Skip to main content

జనవరి 2021 వ్యక్తులు

కిలిమంజారోను అధిరోహించిన ఐపీఎస్ అధికారి తరుణ్
Current Affairs
ఆఫ్రికాలో అత్యంత ఎత్తైన పర్వతం కిలిమంజారోను సీనియర్ ఐపీఎస్ అధికారి తరుణ్ జోషి జనవరి 22న అధిరోహించారు. ఇప్పటివరకు మొత్తం ఆరు పర్వతాలను ఆయన అధిరోహించారు. పంజాబ్‌కు చెందిన తరుణ్ హైదరాబాద్ నగర నిఘా విభాగం స్పెషల్ బ్రాంచ్‌కు సంయుక్త పోలీస్ కమిషనర్‌గా ఆయన పనిచేస్తున్నారు. 2004లో సివిల్ సర్వీసెస్ ఉత్తీర్ణుడైన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌లో ఐపీఎస్ అధికారిగా నియమితులయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రానికి చెందిన అన్వితారెడ్డి కూడా జోషితో కలసి కిలిమంజారోను అధిరోహించారు. ఆమె ప్రస్తుతం రాక్ క్లైంబింగ్ శిక్షణ పాఠశాలలో శిక్షకురాలిగా పనిచేస్తున్నారు. కిలిమంజారో పర్వతం ఆఫ్రికా దేశం టాంజానియాలో ఉంది.
టాంజానియా రాజధాని: డోడోమా; కరెన్సీ: టాంజానియన్ షిల్లింగ్
టాంజానియా ప్రస్తుత అధ్యక్షుడు: జాన్ మాగుఫులి
టాంజానియా ప్రస్తుత ప్రధానమంత్రి: కాసిమ్ మజాలివా
క్విక్ రివ్యూ:
ఏమిటి : కిలిమంజారోను అధిరోహించిన ఐపీఎస్ అధికారి
ఎప్పుడు : జనవరి 22
ఎవరు : సీనియర్ ఐపీఎస్ అధికారి తరుణ్ జోషి
ఎక్కడ : కిలిమంజారో, టాంజానియా

ఏ మాజీ సీజేఐకి జెడ్ ప్లస్ భద్రతను కల్పించారు?
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్‌కు కేంద్రప్రభుత్వం జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించింది. దేశంలో ఆయన ఎక్కడ పర్యటనకు వెళ్లినా సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్(సీఆర్‌పీఎఫ్) కమాండోలు భద్రత కల్పిస్తారు. జస్టిస్ గొగోయ్ జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న ప్రముఖుల్లో 63వ వారు. ఆయనకు 8 నుంచి 12 మంది కమాండోల భద్రత ఎల్లప్పుడూ ఉంటుంది. జెడ్ ప్లస్ కేటగిరీ రెండో భద్రతా విభాగం.
2019లో రాజ్యసభకు...
2019 నవంబర్‌లో సీజేఐగా రిటైరైన గొగోయ్‌ను కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్ చేసింది. దీంతో రాజ్యసభకు నామినేట్ అయిన తొలి సుప్రీంకోర్టు మాజీ సీజేఐగా జస్టిస్ గొగోయ్ నిలిచారు. మాజీ సీజేఐ రంగనాథ్ మిశ్రా కూడా రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు కానీ, ఆయన నామినేటెడ్ సభ్యుడు కాదు. కాంగ్రెస్ తరఫున ఎగువ సభకు ఎన్నికయ్యారు.
సుప్రీంకోర్టు 46వ సీజేఐగా....
అసోం రాష్ట్రానికి చెందిన జస్టిస్ గొగోయ్ 2001లో గువాహటి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తర్వాత పంజాబ్-హరియాణా హైకోర్టు జడ్జిగా, ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. 2012, ఏప్రిల్ 23న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. సుప్రీంకోర్టు 46వ సీజేఐగా 2018, అక్టోబర్ 3న ప్రమాణం చేశారు. 2019, నవంబర్ 17న పదవీ విరమణ చేశారు. 2019, నవంబర్ 9న సున్నితమైన అయోధ్య కేసులో తీర్పు ప్రకటించిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి జస్టిస్ గొగోయ్ నేతృత్వం వహించారు.
భారత్ - కీలక భద్రతా వ్యవస్థలు
భారత్‌లో వీఐపీలు, వీవీఐపీల కోసం ఐదు రకాలైన భద్రతా వ్యవస్థలు అమల్లో ఉన్నాయి. అవి:
  • స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ)
  • జెడ్ ప్లస్ కేటగిరీ
  • జెడ్ కేటగిరీ
  • వై కేటగిరీ
  • ఎక్స్ కేటగిరీ


టాక్ షో లెజెండ్ ల్యారీ కింగ్ కన్నుమూత
అర్ధ శతాబ్దానికి పైగా ప్రపంచ నేతలు, సినీ రంగ ప్రముఖులు మొదలుకొని సామాన్యుల దాకా ముఖాముఖిలు నిర్వహించి సరికొత్త అధ్యాయం సృష్టించిన టాక్ షో లెజెండ్... ల్యారీ కింగ్(లారెన్స్ హార్వే జీగర్) కన్నుమూశారు. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం లాజ్ ఏంజెలిస్‌లోని సెడార్స్-సినాయ్ మెడికల్ సెంటర్‌లో జనవరి 23న 87 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. 1933 నవంబర్ 19న అమెరికాలోని న్యూయార్క్‌లోని యూదుల కుటుంబంలో జన్మించిన ల్యారీ... 1985 నుంచి 2010 వరకు సుదీర్ఘకాలం రేడియో హోస్ట్‌గా ఉన్నారు.
సీఎన్‌ఎన్‌లో...
ల్యారీ కింగ్ 2010 నుంచి సీఎన్‌ఎన్‌లో పనిచేశారు. ఆయన నిర్వహించిన 50వేలకు పైగా కార్యక్రమాలు రేడియో, టీవీల్లో ప్రసారమయ్యాయి. 1995లో మధ్యప్రాచ్యం శాంతి చర్చలకు ల్యారీకింగ్ అధ్యక్షత వహించారు. ఎలిజబెత్ టేలర్, మిఖాయిల్ గోర్బచెవ్, బరాక్ ఒబామా, బిల్‌గేట్స్, లేడీ గాగా వరకు ఆయన ఎందరో ప్రముఖులతో ముఖాముఖి నిర్వహించారు. ఓరా మీడియా సహ వ్యవస్థాపకుడుగా ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రముఖ జర్నలిస్ట్ కన్నుమూత
ఎప్పుడు : జనవరి 23
ఎవరు : ల్యారీ కింగ్(87)
ఎక్కడ : లాజ్ ఏంజెలిస్, కాలిఫోర్నియా రాష్ట్రం, అమెరికా

అమెరికా రక్షణ మంత్రిగా నియమితులైన నల్లజాతీయుడు?
అమెరికా రక్షణ మంత్రిగా రిటైర్డ్ జనరల్ అస్టిన్ నియమితులయ్యారు. దీంతో అమెరికా రక్షణ మంత్రి పదవి చేపట్టిన తొలి నల్లజాతీయుడిగా అస్టిన్ నిలిచారు. అమెరికా కాంగ్రెస్‌లోని ఎగువ సభ అయిన సెనేట్... రక్షణ మంత్రిగా అస్టిన్ నామినేషన్‌ను జనవరి 22న రికార్డు స్థాయిలో 93-2 ఓట్ల తేడాతో బలపరిచింది. ఆ వెంటనే ఆయన చేత ప్రస్తుతం అమెరికా బలగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న డెరైక్టర్ టామ్ మూయిర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ వెను వెంటనే అస్టిన్ విధుల్లో చేరారు.
మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బెడైన్ విదేశాలతో సంబంధాలపై దృష్టి సారించారు. విదేశీ నేతల్లో తొలిసారిగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు ఫోన్ చేసి మాట్లాడారు. కరోనాపై కలసికట్టుగా పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక, రక్షణ సంబంధాల బలోపేతానికి చర్యలు తీసుకోవాలన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమెరికా రక్షణ మంత్రిగా నియమితులైన నల్లజాతీయుడు
ఎప్పుడు : జనవరి 22
ఎవరు : రిటైర్డ్ జనరల్ అస్టిన్

ఉత్తరాఖండ్ రాష్ట్రానికి ఒక రోజు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన యువతి?
జాతీయ బాలికా దినోత్సవం(జనవరి 24) సందర్భంగా జనవరి 24న ఉత్తరాఖండ్ రాష్ట్రానికి ఒక రోజు ముఖ్యమంత్రిగా సృష్టి గోస్వామి వ్యవహ రించారు. హరిద్వార్‌కు చెందిన 20 ఏళ్ల గోస్వామి జనవరి 24న ముఖ్యమంత్రి హోదాలో అధికారిక విధులకు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పలు సంక్షేమ పథకాలను సమీక్షించారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా త్రివేంద్ర సింగ్ రావత్ ఉన్నారు.
జాతీయ బాలికా దినోత్సవం
జాతీయ బాలికా దినోత్సవం ప్రతి సంవత్సరం జనవరి 24న నిర్వహించబడుతుంది. సమాజంలో బాలికల సంరక్షణ, హక్కులు, ఆరోగ్యం, విద్య, సామాజిక ఎదుగుదల మొదలైన అంశాలపై ఈ బాలికా దినోత్సవం రోజున అవగాహన కల్పిస్తారు.
2008 ఏడాది నుంచి...
ఆడపిల్ల అనగానే సమాజంలో చిన్నచూపు చూస్తున్నారు. అలాగే అంతేకాకుండా కడుపులో బిడ్డ ఆడపిల్ల అని తెలియగానే భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారు. పుట్టిన తరువాత అనేక ఆంక్షలు విధిస్తున్నారు. వాటిని నిర్మూలించి ఆడపిల్లలపై ప్రత్యేక దృష్టిసారించే దిశగా భారత ప్రభుత్వం నేషనల్ గర్ల్స్ డెవలప్‌మెంట్ మిషన్‌‘ పేరుతో ఒక కార్యక్రమం రూపొందించింది. అందులో భాగంగా 2008లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంతో జాతీయ బాలికా దినోత్సవంను ప్రారంభించడం జరిగింది.
అంతర్జాతీయ బాలికా దినోత్సవం...
అంతర్జాతీయ బాలికా దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబరు 11న నిర్వహించబడుతోంది. బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను, అనర్థాలను నివారించి, వారి హక్కులను తెలియజేసేందుకు ఐక్యరాజ్యసమితి ఈ దినోత్సవాన్ని ప్రకటించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఉత్తరాఖండ్ రాష్ట్రానికి ఒక రోజు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన యువతి
ఎప్పుడు : జనవరి 24
ఎవరు : సృష్టి గోస్వామి
ఎందుకు : జాతీయ బాలికా దినోత్సవం(జనవరి 24) సందర్భంగా

మణిపూర్ హైకోర్టు సీజేగా నియామకం కానున్న న్యాయమూర్తి?
మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ పీవీ సంజయ్ కుమార్‌ను నియమించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలోని కొలీజియం డిసెంబర్ 16న ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జస్టిస్ పీవీ సంజయ్ కుమార్ ప్రస్తుతం పంజాబ్-హరియాణా హైకోర్టులో న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్నారు.
జస్టిస్ సంజయ్ నేపథ్యం:
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అడ్వొకేట్ జనరల్ (1969-1982)గా పనిచేసిన జస్టిస్ పి.రామచంద్రారెడ్డి, పి.పద్మావతమ్మ దంపతులకు జస్టిస్ సంజయ్ కుమార్ 14 ఆగస్టు 1963న జన్మించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి 1988లో న్యాయ పట్టా అందుకున్నారు. 2000 నుంచి 2003 వరకు ఉమ్మడి ఏపీ హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా సేవలందించారు. ఆగస్టు 8, 2008న అదనపు న్యాయమూర్తిగా, జనవరి 20, 2010న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. రాష్ట్ర విభజన అనంతరం జస్టిస్ సంజయ్ కుమార్‌ను తెలంగాణకు కేటాయించారు. 2019 అక్టోబర్ 14న పంజాబ్-హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు.

ఐడీఆర్‌బీటీ డెరైక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన వ్యక్తి?
ఇన్‌స్టిట్యూట్ ఫర్ డెవలప్‌మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ (ఐడీఆర్‌బీటీ) నూతన డెరైక్టర్‌గా జనవరి 25న ప్రొఫెసర్ డి.జానకిరామ్ బాధ్యతలు చేపట్టారు. ఐఐటీ ఢిల్లీ నుంచి పీహెచ్‌డీ సాధించిన ఆయనకు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ టెక్నాలజీలో అపార అనుభవం ఉంది. ఐఐఐటీ కర్నూలు బోర్డు మెంబర్‌గా, ఐఐఐటీ తిరుచ్చి సెనేట్ మెంబర్‌గా కొనసాగుతున్నారు. పలు యూనివర్సిటీలకు సేవలు అందిస్తున్నారు. 150కిపైగా పరిశోధన పత్రాలు రాశారు. బిగ్ డేటా ప్రాసెసింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, బ్లాక్‌చైన్ టెక్నాలజీస్‌లో ఉన్న సవాళ్లకు పరిష్కారాలపై ఆయన పరిశోధనలు సాగిస్తున్నారు. ఐడీఆర్‌బీటీ ప్రధాన కార్యలయం హైదరాబాద్‌లో ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐడీఆర్‌బీటీ నూతన డెరైక్టర్‌గా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : జనవరి 25
ఎవరు : ప్రొఫెసర్ డి.జానకిరామ్
ఎక్కడ : హైదరాబాద్

తెలంగాణ నుంచి ఎయిర్ వైస్‌మార్షల్ హోదా పొందిన తొలి వ్యక్తి?
తెలంగాణకు చెందిన ఎయిర్ వైస్‌మార్షల్ విష్ణుభొట్ల నాగరాజ్ శ్రీనివాస్‌కు రాష్ట్రపతి అవార్డు లభించింది. రక్షణ రంగంలో ఆయనందించిన సేవలకుగానూ 72వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా శ్రీనివాస్‌ను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి విశిష్టసేవా పతకానికి ఎంపికచేసింది. తెలంగాణ నుంచి ఎయిర్ వైస్‌మార్షల్ హోదా పొందిన తొలి వ్యక్తి శ్రీనివాసే. వరంగల్‌లో ఆగస్టు 8, 1963న జన్మించిన శ్రీనివాస్.. 1985, జూన్ 14న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అకౌంట్స్ విభాగంలో చేరారు.
రెండు పుస్తకాలు...
2008లో ‘బడ్జెటింగ్ ఫర్ ఇండియన్ డిఫెన్స్: ఇష్యూస్ ఆఫ్ కాంటెంపరరీ రిలవెన్స్’, 2010లో ‘డిఫెన్స్ ఆఫ్‌సెట్స్: ఇంటర్నేషనల్ ఎక్స్‌పీరియన్స్ అండ్ ఇంప్లికేషన్స్ ఫర్ ఇండియా’అనే రెండు పుస్తకాలు శ్రీనివాస్ రాశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రాష్ట్రపతి విశిష్టసేవా పురస్కారం విజేత
ఎప్పుడు : జనవరి 26
ఎవరు : ఎయిర్ వైస్‌మార్షల్ విష్ణుభొట్ల నాగరాజ్ శ్రీనివాస్
ఎందుకు : రక్షణ రంగంలో ఆయనందించిన సేవలకుగానూ

హెచ్‌ఎస్‌సీఎల్ ఎండీగా నియమితులైన వ్యక్తి?
హిందుస్తాన్ స్టీల్ వర్క్స్ కన్‌స్ట్రక్షన్ లిమిటెడ్(హెచ్‌ఎస్‌సీఎల్) మేనేజింగ్ డెరైక్టర్‌గా ఎస్‌ఎన్‌ఎల్ చీఫ్ ఇంజినీర్(సివిల్) తాడి లక్ష్మీనారాయణ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన నియామకంపై కేబినెట్ నియామకాల కమిటీ (ఏసీసీ) జనవరి 27న ఆమోదం తెలిపింది. ఐదేళ్ల వరకు ఆయన ఈ పదవిలో ఉంటారు.
డబ్ల్యుహెచ్‌ఓ సమావేశం...
జనవరి 27న ఆన్‌లైన్‌లో జరిగిన డబ్ల్యుహెచ్‌ఓ ఎగ్జిక్యూటివ్ బోర్డు 148 వసెషన్ సమావేశానికి భారత ఆరోగ్య శాఖా మంత్రి హర్షవర్ధన్ అధ్యక్షత వహించారు. కోవిడ్‌ని ఎదుర్కోవడంలో ప్రపంచ దేశాలు చూపిన చొరవ, ముందస్తు సన్నాహాలు, సమైక్య వ్యూహాలు సత్ఫలితాలనిచ్చాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. 2020 యేడాది శాస్త్రవిజ్ఞాన రంగానిదేనని అన్నారు. డబ్ల్యుహెచ్‌వోలో కొనసాగాలన్న అమెరికా నిర్ణయాన్ని భారత్ స్వాగతిస్తున్నదని తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హిందుస్తాన్ స్టీల్ వర్క్స్ కన్‌స్ట్రక్షన్ లిమిటెడ్(హెచ్‌ఎస్‌సీఎల్) మేనేజింగ్ డెరైక్టర్‌గా నియామకం
ఎప్పుడు : జనవరి
ఎవరు : తాడి లక్ష్మీనారాయణ రెడ్డి

దేశంలోనే బెస్ట్ సీఎం ఎవరు తెలుసా?
Current Affairs
దేశంలోని అత్యుత్తమ ముఖ్య మంత్రుల్లో ఒకరుగా ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నిలిచారు. ప్రముఖ జాతీయ వార్తా చానెల్ ‘ఏబీపీ న్యూస్’ చేసిన ‘దేశ్ కా మూడ్’ సర్వేలో బెస్ట్ సీఎంలలో మూడో స్థానాన్ని వైఎస్ జగన్ సాధించారు. తొలి రెండు స్థానాల్లో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. అత్యుత్తమ పాలన సామర్థ్యంతో, అన్ని వర్గాల ప్రజలకు ఆసరాగా నిలిచే సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్న ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఈ ఘనత సాధించారు.
బెస్ట్ సీఎంలు వీరే..
1) నవీన్ పట్నాయక్ - ఒడిశా
2) అరవింద్ కేజ్రీవాల్ - ఢిల్లీ
3) వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి - ఆంధ్రప్రదేశ్
4) పినరయి విజయన్ - కేరళ
5) ఉద్ధవ్ ఠాక్రే - మహారాష్ట్ర
6) భూపేశ్ బఘేల్ - ఛత్తీస్‌గఢ్
7) మమతా బెనర్జీ - పశ్చిమబెంగాల్
8) శివరాజ్ సింగ్ చౌహాన్ - మధ్య ప్రదేశ్
9) ప్రమోద్ సావంత్ - గోవా
10) విజయ్ రూపానీ - గుజరాత్

యాప్ రుణాలపై ఏర్పాటైన ఆర్‌బీఐ ప్యానెల్ అధ్యక్షుడు ఎవరు?
సక్రమ మార్గంలో డిజిటల్ లెండింగ్ (డిజిటల్ మార్గాల్లో రుణాల వ్యాపారం) ప్రోత్సాహానికి అవసరమైన నియంత్రణ చర్యలను సూచించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) జనవరి 13న ఓ అధ్యయన బృందాన్ని ఏర్పాటు చేసింది. ఆన్‌లైన్, యాప్‌ల ద్వారా అధిక వడ్డీ రేట్లకు రుణాలను మంజూరు చేస్తూ, తర్వాత వసూళ్ల కోసం వేధింపులకు పాల్పడుతున్న ఘటనల నేపథ్యంలో ఆర్‌బీఐ తాజా నిర్ణయం తీసుకుంది.
ఆర్‌బీఐ అధ్యయన బృందానికి... ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ జయంత్ కుమార్‌దాస్ అధ్యక్షత వహించనున్నారు. బృందం మూడు నెలల్లోగా తన నివేదికను ఆర్‌బీఐకి సమర్పించనుంది. బృందంలో సభ్యులుగా ఆర్‌బీఐ అధికారులు అజయ్‌కుమార్ చౌదరి, పీ వాసుదేవన్, మనోరంజన్ మిశ్రాతోపాటు, మోనెక్సో ఫిన్‌టెక్ సహ వ్యవస్థాపకుడు విక్రమ్ మెహతా, సైబర్ సెక్యూరిటీ నిపుణుడు రాహుల్ శశి ఉంటారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : యాప్ రుణాలపై ఏర్పాటైన ఆర్‌బీఐ ప్యానెల్ అధ్యక్షుడిగా నియామకం
ఎప్పుడు : జనవరి 13
ఎవరు : ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ జయంత్ కుమార్‌దాస్
ఎందుకు : సక్రమ మార్గంలో డిజిటల్ లెండింగ్ (డిజిటల్ మార్గాల్లో రుణాల వ్యాపారం) ప్రోత్సాహానికి అవసరమైన నియంత్రణ చర్యలను సూచించేందుకు

పద్మ విభూషణ్ అవార్డీ, సంగీతకారుడు కన్నుమూత
ప్రఖ్యాత భారతీయ సంప్రదాయ సంగీతకారుడు ఉస్తాద్ గులాం ముస్తఫా ఖాన్(89) జనవరి 17న ముంబైలోని తన స్వగృహంలో కన్నుమూశారు. ఉత్తరప్రదేశ్‌లోని బదాయులో ఉస్తాద్ వారిస్ హుస్సేన్ ఖాన్, సబ్రీ బేగం దంపతులకు 1931, మార్చి 3న ముస్తఫా ఖాన్ జన్మించారు. ప్రఖ్యాత సంగీతకారుడు మురాద్ బక్షీకి మనవడు అయిన ఆయన 1991లో పద్మశ్రీ, 2006లో పద్మభూషణ్, 2018లో పద్మ విభూషణ్ పురస్కారాలు అందుకున్నారు. 2003లో కళా రంగంలో అత్యుత్తమ పురస్కారమైన సంగీత నాటక అకాడెమీ అవార్డుతో ఆయనను సత్కరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పద్మ విభూషణ్ అవార్డీ, సంగీతకారుడు కన్నుమూత
ఎప్పుడు : జనవరి 17
ఎవరు : ఉస్తాద్ గులాం ముస్తఫా ఖాన్(89)
ఎక్కడ : ముంబై, మహారాష్ట్ర
ఎందుకు : వయో భారం వల్ల వచ్చిన అనారోగ్య సమస్యలతో

సాయుధ పోరాట యోధుడు బూర్గుల కన్నుమూత
స్వాతంత్య్ర సమర యోధుడు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నాయకుడు బూర్గుల నర్సింగరావు (89) కన్నుమూశారు. గుండె సంబంధిత సమస్యలు, కరోనా కారణంగా హైదరాబాద్‌లోని కేర్ ఆసుపత్రిలో జనవరి 18న తుదిశ్వాస విడిచారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన నర్సింగరావు... హైదరాబాద్ స్టేట్ తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు సోదరుడు బి.వెంకటేశ్వరరావు కుమారుడు.
నర్సింగరావు గురించి...

  • 1932 మార్చి14న ఉమ్మడి మహబూబ్‌నగర్‌జిల్లా షాద్‌నగర్ సమీపంలోని బూర్గుల గ్రామంలో జన్మించారు.
  • 1955లో అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్) మొదటి జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికై 1959 వరకు బాధ్యతలు నిర్వహించారు.
  • విద్యార్థి దశలో ఆల్ హైదరాబాద్ స్టూడెంట్ యూనియన్ మొదటి అధ్యక్షుడిగా పనిచేశారు.
  • 1952లో జరిగిన ముల్కీ ఉద్యమం, తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారు.
  • తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టు అధ్యక్షుడిగా పని చేశారు.
  • సీపీఐ హైదరాబాద్ జిల్లాకమిటీ సభ్యుడిగా పనిచేశారు.

క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నాయకుడు కన్నుమూత
ఎప్పుడు : జనవరి 18
ఎవరు : బూర్గుల నర్సింగరావు (89)
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : గుండె సంబంధిత సమస్యలు, కరోనా కారణంగా

కవి, రచయిత, చరిత్రకారుడు లూథర్ ఇక లేరు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ప్రధాన కార్యదర్శి (సీఎస్) నరేంద్ర లూథర్ (89) కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జనవరి 18న తుది శ్వాస విడిచారు. 1932 మార్చి 23న పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో జన్మించిన నరేంద్ర.... కవి, రచయిత, చరిత్రకారుడు, కాలమిస్టు, సొసైటీ ఫర్ సేవ్ రాక్ అధ్యక్షుడిగా హైదరాబాద్ నగరంపై చెరగని ముద్ర వేశారు.
నరేంద్ర లూథర్ గురించి...

  • హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేకాధికారిగా, పరిశ్రమల శాఖ డెరైక్టర్‌గా సేవలందించారు.
  • 1991లో ఉమ్మడి ఏపీ చీఫ్ సెక్రటరీగా పదవీ విరమణ చేశారు.
  • హైదరాబాద్ చరిత్ర, సంస్కృతి, భౌగోళిక స్వరూపం వంటి అంశాలపై 15కు పైగా పుస్తకాలు రాశారు.
  • హైదరాబాద్ శిలల విశిష్టతపై రాక్యుమెంటరీ పేరుతో డాక్యుమెంటరీ తీశారు.
  • హైదరాబాద్‌లో శిలలను ధ్వంసం చేయడానికి వ్యతిరేకంగా సొసైటీ ఫర్ సేవ్ రాక్స్ అధ్యక్షుడిగా పనిచేశారు.
  • ‘విట్ అండ్ విస్‌డమ్ సొసైటీ, యుద్దవీర్ ఫౌండేషన్ తదితర సంస్థల్లో కీలక పాత్ర పోషించారు.

లూథర్ రచనల్లో కొన్ని...
హైదరాబాద్-ఏ బయోగ్రఫీ, లష్కర్-ది స్టోరీ ఆఫ్ సికింద్రాబాద్, పోయెట్, లవర్, బిల్డర్, మహ్మద్ అలీ కుతుబ్‌షా-ది ఫౌండర్ ఆఫ్ హైదరాబాద్, ది ఫ్యామిలీ సాగా.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కవి, రచయిత, చరిత్రకారుడు, ఐఏఎస్ అధికారి కన్నుమూత
ఎప్పుడు : జనవరి 18
ఎవరు : నరేంద్ర లూథర్ (89)
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : అనారోగ్యం కారణంగా...

రామన్ మెగసెసె అవార్డీ డాక్టర్ శాంత కన్నుమూత
ప్రముఖ ఆంకాలజిస్ట్, శాస్త్రజ్ఞురాలు, చెన్నై అడయార్ క్యాన్సర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్-హాస్పిటల్ చైర్మన్, పద్మవిభూషణ్ డాక్టర్ వి.శాంత (93) కన్నుమూశారు. ఆస్తమాతో బాధపడుతున్న ఆమె చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో జనవరి 19న తుదిశ్వాస విడిచారు. నోబెల్ గ్రహీతలు సర్ సీవీ రామన్, సుబ్రమణ్యన్ చంద్రశేఖర్ కుటుంబానికి చెందిన శాంత.. 1927 మార్చి 11న చెన్నైలోని మైలాపూర్‌లో జన్మించారు.
నోబెల్ బహుమతికి కూడా....
డాక్టర్ శాంత.. 1949లో మద్రాస్ మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్ పట్టా అందుకున్నారు. 1955లో అదే కాలేజీలో ఎండీ చదువు ముగించి వెంటనే వైద్యవృత్తిలోకి ప్రవేశించారు. 1955 నుంచి మరణించే వరకు క్యాన్సర్ రోగులకు తన సేవలు అందించారు. క్యాన్సర్‌పై పోరులో ఆమె చేసిన పరిశోధనలు, వైద్యరంగానికి ఆమె చేసిన కృషికి గానూ భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులతో సత్కరించింది. రామన్ మెగెసెసె అవార్డును సైతం అందుకున్న శాంత... 2005లో నోబెల్ బహుమతికి కూడా నామినేట్ అయ్యారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రముఖ ఆంకాలజిస్ట్, పద్మవిభూషణ్ అవార్డీ కన్నుమూత
ఎప్పుడు : జనవరి 19
ఎవరు : డాక్టర్ వి.శాంత (93)
ఎక్కడ : చెన్నై, తమిళనాడు
ఎందుకు : ఆస్తమా కారణంగా

అమెరికా ఎన్నవ అధ్యక్షుడిగా జో బెడైన్ ప్రమాణ స్వీకారం చేశారు?
యూనెటైడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 46వ అధ్యక్షుడిగా జోసెఫ్ రాబినెట్ బెడైన్ జూనియర్(జో బెడైన్) జనవరి 20న ప్రమాణ స్వీకారం చేశారు. అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో ఉన్న క్యాపిటల్ భవనంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. బెడైన్‌తో అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్‌‌ట్స ప్రమాణం చేయించారు. దీంతో అమెరికా చరిత్రలోనే అతిపెద్ద వయస్కుడైన అధ్యక్షుడిగా 78 ఏళ్ల బెడైన్ రికార్డు నెలకొల్పారు. కోవిడ్-19 ముప్పు నేపథ్యంలో కొంత మంది సమక్షంలోనే ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. బెడైన్ ప్రమాణ స్వీకారానికి డొనాల్డ్ ట్రంప్ హాజరు కాలేదు.
ఉపాధ్యక్షురాలిగా కమల...
అధ్యక్షుడుగా బెడైన్ ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు... అమెరికా 49వ ఉపాధ్యక్షురాలిగా ఇండో-ఆఫ్రో అమెరికన్ మహిళ కమల హ్యారిస్ ప్రమాణ స్వీకారం చేశారు. కమలతో అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తి సోనియా సోటోమేయర్ ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో అమెరికా ఉపాధ్యక్ష పదవి చేపట్టిన తొలి మహిళగా, తొలి నల్లజాతి మహిళగా, తొలి ఇండో-అమెరికన్‌గా, తొలి ఆఫ్రికన్-అమెరికన్‌గా, తొలి ఆసియా-అమెరికన్ మహిళగా 56 ఏళ్ల కమల రికార్డు నెలకొల్పారు.
బెడైన్ ప్రస్థానం...

  • జో బెడైన్ 1942లో పెన్సిల్వేనియాలో ఓ క్యాథలిక్ కుటుంబంలో జన్మించారు.
  • యూనివర్సిటీ ఆఫ్ డెలావర్‌లో చదివారు.
  • 1968లో సైరకాస్ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు.
  • మొదటిసారిగా 1972లో డెలావర్ రాష్ట్ర సెనేటర్‌గా ఎన్నికయ్యారు. అప్పుడాయన వయసు 29 సంవత్సరాలు.
  • దేశంలో పిన్నవయస్కుడైన సెనేటర్‌గా గుర్తింపు పొందారు.
  • సెనేట్‌లో అత్యంత తక్కువ ఆస్తులు కలిగిన సెనేటర్‌గా కూడా అప్పట్లో పేరుగాంచారు. మొత్తం ఆరుసార్లు సెనేటర్‌గా ఎన్నికయ్యారు.
  • 1972లో జరిగిన కారు ప్రమాదంలో బెడైన్ మొదటి భార్య చనిపోయారు. 1977లో జిల్ జాకబ్స్‌ను రెండో పెళ్లి చేసుకున్నారు.
  • బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బెడైన్ రెండు పర్యాయాలు ఉపాధ్యక్షుడిగా సేవలందించారు.

క్విక్ రివ్యూ:
ఏమిటి : యూనెటైడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం
ఎప్పుడు : జనవరి 20
ఎవరు : జోసెఫ్ రాబినెట్ బెడైన్ జూనియర్(జో బెడైన్)
ఎక్కడ : క్యాపిటల్ భవనం, వాషింగ్టన్, అమెరికా


తొలి మహిళా సీజేగా జస్టిస్ హిమా కోహ్లి ప్రమాణం
Current Affairs
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్ హిమా కోహ్లి జనవరి 7న ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ హిమ చేత రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయించారు. ఇప్పటివరకు తెలంగాణ హైకోర్టు సీజేగా విధులు నిర్వహించిన జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ ఉత్తరాఖండ్ హైకోర్టు సీజేగా బదిలీపై వెళ్లారు.
జస్టిస్ హిమా కోహ్లి...
ఇప్పటివరకు ఢిల్లీ హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లి విధులు నిర్వహిస్తున్నారు. 1959 సెప్టెంబర్ 2న ఢిల్లీలో జన్మించిన హిమా న్యాయవిద్యను ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి పూర్తి చేశారు. 1984లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయిన ఆమె 1999-2004 మధ్య ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు న్యాయసలహాదారుగా, హైకోర్టులో స్టాండింగ్ కౌన్సిల్‌గా సేవలు అందించారు. అనేక వ్యాజ్యాల్లో ఢిల్లీ ప్రభుత్వం తరఫున, పలుప్రభుత్వ రంగ సంస్థల తరఫున వాదించారు.
2006లో తాత్కాలిక న్యాయమూర్తిగా...
  • 2006, మే 29న ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తిగా నియమితులైన హిమా... 2007 ఆగస్టు 28న శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు.
  • ఢిల్లీ రాష్ట్ర న్యాయసాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్‌గా, నేషనల్ లా యూనివర్సిటీ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యురాలిగా పనిచేశారు.
  • ఢిల్లీ ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ చైర్‌పర్సన్‌గా, పశ్చిమ బెంగాల్‌లోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జ్యుడీషియల్ సెన్సెస్ జనరల్ కౌన్సిల్ సభ్యురాలిగా వ్యవహరించారు.
  • జాతీయ న్యాయసేవా సాధికార సంస్థ ఆధ్వర్యంలో వస్తున్న న్యాయదీప్ పత్రిక సంపాదక వర్గ సభ్యురాలిగా సేవలు అందిస్తున్నారు.

క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా ప్రమాణం
ఎప్పుడు : జనవరి 7
ఎవరు : జస్టిస్ హిమా కోహ్లి
ఎక్కడ : రాజ్‌భవన్, హైదరాబాద్

జో బెడైన్, కమల ఎన్నికకు కాంగ్రెస్ ఆమోదం
అమెరికా తదుపరి అధ్యక్షుడిగా జో బెడైన్, ఉపాధ్యక్షురాలిగా భారత సంతతి నేత కమల హారిస్ ఎన్నికకు జనవరి 7న అధికారికంగా అమెరికా కాంగ్రెస్ ఆమోద ముద్ర లభించింది. అమెరికా పార్లమెంటు ఉభయ సభలు ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లను ఆమోదించడం ద్వారా ఆ ఇరువురు డెమొక్రటిక్ నేతల ఎన్నికను నిర్ధారించాయి. మొత్తం 538 ఎలక్టోరల్ సీట్లలో బెడైన్, కమల 306 ఎలక్టోరల్ సీట్లను, ట్రంప్, రిపబ్లికన్ ఉపాధ్యక్ష అభ్యర్థి మైక్ పెన్స్ 232 ఎలక్టోరల్ సీట్లను సాధించినట్లు నిర్ధారించాయి. దీంతో 78 ఏళ్ల బెడైన్ 2021, జనవరి 20వ తేదీన అమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎవరు?
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మొదటి స్థానంలో నిలిచారు. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్‌ను రెండో స్థానానికి నెట్టారు. జనవరి 7న విడుదలైన బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ సూచీ ‘‘ప్రపంచంలోనే 500 మంది అత్యంత సంపన్నుల జాబితా’’లో ఈ విషయం వెల్లడైంది. బ్లూమ్‌బర్గ్ నివేదిక బట్టి జనవరి 7న టెస్లా షేర్ల ధర ప్రకారం ఎలాన్ మస్క్ సంపద విలువ 188.5 బిలియన్ డాలర్ల పైగా ఉంది. బెజోస్ సంపదతో పోలిస్తే ఇది 1.5 బిలియన్ డాలర్లు అధికం. జనవరి 7న టెస్లా షేరు మరో 7 శాతం ఎగిసి 811.61 డాలర్ల రికార్డు స్థాయిని తాకడంతో ఇది సాధ్యపడింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అత్యంత ధనవంతుడిగా గుర్తింపు
ఎప్పుడు : జనవరి 7
ఎవరు : టెస్లా అధినేత ఎలాన్ మస్క్
ఎక్కడ : ప్రపంచంలో

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ సీఈఓగా నియమితులైన వారు?
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా.. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ జే వెంకట్రాము జనవరి 7న బాధ్యతలు స్వీకరించారు. చెల్లింపులు, ఉత్పత్తులు, అనుబంధ సాంకేతిక వ్యవస్థల మీద ఈయనకు రెండు దశాబ్దాల అనుభవం ఉంది. 2002-2015 మధ్య యాక్సిస్ బ్యాంక్ డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్‌గా, ఆరేళ్ల పాటు భారత వైమానిక దళంలోనూ వెంకట్రాము పనిచేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) ఎండీ, సీఈఓగా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : జనవరి 7
ఎవరు : జే వెంకట్రాము

సింగరేణి సీఎండీ శ్రీధర్ పదవీకాలం పొడిగింపు
సింగరేణి బొగ్గు గనుల సంస్థ సీఎండీగా ఎన్.శ్రీధర్ మరో ఏడాది కొనసాగనున్నారు. ఆయన పదవీకాలం 2020, డిసెంబర్ 31వ తేదీతో ముగిసిపోగా, మరో ఏడాది పాటు పొడిగించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ జనవరి 5న ఉత్తర్వులు జారీ చేశారు. 1997 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన ఎన్.శ్రీధర్ 2015 జనవరి 1 నుంచి ఈ పదవిలో కొనసాగుతున్నారు. సింగరేణి సీఎండీగా ఆయన పదవీ కాలాన్ని పొడిగించడం ఇది మూడోసారి.

బ్రిల్ పబ్లిషింగ్ హౌస్ బోర్డు సభ్యునిగా ఎంపికైన తొలి భారతీయ ప్రొఫెసర్?
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్‌సీయూ) ఇంగ్లిష్ ప్రొఫెసర్ ప్రమోద్ కే నాయర్.. 300 ఏళ్ల చరిత్ర కలిగిన బ్రిల్ ప్రచురణ కేంద్రం (పబ్లిషింగ్ హౌస్) ఎడిటోరియల్ బోర్డులో సభ్యత్వానికి ఎంపికయ్యారు. తద్వారా ఈ ఘనత పొందిన తొలి భారతీయ ప్రొఫెసర్‌గా నిలిచారు. బ్రిల్ నుంచి రానున్న క్రిటికల్ పోస్త్‌హ్యూమనిజం’అనే ఈ-పుస్తక ధారావాహికకు ఆయన ఎంపికయ్యారు. ప్రొఫెసర్ ప్రమోద్ రచించిన పుస్తకాలు, జర్నల్స్ ఆధారంగా ఆయనకు ఈ అవకాశం దక్కింది. హెచ్‌సీయూలోనే ప్రొఫెసర్ ప్రమోద్ విద్యనభ్యసించారు.
1683లో ప్రారంభం...
నెదర్లాండ్‌‌సలోని లీడెన్ నగరంలో 1683లో బ్రిల్ పబ్లిషింగ్ హౌస్ ప్రారంభమైంది. హ్యుమానిటీస్, సోషల్ సెన్సైస్, ఇంటర్నేషనల్ లా, సైన్స్ లోని కొన్ని విభాగాల్లో అంతర్జాతీయ స్థాయి ప్రచురణలను ఈ సంస్థ వెలువరిస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బ్రిల్ పబ్లిషింగ్ హౌస్ ఎడిటోరియల్ బోర్డు సభ్యునిగా ఎంపికైన తొలి భారతీయ ప్రొఫెసర్
ఎప్పుడు : జనవరి 8
ఎవరు : హెచ్‌సీయూ ఇంగ్లిష్ ప్రొఫెసర్ ప్రమోద్ కే నాయర్
ఎందుకు : ప్రొఫెసర్ ప్రమోద్ రచించిన పుస్తకాలు, జర్నల్స్ ఆధారంగా

ముంబై దాడుల సూత్రధారి లఖ్వీకి ఐదేళ్ల జైలు శిక్ష
ముంబై దాడుల సూత్రధారి, లష్కరే తోయిబా ఆపరేషన్స్ కమాండర్ జకీ ఉర్ రెహమాన్ లఖ్వీకి పాకిస్తాన్‌లోని ఉగ్రవాద వ్యతిరేక కోర్టు(ఏటీసీ) జనవరి 8న ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సాయం అందిస్తున్న కేసుకు సంబంధించి లాహోర్‌లోని ఏటీసీ న్యాయమూర్తి ఎజాజ్ అహ్మద్ ఈ తీర్పునిచ్చారు. మూడు నేరాలకు సంబంధించి, ఐదేళ్ల చొప్పున, మూడు శిక్షలు ఒకేసారి అమలయ్యేలా ఈ తీర్పును ప్రకటించారు. అలాగే, మూడు నేరాలకు సంబంధించి వేర్వేరుగా పాకిస్తాన్ కరెన్సీలో 10 వేల జరిమానా విధించారు. 2008, నవంబర్ 26న ముంబై ఉగ్ర దాడులు జరిగాయి.

ఏ దేశ అధ్యక్షుడిపై ట్విట్టర్ శాశ్వత నిషేధం విధించింది?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై సామాజిక మాధ్యమం ట్విట్టర్ శాశ్వత నిషేధం విధించింది. ట్రంప్ ట్విట్టర్ ఖాతాను శాశ్వతంగా నిషేధిస్తున్నట్టుగా జనవరి 9న ప్రకటించింది. ఒక దేశాధినేత అకౌంట్‌ని శాశ్వతంగా తొలగించడం ఇదే తొలిసారి. కొద్ది రోజులుగా ట్విట్టర్ వేదికగా ట్రంప్ పెట్టే పోస్టులు హింసను ప్రేరేపించేలా ఉన్నాయని అందుకే తాజా నిర్ణయం తీసుకున్నట్టు ట్విట్టర్ తెలిపింది.
ఇప్పటికే...
ఇప్పటికే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడి హోదాలో ఉన్నంతవరకు ఆయన అకౌంట్‌ని బ్లాక్ చేస్తున్నట్టు ప్రకటించాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై శాశ్వత నిషేధం
ఎప్పుడు : జనవరి 9
ఎవరు : సామాజిక మాధ్యమం ట్విట్టర్
ఎందుకు : ట్రంప్ పెట్టే పోస్టులు హింసను ప్రేరేపించేలా ఉన్నాయని

కేంద్ర మాజీ మంత్రి మాధవ్‌సింహ్ సోలంకీ కన్నుమూత
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర విదేశాంగ శాఖ మాజీ మంత్రి మాధవ్‌సింహ్ సోలంకీ(93) జనవరి 9న గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లో తుదిశ్వాస విడిచారు. 1927, జూలై 30న జన్మించిన సోలంకీ 1991 నుంచి 1992 దాకా విదేశాంగ మంత్రిగా పనిచేశారు. నాలుగు సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా సేవలందించారు. గుజరాత్ నుంచి రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయన తనయుడు భరత్‌సింహ్ సోలంకీ సైతం గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర విదేశాంగ శాఖ మాజీ మంత్రి కన్నుమూత
ఎప్పుడు : జనవరి 9
ఎవరు : మాధవ్‌సింహ్ సోలంకీ(93)
ఎక్కడ : గాంధీనగర్, గుజరాత్

రచయిత, పద్మశ్రీ అవార్డు గ్రహీత తుర్లపాటి కన్నుమూత
సీనియర్ పాత్రికేయులు, రచయిత, పద్మశ్రీ అవార్డు గ్రహీత తుర్లపాటి కుటుంబరావు(87) కన్నుమూశారు. గుండెపోటు కారణంగా జనవరి 10న విజయవాడలో తుదిశ్వాస వదిలారు. 1933 ఆగస్టు 10న కృష్ణాజిల్లాలో జన్మించిన తుర్లపాటి 14 ఏళ్ల వయస్సులో జర్నలిజంలోకి అడుగుపెట్టారు. ఏడు దశాబ్దాలపాటు పాత్రికేయునిగా, రచయితగా వివిధ హోదాల్లో పనిచేశారు. ఆంధ్రప్రదేశ్‌లో పద్మశ్రీ అవార్డు పొందిన తొలి జర్నలిసు్ట ఈయనే.
రచయితగా...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా తుర్లపాటి పనిచేశారు.

  • జర్నలిస్టుగా ఆయన ప్రస్థానం వివిధ హోదాల్లో 33 ఏళ్లపాటు ఆంధ్రజ్యోతి పత్రికలోనే కొనసాగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ చైర్మన్‌గా కూడా పనిచేశారు.
  • తుర్లపాటి రచనలు జాతక కథలు (1958), జాతి నిర్మాతలు (1968), మహానాయకులు (1971), 1857 విప్లవ వీరులు, 18 మంది ముఖ్యమంత్రులతో నా ముచ్చట్లు, నా కలం-నా గళం వంటివి ప్రజాదరణ పొందాయి.
  • వేలాది సభలకు అధ్యక్షత వహించి 1993లో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్‌‌ట్సలో స్థానం పొందారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రచయిత, పద్మశ్రీ అవార్డు గ్రహీత కన్నుమూత
ఎప్పుడు : జనవరి 10
ఎవరు : తుర్లపాటి కుటుంబరావు(87)
ఎక్కడ : విజయవాడ, కృష్ణా జిల్లా
ఎందుకు : గుండెపోటు కారణంగా

కేంద్ర జలసంఘం నూతన చైర్మన్‌గా నియమితులైన అధికారి?
Current Affairs
పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) ముఖ్య కార్యనిర్వహణ అధికారి(సీఈవో)గా పనిచేసిన ఎస్కే హల్దర్‌ను సీడబ్ల్యూసీ(కేంద్ర జలసంఘం) చైర్మన్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత సీడబ్ల్యూసీ చైర్మన్ ఆర్కే జైన్ డిసెంబర్ 31న పదవీ విరమణ చేయడంతో కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది. సీడబ్ల్యూసీ సభ్యుడు(డబ్ల్యూపీఅండ్‌పీ)గా వ్యవహరిస్తున్న ఎస్కే హల్దర్ అత్యంత సీనియర్ కావడంతో ఆయన్ని తదుపరి సీడబ్ల్యూసీ చైర్మన్‌గా కేంద్రం నియమించింది.
హల్దర్ కృష్ణా బోర్డు చైర్మన్‌గా, పీపీఏ సీఈవోగా 2016 నుంచి 2018 వరకు పనిచేశారు. కృష్ణా, గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల (బేసిన్)తో పాటు పోలవరం ప్రాజెక్టుపై ఆయనకు సమగ్ర అవగాహన ఉంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సీడబ్ల్యూసీ(కేంద్ర జలసంఘం) చైర్మన్‌గా నియామకం
ఎప్పుడు : డిసెంబర్ 31
ఎవరు : ఎస్కే హల్దర్
ఎందుకు : ప్రస్తుత సీడబ్ల్యూసీ చైర్మన్ ఆర్కే జైన్ పదవీ విరమణ చేయడంతో

సినీ నటుడు నర్సింగ్ యాదవ్ కన్నుమూత
ప్రముఖ సినీ నటుడు నర్సింగ్ యాదవ్ (57) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్ 31న తుదిశ్వాస విడిచారు. 1963, మే 15న హైదరాబాద్‌లో జన్మించిన నర్సింగ్ యాదవ్ ఇంటర్ వరకు చదువుకున్నారు. హేమా హేమీలు అనే తెలుగు సినిమాతో చిత్ర పరిశ్రమకు పరిచయమైన నర్సింగ్ యాదవ్‌కి ‘క్షణ క్షణం’చిత్రంతో మంచి పేరొచ్చింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా, విలన్‌గా తనదైన శైలిలో ఆయన ప్రేక్షకులను అలరించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సుమారు 300 పైగా చిత్రాల్లో ఆయన నటించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రముఖ సినీ నటుడు కన్నుమూత
ఎప్పుడు : డిసెంబర్ 31
ఎవరు : నర్సింగ్ యాదవ్ (57)
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : కిడ్నీ సంబంధిత వ్యాధి కారణంగా

ఆంధ్రప్రదేశ్ నూతన సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన వ్యక్తి?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్)గా 1987 ఐఏఎస్ బ్యాచ్ అధికారి ఆదిత్యనాథ్ దాస్ నియమితులయ్యారు. డిసెంబర్ 31న రాష్ట్ర సచివాలయంలో నీలం సాహ్ని నుంచి సీఎస్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అంతర్ రాష్ట్ర బదిలీలకు సంబంధించిన దస్త్రంపై ఆదిత్యనాథ్‌దాస్ తొలి సంతకం చేశారు.
సాగునీటి శాఖ కార్యదర్శిగా...
ఆదిత్యనాథ్ దాస్ సుదీర్ఘకాలం సాగునీటి శాఖ కార్యదర్శిగా, ముఖ్య కార్యదర్శిగా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1999 - 2001 వరకు వరంగల్ జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. 2006 నుంచి 2007 వరకు మున్సిపల్, పట్టణాభివృద్ధి డెరైక్టర్‌గా విధులు నిర్వర్తించనున్నారు. రాష్ట్ర విభజన అనంతరం 2016 వరకు సాగునీటి శాఖ బాధ్యతలు నిర్వహించారు. అనంతరం విద్యాశాఖ బాధ్యతలు చేపట్టారు. కేంద్ర సర్వీసులో కూడా పలు బాధ్యతలు నిర్వర్తించిన ఆయన ఇప్పటి వరకు జలవనరుల శాఖ ప్రత్యేక సీఎస్‌గా ఉన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్)గా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : డిసెంబర్ 31
ఎవరు : ఆదిత్యనాథ్ దాస్
ఎందుకు : సీఎస్‌గా నీలం సాహ్ని పదవీ విరమణ చేసిన నేపథ్యంలో

ఏపీ మారిటైమ్ బోర్డు డిప్యూటీ సీఈవోగా నియమితులైన అధికారి?
ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు డిప్యూటీ సీఈవోగా లెఫ్టినెంట్ కమాండర్ రవీంద్రనాథ్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ డిసెంబర్ 31న ఉత్తుర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని ఓడరేవుల్లో వాణిజ్య అవకాశాలను పెంచడం, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావటం, ఒప్పందాలు అమలయ్యేలా చూడటం వంటి బాధ్యతలను రవీంద్రనాథ్ రెడ్డి తీసుకున్నారు.
ఆప్కో చైర్మన్‌గా చిల్లపల్లి...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేనేత విభాగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు చిల్లపల్లి మోహన్‌రావును ఆప్కో చైర్మన్‌గా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసెంబర్ 31న ఉత్తర్వులు జారీ చేసింది. చేనేత వర్గాల తరఫున సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో ఆయన ముందున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు డిప్యూటీ సీఈవోగా నియామకం
ఎప్పుడు : డిసెంబర్ 31
ఎవరు : లెఫ్టినెంట్ కమాండర్ రవీంద్రనాథ్‌రెడ్డి

తెలంగాణ హైకోర్టు సీజేగా నియమితులైన తొలి మహిళా?
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్ హిమా కోహ్లి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 31న ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు సీజేగా విధులు నిర్వహిస్తున్న జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ ఉత్తరాఖండ్ హైకోర్టు సీజేగా బదిలీపై వెళ్తున్నారు.
జస్టిస్ హిమా కోహ్లి...
ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లి విధులు నిర్వహిస్తున్నారు. 1959 సెప్టెంబర్ 2న ఢిల్లీలో జన్మించిన హిమా న్యాయవిద్యను ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి పూర్తి చేశారు. 1984లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయిన ఆమె 1999-2004 మధ్య ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు న్యాయసలహాదారుగా, హైకోర్టులో స్టాండింగ్ కౌన్సిల్‌గా సేవలు అందించారు. అనేక వ్యాజ్యాల్లో ఢిల్లీ ప్రభుత్వం తరఫున, పలుప్రభుత్వ రంగ సంస్థల తరఫున వాదించారు.
2006లో తాత్కాలిక న్యాయమూర్తిగా...

 

  • 2006, మే 29న ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తిగా నియమితులైన హిమా... 2007 ఆగస్టు 28న శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు.
  • ఢిల్లీ రాష్ట్ర న్యాయసాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్‌గా, నేషనల్ లా యూనివర్సిటీ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యురాలిగా పనిచేశారు.
  • ఢిల్లీ ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ చైర్‌పర్సన్‌గా, పశ్చిమ బెంగాల్‌లోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జ్యుడీషియల్ సెన్సెస్ జనరల్ కౌన్సిల్ సభ్యురాలిగా వ్యవహరించారు.
  • జాతీయ న్యాయసేవా సాధికార సంస్థ ఆధ్వర్యంలో వస్తున్న న్యాయదీప్ పత్రిక సంపాదక వర్గ సభ్యురాలిగా సేవలు అందిస్తున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : తెలంగాణ రాష్ట్ర హైకోర్టు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా నియామకం
ఎప్పుడు : డిసెంబర్ 31
ఎవరు : జస్టిస్ హిమా కోహ్లి
ఎందుకు : జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ ఉత్తరాఖండ్ హైకోర్టు సీజేగా బదిలీ కావడంతో

ఏపీ హైకోర్టు కొత్త సీజేగా నియమితులైన న్యాయమూర్తి పేరు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల నియామకంపై కేంద్ర న్యాయశాఖ డిసెంబర్ 31న ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం...
  • ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ జేకే మహేశ్వరి సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, ప్రస్తుతం సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించాలి.
  • మధ్యప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ మహ్మద్ రఫీఖ్, ఒడిశా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎస్.మురళీధర్, మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీబ్ బెనర్జీలు బాధ్యతలు స్వీకరించాలి.
  • కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చి ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా, మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించాలి.

క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా నియామకం
ఎప్పుడు : డిసెంబర్ 31
ఎవరు : జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి
ఎందుకు : జస్టిస్ జేకే మహేశ్వరి సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయిన నేపథ్యంలో...

రైల్వే బోర్డు కొత్త చైర్మన్‌గా నియమితులైన వ్యక్తి?
రైల్వే బోర్డు కొత్త చైర్మన్, సీఈఓగా సునీత్ శర్మ నియమితులయ్యారు. డిసెంబర్ 31వ తేదీతో చైర్మన్‌గా వీకే యాదవ్ పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో శర్మ నియామకం జరిగింది. స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటిస్ ఆఫీసర్‌గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన శర్మ రైల్వే రంగంలో పలు సంస్కరణలను ప్రవేశపెట్టారు. రాయ్‌బరేలిలోని అత్యాధునిక రైలు బోగీల తయారీ కేంద్రంలో జనరల్ మేనేజర్‌గా పనిచేశారు. వారణాసిలోని డీజిల్ లోకోమోటివ్ వర్క్స్‌లో సేవలందించారు. డీజిల్ ఇంజిన్లను విద్యుత్తు ఇంజిన్లుగా మార్పు చేయడంలో కీలకపాత్ర పోషించారు. సాంకేతిక నైపుణ్యం, రైల్వేలోని వివిధ విభాగాల్లో పనిచేసిన 34 ఏళ్ల అనుభవం ఆయనకు ఉంది. చివరిగా ఈస్ట్రన్ రైల్వే జనరల్ మేనేజర్‌గా సేవలు అందించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రైల్వే బోర్డు కొత్త చైర్మన్, సీఈఓగా నియామకం
ఎప్పుడు : డిసెంబర్ 31
ఎవరు : సునీత్ శర్మ
ఎందుకు : ఇప్పటివరకు రైల్వే బోర్డు చైర్మన్‌గా ఉన్న వీకే యాదవ్ పదవీకాలం ముగిసిన నేపథ్యంలో...

మాజీ హాకీ ఆటగాడు మైకేల్ కిండో కన్నుమూత
భారత హాకీ మాజీ ఆటగాడు, 1975లో ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యుడైన మైకేల్ కిండో(73) కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన డిసెంబర్ 31న తన స్వస్థలం ఒడిశాలోని రూర్కెలాలో తుదిశ్వాస విడిచారు. ఫుల్ బ్యాక్‌గా భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన కిండో 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్ కూడా ఆడారు. ఈ పోటీల్లో భారత్ కాంస్యం గెలుచుకుంది. భారత హాకీ జట్టులో చోటు దక్కించుకున్న గిరిజన తెగలకు చెందిన తొలి వ్యక్తిగా గుర్తింపు పొందారు. క్రీడల్లో విశేష ప్రతిభ కనబరిచిన ఆయనను భారత ప్రభుత్వం ‘అర్జున’ అవార్డుతో సత్కరించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత హాకీ మాజీ ఆటగాడు కన్నుమూత
ఎప్పుడు : డిసెంబర్ 31
ఎవరు : మైకేల్ కిండో (73)
ఎక్కడ : రూర్కెలా, ఒడిశా
ఎందుకు : అనారోగ్యం కారణంగా...

ఇస్రో చైర్మన్ శివన్ పదవీ కాలం పొడిగింపు
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చైర్మన్ డాక్టర్ కైలాసవాడివో శివన్ పదవీ కాలాన్నీ మరో సంవత్సర కాలం పొడిగించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శివన్ పదవీ కాలాన్నీ పొడిగిస్తూ అపాయింట్‌మెంట్ కమిటీ ఆఫ్ కేబినెట్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ ఆఫీస్ కార్యదర్శి శ్రీనివాస్ ఆర్ కటికితల డిసెంబర్ 31న ఓ ప్రకటన విడుదల చేశారు.
2018, జనవరి 15న ఇస్రో చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన శివన్ పదవీ కాలం 2021, జనవరి 14తో ముగియనుంది. అయితే 2021 ఏడాది గగన్‌యాన్-1, చంద్రయాన్-3 లాంటి ప్రతిష్టాత్మక ప్రయోగాలు చేయనున్న దృష్ట్యా ఆయన పదవీ కాలాన్ని ఒక సంవత్సరం పాటు పొడిగించారు. దీంతో 2022, జనవరి 14 వరకు ఇస్రో చైర్మన్ పదవిలో శివన్ కొనసాగనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇస్రో చైర్మన్ డాక్టర్ కైలాసవాడివో శివన్ పదవీ కాలం పొడిగింపు
ఎప్పుడు : జనవరి 1
ఎవరు : భారత ప్రభుత్వం
ఎందుకు : 2021 ఏడాది గగన్‌యాన్-1, చంద్రయాన్-3 లాంటి ప్రతిష్టాత్మక ప్రయోగాలు చేయనున్న దృష్ట్యా

కృషి పండిట్ అవార్డీ, శాసనమండలి సభ్యుడు కన్నుమూత
కృషి పండిట్ అవార్డు గ్రహీత, ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో వైఎస్సార్‌సీపీ సభ్యుడు, సీనియర్ రాజకీయ నేత చల్లా రామకృష్ణారెడ్డి (72) ఇక లేరు. కరోనాకు హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జనవరి 1న తుదిశ్వాస విడిచారు. 1948 ఆగస్టు 27న కర్నూలు జిల్లాలోని అవుకు మండలం ఉప్పలపాడు గ్రామంలో జన్మించిన చల్లా... ఏజీ బీఎస్సీతో పాటు ఎంఏ చదివారు.
1983లో తొలిసారి...
1983లో పాణ్యం నుంచి టీడీపీ తరఫున తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1989లో డోన్ అసెంబ్లీ స్థానానికి, 1991లో నంద్యాల లోక్‌సభ స్థానానికి టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. తర్వాత కాంగ్రెస్‌లో చేరి 1994 ఎన్నికల్లో కోవెలకుంట్లలో ఓడిపోయారు. 1999, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కోవెలకుంట్ల నుంచి సాధించారు. 2009 ఎన్నికల్లో బనగానపల్లెలో ఓటమి పాలయ్యారు. 2014 తర్వాత ప్రభుత్వ హయాంలో ఏడాదిన్నర పాటు ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేశారు. 2019లో వైఎస్సార్‌సీపీలో చేరారు.
కళారంగంలోనూ...
చల్లా రాజకీయ రంగానికే కాకుండా సాహిత్య, కళా, వ్యవసాయ రంగాలకు కూడా తనవంతు సేవలందించారు. ఆయన కవితలు, రచనలు పత్రికల్లో ప్రచురితమయ్యాయి. సైరా చిన్నపురెడ్డి, సత్యాగ్రహం సినిమాల్లో హీరోగా నటించారు. 1977-1982 మధ్యకాలంలో జొన్న పంటలో మంచి దిగుబడి సాధించి అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి చేతుల మీదుగా కృషి పండిట్ అవార్డు స్వీకరించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కృషి పండిట్ అవార్డీ, ఏపీ శాసనమండలి సభ్యుడు కన్నుమూత
ఎప్పుడు : జనవరి 1
ఎవరు : చల్లా రామకృష్ణారెడ్డి(72)
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : కరోనా వైరస్ కారణంగా

సెయిల్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన వ్యక్తి?
దేశీయ అతిపెద్ద స్టీల్ తయారీ కంపెనీ సెయిల్ చైర్మన్‌గా జనవరి 1న సోమ మండల్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు ఆమె ఇదే కంపెనీలో డెరైక్టర్‌గా పనిచేశారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-రూర్కెలా నుంచి 1984లో పట్టభద్రురాలైన సోమ నాల్కో సంస్థలో తన ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించింది. అంచెలంచెలుగా ఎదుగుతూ నాల్కో డెరైక్టర్ స్థాయికి ఎదిగారు. అక్కడి నుంచి 2017లో సెయిల్ కంపెనీలో చేరారు. డిసెంబర్ 31న తాజాగా పదవీ విరమణ చేసిన అనిల్ కుమార్ చౌదరీ స్థానంలో సోమ మండల్ బాధ్యతలు చేపట్టారు.
కోవిడ్-19 వ్యాక్సిన్లు స్వేచ్ఛగా ఎగుమతి, దిగుమతి
విలువ పరిమితి లేకుండా కోవిడ్-19 వ్యాక్సిన్ల ఎగుమతి, దిగుమతికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండెరైక్ట్ ట్యాక్సెస్, కస్టమ్స్ (సీబీఐసీ) ఈ మేరకు నిబంధనలను సవరించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అతిపెద్ద స్టీల్ తయారీ కంపెనీ సెయిల్ చైర్మన్‌గా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : జనవరి 1
ఎవరు : సోమ మండల్

కేంద్ర మాజీ హోం మంత్రి బూటా సింగ్ కన్నుమూత
కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ హోం మంత్రి బూటా సింగ్(86) కన్నుమూశారు. 2020, అక్టోబర్‌లో మెదడులో రక్తస్రావమై కోమాలోకి వెళ్లిన బూటా సింగ్... ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ జనవరి 2న తుదిశ్వాస విడిచారు. నలుగురు ప్రధానుల కేబినెట్‌లో పనిచేసి, ఐదు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితం గడిపిన బూటా సింగ్.. పంజాబ్‌లోని జలంధర్ జిల్లా ముస్తఫాపూర్‌లో 1934, ఆగస్టు 21న జన్మించారు.
1962లో తొలిసారి...

  • బూటాసింగ్ 1962లో మొదటిసారి పంజాబ్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్ తరఫున 8 పర్యాయాలు లోక్‌సభకు ఎన్నికయ్యారు.
  • 2007-10 కాలంలో షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్ చైర్మన్‌గా వ్యవహరించారు.
  • 1998లో కేంద్ర సమాచార శాఖ మంత్రిగా ఉన్న సమయంలో జార్ఖండ్ ముక్తిమోర్చా లంచం కేసులో ఇరుక్కుని పదవి నుంచి వైదొలగారు.
  • ఆపరేషన్ బ్లూస్టార్‌కు, అనంతరం సిక్కులపై దాడుల సమయంలో కేంద్రానికి మద్దతుగా నిలిచిన బూటాసింగ్‌ను 1984లో సిక్కు పెద్దలు మతం నుంచి బహిష్కరించారు.

హార్స్ రేస్‌లో కిందపడి జాకీ మృతి
హైదరాబాద్‌లోని మలక్‌పేట్‌లో ఉన్న హైదరాబాద్ రేస్ క్లబ్‌లో (హెచ్‌ఆర్సీ) విషాదం చోటుచేసుకుంది. జనవరి 2న ఉస్మాన్‌సాగర్ ప్లేట్ డివిజన్-2 రేసులో పాల్గొన్న రాజస్తాన్‌కు చెందిన జాకీ జితేందర్ సింగ్ (25) గోల్డెన్ టేబుల్ అనే గుర్రం పైనుంచి పడి ప్రాణం విడిచాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ హోం మంత్రి కన్నుమూత
ఎప్పుడు : జనవరి 2
ఎవరు : బూటా సింగ్(86)
ఎక్కడ : ఢిల్లీ ఎయిమ్స్
ఎందుకు : మెదడులో రక్తస్రావం కారణంగా

ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ బాగ్చీ ప్రమాణం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీ జనవరి 4న ప్రమాణం చేశారు. ఆయన చేత ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి ప్రమాణం చేయించారు. జస్టిస్ బాగ్చీని కోల్‌కతా హైకోర్టు నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.
మరోవైపు సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా బదిలీ అయిన ఏపీ హైకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరికి హైకోర్టు జనవరి 4న ఘనంగా వీడ్కోలు పలికింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణం
ఎప్పుడు : జనవరి 4
ఎవరు : జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీ
ఎక్కడ : ఏపీ హైకోర్టు, అమరావతి, గుంటూరు జిల్లా

ప్రఖ్యాత సినీ గీత రచయిత వెన్నెలకంటి ఇకలేరు
ప్రఖ్యాత సినీ గీత రచయిత వెన్నెలకంటి రాజేశ్వరప్రసాద్ (64) గుండెపోటుతో జనవరి 5న చెన్నైలో కన్నుమూశారు. 1957, నవంబర్ 30న నెల్లూరులో జన్మించిన వెన్నెలకంటి... సినీ వినీలాకాశంలో మాటల, పాటల రచయితగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 11 ఏళ్ళకే కవితలు, పద్యాలు రాశాడు. ‘‘భక్త దుఃఖనాశ పార్వతీశా’’ అనే మకుటంతో శతకాన్ని, ‘‘రామచంద్ర శతకం’’, ‘‘లలితా శతకం’’ కూడా రాశాడు. తొలినాళ్లలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగిగా పనిచేసిన వెన్నెలకంటి... శ్రీరామచంద్రుడు సినిమాతో గీత రచయితగా సినీ ప్రస్థానం ప్రారంభించారు. దాదాపు రెండు వేల పాటలు రాశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రఖ్యాత సినీ గీత రచయిత కన్నుమూత
ఎప్పుడు : జనవరి 5
ఎవరు : వెన్నెలకంటి రాజేశ్వరప్రసాద్ (64)
ఎక్కడ : చెన్నై, తమిళనాడు
ఎందుకు : గుండెపోటు కారణంగా

క్రీడా శాఖ సహాయ మంత్రి పదవికి లక్ష్మీ రతన్ రాజీనామా
తృణమూల్ కాంగ్రెస్ నేత, పశ్చిమ బెంగాల్ యువజన సేవలు, క్రీడా శాఖ సహాయ మంత్రి లక్ష్మీ రతన్ శుక్లా జనవరి 5న తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రికి, గవర్నర్‌కు పంపారు. మాజీ క్రికెటర్, బెంగాల్ రంజీ టీమ్ మాజీ కెపె్టన్ అయిన శుక్లా తాను రాజకీయాల నుంచి రిటైర్ కాదలచినట్లు రాజీనామా లేఖలో పేర్కొన్నారు. హౌరా(నార్త్) నుంచి ఎంఎల్‌ఏగా ఎన్నికై న శుక్లా తన ఎంఎల్‌ఏ పదవికి మాత్రం రాజీనామా చేయలేదు.
పశ్చిమ బెంగాల్....
రాజధాని: కోల్‌కతా;
ప్రస్తుత గవర్నర్: జగ్‌దీప్ ధన్‌కర్;
ప్రస్తుత ముఖ్యమంత్రి: మమతా బెనర్జీ;
హైకోర్టు: కలకత్తా హైకోర్టు(కలకత్తా హైకోర్టు కోల్‌కతా నగరంలో ఉంది);
కలకత్తా హైకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి: జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్;
మొత్తం లోక్‌సభ సీట్లు: 42
మొత్తం రాజ్యసభ సీట్లు: 16
క్విక్ రివ్యూ :
ఏమిటి : పశ్చిమ బెంగాల్ యువజన సేవలు, క్రీడా శాఖ సహాయ మంత్రి పదవికి రాజీనామా
ఎప్పుడు : జనవరి 5
ఎవరు : లక్ష్మీ రతన్ శుక్లా

హైకోర్టు సీజేగా జస్టిస్ గోస్వామి ప్రమాణ స్వీకారం
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణం చేయించారు. జనవరి 6న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, లోకాయుక్త జస్టిస్ లక్ష్మణరెడ్డి, అడ్వొకేట్ జనరల్ సుబ్రమణ్యం శ్రీరాం, అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ బీఎస్ భానుమతి పాల్గొన్నారు.
జస్టిస్ గోస్వామి...

  • 1961 మార్చి 11న అస్సాం రాష్ట్రం జోరాత్‌లో జన్మించిన జస్టిస్ గోస్వామి... 1985లో గౌహతి లా కాలేజీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు.
  • 1985 ఏడాది న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు.
  • 2011లో గౌహతి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2012లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
  • గౌహతి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.
  • 2019లో పదోన్నతిపై సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. తాజాగా ఏపీ హైకోర్టు సీజేగా బాధ్యతలు చేపట్టారు.
  • జస్టిస్ గోస్వామి మంచి క్రికెటర్ కూడా. ఆయన రంజీ ట్రోఫీలో అస్సాం రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించారు. సీనియర్ లెవల్ అండర్ 19, అండర్ 21లో ఈస్ట్‌జోన్‌కు ప్రాతినిధ్యం వహించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా ప్రమాణ స్వీకారం
ఎప్పుడు : జనవరి 6
ఎవరు : జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి
ఎక్కడ : విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం, కృష్ణా జిల్లా

తొలి మహిళా సీజేగా జస్టిస్ హిమా కోహ్లి ప్రమాణం
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్ హిమా కోహ్లి జనవరి 7న ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ హిమ చేత రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయించారు. ఇప్పటివరకు తెలంగాణ హైకోర్టు సీజేగా విధులు నిర్వహించిన జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ ఉత్తరాఖండ్ హైకోర్టు సీజేగా బదిలీపై వెళ్లారు.
జస్టిస్ హిమా కోహ్లి...
ఇప్పటివరకు ఢిల్లీ హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లి విధులు నిర్వహిస్తున్నారు. 1959 సెప్టెంబర్ 2న ఢిల్లీలో జన్మించిన హిమా న్యాయవిద్యను ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి పూర్తి చేశారు. 1984లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయిన ఆమె 1999-2004 మధ్య ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు న్యాయసలహాదారుగా, హైకోర్టులో స్టాండింగ్ కౌన్సిల్‌గా సేవలు అందించారు. అనేక వ్యాజ్యాల్లో ఢిల్లీ ప్రభుత్వం తరఫున, పలుప్రభుత్వ రంగ సంస్థల తరఫున వాదించారు.
2006లో తాత్కాలిక న్యాయమూర్తిగా...

  • 2006, మే 29న ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తిగా నియమితులైన హిమా... 2007 ఆగస్టు 28న శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు.
  • ఢిల్లీ రాష్ట్ర న్యాయసాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్‌గా, నేషనల్ లా యూనివర్సిటీ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యురాలిగా పనిచేశారు.
  • ఢిల్లీ ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ చైర్‌పర్సన్‌గా, పశ్చిమ బెంగాల్‌లోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జ్యుడీషియల్ సెన్సెస్ జనరల్ కౌన్సిల్ సభ్యురాలిగా వ్యవహరించారు.
  • జాతీయ న్యాయసేవా సాధికార సంస్థ ఆధ్వర్యంలో వస్తున్న న్యాయదీప్ పత్రిక సంపాదక వర్గ సభ్యురాలిగా సేవలు అందిస్తున్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి : తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా ప్రమాణం
ఎప్పుడు : జనవరి 7
ఎవరు : జస్టిస్ హిమా కోహ్లి
ఎక్కడ : రాజ్‌భవన్, హైదరాబాద్

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎవరు?
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మొదటి స్థానంలో నిలిచారు. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్‌ను రెండో స్థానానికి నెట్టారు. జనవరి 7న విడుదలైన బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ సూచీ ‘‘ప్రపంచంలోనే 500 మంది అత్యంత సంపన్నుల జాబితా’’లో ఈ విషయం వెల్లడైంది. బ్లూమ్‌బర్గ్ నివేదిక బట్టి జనవరి 7న టెస్లా షేర్ల ధర ప్రకారం ఎలాన్ మస్క్ సంపద విలువ 188.5 బిలియన్ డాలర్ల పైగా ఉంది. బెజోస్ సంపదతో పోలిస్తే ఇది 1.5 బిలియన్ డాలర్లు అధికం. జనవరి 7న టెస్లా షేరు మరో 7 శాతం ఎగిసి 811.61 డాలర్ల రికార్డు స్థాయిని తాకడంతో ఇది సాధ్యపడింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అత్యంత ధనవంతుడిగా గుర్తింపు
ఎప్పుడు : జనవరి 7
ఎవరు : టెస్లా అధినేత ఎలాన్ మస్క్
ఎక్కడ : ప్రపంచంలో

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ సీఈఓగా నియమితులైన వారు?
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా.. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ జే వెంకట్రాము జనవరి 7న బాధ్యతలు స్వీకరించారు. చెల్లింపులు, ఉత్పత్తులు, అనుబంధ సాంకేతిక వ్యవస్థల మీద ఈయనకు రెండు దశాబ్దాల అనుభవం ఉంది. 2002-2015 మధ్య యాక్సిస్ బ్యాంక్ డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్‌గా, ఆరేళ్ల పాటు భారత వైమానిక దళంలోనూ వెంకట్రాము పనిచేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) ఎండీ, సీఈఓగా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : జనవరి 7
ఎవరు : జే వెంకట్రాము

Published date : 12 Feb 2021 03:34PM

Photo Stories