United Health Care: యునైటెడ్ హెల్త్‌కేర్ సీఈవో హత్య
Sakshi Education
అమెరికాలో ఆరోగ్యరంగ దిగ్గజం యునైటెడ్‌హెల్త్ గ్రూప్ సంస్థలో ఇన్సురెన్స్ విభాగమైన యునైటెడ్‌హెల్త్‌కేర్ సంస్థకు సీఈఓగా సేవలందిస్తున్న బ్రియాన్ థాంప్సన్ హత్యకు గురయ్యారు.
డిసెంబర్ 4వ తేదీ అమెరికాలోని మిడ్‌టౌన్ మన్‌హాట్టన్‌లో గుర్తుతెలియని ఆగంతకుడు కాల్పులు జరిపాడు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది. పెట్టుబడిదారుల సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన థాంప్సన్‌పైకి గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు జరిపినట్టు దర్యాప్తు అధికారి చెప్పారు.
Published date : 05 Dec 2024 12:57PM