కరెంట్ అఫైర్స్ (ఆగస్టు 1 - 7, 2019) బిట్ బ్యాంక్
1. న్యూఢిల్లీలోని నేషనల్ బాల్ భవన్లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఫెసిలిటేషన్–కమ్–పబ్లిసిటీ పెవిలియన్‌ను ఎవరు ప్రారంభించారు?
1) పీయూష్ గోయల్
2) రమేశ్ పోఖ్రియాల్ ‘నిశాంక్’
3) అర్జున్ ముండా
4) ప్రకాశ్ జవదేకర్
- View Answer
- సమాధానం: 2
2. జాతీయ ఆహార భద్రతను పెంచడానికి ఏ నాలుగు రాష్ట్రాల్లో ‘వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్’ పథకం ప్రారంభమైంది?
1)అరుణాచల్‌ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్
2) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్
3) తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్
4) తెలంగాణ, కేరళ, కర్ణాటక, గుజరాత్
- View Answer
- సమాధానం: 2
3. పోలీసు దర్యాప్తునకు సహాయపడటానికి ‘ఆటోమేటెడ్ మల్టీ–మోడల్ బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ (ఏఎంబీఐఎస్)’ అనే ప్రత్యేక డిజిటైజ్డ్ పోలీసింగ్ వ్యవస్థను ఏ రాష్ట్రం ప్రారంభించింది?
1) గుజరాత్
2) కేరళ
3) మహారాష్ట్ర
4) కర్ణాటక
- View Answer
- సమాధానం: 3
4. ప్రో–యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ (ప్రగతి) ప్లాట్ఫార్మ్, 30 వ పరస్పర చర్యకు అధ్యక్షత వహించింది ఎవరు?
1) రాజ్‌నాథ్ సింగ్
2) అమిత్ షా
3) నరేంద్ర మోదీ
4) నిర్మలా సీతారామన్
- View Answer
- సమాధానం: 3
5. ముస్లిం మహిళలు (వివాహంపై హక్కుల పరిరక్షణ) చట్టం, 2019 ప్రకారం ముస్లింలలో తక్షణ ‘ట్రిపుల్ తలాక్’ పాటిస్తే ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది?
1) 3 ఏళ్లు
2) 5 ఏళ్లు
3) 7 ఏళ్లు
4) యావజ్జీవం
- View Answer
- సమాధానం: 1
6. ఏ సిక్కు మత స్థాపకుడి 550 వ జయంతి సందర్భంగా పాకిస్తాన్ నుంచి ‘నగర్ కీర్తన్’ (సిక్కు మత ఉత్సవ ఊరేగింపు) విభజన తర్వాత, తొలిసారి భారతదేశానికి చేరుకుంది?
1) గురునానక్ దేవ్
2) గురు గోబింద్ సింగ్
3) గురు అర్జన్
4) గురు తేగ్ బహదూర్
- View Answer
- సమాధానం: 1
7. నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ)లో ఎంత మంది సభ్యులు ఉంటారు?
1) 35 మంది సభ్యులు
2) 30 మంది సభ్యులు
3) 25 మంది సభ్యులు
4) 20 మంది సభ్యులు
- View Answer
- సమాధానం: 3
8.ప్రపంచంలో తొలి అల్ట్రా–ఫాస్ట్ హైపర్‌లూప్ ప్రాజెక్టు నిర్మాణానికి 10 బిలియన్ డాలర్ల ప్రణాళిక కోసం మౌలిక సదుపాయాల ప్రాజెక్టు హోదా పొందిన రాష్ట్రం?
1) మహారాష్ట్ర
2) తమిళనాడు
3) ఉత్తరప్రదేశ్
4) గుజరాత్
- View Answer
- సమాధానం: 1
9. ఆడపిల్లల సంక్షేమం కోసం ‘వాలీ డిక్రీ యోజన’ అనే ప్రధాన ఆర్థిక సహాయ పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం?
1) ఉత్తరప్రదేశ్
2) మహారాష్ట్ర
3) అసోం
4) గుజరాత్
- View Answer
- సమాధానం: 4
10.తదుపరి సమావేశాల నుంచి ఏ ప్రభుత్వ సంస్థ కాగిత రహితంగా (పేపర్‌లెస్) మారుతుంది?
1) లోక్‌సభ
2) రాజ్యసభ
3) 1, 2
4) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: 1
11. ‘రీజనల్ కాన్ఫరెన్స్ ఆన్ గుడ్ గవర్నెన్స్’కు వేదిక కానున్న నగరం?
1) చెన్నై, తమిళనాడు
2) న్యూఢిల్లీ, ఢిల్లీ
3) జైపూర్, రాజస్థాన్
4) ముంబై, మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 3
12. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఏ అధికరణలను ప్రభుత్వం రద్దు చేసింది?
1) అధికరణ 350, 31 ఏ
2) అధికరణ 370, 31 ఏ
3) అధికరణ 350, 35 ఏ
4) అధికరణ 370, 35 ఏ
- View Answer
- సమాధానం: 4
13.ఢిల్లీ, పుదుచ్చేరి మాదిరిగా శాసనసభ కలిగి ఉండే కొత్త కేంద్ర పాలిత ప్రాంతం?
1) జమ్ముకశ్మీర్
2) లదాఖ్, గిల్గిత్
3) లదాఖ్
4) 1, 3
- View Answer
- సమాధానం: 1
14. సుప్రీంకోర్టు (న్యాయమూర్తుల సంఖ్య) సవరణ బిల్లు 2019 ప్రకారం భారత ప్రధాన న్యాయమూర్తితో సహా సుప్రీంకోర్టులో సవరించిన న్యాయమూర్తుల సంఖ్య ఎంత ?
1) 31
2) 32
3) 33
4) 34
- View Answer
- సమాధానం: 4
15. ఏ నదుల అనుసంధాన ప్రాజెక్టుకు పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (ఎంఓఈఎఫ్సీసీ) నుంచి అనుమతితో పాటు రూ. 4,900 కోట్లు లభించాయి?
1) గోమతి, బెత్వా
2) కోసి, మెఖీ
3) దిహింగ్, మానస్
4) కుల్సీ, కోపిలి
- View Answer
- సమాధానం: 2
16.వెరిస్క్ మాప్లెక్రాఫ్ట్– ‘వాటర్ స్ట్రెస్ ఇండెక్స్ 2019’ ప్రకారం ప్రపంచంలో అత్యంత ప్రమాదకర దేశాలలో భారతదేశం స్థానం?
1) 38
2) 35
3) 40
4) 46
- View Answer
- సమాధానం: 4
17. $20 నుంచి $40 వరకూ ఉన్న వీసా ఫీజు నుంచి భారత పర్యాటకులను మినహాయించిన దేశం?
1) శ్రీలంక
2) మయన్మార్
3) మాల్దీవులు
4) థాయ్‌లాండ్
- View Answer
- సమాధానం: 1
18. 2018 ప్రపంచ బ్యాంక్ గణాంకాల ప్రకారం ప్రపంచ జీడీపీ ర్యాంకింగ్స్‌లో 20.5 ట్రిలియన్ డాలర్లతో ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన దేశం?
1) జర్మనీ
2) అమెరికా
3) చైనా
4) జపాన్
- View Answer
- సమాధానం: 2
19. రక్షణ సమస్యలపై 2019లో 15వ ‘ఇండియా–యుఎస్ డిఫెన్స్ పాలసీ గ్రూప్’ సమావేశం ఎక్కడ జరిగింది?
1) వాషింగ్టన్ డి.సి. యూఎస్ఏ
2) ముంబై, భారత్
3) న్యూయార్క్, యూఎస్ఏ
4) న్యూఢిల్లీ, భారత్
- View Answer
- సమాధానం: 1
20.ప్రజా రవాణా, ప్రభుత్వ భవనాలు, ఆరోగ్య, విద్యా సంస్థలతో సహా బహిరంగ ప్రదేశాల్లో బురఖా లేదా నికాబ్‌పై నిషేధం విధించిన దేశం?
1) డెన్మార్క్
2) స్విట్జర్లాండ్
3) నెదర్లాండ్స్
4) బెల్జియం
- View Answer
- సమాధానం: 3
21. ఆఫ్రికన్ దేశాలు – బెనిన్, ది గాంబియా, గినియాలను ఇటీవల సందర్శించిన తొలి భారతీయ నేత ఎవరు?
1) రాజ్‌నాథ్ సింగ్
2) వెంకయ్య నాయుడు
3) రామ్‌నాథ్ కోవింద్
4) నరేంద్ర మోదీ
- View Answer
- సమాధానం: 3
22. 2019–2023 సంవత్సరాలకు సాంస్కృతిక మార్పిడి కార్యక్రమానికి ఇటీవల ఏ రెండు దేశాలు సంతకం చేశాయి?
1) భారత్, గినియా
2) భారత్, బెనిన్
3) భారత్, గాంబియా
4) భారత్, ఘన
- View Answer
- సమాధానం: 2
23. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు అంతర్జాతీయ సౌర కూటమి ముసాయిదా ఒప్పందం ధ్రువీకరణ సాధనాన్ని (ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ రాటిఫికేషన్) ఏ దేశం అందించింది?
1) గాంబియా
2) జాంబియా
3) గినియా
4) ఘనా
- View Answer
- సమాధానం: 1
24.ఏ దేశం తమ అత్యున్నత పురస్కారం ‘ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్’ను భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ప్రదానం చేసింది?
1) ఘనా
2) గినియా
3) గాంబియా
4) బెనిన్
- View Answer
- సమాధానం: 2
25. వ్యక్తులు, ఎస్ఎంఈలకు ఇంటి వద్దనే మైక్రో క్రెడిట్ అందించే లక్ష్యంతో ఏ బ్యాంక్‌ను స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (ఎస్ఎఫ్బీ)గా మార్చనున్నారు?
1) జియో పేమెంట్స్ బ్యాంక్
2) ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్
3)ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్(ఐపీపీబీ)
4) ఆదిత్య బిర్లా పేమెంట్స్ బ్యాంక్
- View Answer
- సమాధానం: 3
26. బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజలకు జ్ఞానాన్ని మెరుగుపరిచేందుకు ఆర్బీఐ – మనీ మ్యూజియం ఎక్కడ ప్రారంభమైంది?
1) చెన్నై, తమిళనాడు
2) ముంబై, మహారాష్ట్ర
3) న్యూఢిల్లీ, ఢిల్లీ
4) కోల్‌కత, పశ్చిమ బంగా
- View Answer
- సమాధానం: 4
27. భారత్‌కు చెందిన ఏ బ్యాంక్ షాంఘాయ్ శాఖ, చైనా నేషనల్ అడ్వాన్స్ పేమెంట్ సిస్టమ్ (సిఎన్ఏపీఎస్)తో చేరి, అనుసంధానమైన తొలి బ్యాంక్‌గా ఆవిర్భవించింది?
1) కెనరా బ్యాంక్
2) ఎస్బీఐ
3) ఐసీఐసీఐ బ్యాంక్
4) హెచ్డీఎఫ్సీ బ్యాంక్
- View Answer
- సమాధానం: 2
28. 2019–20 సంవత్సరానికి ఆర్బీఐ మూడో ద్వి–మాస ద్రవ్య విధానం ప్రకారం రెపో రేటు ఎంత?
1) 5.65 %
2) 5.15 %
3) 5.40 %
4) 5.75 %
- View Answer
- సమాధానం: 3
29. 2019 జూలై 6న మార్చిన స్టాట్యూటరీ లిక్విడ్ రేషియో(ఎస్ఎల్ఆర్) ఎంత?
1) 18.75%
2) 19.0%
3) 19.25%
4) 19.50%
- View Answer
- సమాధానం: 1
30. ఆర్బీఐ అంచనా వేసిన స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు?
1) 6.5 %
2) 6.7 %
3) 6.8 %
4) 6.9 %
- View Answer
- సమాధానం: 4
31. స్ట్రోక్ (పక్షవాతం) రోగుల పునరావాసం కోసం ప్రపంచంలో తొలి రోబో చేతిని ఏ సంస్థ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు?
1) ఐఐటీ మద్రాస్
2) ఐఐటీ ఢిల్లీ
3) ఐఐటీ కాన్పూర్
4) ఐఐటీ ఖరగపూర్
- View Answer
- సమాధానం: 4
32. లదాఖ్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ (ఎల్ఏహెచ్డీíసీ) ల్యాబ్‌తో కలిసి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) పాష్మినా కోసం పరీక్షా కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనుంది?
1) లేహ్, జమ్మూకశ్మీర్
2) ఉదంపూర్, జమ్మూకశ్మీర్
3) శ్రీనగర్, జమ్మూకశ్మీర్
4) పహెల్గామ్, జమ్మూకశ్మీర్
- View Answer
- సమాధానం: 1
33.కొత్తగా పరీక్షించిన క్విక్ రియాక్షన్ సర్ఫేస్–టు–ఎయిర్ క్షిపణి (క్యూఆర్ఎస్ఏఎం) లక్ష్య సామర్థ్యం ?
1) 30–35 కి.మీ.
2) 25–30 కి.మీ.
3) 35–40 కి.మీ.
4) 40–45 కి.మీ.
- View Answer
- సమాధానం: 2
34. చిట్కార విశ్వవిద్యాలయ విద్యార్థులు రూపొందించిన భారతదేశపు తొలి 3–డి స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నల్ ‘ఇంటెలైట్స్’ను ఎక్కడ ప్రారంభించారు?
1) మొహాలీ, పంజాబ్
2) జైపూర్, రాజస్థాన్
3) చంఢీగఢ్, హరియాణ
4) వారణాసి, ఉత్తరప్రదేశ్
- View Answer
- సమాధానం: 1
35. ‘యాసిన్‘, ‘బాలాబన్‘ ‘ఘయీమ్‘ కొత్త సిరీస్ ప్రిసిషన్–గైడెడ్ మిసైళ్లను ఇటీవల ఏ దేశం ఆవిష్కరించింది?
1) పాకిస్తాన్
2) ఇరాన్
3) ఇరాక్
4) ఉత్తర కొరియా
- View Answer
- సమాధానం: 2
36. నార్కోటిక్స్ సెంట్రల్ బ్యూరో(ఎన్సీబీ) డైరెక్టర్జనరల్గాఎవరు నియమితులయ్యారు?
1) రాకేష్ ఆస్తానా
2) సందీప్ ఆస్తానా
3) హరీశ్ మాథుర్
4) సంతోష్ రాథోడ్
- View Answer
- సమాధానం: 1
37. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) గా బాధ్యతలు స్వీకరించిన ఇండియన్ సివిల్ అకౌంట్స్ సర్వీస్ (ఐసీఏఎస్) అధికారి పేరు?
1) రావూసాహెబ్ దన్వీ
2) బాబుల్ సుప్రియో
3) గిరిరాజ్ ప్రసాద్ గుప్తా
4) రాందాస్ అథ్వాలే
- View Answer
- సమాధానం: 3
38. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) చీఫ్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) ప్రభాత్ కుమార్
2) ప్రవీణ్ శ్రీవాత్సవ
3) పి.కె. సిన్హా
4) అజిత్ సేథ్
- View Answer
- సమాధానం: 2
39. హెచ్ఎస్బీసీ తాత్కాలిక సీఈఓగా ఎవరు నియమితులయ్యారు?
1) యున్ లిన్ లీ
2) ఇవెన్ జేమ్స్ స్టీవెన్సన్
3) నోయల్ క్విన్
4) మార్క్ ఎడ్వర్డ్ టక్కర్
- View Answer
- సమాధానం: 3
40.పవర్ గ్రిడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్– చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) ఘనశ్యామ్ ప్రసాద్
2) సీమా గుప్తా
3) కందికుప్ప శ్రీకాంత్
4) ఎస్. శ్రీకాంత్
- View Answer
- సమాధానం: 3
41. మహిళల సింగిల్స్ విభాగం బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ర్యాంకింగ్‌లో అగ్రస్థానంలో ఉన్నది ఎవరు?
1) సైనా నేహ్వాల్
2) పి.వి. సింధూ
3) నజోమీ ఒకుహారా
4) అకాని యమగుచి
- View Answer
- సమాధానం: 4
42. హంగేరియన్ గ్రాండ్ ప్రిక్స్ 2019 విజేత?
1) చార్లెస్ లెక్లెర్క్
2) సెబాస్టియన్ వెటల్
3) మాక్స్ వర్స్టాపెన్
4) లూయిస్ హామిల్టన్
- View Answer
- సమాధానం: 4
43.పోలాండ్లోని వార్సాలో జరిగిన పోలాండ్ ఓపెన్ రెజ్లింగ్ టోర్నమెంట్లో మహిళల 53 కిలోల విభాగంలో బంగారు పతకం సాధించిన భారతీయ రెజ్లర్?
1) బబితా కుమారీ
2) వినేశ్ ఫోగట్
3) సాక్షి మాలిక్
4) కవితా దేవి
- View Answer
- సమాధానం: 2
44. ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన డేనియల్ వెటోరీ ఏ దేశ క్రికెటర్ ?
1) ఇంగ్లండ్
2) వెస్టిండీస్
3) న్యూజిలాండ్
4) ఆస్ట్రేలియా
- View Answer
- సమాధానం: 3
45.అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టెస్ట్ ర్యాంకుల్లో ఏ దేశ జట్టు అగ్రస్థానం దక్కించుకుంది?
1) బంగ్లాదేశ్
2) న్యూజిలాండ్
3) భారత్
4) ఆస్ట్రేలియా
- View Answer
- సమాధానం: 3
46.ప్రతి ఏటా హిరోషిమా దినాన్ని ఎప్పుడు పాటిస్తారు?
1) ఆగస్టు 3
2) ఆగస్టు 4
3) ఆగస్టు 5
4) ఆగస్టు 6
- View Answer
- సమాధానం: 4
47. ఏటా జాతీయ చేనేత దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
1) ఆగస్టు 3
2) ఆగస్టు 5
3) ఆగస్టు 7
4) ఆగస్టు 8
- View Answer
- సమాధానం: 3
48. కర్ణాటకలోని గుల్బర్గాకు చెందిన అతి పిన్న వయస్కుడిని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ‘ప్రైడ్ ఆఫ్ నేషన్ అవార్డు’తో సత్కరించారు. ఆయన పేరు?
1) బాలమురళి అంబటి
2) హీనల్ రాయ్‌చుర
3) వినాయక్ ఎస్. హిరేమత్
4) ఆకృత్ జస్వాల్
- View Answer
- సమాధానం: 3
49.‘భారత్ గౌరవ్ అవార్డు 2019’ను అందుకున్న భారత క్రికెటర్?
1) సౌరవ్ గంగూలీ
2) సచిన్ టెండూల్కర్
3) కపిల్ దేవ్
4) సునీల్ గవాస్కర్
- View Answer
- సమాధానం: 3
50. ప్రఖ్యాత మహిళల గౌరవార్థం ‘ది బుక్ ఆఫ్ గట్సీ ఉమెన్‘ అనే పుస్తకాన్ని ఎవరెవరు కలిసి రచించనున్నారు?
1) హిల్లరీ క్లింటన్, చెల్సియా క్లింటన్
2) సారాహ్ పాలిన్, చెల్సియా క్లింటన్
3) నాన్సీ పిలోసీ, హిల్లరీ క్లింటన్
4) మార్గెరెట్ థాచెర్, నాన్సీ పిలోసీ
- View Answer
- సమాధానం: 1