జనవరి 2020 వ్యక్తులు
Sakshi Education
ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు అరుదైన గౌరవం
తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావుకి అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) ప్రత్యేక ఆహ్వానం మేరకు జనవరి 23న జరిగిన ‘వరల్డ్ ఎకనామిక్ లీడర్స్’ సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ‘సాంకేతిక అభివృద్ధి వేగాన్ని కొనసాగించడం-సాంకేతిక ఆధారిత పరిపాలన’ అనే అంశంపై ఈ సమావేశాన్ని నిర్వహించారు. సాధారణంగా ఈ సమావేశానికి ప్రభుత్వాధినేతలు, కేంద్ర ప్రభుత్వాల విధానరూపకర్తలైన సీనియర్ మంత్రులను మాత్రమే ఆహ్వానిస్తారు. ఈ సమావేశానికి హాజరైనవారిలో రాష్ట్ర మంత్రి స్థాయిలో కేటీఆర్ ఒక్కరే ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వరల్డ్ ఎకనామిక్ లీడర్స్ సమావేశం
ఎప్పుడు : జనవరి 23
ఎవరు : కె.తారక రామారావు
ఎక్కడ : దావోస్, స్విట్జర్లాండ్
ఎందుకు : సాంకేతిక అభివృద్ధి వేగాన్ని కొనసాగించడం-సాంకేతిక ఆధారిత పరిపాలన’ అనే అంశంపై చర్చించేందుకు
బాస్కెట్‌బాల్ దిగ్గజం బ్రయాంట్ దుర్మరణం
అమెరికా బాస్కెట్ బాల్ దిగ్గజం కోబ్ బ్రయాంట్(41) ఇకలేరు. జనవరి 26న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో తన కూతురు జియానా(13)తో సహా ఆయన దుర్మరణం పాలయ్యాడు. అమెరికా ప్రభుత్వాధికారుల వివరాల ప్రకారం.. పైలట్, బ్రయాంట్, జియానా సహా మొత్తం 9 మందితో అమెరికాలోని లాస్ ఏంజిల్స్ నుంచి బయలుదేరిన సికోర్‌స్కై ఎస్-76 హెలికాప్టర్ కాలిఫోర్నియా సమీపంలోని క్యాలాబసస్ కొండను ఢీకొట్టింది. వెంటనే అది పేలడంతో ప్రయాణిస్తున్న వారంతా దుర్మరణం పాలయ్యారు.
బ్రయాంట్ నేపథ్యం..
అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలో 1978, ఆగస్టు 23న కోబ్ బీన్ బ్రయాంట్ జన్మించారు. హైస్కూల్ చదువు ముగియగానే 18 ఏళ్ల వయసులో నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్‌బీఏ)లో చేరాడు. అలా 1996లో ‘లాస్‌ఏంజిల్స్ లేకర్స్’ జట్టుకు ఆడటం మొదలుపెట్టిన ఈ ‘బ్లాక్ మాంబా’ (బ్రయాంట్ ముద్దుపేరు) ఆఖరిదాకా ఆ ఫ్రాంచైజీని వీడలేదు. 2016లో ఆటకు వీడ్కోలు చెప్పాడు. బ్రయాంట్‌కు గౌరవసూచకంగా లేకర్స్ జట్టు 8, 24 నంబర్ జెర్సీలకు 2017లో రిటైర్మెంట్ ఇచ్చింది.
ఏమిటి : అమెరికా బాస్కెట్ బాల్ దిగ్గజం దుర్మరణం
ఎప్పుడు : జనవరి 26
ఎవరు : కోబ్ బ్రయాంట్(41)
ఎక్కడ : కాలిఫోర్నియా, అమెరికా
ఎందుకు : హెలికాప్టర్ ప్రమాదం కారణంగా
పీఎం అవార్డు ప్యానెల్‌కు సిరిసిల్ల కలెక్టర్ ఎంపిక
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ డి.కృష్ణ భాస్కర్‌కు అరుదైన అవకాశం లభించింది. 2020లో ప్రధాన మంత్రి అవార్డుకు సంబంధించి సవరణలు, సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఏర్పాటైన ప్యానెల్ కమిటీలో సిరిసిల్ల జిల్లా కలెక్టర్ డి.కృష్ణ భాస్కర్‌కు చోటు దక్కింది. సుపరిపాలన అందించేందుకు అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం 15 జిల్లాల కలెక్టర్లతో ప్యానెల్ కమిటీని నియమించింది. ఇందులో సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌కు చోటు దక్కింది. దక్షిణ భారతదేశం నుంచి నలుగురు కలెక్టర్లకు ఈ అవకాశం వచ్చింది. గ్రామీణాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, విద్యాభివృద్ధికి సంబంధించి ప్రధాన మంత్రి అవార్డులో మార్పులు, చేర్పులకు సంబంధించిన సలహాలు, సూచనలను కలెక్టర్ కృష్ణభాస్కర్ ఇవ్వనున్నారు. తెలంగాణ నుంచి కృష్ణభాస్కర్ ఒక్కరికే ఈ అవకాశం రావడం విశేషం.
క్విక్ రివ్యూ:
ఏమిటి: పీఎం అవార్డు ప్యానెల్‌కు సిరిసిల్ల కలెక్టర్ ఎంపిక
ఎవరు: డి.కృష్ణ భాస్కర్
ఎందుకు: 2020లో ప్రధాన మంత్రి అవార్డుకు సంబంధించి సవరణలు, సలహాలు, సూచనలు ఇచ్చేందుకు..
అమెరికాలో భారత రాయబారిగా తరణ్‌జీత్
న్యూఢిల్లీ: అమెరికాలో భారత రాయబారిగా తరణ్‌జిత్ సంధు నియమితులయ్యారు. 1988 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి (ఐఎఫ్‌ఎస్) అయిన సంధు గతంలో రెండు పర్యాయాలు అమెరికాలో భారత్ తరపున 2013-2017 మధ్య డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్‌గా పనిచేశారు. ఇప్పటివరకూ అమెరికాలో భారత రాయబారిగా ఉన్న హర్షవర్ధన్ ష్రింగ్లా విదేశీ వ్యవహారాల కార్యదర్శిగా నియమితులవడంతో ఆ స్థానంలో సంధు బాధ్యతలు చేపడతారు. సంధు ప్రస్తుతం శ్రీలంకలో భారత హైకమిషనర్‌గా ఉన్నారు. కాగా, భారత్‌లో సీఏఏ, కశ్మీర్ అంశం, ఆర్టికల్ 370ను అమెరికన్ కాంగ్రెస్ విమర్శిస్తున్న తరుణంలో సంధు నియామకం ప్రాధాన్యం సంతరించుకొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: అమెరికాలో భారత రాయబారిగా తరణ్‌జీత్ నియమాకం
ఎవరు: తరణ్‌జీత్
ఎక్కడ: అమెరికా
రష్యా ప్రధాని పదవికి మెద్వదేవ్ రాజీనామా
రష్యా ప్రధాన మంత్రి దిమిత్రి మెద్వదేవ్ జనవరి 15న తన పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వ వ్యవస్థలో దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీసుకురాదలచిన మార్పులను సానుకూలపర్చేందుకు వీలుగా తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన చెప్పారు. మెద్వదేవ్ రాజీనామాను పుతిన్ ఆమోదించారు. అనంతరం, ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఉప దళపతిగా మెద్వదేవ్‌ను, తదుపరి ప్రధానిగా మైఖేల్ మిషుస్తిన్‌ను నియమించారు. ఆ వెంటనే, ఈ నియామకాల్ని పార్లమెంట్ ఆమోదించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రష్యా ప్రధాన మంత్రి పదవికి రాజీనామా
ఎప్పుడు : జనవరి 15
ఎవరు : దిమిత్రి మెద్వదేవ్
ఉక్రెయిన్ ప్రధాని ఓలెక్సీ గోంచారక్ రాజీనామా
ఉక్రెయిన్ ప్రధాని ఓలెక్సీ గోంచారక్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు అధ్యక్షుడు వ్లోదిమర్ జెలెన్‌స్కీకి తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఆర్థిక వ్యవస్థపై వ్లోదిమర్‌కు అంతగా అవగాహన లేదని ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఆడియో రికార్డులు ఇటీవల లీకయ్యాయి. దీనికి బాధ్యత వహిస్తూ జనవరి 17న ఆయన తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఈ రాజీనామాను తిరస్కరిస్తున్నట్లు అధ్యక్షుడు వ్లోదిమర్ తెలిపారు. ప్రధానికి మరో అవకాశమిస్తున్నట్లు చెప్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఉక్రెయిన్ ప్రధాని పదవికి రాజీనామా
ఎప్పుడు : జనవరి 17
ఎవరు : ఓలెక్సీ గోంచారక్
నిర్భయ దోషి ముఖేష్ క్షమాభిక్ష తిరస్కరణ
2012 నాటి నిర్భయ అత్యాచార కేసు దోషి ముఖేష్ సింగ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జనవరి 17న తిరస్కరించారు. ఢిల్లీ ప్రభుత్వం ద్వారా అందిన ఈ పిటిషన్‌ను కేంద్ర హోంశాఖ జనవరి 17న రాష్ట్రపతి భవనానికి పంపింది. ఆ వెంటనే రాష్ట్రపతి కోవింద్ పిటిషన్‌ను పరిశీలించడంతోపాటు తిరస్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఫిబ్రవరి 1న ఉరి శిక్ష అమలు...
ముఖేష్ సింగ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించిన అనంతరం ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు నలుగురు దోషులపై మరోసారి డెత్‌వారెంట్లు జారీ చేసింది. దోషులను 2020, ఫిబ్రవరి 1న ఉదయం ఆరుగంటలకు ఉరి తీయాలని డెత్ వారెంట్లు జారీ చేసింది. ముందుగా నిర్ణయించిన దాని ప్రకారం జనవరి 22నే నిర్భయ దోషులకు ఉరిపడాల్సి ఉంది. అయితే ముఖేష్ సింగ్ అనే దోషి తనను క్షమించాల్సిందిగా కోరుతూ రాష్ట్రపతికి పిటిషన్ సమర్పించారు.
ఎన్‌ఎంఎంఎల్ చైర్మన్‌గా నృపేంద్ర మిశ్రా
నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ (ఎన్‌ఎంఎంఎల్) ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్‌గా ప్రధాని మాజీ ముఖ్య కార్యదర్శి నృపేంద్ర మిశ్రా, వైస్ చైర్మన్‌గా ఎ.సూర్య ప్రకాశ్ నియమితులయ్యారు. ఈ మేరకు జనవరి 14న కేంద్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 74 ఏళ్ల నృపేంద్ర మిశ్రా.. ప్రధాని మోదీ ముఖ్య కార్యదర్శిగా 2019, ఆగస్టులో వైదొలిగారు. నెహ్రూ మెమోరియల్‌లో సభ్యులుగా ఉన్న కాంగ్రెస్ నేతలు ఖర్గే, జైరామ్ రమేశ్, కరణ్ సింగ్‌లను 2019, నవంబర్‌లో కేంద్రప్రభుత్వం తొలగించింది. వారి స్థానంలో టీవీ జర్నలిస్ట్ రజత్ శర్మ, అద్మాన్ ప్రసూన్ జోషిలను నియమించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎన్‌ఎంఎంఎల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్‌గా నియామకం
ఎప్పుడు : జనవరి 14
ఎవరు : నృపేంద్ర మిశ్రా
రాచరికాన్ని వదులుకున్న హ్యారీ దంపతులు
బ్రిటన్ యువరాజు హ్యారీ, ఆయన భార్య మేఘన్ మార్కెల్ రాజకుటుంబం నుంచి అధికారికంగా తప్పుకున్నారు. తమకున్న రాయల్ గుర్తింపుని వదులుకున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ఒప్పందంపై హ్యారీ దంపతులు సంతకాలు చేశారు. దీంతో వారిద్దరి పేర్లకు ముందు రాచరికాన్ని ప్రతిబింబించే గౌరవ సూచకాలు ఉండవు. అలాగే బ్రిటన్ రాజ కుటుంబం వారసులుగా వారు నిర్వహించే బాధ్యతలకుగాను పన్ను రూపంలో బ్రిటన్ వాసులు చెల్లించే ఆదాయం కూడా ఇకపై వారికి అందదు.
‘హ్యారీ, మేఘన ఇక రాయల్ కుటుంబ సభ్యులు కాదు. వారి పేర్లకు ముందు గౌరవసూచకంగా వాడే టైటిల్స్‌ను (హెచ్‌ఆర్‌హెచ్) ఇకపై వాడకూడదు’’ అని బకింగ్‌హమ్ ప్యాలెస్ ప్రకటించింది. మిలటరీ అపాయింట్‌మెంట్లు సహా రాజకుటుంబం నిర్వర్తించే విధుల నుంచి కూడా వారిద్దరూ తప్పుకున్నట్టు పేర్కొంది. నెలల తరబడి నిర్మాణాత్మకంగా సుదీర్ఘమైన చర్చలు జరిగిన తర్వాత హ్యారీ దంపతులు రాజభవనం వీడి వెళ్లడానికి తాము సంపూర్ణంగా మద్దతునిస్తున్నట్టుగా రాణి ఎలిజబెత్ తెలిపారు.
ఎస్‌బీఐ మేనేజింగ్ డెరైక్టర్‌గా చల్లా శ్రీనివాసులు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మేనేజింగ్ డెరైక్టరుగా (ఎండీ) చల్లా శ్రీనివాసులు శెట్టిని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎండీగా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి ఆయన మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. చల్లా శ్రీనివాసులు ప్రస్తుతం ఎస్‌బీఐలో డిప్యూటీ ఎండీగా విధులు నిర్వహిస్తున్నారు. మరోవైపు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా పనిచేస్తున్న లింగం వెంకట ప్రభాకర్ కెనరాబ్యాంకు ఎండీ-సీఈఓగా నియమితులయ్యారు. ఆయన పదవీ విరమణ చేసేంతవరకూ ఆ పదవిలో కొనసాగనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీగా నియామకం
ఎవరు : చల్లా శ్రీనివాసులు శెట్టి
లోక్‌పాల్ పదవికి జస్టిస్ దిలీప్ రాజీనామా
లోక్‌పాల్ సభ్యత్వ పదవికి రాజీనామా చేస్తున్నట్లు జస్టిస్ దిలీప్ బి.బొసాలే జనవరి 9న వెల్లడించారు. వ్యక్తిగత కారణాల వల్ల తాను పదవికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. 2020, జనవరి 12 నుంచి తన రాజీనామా అమల్లోకి వస్తుందని చెప్పారు. అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ దిలీప్ 2019 మార్చి 27న లోక్‌పాల్ జ్యుడీషియల్ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. లోక్‌పాల్ సభ్యులుగా ఎంపికై న వారి పదవీకాలం ఐదేళ్ల పాటు లేదా 70 ఏళ్ల వయసు వరకు కొనసాగనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : లోక్‌పాల్ సభ్యత్వ పదవికి రాజీనామా
ఎప్పుడు : జనవరి 9
ఎవరు : జస్టిస్ దిలీప్ బి.బొసాలే
ఎందుకు : వ్యక్తిగత కారణాల వల్ల
హర్ గోవింద్ ఖొరానా పరిశోధక విభాగం ఏర్పాటు
ప్రఖ్యాత భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త హర్ గోవింద్ ఖొరానా పేరుతో పాకిస్తాన్‌లో పరిశోధక విభాగం ఏర్పాటుకానుంది. ఖొరానా పేరిట ప్రత్యేక పరిశోధక విభాగాన్ని(రీసెర్చ్ చైర్) ఏర్పాటు చేయనున్నట్లు లాహోర్‌లోని గవర్నమెంట్ కాలేజ్ యూనివర్సిటీ(జీసీయూ) జనవరి 9న ప్రకటించింది. ఖొరానా 1922లో అవిభక్త భారత్‌లోని రాయ్‌పుర్ గ్రామం (ప్రస్తుతం పాక్‌లో ఉంది)లో జన్మించారు. 1968లో వైద్యరంగంలో నోబెల్ బహుమతిని అందుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హర్ గోవింద్ ఖొరానా పేరుతో ప్రత్యేక పరిశోధక విభాగం ఏర్పాటు
ఎప్పుడు : జనవరి 9
ఎవరు : లాహోర్ గవర్నమెంట్ కాలేజ్ యూనివర్సిటీ(జీసీయూ)
ఎక్కడ : జీసీయూ, లాహోర్, పాకిస్తాన్
ఏపీ హైకోర్టుకు నలుగురు న్యాయమూర్తులు
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా రావు రఘునందన్‌రావు, బట్టు దేవానంద్, దొనడి రమేశ్, నైనాల జయసూర్య నియమితులయ్యారు. వీరి నియామకానికి జనవరి 10న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. ఈ నలుగురి నియామకంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 19కి చేరుకోనుంది. వీరితో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి జనవరి 13న ప్రమాణం చేయించనున్నారు.
రావు రఘునందన్‌రావు
1964 జూన్ 30న జన్మించిన రావు రఘునందన్‌రావు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 1988లో న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. అదే ఏడాది న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. 1993 నుంచి 94 వరకు ఏజీపీగా పనిచేశారు. 1995లో అడ్వొకేట్ జనరల్‌కు సహకరించేందుకు స్పెషల్ ఏజీపీగా నియమితులయ్యారు. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లకు న్యాయవాదిగా ఉన్నారు. ఏపీ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వ సీనియర్ న్యాయవాదుల ప్యానెల్‌లో చోటు దక్కించుకున్నారు. జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) న్యాయవాదుల సంఘం ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.
బట్టు దేవానంద్
కృష్ణా జిల్లాకి చెందిన దేవానంద్ 1966 ఏప్రిల్ 14న జన్మించారు. గుడివాడ ఏజీకే పాఠశాలలో ఎస్‌ఎస్‌సీ, ఏఎన్‌ఆర్ కాలేజీలో ఇంటర్, బీఏ, ఆంధ్రా యూనివర్సిటీలో బీఎల్ చదివారు. 1989లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. 1996 నుంచి 2000 వరకు హైకోర్టులో ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా పనిచేశారు. 2004 నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌కు న్యాయవాదిగా వ్యవహరిస్తున్నారు. 2014 నుంచి 2019 వరకు హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా బాధ్యతలు నిర్వర్తించారు.
నైనాల జయసూర్య
నైనాల జయసూర్య పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో 1968లో జన్మించారు. విజయవాడలోని వెలగపూడి దుర్గాబాయి సిద్ధార్థ కాలేజీ ఆఫ్ లాలో ఎల్‌ఎల్‌బీ చదివారు. 1992లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. 2003-04లో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా వ్యవహరించారు. 2009-14 మధ్య హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఏపీఎస్‌టీసీ, ఎస్‌టీసీ, హుడా తదితర ప్రభుత్వ రంగ సంస్థల తరఫున కేసులు వాదించారు. బీహెచ్‌ఈఎల్, ఆప్కో, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ప్యానల్ న్యాయవాదిగా కొనసాగుతున్నారు.
దొనడి రమేశ్
1965 జూన్ 27న చిత్తూరు జిల్లా సోమల మండలం కామనపల్లిలో రమేశ్ జన్మించారు. తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ కాలేజీలో ఇంటర్, బీకాం, నెల్లూరు వీఆర్ లా కాలేజీలో బీఎల్ చదివారు. 1990లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. 2000-2004 మధ్య హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. 2006-13 మధ్య కాలంలో హైకోర్టులో రాజీవ్ విద్యా మిషన్, సర్వ శిక్షాఅభియాన్‌కు న్యాయవాదిగా వ్యవహరించారు. 2014 నుంచి 2019 వరకు హైకోర్టులో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా బాధ్యతలు నిర్వర్తించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏపీ హైకోర్టుకు నలుగురు న్యాయమూర్తులు
ఎప్పుడు : జనవరి 10
ఎవరు : రావు రఘునందన్‌రావు, బట్టు దేవానంద్, దొనడి రమేశ్, నైనాల జయసూర్య
ఒమన్ సుల్తాన్ బిన్ సయీద్ కన్నుమూత
ఆధునిక అరబ్ ప్రపంచంలో అత్యధిక కాలం పాలించిన ఒమన్ రాజు ఖుబాస్ బిన్ సయీద్ (79) జనవరి 10 కన్నుమూశారు. 1970 నుంచి పాలించిన ఆయన కేన్సర్‌తో బాధపడినట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఈయనకు పెళ్లి కాలేదు. దీంతో ఆయన వారసుడు ఎవరనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఒమన్ రాజ్యాంగం ప్రకారం రాజు సింహాసనాన్ని వదలిన మూడు రోజుల్లోగా కొత్త రాజు దాన్ని అధిష్టించాలి. బిన్ సయీద్‌కు వారసులు లేకపోవడంతో రాజ కుటుంబంలో సభ్యుడైన ‘ముస్లిం, యుక్త వయస్సు వచ్చిన వారు, హేతుబద్ధవాది, ఒమన్ ముస్లిం తల్లిదండ్రులకు జన్మించిన’ వ్యక్తిని తదుపరి రాజుగా ఎన్నుకోవాల్సి ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఒమన్ సుల్తాన్ కన్నుమూత
ఎప్పుడు : జనవరి 10
ఎవరు : ఖుబాస్ బిన్ సయీద్ (79)
సీఆర్‌పీఎఫ్ డీజీగా ఎ.పి.మహేశ్వరి
సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్(సీఆర్‌పీఎఫ్) డీజీగా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఎ.పి.మహేశ్వరి నియమితులయ్యారు. 1984 బ్యాచ్‌కు చెందిన ఉత్తరప్రదేశ్ కేడర్ ఐపీఎస్ ఆఫీసర్ మహేశ్వరి ప్రస్తుతం హోంమంత్రిత్వ శాఖలో (అంతర్గత భద్రత) ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అతను ఫిబ్రవరి 28, 2021 వరకు ఈ పదవిలో ఉంటారు. 2019, డిసెంబర్ 31న భట్నాగర్ పదవీ విరమణ చేసినప్పటినుంచీ డీజీ పోస్టు ఖాళీగా ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్(సీఆర్‌పీఎఫ్) డీజీగా నియామకం
ఎప్పుడు : జనవరి 13
ఎవరు : ఐపీఎస్ ఆఫీసర్ ఎ.పి.మహేశ్వరి
పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ మరణ శిక్ష రద్దు
పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు మరణ శిక్ష విధిస్తూ ఇస్లామాబాద్ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును లాహోర్ హైకోర్టు కొట్టివేసింది. ప్రత్యేక కోర్టు ఏర్పాటును, ఆ కోర్టు ఇచ్చిన ఈ తీర్పును సవాలు చేస్తూ ముషారఫ్ దాఖలు చేసిన పిటిషన్‌పై జనవరి 13న లాహోర్ హైకోర్టులోని త్రిసభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది. ఈ తీర్పులో ముషారఫ్‌పై దేశద్రోహం కేసు నమోదు, ప్రత్యేక కోర్టు ఏర్పాటు, ఆ కోర్టు ఇచ్చిన తీర్పు.. అన్నీ చట్ట వ్యతిరేకం, రాజ్యాంగ విరుద్ధం అని తేల్చి చెప్పింది.
2013లో నాటి నవాజ్ షరీఫ్ ప్రభుత్వం ముషారఫ్ కేసు నమోదు చేసింది. ఆరేళ్ల పాటు ప్రత్యేక కోర్టు విచారణ జరిపి 2019, డిసెంబర్‌లో ముషారఫ్‌కు మరణ శిక్ష విధిస్తూ తీర్పు ప్రకటించింది. ఈ తీర్పును లాహోర్ హైకోర్టులోని జస్టిస్ సయ్యద్ మజహర్ అలీ అక్బర్ నఖ్వీ, జస్టిస్ మొహ్మద్ అమీర్ భట్టీ, జస్టిస్ చౌధరి మసూద్ జహంగీర్‌ల త్రిసభ్య ధర్మాసనం కొట్టివేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు మరణ శిక్ష రద్దు
ఎప్పుడు : జనవరి 13
ఎవరు : లాహోర్ హైకోర్టు
ఎందుకు : ముషారఫ్‌పై దేశద్రోహం కేసు నమోదు, ప్రత్యేక కోర్టు ఏర్పాటు, ఆ కోర్టు ఇచ్చిన తీర్పు.. రాజ్యాంగ విరుద్ధం అని
ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులుగా రావు రఘునందన్‌రావు, బట్టు దేవానంద్, దొనడి రమేశ్, నైనాల జయసూర్య ప్రమాణం చేశారు. హైకోర్టు మొదటి కోర్టు హాలులో జనవరి 13న జరిగిన కార్యక్రమంలో వీరిచే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి వేర్వేరుగా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఏపీ అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్, డీజీపీ గౌతమ్ సవాంగ్ హాజరయ్యారు. ఈ నలుగురి నియామకంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 19కి చేరింది. వీరిని హైకోర్టు న్యాయమూర్తులుగా నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ నెల 10న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం

ఏపీ దిశ చట్టం స్పెషల్ ఆఫీసర్లుగా శుక్లా, దీపిక
ఆంధ్రప్రదేశ్‌లో మహిళల రక్షణ కోసం ప్రవేశపెట్టిన ఏపీ దిశ చట్టం-2019 అమలు కోసం ఇద్దరు ప్రత్యేక అధికారులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జనవరి 2న ఉత్తర్వులు జారీ చేశారు. ఐఏఎస్ విభాగంలో ప్రస్తుతం మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరక్టరుగా ఉన్న కృతికా శుక్లాను దిశ స్పెషల్ ఆఫీసర్‌గా నియమించారు. అలాగే ఐపీఎస్ విభాగంలో కర్నూలు ఏఎస్‌పీగా ఉన్న ఎం.దీపికను గుంటూరు సీఐడీ విభాగంలో ఏడీజీగా బదిలీ చేసి దిశ స్పెషల్ ఆఫీసర్‌గా నియమించారు.
అమలుకు రూ.87 కోట్లు కేటాయింపు
దిశ చట్టం అమలు కోసం రూ.87 కోట్లు కేటాయిస్తూ జనవరి 1న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మహిళలు, బాలలపై జరిగే క్రూరమైన లైంగిక నేరాల సత్వర విచారణకు వీలుగా ప్రతి జిల్లాలోనూ ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటు, మహిళా పోలీసుస్టేషన్ల ఉన్నతీకరణ, ఫోరెన్సిక్ ప్రయోగశాలల బలోపేతం, దిశ కాల్‌సెంటర్, దిశ యాప్‌ల కోసం ఈ నిధులు మంజూరు చేసింది. అందులో రూ.23.52 కోట్లతో మంగళగిరిలో ఉన్న రాష్ట్ర స్థాయి ఫోరెన్సిక్ ప్రయోగశాల, విశాఖపట్నం, తిరుపతిలో ఉన్న ప్రాంతీయ ఫోరెన్సిక్ ప్రయోగశాలల్లో డీఎన్‌ఏ, సైబర్ విభాగాలను ఏర్పాటు చేస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏపీ దిశ చట్టం-2019 స్పెషల్ ఆఫీసర్లుగా నియామకం
ఎప్పుడు : జనవరి 2
ఎవరు : కృతికా శుక్లా, ఎం.దీపిక
ఎందుకు : దిశ చట్టం అమలు కోసం
ఎన్‌ఎంసీ తొలి చైర్మన్‌గా డాక్టర్ సురేశ్ చంద్ర శర్మ
నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్‌ఎంసీ) తొలి చైర్మన్‌గా ఢిల్లీ ఎయిమ్స్(ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్)లో చెవి, ముక్కు, గొంతు(ఈఎన్‌టీ) విభాగంలో ప్రొఫెసర్‌గా ఉన్న డాక్టర్ సురేశ్ చంద్ర శర్మ నియమితులయ్యారు. ఈ మేరకు జనవరి 2న కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. శర్మ మూడేళ్ల పాటు కానీ లేదా తనకు 70 ఏళ్ల వయసు వచ్చేవరకు కానీ ఆ పదవిలో ఉంటారు. ఎన్‌ఎంసీకి ఒక చైర్ పర్సన్, 10 మంది ఎక్స్ అఫిషియొ సభ్యులు ఉంటారు.
వైద్య విద్య నియంత్రణ సంస్థ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) స్థానంలో ఎన్‌ఎంసీను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అవినీతి ఆరోపణలు రావడంతో 2018లో ఎంసీఐని రద్దు చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్‌ఎంసీ) తొలి చైర్మన్‌గా నియామకం
ఎప్పుడు : జనవరి 2
ఎవరు : డాక్టర్ సురేశ్ చంద్ర శర్మ
తైవాన్ సైన్యాధ్యక్షుడు షెన్ యి దుర్మరణం
తైవాన్‌లో జరిగిన సైనిక హెలికాప్టర్ ప్రమాదం కారణంగా తైవాన్ సైన్యాధ్యక్షుడు షెన్ యి-మింగ్(62)తో సహా మరో ఎనిమిది మంది సైనికాధికారులు దుర్మరణం పాలయ్యారు. మరో ఐదు మంది గాయాల పాలయ్యారు. తైవాన్‌కు ఈశాన్య ప్రాంతంలోని సైనికులను స్వయంగా కలసి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేందుకు జనవరి 1న సైన్యాధ్యక్షుడితో పాటు మరో 12 మంది అధికారులు హెలికాఫ్టర్‌లో బయలుదేరారు. ఈ క్రమంలో రాజధాని తైపీకి సమీపంలోని కొండల్లో హెలికాఫ్టర్ అదృశ్యమైంది. దీంతో గాలింపు చర్యలు చేపట్టగా హెలికాఫ్టర్ కూలిన ప్రదేశాన్ని జనవరి 2న గుర్తించారు. ఈ ప్రమాదంలో ఐదుగురు గాయాలతో బయటడినట్లు ఆ దేశ రక్షణ శాఖ వెల్లడించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెవాన్ సైన్యాధ్యక్షుడు మృతి
ఎప్పుడు : జనవరి 1
ఎవరు : షెన్ యి-మింగ్(62)
ఎక్కడ : తైపీకి

- ఎన్‌బీఏలో తన లేకర్స్ జట్టును ఐదుసార్లు (2000, 2001, 2002, 2009, 2010) చాంపియన్‌గా నిలిపిన కోబ్.. అమెరికా జట్టు రెండు సార్లు(2008, 2012) ఒలింపిక్ స్వర్ణ పతకాన్ని సాధించడంలోనూ కీలకపాత్ర పోషించాడు.
- 2008లో ‘ఎన్‌బీఏ అత్యంత విలువైన ఆటగాడు’గా అవార్డు అందుకున్న బ్రయాంట్ 18 సార్లు ఎన్‌బీఏ ఆల్‌స్టార్స్ జట్టు సభ్యుడిగా ఎంపికయ్యాడు. 2000 నుంచి 2016 వరకు వరుసగా 17 సార్లు ఈ ఘనతకెక్కాడు.
- 2018లో ‘డియర్ బాస్కెట్‌బాల్’ పేరుతో బ్రయాంట్ నిర్మించిన యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్‌కు ఆస్కార్ అవార్డు లభించింది.

ఆంధ్రప్రదేశ్ ఏసీబీ డీజీగా సీతారామాంజనేయులు
ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) డెరైక్టర్ జనరల్(డీజీ)గా పి.సీతారామాంజనేయులు నియమితులయ్యారు. అలాగే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) సెక్రటరీ, రవాణా శాఖ కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతల్లో ఆయన కొనసాగనున్నారు. ఈ మేరకు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జనవరి 4న ఉత్తర్వులు జారీ చేశారు. సీతారామాంజనేయులు ప్రస్తుతం రవాణాశాఖ కమిషనర్‌గా ఉన్నారు. కాగా, ఇప్పటివరకు ఏసీబీ డీజీగా ఉన్న కుమార్ విశ్వజిత్‌ను డీజీపీకి రిపోర్టు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) డెరైక్టర్ జనరల్(డీజీ)గా నియామకం
ఎప్పుడు : జనవరి 4
ఎవరు : పి.సీతారామాంజనేయులు
Published date : 27 Jan 2020 04:17PM