Skip to main content

Inter-State Council: ప్రధాని మోదీ నేతృత్వంలో అంతర్రాష్ట్ర మండలి

Inter-State Council: ఎవరి నేతృత్వంలో అంతరాష్ట్ర మండలి ఏర్పాటైంది?
PM Modi headed Inter-State Council reconstituted
PM Modi headed Inter-State Council reconstituted

Telugu Current Affairs - National: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైర్మన్‌ గా అంతరాష్ట్ర మండలి ఏర్పాటైంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2019 ఆగస్టు 9న ఏర్పాటైన అంతరాష్ట్ర మండలి కాలం పూర్తికావడంతో.. కొత్తగా దీన్ని ఏర్పాటు చేసింది. ఇందులో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల పాలనాధికారులు, రాష్ట్రపతి పాలన విధించినప్పుడు ఆయా రాష్ట్రాల గవర్నర్లు సభ్యులుగా వ్యవహరిస్తారు. అలాగే కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, అమిత్‌షా, నిర్మలా సీతారామన్, నరేంద్రసింగ్‌ తోమర్, వీరేంద్ర కుమార్, హర్‌దీప్‌సింగ్‌ పూరీలను సభ్యులుగా నియమించారు. శాశ్వత ఆహ్వానితులుగా కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కరీ, జైశంకర్, అర్జున్‌ ముండా, పీయూష్‌ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, ప్రహ్లాద్‌ జోషి, అశ్వినీ వైష్ణవ్, గజేంద్రసింగ్‌ షెకావత్, కిరణ్‌ రిజిజు, భూపేంద్ర యాదవ్‌లకు అవకాశం కల్పించారు. భారత రాజ్యాంగంలోని ప్రకరణ 263 అంతరాష్ట్ర మండలి గురించి తెలుపుతుంది. 

Inter state Council: అంతర్రాష్ట్ర మండలి పునర్నిర్మాణం

Published date : 30 May 2022 07:10PM

Photo Stories