Skip to main content

Netumbo Nandi: నమీబియాకు తొలి మహిళా అధ్యక్షురాలు

నమీబియా ఎన్నికల్లో అధికార స్వాపో పార్టీ విజయం సాధించి, నెటుంబో నండీ ఎండైట్వా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు.
Namibia Elects Its First Woman President Netumbo Nandi

ఆమె నమీబియా మొదటి మహిళా అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించారు. నమీబియా స్వాతంత్య్రం పొందిన 30 సంవత్సరాల నుంచి స్వాపో పార్టీయే అధికారంలో కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో, ఎండైట్వా 57% ఓట్లు సాధించి, అధ్యక్ష పదవి గెలిచారు. 72 స్థానాల కోసం జరిగిన పోరులో స్వాపో పార్టీ 51 స్థానాలను గెలుచుకుని మెజారిటీ సాధించింది.

1960ల్లో దేశ స్వాతంత్య్ర పోరాట సమయంలో స్వాపో పార్టీలో చేరిన ఎండైట్వా విదేశాంగ శాఖ వంటి కీలక పదవుల్లో పనిచేశారు. 96 స్థానాలకు స్వాపో పార్టీ 51 స్థానాలు గెలిచి మెజారిటీ సాధించింది. ఇండిపెండెంట్‌ పేట్రియాట్స్‌ ఫర్‌ ఛేంజ్‌ (ఐపీసీ) పార్టీ 20 స్థానాలతో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. 

Kashyap Patel: ‘ఎఫ్‌బీఐ’ డైరెక్టర్‌గా కశ్యప్‌ పటేల్‌.. అమెరికాలో భారత సంతతి వ్యక్తికి కీలక పదవి

నిష్కళంక నేత 
ఎన్‌ఎన్‌ఎన్‌ అని పిలుచుకునే ఎండైట్వా పార్టీలో దిగ్గజ నేత. ఆఫ్రికా ఖండంలోని అతి కొద్ది నాయకురాళ్లలో ఒకరు. దేశ స్వాతంత్య్ర పోరాట కాలం నుంచి ఏదో ఒక పదవిలో ఉంటూ వస్తున్నారు. పాస్టర్‌ కూతురు అయిన ఆమె గొప్ప రాజనీతిజ్ఞురాలిగా ఎదిగారు.

గత ఫిబ్రవరిలో ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఆర్థిక దౌత్యాన్ని ఉపయోగించి పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఉద్యోగాలను సృష్టిస్తానని ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేశారు. పార్టీలోని అన్ని వర్గాలను ఏకం చేయగలిగారు. నిష్కళంక నేతగా ఆమెకున్న ప్రతిష్ట ఎన్నికల్లో గెలుపు వైపు నడిపించింది. 

బలమైన గ్రామీణ మూలాలతో.. 
30 లక్షల మంది జనాభా ఉన్న నమీబియా ప్రధానంగా యురేనియం, వజ్రాల ఎగుమతిదారు. దేశంలో మెరుగైన మౌలిక సదుపాయాలు లేవు. నిరుద్యోగం అధికం. దేశ సంపద స్థానికులకు ఉపయోగపడటం లేదు. 15–34 ఏళ్ల మధ్య వయస్కుల్లో నిరుద్యోగం 46 శాతముంది. ఇది జాతీయ సగటు కంటే మూడు రెట్లు ఎక్కువ. అధిక నిరుద్యోగం, అసమానతల కారణంగా స్వాపో పార్టీ గెలుపు కష్టమేనని విశ్లేషకులు భావించారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో బలమైన మూలాలు స్వాపోకు కలిసొచ్చాయి.  

United States Presidents: ఇప్ప‌టివ‌ర‌కు అమెరికా అధ్యక్షులుగా ఎన్నికైన వారు వీరే..

Published date : 05 Dec 2024 12:39PM

Photo Stories