కరెంట్ అఫైర్స్ బిట్ బ్యాంక్ (2020, అక్టోబర్ 20-26)
1. ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల ఏర్పాటుకు “ఆయుష్మాన్ సహకర్” పథకానికి జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ) ఎంత విలువైన రుణాన్ని అందిస్తుంది?
1) రూ. 1,000 కోట్లు
2) రూ. 10,000 కోట్లు
3) రూ. 100 కోట్లు
4) రూ. 500 కోట్లు
- View Answer
- సమాధానం: 2
2. 2020, నవంబర్ లో ఫుడ్ సేఫ్టీ కంప్లైయెన్స్ సిస్టమ్ (FoSCoS) ను ప్రారంభించటానికి ఏ సంస్థ ప్రణాళిక వేసింది?
1) ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
2) వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
3) ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజెషన్
4) ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా
- View Answer
- సమాధానం: 4
3. దేశంలో తొలిసారిగా హీంగ్ (అసఫోటిడా) సాగు విధానాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
1) కేరళ
2) ఆంధ్రప్రదేశ్
3) మహారాష్ట్ర
4) హిమాచల్ ప్రదేశ్
- View Answer
- సమాధానం: 4
4. మహిళల భద్రత కోసం సేఫ్ సిటీ ప్రాజెక్ట్, మిషన్ శక్తి ప్రచార కార్యక్రమాల్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది?
1) ఉత్తర ప్రదేశ్
2) ఆంధ్రప్రదేశ్
3) మహారాష్ట్ర
4) తెలంగాణ
- View Answer
- సమాధానం: 1
5. దేశంలో మొట్టమొదటి మల్టీ-మోడల్ లాజిస్టిక్ పార్క్ (MMLP) ఏ రాష్ట్రంలో అభివృద్ధి చేయబడుతుంది?
1) అస్సాం
2) త్రిపుర
3) సిక్కిం
4) మేఘాలయ
- View Answer
- సమాధానం: 1
6. దేశంలో పొడవైన బస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (బీఆర్టీఎస్) నెట్వర్క్ కలిగి ఉన్న ఏకైక నగరం ఏది?
1) సూరత్
2) అహ్మదాబాద్
3) కోల్‌కతా
4) పాట్నా
- View Answer
- సమాధానం: 1
7. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం... దేశంలో ‘పారాసిటిక్ ఇంటెస్టినల్ వార్మ్ ఇన్ఫెక్షన్’ లేదా సాయిల్ ట్రాన్స్మిటెడ్ హెల్మెంతియాసిస్(STH) తగ్గుముఖం పట్టిందని ఎన్ని రాష్ట్రాలు తెలిపాయి?
1) 13
2) 12
3) 14
4) 16
- View Answer
- సమాధానం: 3
8. ఉడాన్ రీజినల్ ఎయిర్ కనెక్టివిటీ పథకం కింద... ఏ సంవత్సరం నాటికి 100 ఎయిర్ పోర్టులు, వాటర్ డ్రోమ్‌లు, హెలిపోర్ట్‌లను అభివృద్ధి చేయాలని ఎయిర్ పోర్ట్స్ అథారిటీ అఫ్ ఇండియా (ఏఏఐ) ప్రణాళికలు రచించింది?
1) 2022
2) 2024
3) 2025
4) 2030
- View Answer
- సమాధానం: 2
9. నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ (ఎన్ఎస్ఎమ్) మూడవ దశ ఏ నెల నుంచి ప్రారంభమవుతుంది?
1) మార్చి, 2021
2) జనవరి, 2021
3) ఏప్రిల్, 2021
4) డిసెంబర్, 2020
- View Answer
- సమాధానం: 2
10. అగర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్ ఏ రాష్ట్రంలో ఫ్రారంభమైంది?
1) సిక్కిం
2) అస్సాం
3) త్రిపుర
4) మేఘాలయ
- View Answer
- సమాధానం: 2
11. కుటుంబం ఆధార పడ్డ వ్యక్తికి ఏదైనా ప్రమాదం జరిగితే.. బాధితుల కుటుంబానికి “వైయస్ఆర్ బీమా” పథకం కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణ ఆర్థిక సహాయంగా అందించే మొత్తం ఎంత?
1) రూ. 15 వేలు
2) రూ. 20,000
3) రూ. 10,000
4) రూ. 5 వేలు
- View Answer
- సమాధానం: 3
12. కేంద్ర ఆరోగ్య, సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన... అనీమియా ముక్త్ భారత్ ఇండెక్స్ లో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం?
1) అస్సాం
2) హరియాణ
3) గుజరాత్
4) మేఘాలయ
- View Answer
- సమాధానం: 2
13. ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన (PMGSY) అమలులో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన జిల్లా?
1) బహ్రాయిచ్, ఉత్తర ప్రదేశ్
2) మండి, హిమాచల్ ప్రదేశ్
3) బీజాపూర్, ఛత్తీస్‌గఢ్
4) పాలక్కడ్, కేరళ
- View Answer
- సమాధానం: 2
14. జిల్లా స్థాయిలో పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ (పీఎఫ్ఎమ్ఎస్) ను అమలు చేసిన దేశంలోని మొదటి కేంద్రపాలిత ప్రాంతం?
1) డామన్ & డయ్యూ
2) పుదుచ్చేరి
3) లడఖ్
4) జమ్మూకశ్మీర్
- View Answer
- సమాధానం: 4
15. కిసాన్ సూర్యోదయ యోజనను ప్రధాని మోదీ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
1) ఒడిశా
2) గుజరాత్
3) ఉత్తర ప్రదేశ్
4) మధ్యప్రదేశ్
- View Answer
- సమాధానం: 2
16. పర్యాటక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ‘ఇండియా టూరిజం స్టాటిస్టిక్స్ (ఐటీఎస్) అట్ ఏ గ్లేన్స్- 2020’ నివేదిక ప్రకారం... విదేశీ పర్యాటక సందర్శకుల జాబితా-2019 లో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది?
1) తమిళనాడు
2) గుజరాత్
3) ఉత్తర ప్రదేశ్
4) మధ్యప్రదేశ్
- View Answer
- సమాధానం: 1
17. ‘‘గవర్నమెంట్-యూత్ డయలాగ్ ఆన్ పోస్ట్-కోవిడ్ 19 ఆపర్చునిటీస్’’ ఇతివృత్తం(థీమ్)తో వర్చువల్ విధానం ద్వారా సౌదీ అరేబియా నిర్వహించిన... మొదటి జీ20 యూత్ 2020 సమ్మిట్‌లో భారత్ తరపున ఎవరు పాల్గొన్నారు?
1) హర్ష్ వర్ధన్
2) కిరెన్ రిజిజు
3) మహేంద్ర నాథ్ పాండే
4) రమేష్ పోఖ్రియాల్ నిశాంక్
- View Answer
- సమాధానం: 2
18. ‘ఒక మనిషికి ఒక పూట ఆహారానికి అయ్యే ఖర్చు’ అనే అంశం ఆధారంగా... ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార కార్యక్రమం విడుదల చేసిన “ది ప్లేట్ ఆఫ్ ఫుడ్ -2020” జాబితాలో భారత్ ర్యాంక్ ఎంత?
1) 22 వ
2) 23 వ
3) 18 వ
4) 28 వ
- View Answer
- సమాధానం: 4
19. భారత్-శ్రీలంక సంయుక్తంగా నిర్వహించిన సైనిక వ్యాయామం స్లినెక్స్-20(SLINEX-20) 8వ ఎడిషన్ ఎక్కడ జరిగింది?
1) ట్రింకోమాలీ, శ్రీలంక
2) కొచ్చి, భారత్
3) కొలంబో, శ్రీలంక
4) చెన్నై, భారత్
- View Answer
- సమాధానం: 1
20. నేషనల్ ఐడెంటిఫికేషన్ డేటాబేస్ కు ఫేసియల్ వెరిఫికేషన్ ను జోడించిన ప్రపంచంలోని మొదటి దేశం ఏది?
1) సింగపూర్
2) ఇజ్రాయెల్
3) మలేషియా
4) ఇండోనేషియా
- View Answer
- సమాధానం: 1
21. 21. వ్యవసాయ రంగంలో నీటి నిర్వహణకు సంబంధించి... 2021, జనవరి నుంచి భారతదేశంతో ప్రత్యేక భాగస్వామ్యం(Water Attache) కలిగి ఉండనున్న దేశం?
1) ఇజ్రాయెల్
2) డెన్మార్క్
3) ఫిన్లాండ్
4) నెదర్లాండ్స్
- View Answer
- సమాధానం: 1
22. “ఇంటర్నేషనల్ మైగ్రేషన్ అవుట్ లుక్ 2020” 44వ ఎడిషన్ ప్రకారం... 2018 ఏడాదిలో OECD దేశాలకు వలస వచ్చిన వారి సంఖ్య ఆధారంగా భారత్ ర్యాంక్ ఎంత?(OECD- The Organisation for Economic Co-operation and Development)
1) ఐదు
2) తొమ్మిది
3) రెండు
4) ముప్పై ఆరు
- View Answer
- సమాధానం: 3
23. రక్షణ ఉత్పత్తిలో కోప్రొడక్షన్, కో-డెలలప్మెంట్ అనే అంశంపై భారత్ ఏ దేశంతో చర్చలు జరుపుతోంది?
1) అజర్బైజాన్
2) కజకిస్తాన్
3) కిర్గిజిస్తాన్
4) తుర్క్మెనిస్తాన్
- View Answer
- సమాధానం: 2
24. 2021, మార్చి 26న ఏ దేశపు 50వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్నారు?
1) మయన్మార్
2) నేపాల్
3) మాల్దీవులు
4) బంగ్లాదేశ్
- View Answer
- సమాధానం: 4
25. 3వ స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ 2020 నివేదిక ప్రకారం... 2019 ఏడాదిలో వాయు కాలుష్యం కారణంగా శిశు మరణాల సంఖ్య అత్యధికంగా ఉన్న దేశం ఏది?
1) నేపాల్
2) నైజీరియా
3) భారత్
4) పాకిస్తాన్
- View Answer
- సమాధానం: 3
26. లోవీ ఇన్స్టిట్యూట్ ఆసియా పవర్ ఇండెక్స్-2020 ఎడిషన్ ప్రకారం... ఆసియాలో అత్యంత శక్తివంతమైన దేశాల జాబితాలో భారతదేశ ర్యాంక్ ఏమిటి?
1) నాలుగు
2) రెండు
3) ఒకటి
4) ఐదు
- View Answer
- సమాధానం: 1
27. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) లో 190వ సభ్యదేశంగా చేరిన దేశం ఏది?
1) వాటికన్ సిటీ
2) ప్రిన్సిపాలిటీ ఆఫ్ అండోర్రా
3) క్యూబా
4) నార్త్ కొరియా
- View Answer
- సమాధానం: 2
28. భారతదేశంలో కోవిడ్-19ను అరికట్టే కార్యక్రమాలకు మద్దతుగా USAID ప్రకటించిన మొత్తం ఎంత?
1) ఐదు మిలియన్ల అమెరికా డాలర్లు
2) ఒక మిలియన్ అమెరికా డాలర్లు
3) మూడు మిలియన్ల అమెరికా డాలర్లు
4) రెండు మిలియన్ల అమెరికా డాలర్లు
- View Answer
- సమాధానం: 1
29. కరోనా వైరస్ ను అరికట్టే చర్యలను సమర్థవంతంగా అమలు చేసిన విమానాశ్రయాల్లో... ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచిన విమానాశ్రయం?
1) ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ (ఐజీఐ) విమానాశ్రయం, ఢిల్లీ
2) లండన్ హీత్రో విమానాశ్రయం
3) దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం
4) చాంగి విమానాశ్రయం, సింగపూర్
- View Answer
- సమాధానం: 4
30. ప్రపంచ బ్యాంక్ - ఐఎంఎఫ్ (అంతర్జాతీయ ద్రవ్య నిధి) వార్షిక సమావేశంలో భారతదేశానికి ఎవరు ప్రాతినిధ్యం వహించారు?
1) హర్ష్ వర్ధన్
2) రవిశంకర్ ప్రసాద్
3) ఎస్ జైశంకర్
4) ప్రకాష్ జవ్దేకర్
- View Answer
- సమాధానం: 1
31. “హ్యూమన్ మొబిలిటీ, షేర్డ్ ఆపర్చునిటీస్” అనే నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది?
1) అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)
2) ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యుఎన్‌డీపీ)
3) ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)
4) ప్రపంచ బ్యాంక్
- View Answer
- సమాధానం: 2
32. ట్రాక్టర్ ఫైనాన్స్ వ్యాపారం కోసం... మహీంద్రా, మహీంద్రా (ఎం అండ్ ఎం) సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న బ్యాంక్ ఏది?
1) బ్యాంక్ ఆఫ్ బరోడా
2) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
3) కెనరా బ్యాంక్
4) ఇండియన్ బ్యాంక్
- View Answer
- సమాధానం: 1
33. ‘మూపే’ అనే మొట్టమొదటి ఆటోమెటేడ్ ప్రత్యక్ష చెల్లింపుల ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించిన స్టార్టప్ ఏది?
1) అగ్రివెబ్
2) అఫిమిల్క్
3) బ్రెయిన్వైర్డ్
4) స్టెల్లాయాప్స్
- View Answer
- సమాధానం: 4
34. అంచనాల ప్రకారం... 2020-2021 ఖరీఫ్ కాలంలో దేశంలోని ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎంత?
1) 143.38 మిలియన్ టన్నులు
2) 144.52 మిలియన్ టన్నులు
3) 134.52 మిలియన్ టన్నులు
4) 411.32 మిలియన్ టన్నులు
- View Answer
- సమాధానం: 2
35. చంద్రునిపై మొట్టమొదటి 4జీ సెల్యులార్ నెట్‌వర్క్‌లను నిర్మించడానికి నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ ఏజెన్సీ (నాసా) ఏ సంస్థను ఎంపిక చేసింది?
1) నోకియా
2) రిలయన్స్ జియో
3) సిమెన్స్
4) వొడాఫోన్
- View Answer
- సమాధానం: 1
36. 2 మిలియన్ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను (నెక్స్ట్ జనరేషన్ క్రెడిట్ కార్డులు) ప్రవేశపెట్టడానికి ఏ సంస్థ ప్రణాళిక వేసింది?
1) ఫోన్‌పే
2) పేటీఎం
3) అమెజాన్
4) గూగుల్ పే
- View Answer
- సమాధానం: 2
37. ఎమ్ఎస్ఎమ్ఈ లకు మద్దతుగా ఈక్విటీ ఫండ్లను సేకరించడానికి... ఏ రాష్ట్రంతో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
1) జార్ఖండ్
2) ఆంధ్రప్రదేశ్
3) ఒడిశా
4) తెలంగాణ
- View Answer
- సమాధానం: 4
38. ఐఐటీ-మద్రాస్ ఇంక్యుబేషన్ సెల్ సహకారంతో ఏ బ్యాంక్ “ఐఎన్డీ స్ప్రింగ్ బోర్డ్(IND Spring Board)” అనే స్టార్టప్‌ల కోసం రూ .50 కోట్ల వరకు ప్రత్యేక రుణ సౌకర్యాన్ని ప్రారంభించింది?
1) ఇండియన్ బ్యాంక్
2) ఇండస్ఇండ్ బ్యాంక్
3) బ్యాంక్ ఆఫ్ బరోడా
4) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
- View Answer
- సమాధానం: 1
39. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ది ఇయర్ అవార్డు-2020 ను గెలుచుకున్న బ్యాంక్ ఏది?
1) బ్యాంక్ ఆఫ్ ఘనా (బీవోజీ)
2) బ్యాంక్ ఆఫ్ సింగపూర్ (బీవోఎస్)
3) బ్యాంక్ ఆఫ్ మలేసియా (బీవోఎమ్)
4) బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ (బీవోఈ)
- View Answer
- సమాధానం: 1
40. ఇండియన్ ఎయిర్ ఫోర్స్(ఐఏఎఫ్) కోసం... రూ .753 కోట్ల వ్యయంతో మిగ్ -29 సిమ్యులేటర్ సెంటర్‌ను నిర్మించడానికి, నిర్వహణకు ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ ఏది?
1) ఆల్ఫా డిజైన్ టెక్నాలజీస్ లిమిటెడ్
2) లార్సెన్ & టుబ్రో
3) భారత్ డైనమిక్స్ లిమిటెడ్
4) అగ్నికుల్ కాస్మోస్
- View Answer
- సమాధానం: 1
41. ఐఎమ్ఎఫ్(IMF) అంచనాల ప్రకారం... 2020 ఏడాదిలో ఆసియా ఆర్థిక వ్యవస్థ ఎంత శాతం క్షీణిస్తుంది?
1) 2.2 శాతం
2) 3.2 శాతం
3) 5.2 శాతం
4) 2.5 శాతం
- View Answer
- సమాధానం: 1
42. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా ప్రారంభించిన దేశంలోనే మొదటి రియల్ టైమ్ బేస్ మెటల్స్ ఇండెక్స్ పేరు ఏమిటి?
1) ఐకామ్డెక్స్
2) హెల్ప్డెక్స్
3) మెల్ట్డెక్స్
4) మెటెల్డెక్స్(METLDEX)
- View Answer
- సమాధానం: 4
43. 2020 అక్టోబర్ నెలలో ఐఎన్ఎస్ చెన్నై నుంచి ఏ సూపర్సోనిక్ క్రూయిస్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు?
1) రుద్రం
2) పృథ్వీ -2
3) పృథ్వీ -1
4) బ్రహ్మోస్
- View Answer
- సమాధానం: 4
44. పశ్చిమ బెంగాల్‌కు చెందిన శాస్త్రవేత్తలు 2.5 మిలియన్ సంవత్సరాల పురాతనమైన డ్రాగన్‌ఫ్లై శిలాజాన్ని ఏ రాష్ట్రంలో కనుగొన్నారు?
1) పశ్చిమ బెంగాల్
2) తెలంగాణ
3) కేరళ
4) జార్ఖండ్
- View Answer
- సమాధానం: 4
45. ఒడిశాలోని చాందీపూర్ ఐటీఆర్ నుంచి ఇటీవల పరీక్షించిన స్టాండ్ఆఫ్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సౌల్ ను (SANT Missile) ను అభివృద్ధి చేసిన సంస్థ ఏది?
1) భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ
2) ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్
3) భారత్ డైనమిక్స్ లిమిటెడ్
4) ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు
- View Answer
- సమాధానం: 1
46. ఏ సంస్థతో కలిసి ఫ్రాంటియర్ టెక్నాలజీస్ క్లౌడ్ ఇన్నోవేషన్ సెంటర్ (సీఐసీ)ను నీతి ఆయోగ్ ప్రారంభించింది?
1) ఒరాకిల్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్
2) అమెజాన్ వెబ్ సర్వీసెస్
3) ఐబీఎం క్లౌడ్ సేవలు
4) మైక్రోసాఫ్ట్ అజూర్
- View Answer
- సమాధానం: 2
47. 2021 ఏడాదికి దేశంలో ఏ సంస్థ బ్లాక్ చైన్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించనుంది?
1) బుర్సా బాండ్స్
2) సిటీబ్యాంక్ బెర్హార్డ్
3) బాండ్ఈవాల్యూ
4) పిచ్ ప్లాట్‌ఫామ్స్
- View Answer
- సమాధానం: 3
48. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి సస్టైనబుల్ మునిసిపల్ సాలిడ్ వేస్ట్ (ఎంఎస్‌డబ్ల్యూ) ప్రాసెసింగ్ సౌకర్యాన్ని అభివృద్ధి చేసిన సంస్థ ఏది?
1) సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CMERI)
2) అడ్వాన్స్డ్ మెటీరియల్స్ అండ్ ప్రాసెసెస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (AMPRI)
3) సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CECRI)
4) సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CBRI)
- View Answer
- సమాధానం: 1
49. కోవిడ్-19 ఔషధాలకు సంబంధించిన సమాచారం అందించడానికి సీఎస్ఐఆర్(CSIR) ప్రారంభించిన వెబ్సైట్?
1) కారెడ్(CaRED)
2) క్యూరెడ్(CuRED)
3) క్రెడ్(CRED)
4) సిరెడ్(CSIRED)
- View Answer
- సమాధానం: 2
50. ఇంటర్‌గవర్నమెంటల్ కోఆర్డినేషన్ గ్రూప్ ఇటీవల నిర్వహించిన మాక్ సునామి డ్రిల్ పేరు ఏమిటి?
1) IOTsunami20
2) IOcean20
3) IOLaher20
4) IOWave20
- View Answer
- సమాధానం: 4
51. అంతరిక్షం-అన్వేషణ అనే అంశానికి సంబంధించి భారత్ తో ఏ దేశం సహకార ఒప్పందం చేసుకుంది?
1) నైజీరియా
2) పాపువా న్యూ గినియా
3) మలేసియా
4) నెదర్లాండ్స్
- View Answer
- సమాధానం: 1
52. సివిల్ ఇంజనీరింగ్‌లో విశేషంగా రాణించినందుకుగాను యాన్యువల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ (ICE)-2020 అవార్డుల్లో... బ్రూనెల్ మెడల్ ను గెలుచుకున్న ప్రాజెక్ట్ ఏది?
1) జిలువోడు హైడ్రోపవర్ ప్లాంట్, చైనా
2) గ్రాండ్ కూలీ హైడ్రోపవర్ ప్రాజెక్ట్, యునైటెడ్ స్టేట్స్
3) సయానో-షుషేన్స్కయ హైడ్రోపవర్ ప్లాంట్, రష్యా
4) మంగ్దేచు జలవిద్యుత్ ప్రాజెక్ట్, భూటాన్
- View Answer
- సమాధానం: 4
53. విశాఖపట్నం నావల్ డాక్ యార్డ్ వద్ద ఇటీవల ప్రారంభించిన... యాంటీ సబ్‌మెరైన్ వార్ఫేర్ స్టీల్త్ కొర్వెట్టి పేరు ఏమిటి?
1) ఐఎన్ఎస్ కవరట్టి
2) ఐసీజీఎస్ కనక్లత బారువా
3) ఐఎన్ఎస్ చెన్నై
4) ఐసీజీఎస్ విరాజ్
- View Answer
- సమాధానం: 1
54. “కోవిరాప్” అనే కోవిడ్ -19 టెస్ట్ కిట్‌ను అభివృద్ధి చేసిన సంస్థ ఏది?
1) ఐఐటీ కాన్పూర్
2) ఐఐటీ మద్రాస్
3) ఐఐటీ బాంబే
4) ఐఐటీ ఖరగ్‌పూర్
- View Answer
- సమాధానం: 4
55. మ్యాపులకు సంబంధించిన సమాచారంతో ఇటీవల గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రారంభించిన పోర్టల్ పేరు ఏమిటి?
1) ఈ-ధరణి జియో పోర్టల్
2) ఈ-భూమి జియో పోర్టల్
3) ఈ-ధార్తి జియో పోర్టల్
4) ఈ-పృథ్వీ జియో పోర్టల్
- View Answer
- సమాధానం: 3
56. ఇటీవల అరేబియా సముద్రంలో పరీక్షించబడిన యాంటీ షిప్ మిస్సైల్(ASHM) పేరు ఏమిటి?
1) ఐఎన్ఎస్ విక్రమాదిత్య
2) ఐఎన్ఎస్ విరాట్
3) ఐఎన్ఎస్ విగ్రహా
4) ఐఎన్ఎస్ ప్రబల్
- View Answer
- సమాధానం: 4
57. ఇటీవల గుర్తింపు పొందిన ఉత్తరాఖండ్‌లోని మొదటి రామ్సర్ సైట్ ఏది?
1) అసన్ కన్జర్వేషన్ రిజర్వ్
2) సమన్ బర్డ్ శాంక్చుయరీ
3) బియాస్ కన్జర్వేషన్ రిజర్వ్
4) పార్వతి బర్డ్ శాంక్చుయరీ
- View Answer
- సమాధానం: 1
58. ప్రపంచ బ్యాంకు సహాయంతో దేశంలో మొట్టమొదటి ఇసుక దిబ్బ పార్కును(శాండ్ డున్ పార్క్) ఏ రాష్ట్రం అభివృద్ధి చేయబోతోంది?
1) గుజరాత్
2) రాజస్థాన్
3) గోవా
4) తెలంగాణ
- View Answer
- సమాధానం: 3
59. నాసికా కుహరం, గొంతు మధ్య దాగి ఉన్న ‘ట్యూబరియల్ గ్రంథి’ అనే కొత్త జత లాలాజల గ్రంథులను ఏ దేశ పరిశోధకులు కనుగొన్నారు?
1) న్యూజిలాండ్
2) నెదర్లాండ్స్
3) ఫిన్లాండ్
4) స్విట్జర్లాండ్
- View Answer
- సమాధానం: 2
60. న్యూజిలాండ్ ప్రధానిగా ఎవరు ఎన్నికయ్యారు?
1) కాన్స్టాంటినా డిటా
2) కాట్రిన్ జాకోబ్స్డోట్టిర్
3) జసిండా ఆర్డెర్న్
4) సన్నా మెరైన్
- View Answer
- సమాధానం: 3
61. సెబీ ఏర్పాటు చేసిన మార్కెట్ డేటా సలహా కమిటీకి ఎవరు నాయకత్వం వహిస్తారు?
1) మాధాబి పూరి బుచ్
2) సందీప్ త్యాగి
3) పవన్ రాయ్ జి
4) రమేష్ పూరి
- View Answer
- సమాధానం: 1
62. వ్యవసాయ వ్యర్థాలను కాల్చడాన్ని నిరోధించడానికి, పర్యవేక్షించడానికి సుప్రీంకోర్టు ఎవరి నేతృత్వంలో ఏక సభ్య కమిటీని ఏర్పాటు చేసింది?
1) శరద్ అరవింద్ బొబ్డే
2) అజ్జికుత్తిరా సోమయ్య బోపన్న
3) వి రామసుబ్రమణియన్
4) మదన్ భీమారావు లోకూర్
- View Answer
- సమాధానం: 4
63. స్టాండర్డ్ సైబర్ లయబిలిటీ ఇన్సురెన్స్ అవసరాన్ని పరిశీలించడానికి ఐఆర్ఢీఏఐ(IRDAI) ఏర్పాటు చేసిన తొమ్మిది సభ్యుల ప్యానెల్‌కు ఎవరు నాయకత్వం వహిస్తారు?
1) పి ఉమేష్
2) అజయ్ కుమార్ భల్లా
3) అజయ్ త్యాగి
4) తుషార్ మెహతా
- View Answer
- సమాధానం: 1
64. లెబనాన్ ప్రధానిగా ఎవరు ఎన్నికయ్యారు?
1) హసన్ డియాబ్
2) ముస్తఫా ఆదిబ్
3) సాద్ ఎల్-దిన్ హరిరి
4) డెనిస్ ష్మిహాల్
- View Answer
- సమాధానం: 3
65. 2020, అక్టోబర్ - 2021, జూన్ కాలానికి సంబంధించి అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) పాలకమండలి చైర్‌పర్సన్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) రాజీవ్ గౌబా
2) రాజీవ్ కుమార్
3) అపూర్వ చంద్ర
4) అజయ్ కుమార్ భల్లా
- View Answer
- సమాధానం: 3
66. డానిసా డెన్మార్క్ ఓపెన్-2020 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ విభాగంలో టైటిల్ విజేత ఎవరు?
1) అండర్స్ అంటోన్సెన్
2) నోజోమి ఒకుహారా
3) కిడాంబి శ్రీకాంత్
4) యుకీ ఫుకుషిమా
- View Answer
- సమాధానం: 1
67. ప్రతి ఏటా అంతర్జాతీయ చెఫ్స్(Chefs) దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
1) అక్టోబర్ 20
2) అక్టోబర్ 15
3) అక్టోబర్ 12
4) అక్టోబర్ 13
- View Answer
- సమాధానం: 1
68. ప్రపంచ గణాంక దినోత్సవాన్ని ఏటా ఎప్పుడు నిర్వహిస్తారు?
1) అక్టోబర్ 20
2) అక్టోబర్ 25
3) అక్టోబర్ 30
4) అక్టోబర్ 31
- View Answer
- సమాధానం: 1
69. ఏటా ఏ రోజున పోలీసు స్మారక దినోత్సవం జరుపుకుంటారు?
1) అక్టోబర్ 18
2) అక్టోబర్ 19
3) అక్టోబర్ 20
4) అక్టోబర్ 21
- View Answer
- సమాధానం: 4
70. అంతర్జాతీయ మంచు చిరుత దినోత్సవాన్ని ఏటా తఏ రోజున జరుపుకుంటారు?
1) అక్టోబర్ 20
2) అక్టోబర్ 21
3) అక్టోబర్ 22
4) అక్టోబర్ 23
- View Answer
- సమాధానం: 4
71. ఐక్యరాజ్యసమితి (యుఎన్) దినోత్సవాన్ని ఏ రోజు పాటిస్తారు?
1) అక్టోబర్ 15
2) అక్టోబర్ 24
3) అక్టోబర్ 15
4) అక్టోబర్ 14
- View Answer
- సమాధానం: 2
72. ఏటా అక్టోబర్ 24 న పాటించే ప్రపంచ పోలియో దినోత్సవాన్ని 2020 ఏడాది ఏ ఇతివృత్తంతో జరుపుకున్నారు?
1) ఎండ్ పోలియో నౌ
2) మేక్ హిస్టరీ టుడే
3) ఏ విన్ ఎగైనెస్ట్ పోలియో ఈజ్ ఏ విన్ ఫర్ గ్లోబల్ హెల్త్
4) ఏ సెలబ్రేషన్ అఫ్ ది అన్సంగ్ హీరోస్ అఫ్ పోలియో ఏరేడికేషన్
- View Answer
- సమాధానం: 3
73. “షేక్ ముజిబర్ రెహ్మాన్” పై భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాసిన పుస్తకం పేరు ఏమిటి?
1) ది అన్ ఫినిషిడ్ మోమోరీస్
2) వాయిస్ అఫ్ మిలియన్స్
3) వన్ ఇన్ ఏ మిలియన్
4) మిలియన్ వాయిసెస్ ఇన్ మై మైండ్
- View Answer
- సమాధానం: 2
74. “పోర్ట్రెయిట్స్ ఆఫ్ పవర్: హాఫ్ ఎ సెంచరీ ఆఫ్ బీయింగ్ అట్ రింగ్‌సైడ్” పేరుతో ఏ ఆర్థికవేత్త తన ఆత్మకథను విడుదల చేశారు?
1) కిషోర్ భీమణి
2) ప్రదీప్ గూర్హా
3) నంద్ కిషోర్ సింగ్
4) శశి థరూర్
- View Answer
- సమాధానం: 3
75. ప్రపంచ మానవ వనరుల అభివృద్ధి (హెచ్ఆర్డీ) కాంగ్రెస్ నిర్వహించిన నేషనల్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్-పీఎస్‌యూ(PSU) కార్యక్రమంలో... సీఈవో ఆఫ్ ది ఇయర్ అండ్ విజనరీ లీడర్షిప్ అవార్డును ఎవరు అందుకున్నారు?
1) డెబాసిష్ పాండా
2) కె అనంత్ కృష్ణన్
3) ప్రసిద్ధ కృష్ణ
4) ప్రవీర్ కృష్ణ
- View Answer
- సమాధానం: 4
76. వ్యాపార రంగంలో మహిళలను పోత్సహించడాని నిర్వహించిన 17 వ వార్షిక స్టీవ్ అవార్డుల కార్యక్రమంలో లైఫ్ టైం అచీవ్మెంట్-బిజినెస్ కేటగిరిలో గోల్డ్ స్టీవ్ అవార్డును గెలుచుకున్న వ్యక్తి?
1) హేమ గుప్తా
2) నీనా గుప్తా
3) సీమా గుప్తా
4) ఐశ్వర్య శ్రీధర్
- View Answer
- సమాధానం: 3
77. వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్-2020 అవార్డును గెలుచుకున్న మొదటి భారతీయ మహిళ ఎవరు?
1) సీమా గుప్తా
2) నిహాల్ సరిన్
3) ఐశ్వర్య శ్రీధర్
4) సునిధి
- View Answer
- సమాధానం: 3