Anti NEET Bill 2021: నీట్ పరీక్ష నుంచి మినహాయించాలని ప్రత్యేక బిల్లును ఆమోదించిన రాష్ట్రం?
సామాజిక న్యాయం జరగాలంటే ఈ బిల్లుకి మద్దతునివ్వాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సభ్యుల్ని అభ్యర్థించారు. కేంద్ర చట్టాలకు విరుద్ధంగా ఉన్నందువల్ల రాష్ట్రపతి ఆమోదముద్ర పడితేనే ఈ బిల్లు అమలులోకి వస్తుంది. ఎంబీబీఎస్, బీడీఎస్‌లలో అడ్మిషన్లు విద్యార్థుల పన్నెండో తరగతి మార్కుల ఆధారంగా ఉంటాయని బిల్లు స్పష్టం చేసింది. నీట్ పరీక్ష రాస్తే ఫలితాలు ఎలా వస్తాయో అన్న భయంతో ఇటీవల తమిళనాడులో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.
గుజరాత్ నూనత సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మేల్యే?
గుజరాత్ రాష్ట్ర 17వ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్(59) బాధ్యతలు చేపట్టారు. గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లోని రాజ్‌భవన్‌లో సెప్టెంబర్ 13న జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవ్‌వ్రత్ భూపేంద్రతో ప్రమాణస్వీకారం చేయించారు. కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పాల్గొన్నారు.
చదవండి: శిక్షక్ పర్వ్–2021 కాంక్లేవ్ థీమ్ ఏమిటీ?
క్విక్ రివ్యూ :
ఏమిటి : యాంటీ నీట్ బిల్లు –2021కి ఆమోదం
ఎప్పుడు : సెప్టెంబర్ 13
ఎవరు : తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ
ఎందుకు : నీట్ పరీక్షతో దేశవ్యాప్తంగా విద్యార్థులకి సమన్యాయం జరగడం లేదని...