Skip to main content

Anthony Albanese: ఆస్ట్రేలియా ప్రధానమంత్రిగా మళ్లీ ఆంథోనీ అల్బనీస్‌

ఆస్ట్రేలియా దేశ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Anthony Albanese wins second term as Australian PM

ఆస్ట్రేలియాలో జరిగిన తాజా పార్లమెంటరీ ఎన్నికల్లో ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్ నేతృత్వంలోని లేబర్‌ పార్టీ మరోసారి విజయం దిశగా దూసుకెళ్లింది. ఈ విజయంతో ఆంథోనీ అల్బనీస్ మరో మూడేళ్లపాటు ఆస్ట్రేలియా ప్రధానమంత్రిగా కొనసాగనున్నారు. 21 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాలో వరుసగా రెండోసారి ఎన్నికల్లో గెలిచిన నేతగా అల్బనీస్ నిలవనున్నారు.

ప్రతిపక్ష కూటమి నేత పీటర్ డ్యూటన్ ఓటమిని అంగీకరించారు. అంతేకాకుండా, ఆయన తన సొంత సీటులో కూడా ఓటమిని చవిచూశారు. లిబరల్ పార్టీకి చెందిన పీటర్ డ్యూటన్ ఈ ఓటమికి పూర్తిగా తానే బాధ్యత వహిస్తున్నానని స్పష్టం చేశారు.

ఆస్ట్రేలియా ప్రతినిధుల సభలో మొత్తం 150 స్థానాలు ఉండగా, లేబర్ పార్టీ 81 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ప్రతిపక్ష కూటమి 35 స్థానాల్లోను, ఇతరులు 13 స్థానాల్లోను గెలుపునకు దగ్గరగా ఉన్నారు. మరో 21 స్థానాల్లో ఫలితాల సరళి ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు లెక్కించిన ఓట్లలో లేబర్ పార్టీకి 55.4 శాతం ఓట్లు లభించాయి. 

Mark Carney: కెనడా ప్రధానిగా మార్క్ కార్నీ

Published date : 06 May 2025 10:00AM

Photo Stories