Yashaswini elected for national level football training camp: జాతీయస్థాయి ఫుట్‌బాల్ శిక్షణ శిబిరానికి యశస్విని
Sakshi Education
అనంతపురం జిల్లాలో ఈ నెల 5 నుంచి 10 వరకు జరిగే జాతీయస్థాయి ఫుట్‌బాల్ శిక్షణ శిబిరానికి కాకినాడకు చెందిన నాని కృష్ణ యశస్విని ఎంపికయిందని కాకినాడ జిల్లా క్రీడామైదానం ఫుట్‌బాల్ కోచ్ స్వామి బుధవారం తెలిపారు.
ఈ నెల 3, 4 తేదీల్లో రాష్ట్ర ఫుట్‌బాల్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్ జోనల్ పోటీలలో యశస్విని ప్రతిభను కనపరిచింది. ఈ నెల 10 నుంచి 20 వరకు కర్ణాటకలోని బెల్గామ్‌లో అండర్–13 జాతీయస్థాయి ఫుట్‌బాల్ పోటీలు జరగనున్నాయి. అనంతపురంలో శిక్షణ శిబిరంలో మంచి ప్రదర్శన కనబరిస్తే జాతీయస్థాయికి ఎంపికయ్యే అవకాశాలు యశస్వినికి ఉన్నాయని కోచ్ స్వామి తెలిపారు. బాలిక 6వ తరగతి చదువుతోంది.
Published date : 08 Sep 2023 11:48AM