జూన్ 2017 వ్యక్తులు
Sakshi Education
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి మీరాకుమార్
రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ పోటీ చేయనున్నారు. ఈ మేరకు పార్లమెంట్ లైబ్రరీ హాల్లో జూన్ 22న భేటీ అయిన 17 ప్రతిపక్ష పార్టీలు తమ రాష్ట్రపతి అభ్యర్థిగా బిహార్‌కు చెందిన దళిత నాయకురాలు మీరాకుమార్‌ను ఎంపిక చేశాయి. ఆమె భారత మాజీ ఉప ప్రధాని, ప్రముఖ దళిత నాయకుడు బాబు జగ్జీవన్‌రామ్ కుమార్తె.
ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ కూడా దళితవర్గానికి చెందిన వారే కావటంతో ఈ సారి రాష్ట్రపతి ఎన్నికలు ఇద్దరు దళిత నేతల మధ్య జరగనున్నాయి. రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ జూలై 17న జరుగుతుంది. ఫలితాలు అదే నెల 20వ తేదీన వెలువడతాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి
ఎప్పుడు : జూన్ 22
ఎవరు: మీరాకుమార్
మధ్యప్రదేశ్ మంత్రి నరోత్తమ్‌పై ఈసీ వేటు
మధ్యప్రదేశ్ సీనియర్ మంత్రి నరోత్తమ్ మిశ్రాపై ఎన్నికల సంఘం (ఈసీ) అనర్హత వేటు వేసింది. పెయిడ్ న్యూస్ అభియోగాలు, ఎన్నికల ఖర్చులకు సంబంధించి తప్పుడు లెక్కలను చూపించారని పేర్కొంటూ ఆయనపై ఈ చర్యలు తీసుకుంది. మధ్యప్రదేశ్‌లోని దటియా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన ఎన్నికకూడా చెల్లదని స్పష్టం చేసింది. 2017 జూన్ 24 నుంచి మూడేళ్లపాటు మిశ్రాను అనర్హుడిగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రధాన ఎన్నికల అధికారి నసీమ్ జైదీ, ఎన్నికల కమిషనర్లు ఏకే జోటీ, ఓపీ రావత్‌లతో కూడిన ఎన్నికల సంఘం ధర్మాసనం.. 69 పేజీలతో కూడిన ఉత్తర్వులు జారీ చేసింది.
ఈసీ నిర్ణయంతో మిశ్రా మూడేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు. 2008 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తన ఎన్నికల ఖర్చులకు సంబంధించిన పూర్తి వివరాలను ఈసీ ముందుంచలేదని ఆరోపిస్తూ 2009లో కాంగ్రెస్ నేత రాజేంద్ర భారతి చేసిన ఫిర్యాదుపై స్పందించిన ఈసీ విచారణ అనంతరం తన తీర్పు వెలువరించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మధ్యప్రదేశ్ మంత్రి నరోత్తమ్ మిశ్రాపై అనర్హత వేటు
ఎప్పుడు : జూన్ 25
ఎవరు: భారత ఎన్నికల సంఘం
ఎందుకు : ఎన్నికల ఖర్చుపై తప్పుడు లెక్కలు చూపినందుకు గాను
స్కిల్ ఇండియా ప్రచారకర్తగా ప్రియాంక చోప్రా
కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న పథకం ‘స్కిల్ ఇండియా’కు బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ప్రచారకర్తగా వ్యవహరించనున్నారు. ఇందుకోసం జాతీయ నైపుణ్య శిక్షణాభివృద్ధి సంస్థ(ఎన్‌ఎస్‌డీసీ) ప్రియాంకతో ఒప్పందం కుదుర్చుకోనుంది.
గతంలో క్రికెటర్ విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా, షబానా ఆజ్మీ, సింగర్ మోహిత్ చౌహాన్ తదితరులు స్కిల్ ఇండియా కార్యక్రమానికి ప్రచారకర్తలుగా వ్యవహరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : స్కిల్ ఇండియా ప్రచారకర్త
ఎప్పుడు : జూన్ 25
ఎవరు: బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా
సలావుద్దీన్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన అమెరికా
కశ్మీరీ ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్‌ను అమెరికా విదేశాంగ శాఖ జూన్ 26న అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. అమెరికాలో పర్యటిస్తున్న నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమావేశానికి కొద్ది గంటలముందే ఈ నిర్ణయాన్ని వెలువరించింది. దీంతో సలావుద్దీన్‌తో అమెరికన్లు ఎవరూ ఎలాంటి లావాదేవీలు జరపటం, సంబంధాలు నెరపటం పూర్తిగా నిషేధం. అమెరికా అధికార పరిధిలోని ప్రాంతాల్లో ఉన్న సలావుద్దీన్ ఆస్తులను కూడా జప్తుచేస్తారు. సలావుద్దీన్ నేతృత్వంలో హిజ్బుల్ (పాక్ కేంద్రంగా) ఉగ్రవాదులు జమ్మూకశ్మీర్‌లో విధ్వంసాలకు పాల్పడ్డారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సయ్యద్ సలావుద్దీన్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటన
ఎప్పుడు : జూన్ 26
ఎవరు: అమెరికా ప్రభుత్వం
ఎందుకు : హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థ నెలకొల్పి ఉగ్రదాడులకు పాల్పడుతున్నందుకు
మిస్ ఇండియా-2017గా మానుషి చిల్లర్
ఫెమినా మిస్ ఇండియా-2017 కిరీటాన్ని హరియాణాకు చెందిన మానుషి చిల్లర్ కైవసం చేసుకుంది. ముంబైలోని యశ్‌రాజ్ ఫిల్మ్ స్టూడియోలో జూన్ 25న జరిగిన పోటీలో విజేతగా నిలిచిన ఆమె మిస్ ఇండియా టైటిల్ గెలుచుకుంది. మొత్తం 30 మంది పోటీ పడగా.. టాప్ 6లో మానుషి చిల్లర్, షెఫాలీ సూద్, సనా దువా, ప్రియాంక కుమారి, ఐశ్వర్య దేవన్, అనుక్రితి గుసైన్‌లు నిలిచారు. మొదటి రన్నరప్‌గా సనా దువా(జమ్మూ కశ్మీర్), రెండో రన్నరప్‌గా ప్రియాంక కుమారి(బిహార్) ఎంపికయ్యారు.
బాలీవుడ్ నటులు అర్జున్ రాంపాల్, ఇలియానా, బిపాసా బసు, అభిషేక్ కపూర్, విద్యుత్ జమాల్, ఫ్యాషన్ డిజైనర్ మనీశ్ మల్హోత్రలు ఈ పోటీల్లో న్యాయమూర్తులుగా వ్యవహరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మిస్ ఇండియా - 2017
ఎప్పుడు : జూన్ 25
ఎవరు: మానుషి చిల్లర్ (హర్యాణా)
ఎక్కడ : ముంబైలో
ఐఎఫ్‌పీఆర్‌ఐ ఉపాధ్యక్షునిగా మహేంద్రదేవ్
గుంటూరు జిల్లా తుమ్మపూడికి చెందిన ప్రొఫెసర్ మహేంద్ర దేవ్ అమెరికా రాజధాని వాషింగ్టన్ కేంద్రంగా నడిచే అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధనా సంస్థ (ఐఎఫ్‌పీఆర్‌ఐ) ట్రస్టీ బోర్డు ఉపాధ్యక్షులుగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఆర్‌బీఐ నిర్వహించే ఇందిరాగాంధీ అభివృద్ధి పరిశోధనా సంస్థ వైస్ చాన్స్‌లర్‌గా ఉన్నారు.
మహేంద్రదేవ్ గతంలో హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించే సెస్‌కు తొమ్మిదేళ్ల పాటు డెరైక్టర్‌గా, కనీస మద్దతు ధరల నిర్ణాయక సంఘం చైర్మన్‌గానూ పని చేశారు. ఐఎఫ్‌పీఆర్‌ఐ ఉపాధ్యక్ష హోదాలో ఆయన రెండేళ్ల పాటు కొనసాగుతారు. ఈ సంస్థ 42 ఏళ్ల చరిత్రలో అధ్యక్ష/ఉపాధ్యక్ష పదవిని చేపట్టిన రెండో భారతీయుడు మహేంద్ర దేవ్. గతంలో డాక్టర్ ఐషర్ జడ్‌జ అహ్లూవాలియా ఈ పోస్టును అలంకరించారు.
ప్రపంచంలో ఆకలి, దారిద్య్రం, పౌష్టికాహార లోపాన్ని తగ్గించేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలను, పరిష్కార మార్గాలను సూచించేందుకు 1975లో ఐఎఫ్‌పీఆర్‌ఐ ఏర్పాటయింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐఎఫ్‌పీఆర్‌ఐ ఉపాధ్యక్షునిగా భారతీయుడు
ఎప్పుడు : జూన్ 26
ఎవరు: ప్రొఫెసర్ మహేంద్ర దేవ్
ఎక్కడ : వాషింగ్టన్, అమెరికా
శాస్త్రవేత్త పీకే కావ్ కన్నుమూత
అంతర్జాతీయ గుర్తింపు పొందిన ప్లాస్మా శాస్త్రవేత్త ప్రిధిమాన్ క్రిషన్ కావ్ (69) జూన్ 19న అహ్మదాబాద్‌లో మరణించారు. ఆయన తన అసాధారణ ప్రతిభతో 18 ఏళ్ల వయసులోనే ఢిల్లీ ఐఐటీ నుంచి పీహెచ్‌డీ పూర్తి చేశారు. గాంధీనగర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రీసెర్చ్ (ఐపీఆర్) వ్యవస్థాపక సంచాలకుడి (1986-12)గా పనిచేశారు. ఆయనకు 1985లో పద్మశ్రీ పురస్కారం లభించింది.
జస్టిస్ పీఎన్ భగవతి కన్నుమూత
భారత న్యాయ వ్యవస్థలో ‘ప్రజా ప్రయోజన వ్యాజ్యం’(పిల్)కు ఆద్యుడిగా భావించే న్యాయ కోవిదుడు, మాజీ సీజేఐ జస్టిస్ పీఎన్ భగవతి (95) జూన్ 15న న్యూఢిల్లీలో కన్నుముశారు. పీఎన్ భగవతి 1985 జూలై నుంచి 1986 డిసెంబర్ వరకు సుప్రీంకోర్టుకు 17వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. అంతకు ముందు గుజరాత్ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన ఆయన 1973 జూలైలో సుప్రీంకోర్టులో జడ్జిగా చేరారు.
భగవతి సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్న సమయంలో పిల్, భారత న్యాయ వ్యవస్థలో సంపూర్ణ జవాబుదారీతనం వంటి భావనలను ప్రవేశపెట్టారు. ఖైదీలు కూడా ప్రాథమిక హక్కులకు అర్హులే అని ఆయన ఓ సందర్భంలో తీర్పునిచ్చారు. 1978లో ప్రస్తుత కేంద్ర మంత్రి మేనకా గాంధీ పాస్‌పోర్టు స్వాధీన కేసులో ఆయన ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమైనది. పౌరుల కదలికలను నియంత్రించకూడదని, పాస్‌పోర్టులను తమ వద్దే ఉంచుకునే హక్కు ప్రతిఒక్కరికి ఉందని భగవతి ఆ సందర్భంగా అన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జస్టిస్ పీఎన్ భగవతి కన్నుమూత
ఎప్పుడు : జూన్ 15
ఎక్కడ : న్యూఢిల్లీలో
ఎవరు : ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి ఆద్యుడు
ఐరాసలో జడ్జిగా భారత మహిళ
ఐక్యరాజ్య సమితిలోని సముద్ర జలాల వివాదాలను పరిష్కరించే ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఫర్ ది లా ఆఫ్ ది సీ(ఐటీఎల్‌ఓఎస్)కు భారత్‌కు చెందిన న్యాయ నిపుణురాలు నీరు చాధా ఎన్నికయ్యారు. జూన్ 14న జరిగిన ఓటింగ్‌లో చాధాకు ఆసియా పసిఫిక్ గ్రూప్‌లో అత్యధికంగా 120 ఓట్లు రావడంతో అమె తొలి రౌండ్‌లోనే గెలుపొందారు. తద్వారా ఈ ట్రిబ్యునల్‌కు జడ్జిగా నియమితులైన తొలి భారత మహిళగా ఆమె గుర్తింపు పొందారు. చాధా ఈ పదవిలో 9 ఏళ్లు ఉంటారు. ఈ ట్రిబ్యునల్‌లో మొత్తం 21 మంది సభ్యులుంటారు.
ప్రముఖ న్యాయవాది చాధా విదేశాంగ శాఖలో ముఖ్య న్యాయ సలహాదారుగా పనిచేసిన తొలి మహిళగా పేరుగాంచారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐటీఎల్‌ఓఎస్ న్యాయమూర్తిగా భారత మహిళ
ఎప్పుడు : జూన్ 15
ఎవరు : నీరు చాధా
జర్మనీ ఏకీకరణ ఆద్యుడు కోల్ కన్నుమూత
జర్మనీ పునరేకీకరణకు ఆద్యుడిగా పేరుపొందిన ఆ దేశ మాజీ చాన్స్‌లర్ హెల్మట్ కోల్(87) జూన్ 16న బెర్లిన్‌లో కన్నుమూశారు. రెండో ప్రపంచ యుద్ధం అనంతరం రెండు ముక్కలైన జర్మనీని ఏకం చేసేందుకు ఆయన కృషిచేశారు. 1982లో పశ్చిమ జర్మనీ చాన్స్‌లర్‌గా ఎన్నికైన ఆయన 1989లో బెర్లిన్ గోడ కూల్చివేతతో తూర్పు, పశ్చిమ జర్మనీల్ని ఒకటి చేశారు. అనంతరం 1998 వరకు ఉమ్మడి జర్మనీకి చాన్స్‌లర్‌గా కొనసాగారు. 1945లోజర్మనీ రెండుగా చీలిపోగా.. 1989 వరకు పెట్టుబడిదారుల చేతుల్లో పశ్చిమ జర్మనీ, కమ్యూనిస్టుల పాలనలో తూర్పు జర్మనీ కొనసాగాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హెల్మట్ కోల్ కన్నుమూత
ఎప్పుడు : జూన్ 16
ఎవరు : జర్మనీ ఏకీకరణ ఆద్యుడు
ఎక్కడ : బెర్లిన్‌లో
అటల్ ఇన్నోవేషన్ మిషన్ డెరైక్టర్‌గా రామనాథన్ రామనన్
నీతి ఆయోగ్ ఆధ్వర్యంలోని అటల్ ఇన్నోవేషన్ మిషన్ డెరైక్టర్‌గా రామనాథన్ రామనన్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర నియామకాల కమిటీ అదనపు కార్యదర్శి హోదాలో ఆయన నియామకానికి జూన్ 16న ఆమోదం తెలిపింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థలో ఎగ్జిక్యూటివ్ గా ఉన్న రామనన్.. తాత్కాలిక బదిలీపై ఈ బాధ్యతలు చేపడతారు. ఆయన ఈ పదవిలో రెండేళ్ల పాటు ఉంటారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అటల్ ఇన్నోవేషన్ మిషన్‌కు డెరైక్టర్ నియామకం
ఎప్పుడు : జూన్ 16
ఎవరు : రామనాథన్ రామనన్
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్ కోవింద్
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా దళితనేత రామ్‌నాథ్ కోవింద్ (71) పేరుని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా జూన్ 19న ప్రకటించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రామ్‌నాథ్ ప్రస్తుతం బిహార్ గవర్నర్‌గా ఉన్నారు. ఆయనికి రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన అనుభవం ఉంది. సుప్రీంకోర్టు న్యాయవాదిగా రాజ్యాంగంపైనా అవగాహన ఉంది. జూన్ 23న రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి
ఎప్పుడు : జూన్ 19
ఎవరు : రామ్‌నాథ్ కోవింద్
జీఎస్టీ ప్రచారకర్తగా అమితాబ్ బచ్చన్
జీఎస్టీ ప్రచారకర్తగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇప్పటికే 40 సెకన్ల్ల నిడివున్న వీడియోను కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం(సీబీడీటీ) అమితాబ్‌పై చిత్రీకరించి ప్రసారం ప్రారంభించింది. ‘జీఎస్టీ- ఏకీకృత జాతీయ విపణి ఏర్పాటు కోసం తొలి అడుగు’ పేరిట ఈ వీడియో ప్రసారం అవుతుంది. ఇంతకుముందు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు జీఎస్టీ అంబాసిడర్‌గా పనిచేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జీఎస్టీ ప్రచారకర్త ఎంపిక
ఎప్పుడు : జూన్ 19
ఎవరు : అమితాబ్ బచ్చన్
ఎందుకు : జీఎస్టీపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడానికి
జస్టిస్ సీఎస్ కర్ణన్ అరెస్ట్
కోర్టు ధిక్కార కేసులో ఆర్నెల్ల జైలు శిక్షను ఎదుర్కొని తప్పించుకు తిరుగుతున్న కోల్‌కతా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ కర్ణన్ అరెస్టయ్యారు. అజ్ఞాతంలో ఉన్న ఆయనను జూన్ 20న కోయంబత్తూరు దగ్గర్లోని మలుమిచ్చంపట్టి గ్రామంలో పశ్చిమబెంగాల్ సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
కోర్టు ధిక్కార కేసులో సీజేఐ జస్టిస్ ఖేహర్ నేతృత్వంలోని బెంచ్.. కర్ణన్‌కు ఆర్నెల్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. దీంతో జైలు శిక్ష విధింపబడిన మొదటి న్యాయమూర్తిగా కర్ణన్ న్యాయ చరిత్రలో నిలిచిపోయారు. 1983లో తమిళనాడులో న్యాయవాదిగా వృత్తిజీవితం ప్రారంభించిన కర్ణన్ 2009లో మద్రాసు హైకోర్టులో న్యాయమూర్తిగా నియమితులవగా.. 2016 మార్చి 11న కోల్‌కతా హైకోర్టుకు బదిలీ అయ్యారు. తాజాగా వివాదాల నేపథ్యంలోనే జూన్ 12న పదవీ విరమణ కూడా పొందారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జస్టిస్ సీఎస్ కర్ణన్ అరెస్టు
ఎప్పుడు : జూన్ 20
ఎవరు : పశ్చిమ బెంగాల్ సీఐడీ అధికారులు
ఎక్కడ : కోయంబత్తూరు దగ్గర్లోని మలుమిచ్చంపట్టి గ్రామం
ఎందుకు : కోర్టు ధిక్కార కేసులో ఆర్నెళ్ల జైలు శిక్ష అమలు చేయడానికి
ఐసీజేకి తిరిగి నామినేట్ అయిన జస్టిస్ భండారీ
అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) జడ్జి పదవికి భారత్ తన అభ్యర్థిగా మరోసారి జిస్టిస్ దల్వీర్ భండారీని నామినేట్ చేసింది. ఈ మేరకు ఐరాస ప్రధాన కార్యదర్శి గ్యుటెరస్ వద్ద భారత్ నామినేషన్ దాఖలు చేసింది. 2012లో జరిగిన ఓటింగ్‌లో భండారీ ఈ పదవికి ఎన్నికయ్యారు. తదుపరి ఎన్నికలు 2017 నవంబర్‌లో జరగనున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐసీజేకి రెండోసారి నామినేట్ అవడం
ఎప్పుడు : జూన్ 20
ఎవరు : జస్టిస్ దల్వీర్ భండారీ
యూనిసెఫ్ ప్రచారకర్తగా శరణార్థి బాలిక
ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యూనిసెఫ్.. తమ కార్యక్రమాల ప్రచారకర్తగా సిరియా శరణార్థి బాలిక ముజూన్ అల్మెల్లెహాన్‌ను నియమించింది. తద్వారా శరణార్థిగా ఉంటూ యూనిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమితురాలైన తొలి వ్యక్తిగా ముజూన్ నిలిచింది. జోర్డాన్‌లోని జాటారీ శరణార్థి శిబిరంలో ఆశ్రయం పొందుతున్నప్పుడు యూనిసెఫ్ నిర్వహించిన ఎన్నో కార్యక్రమాల్లో ముజూన్ చురుగ్గా పాల్గొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : యూనిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్
ఎప్పుడు : జూన్ 20
ఎవరు : ముజూన్ అల్మెల్లెహాన్
ఎందుకు : యూనిసెఫ్ నిర్వహించిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నందుకు
ఎఫ్‌బీఐ నూతన డెరైక్టర్‌గా క్రిస్టఫర్
అమెరికాలోని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ)కు తదుపరి డెరైక్టర్‌గా మాజీ అటార్నీ జనరల్ క్రిస్టఫర్ రే(50) నియమితులయ్యారు. ఈ పదవికి ఆయనని నామినేట్ చేస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జూన్ 6న తెలిపారు. సెనేట్ ఆమోదం పొందిన వెంటనే ప్రస్తుతం ఎఫ్‌బీఐ తాత్కాలిక డెరైక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆండ్రూ మెక్‌కేబ్ నుంచి క్రిస్టఫర్ బాధ్యతలు స్వీకరిస్తారు. న్యాయశాఖలో 2003-05 కాలంలో అసిస్టెంట్ అటార్నీ జనరల్‌గా పనిచేసిన క్రిస్టఫర్.. ఎన్‌రాన్ కుంభకోణంతో పాటు సెప్టెంబర్ 11 ఉగ్రదాడుల విచారణలో కీలకంగా వ్యవహరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎఫ్‌బీఐ నూతన డెరైక్టర్
ఎప్పుడు : జూన్ 6
ఎక్కడ : అమెరికాలో
ఎవరు : క్రిస్టఫర్ రే
నాసా వ్యోమగాముల్లో భారత సంతతి వ్యక్తి
నాసా చేపట్టనున్న అంతరిక్ష ప్రయోగానికి ఎంపికైన 12 మంది వ్యోమగాముల్లో భారత సంతతికి చెందిన యూఎస్ ఎయిర్ ఫోర్స్‌లో లెఫ్టినెంట్ కల్నల్‌గా పనిచేస్తున్న రాజాచారి (39) చోటు దక్కించుకున్నారు. ప్రస్తుతం అయోవా రాష్ట్రంలోని వాటర్లూ నగరంలో నివసిస్తున్న రాజాచారీ మసాచూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ నుంచి ఎరోనాటిక్స్ అండ్ ఆో్టన్రాటిక్స్‌లో మాస్టర్ డిగ్రీ, అమెరికాలోని నావెల్ టెస్ట్ పైలట్ స్కూల్ నుంచి డిగ్రీ పట్టా అందుకున్నారు. ప్రస్తుతం ఆయన 461 ఫ్లైట్ టెస్ట్ స్క్వాడ్రన్‌లో కమాండర్‌గా, కాలిఫోర్నియాలోని ఎడ్వర్డ్స్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌లో ఉన్న ఎఫ్-35 ఇంటిగ్రేటెడ్ టెస్ట్ ఫోర్స్‌కు డెరైక్టర్‌గా ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నాసా వ్యోమగామిగా ఎంపికైన భారత సంతతి వ్యక్తి
ఎప్పుడు : జూన్ 8
ఎవరు : రాజాచారి
ఫోర్బ్స్ టాప్-100లో కోహ్లికి చోటు
ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్న 100 మంది క్రీడాకారుల జాబితాలో 22 మిలియన్ డాలర్లతో (రూ.141 కోట్లు) కోహ్లి 89వ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఫోర్బ్స్ పత్రిక జూన్ 8న ప్రకటించిన ఈ జాబితాలో భారత్ నుంచి కోహ్లి ఒక్కడే చోటు దక్కించుకున్నాడు. కోహ్లి ఆర్జనలో 3 మిలియన్ డాలర్లు మ్యాచ్ ఫీజుల ద్వారా అందుకోగా, 19 మిలియన్ డాలర్లు ఎండార్స్‌మెంట్‌ల ద్వారా పొందాడు.
ఈ జాబితాలో క్రిస్టియానో రొనాల్డో 93 మిలియన్ డాలర్లతో (రూ.636 కోట్లు) అగ్రస్థానంలో ఉండగా జాబితాలో చోటుదక్కించుకున్న ఏకైక మహిళా క్రీడాకారిణి సెరెనా విలియమ్స్. 2016 జూన్ నుంచి 2017 జూన్ మధ్య ఆదాయాన్ని పరిగణలోకి తీసుకొని ఫోర్బ్స్ ఈ జాబితాను రూపొందించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఫోర్బ్స్ - 100 క్రీడాకారుల జాబితా
ఎప్పుడు : జూన్ 8
ఎవరు : 89వ స్థానంలో కోహ్లీ
ఎన్‌ఎస్‌ఈ చీఫ్‌గా లిమాయే నియామకానికి ఆమోదం
ఎన్‌ఎస్‌ఈ( నేషనల్ స్టాక్ ఎక్సేంజ్) కొత్త చీఫ్‌గా విక్రమ్ లిమాయే నియామకానికి మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ జూన్ 9న
సివిల్స్ - 2016 టాపర్ కేఆర్ నందిని
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) మే 31న విడుదల చేసిన సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2016 ఫలితాల్లో కర్ణాటకకు చెందిన కేఆర్ నందిని తొలి ర్యాంకు కైవసంచేసుకున్నారు. కన్నడ సాహిత్యం ఆప్షనల్‌గా ఎంచుకున్న ఆమె నాలుగో ప్రయత్నంలో ఐఏఎస్ సాధించారు. నందిని ప్రస్తుతం ఐఆర్‌ఎస్ అధికారిగా శిక్షణ పొందుతున్నారు.
పంజాబ్‌కు చెందిన అన్మోల్ షేర్ సింగ్ బేడీ రెండో ర్యాంకును దక్కించుకోగా ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాకు చెందిన రోణంకి గోపాల కృష్ణ మూడో స్థానంలో నిలిచాడు. విజయవాడకు చెందిన కొత్తమాసు దినేశ్‌కుమార్ (వరంగల్ ఎన్‌ఐటీలో చదివారు) ఆరో ర్యాంకు సాధించారు.
మొత్తంగా సివిల్స్‌కు ఎంపికైన 1099 మందిలో తెలుగు రాష్ట్రాల నుంచి 90 మందికిపైగా ఎంపికయ్యారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సివిల్ సర్వీసెస్ - 2016 ఫలితాలు
ఎప్పుడు : మే 31
ఎవరు : తొలి ర్యాంకర్ కేఆర్ నందిని
ఐవోసీ చైర్మన్‌గా సంజీవ్ సింగ్
దేశీ దిగ్గజ ఫ్యూయెల్ రిటైలర్ ‘ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్’ (ఐవోసీ) చైర్మన్‌గా సంజీవ్ సింగ్ నియమితులయ్యారు. ప్రస్తుత చైర్మన్ బి.అశోక్ మే 31న పదవీ విరమణ చేయటంతో ఆయన స్థానంలో సంజీవ్ నియమితులయ్యారు.
సంజీవ్ సింగ్ చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ (సీపీసీఎల్), హిందుస్తాన్ ఉర్వరక్ అండ్ రసాయన్ (హెచ్‌యూఆర్‌ఎల్) కంపెనీలకు కూడా చైర్మన్‌గా కూడా కొనసాగుతారని కంపెనీ పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐవోసీకి నూతన చైర్మన్
ఎప్పుడు : జూన్ 1
ఎవరు : సంజీవ్ సింగ్
ప్రసారభారతి సీఈవోగా శశిశేఖర్ వెంపటి
ప్రసారభారతి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈవో)గా వెంపటి శశిశేఖర్‌ను నియమిస్తున్నట్లు ఉపరాష్ట్రపతి అన్సారీ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ జూన్ 2న తెలిపింది. శేఖర్ ప్రస్తుతం ప్రసారభారతిలో పార్ట్ టైమ్ సభ్యుడిగా ఉన్నారు. ఐఐటీ- ముంబైలో చదువుకున్న శేఖర్ కార్పోరేట్ మేనేజ్‌మెంట్, టెక్నాలజీ కన్సల్టింగ్, డిజిటల్ మీడియాలో అనుభవజ్ఞుడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రసార భారతి కొత్త సీఈవో నియామకం
ఎప్పుడు : జూన్ 2
ఎవరు : వెంపటి శశిశేఖర్
అంతర్జాతీయ ఎకనమిక్ ఫోరం వేదికలో పాల్గొన్న మోదీ
విశ్వమానవాళికి ప్రమాదకరంగా మారిన ఉగ్రవాదానికి నిధులు, ఆయుధాల సరఫరాపై కఠినంగా వ్యవహరించాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. జూన్ 2న రష్యా పర్యటనలో భాగంగా సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరిగిన అంతర్జాతీయ ఎకనమిక్ ఫోరం వేదికగా ప్రసంగించారు. ఓ భారత ప్రధాని అంతర్జాతీయ ఎకనమిక్ ఫోరంలో పాల్గొనటం ఇదే తొలిసారి.
అనంతరం భారత్-రష్యా మధ్య విమానాలు, అటోమొబైల్స్ తదితర 19 రంగాల్లో సంయుక్తంగా ముందుకెళ్లడానికి ఒప్పందాలు కుదిరాయి. భారత్‌కు ఎస్-400 మిసైల్ వ్యవస్థను సరఫరా చేసేందుకు రష్యా అంగీకరించింది. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని దస్తాన్ గుంజ్‌చోయ్‌నీ బౌద్ధాలయాన్ని సందర్శించిన మోదీ అక్కడి పూజారి జంపా డోనార్‌కు టిబెట్ బౌద్ధగ్రంథాలైన ‘ఉర్గా కంజూర్’లోని 100 సంపుటాలను బహూకరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అంతర్జాతీయ ఎకనమిక్ ఫోరం వేదికలో ప్రసంగం
ఎప్పుడు : జూన్ 2
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఐర్లండ్ ప్రధానిగా భారత సంతతి నేత
ఐర్లండ్ తదుపరి ప్రధానిగా భారత సంతతికి చెందిన లియో వారడ్కర్ (38) ఎంపికయ్యారు. తద్వారా ఐర్లండ్‌కు అత్యంత పిన్న వయస్కుడైన, తొలి మైనార్టీ ప్రధానిగా నిలిచారు. తొలి స్వలింగ సంపర్క (గే) ప్రధానిగానూ రికార్డులకెక్కారు. అవినీతి ఆరోపణలతో ప్రస్తుత ప్రధాని ఎండా కెన్నీ రాజీనామాతో జరిగిన అధికార ఫైన్ గేల్ పార్టీ అంతర్గత ఎన్నికలో ఆయనకు 60 శాతం ఓట్లు వచ్చాయి.
ముంబై నుంచి వచ్చి స్థిరపడిన హిందూ, మహారాష్ట్రీయుడైన డాక్టర్ అశోక్ వారడ్కర్, ఐరిష్ నర్స్ మీరియమ్ మూడో సంతానమే లియో. వారడ్కర్ 2007లో డబ్లిన్ వెస్ట్ స్థానం నుంచి ఐర్లండ్ దిగువసభకు ఎన్నికై, మంత్రిగా పని చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐర్లండ్ ప్రధానిగా భారత సంతతి వ్యక్తి
ఎప్పుడు : జూన్ 2
ఎవరు : లియో వారడ్కర్
యూఎస్ స్పెల్ బీ విజేత అనన్య వినయ్
అమెరికాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ ఫైనల్ పోటీల్లో భారత సంతతికి చెందిన బాలిక అనన్య వినయ్(12) విజేతగా నిలిచింది. 90వ పదంగా మారోకైన్‌కు స్పెల్లింగ్ చెప్పి రూ.26 లక్షల బహుమతి అందుకుంది. అనన్య విజయంతో వరుసగా 13వ సారి ఇండో అమెరికన్ సంతతికి చెందిన వారే ఈ టైటిల్‌ను గెలుచుకున్నటై్లంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : యూఎస్ స్పెల్ బీ పోటీలు
ఎప్పుడు : జూన్ 2
ఎవరు : అనన్య వినయ్
ఆక్సిజన్ లేకుండా ఎవరెస్టు అధిరోహణ
భారత ఆర్మీకి చెందిన నలుగురు సభ్యులు ఆక్సిజన్ సిలిండర్లను వినియోగించకుండా విజయవంతంగా ఎవరెస్టును అధిరోహించిన తొలి బృందంగా రికార్డు సృష్టించారు. ఎవరెస్టును అధిరోహించిన బృందంలో కున్‌చోక్ టెండా, కెల్సాంగ్ డోర్జీ భూటియా, కాల్డెన్ పంజ ర్, సోనమ్ ఫంత్సోక్‌లు ఉన్నారు. మొత్తం 14 మంది సభ్యులుగల బృందంలో ఆక్సిజన్ లేకుండా అధిరోహించిన వారు ఈ నలుగురు కాగా, మిగిలిన వారిలో అర్జీన్ తోప్‌గే, గ్వాంగ్ గెల్‌క్, కర్మ జోపాలు ఆక్సిజన్ సిలిండర్లను వినియోగిస్తూ ఎవరెస్టును అధిరోహించగలిగారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆక్సిజన్ లేకుండా ఎవరెస్ట్ అధిరోహణ
ఎప్పుడు : జూన్ 3
ఎవరు : భారత ఆర్మీకి చెందిన నలుగురు సభ్యులు
అటార్నీ జనరల్ పదవీకాలం పొడిగింపు
అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ, సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్, మరో ఐదుగురు సీనియర్ న్యాయాధికారుల పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ(డీవోపీటీ) తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు వారు తమ పదవుల్లో కొనసాగుతారని కేబినెట్ నియామకాల కమిటీ వెల్లడించింది. పదవీకాలం పొడిగించినవారిలో అదనపు సొలిసిటర్ జనరల్స్ పింకీ ఆనంద్, మనిందర్ సింగ్, పీఎస్ పత్వాలియా, తుషార్ మెహతా, పీఎస్ నర్సింహ ఉన్నారని పేర్కొంది.
ఎవరెస్ట్‌ను రెండోసారి అధిరోహించిన నీరుడి ప్రవీణ్
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం తుర్కపల్లి గ్రామానికి చెందిన నీరుడి ప్రవీణ్ కుమార్ ఎవరెస్ట్ శిఖరాన్ని రెండోసారి అధిరోహించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 3న సాయంత్రం ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడు. 2016లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున ప్రవీణ్ తొలిసారి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రెండోసారి ఎవరెస్టు అధిరోహణ
ఎప్పుడు : జూన్ 3
ఎవరు : నీరుడి ప్రణీత్
జియోనీ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రభాస్
మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ ‘జియోనీ ఇండియా’కి బ్రాండ్ అంబాసిడర్‌గా టాలీవుడ్ హీరో ప్రభాస్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభాస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సంస్థ ప్రకటించింది. జియోనీ ఇప్పటికే క్రికెటర్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్, ప్రముఖ కథానాయిక శృతిహాసన్, దుల్కర్ సల్మాన్, దిల్జిత్ దోశాంజ్ వంటి వారితో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జియోనీ బ్రాండ్ అంబాసిడర్
ఎప్పుడు : జూన్ 5
ఎవరు : టాలీవుడ్ నటుడు ప్రభాస్
సంస్కృత విద్యాపీఠం తొలి వీసీ కన్నుమూత
తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠానికి తొలి ఉపకులపతిగా పనిచేసిన రామానుజ తాతాచార్యులు(90) జూన్ 5న ముంబైలో కన్నుమూశారు. విద్యాపీఠం ఏర్పాటైనప్పటి నుంచి ఐదేళ్లపాటు ఆయన వీసీగా విధులు నిర్వర్తించారు. సంస్కృత భాష అభివృద్ధికోసం ఎంతో పాటుపడ్డారు. ఆయన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం గతేడాది పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. తాతాచార్యులు సంస్కృతంలో రాష్ట్రపతి అవార్డుతో పాటు ఫ్రాన్స్ ప్రభుత్వం నుంచి కెవిలియర్ అవార్డును సొంతం చేసుకున్నారు. ఈయనకు ఐదుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రామానుజ తాతాచార్యులు కన్నుమూత
ఎప్పుడు : జూన్ 5
ఎక్కడ : ముంబైలో
ఎవరు : సంస్కృత విద్యాపీఠం తొలి వీసీ
డబ్ల్యూటీఐ ప్రచారకర్తగా దియా మీర్జా
బాలీవుడ్ నటి దియా మీర్జా వైల్డ్‌లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూటీఐ )కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5న డబ్ల్యూటీఐ అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే ఆమె పర్యావరణ పరిరక్షణ, మానవత విలువలను కాపాడే పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అంతేగాక గత ఏడాది స్వచ్ఛభారత్ కార్యక్రమానికి కూడా ప్రచారకర్తగా తనవంతు బాధ్యతను నిర్వర్తించారు.
డబ్ల్యూటీఐ ఆగస్టులో ఏనుగులపై అవగాహన కల్పించేందుకు గజయాత్రను 13 రాష్ట్రాలలో 18 నెలల పాటు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : డబ్ల్యూటీఐ ప్రచారకర్తగా దియామీర్జా
ఎప్పుడు : జూన్ 5
ఎక్కడ : భారత్‌లో
ఎవరు : వైల్డ్‌లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియ

Published date : 13 Jun 2017 04:14PM