కరెంట్ అఫైర్స్ (జులై 26 - 31, 2019) బిట్ బ్యాంక్
1. 261.97 మెగావాట్ల వ్యవస్థాపిత సామర్థ్యంతో భారతదేశంలో రూఫ్‌టాప్ సోలార్ ప్రాజెక్టుల ఇన్‌స్టాలేషన్‌లో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం?
1) మధ్యప్రదేశ్
2) గుజరాత్
3) మహారాష్ట్ర
4) రాజస్థాన్
- View Answer
- సమాధానం: 2
2. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం – ప్రధాన్‌మంత్రి సురక్షా బీమా యోజన అమలులో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?
1) అసోం
2) గుజరాత్
3) మహారాష్ట్ర
4) ఉత్తరప్రదేశ్
- View Answer
- సమాధానం: 4
3. 2019 జూలై 25–26న భారత త్రివిధ (సైనిక, నౌక, వైమానిక) దళాలు నిర్వహించిన తొలి అనుకరణ అంతరిక్ష యుద్ధ వ్యాయామం పేరు?
1) స్పేస్ఎక్స్
2) ఆర్మ్డ్స్పేస్ఎక్స్
3) ఇండ్స్పేస్ఎక్స్
4) స్పేస్ఎక్సర్
- View Answer
- సమాధానం: 3
4. ప్రింటింగ్, అనుబంధ యంత్రాల హెరిటేజ్ గ్యాలరీని చిత్రీకరించిన తొలి భారతీయ రైల్వే జోన్ ఏది?
1) ఉత్తర రైల్వే
2) మధ్య రైల్వే
3) పశ్చిమ రైల్వే
4) దక్షిణ రైల్వే
- View Answer
- సమాధానం: 3
5.యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రకారం గుర్తింపు పొందని విశ్వవిద్యాలయాలు అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏది?
1) మహారాష్ట్ర
2) ఢిల్లీ
3) ఉత్తరప్రదేశ్
4) కర్ణాటక
- View Answer
- సమాధానం: 3
6. భారత్‌లో విద్యుత్ వాహనాల సవరించిన జీఎస్టీ రేటు?
1) 8%
2) 15%
3) 10%
4) 5%
- View Answer
- సమాధానం: 4
7. భారత్‌లో తొలి వెదురు పారిశ్రామిక పార్కు ఎక్కడ ఏర్పాటు కానుంది?
1) లంబఖేడా, భోపాల్ జిల్లా, మధ్యప్రదేశ్
2) మహుది, గాంధీనగర్ జిల్లా, గుజరాత్
3) మందెర్దిసా, దిమా హాసోవ్ జిల్లా, అసోం
4) బెహ్తా, లక్నవూ, ఉత్తరప్రదేశ్
- View Answer
- సమాధానం: 3
8. కేంద్ర ప్రభుత్వం రెండు రక్షణ పారిశ్రామిక కారిడార్లను ఎక్కడ ఏర్పాటు చేయనుంది?
1) ఉత్తరప్రదేశ్, తమిళనాడు
2) మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్
3) ఉత్తరప్రదేశ్, గుజరాత్
4) గుజరాత్, అసోం
- View Answer
- సమాధానం: 1
9. 2019 డిసెంబర్ 3–8 వరకూ జరగబోయే అంతర్జాతీయ గీతా జయంతి మహోత్సవానికి వేదిక కానున్న నగరం?
1) ముంబై, మహారాష్ట్ర
2) జైపూర్, రాజస్థాన్
3) ఛండీగఢ్, పంజాబ్
4) కురుక్షేత్ర, హరియాణ
- View Answer
- సమాధానం: 4
10. ఎన్ఎస్ఎస్ఓ నిర్వహించిన వ్యవసాయ గృహాల పరిస్థితుల అంచనా సర్వే ప్రకారం అన్ని వనరుల ద్వారా వ్యవసాయ గృహానికి సగటు నెలసరి ఆదాయం ఎంత?
1)రూ. 6,426
2) రూ. 6,326
3) రూ. 6,226
4) రూ. 6,126
- View Answer
- సమాధానం: 1
11. ‘ధర్మ–ధమ్మ సంప్రదాయాలలో సత్–చిత–ఆనంద – మోక్షం’ నేపథ్యంతో ధర్మ–ధమ్మ 5వ ఎడిషన్ సమావేశం ఎక్కడ జరిగింది?
1) డిస్పూర్, అసోం
2) రాజ్‌గిర్, బిహార్
3) భువనేశ్వర్, ఒడిశా
4) రాంచీ, జార్ఖండ్
- View Answer
- సమాధానం: 2
12. భారత్ అంతటా ‘వక్ఫ్ ఆస్తుల 100% డిజిటైజేషన్’ సాధించడానికి ఎన్ని రోజులు లక్ష్యంగా పెట్టుకున్నారు?
1) 45 రోజులు
2) 90 రోజులు
3) 180 రోజులు
4) 100 రోజులు
- View Answer
- సమాధానం: 4
13. సముద్రపు లోతైన మాంద్యాలను అన్వేషించే ‘డీప్ ఓషన్ మిషన్ (డీఓఎం)’ను ఏ మంత్రిత్వ శాఖ నడిపిస్తుంది?
1) శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ
2)నూతన,పునరుత్పాధక శక్తి మంత్రిత్వశాఖ
3) భూశాస్త్రాల(ఎర్త్ ) మంత్రిత్వశాఖ
4) రక్షణ మంత్రిత్వశాఖ
- View Answer
- సమాధానం: 3
14.భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)ని మినహాయించి న్యాయమూర్తుల సంఖ్యను పెంచడానికి కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత సుప్రీంకోర్టు ఎంత మంది న్యాయమూర్తులను కలిగి ఉంటుంది?
1) 33
2) 34
3) 35
4) 36
- View Answer
- సమాధానం: 1
15. ముస్లిం మహిళల (వివాహంపై హక్కుల పరిరక్షణ) బిల్లు 2019 ప్రకారం ముస్లిం వ్యక్తి తక్షణ ట్రిపుల్ తలాక్ పాటిస్తే ఎన్ని ఏళ్లు శిక్ష అనుభవిస్తారు?
1) 10
2) 7
3) 5
4) 3
- View Answer
- సమాధానం: 4
16. దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన (డీడీయూజీజేవై) పథకం కింద భారతదేశంలో ఎన్ని మిలియన్ల గృహాలను విద్యుదీకరించారు?
1) 36 మిలియన్లు
2) 30 మిలియన్లు
3) 26 మిలియన్లు
4) 20 మిలియన్లు
- View Answer
- సమాధానం: 3
17. దుబాయ్ వరల్డ్ ఎక్స్పో 2020 నేపథ్యం ఏమిటి?
1)కనెక్టింగ్ మైండ్స్, క్రియేటింగ్ ది ఫ్యూచర్
2)ప్రివెంట్ ఫ్యూచర్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ క్రైసిస్
3) పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్
4)టు ఫోకస్ ఆన్ ది ఫ్యూచర్ గ్రోత్ ఆఫ్ ఇండస్ట్రీ
- View Answer
- సమాధానం: 1
18. ద్వైపాక్షిక హైడ్రోకార్బన్ సహకారంపై ఏ రెండు దేశాలు చర్చించాయి?
1) భారత్, బంగ్లాదేశ్
2) భారత్ మాల్దీవులు
3) భారత్, రష్యా
4) భారత్, సౌదీ అరేబియా
- View Answer
- సమాధానం: 4
19. రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జూలై 28న జరిగిన ‘రష్యన్ నేవీ డే పెరేడ్’లో పాల్గొన్న ఇండియన్ నేవల్ షిప్?
1) ఐఎన్ఎస్ విక్రమాదిత్య
2) ఐఎన్ఎస్ తర్కష్
3) ఐఎన్ఎస్ తల్వార్
4) ఐఎన్ఎస్ త్రికండ్
- View Answer
- సమాధానం: 2
20. తొలి అండర్‌వాటర్ మిలిటరీ మ్యూజియం డైవ్ సైట్‌ను జోర్డాన్‌లోని ఏ నగరంలో ఆవిష్కరించారు?
1) మడబా
2) జెరష్
3) అమ్మన్
4) ఆకాబా
- View Answer
- సమాధానం: 4
21. హరియాణాలోని కురుక్షేత్రలో జరిగే 2019 అంతర్జాతీయ గీతా జయంతి మహోత్సవంలో పాలుపంచుకోనున్న దేశం?
1) నేపాల్
2) శ్రీలంక
3) బంగ్లాదేశ్
4) మయన్మార్
- View Answer
- సమాధానం: 1
22. ప్రపంచ హెపటైటిస్ దినం (డబ్ల్యూహెచ్‌డీ) 2019 గ్లోబల్ ఈవెంట్లు ఎక్కడ జరిగాయి?
1) ఖాట్మండు, నేపాల్
2) థింపూ, భూటాన్
3) ఇస్లామాబాద్, పాకిస్తాన్
4) ఢాకా, బంగ్లాదేశ్
- View Answer
- సమాధానం: 3
23. ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలిసి ఆరు నెలల్లో ఎబోలా వ్యాప్తి నియంత్రణకు పౌరులకు నిఘా, టీకా శిక్షణ ఇవ్వనున్న దేశం?
1) రువాండా
2) టాంజానియా
3) కాంగో
4) ఉగాండా
- View Answer
- సమాధానం: 3
24. మొజాంబిక్‌ను సందర్శించిన తొలి భారత రక్షణ మంత్రి?
1) మనోహర్ పారికర్
2) రాజ్‌నాథ్ సింగ్
3) నిర్మలా సీతారామన్
4) ఎ.కె. ఆంటోని
- View Answer
- సమాధానం: 2
25. 72 ఏళ్ల తర్వాత భక్తుల కోసం తెరిచిన షావాలా తేజ సింగ్ ఆలయం ఎక్కడ ఉంది?
1) పంజాబ్, భారత్
2) ట్రిన్‌కోమలి, శ్రీలంక
3) సీలంగర్, మలేషియా
4) సియాల్కోట్, పాకిస్తాన్
- View Answer
- సమాధానం: 4
26. శాంతియుత ప్రయోజనాల కోసం బాహ్య అంతరిక్ష అన్వేషణ, ఉపయోగాల సహకారంపై ఇస్రోతో ఏ దేశ అంతరిక్ష సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది?
1) కొలంబియా
2) బొలీవియా
3) ఈక్వెడార్
4) ఉరుగ్వే
- View Answer
- సమాధానం: 2
27.భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ– ఇస్రో సాంకేతిక అనుసంధాన విభాగాన్ని ఎక్కడ నెలకొల్పడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది?
1) బీజింగ్, చైనా
2) వియన్నా, ఆస్ట్రియా
3) జెనీవా, స్విట్జర్లాండ్
4) మాస్కో, రష్యా
- View Answer
- సమాధానం: 4
28. ‘ఫార్చ్యూన్ గ్లోబల్ 500 లిస్ట్ 2019’లో అగ్రస్థానం దక్కించుకున్న కంపెనీ?
1) సౌదీ అరాంకో
2) రాయల్ డచ్ షెల్
3) ఫోక్స్‌వాగన్
4) వాల్‌మార్ట్
- View Answer
- సమాధానం: 4
29.భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) సిఫార్సుల ప్రకారం ఎంఎస్ఎంఈలు, స్వయం సహాయక బృందాలకు (ఎస్‌హెచ్‌జీ) కొత్త అనుషంగిక రహిత రుణ పరిమితి ఎంత?
1) రూ. 15 లక్షలు
2) రూ. 5 లక్షలు
3) రూ. 10 లక్షలు
4) రూ. 20 లక్షలు
- View Answer
- సమాధానం: 4
30. త్రిపురలో 2019 జూలై 29న ప్రారంభమైన 2019 సంవత్సరపు 7వ ఆర్థిక జనాభా గణన (ఈసీ) ప్రారంభించిన మంత్రిత్వ శాఖ ఏది?
1) మానవ వనురుల మంత్రిత్వ శాఖ
2)సామాజిక న్యాయం, సాధికారికత మంత్రిత్వ శాఖ
3) స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ
4) ఆర్థిక మంత్రిత్వ శాఖ
- View Answer
- సమాధానం: 3
31. జీడీపీలో భారత్ ప్రస్తుత ఖాతా లోటు (సీఏడీ)ను ఎంత శాతం ఉంటుందని అంచనా వేస్తున్నారు?
1) 2.3 %
2) 2.4 %
3) 2.5 %
4) 2.6 %
- View Answer
- సమాధానం: 1
32. దివాలా చర్యలు ప్రారంభమైన తర్వాత రుణదాతలతో ఒప్పందాల ద్వారా సంస్థను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ప్రమోటర్లకు ఇచ్చే వ్యవధి?
1) 100 రోజులు
2) 45 రోజులు
3) 90 రోజులు
4) 180 రోజులు
- View Answer
- సమాధానం: 3
33. భారత స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో ఎంత శాతం భారతీయ నగరాలు సహకారం అందిస్తున్నాయి?
1) 65%–79%
2) 59%–70%
3) 70%–95%
4) 55%–70%
- View Answer
- సమాధానం: 2
34. భారత్‌లో 331.3 మిలియన్ల సబ్స్క్రైబర్లను కలిగిన అతిపెద్ద టెలికాం కంపెనీ ఏది?
1) వొడాఫోన్ ఐడియా లిమిటెడ్
2) భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్
3) రిలయన్స్ జియో
4) భారతీ ఎయిర్టెల్
- View Answer
- సమాధానం: 3
35. కొత్త ఆర్థిక కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు?
1) రాజీవ్ కుమార్
2) సందీప్ మిశ్రా
3) హరీశ్ కుమార్ సిన్హా
4) సంతోష్ శ్రీధర్
- View Answer
- సమాధానం: 1
36. తొలిసారిగా యునైటెడ్ కింగ్డమ్ (యు.కె.) హోం సెక్రెటరీగా నియమితులైన భారత సంతతికి చెందిన వ్యక్తి ఎవరు?
1) ప్రీతీ పటేల్
2) నరిందర్ సింగ్ కపనీ
3) ఎస్. చంద్రశేఖర్
4) సల్మాన్ రష్దీ
- View Answer
- సమాధానం: 1
37. కార్గిల్ విజయ్ దివస్ 2019 నేపథ్యం ఏమిటి?
1) ‘లీడర్షిప్ ఫర్ రోడ్ సేఫ్టీ’
2) ‘పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్’
3)‘ప్రివెంట్ ఫ్యూచర్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియనల్ క్రైసిస్’
4) రిమెంబర్, రిజాయిస్ అండ్ రెన్యూ
- View Answer
- సమాధానం: 4
38. ఘరియల్ మొసలి జాతి పునరుద్ధరణ కోసం చర్యలు తీసుకోవాలని నిర్ణయించిన రాష్ట్రం?
1) ఉత్తరప్రదేశ్
2) తమిళనాడు
3) ఒడిశా
4) ఆంధ్రప్రదేశ్
- View Answer
- సమాధానం: 3
39. ఏ మహాసముద్ర పర్యవేక్షణ కోసం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఏరియోన్, యుఎస్ఎ స్పేస్–బేస్డ్ ఆటోమేటిక్ డిపెండెంట్ సర్వైలెన్స్–బ్రాడ్కాస్ట్ డేటాను అమలు చేశాయి?
1) అట్లాంటిక్ మహాసముద్రం
2) అర్కిటిక్ మహాసముద్రం
3) హిందూ మహాసముద్రం
4) పసిఫిక్ మహాసముద్రం
- View Answer
- సమాధానం: 3
40. కక్ష్యలోకి ఉపగ్రహాలను మోసుకెళ్లే సామర్థ్యం గల తొలి ప్రైవేట్ రాకెట్ – ‘హైపర్బోలా–1’ను ప్రయోగించిన దేశం?
1) చైనా
2) ఇజ్రాయిల్
3) రష్యా
4) అమెరికా
- View Answer
- సమాధానం: 1
41.వ్యవసాయ క్షేత్రాలలో పురుగుమందుల మాన్యువల్ స్ప్రేను తొలగించడానికి ‘స్మార్ట్ అగ్రికాప్టర్’ను ఏ సంస్థ విద్యార్థి బృందం అభివృద్ధి చేసింది?
1) ఐఐటీ ఖరగ్‌పూర్
2) ఐఐటీ ఢిల్లీ
3) ఐఐటీ మద్రాస్
4) ఐఐటీ బాంబే
- View Answer
- సమాధానం: 3
42. ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసిన యాంటీ హ్యూమన్ ఇమ్యునో డెఫిషియన్సీ వైరస్ (హెచ్ఐవీ) డ్రగ్ పేరు ఏమిటి?
1) డొలుటిగ్రేవిర్
2) రోసువాస్టటిన్
3) అడల్ఇమ్యూమబ్
4) లోపెరమైడ్
- View Answer
- సమాధానం: 1
43. పాకిస్తాన్ తొలిసారిగా అంతరిక్షంలోకి మానవున్ని ఎప్పుడు పంపనుంది?
1) 2021
2) 2022
3) 2023
4) 2024
- View Answer
- సమాధానం: 2
44. అత్యధిక పులులు ఉన్న రాష్ట్రం ఏది?
1) మహారాష్ట్ర
2) రాజస్థాన్
3) ఉత్తరప్రదేశ్
4) మధ్యప్రదేశ్
- View Answer
- సమాధానం: 4
45.దేశంలోని ప్రస్తుత పులుల సంఖ్యను ఏ సంవత్సరం నాటికి రెట్టింపు చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది?
1) 2027
2) 2020
3) 2022
4) 2025
- View Answer
- సమాధానం: 3
46. పశ్చిమ బంగా తర్వాత ఏ రాష్ట్ర రసగుల్లాకు భౌగోళిక గుర్తింపు (జీఐ) ట్యాగ్ లభించింది?
1) అసోం
2) బిహార్
3) ఛత్తీస్‌గఢ్
4) ఒడిశా
- View Answer
- సమాధానం: 4
47. అధునాతన బాలిస్టిక్ యాంటీ క్షిపణి వ్యవస్థ ‘యారో–3’ పరీక్షలను ఏ రెండు దేశాలు విజయవంతంగా నిర్వహించాయి?
1) ఇజ్రాయిల్, అమెరికా
2) అమెరికా, ఉత్తర కొరియా
3) భారత్, అమెరికా
4) భారత్, రష్యా
- View Answer
- సమాధానం: 1
48. ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు?
1) జూలై 28
2) జూలై 27
3) జూలై 26
4) జూలై 25
- View Answer
- సమాధానం: 1
49. ప్రతి ఏటా ప్రపంచ పులుల దినాన్ని ఎప్పుడు పాటిస్తారు?
1) జూలై 27
2) జూలై 28
3) జూలై 29
4) జూలై 30
- View Answer
- సమాధానం: 3
50. ఇన్ఫోసిస్ కొత్తగా స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ సైబర్ డిఫెన్స్ సెంటర్‌ను ఎక్కడ ప్రారంభించింది?
1) ఏథెన్స్, గ్రీస్
2) బుకారెస్ట్, రొమేనియా
3) సోఫియా, బల్గేరియా
4) బుడాపెస్ట్, హంగేరీ
- View Answer
- సమాధానం: 2