఇటీవల బయోడీగ్రేడబుల్ కార్డులను ప్రవేశపెట్టిన బ్యాంకు ఏది ?
1) ఐసీఐసీఐ
2) ఎస్బీఐ
3) యాక్సిస్ బ్యాంకు
4) దెనా బ్యాంకు
- View Answer
- సమాధానం: 3
వివరణ: యాక్సిస్ బ్యాంకు దేశంలోనే తొలిసారిగా బయోడీగ్రేడబుల్ కార్డులను ప్రవేశపెట్టింది. ఇది ప్లాస్టిక్ కార్డులాగే ఉంటుంది. వీటిని polyethylene terephthalate glycolతో తయారు చేస్తారు.
- సమాధానం: 3
11. యునిసెఫ్ ప్రారంభించిన సూపర్ డాడ్ ప్రచార కార్యక్రమంలో చేరిన భారతీయుడు ఎవరు ?
1) వెంకటేశ్
2) వి.వి.ఎస్ లక్ష్మణ్
3) సౌరబ్ గంగూలీ
4) సచిన్ టెండూల్కర్
- View Answer
- సమాధానం: 4
వివరణ: పిల్లల ఎదుగుదలలో తండ్రుల పాత్రపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు యునిసెఫ్ సూపర్ డాడ్ అనే ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో నొవాక్ జకోవిచ్, డేవిడ్ బెక్‌హమ్ పాల్గొంటున్నారు. భారత్ నుంచి ఈ కార్యక్రమంలో సచిన్ పాల్గొంటున్నాడు.
- సమాధానం: 4
12. ఇటీవల నేపాల్ నూతన ప్రధానమంత్రిగా ఎవరు ఎంపికయ్యారు ?
1) షేర్ బహదూర్ దేవ్బా
2) పుష్ప కుమార్
3) బిశ్వేశ్వర కోయిరాలా
4) సూర్య బహదూర్ తాప
- View Answer
- సమాధానం: 1
వివరణ: షేర్ బహదూర్ దేవ్బా నాల్గోసారి నేపాల్ ప్రధానమంత్రిగా ఎంపికయ్యారు.
- సమాధానం: 1
13. ప్రపంచంలో తొలి హైబ్రిడ్ ఎరోబోట్ను తయారు చేసిన దేశం ఏది ?
1) అమెరికా
2) కెనడా
3) ఆస్ట్రేలియా
4) భారత్
- View Answer
- సమాధానం: 4
వివరణ: ప్రపంచంలో తొలి హైబ్రిడ్ ఎరోబోట్ను భారత్ - రష్యా సంయుక్తంగా తయారు చేశాయి. ఇది భూమి, నీరు, ఇసుక, మంచుపై సునాయసంగా ప్రయాణించగలదు. వరదల్లో చిక్కుకున్న ప్రాంతాలకు చేరేందుకు దీన్ని రూపొందించారు.
- సమాధానం: 4
14. ఎగిరే ఉడతను ఇటీవల ఎక్కడ కనుగొన్నారు ?
1) ఉత్తర అమెరికా
2) ఉత్తర ఆఫ్రికా
3) తూర్పు ఆసియా
4) ఉత్తర ఆసియా
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఈ ఉడత తన చర్మాన్ని పారాచూట్లాగా విస్తరించుకొని ఒక చెట్టుపై నుంచి ఇంకో చెట్టుపైకి ఎగరగలదు.
- సమాధానం: 1
15. తొలి జాతీయ మానవ పాల బ్యాంకును ఎక్కడ ఏర్పాటు చేశారు ?
1) హైదరాబాద్
2) పూణె
3) న్యూఢిల్లీ
4) బెంగళూరు
- View Answer
- సమాధానం: 3
వివరణ: న్యూఢిల్లీలోని లేడి హార్డింజ్ మెడికల్ కాలేజీలో తొలి జాతీయ మానవ పాల బ్యాంకు(వాత్సల్య-మాతృ అమృత్ కొశ్)ను ఏర్పాటు చేశారు. తల్లి పాలను సేకరించి, పాశ్చ్యరైజ్ చేసి ఇందులో నిల్వ ఉంచుతారు. తల్లి పాలు అవసరమైన పిల్లలకు వీటిని సరఫరా చేస్తారు.
- సమాధానం: 3
16. బ్రిక్స్ మీడియా ఫోరం సమావేశాలను ఎక్కడ నిర్వహించారు ?
1) న్యూఢిల్లీ
2) బీజింగ్
3) మాస్కో
4) ప్రిటోరియా
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఈ సమావేశాన్ని చైనాలోని బీజింగ్‌లో నిర్వహించారు. బ్రిక్స్ దేశాల ప్రసారమాధ్యమాల కోసం ఒక ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసేందుకు దీన్ని ప్రారంభించారు.
బ్రెజిల్‌కు చెందిన సీఎంఏ గ్రూప్, రష్యాకు చెందిన స్పూత్నిక్ న్యూస్ ఏజెన్సీ, జిన్హువా న్యూజ్ ఏజెన్సీ ఆఫ్ చైనా, ది హిందు గ్రూప్ ఆఫ్ ఇండియా, సౌతాఫ్రికా ఇండిపెండెంట్ మీడియా సంయుక్తంగా బ్రిక్స్ మీడియా ఫోరంను ఏర్పాటు చేశాయి.
- సమాధానం: 2
17. క్యూఎస్ ప్రపంచ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో తొలి స్థానంలో ఉన్న విశ్వవిద్యాలయం ఏది ?
1) కాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
2) హార్వర్డ్ యూనివర్సిటీ
3) స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ
4) మసాచూసెట్స్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
- View Answer
- సమాధానం: 4
వివరణ: QS- Quacquarelli Symonds, టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్‌తో కలిసి ఏటా ప్రపంచంలోని ఉత్తమ యూనివర్సిటీల జాబితాను రూపొందిస్తుంది. ఈ ఏడాదికి సంబంధించిన జాబితాలో తొలిస్థానంలో అమెరికాకు చెందిన మసాచూసెట్స్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తొలి స్థానంలో నిలిచింది. తర్వాతి స్థానంలో స్టాన్ఫోర్డ్, హార్వర్డ్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి.
- సమాధానం: 4
18. క్యూస్ ప్రపంచ ఉత్తమ యూనివర్సిటీల జాబితాలో భారత్ నుంచి తొలి స్థానంలో విశ్వవిద్యాలయం ఏది ?
1) ఐఐటీ - ఢిల్లీ
2) ఐఐటీ - బాంబే
3) ఐఐఎస్సీ - బెంగళూరు
4) ఐఐటీ - మద్రాస్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఈ జాబితాలో భారత్ నుంచి తొలి స్థానంలో ఐఐటీ - ఢిల్లీ (172వ స్థానం) ఉంది. తర్వాతి స్థానంలో ఐఐటీ - బాంబే (179వ స్థానం), ఐఐఎస్సీ - బెంగళూరు(190వ స్థానం) ఉన్నాయి.
- సమాధానం: 1
19. ఫార్చ్యూన్ 500 అత్యుత్తమ కంపెనీల జాబితాలో తొలి స్థానంలో ఉన్న కంపెనీ ఏది ?
1) టెస్లా
2) ఇన్ఫోసిస్
3) వాల్‌మార్ట్
4) కొరస్
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఫార్చూన్ 2017 సంవత్సరానికి సంబంధించి విడుదల చేసిన 500 అత్యుత్తమ కంపెనీల జాబితాలో వాల్మార్ ్ట (5వ సారి) తొలి స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో తొలిసారి స్థానం పొందిన టెస్లా కంపెనీ 383వ స్థానంలో ఉంది.
- సమాధానం: 3
20. ఇటీవల నాసాకు ఎంపికైన భారతీయ సంతతికి చెందిన వ్యోమగామి ఎవరు ?
1) రామకృష్ణ చారి
2) అప్పారావు పొదిలి
3) కృష్ణమూర్తి రావు
4) రాజుచారి
- View Answer
- సమాధానం: 4
వివరణ: కల్పనా చావ్లా తర్వాత భారత సంతతి నుంచి నాసాకు ఎంపికైన వ్యోమగామి లెఫ్టినెంట్ కల్నల్ రాజాచారి. నాసా అంతరిక్షంలోకి పంపేందుకు 12 మందిని ఎంపిక చేసింది. ఇందుకుగాను వీరికి 2 ఏళ్ల పాటు శిక్షణ ఇస్తుంది.
- సమాధానం: 4
21. ఓపెన్ సిగ్నల్ అనే సంస్థ నిర్వహించిన 4జీ ఇంటర్నెట్ స్పీడ్ సర్వేలో భారత్ ర్యాంకు ఎంత ?
1) 18
2) 38
3) 54
4) 74
- View Answer
- సమాధానం: 4
వివరణ: లండన్‌కు చెందిన ఓపెన్ సిగ్నల్ అనే సంస్థ ప్రపంచ 4జీ ఇంటర్నెట్ స్పీడ్‌పై సర్వే నిర్వహించింది. ఇందులో సింగపూర్ తొలిస్థానాన్ని దక్కించుకుంది. 4జీ నెట్వర్క్ లభ్యతలో దక్షిణ కొరియా తొలిస్థానంలో నిలిచింది. ఈ సర్వే ప్రకారం ప్రపంచ ఇంటర్నెట్ సగటు స్పీడ్ 16.2 ఎంబీపీఎస్. భారత్‌లో 4జీ నెట్వర్క్ సగటు స్పీడ్ 5.1 ఎంబీపీఎస్ కాగా 3జీ నెట్వర్క్ సగటు స్పీడ్ 1 ఎంబీపీఎస్ కంటే తక్కువ.
- సమాధానం: 4
22. ఫోర్బ్స్ అత్యంత ఎక్కువ వేతనం పొందుతున్న టాప్ - 100 క్రీడాకారుల జాబితాలో చోటు సంపాదించిన భారతీయ ప్లేయర్ ఎవరు ?
1) రవీంద్ర జడేజా
2) విరాట్ కోహ్లీ
3) అభినవ్ బింద్రా
4) యువరాజ్ సింగ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: విరాట్ కోహ్లీ(22 మిలియన్ డాలర్లు) ఈ జాబితాలో 89వ స్థానంలో నిలిచాడు. జాబితాలో తొలి స్థానంలో క్రిస్టియానా రొనాల్డో (93 మిలియన్ డాలర్లు) ఉన్నాడు. ఈ జాబితాలో స్థానం పొందిన ఏకైక మహిళా క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ 51వ స్థానంలో ఉంది.
- సమాధానం: 2
23. The Crisis within knowledge and education in india అనే పుస్తకాన్ని ఏ సమస్య ఇతివృత్తంగా రచించారు ?
1) భారత రాజకీయాలు
2) భారతదేశంలో రిజర్వేషన్లు - సమాజం
3) భారత విద్యా విధానం
4) భారత ఆర్థిక పరిస్థితులు
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఈ పుస్తకాన్ని గణేశ్ దేవ్య్ రచించారు. సమాజం నుంచి వెలివేయబడిన వారిని వృద్ధిలోకి తీసుకురావడానికి అనుసరించాల్సిన పలు విధానాలను ఈ పుస్తకంలో ఆయన సూచించారు.
- సమాధానం: 2
24. ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
1) జూన్ 9
2) జూన్ 10
3) జూన్ 12
4) జూన్ 14
- View Answer
- సమాధానం: 3
వివరణ: బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలల హక్కుల పరిరక్షణ కోసం 2002 నుంచి ఏటా జూన్ 12న అంతర్జాతీయ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహిస్తారు.
2017 థీమ్ : In conflicts and disasters, Protect children from child labour
- సమాధానం: 3
25. ప్రపంచ రక్తదాత దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
1) జూన్ 14
2) జూన్ 13
3) జూన్ 12
4) జూన్ 11
- View Answer
- సమాధానం: 1
వివరణ: రక్త దానం చేసే వారికి కృతజ్ఞత తెలుపుతూ, రక్తదానం ఆవశ్యకతను అందరికి తెలియజేసేందుకు ఏటా జూన్ 14న ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు.
2017 థీమ్ : What can you do ? Give blood. Give now. Give Often.
- సమాధానం: 1
26. యోగా పై జాతీయ ఆరోగ్య సంపాదకుల సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు ?
1) న్యూఢిల్లీ
2) హైదరాబాద్
3) బెంగళూరు
4) విశాఖపట్నం
- View Answer
- సమాధానం: 1
వివరణ: 2017 థీమ్ : Yoga for health and harmony
- సమాధానం: 1
27. ప్రతిష్టాత్మక రెడ్ ఇంక్ పురస్కారాలలో జీవితకాల సాఫల్య పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు ?
1) రాజ్‌కుమార్ ఝా
2) ఆర్కే రాధాకృష్ణన్
3) వినోద్ దువా
4) గోవింద్ తుపే
- View Answer
- సమాధానం: 3
వివరణ: ముంబయి ప్రెస్ క్లబ్ ఈ పురస్కారాలను ప్రదానం చేస్తుంది. జర్నలిస్ట్ ఆఫ్ ది ఇయర్ పురస్కారానికి రాజ్‌కుమార్ ఝా(ఇండియన్ ఎక్స్‌ప్రెస్ చీఫ్ ఎడిటర్), ది ప్రింట్ పురస్కారానికి ఆర్కే రాధాకృష్ణన్(ఫ్రంట్‌లైన్), ముంబయి స్టార్ రిపోర్ట్ పురస్కారానికి గోవింద్ తుపే ఎంపికయ్యారు.
- సమాధానం: 3
28. భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించిన సెల్ఫీ విత్ డాటర్ ఆప్ ముఖ్య ఉద్దేశం ఏంటి ?
1) ఆడపిల్లలకు విద్య
2) ఆడిపిల్లల భ్రూణ హత్యలను నిరోధించడం
3) ఆడపిల్లల స్వయం ఉపాధి
4) ఏదీ కాదు
- View Answer
- సమాధానం: 2
29. ప్రపంచంలో అతి పురాతనమైన పుట్టగొడుగు శిలాజంను ఎక్కడ కనుగొన్నారు ?
1) ఇజ్రాయెల్
2) కెన్యా
3) ఈజిప్ట్
4) బ్రెజిల్
- View Answer
- సమాధానం: 4
వివరణ: 115 మిలియన్ సంవత్సరాల నాటి పుట్టగొడుగు శిలాజంను బ్రెజిల్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
- సమాధానం: 4
30. లేక్ పొల్యూషన్ నిర్మూలన కోసం ప్రత్యేక ఆప్‌ను ఎవరు రూపొందించారు ?
1) లక్ష్మీ సంయుక్త
2) పింగళి సాహితి
3) అమూల్య బాలకృష్ణ
4) విజిత బెనర్జీ
- View Answer
- సమాధానం: 2
వివరణ: బెంగళూరు నగరానికి చెందిన 12వ తరగతి విద్యార్థిని పింగళి సాహితి సరస్సు కాలుష్యాన్ని నిరోధించేందుకు ఉపయోగపడే ఆప్‌ను తయారు చేసింది. ఇంటెల్ అంతర్జాతీయ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఫేర్‌లో దీన్ని ప్రదర్శించిన ఆమె "An Innovative Crowd sourcing Approach to Monitoring Fresh water Bodies" అనే అంశంపై థీసీస్ సమర్పించి రెండో బహుమతి గెలుచుకుంది. ఇందుకు గాను మెసాచ్యూసెట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పాలపుంతలోని ఒక చిన్న గ్రహానికి పింగళి సాహితి పేరు పెట్టింది.
- సమాధానం: 2
31. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు సంపాదించిన తొలి శ్రీలంక క్రికెటర్ ఎవరు ?
1) సనత్ జయసూర్య
2) కుమార సంగక్కర
3) ముత్తయ్య మురళీధరన్
4) మహేల జయవర్దనే
- View Answer
- సమాధానం: 3
వివరణ: ముత్తయ్య మురళీధరన్‌తో పాటు ఆర్థర్ మోరిస్, జార్జ్ లోహ్మన్న్, కరెన్ రొల్టన్లకు ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కింది.
- సమాధానం: 3
32. 2016 సంవత్సరానికి గాను అఖిల భారత ఫుట్‌బాల్ ఫెడరేషన్ నుంచి ఉత్తమ క్రీడాకారుడిగా ఎంపికైంది ఎవరు ?
1) జేజే లాపెక్లువా
2) సునిల్ ఛత్రి
3) విశాల్ కైత్
4) అర్నాబ్ మండల్
- View Answer
- సమాధానం: 1
వివరణ: మిజోరంకు చెందిన జేజే లాపెక్లువా ఈ పురస్కారానికి ఎంపికయ్యాడు. అవార్డు కింద రూ. 2.5 లక్షల నగదు బహుమతి, ట్రోఫీ లభిస్తుంది.
- సమాధానం: 1
33. ప్రతిష్టాత్మక ప్రిన్సెస్ ఆఫ్ ఆస్టురియస్ సాహిత్య పురస్కారానికి ఎవరు ఎంపిక్యయారు ?
1) ఫ్రెడిరిక్ గ్రాసియా లార్న్
2) ఆడమ్ జగజ్వెస్కీ
3) దామోసో అలోన్సో
4) మిగుల్ గ్లోరియా
- View Answer
- సమాధానం: 1
వివరణ: పొలాండ్‌కు చెందిన ప్రముఖ రచయిత్రి ఆడమ్ జగాజ్వెస్కీ స్పెయిన్ ప్రదానం చేసే ప్రిన్సెస్ ఆఫ్ ఆస్టురియస్ పురస్కారానికి ఎంపికైంది. 1981 నుంచి ఏటా ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు. సైన్స్, హ్యూమానిటిస్, ప్రజా వ్యవహారాల అంశాల్లో వ్యక్తులు లేదా సంస్థలకు ఈ అవార్డును ప్రదానం చేస్తారు.
- సమాధానం: 1
34. షాంఘై సహకార సంస్థలో ఇటీవల చేరిన సభ్య దేశాలు ఏవి ?
1) భారత్, పాకిస్తాన్
2) పాకిస్తాన్, చైనా
3) చైనా, భారత్
4) భారత్, ఖజకిస్తాన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: షాంఘై సహకార సంస్థ(ఎస్సీవో) శిఖరాగ్ర సమావేశాలు ఇటీవల ఖజకిస్తాన్‌లోని ఆస్తానాలో జరిగింది. ఈ సమావేశాల్లోనే భారత్, పాకిస్తాన్ దేశాలకు సభ్యత్వం కల్పిస్తు నిర్ణయం తీసుకున్నారు. ఈ సంస్థను 2001లో ప్రారంభించారు.
ఎస్సీవో సభ్య దేశాలు - చైనా, రష్యా, ఖజకిస్తాన్, కిర్గిజ్స్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, భారత్, పాకిస్తాన్.
- సమాధానం: 1
35. పార్లమెంటరీ వ్యవస్థలో సహకారం కోసం ఇటీవల భారత్‌తో ఒప్పందం కుదుర్చుకున్న దేశం ఏది ?
1) మాల్దీవులు
2) మారిషస్
3) మంగోలియా
4) మాల్టా
- View Answer
- సమాధానం: 2
36. యూకే పార్లమెంటుకు ఎన్నికైన తొలి సిక్కు మహిళ ఎవరు ?
1) ప్రితి గిల్
2) మల్లికా అరోరా
3) అకాలిజిత్
4) బైశాఖి కౌర్
- View Answer
- సమాధానం: 1
వివరణ: లేబర్ పార్టీ నుంచి యూకే పార్లమెంటుకు ఎన్నికైన తొలి సిక్కు మహిళ ప్రితి గిల్.
- సమాధానం: 1
37. 22వ యూరోపియన్ యూనియన్ చిత్రోత్సవం ఎక్కడ నిర్వహించారు ?
1) బ్రస్సెల్స్
2) వార్సా
3) న్యూఢిల్లీ
4) ప్రిటోరియా
- View Answer
- సమాధానం: 3
వివరణ: న్యూఢిల్లీలోని సిరికొట ఆడిటోరియంలో ఐ అండ్ బి మంత్రిత్వశాఖ సహకారంతో ఈ చిత్రోత్సవాన్ని నిర్వహించారు.
- సమాధానం: 3
38. భారత్‌లో కాలుష్య ఉద్గారాలను తగ్గించేందుకు 3.5 మిలయన్ యూరోల గ్రాంట్‌ను ఇచ్చిన దేశం ఏది ?
1) ఇంగ్లండ్
2) ఫ్రాన్స్
3) అమెరికా
4) జపాన్
- View Answer
- సమాధానం: 2
వివరణ: పారిస్ వాతావరణ మార్పుల ఒప్పందంలో భాగంగా.. నాగ్‌పూర్, కోచి, అహ్మదాబాద్‌లలో కాలుష్య నివారణ చర్యల కోసం 3.5 మిలియన్ యూరోల గ్రాంట్‌ను ఫ్రాన్స్ మరియు యూరోపియన్ యూనియన్ విడుదల చేశాయి.
- సమాధానం: 2
39. ఫ్రెంచ్ ఓపెన్ - 2017 పురుషుల సింగిల్స్ విజేత ఎవరు ?
1) రాఫెల్ నాదల్
2) స్టాన్ వావ్రింకా
3) డొనాల్డ్ యంగ్
4) రేయాన్ హర్సిన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఈ టోర్నీ పురుషుల సింగిల్స్ ఫైనల్లో స్టాన్ వావ్రింకాను ఓడించి రాఫెల్ నాదల్ టైటిల్‌ను దక్కించుకున్నాడు. మహిళల సింగిల్స్ టైటిల్‌ను జెలెనా ఓస్టాపెన్క్ గెలుచుకుంది.
- సమాధానం: 1
40. 17వ ప్రపంచ వికలాంగుల చెస్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు ?
1) రోజల్ ఉడ్స్
2) టామ్ బాడి
3) శశికాంత్ కుత్వాల్
4) రవింద్ర నాయుడు
- View Answer
- సమాధానం: 3
వివరణ: స్లోవేకియాలో జరిగిన ప్రపంచ వికలాంగుల చెస్ చాంపియన్‌షిప్‌లో శశికాంత్ కుత్వాల్ బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు.
- సమాధానం: 3
41. భారత ఉక్కుపై అధిక దిగుమతి సుంకం విధించిన దేశం ఏది ?
1) చైనా
2) జపాన్
3) దక్షిణాఫ్రికా
4) అమెరికా
- View Answer
- సమాధానం: 4
వివరణ: అమెరికా భారత్ నుంచి దిగుమతి అవుతున్న ఉక్కుపై అధిక సుంకం విధించింది. దీనిపై భారత్ ప్రపంచ వ్యాపార సంస్థలో ఫిర్యాదు చేసింది.
- సమాధానం: 4
42. ఫ్రాన్స్ దే శ అత్యున్నత పౌర పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు ?
1) రాజమౌళి
2) సౌమిత్ర చటర్జీ
3) అదూర్ గోపాలకృష్ణన్
4) అపర్ణ సేన్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ప్రముఖ బెంగాలీ సినిమా నటుడు సౌమిత్ర చటర్జీకి ఫ్రాన్స్ ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం Legion d'Honneur ప్రదానం చేసింది.
- సమాధానం: 2
43. ఇందిరా గాంధీ - ఏ లైఫ్ ఇన్ నేచర్ పుస్తక రచయిత ఎవరు ?
1) వీరప్ప మొయిలీ
2) మణిశంకర్ అయ్యర్
3) జైరాం ర మేశ్
4) సందీప్ దీక్షిత్
- View Answer
- సమాధానం: 3
44. ఇటీవల ఏ రాష్ట్రం ప్రత్యేక టైమ్ జోన్ కావాలని ప్రతిపాదించింది ?
1) అరుణాచల్ ప్రదేశ్
2) అస్సోం
3) పశ్చిమ బెంగాల్
4) గుజరాత్
- View Answer
- సమాధానం: 1
వివరణ: విద్యుత్‌ను ఆదా చేసుకోవడం, పని సామర్థ్య వృద్ధి కోసం అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమ ఖండు ప్రత్యేక టైమ్ జోన్ కావాలని కేంద్రానికి ప్రతిపాదించారు.
- సమాధానం: 1
45. ప్రపంచంలో అతిపెద్ద తేలియాడే సోలార్ ఫామ్‌ను ఏర్పాటు చేసిన దేశం ఏది ?
1) భారత్
2) బ్రెజిల్
3) చైనా
4) కెనడా
- View Answer
- సమాధానం: 3
వివరణ: హల్యనన్ నగరంలో 1,60,000 సోలార్ ప్యానళ్లతో చైనా ప్రపంచంలోనే అతిపెద్ద తేలియాడే సోలార్ ఫామ్‌ను ఏర్పాటు చేసింది.
- సమాధానం: 3
46. లిటిల్ మిస్ యూనివర్స్ ఇంటర్నెట్ - 2017నకు ఎవరు ఎంపికయ్యారు ?
1) మంజుల రెడ్డి
2) పద్మాలయ నంద
3) ప్రీతి అరోరా
4) సునితా డేవిడ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఒడిశాలోని కటక్‌కు చెందిన 8వ తరగతి విద్యార్థిని పద్మాలయ నంద ఈ టైటిల్‌ను గెలుచుకుంది. గ్రీస్‌లో జరిగే లిటిల్ మిస్ వరల్డ్ పోటీలకు ఎంపికైంది.
- సమాధానం: 2
47. కెనడియన్ గ్రాండ్ ప్రీ ఫార్ములావన్ టైటిల్ విజేత ఎవరు ?
1) డెనియల్ రిక్కియార్డ్
2) సెబాస్టియన్ వెటెల్
3) మాక్స్ వెర్సటపన్
4) లేవిస్ హామిల్టన్
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఈ ఎఫ్1 రేసులో సెబాస్టియన్ వెటెల్‌ను ఓడించి లేవిస్ హామిల్టన్ విజేతగా నిలిచాడు.
- సమాధానం: 4
48. ఇటీవల CRY ప్రకటించిన నివేదికలో బాలకార్మికులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది ?
1) ఉత్తర ప్రదేశ్
2) బిహార్
3) మహారాష్ట్ర
4) తెలంగాణ
- View Answer
- సమాధానం: 1
వివరణ: CRY-Child rights and you విడుదల చేసిన నివేదిక ప్రకారం ఉత్తర ప్రదేశ్‌లో(2,50,672) ఎక్కువ బాలకార్మికులు ఉన్నారు. తర్వాతి స్థానంలో బిహార్ (1,28,087), మహారాష్ట్ర (82,847) ఉన్నాయి.
బాలల హక్కుల పరిరక్షణ కోసం 1979లో రిప్పాన్ కపూర్ CRY సంస్థను స్థాపించారు.
- సమాధానం: 1
49. జీ7 పర్యావరణ మంత్రుల సమావేశం - 2017ను ఎక్కడ నిర్వహించారు ?
1) లండన్
2) పారిస్
3) టోక్యో
4) బోలోగ్నా
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఇటలీలోని బోలోగ్నాలో ఈ సమావేశం జరిగింది. దీనికి జీ7(కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, అమెరికా) దేశాలతో పాటు చిలీ, మాల్దీవులు, ఇథియోపియా, రువాండా దేశాల పర్యావరణ మంత్రులు హాజరయ్యారు. వాతావరణ మార్పులు, సముద్ర మట్టాల పెరుగుదల తదితర అంశాలపై ఈ సమావేశాల్లో చర్చించారు.
- సమాధానం: 4
50. ప్రపంచంలో అత్యధిక వేతనం పొందుతున్న ప్రముఖ నటుల జాబితాలో చోటు సంపాదించిన భారతీయ నటులు ఎవరు ?
1) షారూఖ్ ఖాన్
2) సల్మాన్ ఖాన్
3) అక్షయ్ కుమార్
4) పైవారందరూ
- View Answer
- సమాధానం: 4
వివరణ: ప్రపంచంలో అత్యధిక వేతనం పొందుతున్న ప్రముఖ నటుల జాబితాను ఫోర్బ్స్ రూపొందించింది. అమెరికా నటుడు సీన్ కాంబ్స్(130 మిలియన్ డాలర్ల్లు) ఈ జాబితాలో తొలి స్థానంలో ఉన్నాడు.
భారత్ నుంచి షారూఖ్ ఖాన్ 65వ స్థానం(38 మిలియన్ డాలర్లు), సల్మాన్ ఖాన్ 71వ స్థానం(37 మిలియన్ డాలర్లు), అక్షయ్ కుమార్ 80వ స్థానం(35.5 మిలియన్ డాలర్లు)లో ఉన్నారు.
- సమాధానం: 4