కరెంట్ అఫైర్స్ ( జాతీయం) ప్రాక్టీస్ టెస్ట్ ( 2-8, December, 2021)
1. స్కూల్ పిల్లల స్టార్ట్-అప్ ఐడియాలను పెట్టుబడిదారులకు అందించడంలో సహాయపడటానికి బిజినెస్ బ్లాస్టర్స్ టీవీ షోని ప్రారంభించిన రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం?
ఎ) ఉత్తర ప్రదేశ్
బి) తమిళనాడు
సి) మహారాష్ట్ర
డి) ఢిల్లీ
- View Answer
- Answer: డి
2. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) మెకానిజం సహాయంతో 2020-21 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఎంత మొత్తంలో ఆదా అవుతుందని అంచనా వేసింది?
ఎ) ₹55000 కోట్లు
బి) ₹20000 కోట్లు
సి) ₹35000 కోట్లు
డి) ₹44000 కోట్లు
- View Answer
- Answer: డి
3. ఏ రాష్ట్రానికి రూ. 1816 కోట్ల విలువైన తాగునీటి సరఫరా పథకాలను స్టేట్ లెవల్ స్కీమ్ శాంక్షనింగ్ కమిటీ (SLSSC)ఆమోదించింది ?
ఎ) హరియాణ
బి) రాజస్థాన్
సి) ఉత్తర ప్రదేశ్
డి) బిహార్
- View Answer
- Answer: బి
4. వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా లీడర్షిప్ ఫోరమ్ ఆన్ ఫైనాన్షియల్ టెక్నాలజీ (ఫిన్‌టెక్)ని ఎవరు ప్రారంభించారు?
ఎ) నరేంద్ర మోడీ
బి) అమిత్ షా
సి) జితేంద్ర సింగ్
డి) రాజ్‌నాథ్ సింగ్
- View Answer
- Answer: ఎ
5. ప్రెసిడెంట్స్ కలర్ అవార్డును అందుకున్న 8వ స్టేట్ పోలీస్ ఆఫ్ ఇండియాగా నిలిచినది ఏ రాష్ట్ర పోలీసులు ?
ఎ) ఉత్తరాఖండ్
బి) ఉత్తరప్రదేశ్
సి) మధ్యప్రదేశ్
డి) హిమాచల్ ప్రదేశ్
- View Answer
- Answer: డి
6. హార్న్‌బిల్ ఫెస్టివల్ 22వ ఎడిషన్ ఏ రాష్ట్రంలో జరిగింది?
ఎ) నాగాలాండ్
బి) అసోం
సి) మణిపూర్
డి) మేఘాలయ
- View Answer
- Answer: ఎ
7. సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దూరదర్శన్ కేంద్రం ఎర్త్ స్టేషన్‌ను ఏ నగరంలో ప్రారంభించారు?
ఎ) గోరఖ్‌పూర్
బి) లక్ నవూ
సి) వారణాసి
డి) కాన్పూర్
- View Answer
- Answer: ఎ
8. మహీంద్రా గ్రూప్ ఎన్ని సంవత్సరాల గుర్తుగా స్మారక పోస్టల్ స్టాంపును కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి దేవుసిన్ చౌహాన్ విడుదల చేశారు?
ఎ) 65
బి) 75
సి) 80
డి) 85
- View Answer
- Answer: బి
9. స్మార్ట్ సిటీస్ మిషన్ అమలు కోసం కేంద్ర హౌసింగ్ & పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కాలపరిమితిని ఏ సంవత్సరానికి పొడిగించింది?
ఎ) మే 2025
బి) డిసెంబర్ 2024
సి) మే 2022
డి) జూన్ 2023
- View Answer
- Answer: డి
10. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకారం 2024-25 నాటికి రక్షణ ఎగుమతి లక్ష్యాన్ని ఎంతకి చేరుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది?
ఎ) ₹25000 కోట్లు
బి) ₹20000 కోట్లు
సి) ₹40000 కోట్లు
డి) ₹35000 కోట్లు
- View Answer
- Answer: డి
11. మార్చి 2025 నాటికి దేశవ్యాప్తంగా ఎన్ని ప్రధాన మంత్రి భారతీయ జన్ ఔషధి కేంద్రాలను (PMBJK) ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది?
ఎ) 8000
బి) 9500
సి) 10000
డి) 10500
- View Answer
- Answer: డి
12. సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ కోసం ఈ సంవత్సరం యునెస్కో ఆసియా-పసిఫిక్ అవార్డులలో ఏ ప్రాజెక్ట్ దేశానికి రెండు విభాగాల్లో అవార్డులను తెచ్చిపెట్టింది?
ఎ) గోరఖ్‌పూర్
బి) వారణాసి
సి) లక్ నవూ
డి) నిజాముద్దీన్
- View Answer
- Answer: డి
13.కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ నేషనల్ జెనరిక్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ సిస్టమ్, బనాధికార్ మొబైల్ యాప్‌ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
ఎ) నాగాలాండ్
బి) త్రిపుర
సి) అసోం
డి) మేఘాలయ
- View Answer
- Answer: బి
14. షెడ్యూల్డ్ కులాల విద్యార్థుల సామాజిక ఆర్థిక అభ్యున్నతి కోసం సామాజిక న్యాయం, సాధికారత మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ ఏ పథకాన్ని ప్రారంభించారు?
ఎ) శ్రేష్ట
బి) అపూర్వ
సి) స్వామ్టివ్
డి) PMSWAI
- View Answer
- Answer: ఎ
15. భారతదేశంలో అంతరించిపోతున్న భాషల రక్షణ, పరిరక్షణ కోసం కేంద్రం ఎన్ని భాషల కోసం పథకాన్ని ప్రారంభించింది?
ఎ) 121
బి) 95
సి) 117
డి) 110
- View Answer
- Answer: సి