కరెంట్ అఫైర్స్ ( జూలై 9 - 16) బిట్ బ్యాంక్
1. ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రదానం చేసే ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా ఫర్ కమ్యూనిటీ వర్క్ పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు ?
1) గురుస్వామి జైరామన్
2) రఘునాధరావు ముశ్చర్ల
3) శ్రీధరన్ ఎడప్పాడి
4) రాజేంద్ర మారన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: భారత సంతతికి చెందిన గురుస్వామి జైరామన్(ఢిల్లీ) ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రదానం చేసే అత్యున్నత పురస్కారం ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా ఫర్ కమ్యూనిటీ వర్క్ పురస్కారానికి ఎంపికయ్యారు.
- సమాధానం: 1
2. కలుషిత నీటితో వ్యవసాయం చేస్తున్న దేశాలలో తొలి స్థానంలో ఉన్న దేశం ఏది ?
1) భారత్
2) ఇరాన్
3) మెక్సికో
4) చైనా
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఎన్విరాన్మెంటల్ రీసర్చ్ లెటర్స్‌లో ప్రచురితమైన జర్నల్ ప్రకారం.. చైనా, భారత్, పాకిస్తాన్, మెక్సికో, ఇరాన్లలో కలుషిత నీటితో పంటలను పండిస్తున్నారు. అలాగే.. ఆయా దేశాల పట్టణాల నుంచి దిగువ ప్రాంతాలకు ప్రవహిస్తున్న వ్యర్థ జలాలతో సాగు అవుతున్న పంటలు గతంలో అంచనాల కన్నా 50 శాతం పెరిగాయి. జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేటిక్ సిస్టమ్స్(జీఐఎస్) ద్వారా పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు. అలాగే.. ఈ తరహాలోని సాగు విస్తీర్ణంలో 65 శాతం పట్టణాలకు దిగువన 40 కి లోమీటర్ల పరిధిలోనే ఉన్నాయి.
- సమాధానం: 4
3. దేశంలో తొలిసారిగా దళితుల కోసం ప్రత్యేక యూనివర్సిటీని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?
1) కోయంబత్తూరు
2) మెహూ
3) హైదరాబాద్
4) కత్గూన్
- View Answer
- సమాధానం: 3
వివరణ: తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ విద్యా సంస్థల సొసైటీ (TSWREIS) ప్రతిపాదనల మేరకు కేజీ నుంచి పీజీ విద్యా విధానంలో భాగంగా హైదరాబాద్‌లో దేశంలోనే తొలిసారిగా దళితుల కోసం ప్రత్యేక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు.
- సమాధానం: 3
4. దేశంలో అత్యధిక భూసార కార్డులను జారీ చేసిన రాష్ట్రం ఏది ?
1) తెలంగాణ
2) ఛత్తీస్‌గఢ్
3) మహారాష్ట్ర
4) ఆంధ్రప్రదేశ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: గత రెండేళ్లలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వం 43 లక్షల భూసార కార్డులను జారీ చేసింది.
- సమాధానం: 2
5. ఏ దేశంలో ఆయిల్ బ్లాక్‌ల అన్వేషణ కోసం ఓఎన్జీసీ విదేశ్కు అనుమతి లభించింది ?
1) మలేషియా
2) వియత్నాం
3) ఇండోనేషియా
4) న్యూజిలాండ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: వివాదాస్పద ''U'' ఆకారంలోని 9 డాష్లైన్ ప్రాంతాల్లో చమురు నిల్వల అన్వేషణకు వియత్నాం నుంచి 2 ఏళ్ల కాలానికి ఓఎన్జీసీ విదేశ్ అనుమతి పొందింది.
- సమాధానం: 2
6. భారత్, బంగ్లాదేశ్‌లను కలుపుతు ఏ నదిపై వారధిని నిర్మించనున్నారు ?
1) Khawthlang tuipui
2) teesta
3) feni
4) bramhaputra
- View Answer
- సమాధానం: 1
వివరణ: భారత్, బంగ్లాదేశ్‌లను కలుపుతూ మొత్తం 54 నదులు ప్రవహిస్తున్నాయి. అందులో పెద్దవి గంగా, బ్రహ్మపుత్ర, తీస్తా, ఫెని. మిజోరం వద్ద గల Khawthlang tuipui నదిపై భారత్, బంగ్లాదేశ్‌లను కలుపుతు వంతెన నిర్మించనున్నారు.
- సమాధానం: 1
7. ఆసియా - పసిఫిక్ ప్రాంతంలో తొలి డిజిటల్ హబ్‌ను ఒరాకిల్ సంస్థ ఎక్కడ ఏర్పాటు చేయనుంది ?
1) బీజింగ్
2) సింగపూర్
3) హాంకాంగ్
4) బెంగళూరు
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఒరాకిల్ సంస్థ ఆసియా - పసిఫిక్ ప్రాంతంలో 5 డిజిటల్ హబ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. వీటిలో తొలి హబ్ బెంగళూరులో ఏర్పాటు కానుంది.
- సమాధానం: 4
8. ఇటీవల ఏ సంస్థ ప్రధానమంత్రి ఉత్తమ పనితీరు పురస్కారానికి ఎంపికైంది ?
1) రిలయన్స్ ఇండస్ట్రీస్
2) టాటాస్టీల్
3) విప్రో హెల్త్ సెన్సైస్
4) మహింద్రా డిఫెన్స్
- View Answer
- సమాధానం: 2
వివరణ: 2014-15, 2015-16 మధ్య కాలంలో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు గాను ప్రధానమంత్రి పురస్కారానికి టాటా స్టీల్ ఎంపికైంది. ఈ పురస్కారాన్ని 12 సార్లు అందుకున్న ఏకైక సంస్థ టాటా స్టీల్.
- సమాధానం: 2
9. ఆగ్నేయాసియా ప్రాంతంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సౌహార్థ రాయబారిగా ఎవరు నియమితులయ్యారు ?
1) సైమా వాజీద్ హుస్సేన్
2) శాంతా సిన్హా
3) రైమా మహమ్మద్
4) మల్లెకా హుస్సేన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఆగ్నేయాసియాలో ఆటిజంపై అవగాహన కల్పించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ బంగ్లాదేశ్‌కు చెందిన సామాజిక వేత్త సైమా వాజీద్ హుస్సేన్‌ను సౌహార్థ రాయబారిగా నియమించింది.
- సమాధానం: 1
10. దక్షిణ ఆస్ట్రేలియా స్వ్కాష్ ఓపెన్ టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు ?
1) రామ్స్ అషార్
2) జేమ్స్ విల్స్ప్ట్
3) హరిందర్ సంధు
4) హషీమ్ ఖాన్
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఆస్ట్రేలియాలోని ఆడిలైడ్‌లో జరిగిన దక్షిణ ఆస్ట్రేలియా స్క్వాష్ ఓపెన్ టైటిల్‌ను హరిందర్ పాల్ సంధు గెలుచుకున్నాడు.
- సమాధానం: 3
11. యూనిలీవర్ గ్లోబల్ డెవలప్మెంట్ పురస్కారానికి ఎంపికైన సంస్థ ఏది ?
1) సైమా
2) వాటర్ హెల్త్ ఇంటర్నేషనల్
3) బిసీసీఐ
4) ముంబయి నగరపాలక సంస్థ
- View Answer
- సమాధానం: 2
వివరణ: అమెరికాకు చెందిన వాటర్ హెల్త్ ఇంటర్నేషనల్ సంస్థ యూనీలీవర్ గ్లోబల్ డెవలప్మెంట్ పురస్కారానికి ఎంపికైంది.
- సమాధానం: 2
12. ఇటీవల ఎన్ని దేశాలు అణు ఆయుధాలపై నిషేధం చేస్తూ ఒక ఒప్పందానికి వచ్చాయి ?
1) 100
2) 105
3) 115
4) 122
- View Answer
- సమాధానం: 4
వివరణ: అణు ఆయుధాల వ్యాప్తిని అడ్డుకోవడం, ఉన్న అణు ఆయాధాలను నాశనం చేయాలంటూ 122 దేశాలు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. అయితే అణు ఆయుధాలు కలిగిన అమెరికా, రష్యా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, భారత్, పాకిస్తాన్, ఉత్తర కొరియా, ఇజ్రాయెల్ ఈ సమావేశానికి హాజరుకాలేదు. అలాగే నెదర్లాండ్స్ మినహా నాటోలోని మిగతా సభ్య దేశాలు ఈ సమావేశాన్ని బహిష్కరించాయి. 50 దేశాల పార్లమెంట్ల ఆమోదం పొందితే.. ఈ ఒప్పందం అమల్లోకి వస్తుంది.
- సమాధానం: 4
13. తొలి అంతర్జాతీయ ఏవియేషన్ భద్రతా సెమినార్‌ను ఎక్కడ నిర్వహించారు ?
1) బీజింగ్
2) మనేసర్
3) అమృత్సర్
4) సింగపూర్
- View Answer
- సమాధానం: 2
వివరణ: జాతీయ భద్రతా గార్డు ఆధ్వర్యంలో హర్యానాలోని మనేసర్‌లో తొలి అంతర్జాతీయ ఏవియేషన్ భద్రతా సెమినార్‌ను నిర్వహించారు.
- సమాధానం: 2
14. 12వ జీ 20 సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు ?
1) పారిస్
2) మాస్కో
3) హాంబర్గ్
4) కాలిఫోర్నియా
- View Answer
- సమాధానం: 3
వివరణ: జర్మనీలోని హాంబర్గ్‌లో 12వ జీ-20 సమావేశం జరిగింది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు చెందిన మహిళా వ్యవస్థాపకులను ప్రోత్సహించేందుకు 1 బిలియన్ డాలర్ల ప్రణాళికను ఈ సమావేశంలో తయారు చేశారు.
2017 Theme : Shaping an Inter - connected world
- సమాధానం: 3
15. GQ అత్యంత ప్రభావ శీలురైన యువ భారతీయుడు - 2017 అవార్డుకి ఎవరు ఎంపికయ్యారు ?
1) ప్రభాస్
2) మహేశ్ బాబు
3) విక్కీ కౌశల్
4) పవన్ కల్యాణ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: GQ - Gentlemens Quarterly అనే అంతర్జాతీయ మాసపత్రిక, భారత దేశంలో అత్యంత ప్రభావశీలురైన యువ భారతీయులు - 2017గా టాలీవుడ్ నటుడు ప్రభాస్, బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ ను ఎంపిక చేసింది.
- సమాధానం: 1
16. అతి చిన్న వయసులో లేడీస్ యూరోపియన్ గోల్ఫ్ టూర్ టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు ?
1) అనా మెనెందర్
2) అత్తయ తిధికుల్
3) లిడియాకో
4) అదితి చోప్రా
- View Answer
- సమాధానం: 2
వివరణ: లేడీస్ యూరోపియన్ గోల్ఫ్ టూర్‌ను థాయ్‌లాండ్‌లో నిర్వహించారు. ఈ టోర్నీ ఫైనల్లో అనా మెనెందర్ను ఓడించి అత్తయ తిధికల్ టైటిల్‌ను గెలుచుకుంది. తద్వారా అతి చిన్న వయసులో(14 సంవత్సరాల 4 నెలల 19 రోజులు)ఈ టైటిల్‌ను గెలుచుకున్న క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది.
- సమాధానం: 2
17. దీరూభాయ్ అంబాని ఏరోస్పేస్ పార్క్‌ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?
1) గాంధీనగర్
2) అహ్మదాబాద్
3) మౌవ్
4) నాగ్‌పూర్
- View Answer
- సమాధానం: 4
వివరణ: ధీరూబాయ్ అంబాని ఏరోస్పేస్ పార్క్‌ను నాగ్‌పూర్‌లోని మీహన్ సెజ్‌లో ఏర్పాటు చేయనున్నారు. ఈ పార్కు 289 ఎకరాలలో విస్తరించి ఉంది. ఇది దేశంలో అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ ఎరోస్పేస్ పార్క్. ఇందులో రూ.6,500 కోట్ల పెట్టుబడితో 10 వేల మందికి ఉపాధి ఇస్తారు.
- సమాధానం: 4
18. ప్రపంచ ఆహార ఇండియా - 2017 ప్రదర్శనను ఎక్కడ నిర్వహించనున్నారు ?
1) న్యూఢిల్లీ
2) హైదరాబాద్
3) తిరువనంతపురం
4) అలహాబాద్
- View Answer
- సమాధానం: 1
వివరణ: కేంద్ర ప్రభుత్వం నవంబర్‌లో ప్రపంచ ఆహార ఇండియా - 2017 ప్రదర్శనని న్యూఢిల్లీలో నిర్వహించనుంది. భారత ఆహార తయారీ పరిశ్రమను అభివృద్ధి చేయడం ఈ కార్యక్రమ ఉద్దేశం.
- సమాధానం: 1
19. ఐక్యరాజ్య సమితి ఏ వ్యాధికి నూతన ఔషధాన్ని కనుగొనాలని ఇటీవల సూచించింది ?
1) ఎయిడ్స్
2) సార్స్
3) గనేరియా
4) తట్టు
- View Answer
- సమాధానం: 3
వివరణ: ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం 80 మిలియన్ల ప్రజలు ఏటా గనేరియా బారిన పడుతున్నారు. ఈ వ్యాధి గర్భవతి నుంచి పుట్టబోయే బిడ్డకు సోకి అంధత్వం ఏర్పడుతుంది.
- సమాధానం: 3
20. ఇటీవల గ్రాండ్ ట్రంక్ రోడ్ ప్రాజెక్టుని ప్రారంభించిన దేశం ఏది ?
1) భారత్
2) చైనా
3) యునెటైడ్ కింగ్డమ్
4) పాకిస్తాన్
- View Answer
- సమాధానం: 3
వివరణ: భారతదేశ విభజన జరిగి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బ్రిటీష్ ప్రభుత్వం (యూకే) గ్రాండ్ ట్రంక్ రోడ్ ప్రాజెక్టుని ప్రారంభించింది. బ్రిటిష్ జాతికి చెందిన ఆసియన్లను ఒకే తాటిపైకి తీసుకురావటం ఈ ప్రాజెక్టు లక్ష్యం.
- సమాధానం: 3
21. ఇటీవల భారత్ తొలిసారిగా ఏ దేశం నుంచి ముడి చమురు కొనుగోలు చేయనుంది ?
1) ఇరాన్
2) వియత్నాం
3) వెనెజులా
4) అమెరికా
- View Answer
- సమాధానం: 4
వివరణ: భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా అమెరికా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటున్నట్లు ఐవోసీ డెరైక్టర్ ఏకే శర్మ ప్రకటించారు.
- సమాధానం: 4
22. ఆసియాన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ - 2017లో అత్యధిక పతకాలు గెలుచుకున్న దేశం ఏది ?
1) భారత్
2) చైనా
3) ఖజకిస్తాన్
4) ఇరాన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో జరిగిన 22వ ఆసియాన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో చైనాను వెనక్కు నెట్టి భారత్ పతకాల పట్టికలో తొలి స్థానంలో నిలిచింది. ఈ పోటీల్లో భారత్ 12 బంగారం, 5 వెండి, 12 కాంస్య పతకాలు గెలుచుకుంది. చైనా రెండో స్థానంలో నిలిచింది.
- సమాధానం: 1
23. ప్రతిష్టాత్మక ఆస్ట్రియన్ గ్రాండ్ ప్రీ టైటిల్ విజేత ఎవరు ?
1) డేనియల్ రిక్కీ యార్డో
2) సెబాస్టియన్ వెటెల్
3) లూయిస్ హామిల్టన్
4) వెల్టొరి బొటాస్
- View Answer
- సమాధానం: 4
వివరణ: అజర్ బైజాన్ రాజధాని బాకులో ఈ రేసుని నిర్వహించారు.
- సమాధానం: 4
24. ఇటీవల ఏ వస్తువును మేధో సంపత్తిగా గుర్తించడం జరిగింది?
1) పోచంపల్లి ఇక్కత్
2) గద్వాల జరి
3) మదర్ థెరిసా ధరించిన నీలి రంగు అంచు చీర
4) కంచిపట్టు
- View Answer
- సమాధానం: 3
వివరణ: మదర్ థెరిసా ధరించిన నీలి రంగు అంచు చీరను మిషనరీస్ ఆఫ్ చారిటీస్‌కు చెందిన మేధో సంపత్తికి చెందిన వస్తువుగా ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రీ గుర్తించింది. ఇలా ఒక యూనిఫాంకు మేధో సంపత్తి హక్కులు రావడం ఇదే తొలిసారి.
- సమాధానం: 3
25. ప్రతిష్టాత్మక మారుతి సుజుకి ఈ సంవత్సరపు ఉత్తమ క్రీడాకారుడు పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు ?
1) సైనా నెహ్వాల్
2) పీవీ సింధు
3) సానియా మీర్జా
4) లియాండర్ పేస్
- View Answer
- సమాధానం: 2
వివరణ: మారుతి సుజుకి స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ ఛారిటీ గాలా పురస్కారాలలో ఉత్తమ క్రీడాకారిణిగా పీవీ సింధు ఎంపికైంది.
- సమాధానం: 2
26. పర్యావరణ నిర్వహణకు గాను ఇటీవల ఏ సంస్థ గోల్డెన్ పీకాక్ పురస్కారం పొందింది ?
1) రాజా స్టీల్స్
2) డాన్‌ఫాస్ ఇండియా
3) రికో ఇండియా
4) కొకకోలా ఇండియా
- View Answer
- సమాధానం: 2
వివరణ: వాతావరణ, ఇంధన సామర్థ్య కంపెనీ డాన్‌ఫాస్ పర్యావరణ నిర్వహణకు గాను గోల్డెన్ పీకాక్ పురస్కారం పొందింది. 19వ ప్రపంచ వాతావరణ నిర్వహణ సమావేశంలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు.
- సమాధానం: 2
27. ఇటీవల ఈ-ఆర్టీఐని ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది ?
1) తెలంగాణ
2) కర్ణాటక
3) తమిళనాడు
4) ఢిల్లీ
- View Answer
- సమాధానం: 4
వివరణ: దేశంలో ఈ - ఆర్టీఐని ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం మహారాష్ట్ర(2015). ప్రతి రాష్ట్రం ఈ - ఆర్టీఐ కోసం ప్రత్యేక పోర్టల్‌ను ఏర్పాటు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఇందులో భాగంగా 2017 జూలైలో ఢిల్లీ ఈ - ఆర్టీఐని ప్రవేశపెట్టి.. ఈ విధానాన్ని తీసుకొచ్చిన రెండో రాష్ట్రంగా నిలిచింది.
- సమాధానం: 4
28. OECP-FAO వ్యవసాయ నివేదిక 2017-2026 ప్రకారం ఏ సంవత్సరం లోపు భారత్ పాల ఉత్పత్తిలో తొలి స్థానంలో ఉంటుంది ?
1) 2026
2) 2024
3) 2022
4) 2020
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఈ నివేదిక ప్రకారం 2026 నాటికి ప్రపంచ పాల ఉత్పత్తిలో భారత్ తొలి స్థానంలో ఉంటుంది. అలాగే ప్రపంచ జనాభా 7.3 నుంచి 8.2 బిలియన్లకు చేరుకుంటుంది. 2026 లోపు భారత్ జనాభా 1.5 బిలియన్లకు చేరుకుంటుంది.
OECP- Organisation for economic cooperation and development
- సమాధానం: 1
29. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ దక్షిణ భారత శాఖను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?
1) సేలం
2) మంగళూరు
3) కొండపావులూరు
4) చింతమానుగావి
- View Answer
- సమాధానం: 3
వివరణ: ప్రస్తుతం ఢిల్లీలో మాత్రమే నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ - ఎన్డీఆర్ఎఫ్ ప్రధాన కార్యాలయం ఉంది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం - 2014 ప్రకారం కృష్ణా జిల్లాలోని కొండపావులూరులో ఎన్డీఆర్ఫ్ దక్షిణ భారత శాఖను కేంద్రం ఏర్పాటు చేయనుంది.
- సమాధానం: 3
30. ఇటీవల హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్‌ను ఏ రెండు ప్రాంతాల మధ్య ప్రారంభించారు ?
1) కోయంబత్తూరు - నాగర్ కోయిల్
2) భువనేశ్వర్ - కృష్ణ రాజపురం
3) విజయవాడ - పుదుచ్చేరి
4) బెంగళూరు - కర్నూలు
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఒడిశాలోని భువనేశ్వర్ నుంచి కర్ణాటకలోని కృష్ణా రాజపురం వరకు నూతన హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు. ఈ రైలు ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రయాణిస్తుంది.
- సమాధానం: 2
31. తెలంగాణ సాహిత్య అకాడమీ లోగోని ఎవరు రూపొందించారు ?
1) రవిశంకర్
2) ఎం.వి. రమణారెడ్డి
3) ఏలె లక్ష్మణ్
4) పెరుమాళ్ల సతీశ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: తెలంగాణ సాహిత్య అకడామీ లోగోని సిద్ధిపేటకు చెందిన ప్రముఖ చిత్రకారుడు ఎం.వి. రమణారెడ్డి రూపొందించారు.
- సమాధానం: 2
32. తెలంగాణలో ప్రజా ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా ప్రారంభించిన వ్యవస్థ పేరు ఏమిటి ?
1) ప్రజాహిత
2) జనహిత
3) పరిష్కారం
4) వినతి
- View Answer
- సమాధానం: 2
వివరణ: ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ, సంక్షేమ పథకాల దరఖాస్తుల స్వీకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం జనహిత పేరుతో ప్రత్యేక వ్యవస్థను ప్రారంభించింది. మొదట ప్రయోగాత్మకంగా సూర్యాపేట జిల్లాలో దీన్ని ప్రారంభించింది.
- సమాధానం: 2
33. డాక్టర్ దాశరథి పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు ?
1) ఎన్. గోపి
2) ఎన్. శంకర్
3) బండి సత్యనారాయణ
4) మల్లేపల్లి లక్ష్మయ్య
- View Answer
- సమాధానం: 1
వివరణ: తెలంగాణ ప్రభుత్వం ప్రదానం చేసే దాశరథి పురస్కారానికి ప్రముఖ కవి ఆచార్య ఎన్.గోపి ఎంపికయ్యారు. ఈ అవార్డు కింద రూ.1,01,116 నగదు, జ్ఞాపిక, ప్రశంసా పత్రం ప్రదానం చేస్తారు.
- సమాధానం: 1
34. జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఇటీవల ఏ వస్తువులపై నిషేధం విధించింది ?
1) బొగ్గుతో తయారు చేసే యూరియా
2) సింథటిక్ రబ్బర్
3) సింథటిక్ రంగులు
4) నైలాన్ మరియు సింథటిక్ మాంజా
- View Answer
- సమాధానం: 4
వివరణ: సింథటిక్ మాంజాల వల్ల పక్షులు, జంతువులు, మనుషుల మరణాల సంభవిస్తున్నందున వాటి వాడకాన్ని జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ నిషేధించింది.
- సమాధానం: 4
35. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
1) జూలై 11
2) జూలై 13
3) జూలై 15
4) జూలై 19
- View Answer
- సమాధానం: 1
వివరణ: అధిక జనాభా వల్ల నష్టాలు, ఎదురయ్యే ఇబ్బందులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏటా జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహించుకోవాలని UNDP 1989లో తీర్మానించింది.
- సమాధానం: 1
36. ఇటీవల ఏ భారతీయ నగరంను ప్రపంచ వారసత్వ నగరంగా యునెస్కో ప్రకటించింది ?
1) న్యూఢిల్లీ
2) ముంబయి
3) అహ్మదాబాద్
4) హైదరాబాద్
- View Answer
- సమాధానం: 3
వివరణ: భారత్‌లో తొలి ప్రపంచ వారసత్వ నగరంగా అహ్మదాబాద్ ఇటీవల గుర్తింపు పొందింది. ఇప్పటి వరకు ప్రపంచంలో పారిస్, కైరో, ఎడిన్బర్గ్, బక్త్పూర్(నేపాల్), గాలే(శ్రీలంక) నగరాలు ఈ జాబితాలో చోటు పొందాయి.
అహ్మద్ షా 15వ శతాబ్దంలో అహ్మదాబాద్‌ను నిర్మించారు.
- సమాధానం: 3
37. కొపరేటివ్ సొసైటీలో సభ్యులుగా ఎంపిక కావడానికి కనీస విద్యార్హత నిర్ణయించిన తొలి రాష్ట్రం ఏది ?
1) రాజస్తాన్
2) తెలంగాణ
3) ఆంధ్రప్రదేశ్
4) ఒడిశా
- View Answer
- సమాధానం: 1
వివరణ: రాజస్తాన్ రాష్ట్రంలో 10 వేల కొపరేటివ్ సొసైటీలు, వ్యవసాయ పరపతి సంఘాలు ఉన్నాయి.
- సమాధానం: 1
38. భారత క్రికెట్ జట్టు నూతన బౌలింగ్ కోచ్‌గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) జహీర్‌ఖాన్
2) జవగల్ శ్రీనాథ్
3) భరత్ అరుణ్
4) శ్రీకాంత్
- View Answer
- సమాధానం: 3
వివరణ: బీసీసీఐ భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా రవి శాస్త్రిని, బౌలింగ్ కోచ్‌గా భరత్ అరుణ్‌ని నియమించింది. రాహుల్ ద్రవిడ్ ఇండియా - ఏ, అండర్ - 19 జట్లకు కోచ్‌గా నియమితులయ్యారు.
- సమాధానం: 3
39. ఇండియన్ మెటరోలాజికల్ డిపార్ట్మెంట్ తయారు చేసిన డాప్లర్ వాతావరణ రాడార్‌ను ఎక్కడ ఏర్పాటు చేశారు ?
1) మంగళూరు
2) విశాఖపట్నం
3) పారాదీప్
4) కొచ్చి
- View Answer
- సమాధానం: 4
వివరణ: కొచ్చిలో ఏర్పాటు చేసిన డాప్లర్ వాతావరణ రాడార్‌ను కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్థన్ ప్రారంభించారు. దేశంలో ఇలాంటి 50 రాడార్లను ఏర్పాటు చేయనున్నారు. తాగునీటి సమస్యను ముందుగానే గుర్తించి, నివారించడమే దీని ముఖ్య లక్ష్యం.
- సమాధానం: 4
40. అంతర్జాతీయ మలాలా దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు ?
1) జూలై 9
2) జూలై 12
3) జూలై 14
4) జూలై 15
- View Answer
- సమాధానం: 2
వివరణ: పాకిస్తాన్లో బాలిక విద్య కోసం కృషి చేస్తున్న యూసఫ్‌జాయ్ మలాలాపై తాలిబన్ తీవ్రవాదులు దాడి చేశారు. అయినా భయపడని మలాలా తన ప్రయత్నాన్ని వీడలేదు. ఆమె పోరాట పటిమను గుర్తించిన ఐక్యరాజ్య సమితి నోబల్ శాంతి బహుమతిని అందించింది. అలాగే.. ఐరాస శాంతి దూతగా నియమించింది. జూలై 12న ఆమె పుట్టిన రోజుని పురస్కరించుకొని.. ఏటా ఆ రోజుని మలాలా దినోత్సవంగా జరుపుకోవాలని ఐరాస తీర్మానించింది.
- సమాధానం: 2
41. ప్రపంచ యువత నైపుణ్యాల దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
1) జూలై 9
2) జూలై 13
3) జూలై 15
4) జూలై 20
- View Answer
- సమాధానం: 3
వివరణ: 2017 థీమ్ - Skills for the future work
- సమాధానం: 3
42. దేశంలో తొలిసారిగా సంఘ బహిష్కరణకు వ్యతిరేకంగా చట్టం చేసిన రాష్ట్రం ఏది ?
1) మహారాష్ట్ర
2) తెలంగాణ
3) తమిళనాడు
4) మధ్యప్రదేశ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: మహారాష్ట్రలో కుల పంచాయితీల ద్వారా సాంఘిక బహిష్కరణ చేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా నరేంద్ర దొబొల్కర్ ఉద్యమాన్ని చేపట్టారు. అయితే.. కొంత మంది ఉన్మాదులు ఆయనని హత్య చేశారు. ఈ సంఘటన తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా సాంఘిక బహిష్కరణకు వ్యతిరేకంగా ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చింది.
Prohibition of people from social boycott(prevention, prohibition, redressal) act 2016.
- సమాధానం: 1
43. దేశంలో తొలి హైస్పీడ్ రైల్వే శిక్షణ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?
1) హైదరాబాద్
2) విజయవాడ
3) నోయిడా
4) గాంధీనగర్
- View Answer
- సమాధానం: 4
వివరణ: గుజరాత్‌లోని గాంధీనగర్‌లో దేశంలోనే తొలి హైస్పీడ్ ైరె ల్వే శిక్షణ కేంద్రాన్ని రూ.600 వ్యయంతో ఏర్పాటు చేయనున్నారు.
- సమాధానం: 4
44. ఐఎస్ఐఎస్పై పోరాటం చేసేందుకు ఇటీవల ఏ దేశానికి భారత్ ఆర్థిక సహాయం చేసింది ?
1) సిరియా
2) ఫిలిప్పీన్స్
3) లావోస్
4) ఇరాక్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఫిలిప్పీన్స్‌లోని మారావి నగరంలో ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు విధ్వంసం సృష్టించారు. బాధిత ప్రజలకు పునరావాసం కల్పించేందుకు భారత్ 5 లక్షల డాలర్ల ఆర్థిక సాయాన్ని అందజేసింది. దక్షిణాసియాలో ఐసీస్ తన స్థావరాలు ఏర్పాటు చేసుకున్న ఏకైక దేశం ఫిలిప్పీన్స్.
- సమాధానం: 2
45. ఇటీవల స్వలింగ సంపర్కుల వివాహానికి అనుమతి ఇచ్చిన దేశం ఏది ?
1) భారత్
2) మాల్టా
3) ఇరాన్
4) సౌదీ అరేబియా
- View Answer
- సమాధానం: 2
వివరణ: స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టం ప్రకారం అనుమతి ఇచ్చిన 24వ దేశం మాల్టా.
- సమాధానం: 2
46. 22వ ప్రపంచ పెట్రోలియం కాంగ్రెస్ సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు ?
1) ఇస్తాంబుల్
2) బీజింగ్
3) సింగపూర్
4) టెహరాన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ప్రపంచ పెట్రోలియం కౌన్సిల్ ప్రపంచ పెట్రోలియం కాంగ్రెస్ సమావేశాలను 1993 నుంచి నిర్వహిస్తుంది. ప్రస్తుతం ప్రతి 3 ఏళ్లకోసారి ఈ సమావేశాలు జరుగుతున్నాయి.
- సమాధానం: 1
47. ఇటీవల భారత్ ఇండోర్ క్రికెట్ జట్టు రాయబారిగా ఎవరిని నియమించారు ?
1) కపిల్ దేవ్
2) సునిల్ గవాస్కర్
3) శ్రీకాంత్ శర్మ
4) సందీప్ పాటిల్
- View Answer
- సమాధానం: 4
వివరణ: క్రికెట్ ఆస్ట్రేలియా, ఎమిరేట్స్ క్రికెట్ బోర్డ్‌ల భాగస్వామ్యంతో బీసీసీఐ ఇండోర్ కికెట్ టోర్నమెంట్‌ను నిర్వహించనుంది.
- సమాధానం: 4
48. బోర్డ్ ఆఫ్ డెరైక్టర్స్ ఆఫ్ ఇండియన్ బ్రాడ్‌కాస్టర్స్ ఫౌండేషన్‌కు ఇటీవల చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు ?
1) జస్టిస్ విక్రమ్‌జిత్ సేన్
2) జస్టిస్ రూపెన్ వాలా
3) జస్టిస్ నారిమన్
4) జస్టిస్ రామస్వామి చౌదరి
- View Answer
- సమాధానం: 1
వివరణ: దేశంలోని వివిధ ఛానెళ్లలో ప్రసారం అవుతున్న వినోదాత్మక సీరీయ్లలోని కంటెంట్ సంబంధిత ఫిర్యాదులను పరిశీలించేందుకు ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ ఫౌండేష్ను 2011లో ఏర్పాటు చేశారు.
- సమాధానం: 1
49. దేశంలోని ఏ ప్రాంతాన్ని జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ నో డెవలప్మెంట్ జోన్‌గా ప్రకటించింది ?
1) నల్లమల అడవులు
2) తిరుపతి
3) నర్మదానది
4) గంగా పరివాహక ప్రాంతం
- View Answer
- సమాధానం: 4
వివరణ: గంగా నది తీరం నుంచి 100 కిలోమీటర్ల వరకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవద్దంటూ ఇటీవల జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది.
- సమాధానం: 4
50. అంతర్జాతీయ మహిళా క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్ ఎవరు ?
1) సనా మీర్
2) శశికళా శ్రీవర్దనే
3) మిథాలీ రాజ్
4) జూలన్ గోస్వామి
- View Answer
- సమాధానం: 3
వివరణ: అంతర్జాతీయ మహిళల వన్డే క్రికెట్లో 6 వేల పరుగుల పూర్తి చేసిన తొలి ప్లేయర్‌గా భారత మహిళ క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ గుర్తింపు పొందారు.
- సమాధానం: 3