Netaji Statue:నేతాజీ మార్గంలో నూతన శిఖరాలకు.. విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ప్రధాని మోదీ
ఆధునీకరించిన ఇండియా గేట్ ప్రాంతంలో 28 అడుగుల ఎత్తయిన, 65 టన్నుల బరువైన నేతాజీ ఏకశిలా గ్రానైట్ విగ్రహాన్ని ప్రధాని మోదీ సెప్టెంబర్ 8 న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడారు. ‘నేతాజీ చూపిన మార్గంలో భారత్ ముందుకు సాగి ఉంటే ఈరోజు దేశం మరింత అత్యన్నత స్థాయిలో ఉండేది. కానీ, భారత్ ఆ సువర్ణావకాశాన్ని కోల్పోయింది. దురదృష్టవశాత్తు ఆయనకు మన స్మృతిపథంలో సరైన స్థానం దక్కలేదు. ఆయన నిలువెత్తు విగ్రహం నేడు దేశానికి ఎంతో స్ఫూర్తిదాయకం.
Also read: Satavahana Dynasty Bitbank in Telugu: గాథాసప్తశతి గ్రంథ రచయిత ఎవరు?
ఢిల్లీకి 1,665 కి.మీ.ల దూరంలోని ఖమ్మం నుంచి 100 అడుగుల పొడవైన, 140 చక్రాల ట్రక్కు మీద ఏకశిలను తెచ్చారు. 280 మెట్రిక్ టన్నుల శిలను చెక్కి 26 వేల పని గంటలు శ్రమించి 65 టన్నుల శిల్పానికి తుదిరూపునిచ్చారు. అరుణ్ యోగిరాజ్ నేతృత్వంలోని శిల్పుల బృందం ఈ పనిపూర్తిచేసింది. ఇండియాగేట్ క్రిందిభాగంలో గతంలో బ్రిటిష్ రాజు కింగ్ జార్జ్–5 విగ్రహం ఉన్న చోటనే ఈ విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. బ్రిటిష్ రాజరిక గుర్తుల తొలగింపులో భాగంగా 1968లో జార్జ్ విగ్రహాన్ని తొలగించారు. రూ.13,450 కోట్లతో చేపట్టిన సెంట్రల్ విస్టా అవెన్యూ ప్రాజెక్టులో భాగంగానే నేతాజీ విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్పారు.
Also read: Quiz of The Day (September 08, 2022): భారతదేశంలో జాతీయ అత్యవసర పరిస్థితిని ఎన్నిసార్లు విధించారు?
ఆకట్టుకునేలా కర్తవ్య పథ్
ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు విస్తరించిన, కొత్త సొబగులు అద్దుకున్న ‘కర్తవ్య పథ్’ను ప్రధాని మోదీ సెప్టెంబర్ 8 న ప్రారంభించారు. ప్రఖ్యాత పర్యాటక స్థలంగా పేరొందిన రాజ్‌పథ్‌ను సర్వాంగ సుందరంగా ఆధునీకరించి కర్తవ్య పథ్‌గా నామకరణం చేసిన విషయం తెల్సిందే. ఈ సందర్భంగా మోదీ మాట్లాడారు. ‘ బ్రిటిష్ వలసపాలన, బానిసత్వపు గుర్తులను చెరిపేస్తూ రాజ్‌పథ్ పేరును కర్తవ్యపథ్‌గా మార్చాం’ అని అన్నారు. కర్తవ్యపథ్ సుందరీకరణ, నిర్మాణ పనుల్లో భాగస్వాములైన కార్మికులతో ముచ్చటించారు.
Also read: CEO of NITI Aayog: నీతి ఆయోగ్ సీఈవోగా పరమేశ్వరన్
కర్తవ్య పథ్ విశేషాలు
- 15.5 కి.మీ.ల పొడవునా ఎర్ర గ్రానైట్ రాళ్లు పొదిగిన పాదచారి బాటలు, అండర్‌పాస్‌లు, ఎటుచూసినా పచ్చదనం కన్పించేలా చెట్లు, మెరుగైన పార్కింగ్, కొత్త దుకాణ సముదాయాలు, ఎగ్జిబిషన్ స్టాళ్లు, కనువిందు చేసే నైట్ లైటింగ్ ఏర్పాటుచేశారు.
- మరమ్మతు చేసిన కాల్వలు, ఘన వ్యర్థ్యాల సమర్థ నిర్వహణ, వాడుక నీటి రీసైక్లింగ్, వాన నీటి సంరక్షణ, తక్కువ విద్యుత్‌తో వెలిగే లైట్లు
- ఒకేసారి 1,125 వాహనాలు పార్క్ చేయొచ్చు.
Also read: International Literacy Day: అందరికీ విద్య అందేదెన్నడు?
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP