కరెంట్ అఫైర్స్ (జూన్ 07 - 13, 2019) బిట్ బ్యాంక్
1. 56 దేశాల్లోని 403 నగరాల‘‘ట్రాఫిక్ ఇండెక్స్ 2018’’లో అత్యంత రద్దీ నగరంగా అగ్రస్థానంలో నిలిచిన భారతీయ నగరం ఏది?
1) హైదరాబాద్
2) న్యూఢిల్లీ
3) ముంబై
4) బెంగళూరు
- View Answer
- సమాధానం: 3
2. బోర్డ్ ఆఫ్ ట్రేడ్, కౌన్సిల్ ఫర్ డెవలప్మెంట్ అండ్ ప్రమోషన్ సమావేశం ఎక్కడ జరిగింది?
1) గువహతి
2) కోల్‌కత
3) ముంబై
4) న్యూఢిల్లీ
- View Answer
- సమాధానం: 4
3. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్. హర్షవర్ధన్, కేరళలోని ఏ వ్యాధిపై ఇటీవల సమీక్షించారు?
1) మార్బుర్గ్ వైరస్ వ్యాధి
2) మీసెల్స్ వైరస్ వ్యాధి
3) నిఫా వైరస్ వ్యాధి
4) లస్సా వైరస్ వ్యాధి
- View Answer
- సమాధానం: 3
4. ‘నీరు, మట్టి, ఆహారంపై స్వచ్ఛ్భారత్ మిషన్ పర్యావరణ ప్రభావం’ పేరుతో యూనిసెఫ్ నిర్వహించిన అధ్యయనం - భూగర్భ జలాల కాలుష్యం తగ్గిందని తెలిపింది. దీనికి కారణమైన ప్రభుత్వ కార్యక్రమం పేరు?
1) సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజనా
2) స్మార్ట్ సిటీస్ మిషన్
3) స్వచ్ఛ్భారత్ అభియాన్
4) డిజిటల్ ఇండియా
- View Answer
- సమాధానం: 3
5. యోగా పై అవగాహన కల్పించడంలో ముఖ్యభూమిక పోషించిన మీడియాకు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అందించే అవార్డు?
1) అంతర్రాష్ట్రీయ యోగా సమ్మాన్ ఫర్ మీడియా
2) యోగా మీడియా సమ్మాన్
3) అంతర్రాష్ట్రీయ యోగాదివస్ మీడియా సమ్మాన్
4) అంతర్రాష్ట్రీయ యోగా మీడియా సమ్మాన్
- View Answer
- సమాధానం: 3
6. ప్రపంచంలోనే మూడోది, భారత్‌లో మొదటిదైన డైనోసార్ మ్యూజియం కమ్ పార్క్ ఎక్కడ ప్రారంభమైంది?
1) ఉత్తరప్రదేశ్
2) మహారాష్ట్ర
3) న్యూఢిల్లీ
4) గుజరాత్
- View Answer
- సమాధానం: 4
7. జేష్టాష్టమి రోజున ‘ఖీర్ భవానీ మేళా’ అనే వార్షికోత్సవం ఇటీవల ఎక్కడ జరిగింది?
1) మధ్యప్రదేశ్
2) హిమాచల్ ప్రదేశ్
3) జమ్మూకశ్మీర్
4) ఉత్తరప్రదేశ్
- View Answer
- సమాధానం: 3
8.ఇటీవల ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(భారత పురావస్త పరిశోధనా సంస్థ) ఏ కట్టడాన్ని జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నంగా ప్రకటించింది?
1) దివాన్-ఐ- అమ్
2) గోల్ గుంబజ్
3) సఫ్తర్‌జంగ్ సమాధి
4) చౌఖండీ స్తూపం
- View Answer
- సమాధానం: 4
9. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఫారిన్ ట్రిబ్యునల్స్ ఏర్పాటుకు జిల్లా మేజిస్ట్రేట్లకు అధికారాన్ని ఇచ్చిన మంత్రిత్వ శాఖ ఏది?
1) మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
2) ఓవర్సీస్ మంత్రిత్వ శాఖ
3) హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ
4) విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
- View Answer
- సమాధానం: 3
10. ఏ సంవత్సరం నాటికి పౌరులందరికీ కుళాయిల ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది?
1) 2022
2) 2020
3) 2024
4) 2025
- View Answer
- సమాధానం: 3
11. భారత్‌లో సౌరశక్తి వంటగదులు కలిగిన తొలి గ్రామంగా ఆవిర్భవించిన బంచా ఏ రాష్ట్రంలో ఉంది?
1) మిజోరంలో కోలాసిబ్ జిల్లా
2) నాగాలాండ్‌లోని కిఫైర్ జిల్లా
3) మధ్యప్రదేశ్‌లోని బెతుల్ జిల్లా
4) మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా
- View Answer
- సమాధానం: 3
12.ఐక్యరాజ్యసమితికి చెందిన 2019 ఈక్వేటర్ ప్రైజ్ అందుకున్న తెలంగాణ ఎన్జీఓ?
1) రూరల్ హెల్త్ కేర్ ఫౌండేషన్
2) డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ
3) డిజైర్ సొసైటీ
4) రూరల్ డెవలప్మెంట్ సొసైటీ
- View Answer
- సమాధానం: 2
13. ట్రేడ్ అండ్ డిజిటల్ ఎకానమీపై జీ- 20 మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది?
1) ట్సుకుబా, జపాన్
2) బీజింగ్, చైనా
3) మాస్కో, రష్యా
4) న్యూఢిల్లీ, భారత్
- View Answer
- సమాధానం: 1
14. ఏ మధ్య ఆఫ్రికా దేశంలో అత్యధికంగా మగపిల్లల్లో బాల్య వివాహాలు 28 శాతం వరకుజరుగుతున్నాయి?
1) సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్
2) రిపబ్లిక్ ఆఫ్ ఛద్
3) డీఆర్ కాంగో
4) కేమరూన్
- View Answer
- సమాధానం: 1
15.యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ అవలంబిస్తున్న 12 ఏళ్ల వ్యూహాత్మక ప్రణాళిక పేరు?
1) నేషనల్ స్ట్రాటజీ ఫర్ క్లైమేట్ యాక్షన్ 2031
2) నేషనల్ స్ట్రాటజీ ఫర్ వెల్బీయింగ్ 2031
3) నేషనల్ స్ట్రాటజీ ఫర్ హెల్త్ 2031
4) నేషనల్ స్ట్రాటజీ ఫర్ పొల్యూషన్ 2031
- View Answer
- సమాధానం: 2
16. అడీస్ అబాబాలో జరిగిన సమావేశంలో ఆఫ్రికా సమాఖ్య(ఏయూ) పీస్ అండ్ సెక్యూరిటీ కౌన్సిల్ నుంచి తాత్కాలిక బహిష్కరణకు గురైన ఆఫ్రికా దేశం?
1) మొరాకో
2) లిబియా
3) సూడాన్
4) అల్జీరియా
- View Answer
- సమాధానం: 3
17. ఇటీవల రష్యా ప్రారంభించిన తొలి ఆర్కిటిక్ టూరిస్ట్ రైలు పేరు?
1) జరీన్గోల్డ్
2) రాజబస
3) జయబయ
4) బొగొవోంటో
- View Answer
- సమాధానం: 1
18. హరప్పా నాగరికత విలసిల్లిన గుజరాత్‌లోని లోథల్ వద్ద మారీటైం మ్యూజియం ఏర్పాటుకు భారత ప్రభుత్వంతో చేతులు కలిపిన దేశం?
1) శ్రీలంక
2) పోర్చుగల్
3) ఫ్రాన్స్
4) పాకిస్తాన్
- View Answer
- సమాధానం: 2
19. వచ్చే ఐదేళ్లలో వెయ్యి మంది సివిల్ సర్వెంట్లకు శిక్షణ ఇవ్వడానికి భారత్‌కు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్(ఎన్‌సీజీజీ) తో ఏ దేశ సివిల్ సర్వీసెస్ కమిషన్ ఒప్పందం కుదుర్చుకుంది?
1) నేపాల్
2) బంగ్లాదేశ్
3) శ్రీలంక
4) మాల్దీవులు
- View Answer
- సమాధానం: 4
20. మాల్దీవుల అత్యున్నత పురస్కారం ‘రూల్ ఆఫ్ నిషాన్ ఇజుద్దీన్’తో ఎవరిని సత్కరించారు?
1) వెంకయ్య నాయుడు
2) రామ్‌నాథ్ కోవింద్
3) నరేంద్ర మోదీ
4) నిర్మలా సీతారామన్
- View Answer
- సమాధానం: 3
21. కజక్ - ఇండియన్ ఇన్వెస్ట్మెంట్ ఫోరం ఎక్కడ జరిగింది?
1) అల్మటీ, కజకిస్తాన్
2) అహ్మదాబాద్ గుజరాత్
3) న్యూఢిల్లీ, భారత్
4) నూర్- సుల్తాన్ కజకిస్తాన్
- View Answer
- సమాధానం: 2
22.ఇంగ్లండ్‌కు చెందిన సేవ్ ది చిల్డ్రన్ అనే స్వచ్ఛంద సంస్థ విడుదల చేసిన ‘3వ ఎండ్ ఆఫ్ చైల్డ్‌హుడ్ ఇండెక్స్ 2019’లో అగ్రస్థానం దక్కించుకున్న దేశం?
1) సింగపూర్
2) నార్వే
3) స్వీడన్
4) ఫిన్లాండ్
- View Answer
- సమాధానం: 1
23.ఇంగ్లండ్‌కు చెందిన సేవ్ ది చిల్డ్రన్ అనే స్వచ్ఛంద సంస్థ విడుదల చేసిన ‘3వ ఎండ్ ఆఫ్ చైల్డ్‌హుడ్ ఇండెక్స్ 2019’లో భారత్ ర్యాంక్?
1) 119
2) 117
3) 115
4) 113
- View Answer
- సమాధానం: 4
24.సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల - జీ 20 ఆర్థిక మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది?
1) న్యూఢిల్లీ, భారత్
2) ఫుకుయోకా, జపాన్
3) బీజింగ్, చైనా
4) వాషింగ్టన్ డి.సి., యూఎస్ఏ
- View Answer
- సమాధానం: 2
25. మహాత్మా గాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని ఏ దేశంలోని భారత రాయబార కార్యాలయం ‘గాంధీ సైకిల్ ర్యాలీ ఫర్ పీస్’ ను నిర్వహించింది?
1) సౌదీ అరేబియా
2) ఇరాన్
3) యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్
4) ఖతార్
- View Answer
- సమాధానం: 1
26.2వ గ్లోబల్ డిస్‌ఎబిలిటీ సమ్మిట్ ఎక్కడ జరిగింది?
1) టోక్యో, జపాన్
2) న్యూఢిల్లీ, భారత్
3) బీజింగ్, చైనా
4) బ్యూనస్ ఎయిరీస్, అర్జెంటినా
- View Answer
- సమాధానం: 4
27. 2019-20, 2వ బైమంత్లీ మానిటరీ పాలసీ రేట్ల ప్రకారం సవరించిన రెపో రేటు?
1) 6.00%
2) 5.25%
3) 5.50%
4) 5.75%
- View Answer
- సమాధానం: 4
28. ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) అంచనా ప్రకారం భారత జీడీపీ వృద్ధిరేటు?
1) 7.5%
2) 7.4%
3) 7.3%
4) 7.0%
- View Answer
- సమాధానం: 4
29. ఆర్బీఐ ఇటీవల ఏ విధమైన ఆన్లైన్ లావాదేవీల ఛార్జీలను రద్దు చేసింది?
1) ఎన్ఈఎఫ్టీ (నెఫ్ట్) - ఆర్టీజీఎస్
2) ఆర్టీజీఎస్ - ఐఎంపీఎస్
3) ఐఎంపీఎస్ - ఈసీఎస్
4) ఈసీఎస్ - ఆర్టీజీఎస్
- View Answer
- సమాధానం: 1
30. వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ నుంచి విద్యుత్‌ను అందుకున్న తొలి భారత మెట్రో ప్రాజెక్ట్‌గా ఆవిర్భవించినది?
1) కోల్‌కత మెట్రో రైల్ కార్పోరేషన్
2) ముంబై మెట్రో ైరైల్ కార్పోరేషన్
3) ఢిల్లీ మెట్రో రైల్కార్పోరేషన్
4) చెన్నై మెట్రో ైరైల్ కార్పోరేషన్
- View Answer
- సమాధానం: 3
31. 300 కోట్ల రూపాయల విలువ చేసే 100 స్పైస్ బాంబుల సరఫరా కోసం భారత వాయుసేన(ఐఏఎఫ్)తో ఒప్పందం కుదుర్చుకున్న దేశం?
1) అమెరికా
2) బంగ్లాదేశ్
3) రష్యా
4) ఇజ్రాయిల్
- View Answer
- సమాధానం: 4
32. అమెరికాకు చెందిన బహుళజాతి బ్యాంక్, గోల్డ్‌మన్ సాచ్స్ ప్రకారం 2019-20 ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి రేటు?
1) 7.1 %
2) 7.2 %
3) 7.4 %
4) 7.5 %
- View Answer
- సమాధానం: 2
33.అంతర్జాతీయ ద్రవ్య నిధి, జీ-20 సర్వీలెన్స్ నోట్ ప్రకారం 2019లో భారత ఆర్థికాభివృద్ధి శాతం?
1) 7.1%
2) 7.2%
3) 7.3%
4) 7.5%
- View Answer
- సమాధానం: 3
34. ‘ఇనోప్లోట్రూప్స్ తవన్జెనిసిస్’ అనే కొత్త జాతి పేడపురుగును ఎక్కడ కనుగొన్నారు?
1) మేఘాలయ
2) హిమాచల్‌ప్రదేశ్
3) అరుణాచల్ ప్రదేశ్
4) మధ్యప్రదేశ్
- View Answer
- సమాధానం: 3
35. పసుపు సముద్రం(ఎల్లో సీ)లోని సెమీ సబ్మర్సిబుల్ బార్జ్ నుంచి తొలిసారిగా అంతరిక్షంలోకి ‘లాంగ్ మార్చ్ 11 రాకెట్’ను ప్రయోగించిన దేశం?
1) రష్యా
2) అమెరికా
3) జపాన్
4) చైనా
- View Answer
- సమాధానం: 4
36. సైన్స్ ట్రాన్స్లేషనల్ మెడిసిన్‌లో ప్రచురితమైన నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ శాస్త్రవేత్తలు, సహోద్యోగుల అధ్యయనం ప్రకారం నిఫా వైరస్‌ను నయం చేయగల ప్రయోగదశలో ఉన్న ఎబోలా డ్రగ్ పేరు?
1) వలాసీక్లోవిర్
2) ఫామ్సీక్లోవిర్
3) రెమ్డీసివిర్
4) ఎసైక్లోవిర్
- View Answer
- సమాధానం: 3
37. హైపర్సోనిక్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ వెహికల్(హెచ్ఎస్టీడీవీ)ను విజయవంతంగా ఎక్కడ ప్రయోగించారు?
1) బెంగళూరు
2) విశాఖపట్నం
3) ఒడిశా
4) తిరువనంతపురం
- View Answer
- సమాధానం: 3
38. పార్లమెంటరీ వ్యవహారాలపై కొత్తగా ఏర్పాటుచేసిన కేబినేట్ కమిటీకి ఎవరు నాయకత్వం వహిస్తారు?
1) రాజ్‌నాథ్ సింగ్
2) నిర్మలా సీతారామన్
3) రాంవిలాస్ పాశ్వాన్
4) నరేందర్ సింగ్ తోమర్
- View Answer
- సమాధానం: 1
39. 2019 జూన్ 30న పదవీ విరమణ చేయనున్న అజీం ప్రేమ్‌జీ ఏ సంస్థ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్?
1) లార్సన్ - టుబ్రో
2) విప్రో
3) ఇన్ఫోసిస్
4) హెచ్‌సీఎల్ టెక్నాలజీస్
- View Answer
- సమాధానం: 2
40. 4 ఏళ్ల కాలానికి నియమితులైన మధ్యంతర సెంట్రల్ విజిలెన్స కమిషనర్ (సీవీసీ)?
1) సందీప్ కాంత్ శర్మ
2) హరీశ్ కుమార్ శర్మ
3) వి. సంతోష్ చౌదరి
4) శరద్ కుమార్
- View Answer
- సమాధానం: 4
41. అరుణ్‌జైట్లీ తర్వాత రాజ్యసభ నాయకుడిగా ఎవరు ఎన్నికయ్యారు?
1) థావర్‌చంద్ గెహ్లాట్
2) రాంవిలాస్ పాశ్వాన్
3) నరేంద్ర సింగ్ తోమర్
4) రవిశంకర్ ప్రసాద్
- View Answer
- సమాధానం: 1
42. 17వ లోక్‌సభ ప్రొటెం స్పీకర్ ఎవరు?
1) శ్రీపాద యశో నాయక్
2) కిరణ్ రిజీజు
3) కృషన్ పాల్
4) వీరేంద్ర కుమార్
- View Answer
- సమాధానం: 4
43. ‘క్యాంటర్ ఫిట్జరాల్డ్ యూ21 ఇంటర్నేషనల్ 4 నేషన్స్ టైటిల్’ను గెలుచుకున్నదిఏ దేశ జూనియర్ మహిళా హాకీ జట్టు?
1) భారత్
2) ఐర్లాండ్
3) అమెరికా
4) దక్షిణాఫ్రికా
- View Answer
- సమాధానం: 1
44.భారత్ మాజీ కెప్టెన్ బైచుంగ్ భూటియా కంటే అధికంగా మోస్ట్ క్యాప్డ్ ఫుట్‌బాల్ క్రీడాకారుడిగా పేరు తెచ్చుకున్న క్రీడాకారుడు?
1) సందేశ్ ఝింగన్
2) సునీల్ ఛత్రీ
3) బల్వంత్ సింగ్
4) ఉదాంత సింగ్
- View Answer
- సమాధానం: 2
45.2019 జూన్ 8న జరుపుకున్న ప్రపంచ మహాసముద్రాల దినం నేపథ్యం?
1) ఎంకరేజింగ్ సొల్యూషన్స్ ఫర్ ఎ హెల్తీ ఓషన్
2) ప్రివెంటింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్
3) జెండర్ అండ్ ది ఓషన్
4) అవర్ ఓషన్స , అవర్ రెస్పాన్సబిలిటీ
- View Answer
- సమాధానం: 3
46.2019 వరల్డ్ డే ఎగెనెస్ట్ ఛైల్డ్ లేబర్(డబ్ల్యూడీఏసీఎల్) నేపథ్యం?
1) ది ఎండ్ ఆఫ్ ఛైల్డ్ లేబర్- విథిన్ రీచ్
2) ఇన్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ డిజాస్టర్స్ ప్రొటెక్ట్ చిల్డ్రన్ ఫ్రం ఛైల్డ్ లేబర్
3) జనరేషన్ సేఫ్ - హెల్తీ
4) చిల్డ్రన్ షుడ్‌నాట్ వర్క్ ఇన్ ఫీల్డ్స్, బట్ ఆన్ డ్రీమ్స్
- View Answer
- సమాధానం: 4
47. ఫోర్బ్స్ మేగ్జైన్ ప్రకారం ప్రపంచంలో తొలి బిలియనీర్ రాపర్ ఎవరు?
1) స్నూప్ డాగ్
2) కాన్యే వెస్ట్
3) ఎమినెమ్
4) జే-జెడ్
- View Answer
- సమాధానం: 4
48. 40వేల డాలర్ల ఉమెన్స్ ప్రైజ్ ఫర్ ఫిక్షన్ అందుకున్న ‘యాన్ అమెరికన్ మ్యారేజ్’ నవలా రచయిత్రి?
1) టయారీ జోన్స్
2) టోనీ మారిసన్
3) అలీస్ వాకర్
4) డోనా టర్ట్
- View Answer
- సమాధానం: 1
49. భూతాపానికి వ్యతిరేకంగా పోరాడినందుకు ఆమ్నెస్టీ హ్యూమన్ రైట్స్ అవార్డు - ‘అంబాసిడర్ ఆఫ్ కాన్సైన్స్’ పొందింది?
1) గ్రీటా తున్బ్ర్గ్
2) లిటియా బలీయల్వుకా
3) మారినెల్ ఉబాల్డో
4) జామీ మార్గోలిన్
- View Answer
- సమాధానం: 1
50.తొలిసారిగా రాష్ట్రపతి సువర్ణ కమలం పురస్కారాన్ని అందుకున్న కన్నడ చలనచిత్రం?
1) అపురూప
2) సందర్భ
3) వంశవృక్ష
4) సంస్కార
- View Answer
- సమాధానం: 4