కరెంట్ అఫైర్స్ (జూన్ 1 - 7) బిట్ బ్యాంక్
1. రాష్ట్రంలోని నిరుద్యోగులకు నెలకు ఎన్ని రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి చెల్లింపునకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ ఇటీవల ఆమోదం తెలిపింది ?
1) రూ.1000
2) రూ.1500
3) రూ.2000
4) రూ.2500
- View Answer
- సమాధానం: 1
వివరణ: రాష్ట్రంలోని నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి చెల్లింపునకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కేబినెట్ ఇటీవల ఆమోదం తెలిపింది. 10 లక్షల మంది నిరుద్యోగులకు రూ.1000 చొప్పున భృతి అందించనున్నట్లు వెల్లడించింది. డిగ్రీ, డిప్లొమా చదివిన వారికి ఈ భృతి అందించాలని నిర్ణయం తీసుకుంది.
- సమాధానం: 1
2. ప్రపంచ కొబ్బరి ఉత్పత్తి, ఉత్పాదకతలో ఏ దేశం మొదటి స్థానంలో ఉంది?
1) ఇండోనేషియా
2) భారత్
3) జపాన్
4) శ్రీలంక
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఇటీవల వెల్లడైన గణాంకాల ప్రకారం ప్రపంచ కొబ్బరి ఉత్పత్తి, ఉత్పాదకతలో భారత్ తొలి స్థానంలో ఉంది. 2014-18 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా 13,117 హెక్టార్ల మేర కొత్తగా కొబ్బరి తోటలు సాగులోకి వచ్చాయి. 2017-18లో భారత్ రూ.1602 కోట్ల విలువైన కొబ్బరిని విదేశాలకు ఎగుమతి చేసింది.
- సమాధానం: 2
3. తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి మధ్య జల వివాదాల పరిష్కారం కోసం కేంద్రం ఇటీవల ఏర్పాటు చేసిన నీటి యాజమాన్య బోర్డు ఏది ?
1) కృష్ణా
2) కావేరి
3) నర్మదా
4) బ్రహ్మపుత్ర
- View Answer
- సమాధానం: 2
వివరణ: తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి మధ్య జల వివాదాల పరిష్కారం కోసం సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల కావేరి నది నీటి యాజమాన్య అథారిటీని ఏర్పాటు చేసింది. చైర్మన్, కార్యదర్శితో పాటు ఈ బోర్డులో 8 మంది సభ్యులు ఉంటారు.
- సమాధానం: 2
4. కింది వాటిలోని ఏ రాష్ట్రం ఇటీవల పెట్టుబడి లేని సహజ వ్యవసాయ కార్యక్రమం (ZBNF)ను ప్రారంభించింది ?
1) ఆంధ్రప్రదేశ్
2) తెలంగాణ
3) సిక్కిం
4) పంజాబ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: రాష్ట్రంలో సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించి, 2024 నాటికి రైతులు సమృద్ధిసాధించేలా చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల పెట్టుబడి లేని సహజ వ్యవసాయ కార్యక్రమం (Zero Budget Natural Farming) ప్రారంభించింది. జూన్ 2న జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ సస్టెయినబుల్ ఇండియా ఫైనాన్స్ ఫెసిలిటీ (SIFF)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందు కోసం వచ్చే ఆరేళ్లలో రూ.16,134 కోట్లు వెచ్చించనున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 1,63,034 మంది రైతులు పెట్టుబడి లేని సహజ వ్యవసాయం చేస్తున్నారు. 2024 నాటికి రాష్ట్రంలోని రైతులందరినీ ఈ విధానం కిందకి తీసుకురావాలన్నది లక్ష్యం.
- సమాధానం: 1
5. ఇటీవల ఏ దేశంలో జరిగిన ‘‘బిజినెస్, ఇన్నోవేషన్ అండ్ కమ్యూనిటీ ఈవెంట్’’లో ప్రధాని నరేంద్ర మోదీ రూపే కార్డ్, బీమ్, ఎస్బీఐ యాప్స్ ని ప్రారంభించారు ?
1) ఇండోనేషియా
2) జపాన్
3) యూకే
4) సింగపూర్
- View Answer
- సమాధానం: 4
వివరణ: ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఇండోనేషియా, మలేషియా, సింగపూర్ దేశాల్లో పర్యటించారు. ఇందులో భాగంగా సింగపూర్ లో జరిగిన బిజినెస్, ఇన్నోవేషన్, కమ్యూనిటీ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ దేశంలో రూపే కార్డ్, బీమ్, ఎస్బీఐ యాప్స్ ని ప్రారంభించారు. మోదీ 3 దేశాల పర్యటనలో భాగంగా ఇండోనేషియాతో 15 ఒప్పందాలు, సింగపూర్ తో 14 ఒప్పందాలు కుదిరాయి.
- సమాధానం: 4
6. ఇటీవల సింగపూర్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ కింది వారిలో ఎవరికి పద్మ శ్రీ పురస్కారాన్ని ప్రదానం చేశారు ?
1) టామీ కోహ్
2) యాన్ చాంగ్
3) మిన్ చౌహ్
4) అదిల్ రహమాన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఇటీవల సింగపూర్ లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ రాజకీయ వేత్త టామీ కోహ్ కు భారత పౌర పురస్కారం పద్మ శ్రీని ప్రదానం చేశారు. 2018 సంవత్సరానికి గాను కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డుల్లో.. 10 మంది ASEAN(Association of Southeast Asian Nations) దేశాల వ్యక్తులు పురస్కార గ్రహీతలుగా ఉన్నారు. టామీ కోహ్ వారిలో ఒకరు.
- సమాధానం: 1
7. యూఎస్ పసిఫిక్ కమాండ్ లేదా PACOM పేరుని ఇటీవల ఏ విధంగా మార్చారు ?
1) యూఎస్ ఇండో పసిఫిక్ కమాండ్
2) యూఎస్ ఇండియా పసిఫిక్ కమాండ్
3) యూఎస్ అట్లాంటిక్ పసిఫిక్ కమాండ్
4) యూఎస్ అండమాన్ పసిఫిక్ కమాండ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: యూఎస్ పసిఫిక్ కమాండ్ పేరుని ఇటీవల యూఎస్ ఇండో - పసిఫిక్ కమాండ్ గా మార్చారు. దక్షిణ చైనా సముద్రంలో వివాదం నేపథ్యంలో అమెరికా సైన్యానికి భారత మద్దతు ప్రాధాన్యతను తెలిపేలా దీని పేరుని మార్చారు. ఈ మిలిటరీ కమాండ్ ని అమెరికా రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఏర్పాటు చేసింది.
- సమాధానం: 1
8. స్పెయిన్ ప్రధాన మంత్రిగా ఇటీవల ఎవరు బాధ్యతలు చేపట్టారు ?
1) జూన్ రొడ్రిగ్యుజె
2) మారియానో రాజోయ్
3) పెడ్రో సాంచెజ్
4) బ్రియానే లిగార్డ్
- View Answer
- సమాధానం: 3
వివరణ: పెడ్రో సాంచెజ్ స్పెయిన్ ఏడో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మారియానో రాజోయ్ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. అవినీతి, కుంభకోణం ఆరోపణలతో మారియానో ఇటీవల పదవి నుంచి వైదొలిగారు. పెడ్రో సాంచెజ్ సోషలిస్ట్ పార్టీకి చెందినవారు.
- సమాధానం: 3
9. ఈజిప్టు అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన వారు ఎవరు ?
1) హుమా ఖురేషి
2) అబ్దెల్ ఫత్తాహ్ అల్ - సిసి
3) రమీజ్ రహమాన్
4) అఖిల్ వాదా
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఇటీవల జరిగిన ఈజిప్ట్ అధ్యక్ష ఎన్నికల్లో అబ్దెల్ ఫత్తాహ్ అల్ - సిసి 97 శాతానికి పైగా ఓట్లతో విజయం సాధించారు. తద్వారా రెండోసారి ఆ దేశ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఆయన గతంలో ఆ దేశ సైన్యాధ్యక్షుడిగా పనిచేశారు. 2013లో అల్లర్లు చెలరేగడంతో అప్పటి అధ్యక్షుడు మహమ్మద్ మోర్సీని గద్దె దించి తొలిసారి ఈజిప్ట్ అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టారు.
- సమాధానం: 2
10. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
1) జూన్ 1
2) జూన్ 3
3) జూన్ 5
4) జూన్ 7
- View Answer
- సమాధానం: 3
వివరణ: 1972లో ఐక్యరాజ్య సమితి ఏటా జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించాలని తీర్మానించింది. భూమి, నీరు, వాతావరణ పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఏటా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ ఏడాది పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత ప్రభుత్వం తాజ్ డిక్లరేషన్ టూ బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ ను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం ఆగ్రా వాసులు తాజ్ మహల్ కు 500 మీటర్ల పరిసర ప్రాంతాల్లో పాలిథీన్, ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని నిర్ణయించారు.
- సమాధానం: 3
11. తెలంగాణ పోలీస్ శాఖ ఇటీవల 1098 ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్ ని ఎవరి కోసం ప్రారంభించింది ?
1) ఉద్యోగుల రక్షణ
2) బాలల రక్షణ
3) ఆసుపత్రులపై ఫిర్యాదు
4) పోలీసులపై ఫిర్యాదు
- View Answer
- సమాధానం: 2
వివరణ: రాష్ట్రంలో బాలల రక్షణకు తెలంగాణ పోలీస్ శాఖ 1098 ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్‌ను ఇటీవల ప్రారంభించింది. చిన్నారులు ఆపదలో ఉన్నారని ఈ నంబర్ కు ఫోన్ చేస్తే పోలీసులు తక్షణమే వారిని ఆదుకునే దిశగా చర్యలు చేపడతారు.
- సమాధానం: 2
12. ఇంటర్నేషనల్ ఇండియా ఫిల్మ్ అకాడమీ(IIFA) జీవితకాల సాఫల్య పురస్కారం - 2018కి ఎవరు ఎంపికయ్యారు ?
1) అమితాబ్ బచ్చన్
2) ఇర్ఫాన్ ఖాన్
3) దర్మేంద్ర
4) అనుపమ్ ఖేర్
- View Answer
- సమాధానం: 4
వివరణ: ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఇంటర్నేషనల్ ఇండియా ఫిల్మ్ అకాడమీ నుంచి జీవితకాల సాఫల్య పురస్కారానికి ఎంపికయ్యారు. 2000 సంవత్సరం నుంచి ఐఫా అవార్డులని అందిస్తున్నారు. ఏటా ఒక్కో దేశంలో ఈ అవార్డు వేడుకలని నిర్వహిస్తారు. 2018 అవార్డుల ప్రదానోత్సవం బ్యాంకాక్ లో జరిగింది.
- సమాధానం: 4
13. తెలంగాణ ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో ప్రస్తుతం కూలీలకు అందించే రోజువారి గరిష్ఠ వేతనం ఎంత ?
1) రూ.197
2) రూ.205
3) రూ.273
4) రూ.168
- View Answer
- సమాధానం: 2
వివరణ: దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉపాధి హామీ కూలీల వేతనాలు పెంచుతూ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం ఇటీవల రోజువారీ కూలీని రూ.197 నుంచి రూ.205కు పెంచింది. ఆంధ్రప్రదేశ్ లోను ఇది రూ. 205 కు పెరిగింది. దేశంలోనే గరిష్ఠంగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఉపాధి కూలీల వేతనం రూ. 273గా నిర్ణయించారు. అతి తక్కువగా జార్ఖండ్‌లో రూ. 168 గా ఉంది.
- సమాధానం: 2
14. డీఆర్డీవో ఇటీవల మరోసారి విజయవంతంగా పరీక్షించిన అగ్ని - 5 క్షిపణి పరిధి ఎంత ?
1) 5000 కిలోమీటర్లు
2) 10000 కిలోమీటర్లు
3) 3000 కిలోమీటర్లు
4) 7000 కిలోమీటర్లు
- View Answer
- సమాధానం: 1
వివరణ: పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అగ్ని - 5 క్షిపణిని డీఆర్డీవో ఇటీవల విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణిని పరీక్షించడం ఇది ఆరోసారి. మొదటిసారి 2012 ఏప్రిల్ 19న పరీక్షించారు. అగ్ని - 5 క్షిపణి పరిధి 5000 కిలోమీటర్లు. దీన్ని ఉపరితలం నుంచి ఉపరితలంపైకి ప్రయోగిస్తారు.
- సమాధానం: 1
15. కనీసం ఐదేళ్లుగా అన్నదానం చేస్తున్న ఆధ్యాత్మిక, దాతృత్వ సంస్థలకు జీఎస్టీ తిరిగి చెల్లించేందుకు కేంద్రం ఇటీవల ప్రారంభించిన పథకం ఏది ?
1) ఖానా సేవా యోజన
2) ఆహార్ దేనా యోజన
3) సేవా భోజ్ యోజన
4) సబ్ కో ఆహార్ యోజన
- View Answer
- సమాధానం: 3
వివరణ: కనీసం ఐదేళ్లుగా అన్నదానం చేస్తున్న సంస్థలకు జీఎస్టీ తిరిగి చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల సేవా భోజ్ యోజనను ప్రారంభించింది. రూ.325 కోట్లతో వచ్చే రెండేళ్లపాటు ఈ పథకాన్ని అమలు చేయనుంది. నెలకు 5 వేల మందికి అన్నదానం చేస్తున్న ఆలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలు, ధార్మిక ఆశ్రమాలు, దర్గాలు, మకాలకు ఈ పథకం వర్తిస్తుంది.
- సమాధానం: 3
16. మరింత కచ్చితంగా వాతావరణ సమాచారాన్ని అందించేందుకు భారత వాతావరణ విభాగం ఇటీవల అందుబాటులోకి తెచ్చిన వ్యవస్థ ఏది ?
1) Ensemble Prediction Systems
2) atmosphere prediction system
3) earth prediction system
4) india prediction system
- View Answer
- సమాధానం: 1
వివరణ: వాతావరణ వివరాలను 10 రోజుల ముందే మరింత కచ్చితంగా తెలుసుకునేందుకు మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సెన్సైస్ ఇటీవల ఎన్సెంబుల్ ప్రెడిక్షన్ సిస్టమ్ (eps)ను ప్రారంభించింది. ఇందులోని అత్యాధునిక వ్యవస్థల్లో పుణెలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటిరియాలజీలో ఒకటి, నోయిడాలోని నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్ కాస్టింగ్‌లో మరొకటి ఏర్పాటు చేశారు.
- సమాధానం: 1
17. టైమ్స్ పత్రిక ఇటీవల ప్రకటించిన 100 ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల జాబితాలో చోటు సంపాదించిన భారత విశ్వవిద్యాలయం ఏది ?
1) ఉస్మానియా విశ్వవిద్యాలయం
2) ఢిల్లీ యూనివర్సిటీ
3) ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్
4) ఆంధ్రా విశ్వవిద్యాలయం
- View Answer
- సమాధానం: 3
వివరణ: 2018కి గాను టైమ్స్ పత్రిక ప్రకటించిన 100 ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల జాబితాలో బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్)కు చోటు దక్కింది. హార్వర్డ్ యూనివర్సిటీ, మసాచూసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, స్టాన్ ఫోర్డ్, కేంబ్రిడ్‌జ, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయాలు వరుసగా టాప్ - 5 లో ఉన్నాయి.
- సమాధానం: 3
18. గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల 49వ సదస్సు ఇటీవల ఏ నగరంలో జరిగింది ?
1) న్యూఢిల్లీ
2) హైదరాబాద్
3) తిరువంతపురం
4) లక్నో
- View Answer
- సమాధానం: 1
వివరణ: గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల 49వ సదస్సు జూన్ 4, 5 తేదీల్లో న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో జరిగింది. ఈ సదస్సులో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు.
- సమాధానం: 1
19. దేశంలో ప్లాస్టిక్ సంచులను నిషేధించిన తొలి రాష్ట్రం ఏది ?
1) మహారాష్ట్ర
2) సిక్కిం
3) అరుణాచల్ ప్రదేశ్
4) ఆంధ్రప్రదేశ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: భారత్ లో 1998లో మొదటిసారిగా సిక్కిం ప్లాస్టిక్ సంచులను నిషేధించిన తొలి రాష్ట్రంగా చరిత్ర సృష్టించింది. ఇటీవల ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5న పలు రాష్ట్రాలు ప్లాస్టిక్ నిషేధానికి ప్రతినబూనాయి. తమిళనాడులో జనవరి 2019 నుంచి, జార్ఖండ్ లో 2019 జూన్ 5 నుంచి ప్లాస్టిక్ పై నిషేధం అమల్లోకి రానుంది. నాగాలాండ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవలే ప్లాస్టిక్ నిషేధాన్ని అమల్లోకి తెస్తామని ప్రకటించాయి. ఛండీగఢ్ లో ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను బ్యాన్ చేశారు.
- సమాధానం: 2
20. గ్లోబల్ చైల్డ్ రైట్స్ గ్రూప్ ఇటీవల వెలువరించిన చైల్డ్‌హుడ్ ఇండెక్స్ లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది ?
1) 116
2) 113
3) 120
4) 125
- View Answer
- సమాధానం: 2
వివరణ: గ్లోబల్ చైల్డ్ రైట్స్ గ్రూప్ ఇటీవల వెలువరించిన ప్రపంచ బాల్య సూచీలో భారత్ 113వ స్థానంలో నిలిచింది. 2017లో భారత్ ర్యాంక్ 116. పౌష్టికాహార లోపం, శిశు మరణాలు, బాలకార్మిక వ్యవస్థ చిన్నారులకు సమస్యగా పరిణమించాయని నివేదిక పేర్కొంది.
- సమాధానం: 2
21. ప్రపంచ బ్యాంక్ ఇటీవల వెలువరించిన ప్రపంచ ఆర్థిక అంచనా నివేదిక జూన్ 2018 ఎడిషన్ ప్రకారం ఈ ఏడాది భారత్ వృద్ధి ఎంతగా నమోదు కానుంది ?
1) 7.3 శాతం
2) 7.8 శాతం
3) 8 శాతం
4) 7.1 శాతం
- View Answer
- సమాధానం: 1
వివరణ: ప్రపంచ బ్యాంక్ ఇటీవల ప్రపంచ ఆర్థిక అంచనా నివేదిక జూన్ 2018 ఎడిషన్ ను విడుదల చేసింది. ఇందులో భారత్ 7.3 శాతం వృద్ధి సాధిస్తుందని అంచనా వేసింది. వచ్చే రెండేళ్లలో 7.5 శాతం చొప్పున వృద్ధి సాధిస్తుందని పేర్కొంది.
- సమాధానం: 1
22. కింది వాటిలో అత్యంత లాభదాయక ప్రభుత్వ రంగ సంస్థ ఏది ?
1) ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్
2) ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్
3) స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్
4) కోల్ ఇండియా లిమిటెడ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్‌యూ)ల అన్నింటిలో అత్యంత లాభదాయక కంపెనీగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వరుసగా రెండో ఏడాది కూడా అగ్రస్థానంలో నిలిచింది. ఐవోసీ 2017-18లో రూ.21,346 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
- సమాధానం: 1
23. కింద పేరొన్న క్రికెటర్లలో ఎవరు 2017-18 సీజన్ కు గాను పాలి ఉమ్రిగర్ అవార్డుకు ఎంపికయ్యారు ?
1) కేఎల్ రాహుల్
2) రోహిత్ శర్మ
3) అజింక్యా రహానే
4) విరాట్ కోహ్లీ
- View Answer
- సమాధానం: 4
వివరణ: బీసీసీఐ 2016-17, 2017-18 సీజన్ లకు అవార్డులు ప్రకటించింది. ఇందులో రెండు సీజన్లలో పాలి ఉమ్రిగర్ అవార్డుకు విరాట్ కోహ్లీనే ఎంపికయ్యాడు.
- సమాధానం: 4
24. బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం ఇటీవల ఏ దేశంలో జరిగింది ?
1) భారత్
2) బ్రెజిల్
3) రష్యా
4) దక్షిణాఫ్రికా
- View Answer
- సమాధానం: 4
వివరణ: దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో జూన్ 4న బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా) విదేశాంగ మంత్రుల సదస్సు జరిగింది. ఇందులో భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పాల్గొన్నారు.
- సమాధానం: 4
25. కింది వాటిలోని ఏ అంతరిక్ష సంస్థ న్యూట్రాన్ అనే నక్షత్రాన్ని కనుగొన్నట్లు ఇటీవల ప్రకటించింది?
1) ఇస్రో
2) రాస్ కాస్మోస్
3) నాసా
4) జాక్సా
- View Answer
- సమాధానం: 3
వివరణ: గెలాక్సీకి 2 లక్షల కాంతి సంవత్సరాల దూరంలో న్యూట్రాన్ అనే కొత్త నక్షత్రాన్ని నాసా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ మేరకు నక్షత్రానికి సంబంధించిన చిత్రాన్ని నాసా విడుదల చేసింది. ఇప్పటి వరకు ఈ తరహా నక్షత్రాలను పాలపుంతలో పదికిపైనే కనుగొన్నప్పటికీ పాలపుంత ఆవల కనుగొనడం ఇదే తొలిసారి.
- సమాధానం: 3
26. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షురాలిగా ఇటీవల ఎన్నికైన మరియా ఫెర్నాండా ఎస్పినోస గార్సెస్ ఏ దేశానికి చెందిన వారు?
1) ఫ్రాన్స్
2) ఈక్వెడార్
3) భారత్
4) ఈజిప్ట్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఐరాస సాధారణ అసెంబ్లీ అధ్యక్షురాలిగా ఈక్వెడార్ విదేశాంగ మంత్రి మరియా ఫెర్నాండా ఎస్పినోస గార్సెస్ ఎన్నికయ్యారు. 2018 సెప్టెంబర్ నుంచి ఏడాది పాటు కొనసాగనున్న 73వ సెషన్ కు ఆమె నేతృత్వం వహిస్తారు. ఆమె ఈ పదవికి ఎన్నికై న నాలుగో మహిళ. 1953లో భారత తొలి ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ సోదరి విజయలక్ష్మీ పండిట్ ఐరాస సాధారణ సభ అధ్యక్షురాలిగా ఎన్నికై న తొలి మహిళగా చరిత్ర సృష్టించారు.
- సమాధానం: 2
27. ఫోర్బ్స్ ఇటీవల వెలువరించిన ప్రపంచంలో అత్యధికంగా ఆర్జిస్తున్న అథ్లెట్ల జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ ప్లేయర్ ఎవరు?
1) విరాట్ కోహ్లీ
2) కిడాంబి శ్రీకాంత్
3) రోహిత్ శర్మ
4) పీవీ సింధు
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఫోర్బ్స్ ఇటీవల వరల్డ్ హయ్యెస్ట్ పెయిడ్ అథ్లెట్స్ 2018 జాబితాను విడుదల చేసింది. ఇందులో చోటు దక్కించుకున్న ఏకై క భారత ప్లేయర్ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఈ జాబితా ప్రకారం కోహ్లీ ఏడాదికి రూ. 160 కోట్లు ఆర్జిస్తూ 83వ స్థానంలో నిలిచారు. అమెరికా ప్రొఫెషనల్ బాక్సర్ ఫ్లాయిడ్ మేవెదెర్ రూ.1907 కోట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఫుట్‌బాల్ ప్లేయర్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.
- సమాధానం: 1
28. అసోచామ్ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం ఈ-వ్యర్థాల ఉత్పత్తిలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది ?
1) 5
2) 10
3) 8
4) 1
- View Answer
- సమాధానం: 1
వివరణ: అసోచామ్ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం ఈ-వ్యర్థాల ఉత్పత్తిలో చైనా, అమెరికా, జపాన్, జర్మనీ తర్వాత భారత్ ఐదో స్థానంలో నిలిచింది. రాష్ట్రాల వారీగా జాబితాలో మహారాష్ట్ర తొలి స్థానంలో, తమిళనాడు రెండో స్థానంలో, ఉత్తరప్రదేశ్ మూడో స్థానంలో ఉన్నాయి.
- సమాధానం: 1
29. ది ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి యంగెస్ట్ ఆథర్ ఆఫ్ ఇండియా పురస్కారానికి ఎంపికై న నాలుగేళ్ల బాలుడు ఎవరు ?
1) క్రిష్ కల్యాణ్
2) ఆయాన్ గోగోయ్ గోహెయిన్
3) అవన్ దేశాయ్
4) మధుకర్ రాయ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: అస్సాంకు చెందిన నాలుగేళ్ల బాలుడు ఆయాన్ గోగోయ్ గోహెయిన్ ఇటీవల ది ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి యంగెస్ట్ ఆథర్ ఆప్ ఇండియా పురస్కారానికి ఎంపికయ్యాడు. హనీకోంబ్ అనే పుస్తకాన్ని రచించినందుకు గాను అయాన్ కు ఈ ఘనత దక్కింది.
- సమాధానం: 2
30. కింది వారిలో ఎవరు బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స (BAFTA) చైర్మన్ గా ఎంపికయ్యారు ?
1) పిప్పా హారిస్
2) జేన్ లష్
3) దానెల్లీ మియాహ్
4) రజియా ఖాన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: బాఫ్టా చైర్మన్ గా ఇటీవల పిప్పా హారీస్ ఎంపికయ్యారు. జేన్ లష్ స్థానంలో ఆమె బాధ్యతలు చేపడతారు. ఈ పదవిలో రెండేళ్లు ఉంటారు. ఇంతకముందు ఆమె బీబీసీలో పనిచేశారు.
- సమాధానం: 1
31. ప్రత్యేక ఆర్థిక మండళ్లు(SEZ)లపై భారత విధానాలను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎవరి నేతృత్వంలో బృందాన్ని ఏర్పాటు చేసింది ?
1) బాబా కల్యాణి
2) రమన్ సింగ్
3) అమ్రితా సింగ్
4) రవి శంకర్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ప్రత్యేక ఆర్థిక మండళ్ల విధానం 2000 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. SEZ చట్టం 2005 నుంచి అమలవుతోంది. ఈ చట్టంలోని నిబంధనలను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం బాబా కల్యాణినేతృత్వంలోప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుత ఆర్థిక అవసరాలకు అనుగుణంగా నిబంధనల్లో తీసుకురావాల్సిన మార్పులపై ఈ బృందం సూచనలు చేస్తుంది.
- సమాధానం: 1
32. 11వ జియో ఇంటెలిజెన్స్ ఆసియా 2018 కార్యక్రమం ఇటీవల ఏ నగరంలో జరిగింది ?
1) బెంగళూరు
2) హైదరాబాద్
3) న్యూఢిల్లీ
4) కొచ్చి
- View Answer
- సమాధానం: 3
వివరణ: జియో ఇంటిలిజెన్స్ ఆసియా 2018 కార్యక్రమం 11వ ఎడిషన్ ఇటీవల న్యూఢిల్లీలో జరిగింది. ఇందులో భారత సైన్యాధిపతి జనరల్ బిపిన్ రావత్ పాల్గొన్నారు. జియో స్పాషియల్ రంగంలోని సాంకేతికత సహాయంతో భారత సైన్యానికి అత్యాధునిక పరికరాలను అందించాల్సిన అవసరాన్ని రావత్ పేర్కొన్నారు.
- సమాధానం: 3
33. అటల్ భుజల్ యోజన కింది వాటిలో ఏ అంశానికి సంబంధించినది?
1) భూగర్భ జల సంరక్షణ
2) కాలుష్య నివారణ
3) గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ
4) మహిళా భద్రత
- View Answer
- సమాధానం: 1
వివరణ: భూగర్భ జలాలు వేగంగా తగ్గిపోతున్న ప్రాంతాల్లో ప్రజల భాగస్వామ్యంతో భూగర్భ జల సంరక్షణకు మెరుగైన నిర్వహణ పద్ధతులను పాటించేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం అటల్ భుజల్ యోజనను ప్రవేశపెట్టింది. గుజరాత్, హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తుంది. ఇందు కోసం రూ.6 వేల కోట్లు కేటాయించింది. 2018-19 నుంచి 2022-23 వరకు పథకం అమల్లో ఉంటుంది.
- సమాధానం: 1
34. కింది ఆటగాళ్లలో ఇటీవల ఎవరి మైనపు విగ్రహాన్ని న్యూఢిల్లీలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆవిష్కరించారు ?
1) రోహిత్ శర్మ
2) విరాట్ కోహ్లీ
3) మహేంద్ర సింగ్ ధోని
4) సునీల్ గవాస్కర్
- View Answer
- సమాధానం: 2
వివరణ: న్యూఢిల్లీలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ మైనపు బొమ్మని ఏర్పాటు చేశారు. ఈ మ్యూజియంలో క్రీడాకారులు సచిన్ టెండూల్కర్, కపిల్ దేవ్, లియోనెల్ మెస్సీ మైనపు విగ్రహాలు ఉన్నాయి.
- సమాధానం: 2
35. ఆసియాన్ భారత అంబాసిడర్ గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు?
1) రామకృష్ణ పరమేశ్
2) సుదీప్ గురు
3) రందీప్ సింగ్
4) రుద్రేంద్ర టాండన్
- View Answer
- సమాధానం: 4
వివరణ: 1994 ఐఎఫ్ఎస్ బ్యాచ్ కు చెందిన అధికారి రుద్రేంద్ర టాండన్.. ఇటీవల ASEAN(Association of southeast Asian nations) భారత అంబాసిడర్ గా నియమితులయ్యారు.
- సమాధానం: 4
36. ప్రస్తుత భారత ఎన్నికల ప్రధాన అధికారి ఎవరు ?
1) సునిల్ అరోరా
2) ఓపీ రావత్
3) వివేక్ నాయర్
4) ఆకాశ్ రామకృష్ణ
- View Answer
- సమాధానం: 2
వివరణ: ప్రస్తుత భారత ఎన్నికల ప్రధాన అధికారి - ఓపీ రావత్. భారత ఎన్నికల సంఘానికి సంబంధించిన ఆర్టీఐ పోర్టల్ ని సీఈసీ ఓపీ రావత్, ఈసీ సునిల్ ఆరోరా, ఈసీ అశోక్ లావాసప్రారంభించారు. దీని ద్వారా ఎన్నికల సంఘానికి సంబంధించిన సమాచారాన్ని ప్రజలు కోరవచ్చు.
ECI RTI Portal : https://rti.eci.nic.in
- సమాధానం: 2
37. ప్రపంచ శాంతి సూచీ 2018లో భారత్ ఎన్నో ర్యాంకులో నిలిచింది ?
1) 136
2) 163
3) 142
4) 152
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఆస్ట్రేలియాలోని సిడ్నీ కేంద్రంగా పనిచేసే ఎకనామిక్స్ అండ్ పీస్ సంస్థ గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2018ని ఇటీవల విడుదల చేసింది. మొత్తం 163 దేశాల ర్యాంకింగ్స తో నివేదికను విడుదల చేసింది. ఇందులో భారత్ 136వ ర్యాంకులో నిలిచింది. ఐస్‌ల్యాండ్ తొలి స్థానంలో, న్యూజిలాండ్ రెండో స్థానంలో, ఆస్టియ్రా మూడో స్థానంలో నిలిచాయి.
- సమాధానం: 1
38. ఇటీవల బద్దలైన ఫ్యూగో అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది ?
1) ఇండోనేషియా
2) ఇథియోపియా
3) గ్వాటెమాలా
4) ఈక్వెడార్
- View Answer
- సమాధానం: 3
వివరణ: మధ్య అమెరికా దేశమైన గ్వాటెమాలాలో సిటీకి 40 కిలోమీటర్లు దూరంలోని ఫ్యూగో అగ్నిపర్వతం ఇటీవల బద్దలైంది. ఇది ఒక్కసారిగా లావాను ఎగజిమ్మడంతో సమీప గ్రామాలకు చెందిన 25 మంది మృతి చెందగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.
- సమాధానం: 3
39. 2017-18లో తెలంగాణ ఐటీ వృద్ధి రేటు ఎంతగా నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది?
1) 9.32 శాతం
2) 12 శాతం
3) 14 శాతం
4) 17 శాతం
- View Answer
- సమాధానం: 1
వివరణ: 2017-18 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ఐటీ వృద్ధి రేటు 9.32 శాతంగా నమోదుకాగా రూ.93,442 కోట్ల ఐటీ, ఐటీ ఆధారిత ఉత్పత్తులను రాష్ట్రం ఎగుమతి చేసింది. ఈ మేరకు పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు జూన్ 1న ఒక నివేదికను విడుదల చేశారు. 2017-18లో జాతీయ సగటు ఐటీ వృద్ధి రేటు 7-9 శాతంగా ఉంది. 2020 నాటికి 16 శాతం ఐటీ వృద్ధి రేటుతో రూ.1.2 లక్షల కోట్ల వార్షిక ఐటీ ఉత్పత్తుల ఎగుమతులు సాధించి 4 లక్షలకు పైగా ఐటీ ఉద్యోగాలు, 20 లక్షల మందికి పరోక్ష ఉపాధి కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
- సమాధానం: 1
40. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ గా ఇటీవల నియమితులైనవారు ఎవరు ?
1) మహేశ్ కుమార్ జైన్
2) ఎస్.ఎస్.ముంద్రా
3) చందా కొచ్చర్
4) అరుంధతి భట్టాచార్య
- View Answer
- సమాధానం: 1
వివరణ: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నాలుగవ డిప్యూటీ గవర్నర్‌గా మహేశ్ కుమార్ జైన్ నియమితులయ్యారు. మూడేళ్లపాటు ఆయన ఈ పదవిలో ఉంటారు. 2017 జూలైలో ఎస్.ఎస్.ముంద్రా పదవీకాలం ముగియడంతో జైన్‌ను ఆయన స్థానంలో నియమించారు. ఆర్బీఐలో ప్రస్తుతం విరాల్ వి ఆచార్య, ఎన్.ఎస్.విశ్వనాథన్, బి.పి.కనుంగో లు డిప్యూటీ గవర్నర్లుగా ఉన్నారు.
- సమాధానం: 1
41. సొసైటీ ఆఫ్ లండన్ నుంచి ఇటీవల ప్రతిష్టాత్మక లిన్నేయన్ మెడల్ అందుకున్న వారు ఎవరు ?
1) సూపర్ 30 ఆనంద్
2) కై లాశ్ సత్యార్థి
3) కమల్ జిత్ బవా
4) ప్రొఫెసర్ రామచంద్రం
- View Answer
- సమాధానం: 3
వివరణ: భారత వృక్ష శాస్త్రవేత్త కమల్జిత్ బవాకు ప్రఖ్యాత లిన్నేయన్ మెడల్ లభించింది. సొసైటీ ఆఫ్ లండన్ ప్రదానం చేసే ఈ అవార్డును అందుకున్న తొలి భారతీయుడు బవా. ఈయన ప్రస్తుతం బెంగుళూరు కేంద్రంగా పనిచేస్తున్న ‘అశోక ట్రస్ట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఎకాలజీ అండ్ ద ఎన్విరాన్మెంట్’కు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఉష్ణ ప్రదేశాల్లో మొక్కల పరిణామ క్రమం, అటవీ క్షీణత, కలప రకానికి చెందిన అటవీ ఉత్పత్తులు, మధ్య అమెరికా, పశ్చిమ కనుములు, తూర్పు హిమాలయాల్లోని అడవుల్లో జీవ వైవిధ్యంపై చేసిన కృషికి గాను ఆయనకు ఈ బహుమతి దక్కింది.
- సమాధానం: 3
42. కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ కార్యదర్శిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) సత్యపాల్ సింగ్
2) విజయ్ గోఖలే
3) ఎన్ కే సిన్హా
4) అమిత్ ఖారె
- View Answer
- సమాధానం: 4
వివరణ: 1985 ఐఏఎస్ బ్యాచ్, జార్ఖండ్ క్యాడర్ కు చెందిన అధికారి అమిత్ ఖారె ఇటీవల కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఇంతకముందు ఈ పదవిలో ఉన్న ఎన్ కే సిన్హా మే 31, 2018న పదవీ విరమణ చేశారు.
- సమాధానం: 4
43. ప్రాంతీయ సమాచారాన్ని అక్కడి ప్రజలకు అందించేందుకు వీలుగా ఇటీవల టెక్ దిగ్గజం గూగుల్ ఇండియా ప్రారంభించిన యాప్ ఏది ?
1) నెయిబర్లీ
2) నెయిబర్ హుడ్
3) నో యువర్ నెయిబర్
4) జీ నెయిబర్
- View Answer
- సమాధానం: 1
వివరణ: గూగుల్ ఇండియా ఇటీవల బీటా వర్షన్ లో Neighbourly యాప్ ని ఆవిష్కరించింది. ప్రాంతీయ సమాచారాన్ని అక్కడి ప్రజలకు అందించేందుకు వీలుగా గూగుల్ ఈ ఆప్ ని రూపొందించింది. ప్రస్తుతం ముంబయి వాసులకి ఈ యాప్ అందుబాటులో ఉంది. త్వరలో మిగతా నగరాలకు విస్తరించనుంది.
- సమాధానం: 1
44. ఇటీవల ఏ రాష్ట్రం చిన్నారులపై దాడులకు వ్యతిరేకంగా యునిసెఫ్ తో కలిసి ‘Paree Pain Katha Tiye’ పేరుతో క్యాంపెయిన్ ప్రారంభించింది ?
1) కర్ణాటక
2) తమిళనాడు
3) ఒడిశా
4) ఆంధ్రప్రదేశ్
- View Answer
- సమాధానం: 3
వివరణ: యునిసెఫ్, ఒడిశా రాష్ట్ర పోలీసులు సంయుక్తంగా ‘Paree Pain Katha Tiye’ (చిన్నారి కోసం ఓ పదం) పేరుతో క్యాంపెయిన్ ప్రారంభించారు. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరినీ చిన్నారులపై జరిగే దాడులకు వ్యతిరేకంగా జాగృతంచేయడమే ఈ క్యాంపెయిన్ లక్ష్యం.
- సమాధానం: 3
45. కేంద్ర గణాంక శాఖ ఇటీవల వెల్లడించిన వివరాల ప్రకారం 2017-18 ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్ లో భారత వృద్ధి ఎంతగా నమోదైంది ?
1) 6.1 శాతం
2) 7 శాతం
3) 7.7 శాతం
4) 9 శాతం
- View Answer
- సమాధానం: 3
వివరణ: కేంద్ర గణాంక శాఖ ఇటీవల వెల్లడించిన వివరాల ప్రకారం 2017-18 ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్ లో భారత వృద్ధి రేటు 7.7 శాతంగా నమోదైంది. 2017-18లో తొలి త్రైమాసికంలో వృద్ధి రేటు 5.6 శాతం, తర్వాతి నెలల్లో వరుసగా 6.3 శాతం, 7 శాతం, చివరి త్రైమాసికంలో 7.7 శాతం వృద్ధి నమోదయి్యంది. వ్యవసాయ వృద్ధి 4.5 శాతం, తయారీ రంగ వృద్ధి 9.1 శాతం నమోదుకాగా నిర్మాణ రంగ వృద్ధి 11.6 శాతంగా నమోదయి్యంది. దేశ జీడీపీలో తయారీ రంగం 15 శాతం వాటా కలిగి ఉండగా సేవల రంగం 55 శాతంపైగా వాటాను కలిగి ఉంది.
- సమాధానం: 3
46. సంతోక్బా మానవత్వ అవార్డు - 2018 ని ఇటీవల ఎవరు అందుకున్నారు?
1) కై లాశ్ సత్యార్థి
2) వర్గీస్ కురియన్
3) డాక్టర్ ఎస్ స్వామినాథన్
4) సామ్ పిట్రోడా
- View Answer
- సమాధానం: 1
వివరణ: నోబెల్ అవార్డు గ్రహీత కై లాశ్ సత్యార్థి ఇటీవల సంతోక్బా మానవత్వ అవార్డు - 2018కి ఎంపికయ్యారు. గుజరాత్ లోని సూరత్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డు అందుకున్నారు. పురస్కారం కింద రూ. కోటి బహుమతిగా లభించింది
- సమాధానం: 1
47. ఉత్తమ కేరికేచర్ విభాగంలో వరల్డ్ ప్రెస్ కార్టూన్ అవార్డు - 2018ని పొందిన ఏకై క ఆసియా కార్టూనిస్ట్ ఎవరు ?
1) శ్రీధర్
2) శంకర్ పామర్తి
3) రామచంద్ర బాబు
4) థామస్ ఆంటోని
- View Answer
- సమాధానం: 4
వివరణ: కేరళ కార్టూనిస్ట్ థామస్ ఆంటోని ఇటీవల వరల్డ్ ప్రెస్ కార్టూనిస్ట్ అవార్డుల్లో ఉత్తమ కేరికేచర్ విభాగంలో అవార్డు పొందారు. తద్వారా ఈ అవార్డు పొందిన ఏకై క ఆసియా వ్యక్తిగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆయన మలయాలం దినపత్రిక మెట్రో వార్తలో ఎగ్జిక్యూటివ్ ఆర్టిస్ట్ గా ఉన్నారు. పోర్చుగల్ లోని లిస్బన్ లో ఉన్న సంస్థ ఏటా ఈ అవార్డులు ప్రదానం చేస్తుంది.
- సమాధానం: 4
48. ఇటలీ ప్రధాన మంత్రిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) గుసెప్పీ కాంటె
2) రాబెర్టో ఫికో
3) సెర్గియో మట్టరెల్లా
4) మట్టియో సాల్విని
- View Answer
- సమాధానం: 1
వివరణ: గుసెప్పీ కాంటె ఇటీవల ఇటలీ ప్రధానమంత్రిగా నియమితులయ్యారు. ఇటలీ ప్రస్తుత అధ్యక్షుడు సెర్గియో మట్టరెల్లా.
- సమాధానం: 1
49. ఐరాస ఏ రోజుని ప్రపంచ సైకిల్ దినోత్సవంగా జరుపుతోంది ?
1) జూన్ 1
2) జూన్ 2
3) జూన్ 3
4) జూన్ 4
- View Answer
- సమాధానం: 3
వివరణ: 2018 ఏప్రిల్ 12న ఐరాస ప్రత్యేక తీర్మానం ద్వారా ఏటా జూన్ 3న ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని నిర్వహించాలని పేర్కొంది. దీంతో.. ఇటీవల జూన్ 3న తొలి ప్రపంచ ైసైకిల్ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించారు. సులభమైన, పర్యావరణహితమైన, ఆరోగ్యవంతమైన రవాణా వ్యవస్థలను ప్రోత్సహించడంలో భాగంగా ఏటా ఈ దినోత్సవాన్ని నిర్వహించాలని ఐరాస వెల్లడించింది.
- సమాధానం: 3
50. జోర్డాన్ నూతన ప్రధాన మంత్రిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు?
1) ఇబ్రహీం హషీమ్
2) ఒమర్ రజాజ్
3) హని ముల్కీ
4) సాద్ జుమా
- View Answer
- సమాధానం: 2
వివరణ: జోర్డాన్ రాజు అబ్దుల్లా 2 ఇటీవల హని ముల్క్ స్థానంలో ప్రపంచ బ్యాంక్ మాజీ అధికారి ఒమర్ రజాజ్ ను ఆ దేశ ప్రధానమంత్రిగా నియమించారు.
- సమాధానం: 2