ఆగష్టు 2019 వ్యక్తులు
Sakshi Education
ఏపీ ప్రభుత్వ సలహాదారుగా అమర్
జాతీయ మీడియా - అంతరాష్ట్ర వ్యవహారాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా సీనియర్ పాత్రికేయుడు, ఇండియన్ జర్నలిస్టు యూనియన్ (ఐజేయూ) అధ్యక్షుడు దేవులపల్లి అమర్ నియమితులయ్యారు. ఈ మేరకు సాధారణ పరిపాలన (రాజకీయ) శాఖ ముఖ్యకార్యదర్శి ఆర్పీ సిసోడియా ఆగస్టు 22న ఉత్తర్వులు జారీ చేశారు. పలు పత్రికల్లో, వివిధ హోదాల్లో పనిచేసిన అమర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా వ్యవహరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా నియామకం
ఎప్పుడు : ఆగస్టు 22
ఎవరు : దేవులపల్లి అమర్
కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా భల్లా
కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి అజయ్‌కుమార్ భల్లా ఆగస్టు 23న బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు ఈ పదవిలో ఉన్న రాజీవ్ గౌబా స్థానంలో భల్లా నియమితులయ్యారు. భల్లా నియామకానికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతలోని కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. దీంతో రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. 1984 అస్సాం-మేఘాలయ కేడర్‌కు చెందిన భల్లా గతంలో కేంద్ర విద్యుత్ కార్యదర్శిగా పనిచేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : ఆగస్టు 23
ఎవరు : అజయ్‌కుమార్ భల్లా
కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ అస్తమయం
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ అగ్రనేత, స్వతంత్ర భారతంలో అతిపెద్ద పన్ను సంస్కరణకు ఆద్యుడు అరుణ్ జైట్లీ (66) ఇకలేరు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. చికిత్స పొందుతూ ఢిల్లీలోని ఏయిమ్స్‌లో ఆగస్టు 24న కన్నుమూశారు. ఆగస్టు 25న ఢిల్లీలోని నిగమ్‌బోధ్ ఘాట్‌లో జైట్లీ భౌతికకాయానికి అంత్యక్రియలు జరిగాయి.
ఢిల్లీలో 1952, డిసెంబర్ 28న మహరాజ్ కిషన్ జైట్లీ, రతన్ ప్రభ దంపతులకు అరుణ్ జైట్లీ జన్మించారు. ఆయన తండ్రికి ఢిల్లీలో పేరు ప్రఖ్యాతులున్న న్యాయవాదిగా గుర్తింపుఉంది. చిన్నప్పటి నుంచి చర్చాగోష్టుల్లో పాల్గొనటాన్ని ఇష్టపడే అరుణ్ జైట్లీ ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ చేశారు. 1975లో అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా విద్యార్థి నాయకుడిగా ఉద్యమంలో పాల్గొన్నారు. దాదాపు 19 నెలలు జైల్లో ఉన్నారు. 1980లో జనసంఘ్(బీజేపీ)లో చేరారు. పార్టీ తరఫున ఎన్నో కేసులు వాదించారు. న్యాయపరమైన అంశాలపై ఎన్నో పుస్తకాలను రాశారు.
లోక్‌సభకు ఎన్నిక కాలేదు...
ఎంతో రాజకీయ అనుభవం ఉన్న జైట్లీ ప్రత్యక్ష ఎన్నికల్లో ఎప్పుడూ నెగ్గలేదు. ఒక్కసారీ లోక్‌సభకు ఎన్నిక కాలేదు. అమృత్‌సర్ నియోజకవర్గం నుంచి ఒకే ఒక్కసారి పోటీ చేసినా కాంగ్రెస్ అభ్యర్థి అమరీందర్ సింగ్‌ను ఎదుర్కోలేక ఓడిపోయారు. ఆయన ప్రతిభను గుర్తించిన బీజేపీ అధిష్టానం రాజ్యసభకు పంపి ఆయన సేవలను వినియోగించుకుంది.
జైట్లీ పదవుల ప్రస్థానం
ఏమిటి : కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత
ఎప్పుడు : ఆగస్టు 24
ఎవరు : అరుణ్ జైట్లీ (66)
ఎక్కడ : ఎయిమ్స్, ఢిల్లీ
ఎందుకు : అనారోగ్యం కారణంగా
జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా లోకేష్‌కుమార్
హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (జీహెచ్‌ఎంసీ) కమిషనర్‌గా రంగారెడ్డి జిల్లా ప్రస్తుత కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఆగస్టు 26న ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో దాదాపు ఏడాదిగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ పదవితోపాటు జల మండలి ఇన్‌చార్జి ఎండీగా ఉన్న దానకిశోర్, ఇకపై జలమండలి ఎండీ బాధ్యతలకే పరిమితం కానున్నారు.
లోకేష్‌కుమార్‌ను జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా నియమించడంతో రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.హరీష్‌కు కలెక్టర్‌గా అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా నియామకం
ఎప్పుడు : ఆగస్టు 26
ఎవరు : డీఎస్ లోకేష్‌కుమార్
మన్మోహన్‌కు ఎస్పీజీ భద్రత ఉపసంహరణ
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ప్రస్తుతం అందిస్తున్న స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) భద్రతను కేంద్రప్రభుత్వం ఉపసంహరించింది. దీనికి బదులుగా ఆయనకు జెడ్ ప్లస్ సెక్యూరిటీని కల్పిస్తూ కేంద్ర హోం శాఖ ఆగస్టు 26న ఆదేశాలు జారీ చేసింది. దేశంలోని ప్రముఖుల భద్రతను సమీక్షించే విభాగం నివేదికల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోం శాఖ వెల్లడించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఎస్పీజీ భద్రత ఉపసంహరణ
ఎప్పుడు : ఆగస్టు 26
ఎవరు : కేంద్రప్రభుత్వం
ఏపీ మహిళా కమిషన్ చైర్మన్‌గా వాసిరెడ్డి పద్మ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా వాసిరెడ్డి పద్మ ఆగస్టు 26న ప్రమాణ స్వీకారం చేశారు. తాడేపల్లిలో ఆగస్టు 26న జరిగిన కార్యక్రమంలో పద్మ చేత రాష్ట్ర మహిళా, శిశు, సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత పమాణ స్వీకారం చేయించారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా వాసిరెడ్డి పద్మను కేబినెట్ హోదాతో ప్రభుత్వం నియమించింది. పద్మ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి పాల్గొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా ప్రమాణస్వీకారం
ఎప్పుడు : ఆగస్టు 26
ఎవరు : వాసిరెడ్డి పద్మ
ఎక్కడ : తాడేపల్లి, ఆంధ్రప్రదేశ్
తొలి మహిళా డీజీపీ కాంచన్ చౌదరి కన్నుమూత
దేశంలో తొలి మహిళా డీజీపీ కాంచన్ చౌదరి భట్టాచార్య (72) దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఆగస్టు 26న ముంబైలోని ఓ ఆస్పత్రిలో కన్నుమూశారు. 1973 ఐపీఎస్ బ్యాచ్ అధికారి అయిన కాంచన్ దేశంలో తొలి మహిళా డీజీపీగా ఎంపికై చరిత్ర సృష్టించారు. కిరణ్ బేడీ తరువాత దేశంలో రెండో మహిళా ఐపీఎస్ అధికారిగా నిలిచారు. హిమాచల్ ప్రదేశ్‌లో జన్మించిన కాంచన్ 2004 నుంచి 2007 అక్టోబర్ 31 వరకు ఉత్తరాఖండ్ డీజీపీగా పని చేశారు. సీఐఎస్‌ఎఫ్ అధిపతిగానూ పనిచేశారు. 33 ఏళ్ల వృత్తి జీవితంలో పలు సమస్యాత్మక కేసులను ఆమె పరిష్కరించారు. జాతీయ బ్యాడ్మింటన్ చాంిపియన్ సయ్యద్ మోదీ హత్యతోపాటు రిలయన్స్-బాంబే డైయింగ్ కేసులు ఇందులో ఉన్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తొలి మహిళా డీజీపీ కన్నుమూత
ఎప్పుడు : ఆగస్టు 26
ఎవరు : కాంచన్ చౌదరి భట్టాచార్య (72)
ఎక్కడ : ముంబై, మహారాష్ట్ర
ఎందుకు : అనారోగ్యం కారణంగా
తొలి మహిళా ఫ్లయిట్ కమాండర్‌గా ధామీ
వింగ్ కమాండర్ షలీజా ధామీ భారత వాయుసేనలో ఫ్లయింగ్ యూనిట్ ఫ్లయిట్ కమాండర్ హోదా సంపాదించారు. దీంతో ఈ బాధ్యతలు స్వీకరించనున్న తొలి మహిళా కమాండర్‌గా ధామీ నిలవనుంది. హెలికాప్టర్లను నడపడంలో 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న ధామీ.. తొలి మహిళా ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్‌గా కూడా గుర్తింపు పొందింది. అలాగే శాశ్వత ప్రాతిపదికన ఎయిర్‌ఫోర్స్ ఫ్లయింగ్ విభాగంలో చేరిన తొలి మహిళగా రికార్డులకెక్కింది. పంజాబ్‌లోని లూథియానా ధామీ స్వస్థలం. 1994లో మహిళలను మొదటిసారి ఐఏఎఫ్‌లోకి అనుమతించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత వాయుసేనలో తొలి ఫ్లయింగ్ యూనిట్ ఫ్లయిట్ కమాండర్
ఎప్పుడు : ఆగస్టు 28
ఎవరు : వింగ్ కమాండర్ షలీజా ధామీ
పీఎంఎల్‌ఏ ట్రైబ్యునల్ ఛైర్‌పర్సన్‌గా జస్టిస్ గౌర్
నగదు అక్రమ చలామణి చట్టం (పీఎంఎల్‌ఏ) అప్పీలేట్ ట్రైబ్యునల్ ఛైర్‌పర్సన్‌గా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సునీల్ గౌర్ నియమితులయ్యారు. 2019, 23న ఆయన పద వి బాధ్యతలు చేపట్టనున్నారు. 2008లో ఢిల్లీ హైకోర్డు న్యాయమూర్తిగా నియమితులైన గౌర్.. చాలా కేసులను విజయవంతంగా పూర్తిచేశారు. తాజాగా ఐఎన్‌ఎక్స్ మీడియా కేసుల్లో, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం ముందస్తు బెయిల్ పిటిషన్లను గౌర్ తిరస్కరించారు. 2019, ఆగస్టు 23న పదవీ విరమణ పొందడానికి 48 గంటల ముందే చిదంబరం బెయిల్ పిటిషన్లను తిరస్కరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నగదు అక్రమ చలామణి చట్టం (పీఎంఎల్‌ఏ) అప్పీలేట్ ట్రైబ్యునల్ ఛైర్‌పర్సన్‌గా నియామకం
ఎప్పుడు : ఆగస్టు 28
ఎవరు : జస్టిస్ సునీల్ గౌర్
ఏపీలో ట్రాఫిక్ వాట్సాప్ నంబర్ విడుదల
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి వాహనాలను నడిపేవారిని పౌరులే గుర్తించి ప్రభుత్వానికి పట్టించేందుకు వీలుగా వాట్సాప్ నంబరు 9542800800ను ఆంధ్రప్రదేశ్ రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) విడుదల చేశారు. విజయవాడలోని రవాణా శాఖ కమిషనరేట్‌లో ఆగస్టు 28న నిర్వహించిన కార్యక్రమంలో ఈ వాట్సాప్ నంబర్‌ను మంత్రి ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ట్రాఫిక్ నిబంధనలను ఎవరైనా అతిక్రమిస్తే.. స్పష్టంగా ఫొటో తీసి వాట్సాప్ నంబరుకు పంపితే నేరుగా వారి ఇంటికే జరిమానా చలానా పంపేలా ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. రహదారి భద్రతకు రూ.50 కోట్లు కేటాయించామన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ట్రాఫిక్ వాట్సాప్ నంబర్ విడుదల
ఎప్పుడు : ఆగస్టు 28
ఎవరు : ఆంధ్రప్రదేశ్ రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)
ఎక్కడ : విజయవాడ, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి వాహనాలను నడిపేవారిని పౌరులే గుర్తించి ప్రభుత్వానికి పట్టించేందుకు వీలుగా
మాజీ క్రికెటర్ వీబీ చంద్రశేఖర్ కన్నుమూత
భారత మాజీ క్రికెటర్, తమిళనాడు క్రికెట్‌కు సుదీర్ఘ కాలం మూలస్తంభంలా నిలిచిన వక్కడై బిశ్వేశ్వరన్ (వీబీ) చంద్రశేఖర్(58) గుండెపోటు కారణంగా ఆగస్టు 15న చెన్నైలో కన్నుమూశారు. 1988-90 మధ్య భారత్ తరఫున 7 వన్డేలు ఆడిన చంద్రశేఖర్ మొత్తం 88 పరుగులు చేశాడు. దేశవాళీ క్రికెట్లో తమిళనాడు జట్టు తరఫున 4,999 పరుగులు చేశాడు. తమిళనాడు ఓపెనర్‌గా చిరస్మరణీయ ఇన్నింగ్‌స ఆడిన వీబీ 81 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 43.09 సగటుతో 4,999 పరుగులు సాధించారు. 1988-89 ఇరానీ కప్ మ్యాచ్‌లో 56 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. రిటైర్మెంట్ అనంతరం 2012లో తమిళనాడు కోచ్‌గా, భారత సెలక్టర్‌గా పనిచేశారు. కామెంటేటర్‌గానూ గుర్తింపు తెచ్చుకున్న చంద్రశేఖర్ ప్రస్తుతం చెన్నైలో సొంత క్రికెట్ అకాడమీ నిర్వహిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత మాజీ క్రికెటర్ కన్నుమూత
ఎప్పుడు : ఆగ స్టు 15
ఎవరు : బిశ్వేశ్వరన్ (వీబీ) చంద్రశేఖర్(58)
ఎక్కడ : చెన్నై, తమిళనాడు
ఎందుకు : గుండెపోటుకారణంగా
ఎల్‌బ్రూస్‌ను అధిరోహించిన భారతీయుడు
ఐరోపా ఖండంలోని ఎల్‌బ్రూస్ పర్వతాన్ని విజయనగరం జిల్లాకి చెందిన గిరిజన యువకుడు ఆర్.సుదర్శనరాయుడు అధిరోహించాడు. ఆగస్టు 11న యాత్రను ప్రారంభించి, 5642 మీటర్ల ఎత్తు గల ఎల్‌బ్రూస్‌పైకి ఆగస్టు 15న చేరినట్లు సుదర్శనరాయుడు తెలిపారు. విజయనగరం జిల్లా కొమరాడ మండలానికి చెందిన 24 ఏళ్ల రాయుడు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వ్యాయామ విద్యలో స్నాతకోత్తర విద్యను అభ్యసిస్తున్నాడు. 2018లో కిల్లిమంజారో శిఖరాన్ని అధిరోహించే బృందంలో సభ్యునిగా ఎంపికై సాహస యాత్రను విజయవంతంగా ముగించాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎల్‌బ్రూస్ పర్వతాన్ని అధిరోహించిన భారతీయుడు
ఎప్పుడు : ఆగ స్టు 15
ఎవరు : ఆర్.సుదర్శనరాయుడు
తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా వినోద్
తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు నియామక ఉత్తర్వులను సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆగస్టు 16న ప్రగతిభవన్‌లో వినోద్‌కు అందజేశారు. దీంతో కేబినెట్ మంత్రి హోదాలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా మూడేళ్ల పాటు వినోద్ పదవిలో కొనసాగనున్నారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా నియామకం
ఎప్పుడు : ఆగస్టు 16
ఎవరు : మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్
జన ప్రణవం గ్రంథం ఆవిష్కరణ
ప్రముఖ పాత్రికేయుడు పసుపులేటి వెంకటరమణ రచించిన ‘జన ప్రణవం’ గ్రంథాన్ని ఏపీ సీఎం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆగస్టు 17న హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర వివరాలను రెండు భాగాలు గ్రంథస్తం చేయగా.. భాగం-1ను సజ్జల రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు. ప్రజా సంక్షేమానికి నవరత్నాలు ఆయువుపట్టని, పాదయాత్రలో ప్రజల అవసరాలను గుర్తించిన వైఎస్ జగన్.. నవరత్నాలను ప్రవేశపెట్టారని ఈ సందర్భంగా సజ్జల చెప్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జన ప్రణవం గ్రంథం ఆవిష్కరణ
ఎప్పుడు : ఆగస్టు 17
ఎవరు : ఏపీ సీఎం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి
ఎక్కడ : హైదరాబాద్
బిహార్ మాజీ సీఎం జగన్నాథ్ కన్నుమూత
బిహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా(82) కన్నుమూశారు. గత కొంత కాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆగస్టు 19న తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి సంతాప సూచకంగా బిహార్ ప్రభుత్వం మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. బిహార్ విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్‌లో ఆచార్యుడిగా విధులు నిర్వర్తించిన జగన్నాథ్ మిశ్రా మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. పీవీ నర్సింహరావు కాలంలో కేంద్ర మంత్రిగానూ సేవలందించారు. తొలుత కాంగ్రెస్‌లో చేరిన ఆయన తర్వాత ఎన్సీపీలో చేరారు. తర్వాత జేడీయూలోనూ కొంతకాలం కొనసాగారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బిహార్ మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత
ఎప్పుడు : ఆగస్టు 19
ఎవరు : జగన్నాథ్ మిశ్రా(82)
ఎందుకు : కేన్సర్ కారణంగా
రాజ్యసభకు మన్మోహన్ సింగ్ ఎన్నిక
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజస్తాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజస్తాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన మదన్‌లాల్ షైనీ మృతితో ఆ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ పార్టీ తరఫున మన్మోహన్ నామినేషన్ దాఖలు చేశారు. నిర్దేశిత గడువులోపు మన్మోహన్ నామినేషన్ ఒక్కటే దాఖలవడంతో ఆయన ఎన్నికై నట్లు ఎన్నికల అధికారులు ఆగస్టు 19న ప్రకటించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రాజస్తాన్ నుంచి రాజ్యసభకు ఎన్నిక
ఎప్పుడు : ఆగస్టు 19
ఎవరు : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్
సంగీత దర్శకుడు ఖయ్యాం కన్నుమూత
బాలీవుడ్‌కి చెందిన ప్రముఖ సంగీత దర్శకుడు, పద్మభూషణ్ గ్రహీత మొహమ్మద్ జహుర్ ఖయ్యాం హష్మి(93) కన్నుమూశారు. కొన్నేళ్లుగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆయన కార్డియాక్ అరెస్ట్(గుండె ఆగిపోవడం)తో ఆగస్టు 19న ముంబైలోని ఓ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. 17 ఏళ్లకే సంగీత ప్రయాణం ప్రారంభించిన ఖయ్యాం ఉమ్రావ్ జాన్, కభీకభీ వంటి సినిమాలకు సంగీతం అందించారు. ఉమ్రావ్ జాన్ సినిమాకు అందించిన సంగీతానికిగాను జాతీయ అవార్డు లభించింది. 2007లో సంగీత నాటక అకాడమి అవార్డును ఖయ్యాం అందుకున్నారు. 2011లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో ఆయనను సత్కరించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బాలీవుడ్‌కి చెందిన ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత
ఎప్పుడు : ఆగస్టు 19
ఎవరు : మొహమ్మద్ జహుర్ ఖయ్యాం హష్మి(93)
ఎక్కడ : ముంబై, మహారాష్ట్ర
ఎందుకు : కార్డియాక్ అరెస్ట్(గుండె ఆగిపోవడం)తో
మధ్యప్రదేశ్ మాజీ సీఎం బాబులాల్ కన్నుమూత
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, భాజపా సీనియర్ నేత బాబులాల్ గౌర్(89) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆగస్టు 21న గుండెపోటు రావడంతో భోపాల్‌లోని ఓ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌ఘర్‌లో 1930, జూన్ 2న జన్మించిన బాబులాల్ కార్మిక సంఘాల నేతగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. జనతా పార్టీ సహకారంతో మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం బీజేపీలో చేరారు. గోవింద్‌పురా నుంచి 10సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004 నుంచి 2005 వరకు మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత
ఎప్పుడు : ఆగస్టు 20
ఎవరు : బాబులాల్ గౌర్(89)
ఎక్కడ : భోపాల్, మధ్యప్రదేశ్
ఎందుకు : గుండెపోటు రావడంతో
యూఎస్ కాన్సులేట్ జనరల్‌గా జోయల్
హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ నూతన కాన్సుల్ జనరల్‌గా జోయల్ రిఫ్మాన్ ఆగస్టు 21న బాధ్యతలు స్వీకరించారు. కేథరిన్ హడ్డా స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు బంగ్లాదేశ్‌లోని ఢాకాలో ఉన్న యూఎస్ ఎంబసీలో డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్‌గా జోయల్ పనిచేశారు. గతంలో వాషింగ్టన్ డీసీలో బ్యూరో ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ రీసెర్చ్‌లో సీనియర్ లైజన్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించారు. పలు దేశాల్లో అమెరికా తరఫున వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ నూతన కాన్సుల్ జనరల్‌గా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : ఆగస్టు 21
ఎవరు : జోయల్ రిఫ్మాన్
పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ సీఎండీగా కె. శ్రీకాంత్
ప్రభుత్వ రంగ విద్యుత్ పంపిణీ సంస్థ, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ (సీఎండీ)గా కె. శ్రీకాంత్ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ విషయాన్ని సంస్థ ఆగస్టు 21న ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది. కంపెనీ ఫైనాన్స్ విభాగ డెరైక్టర్ హోదాలో పనిచేసిన శ్రీకాంత్‌కు విద్యుత్ రంగంలో 33 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉందని తెలిపింది. క్యాపిటల్ బడ్జెటింగ్ రూపకల్పన, దీర్ఘకాలిక ఫైనాన్స్ ప్లానింగ్, వనరుల సమీకరణ వంటి అంశాల్లో మంచి పట్టు సాధించారని పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ (సీఎండీ)గా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : ఆగస్టు 21
ఎవరు : కె. శ్రీకాంత్
కేంద్ర కేబినెట్ కార్యదర్శిగా రాజీవ్ గౌబా
కేంద్ర కేబినెట్ తదుపరి కార్యదర్శిగా కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా నియమితులయ్యారు. ఈ మేరకు ఆగస్టు 21న కేబినెట్ నియామకాల కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రెండేళ్ల పాటు కేబినెట్ కార్యదర్శిగా రాజీవ్ పదవిలో కొనసాగనున్నారు. ఆగస్టు 30న ప్రస్తుతం కేంద్ర కేబినెట్ కార్యదర్శిగా ప్రదీప్ కుమార్ సిన్హా స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కేంద్ర కేబినెట్ కార్యదర్శిగా నియామకం
ఎప్పుడు : ఆగస్టు 21
ఎవరు : రాజీవ్ గౌబా
మలబార్ గోల్డ్ బ్రాండ్ అంబాసిడర్‌గా అనిల్
ప్రముఖ వజ్రాభరణాల సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్‌సకు బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ నియమితులయ్యారు. మలబార్ ప్రామిసెస్ పేరిట తర్వలోనే విడుదలకానున్న వాణిజ్య ప్రకటనల్లో అనిల్ దర్శనమివ్వనున్నారని సంస్థ చైర్మన్ అహ్మద్ ఆగస్టు 8న తెలిపారు. కరీనా కపూర్ ఖాన్, తమన్నా, మానుషీ చిల్లర్ వంటి వారు ఇప్పటికే ఈ సంస్థ ప్రచారకర్తలుగా ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మలబార్ గోల్డ్ అండ్ డైమండ్‌సకు బ్రాండ్ అంబాసిడర్‌గా నియామకం
ఎప్పుడు : ఆగ స్టు 8
ఎవరు : బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్
ఇండియన్ ఆయిల్ ఈడీగా అరూప్ సిన్హా
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) దక్షిణ ప్రాంత ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్(ప్రాంతీయ సేవలు)గా అరూప్ సిన్హా ఆగస్టు 8న బాధ్యతలు స్వీకరించారు. తమిళనాడు, పుదుచ్ఛేరి, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళలకు సంబంధించిన మానవ వనరులు, ఆర్థిక, ఉత్పత్తి రవాణా, కాంట్రాక్టులు, భద్రత, నాణ్యత నియంత్రణ వంటి పలు బాధ్యతలను ఆయన నిర్వర్తించనున్నారు. యూనివర్సిటీ ఆఫ్ లఖ్‌నవూ నుంచి మేనేజ్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్‌ను అరూప్ పూర్తిచేశారు. ఇండియన్ ఆయిల్‌లో హెచ్‌ఆర్ విధాన రూపకర్తగా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన ఉద్యోగులకు ఇ-లెర్నింగ్ ప్లాట్‌ఫాం వంటి పలు నియామక, శిక్షణ కార్యక్రమాల్లో సేవలు అందించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇండియన్ ఆయిల్ ఈడీగా నియామకం
ఎప్పుడు : ఆగ స్టు 8
ఎవరు : అరూప్ సిన్హా
జయహో పుస్తకాన్ని ఆవిష్కరించిన జగన్
సీనియర్ పాత్రికేయుడు కొండుభట్ల రామచంద్రమూర్తి రచించిన ‘జయహో’ పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ది ప్రింట్ ఎడిటర్ ఇన్‌చీఫ్, పద్మభూషణ్ పురస్కార గ్రహీత శేఖర్ గుప్తా ఆవిష్కరించారు. ఎమెస్కో ఆధ్వర్యంలో ఆగస్టు 12న తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో పుస్తకావిష్కరణ సభను నిర్వహించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రపై జయహో పుస్తకాన్ని రూపొందించారు. పుస్తకావిష్కరణ సందర్భంగా సీఎం జగన్ మట్లాడుతూ... ప్రతిపక్ష నేతగా ఉండగా తాను చేపట్టిన 3,648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర ప్రజలకు ధైర్యాన్నిచ్చిందన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జయహో పుస్తకావిష్కరణ
ఎప్పుడు : ఆగస్టు 12
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ది ప్రింట్ ఎడిటర్ ఇన్‌చీఫ్ శేఖర్ గుప్తా
ఎక్కడ : అమరావతి, ఆంధ్రప్రదేశ్
ఫిజీ సుప్రీంకోర్టు జడ్జీగా జస్టిస్ లోకూర్
ఫిజీ దేశ సుప్రీంకోర్టులో నాన్‌రెసిడెంట్ ప్యానల్ జడ్జిగా భారత సుప్రీంకోర్టు జడ్జిగా సేవలందించిన జస్టిస్(విశ్రాంత) మదన్ బి.లోకూర్ ఆగస్టు 12న ప్రమాణస్వీకారం చేశారు. లోకూర్‌తో ఫిజీ అధ్యక్షుడు జియోజీ కొన్‌రోటే ప్రమాణస్వీకారం చేయించారు. ఫిజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా లోకూర్ మూడేళ్లపాటు కొనసాగనున్నారు. ఒక భారత జడ్జి మరోదేశ సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి. గతంలో తెలుగురాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగానూ ఆయన పనిచేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఫిజీ దేశ సుప్రీంకోర్టులో నాన్‌రెసిడెంట్ ప్యానల్ జడ్జిగా ప్రమాణస్వీకారం
ఎప్పుడు : ఆగస్టు 12
ఎవరు : జస్టిస్(విశ్రాంత) మదన్ బి.లోకూర్
అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా యార్లగడ్డ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ను రెండేళ్ల కాలానికి నియమిస్తూ రాష్ట్ర సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.ప్రవీణ్‌కుమార్ ఆగస్టు 13న ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో అధికార కార్యకలాపాల నిమిత్తం, అధికార భాష తెలుగును పరిపాలనలో విస్తృతంగా ఉపయోగించడానికి చర్యలు చేపట్టేందుకు సంఘం అధ్యక్షుడికి అధికారం ఉంటుంది. అలాగే పరిపాలనలో తెలుగు వాడుక ప్రగతి సమీక్షించి ప్రభుత్వానికి సూచనలు, సిఫారసులు చేసే అధికారం కూడా ఉంటుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా నియామకం
ఎప్పుడు : ఆగస్టు 13
ఎవరు : యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
ఏపీ పూర్తిస్థాయి డీజీపీగా గౌతమ్ సవాంగ్
ఆంధ్రప్రదేశ్ పూర్తిస్థాయి డీజీపీగా గౌతమ్ సవాంగ్‌ను నియమిస్తూ ఆగస్టు 13న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు డీజీపీగా అదనపు బాధ్యతలు నిర్వర్తించిన ఆయన ఇకపై అన్ని పోలీసు బలగాలకు బాస్‌గా వ్యవహరిస్తారు. 1986 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన సవాంగ్ జూన్ 1న ఆర్.పి.ఠాకూర్ స్థానంలో ఏపీ డీజీపీగా అదనపు బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఏపీ కేడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్‌ల జాబితాను వైఎస్ జగన్ సర్కారు కేంద్ర హోంశాఖ పరిధిలోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ)కు పంపించింది. ఆగస్టు 1వ తేదీన సమావేశమైన యూపీఎస్‌సీ ఎంప్యానల్ కమిటీ.. ఏపీ డీజీపీ నియామకంపై చేసిన సిఫారసు మేరకు రాష్ట్ర ప్రభుత్వం సవాంగ్‌ను పూర్తిస్థాయి డీజీపీగా నియమించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ పూర్తిస్థాయి డీజీపీగా నియామకం
ఎప్పుడు : ఆగస్టు 13
ఎవరు : గౌతమ్ సవాంగ్
జ్ఞానపీఠ్ సలహా కమిటీ కన్వీనర్‌గా సుబ్బారావు
భారతీయ జ్ఞానపీఠ్ తెలుగు భాషా సలహా కమిటీ కన్వీనర్‌గా ప్రముఖ సాహితీవేత్త డా. చందూ సుబ్బారావు నియమితులయ్యారు. అలాగే కమిటీ సభ్యులుగా సీనియర్ జర్నలిస్టు, ఆంధ్రజ్యోతి అసోసియేట్ ఎడిటర్ ఎ.కృష్ణారావు, రచయిత వెన్నా వల్లభ్‌రావు నియమితులయ్యారు. వచ్చే 3 సంవత్సరాలకు జ్ఞానపీఠ్, మూర్తిదేవి పురస్కారాల గ్రహీతలను ఎంపిక చేసేందుకు జ్ఞానపీఠ్ సంస్థ ఆగస్టు 13న భాషల వారీగా కమిటీలను ఏర్పాటు చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారతీయ జ్ఞానపీఠ్ తెలుగు భాషా సలహా కమిటీ కన్వీనర్‌గా నియామకం
ఎప్పుడు : ఆగస్టు 13
ఎవరు : డా. చందూ సుబ్బారావు
ఎఫ్‌ఏఎన్‌ఎస్ సభ్యురాలిగా ఆర్ హేమలత
ఆసియా పోషకాహార సంఘాల సమాఖ్య (ఎఫ్‌ఏఎన్‌ఎస్) కార్యనిర్వాహక మండలి సభ్యురాలిగా జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్) సంచాలకురాలు డా.ఆర్.హేమలత నియమితులయ్యారు. 2023 వరకు ఆమె పదవిలో కొనసాగుతారని ఎఫ్‌ఏఎన్‌ఎస్ ఆగస్టు 14న తెలిపింది. మండలి సభ్యురాలిగా.. పోషకాహార విభాగంలో పరిశోధన, శిక్షణ, సభ్య దేశాల్లో అవగాహన కార్యక్రమాల నిర్వహణలో హేమలత పాల్గొనాల్సి ఉంటుంది. ఇండోనేసియాలోని బాలిలో తాజాగా జరిగిన సమావేశంలో నూతన సభ్యులను నియమించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎఫ్‌ఏఎన్‌ఎస్ కార్యనిర్వాహక మండలి సభ్యురాలిగా నియామకం
ఎప్పుడు : ఆగస్టు 14
ఎవరు : డా.ఆర్.హేమలత
కిలిమంజారోని అధిరోహించిన పుణె బాలుడు
ఆఫ్రికాలోనే అత్యంత ఎత్తై పర్వతం అయిన కిలిమంజారోని పుణెకు చెందిన అద్విత్ భాటియా అనే బాలుడు అధిరోహించాడు. శిక్షకుడు సమీర్ పథం సారథ్యంలో 9 ఏళ్ల అద్విత్ జూలై 31న కిలిమంజారోని అధిరోహించినట్లు బాలుడి తల్లి పాయల్ వెల్లడించింది. ఆక్సిజన్ స్థాయి 50 శాతానికి పడిపోవడం, మైనస్ 25 డిగ్రీల ఉష్ణోగ్రతా పరిస్థితులు సవాలుగా నిలిచాయని అద్విత్ అన్నాడు. కిలిమంజారో పర్వతం సుమద్ర మట్టానికి 19,341 ఫీట్ల ఎత్తులో ఉంది.
బిన్ లాడెన్ కుమారుడు హమ్జా హతం
ఒసామా బిన్ లాడెన్ కుమారుడు, అల్‌కాయిదా కీలక నేత హమ్జా బిన్ లాడెన్ వైమానిక దాడుల్లో హతమైనట్లు అమెరికా అధికారులు జూలై 31న వెల్లడించారు. హమ్జా మరణించినట్లు ముగ్గురు అమెరికా అధికారులు స్పష్టం చేశారని, అయితే ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందనే విషయాలను వారు వెల్లడించలేదని ఎన్‌బీసీ న్యూస్ పేర్కొంది. అల్‌కాయిదాలో కీలక నేతగా ఎదుగుతున్న హమ్జాను పట్టించిన వారికి దాదాపు రూ.7 కోట్లు బహుమతిగా ఇస్తామని 2019 ఫిబ్రవరిలో అమెరికా ప్రకటించడానికి ముందే అతడు మరణించినట్లు ఎన్‌బీసీ, న్యూయార్క్ టైమ్స్ కథనాలను బట్టి తెలుస్తోంది.
లాడెన్ 20 మంది సంతానంలో 15వ కుమారుడైన హమ్జా.. లాడెన్ మూడో భార్య కొడుకు. హమ్జాకు 30 ఏళ్ల వయసున్నట్లు భావిస్తున్నారు. జిహాద్‌కు పట్టపు యువరాజుగా పేర్కొంటున్న హమ్జా.. అమెరికాపై దాడులు చేయాల్సిందిగా తరచూ వీడియోలు, ఆడియోల రూపంలో పిలుపునిస్తూ ఉండేవాడు. లాడెన్‌ను 2011లో మట్టుబెట్టిన అనంతరం అతడి ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న ఫైళ్ల ఆధారంగా అల్‌కాయిదాను ముందుండి నడిపేందుకు హమ్జాను జాగ్రత్తగా పెంచుతున్నట్లు అమెరికా అధికారులు గుర్తించారు.
పాకిస్తాన్‌లో భారతీయుడి అరెస్ట్
దేశంలో గూఢచర్యానికి పాల్పడుతున్నాడనే ఆరోపణలపై పాకిస్తాన్ రాజు లక్ష్మణ్ అనే భారతీయుడిని అరెస్ట్‌చేసింది. అతడిని పంజాబ్ ప్రావిన్స్ లోని డేరా ఘాజీ ఖాన్ జిల్లాలోని రాఖీగజ్ ప్రాంతంలో అరెస్ట్ చేసినట్లు పాక్ పోలీసులు వెల్లడించారు.ఇతర వివరాలు రాబట్టేందుకు లక్ష్మణ్‌ను పోలీసులు గుర్తుతెలియని ప్రాంతానికి తరలించారు. బెలూచిస్తాన్ ప్రావిన్స్ నుంచి డేరా ఘాజీ ఖాన్ జిల్లాలోకి లక్ష్మణ్ ప్రవేశిస్తుండగా అరెస్ట్ చేసినట్లు ఆగస్టు 1 పోలీసులు పేర్కొన్నారు.
గూఢచర్యానికి పాల్పడ్డారనే ఆరోపణలపై గతంలో భారత మాజీ నేవీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌ను బెలూచిస్తాన్ ప్రాంతంలోనే పాక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గూఢచర్యానికి పాల్పడుతున్నాడనే ఆరోపణలపై రాజు లక్ష్మణ్ అనే భారతీయుడు అరెస్ట్
ఎప్పుడు : ఆగస్టు 1
ఎవరు : పాకిస్తాన్ పోలీసులు
ఎక్కడ : రాఖీగజ్ ప్రాంతం, డేరా ఘాజీ ఖాన్ జిల్లా, పంజాబ్ ప్రావిన్స్, పాకిస్తాన్
నటన శిక్షకుడు దేవదాస్ కనకాల ఇకలేరు
సీనియర్ నటుడు, నటన శిక్షకుడు దేవదాస్ కనకాల (75) ఇకలేరు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో ఆగస్టు 2న కన్నుమూశారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శివారులోని కనకాలపేటలో 1945 జూలై 30న కనకాల పాపయ్య నాయుడు, మహాలక్ష్మమ్మ దంపతులకు దేవదాస్ జన్మించారు. దేవదాస్ తండ్రి పాపయ్య.. ఫ్రెంచి పాలనలో ఉన్నప్పుడు యానాం ఎమ్మెల్యేగా పనిచేశారు.
నటుడిగా, శిక్షకుడిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న దేవదాస్ కనకాల చలిచీమలు, నాగమల్లి సినిమాలకు దర్శకత్వం వహించారు. సిరిసిరిమువ్వ, గోరింటాకు, మంచుపల్లకి, గ్యాంగ్ లీడర్, భరత్ అనే నేను తదితర చిత్రాల్లో నటించారు. హైదరాబాద్‌లో యాక్టింగ్ ఇనిస్టిట్యూట్‌ను ఏర్పాటుచేసి నటనలో శిక్షణనిచ్చారు. రజనీకాంత్, చిరంజీవి, రాజేంద్రప్రసాద్, శుభలేఖ సుధాకర్, భానుచందర్, రఘువరన్, నాజర్, తదితర ప్రముఖులు దేవదాస్ శిష్యులే. ఆయన కుమారుడు రాజీవ్ కనకాల, కోడలు సుమ చిత్ర పరిశ్రమలో గుర్తింపు సంపాదించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సీనియర్ నటుడు, నటన శిక్షకుడు కన్నుమూత
ఎప్పుడు : ఆగస్టు 2
ఎవరు : దేవదాస్ కనకాల (75)
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : అనారోగ్యం కారణంగా
కిష్కింధకాండ పుస్తకం ఆవిష్కరణ
తెలంగాణ ముఖ్యమంత్రి ప్రధాన ప్రజా సంబంధాల అధికారి వనం జ్వాలా నరసింహారావు రాసిన ‘కిష్కింధ కాండ’పుస్తకాన్ని రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి ఆవిష్కరించారు. హైదరాబాద్‌లో ఆగస్టు 4న పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ ఆధ్యాత్మిక పత్రికలో జ్వాలా నరసింహారావు రాయగా ధారావాహికంగా ప్రచురితమైన ‘కిష్కింధకాండ’పుస్తకాన్ని డీజీపీ ఆవిష్కరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కిష్కింధకాండ పుస్తకం ఆవిష్కరణ
ఎప్పుడు : ఆగస్టు 4
ఎవరు : తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి
ఎక్కడ : హైదరాబాద్
బ్యాడ్మింటన్ కోచ్ సుధాకర్‌రెడ్డి కన్నుమూత
ప్రముఖ సీనియర్ బ్యాడ్మింటన్ కోచ్ గుజ్జుల సుధాకర్‌రెడ్డి గుండెపోటు కారణంగా కన్నుమూశారు. బీడబ్ల్యూఎఫ్ సీనియర్ ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో పాల్గొనేందుకు పోలెండ్‌లో వెళ్లిన ఆయన సాధన అనంతరం గుండెపోటు రావడంతో కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందారు. గుంటూరుకి చెందిన సుధాకర్‌రెడ్డి ప్రస్తుతం నెల్లూరు స్పోర్‌ట్స అథారిటీలో బ్యాడ్మింటన్ కోచ్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్, అతని సోదరుడు నందగోపాల్ సుధాకర్‌రెడ్డి దగ్గరే శిక్షణ తీసుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రముఖ సీనియర్ బ్యాడ్మింటన్ కోచ్ క న్నుమూత
ఎప్పుడు : ఆగస్టు 5
ఎవరు : గుజ్జుల సుధాకర్‌రెడ్డి
ఎక్కడ : పోలెండ్
ఎందుకు : గుండెపోటు కారణంగా
టెస్టు క్రికెట్‌కు డేల్ స్టెయిన్ వీడ్కోలు
ఆధునిక క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన పేసర్లలో ఒకడైన డేల్ స్టెయిన్ టెస్టు ఫార్మాట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. వరుస గాయాలతో ఇబ్బందిపడుతున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆగస్టు 5న ప్రకటించాడు. ఇక వన్డే, టీ20ల్లో మరింత ఎక్కువ కాలం కొనసాగేందుకు ప్రయత్నిస్తానన్నాడు. 2004లో ఇంగ్లండ్‌పై అరంగేట్రం చేసిన ఈ దక్షిణాఫ్రికా పేసర్ 2019, ఫిబ్రవరిలో శ్రీలంకపై చివరి టెస్టు ఆడాడు. అంతేకాకుండా ఈ ఫార్మాట్‌లో ప్రొటీస్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గానూ నిలిచాడు. 93 టెస్టుల్లో 439 వికెట్లు తీసిన స్టెయిన్ 1251 పరుగులు సాధించాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : టెస్టు ఫార్మాట్ క్రికెట్‌కు వీడ్కోలు
ఎప్పుడు : ఆగస్టు 5
ఎవరు : డేల్ స్టెయిన్
ఎందుకు : వరుస గాయాలతో ఇబ్బందిపడుతున్నందున
పోలవరం నిర్వాసితులకు ప్రత్యేక అధికారి
పోలవరం ప్రాజెక్టు కారణంగా నిర్వాసితులైన కుటుంబాలకు పునరావాసం కల్పించేందుకు ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. శ్రీపొట్టిశ్రీరాములునెల్లూరు జిల్లా గూడూరు సబ్ కలెక్టర్, 2016 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆనంద్‌ను పునరావాస కల్పన ప్రత్యేకాధికారిగా బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్వి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆగస్టు 5న ఉత్తర్వులు జారీచేశారు.
కార్మికశాఖ కమిషనర్‌గా ఉదయలక్ష్మీ
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీలశాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేస్తున్న బి.ఉదయలక్ష్మికి.. కార్మికశాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
హెచ్‌ఎస్‌బీసీ తాత్కాలిక సీఈవోగా నోయెల్
ప్రపంచంలో ఏడో అతిపెద్ద బ్యాంకు, ఆర్థిక సేవల కంపెనీ హెచ్‌ఎస్‌బీసీ హోల్డింగ్‌స తాత్కాలిక సీఈవోగా నోయెల్ క్విన్ నియమితులయ్యారు. ప్రస్తుత సీఈవో జాన్ ఫ్లింట్ తన పదవి నుంచి వైదొలగడంతో ఈ నియామకం చేపట్టినట్లు హెచ్‌ఎస్‌బీసీ ఆగస్టు 5న తెలిపింది. సొంత దేశంతోపాటు ఆసియాలో ఇప్పుడున్న అనిశ్చిత పరిస్థితుల్లో నూతన నాయకత్వం అవసరమని పేర్కొంది. ప్రస్తుతం గ్లోబల్ కమర్షియల్ బ్యాంకింగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా నోయెల్ ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హెచ్‌ఎస్‌బీసీ హోల్డింగ్‌స తాత్కాలిక సీఈవోగా నియామకం
ఎప్పుడు : ఆగస్టు 5
ఎవరు : నోయెల్ క్విన్
క్రికెట్‌కు బ్రెండన్ మెకల్లమ్ వీడ్కోలు
క్రికెట్‌కు పూర్తిగా వీడ్కోలు పలుకుతున్నట్లు న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ ఆగస్టు 6న ప్రకటించాడు. అంతర్జాతీయ పోటీ క్రికెట్ నుంచి 2016లోనే తప్పుకొన్న అతడు ప్రపంచవ్యాప్తంగా టి20 లీగ్‌లలో ఆడుతున్నాడు. ప్రసుత్తం కెనడాలో జరుగుతున్న గ్లోబల్ టి20 లీగ్‌లో టొరంటో నేషనల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ టోర్నీనే తనకు ఆఖరిదని స్పష్టం చేశాడు.
2002లో వన్డే (సిడ్నీలో ఆస్ట్రేలియాపై), 2004లో టెస్టు (హామిల్టన్‌లో దక్షిణాఫ్రికాపై), 2005లో టి20 (ఆక్లాండ్‌లో ఆస్ట్రేలియాపై) మెకల్లమ్ అరంగేట్రం చేశాడు. ప్రపంచవ్యాప్తంగా అన్ని టి20 లీగ్‌లలో కలిపి 370 మ్యాచ్‌లాడిన మెకల్లమ్ 9,922 పరుగులు చేశాడు.
ఘనతలు..
ఏమిటి : క్రికెట్‌కు పూర్తిగా వీడ్కోలు
ఎప్పుడు : ఆగస్టు 6
ఎవరు : బ్రెండన్ మెకల్లమ్
కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ కన్నుమూత
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ (67) కన్ను మూశారు. గుండెపోటు కారణంగా ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(ఎయిమ్స్)లో ఆగస్టు 6న తుదిశ్వాస విడిచారు. ఢిల్లీలోని లోధీ రోడ్డులో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 1952 ఫిబ్రవరి 14న హరియాణాలోని అంబాలాలో సుష్మ జన్మించారు. పంజాబ్ యూనివర్సిటీ నుంచి న్యాయవిద్య ముగించారు. 1975 జూలై 13న స్వరాజ్ కౌశల్‌ను వివాహమాడారు. కొన్నాళ్లు సుప్రీంకోర్టు న్యాయవాదిగా పనిచేశారు. 1977లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సుష్మ 1998లో ఢిల్లీ సీఎం అయ్యారు. 1996లో కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రిగా ఉన్నారు.
ప్రజా జీవితంలోనే నాలుగు దశాబ్దాలు
పుట్టిన తేదీ: ఫిబ్రవరి 14, 1952
తల్లిదండ్రులు: హర్దేవ్ శర్మ, లక్ష్మీదేవి
పుట్టినూరు: హరియాణాలోని అంబాలా కంటోన్మెంట్
చదువు: బీఏ - సనాతన్ ధర్మ కాలేజి, అంబాలా
ఎల్‌ఎల్‌బీ - పంజాబ్ యూనివర్సిటీ
భర్త: స్వరాజ్ కౌశల్ (1975 జూలై 13న వివాహం)
సంతానం: ఒక కుమార్తె(పేరు : బన్సురి)
వృత్తి: సుప్రీంకోర్టు లాయర్
రాజకీయం: మూడుసార్లు ఎమ్మెల్యే. ఏడు సార్లు ఎంపీ (1990, 2000, 2006లో రాజ్యసభ, 1996, 1998, 2009, 2014లో లోక్‌సభ)
2014 నుంచీ సుష్మా స్వరాజ్ విదేశాంగ మంత్రిగా కొనసాగారు. ఈ బాధ్యతలు చేపట్టిన ప్పటి నుంచి సమాచారాన్ని అందరికీ చేరవేయటానికి సామాజిక మాధ్యమం ‘ట్విటర్’ను ప్రధాన వేదికగా చేసుకున్నారు. ఆమెకు ట్విటర్‌లో 1.3 కోట్ల మంది ఫాలోవర్లు ఏర్పడ్డారు. ఎవరైనా సహాయం అడిగితే ట్విటర్ ద్వారా వెంటనే స్పందించేవారు. అందుకే వాషింగ్టన్ పోస్ట్ సుష్మకు ‘సూపర్ మామ్’ ట్యాగ్ తగిలించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత
ఎప్పుడు : ఆగస్టు 6
ఎవరు : సుష్మాస్వరాజ్ (67)
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : గుండెపోటు కారణంగా
ప్రముఖ రచయిత్రి మారిసన్ కన్నుమూత
ప్రముఖ అమెరికన్ సాహితీ వేత్త, నవలా రచయిత్రి నోబెల్ అవార్డు గ్రహీత టోని మారిసన్ (88) న్యూయార్క్‌లోని మోంటిఫియోర్ మెడికల్ సెంటర్‌లో ఆగస్టు 5న కన్నుమశారు. అమెరికాలోని ఒహియో రాష్ట్రంలోగల లోరైన్‌లో 1931, ఫిబ్రవరి 18న మారిసన్ జన్మించారు. ఆధునిక సాహిత్యానికి మార్గదర్శిగా ఖ్యాతి గడించిన ఆమె బిలవ్‌డ నవల ద్వారా ఎనలేని కీర్తిని సంపాదించారు. సాంగ్ ఆఫ్ సాలమన్‌తో పాటు ఇతర రచనలు ఆమెలోని భావుకతకు, ఊహాత్మక శక్తికి దర్పణంగా నిలిచాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రముఖ అమెరికన్ సాహితీ వేత్త, నవలా రచయిత్రి కన్నుమూత
ఎప్పుడు : ఆగస్టు 5
ఎవరు : టోని మారిసన్ (88)
ఎక్కడ : న్యూయార్క్, అమెరికా
ఆర్కిటెక్ట్ వెంకటరమణారెడ్డి కన్నుమూత
మూడు రాష్ట్రాల ప్రభుత్వాల్లో పలు కీలక విభాగాల్లో పనిచేసిన ప్రముఖ ఆర్కిటెక్ట్ జి.వెంకటరమణారెడ్డి (93) అనారోగ్యం కారణంగా హైదరాబాద్‌లో ఆగస్టు 5న కన్నుమూశారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని టౌన్‌ప్లానింగ్‌లో ఉద్యోగంలో చేరిన వెంకటరమణారెడ్డి 1953లో కర్నూలు కేంద్రంగా ఆంధ్ర ప్రభుత్వంలో జాయింట్ డెరైక్టర్‌గా పనిచేశారు. తిరిగి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ వివిధ హోదాల్లో పనిచేసి 1982లో టౌన్‌ప్లానింగ్ డెరైక్టర్ హోదాలో పదవీ విరమణ చేశారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు సన్నిహితునిగా ముద్రపడ్డ రమణారెడ్డి సెక్రటేరియేట్ ఎల్ బ్లాక్, హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీ వంటి నిర్మాణాల రూపకల్పన చేశారు. టీటీడీ సలహాదారుగా కూడా ఆయన పనిచేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రముఖ ఆర్కిటెక్ట్ కన్నుమూత
ఎప్పుడు : ఆగస్టు 6
ఎవరు : జి.వెంకటరమణారెడ్డి (93)

- 1974లో ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘ నేతగా ఎన్నిక
- 1977లో ఏబీవీపీ యువమోర్చా కన్వీనర్.. ఏబీవీపీ జాతీయ కార్యదర్శిగా నియామకం.
- 1989లో అదనపు సొలిసిటర్ జనరల్‌గా నియమితులయ్యారు
- 1991 నుంచి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు.
- 1999లో వాజపేయి హయాంలో న్యాయశాఖ, సమాచార శాఖ, వాణిజ్యం కార్పొరేట్ వ్యవహారాల శాఖలను నిర్వహించారు.
- 2009-14 మధ్య రాజ్యసభలో విపక్ష నేత
- 2002 జూలైలో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేసి పార్టీ కార్యదర్శిగా, ప్రధాన ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టారు.
- 2003లో వాజ్‌పేయి మంత్రివర్గంలో చేరారు
- 2014లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
- 2014, 2017లో కొద్ది నెలల పాటు రక్షణ మంత్రిగా వ్యవహరించి రక్షణ రంగంలో ప్రైవేటీకరణ వంటి కీలక సంస్కరణలు తీసుకొచ్చారు.

- టెస్టుల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ (54 బంతుల్లో) రికార్డు మెకల్లమ్ పేరిటే ఉంది. 2016లో ఆస్ట్రేలియాపై తన చివరి టెస్టులో అతడీ రికార్డు నెలకొల్పాడు.
- అంతర్జాతీయ క్రికెట్‌లో న్యూజిలాండ్ తరఫున ట్రిపుల్ సెంచరీ చేసిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా కూడా మెకల్లమ్ గుర్తింపు పొందాడు.
- క్రిస్ గేల్ తర్వాత టి20 ఫార్మాట్‌లో సెంచరీ చేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా ఈ కివీస్ క్రికెటర్ నిలిచాడు.
ఏమిటి : క్రికెట్‌కు పూర్తిగా వీడ్కోలు
ఎప్పుడు : ఆగస్టు 6
ఎవరు : బ్రెండన్ మెకల్లమ్
కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ కన్నుమూత
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ (67) కన్ను మూశారు. గుండెపోటు కారణంగా ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(ఎయిమ్స్)లో ఆగస్టు 6న తుదిశ్వాస విడిచారు. ఢిల్లీలోని లోధీ రోడ్డులో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 1952 ఫిబ్రవరి 14న హరియాణాలోని అంబాలాలో సుష్మ జన్మించారు. పంజాబ్ యూనివర్సిటీ నుంచి న్యాయవిద్య ముగించారు. 1975 జూలై 13న స్వరాజ్ కౌశల్‌ను వివాహమాడారు. కొన్నాళ్లు సుప్రీంకోర్టు న్యాయవాదిగా పనిచేశారు. 1977లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సుష్మ 1998లో ఢిల్లీ సీఎం అయ్యారు. 1996లో కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రిగా ఉన్నారు.
ప్రజా జీవితంలోనే నాలుగు దశాబ్దాలు
పుట్టిన తేదీ: ఫిబ్రవరి 14, 1952
తల్లిదండ్రులు: హర్దేవ్ శర్మ, లక్ష్మీదేవి
పుట్టినూరు: హరియాణాలోని అంబాలా కంటోన్మెంట్
చదువు: బీఏ - సనాతన్ ధర్మ కాలేజి, అంబాలా
ఎల్‌ఎల్‌బీ - పంజాబ్ యూనివర్సిటీ
భర్త: స్వరాజ్ కౌశల్ (1975 జూలై 13న వివాహం)
సంతానం: ఒక కుమార్తె(పేరు : బన్సురి)
వృత్తి: సుప్రీంకోర్టు లాయర్
రాజకీయం: మూడుసార్లు ఎమ్మెల్యే. ఏడు సార్లు ఎంపీ (1990, 2000, 2006లో రాజ్యసభ, 1996, 1998, 2009, 2014లో లోక్‌సభ)
- భర్త స్వరాజ్ కౌశల్ పిన్న వయస్సులోనే గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టి రికార్డు సృష్టించగా, హరియాణా కేబినెట్‌లో (1977- 82, 1987-90) అతిపిన్న వయస్కురాలైన మంత్రిగా సుష్మా బాధ్యతలు చేపట్టారు. అందుకే ఈ దంపతులు విశిష్ట జంటగా లిమ్కాబుక్ రికార్డుల్లో స్థానం సంపాదించారు.
- ఢిల్లీ ముఖ్యమంత్రిగా అక్టోబర్ 13, 1998 నుంచి డిసెంబర్ 3, 1998 వరకు పనిచేశారు.
- 1998లో కేంద్ర సమాచార, ప్రసార, టెలికమ్యూనికేషన్ శాఖలకు మంత్రిగా ఉన్నారు.
- 2000- 20003 సంవత్సరాల్లో కేంద్ర సమాచార, ప్రసార శాఖలకు మంత్రిగా
- 2003-2004 కాలంలో ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
- 2009లో లోక్‌సభలో బీజేపీ పక్ష నేతగా వ్యవహరించారు.
- 2014- 2019 వరకు విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నారు.
- పంజాబ్ యూనివర్సిటీ నుంచి ఎస్‌సీసీ ఉత్తమ కేడెట్‌గా, ఉత్తమ విద్యార్థినిగా మూడేళ్లపాటు ఎంపికయి గోల్డ్ మెడల్ సాధించారు.
- వివిధ స్థాయీసంఘాలు, పార్లమెంట్ కమిటీల్లో కీలక సభ్యురాలిగా వ్యవహరించారు. అనేక సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. - వివిధ హోదాల్లో ఆమె 18 దేశాల్లో పర్యటించారు. హరియాణా అసెంబ్లీ ఉత్తమ స్పీకర్‌గా మూడుపర్యాయాలు ఎంపికయ్యారు.
- 2019 లోక్‌సభ ఎన్నికల్లో అనారోగ్యం కారణంగా సుష్మ పోటీ చేయలేదు.
- అతి పిన్న వయసులో రాష్ట్ర కేబినెట్ మంత్రిగా బాధ్యతలు
- లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా పనిచేసిన తొలి మహిళ
- 2008, 2010లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డులు
- జాతీయ స్థాయి పార్టీకి అధికార ప్రతినిధిగా పనిచేసిన తొలి మహిళ
2014 నుంచీ సుష్మా స్వరాజ్ విదేశాంగ మంత్రిగా కొనసాగారు. ఈ బాధ్యతలు చేపట్టిన ప్పటి నుంచి సమాచారాన్ని అందరికీ చేరవేయటానికి సామాజిక మాధ్యమం ‘ట్విటర్’ను ప్రధాన వేదికగా చేసుకున్నారు. ఆమెకు ట్విటర్‌లో 1.3 కోట్ల మంది ఫాలోవర్లు ఏర్పడ్డారు. ఎవరైనా సహాయం అడిగితే ట్విటర్ ద్వారా వెంటనే స్పందించేవారు. అందుకే వాషింగ్టన్ పోస్ట్ సుష్మకు ‘సూపర్ మామ్’ ట్యాగ్ తగిలించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత
ఎప్పుడు : ఆగస్టు 6
ఎవరు : సుష్మాస్వరాజ్ (67)
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : గుండెపోటు కారణంగా
ప్రముఖ రచయిత్రి మారిసన్ కన్నుమూత
ప్రముఖ అమెరికన్ సాహితీ వేత్త, నవలా రచయిత్రి నోబెల్ అవార్డు గ్రహీత టోని మారిసన్ (88) న్యూయార్క్‌లోని మోంటిఫియోర్ మెడికల్ సెంటర్‌లో ఆగస్టు 5న కన్నుమశారు. అమెరికాలోని ఒహియో రాష్ట్రంలోగల లోరైన్‌లో 1931, ఫిబ్రవరి 18న మారిసన్ జన్మించారు. ఆధునిక సాహిత్యానికి మార్గదర్శిగా ఖ్యాతి గడించిన ఆమె బిలవ్‌డ నవల ద్వారా ఎనలేని కీర్తిని సంపాదించారు. సాంగ్ ఆఫ్ సాలమన్‌తో పాటు ఇతర రచనలు ఆమెలోని భావుకతకు, ఊహాత్మక శక్తికి దర్పణంగా నిలిచాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రముఖ అమెరికన్ సాహితీ వేత్త, నవలా రచయిత్రి కన్నుమూత
ఎప్పుడు : ఆగస్టు 5
ఎవరు : టోని మారిసన్ (88)
ఎక్కడ : న్యూయార్క్, అమెరికా
ఆర్కిటెక్ట్ వెంకటరమణారెడ్డి కన్నుమూత
మూడు రాష్ట్రాల ప్రభుత్వాల్లో పలు కీలక విభాగాల్లో పనిచేసిన ప్రముఖ ఆర్కిటెక్ట్ జి.వెంకటరమణారెడ్డి (93) అనారోగ్యం కారణంగా హైదరాబాద్‌లో ఆగస్టు 5న కన్నుమూశారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని టౌన్‌ప్లానింగ్‌లో ఉద్యోగంలో చేరిన వెంకటరమణారెడ్డి 1953లో కర్నూలు కేంద్రంగా ఆంధ్ర ప్రభుత్వంలో జాయింట్ డెరైక్టర్‌గా పనిచేశారు. తిరిగి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ వివిధ హోదాల్లో పనిచేసి 1982లో టౌన్‌ప్లానింగ్ డెరైక్టర్ హోదాలో పదవీ విరమణ చేశారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు సన్నిహితునిగా ముద్రపడ్డ రమణారెడ్డి సెక్రటేరియేట్ ఎల్ బ్లాక్, హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీ వంటి నిర్మాణాల రూపకల్పన చేశారు. టీటీడీ సలహాదారుగా కూడా ఆయన పనిచేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రముఖ ఆర్కిటెక్ట్ కన్నుమూత
ఎప్పుడు : ఆగస్టు 6
ఎవరు : జి.వెంకటరమణారెడ్డి (93)
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : అనారోగ్యం కారణంగా
Published date : 23 Aug 2019 01:05PM