మే 2021 వ్యక్తులు
Sakshi Education
కేరళ సీఎంగా రెండోసారి ప్రమాణం స్వీకారం చేసిన నేత?
సీపీఎం సీనియర్ నేత పినరయి విజయన్(77) వరుసగా రెండో విడత కేరళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మే 20న కేరళ రాజధాని తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్.. ఆయనతోపాటు 20 మంది మంత్రులతో ప్రమాణం చేయించారు. 1944 మార్చి 21న గీత కార్మిక కుటుంబంలో విజయన్ జన్మించారు. విజయన్ స్వస్థలం కన్నూర్ జిల్లాలోని పినరయి. విద్యార్థి సంఘాల ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించిన విజయన్ 1964లో కమ్యూనిస్టు పార్టీలో చేరారు. కేరళ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షునిగా, కార్యదర్శిగా పనిచేశారు. 1996-98లో విద్యుత్ మంత్రిగా ఉన్నారు. 2016, మే 25 తేదీన తొలిసారి కేరళ ముఖ్యమంత్రి ప్రమాణం చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కేరళ సీఎంగా రెండోసారి ప్రమాణం స్వీకారం చేసిన నేత?
ఎప్పుడు : మే 20
ఎవరు : పినరయి విజయన్
ఎక్కడ : సెంట్రల్ స్టేడియం, తిరువనంతపురం
రాజస్తాన్ మాజీ సీఎం పహాడియా కన్నుమూత
కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్తాన్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ పహాడియా (89) కన్నుమూశారు. కోవిడ్ బారిన పడిన పహాడియా.. గురుగ్రామ్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మే 19న తుదిశ్వాస విడిచారు. రాజస్తాన్ రాష్ట్రం భరత్‌పూర్ జిల్లా భుసావర్‌లో జన్మించిన పహాడియా రాజస్తాన్ యూనివర్సిటీలో ఎంఏ, ఎల్‌ఎల్‌బీ చదివారు. 1957 మొదలుకొని నాలుగు పర్యాయాలు లోక్‌సభకు, రెండు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. కేంద్ర సహాయ మంత్రిగా పని చేశారు. 1980–81 సంవత్సరాల్లో రాజస్తాన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. బిహార్, హరియాణ రాష్ట్రాలకు గవర్నర్‌గా కూడా వ్యవహరించారు. 1988–89లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా కూడా పహాడియా వ్యవహరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్తాన్ మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత
ఎప్పుడు : మే 19
ఎవరు : జగన్నాథ్ పహాడియా (89)
ఎక్కడ : గురుగ్రామ్, హరియాణ
ఎందుకు: కరోనా వైరస్ కారణంగా..
పర్యావరణ పరిరక్షణ ఉద్యమం చిప్కోను ప్రారంభించిన వ్యక్తి?
ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు, స్వాతంత్య్ర సమరయోధుడు, చిప్కో ఉద్యమానికి ఊపిరిపోసిన సుందర్‌లాల్ బహుగుణ(94) కన్నుమూశారు. కోవిడ్-19 చికిత్స పొందుతూ... రిషికేశ్ ఎయిమ్స్‌లో మే 21న తుదిశ్వాస విడిచారు. ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ జిల్లాలో 1927 జనవరి 9వ తేదీన జన్మించిన బహుగుణ 13 ఏళ్ల వయస్సులోనే స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. మహాత్మాగాంధీ అహింసా వాదాన్ని జీవితాంతం ఆచరించారు. 1947లో లాహోర్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకొని తెహ్రీ సంస్థాన రాచరికానికి వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొన్నారు. 1948లో ఏర్పడిన ప్రభుత్వంలో ప్రచారశాఖ మంత్రి అయ్యారు.
పర్యావరణ ఉద్యమాలకు ప్రేరణగా...
1974లో హిమాలయ ఘర్వాల్ ప్రాంతంలో చెట్ల నరికివేతను అడ్డుకొనేందుకు శాంతియుత నిరసన ఉద్యమం చిప్కోను బహుగుణ ప్రారంభించారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలు చెట్లను నరికివేసే సమయంలో వాటిని కౌగిలించుకోవడం ద్వారా కాపాడుకోవడమే దీని లక్ష్యం. ఇలా వృక్షాలను రక్షించే ఉద్యమంగా ప్రారంభమై పర్యావరణ పరిరక్షణ ఉద్యమంగా రూపుదిద్దుకుంది. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ ఉద్యమాలకు ప్రేరణగా నిలిచింది
తెహ్రీ డ్యామ్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ...
చెట్లను నరికివేయడాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తూ 1981లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీని తీసుకోవడానికి బహు గుణ నిరాకరించారు. సొంత జిల్లా తెహ్రీలో ప్రభుత్వం తలపెట్టిన డ్యాంతో పెద్ద సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యే ప్రమాదముంది. దీంతో తెహ్రీ డ్యామ్ నిర్మాణాన్ని తీవ్రంగా నిరసిస్తూ 84 రోజులపాటు ఉపవాస దీక్ష సాగించారు. హిమాలయాల పర్యావరణ పరి రక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆయన పలు పర్యాయాలు పాదయాత్రలు కూడా చేపట్టారు. ఆయన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ సహా పలు అవార్డులు ఆయన్ను వరించాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు, స్వాతంత్య్ర సమరయోధుడు కన్నుమూతత
ఎప్పుడు : మే 21
ఎవరు : సుందర్‌లాల్ బహుగుణ(94)
ఎక్కడ : రిషికేశ్ ఎయిమ్స్, ఉత్తరాఖండ్
ఎందుకు: కోవిడ్-19 కారణంగా...
ఆక్స్ఫర్డ్ విద్యార్థి సంఘం ప్రెసిడెంట్గా ఎన్నికైన విద్యార్థిని?
యూకేలోని ప్రతిష్టాత్మక ఆక్స్‌ఫర్డ్ విశ్వ విద్యాలయం విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన అన్వీ భూటానీ ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలో అన్వీ మంచి మెజారిటీతో ఎన్నికయ్యారు. అధ్యక్షురాలిగా ఉన్న భారత సంతతి విద్యార్థిని రష్మీ సామంత్ రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమయ్యింది. 2021–22 విద్యా సంవత్సరంలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఉపాధ్యక్షురాలిగా భారత సంతతికే చెందిన దేవిక ఎన్నికైంది. అన్వీ భూటానీ ప్రస్తుతం ఆక్స్‌ఫర్డ్ వర్సిటీకి చెందిన మాగ్డలిన్ కాలేజీలో హ్యూమన్ సైన్స్ విద్యను అభ్యసిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆక్స్‌ఫర్డ్ విద్యార్థి సంఘం ప్రెసిడెంట్గా ఎన్నికైన భారత సంతతి విద్యార్థిని?
ఎప్పుడు : మే 21
ఎవరు : అన్వీ భూటానీ
ఎక్కడ : ఆక్స్‌ఫర్డ్ విశ్వ విద్యాలయం, యూకే
ఎందుకు: ఇప్పటివరకు విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా ఉన్న భారత సంతతి విద్యార్థిని రష్మీ సామంత్ రాజీనామా చేయడంతో
కరోనాతో ఏఎఫ్‌ఐ మెడికల్ కమిషన్ చైర్మన్ కన్నుమూత
భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) మెడికల్ కమిషన్ చైర్మన్ అరుణ్ కుమార్ మెండిరటా (60) మరణించారు. కొన్ని రోజుల క్రితం కరోనాతో ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చేరిన అరుణ్ చికిత్స పొందుతూ మే 21న తుదిశ్వాస విడిచారు. ఇటీవల టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత టీమ్‌కు చీఫ్ మెడికల్ ఆఫీసర్‌గా భారత ఒలింపిక్ సంఘం అరుణ్‌ను నియమించింది. దాంతో ఆయన భారత క్రీడాకారుల బృందంతోపాటు టోక్యోకు వెళ్లాల్సి ఉంది. గత 25 ఏళ్లుగా అరుణ్ ఆసియా అథ్లెటిక్స్ సంఘంలో పనిచేస్తున్నారు.
కరోనాతో కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత
కేంద్ర మాజీ మంత్రి, కర్ణాటకకు చెందిన రైతు నేత బాబాగౌడ పాటిల్(78) కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితం కరోనాకు గురైన ఈయన బెళగావిలోని ఆస్పత్రిలో మే 21న తుదిశ్వాస విడిచారు. బెళగావి తాలూకా చిక్కబాగేవాడి గ్రామానికి చెందిన బాబాగౌడ...జేడీఎస్ తరఫున బాగల్‌కోటె జిల్లా నవలగుంది ఎమ్మెల్యేగా గెలిచి సేవలు అందించారు. బీజేపీలో చేరి 1998లో బెళగావి నుంచి ఎంపీగా గెలిచి వాజ్‌పేయి సర్కార్‌లో కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రిగా పని చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) మెడికల్ కమిషన్ చైర్మన్ కన్నుమూత
ఎప్పుడు : మే 21
ఎవరు : అరుణ్ కుమార్ మెండిరటా (60)
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు: కోవిడ్-19 కారణంగా...
ప్రముఖ చిత్రకారుడు గోపి ఇకలేరు
ప్రముఖ చిత్రకారుడు గోపి (లూసగాని గోపాల్‌గౌడ్ 69) మే 21న కోవిడ్‌తో కన్నుమూశారు. కొంతకాలంగా పలు అనారోగ్య కారణాలతో బాధపడుతున్న ఆయన ఇటీవల కోవిడ్ బారిన పడి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. నాలుగు దశాబ్దాలకు పైగా కాన్వాస్‌పై తన బొమ్మలతో తెలుగు సాహిత్య, చిత్ర సీమను హోయలు పలికించి తనదైన ముద్ర వేసుకున్న గోపి 1952లో జన్మించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూల్‌కు చెందిన ఆయన 1975లో జేఎన్‌టీయూ నుంచి ఫైన్ ఆర్ట్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు. దాదాపు అన్ని తెలుగు వార,మాస పత్రికల్లో అనేక కథలు, నవలలకు అద్భుతమైన బొమ్మలు గీశారు. ఉమ్మడి ఏపీ ప్రభుత్వంలో సమాచార, ప్రజాసంబంధాల విభాగంలో ఫ్రీలాన్స్ ఆర్టిస్టుగా 10 ఏళ్ల పాటు పనిచేశారు. సినీ ఆర్టిస్టుగా ఎన్నో చిత్రాలకు తన కళాత్మకతను అద్దారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రముఖ చిత్రకారుడు కన్నుమూత
ఎప్పుడు : మే 21
ఎవరు : గోపి (లూసగాని గోపాల్‌గౌడ్ 69)
ఎక్కడ : గాంధీ ఆస్పత్రి, సికింద్రాబాద్
ఎందుకు : కోవిడ్-19 కారణంగా...
ప్రముఖ సినీ జర్నలిస్ట్, పీఆర్‌ఓ బి.ఎ. రాజు ఇకలేరు
ప్రముఖ సినీ జర్నలిస్ట్, పీఆర్‌ఓ, నిర్మాత బి.ఎ. రాజు (61) ఇకలేరు. గుండెపోటు కారణంగా మే 21న హైదరాబాద్‌లో కన్నుమూశారు. విజయవాడలో జన్మించిన రాజు పీఆర్‌ఓగా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత సినీ జర్నలిస్ట్‌గా మారారు. జ్యోతిచిత్ర, ఆంధ్రజ్యోతి, ఉదయం, శివరంజని వంటి దిన, వార పత్రికల్లో జర్నలిస్ట్‌గా చేశారు. 1994లో తన భార్య, జర్నలిస్ట్ బి. జయతో కలసి ‘సూపర్‌హిట్’ వారపత్రికను ప్రారంభించారు. నిర్మాతగా మారి, తన భార్య జయ దర్శకత్వంలో చంటిగాడు, గుండమ్మగారి మనవడు, వైశాఖం వంటి సినిమాలు నిర్మించారు. ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షునిగానూ చేశారు. తన దర్శకత్వంలో తెరకెక్కిన ‘22’ సినిమా ఇంకా విడుదల కాలేదు.
కర్ణాటక మాజీ స్పీకర్ కృష్ణ కన్నుమూత
కర్ణాటక విధానసభ మాజీ స్పీకర్ కేఆర్ పేట కృష్ణ(80) మే 21న కన్నుమూశారు. మైసూరులోని కువెంపునగరలో ఉన్న తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 2006–2008 మధ్యకాలంలో ఆయన స్పీకర్‌గా పనిచేశారు. మూడు సార్లు కేఆర్ పేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1988లో ఎస్‌ఆర్ బొమ్మాయ్ మంత్రివర్గంలో పశుసంవర్ధక శాఖ, 1996లో మండ్య ఎంపీగా పనిచేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రముఖ సినీ జర్నలిస్ట్, పీఆర్‌ఓ, నిర్మాత కన్నుమూత
ఎప్పుడు : మే 21
ఎవరు : బి.ఎ. రాజు (61)
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : గుండెపోటు కారణంగా...
భారతదేశ తొలి మహిళా ఫ్లయిట్ టెస్ట్ ఇంజినీర్ ఎవరు?
భారతదేశ తొలి మహిళా ఫ్లయిట్ టెస్ట్ ఇంజినీర్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఆశ్రిత వి. ఓలేటి రికార్డు నెలకొల్పారు. కర్ణాటకలోని కొల్లెగల్ కు చెందిన ఆశ్రిత బెంగళూరులో ఇంజినీరింగ్ చేసి... 2014లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ లో చేరి స్క్వాడ్రన్ లీడర్ అయ్యింది. తర్వాత ‘ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ టెస్ట్ పైలెట్ స్కూల్’ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ‘ఫ్లయిట్ టెస్ట్ కోర్స్’ (43వ బ్యాచ్)లో ఉత్తీర్ణత చెందింది. ప్రపంచంలో కేవలం 7 మాత్రమే ఉండే ఇలాంటి స్కూల్స్‌లో ఈ కోర్సులో ఉత్తీర్ణత చెందడమే కాకుండా భారతదేశ తొలి మహిళా ఫ్లయిట్ టెస్ట్ ఇంజినీర్ అయింది. ఈ విషయాన్ని మే 23న ఐఏఎఫ్ ట్విటర్ ద్వారా తెలిపింది.
కేవలం 275 మంది...
1973 నుంచి ఎయిర్‌ఫోర్స్ నిర్వహిస్తున్న ఫ్లయిట్ టెస్ట్ ఇంజినీర్ పరీక్షలో కేవలం 275 మంది పాసవ్వగా వారిలో తొలి మహిళగా ఆశ్రిత చరిత్ర సృష్టించింది. ఇకమీద భారతీయ ఎయిర్‌ఫోర్స్‌లో ఏ విమానం కొనాలన్నా, సేవలు మొదలెట్టాలన్నా దానిని పరీక్షించే ఓ.కె చేయాల్సిన బాధ్యత ఆశ్రితదే. ఇండియన్ ఆర్మీలో ప్రస్తుతం 6,807 మంది మహిళా ఆఫీసర్లు పని చేస్తున్నారు. ఎయిర్‌ఫోర్స్‌లో 1607 మంది మహిళా ఆఫీసర్లు పని చేస్తున్నారు. నేవీలో వీరి సంఖ్య 704 మాత్రమే. 2015 నుంచి ఎయిర్ ఫోర్స్ తన ఫైటర్ విభాగంలో మహిళల ప్రవేశాన్ని ఆమోదించాక సరిగ్గా ఆరేళ్లకు ఆశ్రిత తనదైన ఘనతను సాధించింది.
సీబీఐ చీఫ్గా నియమితులైన ఐపీఎస్ అధికారి?
సీనియర్ ఐపీఎస్ అధికారి సుబోధ్ కుమార్ జైస్వాల్ కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) డైరెక్టర్‌గా నియమితులయ్యారు. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ మే 25న జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. 1985వ బ్యాచ్‌కు చెందిన జైస్వాల్ ప్రస్తుతం కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీజేఐ ఎన్వీ రమణ, లోక్‌సభలో ప్రతిపక్షనేత అధిర్ రంజన్ చౌదరిలతో కూడిన హైపవర్ కమిటీ మే 24న సమావేశమై సీబీఐ చీఫ్‌గా సుబోధ్‌ను ఎంపిక చేసింది. సీబీఐ డైరెక్టర్‌గా ఉన్న రిషి కుమార్ శుక్లా 2021 ఫిబ్రవరి 3వ తేదీన పదవీ విరమణ చేశారు. అప్పటినుంచి అదనపు డైరెక్టర్ ప్రవీణ్ సిన్హా తాత్కాలిక డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.
సుబోధ్ ప్రస్థానం
ఏమిటి : కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) డైరెక్టర్‌గా నియామకం
ఎప్పుడు : మే 25
ఎవరు : సీనియర్ ఐపీఎస్ అధికారి సుబోధ్ కుమార్ జైస్వాల్
ఎందుకు : సీబీఐ డైరెక్టర్‌గా ఉన్న రిషి కుమార్ శుక్లా పదవీ విరమణ చేసిన నేపథ్యంలో...
రాష్ట్రీయ లోక్దళ్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన నేత?
రాష్ట్రీయ లోక్దళ్ పార్టీ అధ్యక్షుడిగా జయంత్ చౌదరి ఎన్నికయ్యారు. మే 25న జరిగిన పార్టీ మీటింగ్‌లో ఆయన్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు ఆ పార్టీ తెలిపింది. జయంత్‌కు ముందు ఆర్‌ఎల్డీకి ఆయన తండ్రి అజిత్ సింగ్ అధ్యక్షుడిగా చేశారు. ఆ సమయంలో జయంత్ ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. అజిత్ సింగ్ ఇటీవల కోవిడ్ 19తో మరణించడంతో అధ్యక్షుడి నియామకం అనివార్యమైంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రాష్ట్రీయ లోక్దళ్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన నేత?
ఎప్పుడు : మే 25
ఎవరు : జయంత్ చౌదరి
ఎందుకు : ఇప్పటివరకు పార్టీ అధ్యక్షుడిగా ఉన్న అజిత్ సింగ్ ఇటీవల కోవిడ్ 19తో మరణించడంతో...
ప్రపంచంలోనే మొదటి కోవిడ్ టీకా తీసుకున్న వ్యక్తి?
ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కోవిడ్–19 టీకా తీసుకున్న వ్యక్తిగా చరిత్ర సృష్టించిన విలియం షేక్‌స్పియర్(81) మే 24న కన్నుమూశారు. యూనివర్సిటీ హాస్పిటల్ కోవెంట్రీ, వార్విక్‌షైర్‌లో 2020, డిసెంబర్ 8న మొట్టమొదటి ఫైజర్ టీకా డోస్ తీసుకున్న పురుషునిగా షేక్స్పియర్ రికార్డు నెలకొల్పారు. అంతకుముందు, అదే ఆస్పత్రిలో ఆయన కంటే ముందు 91 ఏళ్ల మహిళ మార్గరేట్ కీనన్ కోవిడ్ టీకా తీసుకుని, మొట్టమొదటి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. అయితే.. పురుషుల్లో మొదట టీకా తీసుకున్న వ్యక్తిగా మాత్రం షేక్స్‌పియర్ ఉన్నారు. కోవిడ్‌యేతర రుగ్మతలతో అదే ఆస్పత్రిలో చేరిన షేక్‌స్పియర్ మే 20న కన్నుమూసినట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పురుషుల్లో మొదటి కోవిడ్ టీకా తీసుకున్న వ్యక్తి కన్నుమూత
ఎప్పుడు : మే 20
ఎవరు : విలియం షేక్‌స్పియర్(81)
ఎక్కడ : ప్రపంచంలో....
ఎందుకు : కోవిడ్‌యేతర రుగ్మతలతో...
స్వాతంత్య్ర సమరయోధుడు దొరెస్వామి కన్నుమూత
కన్నడనాట ప్రముఖ గాంధేయవాది, స్వాతంత్య్ర సమరయోధుడు, పాత్రికేయుడు హరోహళ్లి శ్రీనివాసయ్య దొరెస్వామి(హెచ్‌ఎస్ దొరెస్వామి 103) కన్నుమూశారు. వయోభారం, గుండె సమస్యలతో బెంగళూరులో మే 26న తుదిశ్వాస విడిచారు. దొరెస్వామి 1918 ఏప్రిల్ 10న బెంగళూరు సమీపంలోని హరోహళ్లిలో జన్మించారు. బీఎస్సీ పూర్తి చేసిన ఆయన సైన్స్, గణిత ఉపాధ్యాయునిగా మారారు. 1942లో గాంధీజీ పిలుపు మేరకు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. 14 నెలల కారాగారవాసం చేశారు. అనంతరం స్వాతంత్య్ర పోరాటం కొనసాగిస్తూ పలు పత్రికలను స్థాపించి స్వరాజ్య స్ఫూర్తిని రగిల్చారు.
స్వాతంత్య్రం తరువాత...
స్వాతంత్య్రం సిద్ధించాక దేశంలోని అసమానతలపై దొరెస్వామి దృష్టి సారించారు. 1950లలో భూదాన్ ఉద్యమంలోకి అడుగుపెట్టారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో, జయప్రకాష్ నారాయణ్ సోషలిస్టు ఉద్యమంలో పాల్గొన్నారు. కర్ణాటక, బెంగళూరుకు సంబంధించిన అనేక ప్రజా సమస్యల పోరాటాల్లో ముందున్నారు. ఎక్కడ ప్రజాందోళనలు జరిగినా అక్కడ దొరె స్వామి ఉంటారని పేరుగాంచారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గాంధేయవాది, స్వాతంత్య్ర సమరయోధుడు, పాత్రికేయుడు కన్నుమూత
ఎప్పుడు : మే 26
ఎవరు : హరోహళ్లి శ్రీనివాసయ్య దొరెస్వామి(103)
ఎక్కడ : బెంగళూరు, కర్ణాటక
ఎందుకు : వయోభారం, గుండె సమస్యలతో...
అమెజాన్ నూతన సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్న వ్యక్తి?
ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ సీఈవో బాధ్యతల నుంచి జెఫ్ బెజోస్ 2021, జూలై 5న తప్పుకోనున్నారు. ఆ రోజున కొత్త సీఈవోగా ఆండీ జెస్సీ బాధ్యతలు చేపట్టనున్నారు. కంపెనీ వ్యవస్థాపకుడు బెజోస్ మే 27న ఈ విషయాలు వెల్లడించారు. 27 ఏళ్ల క్రితం 1994, జూలై 5 తేదీన తాను కంపెనీని ప్రారంభించినట్లు పేర్కొన్నారు. కొత్త సీఈవోగా ఎంపికైన జస్సీ ప్రస్తుతం అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ వ్యాపార విభాగానికి సారథ్యం వహిస్తున్నారు. సీఈవోగా తప్పుకున్న తర్వాత బెజోస్.. ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కొనసాగుతారు. అమెజాన్ ప్రధాన కార్యలయం అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రం సీటెల్ నగరంలో ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2021, జూలై 5న అమెజాన్ నూతన సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్న వ్యక్తి?
ఎప్పుడు : మే 27
ఎవరు : ఆండీ జెస్సీ
ఎక్కడ : సీటెల్ నగరం, వాషింగ్టన్ రాష్ట్రం, అమెరికా
ఎందుకు : ప్రస్తుతం సీఈవోగా ఉన్న జెఫ్ బెజోస్ తన పదవి నుంచి తప్పుకోనుండటంతో...
ప్రస్తుతం రీసెర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్ చీఫ్గా ఉన్న ఐపీఎస్ అధికారి?
రీసెర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్ (రా) చీఫ్ సమంత్ కుమార్ గోయల్ పదవీకాలాన్ని ఏడాది పొడిగించారు. ఆయన జూన్ 30న రిటైర్ కావాల్సి ఉండగా... ఏడాది పొడిగింపు ఇస్తూ కేబినెట్ నియామకాల కమిటీ మే 27న నిర్ణయం తీసుకుంది. సమంత్ కుమార్ పంజాబ్ కేడర్‌కు చెందిన 1984 ఐపీఎస్ అధికారి. అలాగే ఇంటెలిజెన్స్ బ్యూరో హెడ్ అర్వింద్ కుమార్ పదవీకాలాన్ని కూడా ఏడాది పొడిగించారు. ఆయన 2022 జూన్ 30 దాకా ఐబీ చీఫ్‌గా కొనసాగుతారు.
సీబీఐ 31వ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన అధికారి?
కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) 31వ డైరెక్టర్‌గా సుబోధ్ కుమార్ జైస్వాల్ మే 26న బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీబీఐ సీనియర్ అధికారులకు పలు అంశాలు వివరించారు. 1985వ బ్యాచ్‌కు చెందిన జైస్వాల్ ఇప్పటివరకు కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) డైరెక్టర్ జనరల్‌గా పనిచేశారు. సీబీఐ ప్రధాన కార్యాలయం దేశ రాజధాని న్యూఢిల్లీలో ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రీసెర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్ (రా) చీఫ్ పదవీకాలం పొడిగింపు
ఎప్పుడు : మే 27
ఎవరు : సమంత్ కుమార్ గోయల్
ఎందుకు : కేబినెట్ నియామకాల కమిటీ నిర్ణయం మేరకు...
నేపాల్ ప్రధానిగా మళ్లీ కె.పి.ఓలి
నేపాల్ ప్రధానమంత్రిగా కె.పి.శర్మ ఓలి మళ్లీ నియమితులయ్యారు. సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిపక్ష నేపాలీ కాంగ్రెస్, ప్రచండ నేతృత్వంలోని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్టు సెంటర్) కూటమి విఫలమయ్యింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీని కూడగట్టలేకపోయింది. మే 13వ తేదీ రాత్రి 9 గంటల్లోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అధ్యక్షురాలు బిద్యాదేవి భండారీ గడువు విధించారు. గడువులోగా ప్రతిపక్ష కూటమి ముందుకు రాకపోవడంతో కె.పి.శర్మ ఓలికి మార్గం సుగమమైంది. నేపాల్ రాజ్యాంగం ప్రకారం సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటులో ఇతర పక్షాలు విఫలమైతే అతిపెద్ద పార్టీని మైనారిటీ ప్రభుత్వ ఏర్పాటుకు అధ్యక్షురాలు ఆహ్వానించాల్సి ఉంటుంది. ఓలీ ఛైర్మన్‌గా ఉన్న సీపీఎన్‌యూఎంఎల్ 121 సభ్యులతో అతిపెద్ద పార్టీగా ఉంది. దాంతో ఓలిని మళ్లీ ప్రధానిగా నియమిస్తున్నట్లు మే 13వ తేదీ రాత్రి ప్రకటించారు. ఓలి 30 రోజుల్లోగా ప్రతినిధుల సభలో మెజారిటీని నిరూపించుకోవాల్సి ఉంటుంది.
టెమ్స్ గ్రూప్ చైర్‌పర్సన్ ఇందూ జైన్ మృతి
టైమ్స్ గ్రూప్ చైర్‌పర్సన్ ఇందూ జైన్(84) కరోనా సంబంధిత సమస్యలతో మే 13వ తేదీన కన్నుమూశారు. 1999లో గ్రూప్ యాజమాన్య బాధ్యతలు చేపట్టిన జైన్ సంస్థ స్థాయిని పెంచడంలో కృషి చేశారు. 2000లో టైమ్స్ ఫౌండేషన్‌ను స్థాపించి సేవా కార్యక్రమాల్లో దేశంలోనే ఉత్తమ ఎన్‌జీవోగా తీర్చిదిద్దారు. 1983లో ఏర్పాటైన ఫిక్కి లేడీస్ ఆర్గనైజేషన్(ఎఫ్‌ఎల్‌వో) వ్యవస్థాపక ప్రెసిండెంట్‌గా వ్యవహరించారు. భారతీయ భాషా సాహిత్యాభివృద్ధిని కాంక్షిస్తూ తన మామ సాహు శాంతి ప్రసాద్ జైన్ స్థాపించిన భారతీయ జ్ఞాన్‌పీఠ ట్రస్ట్‌కు 1999 నుంచి చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు. ఈ ట్రస్ట్ ఏటా జ్ఞానపీఠ అవార్డులను అందజేస్తుంటుంది. 2016లో కేంద్రం ఆమెను పద్మ భూషణ్‌తో సత్కరించింది.
విఖ్యాత కవి, నటుడు అదృష్ట దీపక్ ఇకలేరు
విఖ్యాత కవి, సినీ గేయ రచయిత, విమర్శకుడు, నాటక కళాకారుడు, నటుడు అదృష్ట దీపక్ (71) ఇకలేరు. కరోనా మహమ్మారి కారణంగా కాకినాడలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ... మే 16న తుదిశ్వాస విడిచారు. భాషావేత్తగా, నిబద్ధ కవిగా, కథకుడిగా, బుర్రకథా రచయితగా, వ్యాసకర్తగా, కాలమిస్టుగా, విమర్శకుడిగా, ఉపన్యాసకుడిగా, నటుడిగా, గాయకుడిగా, సినీ గేయ రచయితగా అన్ని రంగాల్లోనూ దీపక్ బలమైన ముద్ర వేశారు. విద్యార్థి సమాఖ్య, యువజన సమాఖ్య, అభ్యుదయ రచయితల సంఘం, ప్రజానాట్య మండలి సంస్థల్లో క్రియాశీలక బాధ్యతలు నిర్వహించారు.
దీపక్ నేపథ్యం...
పుట్టిన రోజు : 1811950
పుట్టిన ఊరు : తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం
తల్లిదండ్రులు : సూరాయమ్మ, బంగారయ్య
విద్యాభాస్యం : 8వ తరగతి వరకూ రావులపాలెం. ఎంఏ వరకూ రామచంద్రపురం.
వృత్తి : ద్రాక్షారామ పీవీఆర్ జూనియర్ కళాశాలలో చరిత్రోపన్యాసకునిగా 1979 నుంచి 2008 వరకూ పని చేసి ఉద్యోగ విరమణ పొందారు.
ప్రవృత్తి : సాహిత్యం, నాటక రంగాలు, కవి, సినీ గేయ రచయిత, నాటకాలకు న్యాయనిర్ణేత, విమర్శకుడు.
రచనలు : కోకిలమ్మ పదాలు పదశతకం (19722014), అగ్ని కవిత్వం (1974), ప్రాణం కవిత్వం (1978), సమరశంఖం బుర్రకథ (1981), అడవి కవిత్వం (2008), దీపకరాగం వ్యాసాలు (2008), ఆశయాల పందిరిలో సినిమా పాటల సంకలనం (2010), శ్రీశ్రీ ఒక తీరని దాహం మహాకవి సంస్మరణ (2010), అదృష్ట దీపక్ కథలు (2016), దీపం, తెరచిన పుస్తకం (2020)
పురస్కారాలు
1984 : నేటిభారతం చిత్రంలో మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం గీతానికి ఉత్తమ గేయ రచయితగా మద్రాసులో అప్పటి రాష్ట్రపతి డాక్టర్ శంకర్‌దయాళ్‌శర్మ చేతుల మీదుగా కళాసాగర్ అవార్డు.
2003 : అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా రాష్ట ప్రభుత్వ ఉత్తమ అధ్యాపక అవార్డు.
2003 : విశాలాంధ్ర స్వర్ణోత్సవ వేడుకల్లో కవి సత్కారం.
2004 : మోడరన్ ఫౌండేషన్ కళానిధి అవార్డు, సాహితీ పురస్కారం.
2010 : శ్రీశ్రీ సాహితీ పురస్కారం, జాలాది సాహితీ పురస్కారం.
2012 : శ్రీనాథ రత్న శిల్పి ఉడయార్ కళాపురస్కారం.
2017 : నంది నాటకోత్సవాల్లో న్యాయనిర్ణేతగా రాష్ట్ర ప్రభుత్వ నంది పురస్కారం. ఇవే కాకుండా 50కి పైగా వివిధ నాటక కళాపరిషత్తులలోనూ, సాహితీ సభల్లోనూ, విద్యాలయాల్లోనూ, ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : విఖ్యాత కవి, సినీ గేయ రచయిత, విమర్శకుడు, నాటక కళాకారుడు, నటుడు కన్నుమూత
ఎప్పుడు : మే 16
ఎవరు : అదృష్ట దీపక్ (71)
ఎక్కడ : కాకినాడ, తూర్పు గోదావరి జిల్లా
ఎందుకు : కరోనా మహమ్మారి కారణంగా..
స్నేక్ స్టాన్లీగా ప్రసిద్ది చెందిన వ్యక్తి?
చెన్నైలోని అంబత్తూరు కల్లికుప్పంకు చెందిన స్టాన్లీ ఫెర్నాండజ్ (62) కన్నుమూశారు. ఇటీవల కరోనా వైరస్ బారిన పడిన ఆయన చెన్నైలోని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మే15న మరణించారు. ఫెర్నాండజ్... వృత్తిరీత్యా టీవీ చానళ్లలో కెమెరామెన్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. ప్రవృత్తి రీత్యా పిన్న వయస్సు నుంచి పాములు పట్టడంలో నేర్పరైన ఫెర్నాండెజ్... స్నేక్ స్టాన్లీగా ప్రసిద్ది చెందారు. చెన్నై సహా పలు ప్రాంతాల్లో ఇళ్లు, కార్యాలయాల్లో దూరిన పాములను ఎంతో చాకచక్యంగా పట్టుకోవడంలో అటవీ, అగ్నిమాపకశాఖల అధికారులకు సహకరించేవారు. ఇలా పాతికేళ్లలో సుమారు పదివేలకు పైగా విషసర్పాలను పట్టుకున్నారు.
కాల్పుల విరమణ: ఉల్ఫా (ఐ)
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అస్సాం రాష్ట్రంలో మూడు నెలల పాటు కాల్పుల విరమణను పాటించనున్నట్లు నిషేధిత యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం(ఇండిపెండెంట్) మే 15న ప్రకటించింది. ఈ మేరకు సంస్థ కమాండర్ ఇన్ చీఫ్ పరేష్ బారువా... ఒక ప్రకటన విడుదల చేశారు. ఉల్ఫా(ఐ) నిర్ణయాన్ని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్వాగతించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : స్నేక్ స్టాన్లీగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి కన్నుమూత
ఎప్పుడు : మే 15
ఎవరు : స్టాన్లీ ఫెర్నాండజ్ (62)
ఎక్కడ : చెన్నై, తమిళనాడు
ఎందుకు : కరోనా వైరస్ కారణంగా...
జో బైడెన్ సలహాదారుగా నియమితులైన భారతీయ-అమెరికన్?
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు సీనియర్ సలహాదారుగా భారతీయఅమెరికన్, విధాన నిపుణురాలు నీరా టాండన్ నియమితులయ్యారు. అధ్యక్షుడి సీనియర్ సలహాదారుగా నీరా... యూఎస్ డిజిటల్ సర్వీసు, కేర్ యాక్ట్ వ్యవహారాలను పర్యవేక్షించనున్నట్లు సమాచారం. 50 ఏళ్ల నీరా.. ప్రస్తుతం సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రెస్ అధ్యక్షురాలు, ముఖ్య కార్యనిర్వహణాధికారిగా (సీఈఓ) పనిచేస్తున్నారు. సమాజాభివృద్ధి కోసం సంస్థ కృషి చేస్తోంది.
గాజాపై నిప్పుల వాన
పాలస్తీనాలోని గాజా సిటీపై ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. మే 16న నిప్పుల వర్షం కురిపించింది. ఈ ఘటనలో మూడు భవనాలు నేలమట్టమయ్యాయి. కనీసం 42 మంది పాలస్తీనియన్లు మరణించినట్లు తెలిసింది. వారం రోజుల క్రితం ఇజ్రాయెల్, పాలస్తీనా హమాస్ మిలటరీ మధ్య మొదలైన దాడులు, ప్రతిదాడులు కొనసాగుతూనే ఉన్నాయి.
అత్యవసర సమావేశం...
తాజా ఘర్షణలపై చర్చించేందుకు 57 ఇస్లామిక్ దేశాల కూటమి మే 16న అత్యవసరంగా సమావేశమయ్యింది. స్వతంత్ర దేశాన్ని కలిగి ఉండే అర్హత పాలస్తీనియన్లకు ఉందని ఇస్లామిక్ దేశాల కూటమి అభిప్రాయపడింది. జెరూసలేం, గాజాలో తాజా పరిస్థితికి ఇజ్రాయెల్ బాధ్యత వహించాలని కొన్ని ఇస్లామిక్ దేశాలు తేల్చిచెబుతున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సలహాదారుగా నియమితులైన భారతీయ-అమెరికన్?
ఎప్పుడు : మే 15
ఎవరు : నీరా టాండన్
ఎక్కడ : అమెరికా
ఎందుకు : బైడెన్ ప్రభుత్వానికి సేవలందించేందుకు...
నల్సా ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా నియమితులైన సుప్రీంకోర్టు న్యాయమూర్తి?
నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఈ స్థానంలో ఉన్న జస్టిస్ ఎన్.వి.రమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. సీనియారిటీపరంగా రెండో స్థానంలో ఉన్న జస్టిస్ నారీమన్ 2021, ఆగస్టు 12న రిటైరవుతున్నారు. దీంతో ఆ తర్వాత స్థానంలో ఉన్న జస్టిస్ లలిత్‌ను ఆ పదవికి ఎంపిక చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా నియామకం
ఎప్పుడు : మే 17
ఎవరు : సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్
ఎందుకు: జస్టిస్ నారీమన్ 2021, ఆగస్టు 12న రిటైరవుతున్నందున...
ప్రముఖ శాస్త్రవేత్త షాహిద్ జమీల్ రాజీనామా
ప్రముఖ వైరాలజిస్టు షాహిద్ జమీల్... జినోమ్ కన్సార్షియం (ఇన్సాకోగ్) అధిపతి పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని మే 14న జమీల్ ప్రకటించారు. సార్స్ కోవ్-2 జన్యు మార్పులను ఎప్పటికప్పుడు ఇన్సాకోగ్ పర్యవేక్షిస్తోంది. మార్పులకు అనుగుణంగా ప్రభుత్వానికి సలహాలు ఇస్తుంది. ఇలాంటి కీలక పదవికి జమీల్ రాజీనామా చేయడం చర్చనీయాంశమవుతోంది.
ఐఎంఏ మాజీ అధ్యక్షుడు, పద్మశ్రీ అవార్డీ అగర్వాల్ కన్నుమూత
ప్రముఖ హృద్రోగ నిపుణులు, ఐఎంఏ మాజీ అధ్యక్షుడు, పద్మశ్రీ అవార్డీ డాక్టర్ కేకే అగర్వాల్ (62) కన్నుమూశారు. కరోనా వైరస్ బారిన పడిన ఆయన ఢిల్లీ ఎయిమ్స్‌లో మే 18న తుదిశ్వాస విడిచారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్‌లో మహమ్మారితో పోరాటం చేస్తూ 270 మంది డాక్టర్లు ప్రాణాలు కోల్పోయారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తెలిపింది. కరోనా మొదటి వేవ్‌లో 748 మంది వైద్యులు మరణించారు.
కేంద్ర మాజీ మంత్రి చమన్‌లాల్ కన్నుమూత
భాజపా సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చమన్‌లాల్ గుప్తా(87) కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా జమ్మూలోని తన నివాసంలో మే 18న తుదిశ్వాస విడిచారు. 1934లో జన్మించిన చమన్‌లాల్... ఐదు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో రాణించారు. 1972లో తొలిసారి జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. భాజపా రాష్ట్ర అధ్యక్షునిగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రముఖ హృద్రోగ నిపుణులు, ఐఎంఏ మాజీ అధ్యక్షుడు, పద్మశ్రీ అవార్డీ కన్నుమూత
ఎప్పుడు : మే 18
ఎవరు : డాక్టర్ కేకే అగర్వాల్ (62)
ఎక్కడ : ఢిల్లీ ఎయిమ్స్
ఎందుకు: కరోనా వైరస్ కారణంగా..
సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత రాజనారాయణన్ కన్నుమూత
కరిసల్ సాహిత్య పితామహుడిగా మన్ననలు అందుకున్న సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, ప్రముఖ తమిళ రచయిత కి.రా. అలియాస్ కె.రాజనారాయణన్ (99) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యల కారణంగా పుదుచ్చేరిలో మే 17న తుదిశ్వాస విడిచారు. తూత్తుకుడి జిల్లా కోవిల్పట్టి సమీపాన ఇడైసేవల్ గ్రామంలో 1922లో రాజనారాయణన్ జన్మించారు. ఆయన అసలు పేరు రాయంగల శ్రీ కృష్ణరాజ నారాయణ పెరుమాళ్ రామానుజం. దానిని కె.రాజనారాయణన్‌గా మార్చుకున్నారు. 30కుపైగా పుస్తకాలు రాసి పలు పురస్కారాలు పొందారు. పుదుచ్చేరి విశ్వవిద్యాలయంలో గౌరవ ఆచార్యులుగా పని చేశారు. 7వ తరగతి వరకు మాత్రమే చదివిన ఆయన... చదువుకు, సాహిత్య పరిజ్ఞానానికి సంబంధం లేదని నిరూపించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, ప్రముఖ తమిళ రచయిత
ఎప్పుడు : మే 17
ఎవరు : కె.రాజనారాయణన్ (99)
ఎక్కడ : పుదుచ్చేరి
ఎందుకు: వృద్ధాప్య సమస్యల కారణంగా..

- సుబోధ్ జైస్వాల్ బిహార్ రాష్ట్రం ధన్బాద్ జిల్లా సింద్రిలో 1962 సెప్టెంబర్ 22న జన్మించారు.
- బీఏ (హానర్స్), ఎంబీఏ చేశారు.
- 1985 బ్యాచ్‌కు చెందిన మహారాష్ట్ర కేడర్ ఐపీఎస్ అధికారి.
- ముంబై యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్‌లో పనిచేశారు. పలు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లకు నాయకత్వం వహించారు. 2008లో జరిగిన మాలేగావ్ పేలుళ్ల కేసును దర్యాప్తు చేశారు.
- 2002లో నకిలీ స్టాంపు పేపర్‌ల కుంభకోణంపై దర్యాప్తు జరిపిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)కు నేతృత్వం వహించారు. అబ్దుల్ కరీమ్ తెల్గీ ప్రధాన పాత్రధారిగా తేలిన రూ. 20 వేల కోట్ల రూపాయల స్టాంపు పేపర్ల కుంభకోణం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే.
- జులై 11, 2006లో చోటుచేసుకున్న వరుస రైలు బాంబు పేలుళ్ల కేసు దర్యాప్తులో కీలకపాత్ర పోషించారు.
- ముంబై పోలీసు కమీషనర్‌గా పనిచేశారు.
- మహారాష్ట్ర డీజీపీగా పనిచేశారు.
- ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ)లో సేవలందించారు.
- రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా)లో తొమ్మిదేళ్ల సుదీర్ఘకాలం సేవలందించారు. ఇందులో మూడేళ్లు రా అదనపు కార్యదర్శిగా పనిచేశారు.
- విధినిర్వహణలో ప్రతిభ చూపినందుకుగాను 2001లో రాష్ట్రపతి పోలీసు మెడల్‌ను అందుకున్నారు.
- 2020లో కేంద్ర ప్రభుత్వం నుంచి ‘అసాధారణ్ సురక్షా సేవా ప్రమాణ్ పత్ర్ (ఏఎస్‌ఎస్‌పీపీ) అందుకున్నారు.

Published date : 29 Jun 2021 03:32PM