కరెంట్ అఫైర్స్ (జూన్ 8 - 15) బిట్ బ్యాంక్
1. కింది వాటిలోని ఏ పండుని త్రిపుర రాష్ట్ర పండుగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇటీవల ప్రకటించారు ?
1) లిచి
2) బనానా
3) స్ట్రాబెర్రీ
4) క్వీన్ పైనాపిల్
- View Answer
- సమాధానం: 4
వివరణ: క్వీన్ పైనాపిల్ ని త్రిపుర రాష్ట్ర పండుగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇటీవల ప్రకటించారు. ఆ రాష్ట్రంలో విరివిగా సాగయ్యే ఈ పండ్లని ఇటీవల తొలిసారి పశ్చిమ ఆసియాకు ఎగుమతి చేశారు. ఈ ఎగుమతుల ద్వారా రాష్ట్రానికి ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం వెల్లడించింది.
- సమాధానం: 4
2. మలబార్ సైనిక విన్యాసాలు ఇటీవల ఏ దేశంలో జరిగాయి ?
1) అమెరికా
2) భారత్
3) జపాన్
4) ఇజ్రాయెల్
- View Answer
- సమాధానం: 1
వివరణ: భారత్, అమెరికా సైన్యం మధ్య స్నేహ పూర్వక సంబంధాల బలోపేతం కోసం 1992లో మలబార్ సైనిక విన్యాసాలు ప్రారంభమయ్యాయి. 2007 నుంచి జపానీస్ మారిటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ ఇందులో భాగమైంది. ఇటీవల జూన్ 7 నుంచి 16 వరకు ఈ సైనిక విన్యాసాలు అమెరికాలోని గౌవామ్ నౌకాశ్రయంలో జరిగాయి.
- సమాధానం: 1
3. ప్రపంచ సాగరాల దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
1) జూన్ 8
2) జూన్ 10
3) జూన్ 12
4) జూన్ 14
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఐరాస ఏటా జూన్ 8న ప్రపంచ సాగరాల దినోత్సవాన్ని నిర్వహించాలని 2008 డిసెంబర్ 5న తీర్మానించింది. మానవ జీవితంలో సాగరాల ప్రాముఖ్యతను తెలుపుతూ వాటిని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకతను వివరించేందుకు ఏటా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు.
2018 Theme :Preventing Plastic Pollution and encouraging solutions for a healthy ocean.
- సమాధానం: 1
4. ఇటీవల ఉమెన్స్ ప్రైజ్ ఫర్ ఫిక్షన్ - 2018 అవార్డుని పొందిన ‘‘హోమ్ ఫైర్’’ పుస్తక రచయిత ఎవరు ?
1) అరుణా రెడ్డి
2) కమిలా షమ్సీ
3) అఖిలేశ్ కుమార్
4) హెన్రీ కెన్సింగ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: కమిలా షమ్సీ బ్రిటిష్ పాకిస్తానీ రచయిత. ఆమె రచించిన హోమ్ ఫైర్ నవలకు గాను బ్రిటన్ నుంచి ఉమెన్స్ ప్రైజ్ ఫర్ ఫిక్షన్ అవార్డుని గెలుపొందారు. ఈ అవార్డుని 1996లో ఏర్పాటు చేశారు.
- సమాధానం: 2
5. కింది వాటిలోని ఏ పేమెంట్స్ బ్యాంక్ కు ఇటీవలUIDAI ఈ - కేవైసీ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది ?
1) పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్
2) ఫినో పేమెంట్స్ బ్యాంక్
3) ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్
4) ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్
- View Answer
- సమాధానం: 3
వివరణ: మొబైల్ నెంబర్‌కు ఆధార్ లింకింగ్ కోసం వచ్చిన ఎయిర్టెల్ ఖాతాదారుల విజ్ఞప్తుల ద్వారా వారికి తెలియకుండానే ఆధార్ నెంబర్ల సహాయంతో పేమెంట్ బ్యాంక్ అకౌంట్లని సృష్టించింది. అలా సృష్టించడమే కాకుండా వినియోగదారునికి అందాల్సిన సబ్సిడీ ఎల్పీజీ గ్యాస్ సిలెండర్ సబ్సిడీని ఎయిర్టెల్ పేమెంట్ ఖాతాలో చేరేలా చేసింది. వాస్తవానికి ఎయిర్టెల్ ఖాతాదారులు ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీని ఇతర బ్యాంకు ఖాతాలకు అనుసంధానం చేసినా.. ఆ ఖాతాలకు కాకుండా సబ్సిడీ మొత్తం ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంకు ఖాతాల్లో పడేలా అక్రమాలకు పాల్పడింది. ఈ నేపథ్యంలో ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంక్‌కు ఈ - కేవైసీ సేవలను యూఐడీఏఐ తాత్కాలికంగా నిలిపివేసింది.
- సమాధానం: 3
6. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఇటీవల నేషనల్ పేమెంట్స్ ఎక్సలెన్స్ అవార్డ్ - 2017 ని పొందిన బ్యాంక్ ఏది ?
1) ఎస్వీసీ కో ఆపరేటివ్ బ్యాంక్
2) తెలంగాణ కో ఆపరేటివ్ బ్యాంక్
3) ధనలక్ష్మీ కో ఆపరేటివ్ బ్యాంక్
4) సిటీ యూనియన్ బ్యాంక్
- View Answer
- సమాధానం: 1
వివరణ: నేషనల్ పేమెంట్స్ ఎక్సలెన్స్ అవార్డు పేమెంట్స్ వ్యవస్థలో బ్యాంకులకు అందించే అత్యున్నత పురస్కారం. ఏటీఎమ్ నెట్ వర్క్, సీటీఎస్ వ్యవస్థల్లో మెరుగైన పనితీరుకి గాను ఈ అవార్డుని ప్రదానం చేస్తారు. ఇటీవల ఎస్వీసీ (షమ్రావ్ విఠల్)కో ఆపరేటివ్ బ్యాంక్ నేషనల్ పేమెంట్స్ ఎక్సలెన్స్ అవార్డు - 2017ని దక్కించుకుంది.
- సమాధానం: 1
7. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ నూతన కమిషనర్‌గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) రామ్ ప్రసాద్
2) శరద్ కుమార్
3) శివ కుమార్
4) రాజారాం సుందర్
- View Answer
- సమాధానం: 2
వివరణ: హర్యానా కేడర్ కు చెందిన 1979 ఐపీఎస్ బ్యాచ్ అధికారి శరద్ కుమార్.. ఇటీవల సీవీసీ కమిషనర్ గా నియమితులయ్యారు. ఆయన నాలుగేళ్ల పాటు ఈ పదవిలో ఉంటారు. శరద్ కుమార్ 2013 నుంచి 2017 వరకు ఎన్ఐఏ డైరక్టెర్ గా పనిచేశారు.
- సమాధానం: 2
8. ఇటీవల మలేషియాలో జరిగిన మహిళల ఆసియా టీ 20 క్రికెట్ కప్ - 2018 ని ఏ దేశం గెలుచుకుంది ?
1) బంగ్లాదేశ్
2) భారత్
3) పాకిస్తాన్
4) శ్రీలంక
- View Answer
- సమాధానం: 1
వివరణ: మలేషియాలో జరిగిన మహిళల ఆసియా టీ20 క్రికెట్ కప్ ఫైనల్లో బంగ్లాదేశ్ భారత్ ను ఓడించి తొలిసారి ఆసియా కప్ ను గెలుచుకుంది.
- సమాధానం: 1
9. ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ - 2018 పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు ?
1) మార్టిన్ డెల్‌పోట్రో
2) నొవాక్ జకోవిచ్
3) డామినిక్ థీమ్
4) రాఫెల్ నాదల్
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో రాఫెల్ నాదల్.. డామినిక్ థీమ్ ను ఓడించి టైటిల్ ను గెలుచుకున్నాడు. ఈ విజయంతో రాఫెల్ నాదల్ పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్ లో మళ్లీ మొదటి స్థానానికి చేరుకున్నాడు. మహిళల సింగిల్ ని రొమేనియా క్రీడాకారిణి సిమోనా హాలెప్ దక్కించుకుంది. రన్నరప్ గా అమెరికా క్రీడాకారిణి స్లోన్ స్టీఫెన్స్ నిలిచింది.
- సమాధానం: 4
10. చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ చైనా అత్యున్నత గౌరవ పురస్కారం ఫ్రెండ్ షిప్ మెడల్ ని ఇటీవల ఎవరికి ప్రదానం చేశారు ?
1) నరేంద్ర మోదీ
2) వ్లాదిమిర్ పుతిన్
3) ఎమాన్యుల్ మెక్రాన్
4) డొనాల్డ్ ట్రంప్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఫ్రెండ్ షిప్ మెడల్... చైనా అత్యున్నత గౌరవ పురస్కారం. ఇటీవల ఈ పురస్కారాన్ని చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కి ప్రదానం చేశారు. ప్రపంచ శాంతికి కృషి చేస్తున్నందుకు గాను ఆయనకు ఈ అవార్డు ప్రదానం చేసినట్లు వెల్లడించారు. 2017లో వ్లాదిమిర్ పుతిన్... జిన్ పింగ్ కు రష్యా ఆర్డర్ ఆఫ్ సెంట్ ఆండ్య్రూ పురస్కారాన్ని ప్రదానం చేశారు.
- సమాధానం: 2
11. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండెరైక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC) చైర్మన్ గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు?
1) ప్రఫుల్లా దాస్
2) ఎస్ రమేశ్
3) రామన్ రాయ్
4) ప్రేమ్ కుమార్ నారాయణ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: CBIC సభ్యుడిగా ఉన్న ఎస్ రమేశ్ ను చైర్మన్ గా నియమిస్తూ కేంద్ర నియామకాల కమిటీ ఇటీవల ఆమోదం తెలిపింది. వనజా ఎన్ సర్నా జూన్ లో పదవి విరమణ చేయడంతో ఆమెస్థానంలో ఎస్ రమేశ్ చైర్మన్ గా నియమితులయ్యారు.
- సమాధానం: 2
12. 106వ జాతీయ సైన్స్ కాంగ్రెస్ ఏ నగరంలో జరగనుంది ?
1) జలంధర్
2) ముంబయి
3) ఇంఫాల్
4) హైదరాబాద్
- View Answer
- సమాధానం: 1
వివరణ: 106వ జాతీయ సైన్స్ కాంగ్రెస్ పంజాబ్ జలంధర్ లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో జరగనుంది. 2019 జనవరి 3 నుంచి 7 వరకు జరగనున్న ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. 105వ సైన్స్ కాంగ్రెస్ ఇటీవల మణిపూర్ లోని ఇంఫాల్ లో జరిగింది.
- సమాధానం: 1
13. కింది వారిలో ‘‘తెలంగాణ జన పరిషద్’’ కన్వీనర్ గా వ్యవహరించిన తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు ఎవరు ?
1) జి. వెంకటస్వామి
2) కాళోజీ నారాయణరావు
3) మర్రి చెన్నారెడ్డి
4) ప్రొఫెసర్ కేశవరావు జాదవ్
- View Answer
- సమాధానం: 4
వివరణ: తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ జూన్ 16న అనారోగ్యంతో కన్నుమూశారు. తెలంగాణ సాయుధ పోరాటం నుంచి తెలంగాణ ఉద్యమం వరకు ఆయన అనేక పోరాటాల్లో పాల్గొన్నారు. తెలంగాణ జనపరిషత్ కన్వీనర్ గా పనిచేశారు. మ్యాన్ కౌండ్, యువతరం పేరుతో పత్రికలు నడిపారు. భాషా సమస్య, మార్క్స్-గాంధీ-సోషలిజం, లోహియా ఇన్ పార్లమెంట్ తదితర పుస్తకాలు రచించారు.
- సమాధానం: 4
14. ఇటీవల ఏ రాష్ట్ర పోలీస్ శాఖ ‘‘కాప్ కనెక్ట్’’ యాప్ ని ప్రారంభించింది ?
1) తెలంగాణ
2) ఆంధ్రప్రదేశ్
3) కర్ణాటక
4) హర్యానా
- View Answer
- సమాధానం: 1
వివరణ: తెలంగాణ పోలీస్ శాఖ వాట్సాప్ తరహాలో కొత్తగా కాప్ కనెక్ట్ యాప్ ని ప్రారంభించింది. డీజీపీ నుంచి కానిస్టేబుల్ వరకు అందరికీ ఒకేసారి ఆదేశాలు పంపడానికి కాప్ కనెక్ట్ యాప్ ని అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ పోలీస్ సిబ్బందికి మాత్రమే అందుబాటులో ఉంటుంది.
- సమాధానం: 1
15. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ లు.. ఇటీవల ఏ దేశంలో తొలిసారి సమావేశమయ్యారు ?
1) భారత్
2) సింగపూర్
3) చైనా
4) జపాన్
- View Answer
- సమాధానం: 2
వివరణ: జూన్ 12న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్.. సింగపూర్ సెంటోసా దీవిలోని కేపిల్లా హోటల్లో తొలిసారి సమావేశమయ్యారు. 1950-53 కొరియా యుద్ధం తర్వాత ఇరు దేశాల అధ్యక్షులు భేటీ కావడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా అణ్వస్త్ర పరీక్షలు నిలిపివేస్తున్నట్లు ఉత్తర కొరియా ప్రకటించగా.. కొరియా ద్వీపకల్పంలో యుద్ధ విన్యాసాలు నిలిపివేస్తున్నట్లు, త్వరలో సైన్యాన్ని వెనక్కి పిలువనున్నట్లు అమెరికా వెల్లడించింది.
- సమాధానం: 2
16. ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన సూపర్ కంప్యూటర్ గా గుర్తింపు పొందిన ‘‘సమిట్’’ సూపర్ కంప్యూటర్ ని ఏ దేశం అభివృద్ధి చేసింది ?
1) అమెరికా
2) చైనా
3) భారత్
4) జపాన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన సూపర్ కంప్యూటర్ ని అమెరికా ఇటీవల ఆవిష్కరించింది. దీనికి సమిట్ అని నామకరణం చేసింది. ఇది సెకనుకు 2 లక్షల గణనలను చేయగలదు. దీంతో చైనాకు చెందిన సూపర్ కంప్యూటర్ ‘‘సన్ వే తైహులైట్’’ (సెకనుకు 93 వేల గణనలను)ను ఇది అధిగమించింది. అమెరికా గత సూపర్ కంప్యూటర్ ట్రిటాన్ కంటే సమిట్ వేగం ఏడు రెట్లు ఎక్కువ.
- సమాధానం: 1
17. ఇటీవల జరిగిన స్టట్గార్ట్ ఓపెన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు ?
1) మిలోస్ రోని
2) నొవాక్ జకోవిచ్
3) రాఫెల్ నాదల్
4) రోజర్ ఫెడరర్
- View Answer
- సమాధానం: 4
వివరణ: జర్మనీలో జరిగిన స్టట్గార్ట్ ఓపెన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో కెనడా ఆటగాడు మిలోస్ రోనిని ఓడించి స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ టైటిల్ విజేతగా నిలిచాడు. దీన్ని మెర్సిడెస్ కప్ గాను పిలుస్తారు. ఫెడరర్ కెరీర్ లో ఇది 98వ టైటిల్.
- సమాధానం: 4
18. 2026 ఫిఫా ఫుట్ బాల్ వరల్డ్ కప్ ఏ దేశంలో జరగనుంది ?
1) అమెరికా
2) మెక్సికో
3) కెనడా
4) పై మూడు
- View Answer
- సమాధానం: 4
వివరణ: 2026 ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్ కప్ అమెరికా, మెక్సికో, కెనడా దేశాల్లో జరగనుంది. ఈ మూడు దేశాలు ఉమ్మడిగా ఈ పోటీలను నిర్వహించనున్నాయి. 2026 ఫుట్ బాల్ ప్రపంచ కప్ నిర్వహించేందుకు మొరాకో దాఖలు చేసిన అభ్యర్థనను ఫిఫా తిరస్కరించింది. 2022 ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఖతార్ లో జరగనుంది. 2018 ఫిఫా ప్రపంచ కప్(21వ) రష్యాలో జరిగింది.
- సమాధానం: 4
19. ఐసీసీ టెస్ట్ హోదా పొందిన ఆఫ్గనిస్తాన్ జట్టు.. ఇటీవల ఏ దేశంతో తొలి టెస్టు మ్యాచ్ ఆడింది ?
1) భారత్
2) శ్రీలంక
3) పాకిస్తాన్
4) బంగ్లాదేశ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఐసీసీ టెస్టు హోదా పొందిన తర్వాత ఆప్గనిస్తాన్ తొలి మ్యాచ్ ను భారత్ తో ఆడింది. బెంగళూరులో జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. కేవలం రెండు రోజుల్లోనే మ్యాచ్ ముగిసింది.
- సమాధానం: 1
20. నీటి నాణ్యత సూచీలో 122 దేశాల జాబితాలో భారత్ ఎన్నో స్థానంలో ఉందని నీతి ఆయోగ్ ఇటీవల వెల్లడించింది ?
1) 100
2) 122
3) 120
4) 115
- View Answer
- సమాధానం: 3
వివరణ: నీతి ఆయోగ్ ‘‘కంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్’’ పేరుతో నివేదికను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో 60 కోట్ల మంది తీవ్రమైన నీటి కొరత ఎదుర్కొంటున్నారని, సరైన తాగునీరు లేక ఏటా 2 లక్షల మంది చనిపోతున్నారని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా నీటి నాణ్యత సూచీలో భారత్ 120వ స్థానంలో ఉందని పేర్కొంది. రాష్ట్రాల వారీగా నీతి ఆయోగ్ రూపొందించిన నీటి నిర్వహణ సూచీల్లో ఆంధ్రప్రదేశ్ 3, తెలంగాణ 8వ ర్యాంకులో నిలిచాయి.
- సమాధానం: 3
21. నీతి ఆయోగ్ చైర్మన్ గా ఎవరు వ్యవహరిస్తారు?
1) ప్రధాన మంత్రి
2) రాష్ట్రపతి
3) ఉపరాష్ట్రపతి
4) హోంశాఖ మంత్రి
- View Answer
- సమాధానం: 1
వివరణ: రాష్ట్రపతి భవన్ లో ఇటీవల నీతి ఆయోగ్ నాలుగో పాలకమండలి సమావేశం జరిగింది. నీతి ఆయోగ్ చైర్మన్ ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 23 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఒక లెఫ్టినెంట్ గవర్నర్ పాల్గొన్నారు. ప్రస్తుతం నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ గా రాజీవ్ కుమార్, సీఈవోగా అమితాబ్ కాంత్ ఉన్నారు.
- సమాధానం: 1
22. ఇటీవల వార్తల్లో నిలిచిన ఎన్.ఎన్. వోహ్రా ఏ రాష్ట్ర గవర్నర్ ?
1) కర్ణాటక
2) జమ్ము కశ్మీర్
3) మణిపూర్
4) గోవా
- View Answer
- సమాధానం: 2
వివరణ: జమ్ముకశ్మీర్ లో సంకీర్ణ ప్రభుత్వం నుంచి బీజేపీ ఇటీవల వైదొలిగింది. పీడీపీకి పూర్తి మెజారిటీ లేకపోవడంతో ముఖ్యమంత్రి పదవికి మెహబూబా ముఫ్తీ రాజీనామా చేశారు. దీంతో రాష్ట్రంలో గవర్నర్ పాలన విధించాలంటూ గవర్నర్ ఎన్.ఎన్.వోహ్రా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కి సిఫార్సు చేశారు. దీనికి రాష్ట్రపతి ఆమెదం తెలిపారు. దీంతో జమ్ము కశ్మీర్ ప్రస్తుతం గవర్నర్ పాలనలో ఉంది.
- సమాధానం: 2
23. ఇటీవల వార్తల్లో నిలిచిన ‘‘రాణి రష్మోణి’’ భారత సైన్యంలోని ఏ విభాగానికి చెందినది ?
1) పదాతిదళం
2) వాయుదళం
3) నౌకాదళం
4) ఏదీ కాదు
- View Answer
- సమాధానం: 3
వివరణ: రాణి రష్మోణి.. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అత్యాధునిక నౌక. ఇది ఇటీవల భారత తీర ప్రాంత భద్రతా దళంలో చేరింది. ఇది గంటకు 34 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించగలదు. ఈ నౌకను విశాఖలోని హిందూస్థాన్ షిప్‌యార్డ్ నిర్మించింది. ఇది విశాఖ కేంద్రంగా సేవలందిస్తుంది. బ్రిటిష్ విధానాలకు వ్యతిరేకంగా పోరాడిన రాణి రష్మోణి దేవి ధైర్య సాహసాలకు గుర్తుగా ఈ నౌకకు ఆ పేరు పెట్టారు.
- సమాధానం: 3
24. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్మార్ట్ సిటీస్ మిషన్ కు ఎంపికై న 100వ నగరంగా ఇటీవల గుర్తింపు పొందిన నగరం ఏది ?
1) షిల్లాంగ్
2) కరీంనగర్
3) కాకినాడ
4) మైసూర్
- View Answer
- సమాధానం: 1
వివరణ: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్మార్ట్ సిటీస్ మిషన్ కార్యక్రమంలో మేఘాలయ రాజధాని షిల్లాంగ్ ను ఇటీవల చేర్చారు. దీంతో ఈ ప్రాజెక్టుకి ఎంపికై న 100వ నగరంగా షిల్లాంగ్ గుర్తింపు పొందింది. ప్రధాని నరేంద్ర మోదీ 2015 జూన్ 25న స్మార్ట్ సిటీస్ మిషన్ ను ప్రారంభించారు.
- సమాధానం: 1
25. వ్యవసాయంతో ఉపాధి హామీ పథకం అనుసంధానానికి మెరుగైన విధానం రూపొందించేందుకు ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్ సబ్ గ్రూప్ నకు ఎవరు నేతృత్వం వహించనున్నారు ?
1) కే చంద్రశేఖర్ రావు
2) నారా చంద్రబాబు నాయుడు
3) నితీశ్ కుమార్
4) శివరాజ్ సింగ్ చౌహాన్
- View Answer
- సమాధానం: 4
వివరణ: వ్యవసాయం, ఉపాధి హామీ పథకం మధ్య సమన్వయ విధానం రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల నీతి ఆయోగ్ సబ్ గ్రూప్ ని ఏర్పాటు చేసింది. దీనికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వం వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్, బిహార్, ఉత్తరప్రదేశ్, సిక్కిం, గుజరాత్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇందులో సభ్యులుగా ఉంటారు. 3 నెలల్లో ఈ గ్రూప్ నివేదిక సమర్పించాల్సి ఉంటుంది.
- సమాధానం: 4
26. కింది వాటిలోని ఏ దేశంపై ఐరాస మానవ హక్కుల కౌన్సిల్ వివక్ష చూపిస్తోందని ఆరోపిస్తూ ఇటీవల అమెరికా ఆ కౌన్సిల్ నుంచి వైదొలిగింది ?
1) సిరియా
2) ఇజ్రాయెల్
3) ఉత్తర కొరియా
4) మయన్మార్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కౌన్సిల్(UNHRC) నుంచి అమెరికా ఇటీవల వైదొలిగింది. ఇజ్రాయెల్ పై కౌన్సిల్ రాజకీయ వివక్ష చూపిస్తోందని ఆరోపిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. ఐరాసలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ ఈ విషయాన్ని వెల్లడించారు. యూఎన్హెచ్ఆర్సీని 2006లో ఏర్పాటు చేశారు. ఇందులో 47 దేశాలకు సభ్యత్వం ఉంది. అమెరికా ఇటీవలే పారిస్ పర్యావరణ ఒప్పందం, ఇరాన్ అణు ఒప్పందం నుంచి కూడా వైదొలిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అమెరికా ఫస్ట్ విధానంలో భాగంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు.
- సమాధానం: 2
27. ఫెమీనా మిస్ ఇండియా - 2018గా ఎంపికై న అనుక్రీతి వాస్ ఏ రాష్ట్రానికి చెందిన వారు ?
1) ఆంధ్రప్రదేశ్
2) హర్యానా
3) తమిళనాడు
4) కేరళ
- View Answer
- సమాధానం: 3
వివరణ: తమిళనాడుకు చెందిన అనుక్రీతి ఫెమీనా మిస్ ఇండియా - 2018 గా ఎంపికయ్యారు. ముంబైలో జరిగిన పోటీల్లో ఆమె తొలి స్థానంలో నిలిచారు. హరియాణాకు చెందిన మీనాక్షి చౌదరి రెండో స్థానం, ఆంధ్రప్రదేశ్ కు చెందిన శ్రేయారావు మూడో స్థానంలో నిలిచారు.
- సమాధానం: 3
28. కింది వారిలో ఎవరు అమెరికాలో అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ జనరల్ మోటార్స్ సీఎఫ్ఓగా నియమితులయ్యారు ?
1) దివ్య సూర్యదేవర
2) అనితా దేశాయ్
3) ఇంద్రా నూయి
4) లక్ష్మీ ప్రతూరి
- View Answer
- సమాధానం: 1
వివరణ: అమెరికాలో అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ జనరల్ మోటార్స్ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ గా ప్రవాస భారతీయురాలు దివ్య సూర్యదేవర నియమితులయ్యారు. దీంతో ఆటో మొబైల్ ఇండస్ట్రీ చరిత్రలో తొలిసారిగా ఈ పదవి చేపట్టనున్న తొలి మహిళగా దివ్య గుర్తింపు పొందారు. దివ్య సూర్యదేవర తమిళనాడు చెందినవారు.
- సమాధానం: 1
29. ఇటీవల కన్నుమూసిన ప్రముఖ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్, ఏ కళకు సంబంధించిన వారు ?
1) గానం
2) నాట్యం
3) మిమిక్రీ
4) చిత్రలేఖనం
- View Answer
- సమాధానం: 3
వివరణ: మిమిక్రీ కళను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన కళాకారుడు, పద్మశ్రీ డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ ఇటీవల కన్నుమూశారు. వరంగల్ లో 1932లో జన్మించిన వేణుమాధవ్.. ఎంతో మంది గొంతుకలను అనుకరించారు. ప్రపంచవ్యాప్తంగా 30 దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. 1971లో ఐరాసలో ప్రపంచ ప్రముఖుల గొంతులను అనుకరించి ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. 2001లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం పొందారు.
- సమాధానం: 3
30. భిలాయ్ స్టీల్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఉంది ?
1) మధ్యప్రదేశ్
2) జార్ఖండ్
3) కర్ణాటక
4) ఛత్తీస్ గఢ్
- View Answer
- సమాధానం: 4
వివరణ: భిలాయ్ స్టీల్ ప్లాంట్ ఛత్తీస్‌గఢ్ లో ఉంది. ఇటీవల ఆధునికీకరించిన ఈ స్టీల్ ప్లాంట్ ను ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. రూ.19 వేల కోట్లతో అభివృద్ధి చేసిన భిలాయ్ స్టీల్ ప్లాంట్ సామర్థ్యం ఏడాదికి 4.7 మిలియన్ టన్నుల నుంచి 7.5 మిలియన్ టన్నులకు పెరుగుతుంది. భారత్ ప్రస్తుతం ప్రపంచంలో రెండో అతిపెద్ద ఉక్కు ఉత్పత్తి దేశంగా ఉంది. చైనా మొదటి స్థానంలో ఉంది.
- సమాధానం: 4
31. కింది వాటిలోని ఏ సంస్థ భూమికి 600 కాంతి సంవత్సరాల దూరంలో కే2-236బి అనే గ్రహాన్ని కనుగొంది ?
1) ఇస్రో
2) నాసా
3) రాస్ కాస్మోస్
4) ఏదీ కాదు
- View Answer
- సమాధానం: 1
వివరణ: భూమికి 600 కాంతి సంవత్సరాల దూరంలో కే2-236 అనే నక్షత్రం చుట్టూ తిరుగుతున్న ఓ గ్రహాన్ని అహ్మదాబాద్ లోని ఇస్రో భౌతిక పరిశోధన ప్రయోగశాలకు చెందిన ప్రొఫెసర్ అభిజిత్ చక్రవర్తి బృందం కనుగొన్నది. మౌంట్ అబూ గురుశిఖర్ అబ్జర్వేటరీలోని పారాస్ స్పెక్టోగ్రాఫ్ ద్వారా ఈ గ్రహాన్ని కనుగొన్నారు. ఈ గ్రహానికి కే2-236బి అని నామకరణం చేశారు. తాజా ఆవిష్కరణతో కొత్తగా గ్రహాలను కనుగొన్న అతికొద్ది దేశాల జాబితాలో భారత్ చేరింది.
- సమాధానం: 1
32. జపాన్ అందించే నిక్కీ ఆసియా ప్రైజ్ - 2018 ని ఇటీవల ఎవరికి ప్రదానం చేశారు ?
1) నరేంద్ర మోదీ
2) కై లాశ్ సత్యార్థి
3) బిందేశ్వర్ పాఠక్
4) ప్రియాంకా చోప్రా
- View Answer
- సమాధానం: 3
వివరణ: మానవ హక్కుల రక్షణ, పర్యావరణ పరిరక్షణకు పాటుపడేందుకు సులభ్ ఇంటర్నేషనల్ పేరుతో స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తోన్న బిందేశ్వర్ పాఠక్.. 2018 సంవత్సరానికి గాను జపాన్ నుంచి నిక్కీ ఆసియా ప్రైజ్ అవార్డు అందుకున్నారు. అపరిశుభ్రత, మహిళలపై వివక్షను రూపుమాపడంలో పాఠక్ చేసిన కృషికి గుర్తింపుగా జపాన్ కు చెందిన ప్రఖ్యాత సంస్థ కల్చర్ అండ్ కమ్యూనిటీ విభాగంలో ఈ అవార్డుని అందజేసింది. జపాన్ కు చెందిన ప్రముఖ మీడియా సంస్థ నిక్కీ ఇంక్ 1996 నుంచి ఏటా ఈ అవార్డు అందిస్తోంది. వ్యాపారం, ఆర్థికం, పర్యావరణం, సాంస్కృతిక రంగాల్లో ఉత్తమ సేవలు అందించిన వారికి ఈ అవార్డు అందజేస్తారు. బిందేశ్వర్ పాఠక్.. సులభ్ ఇంటర్నేషనల్ సంస్థను 1970లో ప్రారంభించారు. పారిశుద్ధ్య నిర్వహణ కోసం ఈ సంస్థ దేశవ్యాప్తంగా సులభ్ ఫ్లష్ కంపోస్టింగ్ టాయిలెట్స్ ను నిర్మించింది.
- సమాధానం: 3
33. పథకాలు, సేవలకు సంబంధించిన సమాచారం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ పేరుతో వెబ్ డిక్షనరీని అందుబాటులోకి తీసుకొచ్చింది ?
1) టీ వెబ్
2) టీ నెట్
3) టీ సాఫ్ట్
4) టీ సమాచార్
- View Answer
- సమాధానం: 1
వివరణ: పథకాలు, సేవలకు సంబంధించిన సమాచారం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల టీ వెబ్ పేరుతో వెబ్ డిక్షనరీని అందుబాటులోకి తెచ్చింది.
- సమాధానం: 1
34. ఇటీవల ఏ దేశ మహిళల క్రికెట్ జట్టు 47 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ 490 పరుగులు నమోదు చేసింది ?
1) భారత్
2) న్యూజిలాండ్
3) ఇంగ్లండ్
4) ఆస్ట్రేలియా
- View Answer
- సమాధానం: 2
వివరణ: న్యూజిలాండ్ మహిళల జట్టు 47 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ నమోదు చేసి రికార్డు సృష్టించింది. జూన్ 9న ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఆ జట్టు 490 పరుగులు చేసింది. ఇటీవలే ఇంగ్లండ్ పురుషుల జట్టు ఆస్ట్రేలియాతోజరిగిన మ్యాచ్ లో 481 పరుగులు చేసి పురుషుల టీమ్ లో వన్డేల్లో అత్యధిక స్కోర్ నమోదు చేసింది.
- సమాధానం: 2
35. చెక్ చెస్ టోర్నమెంట్ - 2018 టైటిల్ ను గెలుచుకున్న భారత గ్రాండ్ మాస్టర్ ఎవరు ?
1) లలిత్ బాబు
2) పెంటేల హరికృష్ణ
3) దేబాషిస్ దాస్
4) అశ్విన్ జయరామ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: భారత గ్రాండ్ మాస్టర్ పెంటేల హరికృష్ణ ఇటీవల జరిగిన చెక్ చెస్ టోర్నమెంట్ - 2018 టైటిల్ విజేతగా నిలిచాడు. ప్రేగ్ లో జరిగిన 12 రౌండ్ల ర్యాపిడ్ మ్యాచ్ లో చెక్ రిపబ్లిక్ కు చెందిన గ్రాండ్ మాస్టర్ డేవిడ్ నవారాను ఓడించి హరికృష్ణ టైటిల్ సొంతం చేసుకున్నాడు.
- సమాధానం: 2
36. ఐరాస భద్రతా మండలిలో ప్రస్తుతం ఉన్న శాశ్వత సభ్య దేశాలు ఎన్ని ?
1) 10
2) 15
3) 25
4) 5
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో 5 శాశ్వత సభ్య దేశాలు ఉన్నాయి. అవి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, రష్యా. వీటితో పాటు మరో 10 తాత్కాలిక సభ్య దేశాలు ఉంటాయి. ఈ మేరకు ఇటీవల జరిగిన తాత్కాలిక సభ్య దేశాల ఎన్నికల్లో జర్మనీ, డొమనికన్ రిపబ్లిక్, దక్షిణాఫ్రికా, బెల్జియం, ఇండోనేషియా ఎన్నికయ్యాయి. ఈ దేశాలు రెండేళ్ల పాటు భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశాలుగా ఉంటాయి.
- సమాధానం: 4
37. షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) 18వ సదస్సు ఇటీవల ఏ దేశంలో జరిగింది ?
1) చైనా
2) భారత్
3) రష్యా
4) కజకిస్తాన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) 18వ సదస్సు చైనాలోని క్వింగ్డావ్లో జూన్ 9 నుంచి 10 వరకు జరిగింది. ఈ సదస్సులో ఎస్సీవో సభ్యదేశాలైన భారత్, చైనా, రష్యా, కజకిస్థాన్, కిర్గిస్థాన్, తజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్, పాకిస్థాన్ దేశాధినేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభ్యదేశాలన్నీ చైనా నిర్మిస్తున్న బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (బీఆర్ఐ)కు ఆమోదం తెలపగా ప్రధాని నరేంద్ర మోదీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కూటమిలో 2005 నుంచి పరిశీలక హోదా కలిగిన భారత్ పూర్తిస్థాయి సభ్యత్వం వచ్చిన తర్వాత పాల్గొన్న తొలి సమావేశం ఇది.
- సమాధానం: 1
38. జీ - 7 దేశాల 44వ సదస్సు ఇటీవల ఏ దేశంలో జరిగింది ?
1) అమెరికా
2) ఇటలీ
3) కెనడా
4) జర్మనీ
- View Answer
- సమాధానం: 3
వివరణ: జీ - 7 దేశాలు - కెనడా, అమెరికా, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, యూకే. ఇవి ప్రపంచ వాణిజ్యంలో 60 శాతం వాటా కలిగి ఉంటాయి. గతంలో దీన్ని జీ - 8 గా వ్యవహరించే వారు. క్రిమియాను ఆక్రమించడంతో రష్యాను 2014లో కూటమి నుంచి బహిష్కరించారు. దీంతో ఇది జీ - 7 గా మారింది. జీ -7 44వ సదస్సు ఇటీవల కెనడాలోని క్యూబెక్ లో జరిగింది.
- సమాధానం: 3
39. భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఏ దేశంలో ఇటీవల మహాత్మా గాంధీ డిజిటల్ మ్యూజియంను ప్రారంభించారు ?
1) దక్షిణాఫ్రికా
2) యూకే
3) అమెరికా
4) రష్యా
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఇటీవల దక్షిణాఫ్రికాలో భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పర్యటించారు. పీటర్ మారిట్జ్‌బర్గ్‌లో గాంధీజీని రైల్లోంచి తోసేసిన సంఘటనకు 125 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న సుష్మా.. ‘ద బర్త్ ఆఫ్ సత్యాగ్రహ’ అనే కాఫీ టేబుల్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. మహాత్మాగాంధీ డిజిటల్ మ్యూజియంను ప్రారంభించారు.
- సమాధానం: 1
40. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న కాళేశ్వరం ప్రాజెక్టు ఏ జిల్లా పరిధిలోకి వస్తుంది ?
1) కొమురం భీం అసిఫాబాద్
2) జయశంకర్ భూపాలపల్లి
3) మంచిర్యాల
4) కరీంనగర్
- View Answer
- సమాధానం: 2
వివరణ: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ (టీఏసీ) ఇటీవల ఆమోదం తెలిపింది. దీంతో ప్రాజెక్టు నిర్మాణానికి కావలసిన అన్ని అనుమతులు లభించినట్లయింది. కాళేశ్వరం ద్వారా 18.25 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిచనున్నారు. అదే విధంగా 195 టీఎంసీల గోదావరి నీటిని మేడిగడ్డ బ్యారేజీ నుంచి ఎత్తిపోసి మరో 18.82 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించనున్నారు. ఈ ప్రాజెక్టు జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలోకి వస్తుంది.
- సమాధానం: 2
41. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల రెపోరేటు, రివర్స్ రెపో రేట్లను 25 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో ప్రస్తుతం రివర్స్ రిపో రేటు ఎంత ?
1) 6.25 శాతం
2) 6 శాతం
3) 5.75 శాతం
4) 6.50 శాతం
- View Answer
- సమాధానం: 2
వివరణ: కీలక పాలసీ రేట్లు అయిన రెపో రేటు, రివర్స్ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల ప్రకటించింది. దీంతో రెపో రేటు 6.25 శాతానికి, రివర్స్ రెపో రేటు 6 శాతానికి చేరాయి. ఆర్బీఐ చివరగా 2014 జనవరిలో రెపో రేటును పెంచింది.
- సమాధానం: 2
42. కెనడా గ్రాండ్ ప్రీ 2018 ఫార్ములా వన్ టైటిల్ ను ఎవరు గెలుచుకున్నారు ?
1) వాల్తెరి బొటాస్
2) వెర్ స్టాపెన్
3) రికియార్డో
4) సెబాస్టియన్ వెటెల్
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ కెనడా గ్రాండ్‌ప్రి 2018 టైటిల్‌ను దక్కించుకున్నాడు. కెనడాలోని మాంట్రియల్లో జరిగిన ఫార్ములావన్ రేసులో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ రేసులో వాల్తెరి బొటాస్ (మెర్సిడెస్), వెర్స్టాపెన్ (రెడ్‌బుల్), రికియార్డో (రెడ్‌బుల్) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు. వెటెల్‌కు కెరీర్లో ఇది 50వ విజయం.
- సమాధానం: 4
43. భారత తొలి పార్లమెంట్ ఏ సంవత్సరంలో ఏర్పడింది?
1) 1952
2) 1957
3) 1955
4) 1950
- View Answer
- సమాధానం: 1
వివరణ: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, మొదటి పార్లమెంటేరియన్ కందాళ సుబ్రహ్మణ్య తిలక్ ఇటీవల విశాఖపట్నంలో కన్నుమూశారు. తొలి పార్లమెంట్ ఏర్పడిన 1952 నుంచి 1957 వరకు విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించారు. తిలక్ మొదట కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించినా అనంతరం సోషలిస్టు పార్టీలో చేరి లోక్‌సభకు ఎన్నికయ్యారు.
- సమాధానం: 1
44. ‘రోంగ్ ధాంగ్ తమాషా’ పుస్తక రచయిత ఎవరు ?
1) తస్లీమా నస్రీన్
2) చేతన్ భగత్
3) షాజహాన్ బచ్చు
4) శశిథరూర్
- View Answer
- సమాధానం: 3
వివరణ: బంగ్లాదేశ్‌లోని ప్రముఖ రచయిత, ప్రచురణ కర్త షాజహాన్ బచ్చు ఇటీవల హత్యకు గురయ్యారు. ఆయన స్వగ్రామమైన మున్షీగంజ్ జిల్లా కకాల్డీలో గుర్తుతెలియని వ్యక్తులు షాజహాన్‌పై కాల్పులు జరపడంతో కన్నుమూశారు. షాజహాన్ రాసిన ‘రోంగ్ ధాంగ్ తమాషా’ కవితా సంపుటి బాగా ప్రాచుర్యం పొందింది.
- సమాధానం: 3
45. కింది వాటిలో ఖరీఫ్ పంట కానిది ఏది ?
1) వరి
2) చెరకు
3) గోధుమలు
4) వేరుశనగ
- View Answer
- సమాధానం: 3
వివరణ: వర్షాకాలంలో వేసే పంటలను ఖరీఫ్ పంటలు అంటారు. తొలకరి వర్షాలు మొదలయ్యాకు ఖరీఫ్ పంటలను వేస్తారు. వరి, సోయాబీన్, పత్తి, వేరుశనగ, చెరకు తదితర పంటలు ఖరీఫ్ పంటలు. చలి కాలం ప్రారంభంలో వేసే పంటలను రబీ పంటలుగా పిలుస్తారు. గోధుమలు, బార్లే, ముస్టర్డ్, చెరకు తదితర పంటలు రబీ కిందకు వస్తాయి.
- సమాధానం: 3
46. కింది వాటిలోని ఏ రాష్ట్రం ఇటీవల డిగ్రీ స్థాయిలో సెమిస్టర్ విధానాన్ని నిలిపివేసి వార్షిక పరీక్షల విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టింది?
1) హర్యానా
2) తెలంగాణ
3) మధ్యప్రదేశ్
4) హిమాచల్‌ప్రదేశ్
- View Answer
- సమాధానం: 4
వివరణ: హిమాచల్ ప్రదేశ్ ఇటీవల డిగ్రీ స్థాయిలో సెమిస్టర్ విధానానికి స్వస్తి పలికింది. ఈ విద్యా సంవత్సరం నుంచే తిరిగి వార్షిక పరీక్షల విధానాన్ని ప్రవేశపెట్టింది. రాష్టీయ్ర ఉచ్చత్తార్ శిక్షా అభియాన్ (రుసా)లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.
- సమాధానం: 4
47. కళింగ సాహిత్య ఉత్సవాన్ని కింది వాటిలోని ఏ రాష్ట్రం నిర్వహిస్తుంది ?
1) ఒడిశా
2) తెలంగాణ
3) కేరళ
4) ఆంధ్రప్రదేశ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: 5వ ఎడిషన్ కళింగ సాహిత్య ఉత్సవాలు ఇటీవల ఒడిశాలోని భువనేశ్వర్ లో జరిగాయి. ఒడియా భాషకు ఉన్న క్లాసికల్ లాంగ్వేజ్ హోదా వేడుకలా జరిపేందుకు ఏటా దీనిని నిర్వహిస్తారు.
- సమాధానం: 1
48. భారత వాతావరణ విభాగం వరదల హెచ్చరికల కోసం త్వరలో FFGS వ్యవస్థను ఉపయోగించనుంది. FFGS అంటే ఏమిటి ?
1)Flash Flood Guidance System
2)Flash Food Guiding System
3)Flash Flood Geographical Supervision
4)Flood Forecast Guidance System
- View Answer
- సమాధానం: 1
వివరణ: భారత వాతావరణ విభాగం వరదల హెచ్చరికల కోసం FFGS-Flash Flood Guidance System ను త్వరలో వినియోగించనుంది. ప్రస్తుతం వరద హెచ్చరికలను సెంట్రల్ వాటర్ కమిషన్ అందిస్తోంది. ఈ వ్యవస్థ ద్వారా విపత్తు నిర్వహణ సంస్థలను వీలైనంత త్వరగా అప్రమత్తం చేయవచ్చని సంస్థ వెల్లడించింది.
- సమాధానం: 1
49. ముంబైలో జరిగిన ఇంటర్ కాంటినెంటల్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ - 2018 ఫైనల్లో భారత్ ఏ జట్టుని ఓడించి టైటిల్ ను గెలుచుకుంది ?
1) దక్షిణ కొరియా
2) బంగ్లాదేశ్
3) జింబాబ్వే
4) కెన్యా
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఇంటర్ కాంటినెంటల్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ - 2018 ఫైనల్ ఇటీవల ముంబైలో జరిగింది. ఇందులో భారత్ 2-0 తేడాతో కెన్యాను ఓడించి టైటిల్ ను గెలుచుకుంది. ఈ టోర్నీలో భారత్ తరఫున 11 గోల్స్ నమోదుకాగా ఇందులో సునీల్ చెత్రీ 8 గోల్స్ చేశాడు. దీంతో 102 మ్యాచ్‌ల్లో 64 గోల్స్ చేసిన చెత్రీ 124 మ్యాచ్‌ల్లో 64 గోల్స్ చేసిన అర్జెంటీనా ప్లేయర్ మెస్సీ సరసన చేరాడు. ఈ జాబితాలో పోర్చుగల్ ప్లేయర్ రొనాల్డో 150 మ్యాచ్‌ల్లో 81 గోల్స్ చేసి అగ్రస్థానంలో ఉన్నాడు.
- సమాధానం: 4
50. భారత తొలి జాతీయ పోలీస్ మ్యూజియంను ఏ నగరంలో ఏర్పాటు చేస్తున్నారు ?
1) ముంబై
2) న్యూఢిల్లీ
3) కోల్‌కతా
4) చెన్నై
- View Answer
- సమాధానం: 2
వివరణ: భారత తొలి జాతీయ పోలీస్ మ్యూజియంను న్యూఢిల్లీలో ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. అక్టోబర్ 21న పోలీస్ సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ మ్యూజియంను ప్రారంభించనున్నారు.
- సమాధానం: 2