BCCI Secretary: బీసీసీఐ కార్యదర్శిగా సైకియా, కోశాధికారిగా ప్రభ్‌తేజ్
Sakshi Education
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శిగా దేవ్‌జిత్ సైకియా, కోశాధికారిగా ప్రభ్‌తేజ్ సింగ్ భాటియా నియమితులయ్యారు.

బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎం)లో సభ్యులు వాళ్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎందుకంటే వారు మాత్రమే సంబంధిత పదవులకు నామినేషన్లు దాఖలు చేశారు.
గతంలో జై షా బీసీసీఐ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. అయితే, జై షా ఐసీసీ (అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్) చైర్మన్‌గా ఎన్నికైన నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శి పదవికి వైదొలిగారు. జై షా వైదొలగిన తర్వాత, దేవ్‌జిత్ సైకియా తాత్కాలిక కార్యదర్శిగా పనిచేస్తూ, జనవరి 12వ తేదీ నుంచి పూర్తి స్థాయి కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు.
Published date : 15 Jan 2025 08:38AM