Skip to main content

Conrad Sangma: మేఘాలయ సీఎంగా కాన్రాడ్‌ సంగ్మా ప్రమాణం

మేఘాలయ ముఖ్యమంత్రిగా నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్‌పీపీ) చీఫ్‌ కాన్రాడ్‌ కె.సంగ్మా వరుసగా రెండోసారి ప్రమాణం చేశారు.
Conrad Sangma

ఆయన పార్టీకే చెందిన మరో ఏడుగురు ఎమ్మెల్యేలు, యూడీపీ నుంచి ఇద్దరు, బీజేపీ, హెచ్‌ఎస్‌పీడీపీల నుంచి ఒక్కొక్కరు చొప్పున మొత్తం 11 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. మార్చి 7వ తేదీ షిల్లాంగ్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ఫగూ చౌహాన్‌ వీరందరి చేత పదవీ ప్రమాణం చేయించారు. ఇందులో ఎన్‌పీపీకి చెందిన ఇద్దరు ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణం చేశారు.  
నిబంధనల ప్రకారం.. నాగాలాండ్‌ అసెంబ్లీలోని 60 స్థానాలకు గాను సీఎంతో కలిపి మంత్రివర్గంలో 12 మందికి మించి ఉండరాదు. ప్రమాణ స్వీకారం చేసిన సీఎం కాన్రాడ్, మంత్రులకు ప్రధాని మోదీ ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలిపారు. మేఘాలయ మరింతగా అభివృద్ధి పథకంలో నడిపించాలనే లక్ష్య సాధనలో వారు విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, పర్యాటకంతోపాటు మౌలిక సదుపాయాలను, రహదారులు, విద్యుత్, నీటి వసతులను మెరుగుపర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యాలని ప్రమాణ స్వీకారం అనంతరం సంగ్మా పీటీఐకి చెప్పారు.

Ram Chandra Poudel: నేపాల్‌ కొత్త అధ్యక్షుడిగా పౌద్యాల్‌!

 

Published date : 08 Mar 2023 03:20PM

Photo Stories