Skip to main content

Emergency Medicines: అందుబాటు ధరల్లోకి క్యాన్సర్‌ మందులు.. 26 డ్రగ్స్‌ను తొలగింపు.. జాబితాలోకి మరో 34 డ్రగ్స్‌

యాంటీ క్యాన్సర్‌ డ్రగ్స్, యాంటీ బయోటిక్స్‌ సహా 34 డ్రగ్స్‌ను జాతీయ అత్యావశ్యక ఔషధాల జాబితా(ఎన్‌ఎల్‌ఈఎం)లోకి కేంద్రంచేర్చింది. దాంతో వీటి ధరలు దిగిరానున్నాయి.
 Union Health Minister Mansukh Mandaviya released the list
Union Health Minister Mansukh Mandaviya released the list

ఈ మేరకు 384 జాతీయ అత్యవసర ఔషధాల జాబితాను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ సెప్టెంబర్ 13న విడుదల చేశారు. 

Also read: WHO: ఇష్టారాజ్యంగా యాంటీ‘భయో’టిక్స్‌!.. నిజంగా అవసరమైనప్పుడు మందులు పనిచేయవంటున్న అధ్యయనాలు

ఐవర్‌మెక్టిన్, అమికాసిన్, బెడాక్లిలైన్, డెలామనిడ్, ముపిరోసిన్, మెరోపెనెమ్‌ వంటివి వీటిలో ఉన్నాయి. బెండామస్టీన్‌ హైడ్రోక్లోరైడ్, ఇరినోటెకాన్‌ హెచ్‌సీఐ ట్రైహైడ్రేడ్, లెనాలిడోమైడ్, లియూప్రోలైడ్‌ ఎసిటేట్‌ వంటి యాంటీ క్యాన్సర్‌ డ్రగ్స్, నికోటిన్‌ రిప్లేస్‌మెంట్‌ థెరపీ, బుప్రినోరిఫెన్‌ వంటి మానసిక చికిత్స ఔషధాలనూ జాబితాలో చేర్చారు. ర్యాంటిడిన్, సుక్రాల్ఫేట్, వైట్‌ పెట్రోలియం, ఎటినోలోల్, మైథెల్‌డోపా సహా 26 డ్రగ్స్‌ను తొలగించారు. 1996 నుంచి ఈ జాబితాను కేంద్రం అమలుచేస్తోంది. 2003, 2011, 2015ల్లో దీన్ని సవరించారు. ఆరోగ్య సంరక్షణలో అన్ని స్థాయిల్లోనూ సరసమైన, నాణ్యమైన ఔషధాల ప్రాధాన్యాన్ని నిర్ధారించడంలో ఎన్‌ఎల్‌ఈఎంది పెద్ద పాత్ర అని మంత్రి అన్నారు. ఎండోక్రైన్‌ మెడిసిన్, కాంట్రాసెప్టివ్స్‌ ఫుడ్రోకార్టిసోన్, ఓర్లీలోక్సిఫిన్, ఇన్సులిన్‌ గ్లార్జైన్, టెనిలిగ్లిటిన్, శ్వాస వ్యవస్థ సంబంధ మోంటేలూకాస్ట్, నేత్ర సంబంధ లాటనోప్రోస్ట్‌లనూ జాబితాలో చేర్చారు.

Also read: Daily Current Affairs in Telugu: 2022, సెప్టెంబర్ 13th కరెంట్‌ అఫైర్స్‌

Published date : 14 Sep 2022 07:18PM

Photo Stories