Skip to main content

Minister Harish Rao: ధరణి పోర్టల్‌ ఉపసంఘం చైర్మన్‌గా వ్యవహరించనున్న మంత్రి?

Harish Rao

ధరణి పోర్టల్‌లో వ్యవసాయ భూములకు సంబంధించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఉప సంఘానికి రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు చైర్మన్‌గా, సభ్యులుగా మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, జగదీష్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి వ్యవహరించనున్నారు. ఈ ఉప సంఘం కన్వీనర్‌గా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ శేషాద్రిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ సెప్టెంబర్‌ 23న ఉత్తర్వులు జారీ చేశారు.

సీఐఐ మిస్టిక్‌ సౌత్‌: గ్లోబల్‌ లింకేజెస్‌ సదస్సు

సెప్టెంబర్‌ 23న సీఐఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మిస్టిక్‌ సౌత్, గ్లోబల్‌ లింకేజెస్‌ సమ్మిట్‌ టువార్డ్స్‌ 1.5 ట్రిలియన్‌ డాలర్‌ ఎకానమి బై 2025’సదస్సును ఉద్దేశించి భార‌త‌ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వర్చువల్‌ వేదికగా ప్రసంగించారు. దక్షిణ భారత ఆర్థిక వ్యవస్థ 2025 నాటికి 1.5 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకునేలా లక్ష్యాన్ని నిర్దేశించుకోవడాన్ని ఆయన అభినందించారు. 

చ‌ద‌వండి: ట్రాన్స్‌ఫర్మేటివ్‌ జస్టిస్‌ పుస్తకాన్ని విశ్రాంత న్యాయమూర్తి?


క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ధరణి పోర్టల్‌ ఉపసంఘం చైర్మన్‌గా వ్యవహరించనున్న మంత్రి?
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 23
ఎవరు    : తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
ఎందుకు : ధరణి పోర్టల్‌లో వ్యవసాయ భూములకు సంబంధించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయానికి...

 

Published date : 24 Sep 2021 06:56PM

Photo Stories