'Pralay' Ballistic Missiles: భారత బలగాల చేతికి ‘ప్రళయ్’
Sakshi Education
భారత సాయుధ దళాల చేతికి త్వరలో ‘ప్రళయ్’ బాలిస్టిక్ క్షిపణి అందనుంది. 150–500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను చేధించగల ఈ క్షిపణి కొనుగోలు ప్రతిపాదన తుది దశలో ఉందని, దీనిని త్వరలో జరిగే ఉన్నతస్థాయి సమావేశంలో ఆమోదం కోసం తీసుకురానున్నట్టు రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. వ్యూహాత్మక ఆపరేషన్ల కోసం ఈ క్షిపణిని వినియోగించనున్నారు. సరిహద్దులో చైనా దురాక్రమణ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 30 Dec 2022 04:42PM