కరెంట్ అఫైర్స్ (జూలై 25 -31) బిట్ బ్యాంక్
1. ప్రతిష్ఠాత్మక ‘‘చెన్నై ఓపెన్ టైటిల్’’ పేరును ఇటీవల ఏ విధంగా మార్చారు?
1) తెలంగాణ ఓపెన్
2) కళింగ ఓపెన్
3) మహారాష్ర్ట ఓపెన్
4) మలబార్ ఓపెన్
- View Answer
- సమాధానం: 3
వివరణ: గత 21 సంవత్సరాలుగా చెన్నైలో నిర్వహిస్తున్న టెన్నిస్ టోర్నమెంట్ ‘‘చెన్నై ఓపెన్’’ ను‘మహారాష్ర్ట ఓపెన్’ పేరుతో పూణెలో నిర్వహించనున్నారు.ఈ టోర్నమెంట్‌ను తమిళనాడు టెన్నిస్ అసోసియెషన్‘IMG‘ అనే కంపెనీ సహకారంతో నిర్వహించేది. కానీ ఈ సారి ‘IMG‘ సంస్థ ఆర్థిక సమస్యల వల్ల దీనిని తమిళనాడు టెన్నిస్ అసోసియేషన్ నిర్వహించటం లేదు.
- సమాధానం: 3
2. 5వ ఈశాన్య రాష్ట్రాల కనెక్టివిటీ సదస్సు 2018ని ఏ రాష్ర్టంలో నిర్వహించనున్నారు?
1) మేఘాలయ
2) సిక్కిం
3) అస్సోం
4) అరుణాచల్ ప్రదేశ్
- View Answer
- సమాధానం: 4
వివరణ: 5వ ఈశాన్య రాష్ట్రాల కనెక్టివిటీ సదస్సు 2018నిఅరుణాచల్ప్రదేశ్లోనిర్వహించనున్నారు. దీనిని ఫిక్కీ (FICCI) నిర్వహిస్తుంది. 4వ సమావేశంను 2017లో నాగాలాండ్‌లో నిర్వహించారు.
- సమాధానం: 4
3. అంతర్జాతీయ సాంఘిక న్యాయం సదస్సు (International meet on social justice)ను ఎక్కడ నిర్వహించారు?
1) బెంగళూరు
2) హైదరాబాద్
3) విజయవాడ
4) భువనేశ్వర్
- View Answer
- సమాధానం: 1
వివరణ: డా. బి.ఆర్. అంబేద ్కర్ 126 జయంతి సందర్భంగా సామాజిక న్యాయం అంతర్జాతీయ సదస్సును బెంగళూరులో నిర్వహించారు. ఈ సమావేశానికి మార్టిన్ లూథర్ కింగ్-III ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
- సమాధానం: 1
4. ఇటీవల ఆక్స్‌ఫామ్ విడుదల చేసిన ‘‘అసమానతల తగ్గింపు సూచీ’’ (Commitment to Reducing Inequality Index) లో ఇండియా స్థానం ఎంత?
1) 128
2) 132
3) 138
4) 152
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఆక్స్‌ఫామ్ అనే స్వచ్ఛంద సంస్థ ‘‘అసమానతల తగ్గింపుపై ప్రభుత్వాల అంకితభావము’’ అనే అంశంపై 152 దేశాలను పరిగణనలోకి తీసుకొనిఒక ఇండెక్స్‌ను విడుదల చేసింది. ఈ జాబితాలో తొలిస్థానంలో స్వీడన్ ఉంది. తరువాతి స్థానాలలో బెల్జియం, డెన్మార్క, నార్వే మరియు జర్మనీ ఉన్నాయి. చైనా 87, ఇండియా 132, పాకిస్థాన్ 146, బంగ్లాదేశ్ 148వ, నైజీరియా 152 స్థానంలో ఉన్నాయి.
- సమాధానం: 2
5. ఇటీవల చైనా మరియు రష్యా ఏ సముద్రంలో సంయుక్త నౌకాదళ విన్యాసాలు నిర్వహించాయి?
1) దక్షిణ చైనా సముద్రం
2) బాల్టిక్ సముద్రం
3) బేరింగ్ జలసంధి
4) పసుపు సముద్రం
- View Answer
- సమాధానం: 2
వివరణ: రష్యా మరియు చైనా ‘‘Joint Sea 2017’’ పేరుతో బాల్టిక్ సముద్రంలో సంయుక్త నౌకా విన్యాసాలు నిర్వహించాయి.
- సమాధానం: 2
6. 5వ దక్షిణ భారతదేశ రచయితల సమిష్టి సమావేశంను ఎక్కడ నిర్వహించారు?
1) గోవా
2) తమిళనాడు
3) కర్ణాటక
4) కేరళ 2017 theme - "tolerance"
- View Answer
- సమాధానం: 4
వివరణ: 5వ దక్షిణ భారతదేశ రచయితల సమావేశం కేరళలోని అలప్పుజ జిల్లాలో ఉన్న చెంగునూరులో నిర్వహించారు.
- సమాధానం: 4
7. ఇటీవల భారత్ ఏ దేశంతో నది మార్గాల రవాణాకు ఒప్పందం కుదుర్చుకుంది?
1) బంగ్లాదేశ్
2) భూటాన్
3) పాకిస్థాన్
4) నేపాల్
- View Answer
- సమాధానం: 1
వివరణ: భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య నదీ మార్గాల ద్వారా సరుకులు మరియు మానవ రవాణా కొరకు ఒక ఒప్పందం కుదిరింది. ఈ రవాణా 2017 డిసెంబర్‌లోపు ప్రారంభమవుతుంది.
- సమాధానం: 1
8. ప్రపంచంలోనే తొలిసారిగా తేలియాడే పవనశక్తి ప్లాంట్‌ను ఎక్కడ ఏర్పాటు చేశారు?
1) నెదర్లాండ్స్
2) ఇండియా
3) స్కాట్లాండ్
4) చైనా
- View Answer
- సమాధానం: 3
వివరణ: ప్రపంచంలోనే తొలిసారిగా తేలియాడే పవన శక్తి ప్లాంట్‌ను స్కాట్లాండ్లో ఏర్పాటు చేశారు.
- సమాధానం: 3
9. ప్రపంచ బ్యాంకు ఇటీవల విడుదల చేసిన ‘‘World Economic Outlook’’ సర్వేలో ఇండియా యొక్క వృద్ధి ఎంతగా పేర్కొన్నారు?
1) 6.8 %
2) 7.2%
3) 7.8 %
4) 8.3 %
- View Answer
- సమాధానం: 2
వివరణ: ప్రపంచ బ్యాంకు (IMF) World Economic Outlook ను తయారు చేసింది. 2017-18 ఆర్థిక సంవత్సరమునకు ఇండియా 7.2% వృద్ధి నమోదు చేస్తుందని పేర్కొంది.పెద్ద నోట్ల రద్దు వలన వృద్ధి మందగించిందని తెలిపింది.
- సమాధానం: 2
10. మహిళల క్రికెట్ ప్రపంచకప్-2017 ను ఏ దేశం గెలుచుకుంది?
1) ఇండియా
2) పాకిస్థాన్
3) కెనడా
4) ఇంగ్లండ్
- View Answer
- సమాధానం: 4
వివరణ: మహిళల క్రికెట్ ప్రపంచకప్-2017 ఫైనల్ లండన్‌లోని లార్డ్స మైదానంలో జరిగింది. ఇంగ్లాండ్ జట్టు 9 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించి ప్రపంచ కప్‌ను గెలుచుకుంది.
- సమాధానం: 4
11. ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ జావెలిన్ త్రో లో బంగారు పతకం సాధించినది ఎవరు?
1) సుందర్ సింగ్ గుర్జర్
2) జులియస్ యెగో
3) నీరజ్ చోప్రా
4) జాన్ జీన్ లన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: 8వ ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిన్ను లండన్‌లో నిర్వహించారు. ఇందులో సుందర్ సింగ్ గుర్జర్‌కు జావెలిన్ త్రోలో స్వర్ణ పతకం లభించింది.టోర్నీలో చైనా 65 మెడల్స్‌తో తొలిస్థానంలో ఉండగా 5 పతకాలు సాధించి ఇండియా 34వ స్థానంలో ఉంది.మొత్తం 100 దేశాల నుంచి 1300 మంది పారా క్రీడాకారులు పాల్గొన్నారు.
- సమాధానం: 1
12. యూఎస్ ఓపెన్ గ్రాండ్ ప్రీ బ్యాడ్మింటన్ టైటిల్ విజేత ఎవరు?
1) పారుపల్లి కాశ్యప్
2) హెచ్ఎస్ ప్రణయ్
3) లిన్‌డాన్
4) లీ చొంగ్ వై
- View Answer
- సమాధానం: 2
వివరణ: కాలిఫోర్నియాలో జరిగిన యూఎస్ ఓపెన్ గ్రాండ్ ప్రీ బ్యాడ్మింటన్టోర్నీలో పారుపల్లి కాశ్యప్‌ను ఓడించి, హెచ్ఎస్ ప్రణయ్ టైటిల్‌ను గెలుచుకున్నాడు.
- సమాధానం: 2
13. కామన్వెల్త్ యూత్ క్రీడల్లో బాక్సింగ్‌లో స్వర్ణ పతక విజేత ఎవరు?
1) జేమ్స్నాధన్ ప్రోబెర్
2) మహమ్మద్ ఎతాష్ఖాన్
3) ఎల్లా జేడ్ బూట్
4) రూబెన్ షిలోహ్
- View Answer
- సమాధానం: 4
వివరణ: 49 కేజీల ఫ్లై వెయిట్ విభాగంలో జేమ్స్నాధన్ ప్రోబెర్ను ఓడించి సచిన్ శివాచ్ బంగారు పతకంను గెలుచుకున్నాడు.
- సమాధానం: 4
14. టీ బ్యాగ్ పై వేసే పిన్ను వాడకూడదని ఇటీవలఆజ్ఞలు జారిచేసిన సంస్థ ఏది?
1) FAO
2) FAA
3) FSSAI
4) FAI
- View Answer
- సమాధానం: 3
వివరణ: FSSAI - Food Safety and Standards Authority of India టీ బ్యాగ్ ప్యాకేజింగ్‌లో పిన్ (Staples) లు వాడకూడదు అని ప్రకటించింది. ఈ నిషేదం 2018 జనవరి 1 నుంచి అమల్లోకొస్తుంది.
- సమాధానం: 3
15. ‘‘మహానాయక్ సమ్మాన్-2017’’ పురాస్కారానికి ఎవరు ఎంపికయ్యారు?
1) శంకుతల బారు
2) ప్రొసింజిత్ చటర్జీ
3) నుస్రత్ జహన్
4) సుప్రనోకంతి
- View Answer
- సమాధానం: 1
వివరణ: బెంగాల్ ప్రభుత్వం సినిమా రంగంలో ప్రదానం చేసే అత్యున్నత పురస్కారం ‘‘మహనాయక్ సమ్మాన్ అవార్డు 2017’’కు శంకుతల బారు ఎంపికైంది. ఉత్తమ బెంగాలీ నటుడుగా ప్రొసెంజీత్ చటర్జీ, ఉత్తమ బెంగాలీ నటిగా నుస్రత్ జహన్ ఎంపికయ్యారు.
- సమాధానం: 1
16. తొలి ప్రైవేటు నౌకల తయారీ సంస్థ రిలయన్స్ డిఫెన్స్ ప్రారంభించిన నౌకలు ఏవి?
1) సాచి
2) రాంచి
3) గాంధీ
4) ధీరుభాయ్ అంబానీ
- View Answer
- సమాధానం: 1
వివరణ: రక్షణ ఉత్పతుల తయారీ అనుమతి పొందిన తొలి ప్రైవేటు కంపెనీ రిలయన్స్ డిఫెన్స్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్. ఇది తొలిసారిగా తీర ప్రాంతాల (offshore)గస్తీ కోసం సాచి (shachi) మరియు శృతి అనే నౌకలు తయారు చేసింది. ఈ నౌకలు తక్కువ మరియు మధ్యస్థ స్థాయి దూరాలలో ఉన్న లక్ష్యాలను ఛేదిస్తాయి. వీటిలో 76 mm సూపర్ ర్యాపిడ్ గన్ మరియు 30 mm AK-630 గన్లను పొందుపరిచారు.
- సమాధానం: 1
17. ఆసియా యూత్ మరియు జూనియర్ వెయిట్‌లిప్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతక విజేత ఎవరు?
1) వూజిన్గ బా
2) చెన్ హ్యు
3) యాంగ్ లైన్
4) ఊర్మిళా దేవి
- View Answer
- సమాధానం: 4
వివరణ: భారతీయ వెయిట్‌లిప్టర్ కొన్సామ్ ఊర్మీళా దేవి (Konsam Ormila devi) ఆసియా యూత్ మరియు జూనియర్ వెయిట్ లిప్టింగ్లో బంగారు పతకము గెలుచుకుంది. ఈ క్రీడలు నేపాల్ రాజధాని ఖట్మాండులో నిర్వహించారు.
- సమాధానం: 4
18. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2021ను ఏ దేశంలో నిర్వహించనున్నారు?
1) మలేషియా
2) ఇండియా
3) కెనడా
4) సురినామ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ప్రపంచ పురుషుల బాక్సింగ్ కప్‌ను 2021లో తొలిసారి నిర్వహించే అవకాశం ఇండియా పొందింది. 2018లో మహిళల ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ను కూడా ఇండియా(న్యూఢిల్లీ) నిర్వహించనుంది.
- సమాధానం: 2
19. ఇటీవల ఏ రాష్ర్ట హైకోర్టు, పాఠశాలలలో వందేమాతరం తప్పనిసరి అని ప్రకటించింది?
1) హైదరాబాద్ హైకోర్టు
2) బాంబే హైకోర్టు
3) మద్రాస్ హైకోర్టు
4) జైపూర్ హైకోర్టు
- View Answer
- సమాధానం: 3
వివరణ: ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలతో పాటు ప్రభుత్వ మరియు ప్రైవేటు కార్యాలయాల్లో కూడావందేమాతరంను పాడాలి అని మద్రాస్ హైకోర్టు ప్రకటించింది.
- సమాధానం: 3
20. ‘‘గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఔట్లుక్’’ విడుదల చేసిన నివేదిక ప్రకారం 2040లోపు భారతదేశంలో మౌళిక సదుపాయాల కల్పనకు ఎంత ధనం కావాలి?
1) 4.5 ట్రిలియన్ డాలర్లు
2) 3.5 ట్రిలియన్ డాలర్లు
3) 4.5 బిలియన్ డాలర్లు
4) 3.5 బలియన్ డాలర్లు
- View Answer
- సమాధానం: 1
వివరణ: భారతదేశంలో మాలిక సదుపాయాల కల్పనకు 2040లోపు 4.5 ట్రిలియన్ డాలర్లు కావాలని గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఔట్లుక్ ప్రకటించింది. ఈ నివేదిక కోసం 50 దేశాలు మరియు 7 పారిశ్రామిక కేంద్రాలను అధ్యయనం చేశారు.
- సమాధానం: 1
21. 2017 బ్రిక్స్ యూత్ ఫోరమ్‌ను ఎక్కడ నిర్వహించారు?
1) చైన్నై
2) ప్రిటోరియా
3) కజన్
4) బీజింగ్
- View Answer
- సమాధానం: 4
22. ఇటీవల ఇండియాలో మైక్రోసాఫ్ట్ తయారు చేసిన ఆప్లికేషన్ పేరు ఏమిటి?
1) మేక్ ఇన్ ఇండియా
2) కైజాలా
3) మేడ్ ఇన్ ఇండియా
4) మై ఇండియా
- View Answer
- సమాధానం: 2
23. CRPF దినోత్సవంను ఏ రోజున నిర్వహిస్తారు?
1) జులై 27
2) జులై 25
3) జులై 23
4) జులై 20
- View Answer
- సమాధానం: 1
వివరణ: 1939 జులై 27న CRPF ను ప్రారంభించారు. CRPF కేంద్ర హోం మంత్రిత్వశాఖ కింద పని చేస్తుంది.
- సమాధానం: 1
24. కార్గిల్ విజయ్ దివస్‌ను ఏ రోజున జరుపుకుంటారు?
1) జులై 20
2) జులై 23
3) జులై 26
4) జులై 29
- View Answer
- సమాధానం: 3
వివరణ: 18వ కార్గిల్ విజయ్ దివస్‌ను జులై 26 న నిర్వహించారు. 1999లో కార్గిల్ యుద్ధంలో మరణించిన వారి స్మృత్యర్థం ప్రతి సంవ త్సరం జులై 26న కార్గిల్ విజయ దివస్‌ను నిర్వహిస్తారు.
- సమాధానం: 3
25. APJ అబ్దుల్ కలామ్ మెమోరియల్‌ను ఇటీవల ఎక్కడ ప్రారంభించారు?
1) మద్రాస్
2) పూణే
3) భోపాల్
4) రామేశ్వరం
- View Answer
- సమాధానం: 4
వివరణ: 20 కోట్ల వ్యయంతో రామేశ్వరంలో APJ అబ్దుల్ కలామ్ మెమోరియల్‌ను DRDO మొగల్ మరియు భారత నిర్మాణ శైలిలో నిర్మించింది.
- సమాధానం: 4
26. ఇండియాలో తొలి ఆటోమెటిక్ విపత్తుల సమాచార వ్యవస్థ కలిగిన రాష్ర్టం ఏది?
1) ఒడిశా
2) ఆంధ్రప్రదేశ్
3) తమిళనాడు
4) కేరళ
- View Answer
- సమాధానం: 1
వివరణ: తీర ప్రాంతంలో రాబోయే విపత్తులను ముందుగానే గుర్తించి సమాచారము అందించే వ్యవస్థ కలిగిన ఏకైక రాష్ర్టం ఒడిశా.
- సమాధానం: 1
27. బ్రిక్స్ లేబర్ మరియు ఉపాధి కల్పన మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది?
1) బీజింగ్
2) న్యూఢిల్లీ
3) కాజన్
4) రియోడిజినిరో
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఇండియా తరపున శ్రీ బండారు దత్తాత్రేయ బ్రిక్స్ లేబర్ మరియు ఉపాధి కల్పన మంత్రుల సమావేశానికి హాజరయ్యారు.
- సమాధానం: 1
28. ఇటీవల ఏ దేశం తొలిసారిగా భారత్‌కు యురేనియంను ఎగుమతి చేసింది?
1) కెనడా
2) రష్యా
3) ఆస్ట్రేలియా
4) వియత్నం
- View Answer
- సమాధానం: 3
వివరణ: 2014లో కుదిరిన ఇండియా - ఆస్ట్రేలియా పౌర అణు సహకార ఒప్పందం ప్రకారం తొలి షిప్‌మెంట్‌ను ఆస్ట్రేలియా ఇండియాకు పంపింది.
- సమాధానం: 3
29. 2017 జులైలో బీహార్‌కు 6వసారి ముఖ్యమంత్రి అయింది ఎవరు?
1) సుశీల్ కూమార్
2) నితీష్ కుమార్
3) తేజ్ ప్రతాప్ యాదవ్
4) తేజస్వీ యాదవ్
- View Answer
- సమాధానం: 2
30. ఏ సంస్థ నుంచి ‘‘ఫ్రీ చార్జ మొబైల్ వాల్యెట్’’ ను కొనుగోలు చేస్తున్నట్లు యాక్సిస్ బ్యాంక్ఇటీవల ప్రకటించింది?
1) పేటీఎమ్
2) ఫ్లిప్‌కార్ట
3) షాప్‌క్లూస్
4) స్నాప్‌డీల్
- View Answer
- సమాధానం: 4
వివరణ: యాక్సిస్ బ్యాంక్ 385 కోట్లకు స్నాప్‌డీల్ నుంచి ఫీ చార్జ మొబైల్ వాల్యెట్నుకొనుగోలు చేయనుంది.
- సమాధానం: 4
31. ఇటీవల ఏ దేశ శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే తొలిసారిగా మానవ DNAను ఎడిట్ చేశారు?
1) కెనడా
2) చైనా
3) రష్యా
4) అమెరికా
- View Answer
- సమాధానం: 4
వివరణ: వారసత్వముగా వచ్చే వ్యాధులను అడ్డుకోవడం కోసం తొలిసారిగా అమెరికా శాస్త్రవేత్తలు డిఎన్ఏ ను ఎడిట్ చేశారు.
- సమాధానం: 4
32. భూకంపాల వ్యాప్తిపై అవగాహన కల్పించేందుకు ఎర్త్‌సెన్సైస్ మంత్రిత్వ శాఖ తయారు చేసిన ఆప్లికేషన్ పేరు ఏమిటి?
1) సిస్మోలజీ
2) ఇండియా క్వెక్
3) భూకంప మాసిని
4) ఇండియానిన్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఎర్త్ సెన్సైస్ మంత్రిత్వ శాఖ తయారు చేసిన India Quake మొబైల్ యాప్‌ను 2017 జులై 27న దేశంలోని 84 కేంద్రాలకు అనుసంధానం చేశారు.
- సమాధానం: 2
33. దేశంలో అత్యధిక పులులు ఉన్న రెండవరాష్ర్టం ఏది?
1) కర్ణాటక
2) ఉత్తరాఖండ్
3) ఆంధ్రప్రదేశ్
4) గోవా
- View Answer
- సమాధానం: 2
వివరణ: దేశంలో అత్యధికంగా కర్ణాటకలో 400 పులులు ఉన్నాయి. గత సంవత్సరం 63 పెరగటంతో మొత్తం 242 పులులతో ఉత్తరాఖండ్రెండవ స్థానంలోకి వచ్చింది.
- సమాధానం: 2
34. ఆసియాన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ అండర్-19 ఛాంపియన్షిప్ 2018కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది?
1) ఇండొనేషియా
2) ఇండియా
3) మలేషియా
4) చైనా
- View Answer
- సమాధానం: 1
35. ఏ సెక్షన్ కింద వరకట్నం కోసం వేధించే వారిని అరెస్ట్ చేస్తారు?
1) 402
2) 438
3) 498A
4) 502A
- View Answer
- సమాధానం: 3
వివరణ: వరకట్నం కోసం వేధింపులు జరిపారని ఏవరైనా ఫిర్యాదు చేస్తే ప్రాథమిక విచారణ చేసిన తరువాత మాత్రమే అరెస్ట్ చేయాలని సుప్రీంకోర్టుప్రకటించింది. 1860లో ప్రవేశపెట్టిన IPC సెక్షన్ 498A ప్రకారం కట్నం కోసం వేధించే వారినిఅరెస్ట్ చేస్తారు.
- సమాధానం: 3
36. వికిలీక్స్ విడుదల చేసిన ఏ పత్రాల వల్ల పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరిఫ్ రాజీనామా చేశారు?
1) ఇస్లామాబాద్ పేపర్స్
2) బీజింగ్ పేపర్స్
3) కీల్ పేపర్స్
4) పనామా పేపర్స్
- View Answer
- సమాధానం: 4
వివరణ: పాకిస్థాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరిఫ్ మరియు ఆర్థిక మంత్రి ఇసాక్ దాన్ ను పనామా పేపర్స్ కేసులో పాకిస్థాన్ సుప్రీం కోర్టు దోషులుగా ప్రకటించింది.
- సమాధానం: 4
37. ఇటీవల డెల్ సంస్థ విడుదల చేసిన అత్యధిక మహిళా వ్యవస్థాపకులు ఉన్న నగరాలలో తొలిస్థానంలో ఉన్న నగరం ఏది?
1) బెంగళూరు
2) న్యూయార్క్
3) లండన్
4) బొస్టన్
- View Answer
- సమాధానం: 2
వివరణ: DELL సంస్థ విడుదల చేసిన 50 నగరాలతో కూడిన ‘‘అత్యధిక మహిళ వ్యవస్థాపకుల ఇండెక్స్’’ లో తొలిస్థానంలో న్యూయార్క నగరం ఉంది. ఈ జాబితాలోబెంగళూరు 40వ స్థానంలో ఉంది.
- సమాధానం: 2
38. ప్రపంచ హైపటైటిస్ దినోత్సవంను ఎప్పుడు నిర్వహిస్తారు?
1) జులై 28
2) జులై 30
3) జులై 31
4) ఆగస్ట్ 2
- View Answer
- సమాధానం: 1
వివరణ: ప్రజలలో హైపటైటిస్ పట్ల అవగాహన కల్పించుట కొరకు ఏటా జులై 28న ప్రపంచ హైపటైటిస్ దినోత్సవం నిర్వహిస్తారు.
2017 Theme - "Eliminate Hepatities".
-
39. ఇటీవల ఏ రాష్ర్టం లిక్విడ్ నైట్రోజన్ కలిపిన ఆహార పదార్థాలపై నిషేదం విధించింది?
1) గోవా
2) హర్యానా
3) తెలంగాణ
4) సిక్కిం
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఆహారం విషపూరితం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో లిక్విడ్ నైట్రోజన్ ఆహార పదార్థాలను వాడకూడదు అని హర్యానా ప్రభుత్వం నిషేధం విధించింది.
- సమాధానం: 2
40. ఆంధ్రప్రదేశ్‌లో ‘‘పై డేటా సెంటర్’’ను ఎక్కడ ఏర్పాటు చేశారు?
1) తాడేపల్లి గూడెం
2) చాగల్లు
3) మంగళగిరి
4) తిరుపతి
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 600 కోట్ల వ్యయంతో ‘‘పై డేటా సెంటర్’’ను మంగళగిరిలో ప్రారంభించింది. రాష్ర్ట ప్రభుత్వానికి చెందిన డేటాను ఇక్కడే నిల్వ చేస్తారు.
- సమాధానం: 3
41. హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్ట్సలోకి ఎక్కిన వస్తువు/ప్రాంతం ఏది?
1) అజంతా
2) ఎల్లోరా
3) హైదరాబాద్ బిర్యానీ
4) తెలంగాణ బోనం
- View Answer
- సమాధానం: 4
42. ఇటీవల ఎల్బ్ర్జ శిఖరంను ఎక్కినది ఎవరు?
1) మాలవత్ పూర్ణ
2) శేఖర్ బాబు
3) రవీంద్ర రెడ్డి
4) నరేష్ అగర్వాల్
- View Answer
- సమాధానం: 1
వివరణ: రష్యాలోని ఎల్బ్ర్జ పర్వాతాన్ని ఆలేరు గురుకులానికి చెందిన శ్రీ విద్యతో కలిసి మాలవత్ పూర్ణ ఎక్కింది.
- సమాధానం: 1
43. ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నుంచి కాస్ట్ మేనేజ్మెంట్ 2016 పురస్కారంనకు ఎంపికైన సంస్థ ఏది?
1) ఇండియన్ రైల్వే
2) SSBI
3) సింగరేణి కాలరీస్ కంపెనీ
4) DBR మిల్స్
- View Answer
- సమాధానం: 3
వివరణ: 2015లో కూడా సింగరేణి ఈ పురస్కారంనకు ఎంపికైంది.
- సమాధానం: 3
44. ఇండియాలో ఎన్ని నగరాలు భూకంపాల జోన్లో ఉన్నాయి?
1) 10
2) 25
3) 23
4) 29
- View Answer
- సమాధానం: 4
వివరణ: నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ ఒక నివేదికలో దేశంలో 29 ముఖ్యనగరాలు భూకంపాల జోన్లో ఉన్నట్లు ప్రకటించింది. దేశరాజధాని ఢిలీతో పాటు 9 రాష్ట్రాల రాజధానులు ఈ పరిధిలోనే ఉన్నాయి.
- సమాధానం: 4
45. టపాసుల తయారీలో ఏ లోహాలు వాడకూడదని సుప్రీంకోర్టు ప్రకటించింది?
1) లిథియం
2) మెర్క్యురీ
3) ఆర్సెనిక్
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
వివరణ: టపాసుల తయారీలో లిథియం, మెర్క్యురీ, ఆర్సెనిక్ అంటిమోనీ, మరియు లెడ్ లోహాలను వాడరాదని సుప్రీకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
- సమాధానం: 4
46. ప్రపంచంలో అత్యంత సంపన్నుడు ఎవరు?
1) బిల్‌గేట్స్
2) వారెన్ బఫెట్
3) జెఫ్ బెజొస్
4) ముకేష్ అంబానీ
- View Answer
- సమాధానం: 3
వివరణ: అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజొస్ ప్రపంచ కుబేరుల జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నారు. అతని ఆస్తుల విలువ 90.9 బిలియను డాలర్లు. బిల్‌గేట్స్ 90.7 బిలియన్ డాలర్లతో రెండవ స్థానంలో ఉన్నారు.
- సమాధానం: 3
47. ప్రపంచంలో అతి పొడవైన వేలాడే వంతెనను నిర్మించిన దేశం ఏది?
1) స్విట్జర్లాండ్
2) చైనా
3) అమెరికా
4) కెనడా
- View Answer
- సమాధానం: 1
వివరణ: భూ ఉపరితలానికి 86 మీ. ఎత్తులో, 404 మీటర్ల పొడవున వేలాడే వంతెనను ప్విట్జర్లాండ్ ‘‘స్వీస్ అల్ఫిన్ రిసార్ట’’లో ఏర్పాటు చేసింది.
- సమాధానం: 1
48. బ్రిటన్‌లో పెట్రోల్, డీజిల్ వాహనాలపై ఏ సంవత్సరంలోనిషేధం విధిస్తారు?
1) 2020
2) 2030
3) 2040
4) 2050
- View Answer
- సమాధానం: 3
వివరణ: ప్రస్తుతం బ్రిటన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహానాల అమ్మకాలు 1% మాత్రమే ఉన్నాయి. పర్యావరణ పరిరక్షణ కోసం 2040 నుంచి పెట్రోల్ మరియు డీజిల్ వాహనాలపై ఆ దేశం నిషేధం విధించనుంది.
- సమాధానం: 3
49. ఇటీవల అమెరికా విడుదల చేసిన నివేదికలో ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్న దేశంగా నిలిచిన దేశం ఏది?
1) వెనెజులా
2) ఉత్తరకొరియా
3) లెబనాన్
4) పాకిస్తాన్
- View Answer
- సమాధానం: 4
వివరణ: అమెరికాపాకిస్థాన్ను ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న దేశాల జాబితాలో చేర్చింది. ఈ జాబితాలో అప్ఘనిస్థాన్, సొమాలియా, ఈజిప్టు, లెబనాన్, కొలంబియా, మలియ, వెనెజులా ఉన్నాయి.
- సమాధానం: 4
50. ప్రపంచంలో మానవ అక్రమ రవాణాలో ముందున్న దేశం ఏది?
1) రష్యా
2) ఇరాన్
3) పాకిస్థాన్
4) చైనా
- View Answer
- సమాధానం: 4
వివరణ: అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రపంచవ్యాప్తంగా 2.10 కోట్ల మంది అక్రమ రవాణాకు గురైనట్లు ప్రకటించింది. అమెరికా ఒక నివేదిక లో చైనా ప్రపంచంలో అత్యధికంగా మానవ అక్రమ రవాణా చేస్తున్నట్లు పేర్కొంది.
- సమాధానం: 4