ఫిబ్రవరి 2020 జాతీయం
Sakshi Education
అమెరికన్ సీహాక్ హెలికాప్టర్ల కొనుగోలుకు ఆమోదం
అమెరికా నుంచి 24 మల్టీ-రోల్ ఎంహెచ్-60 సీహాక్ (రోమియో) హెలికాప్టర్లను కొనుగోలు చేయడానికి కేబినెట్ కమిటీ ఆఫ్ సెక్యూరిటీ (సిసిఎస్) ఫిబ్రవరి 19న ఆమోదం తెలిపింది. 2.4 బిలియన్ డాలర్లతో కొనుగోలు చేయనున్న ఈ హెలికాప్టర్లు ప్రస్తుతం భారత్ వినియోగిస్తున్న సీకింగ్ హెలికాప్టర్ల స్థానాన్ని భర్తీ చేయనున్నాయి. ఈ హెలికప్టర్లతో భారత్ నావికా దళ సామర్థ్యం మరింత పెరుగునుంది.
సీహాక్ హెలికాప్టర్ల ప్రత్యేకతలు
ఏమిటి : అమెరికన్ మల్టీ-రోల్ ఎంహెచ్-60 సీహాక్ (రోమియో) హెలికాప్టర్లను కొనుగోలుకు ఆమోదం
ఎప్పుడు : ఫిబ్రవరి 19
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : భారత నావికా దళ సామర్థ్యాన్ని పెంచేందుకు
థల్ సేనా భవన్ నిర్మాణానికి శంకుస్థాపన
భారత సైన్యం కోసం దేశ రాజధాని న్యూఢిల్లీలో నూతన ప్రధాన కార్యలయం నిర్మించనున్నారు. ‘థల్ సేనా భవన్’ పేరుతో నిర్మించే ఈ భవనానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఫిబ్రవరి 21న శంకుస్థాపన చేశారు. రూ.700 కోట్లతో ఉదయించే సూర్యుడి ఆకృతిలో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. కొత్త భవనం 3-4 ఏళ్లలో సిద్ధమవుతుందని భారత సైన్యాధిపతి జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణె పేర్కొన్నారు. ఏడంతస్తుల ఈ భవనంలో సైన్యానికి చెందిన 2900 మంది, పౌర సిబ్బంది 3100 మంది పనిచేస్తారని ఉన్నతాధికారులు తెలిపారు. 250 మంది భద్రతా సిబ్బంది ఈ ప్రాంగణంలోనే బస చేస్తారని వివరించారు. 4వేల కార్ల పార్కింగ్‌కు ఏర్పాట్లు ఉంటాయన్నారు. ప్రస్తుతం సైనిక ప్రధాన కార్యాలయం సౌత్ బ్లాక్ భవనంలో ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : థల్ సేనా భవన్ నిర్మాణానికి శంకుస్థాపన
ఎప్పుడు : ఫిబ్రవరి 21
ఎవరు : రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
ఎక్కడ : న్యూఢిల్లీ
అంతర్జాతీయ న్యాయ సదస్సు ముగింపు
భారత సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఫిబ్రవరి 22న న్యూఢిల్లీలో మొదలైన అంతర్జాతీయ న్యాయ సదస్సు ఫిబ్రవరి 23న ముగిసింది. ఫిబ్రవరి 23న జరిగిన సదస్సు ముగింపు కార్యక్రమంలో ‘న్యాయవ్యవస్థ -మారుతున్న ప్రపంచం’అంశంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగించారు. లింగపరమైన న్యాయం అనే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని సాధించేందుకు భారత న్యాయవ్యవస్థ చేసిన కృషి అమోఘమని పేర్కొన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఎల్లప్పుడూ సానుకూల, ప్రగతిశీల దృక్పథంతోనే పనిచేసిందని కొనియాడారు.
ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 22న పాల్గొన్నారు. క్లిష్టమైన అంశాలపై ఇటీవలి కాలంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు ప్రపంచవ్యాప్త చర్చకు కారణమయ్యాయని ఈ సందర్భంగా మోదీ అన్నారు. సదస్సులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే మాట్లాడుతూ... పర్యావరణ సంబంధ అంశాలకు జాతీయ, అంతర్జాతీయ అనే భేదం లేదని, వీటిని పరిష్కరించడానికి చట్టాలతో కూడిన ఒకే వ్యవస్థ అవసరమని పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అంతర్జాతీయ న్యాయ సదస్సు ముగింపు
ఎప్పుడు : ఫిబ్రవరి 23
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఎక్కడ : న్యూఢిల్లీ
ఆలిండియా పోలీస్ వేడుకల్లో ఉపరాష్ట్రపతి
సికింద్రాబాద్‌లోని రైల్వే స్పోర్‌ట్స కాంప్లెక్స్ (ఆర్‌ఎస్‌సీ) గ్రౌండ్‌సలో ఫిబ్రవరి 23న 20వ ఆలిండియా పోలీస్ బ్యాండ్ కాంపిటీషన్ ముగింపు వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొని ప్రసంగించారు. సంగీతం సాయుధ దళాలలో ధైర్యాన్ని, శౌర్యాన్ని రేకెత్తిస్తుందని వెంకయ్య పేర్కొన్నారు. దేశభక్తిని, దేశ రక్షణపై నిబద్ధతను ప్రేరేపిస్తుందన్నారు. ఆలిండియా పోలీస్ బ్యాండ్ ఛాంపియన్‌షిప్ పోటీలను ఆర్‌పీఎఫ్ జాతీయ స్థాయిలో 3వసారి నిర్వహిస్తోందని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ డెరైక్టర్ జనరల్ అరుణ్‌కుమార్ అన్నారు.
సీఆర్‌పీఎఫ్‌కు విజేత ట్రోఫి
తాజా వేడుకల్లో బ్రాస్ బ్యాండ్ క్యాటగిరీలో 20వ ఆల్ ఇండియా పోలీస్ బ్యాండ్ ఛాంపియన్‌షిప్ విజేత ట్రోఫీని సీఆర్‌పీఎఫ్‌కు, పైప్ బ్యాండ్ ట్రోఫీని మహారాష్ట్ర పోలీసులకు అందజేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆలిండియా పోలీస్ బ్యాండ్ కాంపిటీషన్ 20వ ముగింపు
ఎప్పుడు : ఫిబ్రవరి 23
ఎవరు : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఎక్కడ : ఆర్‌ఎస్‌సీ గ్రౌండ్‌స, సికింద్రాబాద్
ఐదేళ్లలో 1.09 కోట్ల చెట్ల నరికివేతకు అనుమతి
2014-19 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం 1,09,75,000 చెట్ల నరికివేతకు కేంద్ర అటవీ, పర్యావరణశాఖ అనుమతిచ్చింది. ఇటీవల లోక్‌సభలో కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ సహాయమంత్రి బాబుల్ సుప్రియో ఈ విషయాన్ని తెలియజేశారు. తప్పని పరిస్థితుల్లో మాత్రమే చెట్లను తొలగిస్తున్నామని మంత్రి తెలిపారు. దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో 2016-19 మధ్యకాలంలో 12,12,753 లక్షల చెట్లను కొట్టేసేందుకు అనుమతినిచ్చినట్లు పేర్కొన్నారు. దాదాపు 11 లక్షల చెట్లతో మహారాష్ట్ర రెండో స్థానంలో, 10 లక్షల చెట్లతో మధ్యప్రదేశ్ మూడోస్థానంలో ఉన్నాయని పేర్కొన్నారు. గత మూడేళ్లలో 76,72,337 చెట్లను తొలగించగా, 7.87 కోట్ల కంటే ఎక్కువగా మొక్కలను కంపల్సరీ ఎఫారెస్టేషన్ కింద నాటినట్లు వెల్లడించారు.
చెట్ల నరికివేత
భారత్‌లో తలసరికి 28 చెట్లే...
2018లో ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా చూస్తే వివిధ దేశాల్లో ఒక్కొక్కరికి ఉన్న చెట్ల నిష్పత్తి కంటే భారత్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కెనడాలో అత్యధికంగా ఒక్కో వ్యక్తికి 8,953, రష్యాలో 4,461, బ్రెజిల్‌లో 1,494, అమెరికాలో 716, చైనాలో 102 చెట్లు ఉండగా, మన దేశంలో మాత్రం ఒక్కొక్కరికి 28 చెట్లే ఉన్నాయి.
ఆ ఐదెకరాల్లో మసీదు, ఆసుపత్రి: వక్ఫ్ బోర్డు
అయోధ్య కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సంక్రమించిన ఐదెకరాల స్థలంలో మసీదు, ఆసుపత్రితో పాటు లైబ్రరీని నిర్మించనున్నట్లు ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు వెల్లడించింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కేటాయించనున్న ఐదెకరాల స్థలంలో మసీదు నిర్మించాలని నిర్ణయించినట్లు వక్ఫ్ బోర్డు చైర్మన్ జుఫర్ ఫారూకీ ఫిబ్రవరి 24న వెల్లడించారు. మసీదు నిర్మాణానికి సంబంధించి త్వరలో ట్రస్ట్‌ను ఏర్పాటుచేస్తామని పేర్కొన్నారు. మసీదుకు పేరు పెట్టే అంశంపై ట్రస్ట్ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
పీఎం కిసాన్ మొబైల్ యాప్ ప్రారంభం
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్ యోజన) పథకం ప్రారంభించి ఏడాది అవుతున్న సందర్భంగా పథకానికి సంబంధించిన మొబైల్ యాప్‌ను కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఫిబ్రవరి 24న ఢిల్లీలో ప్రారంభించారు. పథకం సేవలు మరింత విసృ్తతం చేసేందుకు ఈ యాప్‌ను ఆవిష్కరించినట్లు మంత్రి పేర్కొన్నారు. రైతుల ఆదాయం 2022 కల్లా రెట్టింపు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
14 కోట్ల మంది రైతులకు...
పీఎం-కిసాన్ పథకాన్ని పశ్చిమ బెంగాల్ తప్ప అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. 14 కోట్ల మంది రైతులకు ఈ పథకం చేరాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటివరకు 9.74 కోట్ల మంది రైతులు నమోదు చేసుకున్నారు. అందులో 8.45 కోట్ల మంది రైతులకు చెల్లింపులు చేసినట్లు అధికారికంగా నమోదైంది.
గోరఖ్‌పూర్‌లో ప్రారంభం...
ఐదెకరాల్లోపు భూమి ఉన్న రైతులకు ఏటా రూ.6వేలు ఆర్థిక సాయం అందించేందకు ఉద్దేశించిన పీఎం-కిసాన్ పథకంను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో 2019, ఫిబ్రవరి 24న జరిగిన ఈ కార్యక్రమంలో తొలి విడతగా 1.01 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి రూ.2,000ను మోదీ బదిలీ చేశారు. పీఎం-కిసాన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2019-20 ఆర్థిక సంవత్సర మధ్యంతర బడ్జెట్(ఓట్ ఆన్ అకౌంట్)లో ప్రకటించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పీఎం కిసాన్ మొబైల్ యాప్ ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 24
ఎవరు : కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : పీఎం-కిసాన్ యోజన పథకం ప్రారంభించి ఏడాది అవుతున్న సందర్భంగా
అత్యంత కాలుష్య నగరంగా ఘజియాబాద్
ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ నిలిచింది. ఘజియాబాద్ తర్వాతి స్థానాల్లో వరుసగా హోటన్ (చైనా), గుజ్రాన్‌వాలా(పాకిస్తాన్), ఫైస్లాబాద్ (పాకిస్తాన్), ఢిల్లీ(భారత్) ఉన్నాయి. ఈ విషయాన్ని వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్-2019 వెల్లడించింది.
ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్-ముఖ్యాంశాలు
ఏమిటి : అత్యంత కాలుష్య నగరంగా ఘజియాబాద్
ఎప్పుడు : ఫిబ్రవరి 25
ఎవరు : వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్-2019
ఎక్కడ : ప్రపంచంలో
అద్దె గర్భం నియంత్రణ బిల్లుకు కేబినెట్ ఆమోదం
మహిళలు తమ ఇష్టంతో గర్భాశయాన్ని ఇతరులకు అద్దెకివ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు అద్దె గర్భం నియంత్రణ బిల్లు-2020పై ఫిబ్రవరి 26న జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ఆమోద ముద్ర వేసింది. వితంతువులు, విడాకులు పొందిన వారూ ఇతరులకు తమ గర్భాన్ని అద్దెకు ఇవ్వొచ్చని బిల్లు స్పష్టం చేసింది.
సరోగసీ చట్టాలను సవరిస్తూ 2019, ఆగస్టులో లోక్‌సభ ఒక ముసాయిదా బిల్లును ఆమోదించింది. అయితే దగ్గరి బంధువులే అద్దెకు గర్భాన్ని ఇవ్వొచ్చనే నిబంధనపై విమర్శలొచ్చాయి. దీంతో బిల్లును రాజ్యసభ సెలెక్ట్ కమిటీకి పంపింది. బీజేపీ ఎంపీ భూపేందర్ యాదవ్ నేతృత్వంలోని కమిటీ సరోగసీకి సంబంధించి అన్ని వర్గాల వారితోనూ చర్చించి బిల్లులో సవరణలను ప్రతిపాదించింది. ఈ సవరణలను కేబినెట్ తాజాగా ఆమోదించింది.
అద్దె గర్భం బిల్లులోని ముఖ్యాంశాలు
ఏమిటి : అద్దె గర్భం నియంత్రణ బిల్లు-2020కు ఆమోదం
ఎప్పుడు : ఫిబ్రవరి 26
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : మహిళలు తమ ఇష్టంతో గర్భాశయాన్ని ఇతరులకు అద్దెకివ్వడానికి వీలుకల్పించేందుకు
నేషనల్ టెక్స్‌టైల్ మిషన్‌కు కేబినెట్ ఆమోదం
టెక్నికల్ టెక్స్‌టైల్స్ రంగంలో అంతర్జాతీయస్థాయి ప్రమాణాలను అందుకోవడానికి వీలుగా రూ.1,480 కోట్లతో ‘నేషనల్ టెక్నికల్ టెక్స్‌టైల్ మిషన్’ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రదాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఫిబ్రవరి 26న సమావేశమైన మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకుంది. టెక్స్‌టైల్ మిషన్ కాలపరిమితి 2020-21 నుంచి 2023-24 వరకు ఉంటుంది. వ్యవసాయం, రహదారులు, రైల్వేట్రాక్‌లు, సాఫ్ట్‌వేర్,వైద్య-ఆరోగ్యం, బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు, అగ్నినిరోధక జాకెట్లు, రోదసీ ప్రయోగాల్లో ఈ టెక్స్‌టైల్స్‌ను ఉపయోగిస్తారు. ఉన్నత విద్యా సంస్థల్లోనూ ఇక మీదట టెక్నికల్ టెక్స్‌టైల్స్ కోర్సులు ప్రవేశపెడతారు.
కశ్మీర్‌లో కేంద్ర చట్టాల అమలు
కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌లో ఉమ్మడి జాబితాలోని 37 కేంద్ర చట్టాలు అమలు చేసే ఆదేశాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించింది. దీంతో జమ్మూ కశ్మీర్ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ కింద ఆదేశాలు జారీ చేసేందుకు మార్గం సుగమమైంది. 2019, ఆగస్టులో అవిభక్త కశ్మీర్ రాష్ట్రానికున్న ప్రత్యేక ప్రతిపత్తి హోదా(ఆర్టికల్ 370)ను రద్దుచేసి రాష్ట్రాన్ని ‘జమ్మూకశ్మీర్’, ‘లడాక్’ కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చడం తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నేషనల్ టెక్నికల్ టెక్స్‌టైల్ మిషన్ ఏర్పాటుకు ఆమోదం
ఎప్పుడు : ఫిబ్రవరి 26
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : టెక్నికల్ టెక్స్‌టైల్స్ రంగంలో అంతర్జాతీయస్థాయి ప్రమాణాలను అందుకోవడానికి వీలుగా
మార్కెట్ ఇంటెలిజెన్స్ వెబ్‌సైట్ ఆవిష్కరణ
టమాటా, ఉల్లిపాయలు, ఆలుగడ్డల ధరలు ఉన్నట్టుండి పతనమైతే ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసేందుకు రూపొందించిన ‘మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ (ఎంఐఈడబ్ల్యూఎస్)’ వెబ్‌సైట్‌ను కేంద్ర ఆహార శుద్ధి శాఖ మంత్రి హర్‌సిమ్రత్‌కౌర్ బాదల్ ఆవిష్కరించారు. ఢిల్లీలో ఫిబ్రవరి 26న ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. క్రితం ఏడాది అదే కాలంతో పోలిస్తే ధరలు 50 శాతం పతనమైనా, మూడేళ్ల కనిష్ట స్థాయికి ఈ మూడు కూరగాయల ధరలు క్షీణించినా ఎంఐఈడబ్ల్యూఎస్ పోర్టల్ హెచ్చరికలు పంపుతుంది. దేశవ్యాప్తంగా 1,200 మార్కెట్లలో వీటి ధరలను ఈ పోర్టల్ తెలియజేస్తుంది.
మంత్రి బాదల్ మాట్లాడుతూ.. ‘ప్రజలు అధికంగా వినియోగించే ఈ మూడు కూరగాయల టోకు ధరలను ఈ పోర్టల్ తెలియజేస్తుంది. అధిక సరఫరా కారణంగా ధరలు పడిపోతే ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తుంది. దీంతో ‘ఆపరేషన్స్ గ్రీన్’ పథకం కింద ప్రభుత్వం సకాలంలో స్పందించి.. అధికంగా ఉన్న ఉత్పత్తిని కోల్డ్ స్టోరేజ్‌లకు తరలించేందుకు వీలుగా రైతులకు సబ్సిడీ ఇస్తుంది. లేదా మిగులు ఉత్పత్తిని డిమాండ్ ఉన్న చోటుకు తరలించేందుకు సాయమందిస్తుంది’ అని తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎంఐఈడబ్ల్యూఎస్ వెబ్‌సైట్ ఆవిష్కరణ
ఎప్పుడు : ఫిబ్రవరి 26
ఎవరు : కేంద్ర ఆహార శుద్ధి శాఖ మంత్రి హర్‌సిమ్రత్‌కౌర్ బాదల్
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : టమాటా, ఉల్లిపాయలు, ఆలుగడ్డల ధరలు ఉన్నట్టుండి పతనమైతే ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసేందుకు
ఆన్‌లైన్‌లో చట్టసభ్యుల నేర చరిత్ర: సుప్రీంకోర్టు
దేశంలోని అన్ని ప్రాంతీయ, జాతీయ స్థాయి రాజకీయ పార్టీలు తమతమ అభ్యర్థులపై పెండింగులో ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను తమ వెబ్‌సైట్లలో ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్న వారిని ఎన్నికల్లో అభ్యర్థులుగా ఎందుకు నిర్ణయించారో రాజకీయ పక్షాలన్నీ వివరణ ఇవ్వాలని జస్టిస్ ఆర్.ఎఫ్.నారిమన్, జస్టిస్ రవీంద్రభట్‌ల బెంచ్ స్పష్టం చేసింది. రాజకీయాలు నేరపూరితం కావడంపై కోర్టు 2018 సెప్టెంబర్‌లో ఇచ్చిన తీర్పు(అభ్యర్థులపై ఉన్న క్రిమినల్ నేరాల వివరాలు బహిర్గతం చేయాలి) అమలు కావడం లేదని, ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని దాఖలైన పిటిషన్‌పై ధర్మాసనం ఫిబ్రవరి 13న విచారణ చేపట్టింది. రాజకీయ పార్టీలన్నీ అభ్యర్థులను ఎంపిక చేసిన 48 గంటల్లోగా లేదా నామినేషన్ల దాఖలు ప్రారంభమయ్యే తేదీకి కనీసం రెండు వారాల ముందు వారి నేర చరిత్రను ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటి అన్ని సోషల్ మీడియా వేదికలపై వెల్లడించాలని, జాతీయ, స్థానిక వార్తా పత్రికల్లోనూ ప్రకటనలు జారీ చేయాలని ఆదేశాలిచ్చింది.
పార్లమెంట్‌లో నేరచరిత్ర కలిగిన ఎంపీల సంఖ్య
పుల్వామా అమరుల స్మారక స్తూపం ఆవిష్కరణ
2019, ఫిబ్రవరి 14న పుల్వామా దాడి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 40 మంది సీఆర్‌పీఎఫ్ సిబ్బంది స్మృత్యర్థం లెత్‌పోరా సైనిక శిబిరంలో స్మారక స్తూపాన్ని ఆవిష్కరించారు. సీఆర్‌పీఎఫ్ జవాన్ల సేవ, నిజాయితీలకు గుర్తుగా 2020, ఫిబ్రవరి 14న ఈ స్థూపాన్ని ఆవిష్కరించారు. దాడిలో ప్రాణాలు కోల్పోయిన 40 మంది జవాన్ల ఫొటోలను వారి పేర్లతో సహా ఆ స్తూపంపై చెక్కారు.
మీ బలిదానాన్ని మరువలేం: ప్రధాని
‘పుల్వామా’అమరవీరులకు ఫిబ్రవరి 14న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఘనంగా నివాళులర్పించారు. దేశ రక్షణ కోసం జీవితాన్ని అంకితం చేసి, చివరికి ప్రాణత్యాగం చేసిన వారికి సాటి, పోటీ ఎవరూ లేరని కొనియాడారు. భారతీయులు ఎన్నటికీ ఆ వీర సైనికుల బలిదానాన్ని మరువలేరని మోదీ ట్వీట్ చేశారు.
2019 పుల్వామా దాడి
జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లా అవంతిపొరా పట్టణం సమీపంలోని లెత్‌పొరా వద్ద సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు 2019, ఫిబ్రవరి 14న ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఓ స్కార్పియో ఎస్‌యూవీలో దాదాపు 350 కేజీల అత్యాధునిక పేలుడు పదార్థాన్ని (ఐఈడీ) నింపుకున్న ఓ ఆత్మాహుతి దళసభ్యుడు జవాన్ల వాహన శ్రేణిని లక్ష్యంగా చేసుకున్నాడు. తన కారుతో కాన్వాయ్‌లోని ఓ బస్సును ఢీకొట్టి తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు వీర మరణం పొందగా, మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా సీఆర్పీఎఫ్ 76వ బెటాలియన్‌కు చెందిన వారు. ఈ దాడిని తామే చేశామని పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రసంస్థ జైషే మహమ్మద్ ప్రకటించుకుంది.
రామాయణ ఇతివృత్తంతో నూతన రైలు
రామాయణ ఇతివృత్త నేపథ్యంతో కూడిన రైలును మార్చి చివర్లోగా తీసుకొస్తామని రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ ఫిబ్రవరి 14న తెలిపారు. ఈ రైలు లోపలా బయటా రామాయణాన్ని జ్ఞప్తికి తెచ్చేలా తీర్చిదిద్దుతామని, రైల్లో రామాయణ కీర్తనలు ఉంటాయన్నారు. దేశం నలుమూలల నుంచి రామాయణంతో ముడిపడి ఉన్న ప్రాంతాలగుండా ఈ రైలు నడిపిస్తామని చెప్పారు. ‘రామాయణ్ ఆన్ వీల్స్’గా ఈ రైలు ప్రాముఖ్యత పొందుతుందన్నారు. మరోవైపు రైల్వేలు చేపట్టిన ‘జాతీయ ప్రాముఖ్యత’ కలిగిన ప్రాజెక్టులను 2023కల్లా పూర్తి చేస్తామని వీకే యాదవ్ చెప్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రామాయణ ఇతివృత్తంతో నూతన రైలు
ఎప్పుడు : ఫిబ్రవరి 14
ఎవరు : రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్
ఎక్కడ : దేశవ్యాప్తంగా రామాయణంతో ముడిపడి ఉన్న ప్రాంతాలగుండా
మద్రాసు ఐఐటీతో ఎన్నికల కమిషన్ ఒప్పందం
దేశంలో ఎక్కడినుంచైనా ఓటు వేయటానికి వీలు కల్పించే బ్లాక్‌చైన్ టెక్నాలజీపై కలసి పని చేసేందుకు భారత ఎన్నికల కమిషన్, మద్రాసు ఐఐటీతో ఒప్పందం కుదుర్చుకుంది.ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ప్రయోగ దశలో ఉందని ఎన్నికల కమిషన అధికారులు తెలిపారు. బ్లాక్‌చైన్ టెక్నాలజీతో ఓటింగ్‌లో పాల్గొనేందుకు ప్రజలు ప్రభుత్వం ఏర్పాటు చేసే నిర్దిష్ట ప్రదేశానికి రావాల్సి ఉంటుందని తెలిపారు. ‘ఉదాహరణకు చెన్నైకి చెందిన వ్యక్తి ఢిల్లీలో ఉంటే ఢిల్లీలోనే అధికారులు ఏర్పాటు చేసిన అధీకృత సెంటర్ ద్వారా చైన్నైలో జరుగుతున్న ఎన్నికల్లో ఓటు వేయవచ్చు. దీనికి ఈ-బాలెట్ పేపర్ జనరేట్ అవుతుంది’ అని చెప్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మద్రాసు ఐఐటీతో ఒప్పందం
ఎప్పుడు : ఫిబ్రవరి 15
ఎవరు : భారత ఎన్నికల కమిషన్
ఎందుకు : బ్లాక్‌చైన్ టెక్నాలజీపై కలసి పని చేసేందుకు
వారణాసిలో రూ.1,254 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సొంత నియోజకవర్గం వారణాసిలో ఫిబ్రవరి 16న పర్యటించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో రూ.1,254 కోట్లు విలువ చేసే 50 ప్రాజెక్టులకు సంబంధించి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఆరెస్సెస్ సిద్ధాంతకర్త పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ మెమోరియల్ సెంటర్‌ను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా 63 అడుగుల ఎత్తై దీన్‌దయాళ్ విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించారు. మరోవైపు వారణాసిలో శ్రీ జగద్గురు విశ్వారాధ్య గురుకుల్ శతాబ్ది ఉత్సవాల్లోనూ ప్రధాని పాల్గొన్నారు. 430 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని, కాశీ ఏక్ రూప్ అనేక్ పేరుతో ఏర్పాటైన హస్తకళల ప్రదర్శనను ఆయన ప్రారంభించారు.
సీఏఏను వెనక్కి తీసుకోం..
వారణాసి పర్యటన సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాలపై ఒత్తిళ్లకు తలొగ్గి పునరాలోచన చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. దళితులు, ఇతర అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పండిట్ దీన్ దయాళ్ అంత్యోదయ పథకం తెచ్చారని పేర్కొన్నారు. వారణాసిలో అయిదేళ్లలో రూ.25 వేల కోట్ల అభివృద్ధి పనులు జరుగు తున్నాయని తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రూ.1,254 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 16
ఎవరు : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఎక్కడ : వారణాసి, ఉత్తరప్రదేశ్
ఐఆర్‌సీటీసీ మహాకాళ్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం
ఐఆర్‌సీటీసీకి చెందిన మూడో ప్రైవేటు రైలు ‘మహాకాళ్ ఎక్స్‌ప్రెస్’ను ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 16న వీడియో లింక్ ద్వారా ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లోని కాశీ, మధ్యప్రదేశ్‌లో ఉజ్జయిని, ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగ క్షేత్రాలకు వెళ్లడానికి ఈ మహాకాళ్ ఎక్స్‌ప్రెస్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఈ ఎక్స్‌ప్రెస్‌లో శివుడికి ప్రత్యేకంగా ఓ సీటు రిజర్వ్ చేశారు. ఎవరూ కూర్చోకుండా అది శివుడిదని తెలిసేలా బీ5 కోచ్‌లోని 64వ సీటును శివుడికి కేటాయించినట్లు ఉత్తర రైల్వే అధికార ప్రతినిధి దీపక్ కుమార్ తెలిపారు. ఈ సీటు కేవలం ఒక్కసారికేనా లేక శాశ్వతంగా ఉంటుందా అన్న విషయంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మహాకాళ్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 16
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎందుకు : ఉత్తరప్రదేశ్‌లోని కాశీ, మధ్యప్రదేశ్‌లో ఉజ్జయిని, ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగ క్షేత్రాలకు వెళ్లడానికి
బాలికా విద్యపై మహీంద్రా, నాందీ ఫౌండేషన్ సర్వే
దేశంలో బాలికల అక్షరాస్యతపై ‘ది టీన్ ఏజ్ గర్ల్స్ (టీఏజీ)’ ప్రాజెక్టులో భాగంగా మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్, నాందీ ఫౌండేషన్ సంస్థలు దేశ వ్యాప్తంగా సర్వే నిర్వహించాయి. 2019-20 సంవత్సరంలో దేశంలోని 600కుపైగా జిల్లాల్లో 74 వేల మంది టీనేజీ బాలికల్ని సర్వేలో భాగం చేశారు. 13 నుంచి 19 ఏళ్ల మధ్య వయసు గల అమ్మాయిల్లో కేరళ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ రాష్ట్రాలు 100 శాతం అక్షరాస్యత సాధించి ముందంజలో ఉన్నాయని ఈ సర్వే వెల్లడించింది. అక్షరాస్యత శాతం పెరిగితే.. మాతా శిశు మరణాలను 50 శాతం వరకూ తగ్గించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.
టీఏజీ సర్వేలో వెల్లడైన అంశాలు..
ఏమిటి : దేశంలో బాలికల అక్షరాస్యతపై సర్వే
ఎప్పుడు : ఫిబ్రవరి 16
ఎవరు : మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్, నాందీ ఫౌండేషన్ సంస్థలు
మహిళా సైనికాధికారులకు శాశ్వత కమిషన్ ఏర్పాటు
భారత సైన్యంలో పనిచేస్తోన్న మహిళా అధికారులకు పురుషులతో సమానంగా ఉన్నత బాధ్యతలు నెరవేర్చే అవకాశం ఇవ్వకపోవడం రాజ్యాంగం ప్రసాదించిన సమానత్వ భావనను వ్యతిరేకించడమేనని సుప్రీంకోర్టు ఫిబ్రవరి 17న ప్రతిష్టాత్మక తీర్పునిచ్చింది. అందులో భాగంగానే షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ)లోని మహిళా సైనికాధికారులకు మూడు నెలల్లోగా శాశ్వత కమిషన్(పర్మనెంట్ కమిషన్-పీసీ) ఏర్పాటు చేయాలని కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించింది. శారీరక పరిమితులు, సామాజిక కట్టుబాట్ల పేరుతో సైనిక పటాలాల కమాండింగ్ బాధ్యతల్లో మహిళా అధికారులను నియమించకపోవడం తగదని స్పష్టం చేసింది.
తాజా తీర్పుతో..
సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పుతో... మహిళా సైనికాధికారులకు కమాండ్ పోస్టింగ్‌సతో పాటు పురుష అధికారులతో సమానంగా పదోన్నతులు, ర్యాంక్స్, పెన్షన్సు, ఇతర ప్రయోజనాలు దక్కనున్నాయి.
2010 నాటి ఢిల్లీ హైకోర్టు తీర్పుకు సమర్థన
మహిళా సైనికుల విషయంలో వివక్ష తగదంటూ 2010లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. పదేళ్లుగా ఈ ఆదేశం అమలుపై కేంద్రం శ్రద్ధ చూపలేదని తప్పు పట్టింది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ కేంద్రం వేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ.. జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అజయ్ రస్తోగీల ధర్మాసనం ఫిబ్రవరి 17న ఈ తీర్పునిచ్చింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మహిళా సైనికాధికారులకు శాశ్వత కమిషన్ ఏర్పాటు చేయాలి
ఎప్పుడు : ఫిబ్రవరి 17
ఎవరు : సుప్రీంకోర్టు
వెల్‌నెస్ సెంటర్ల నిర్వహణలో ఏపీకి అగ్రస్థానం
ఆయుష్మాన్ భారత్ పథకం అమలులో భాగంగా హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్ల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 66 మార్కులతో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి వికాస్ షీల్ రాష్ట్రానికి లేఖ రాశారు. గ్రామీణ ప్రాంతాల్లో పేద రోగులకు వైద్యసేవలు అందించడం, వారి వివరాలను నమోదు చేయడం, వాటిని కేంద్ర ఆరోగ్య శాఖ పోర్టల్‌కు అనుసంధానించడం వంటి విషయాల్లో ఏపీ మంచి ప్రతిభ కనబరిచినట్టు లేఖలో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా అమలవుతున్న ప్రధానమంత్రి మాతృవందన యోజనలోనూ ఇటీవల ఆంధ్రప్రదేశ్‌కు రెండో ర్యాంక్ వచ్చిన విషయం తెలిసిందే.
తెలంగాణకు 19వ స్థానం...
2019 డిసెంబర్, 2020 జనవరి నెలలకు సంబంధించి హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్ల నిర్వహణలో రాష్ట్రాల ప్రతిభను లెక్కించారు. ఇందులో 58 మార్కులతో గోవా, తమిళనాడు రెండో స్థానంలో, 57 మార్కులతో గుజరాత్ మూడో స్థానంలో నిలిచాయి. తెలంగాణ 37 మార్కులతో 19వ స్థానంలో నిలిచింది.
రెండు రకాల సేవలు...
ఆయుష్మాన్ భారత్ పథకం రెండు రకాల సేవలు ఉంటాయి. ఒకటి.. జన ఆరోగ్య యోజన (ఆరోగ్యశ్రీ తరహా) కాగా రెండోది హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్ల నిర్వహణ.
వెల్‌నెస్ సెంటర్ల నిర్వహణలో టాప్-10 రాష్ట్రాలు
మార్చి 28న శ్రీరామాయణ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం
శ్రీరామచంద్రుడి పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు రైల్వేశాఖ ప్రారంభించనున్న ప్రత్యేక రైలు ‘శ్రీరామాయణ ఎక్స్‌ప్రెస్’ 2020, మార్చి 28న ఢిల్లీ నుంచి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని ఇండియన్ రెల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) ఫిబ్రవరి 19న వెల్లడించింది. మొత్తం 16 రాత్రులు -17 పగళ్ల పాటు ఈ యాత్ర సాగనుందని పేర్కొంది. రామాయణ ఇతివృత్త నేపథ్యంతో కూడిన ఈ రైలు లోపలా బయటా రామాయణాన్ని జ్ఞప్తికి తెచ్చేలా తీర్చిదిద్దుతామని, రైల్లో రామాయణ కీర్తనలు ఉంటాయని రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ తెలిపారు. దేశం నలుమూలల నుంచి రామాయణంతో ముడిపడి ఉన్న ప్రాంతాలగుండా ఈ రైలును నడిపిస్తామని చెప్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2020, మార్చి 28 నుంచి శ్రీరామాయణ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 19
ఎవరు : భారతీయ రైల్వే
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : శ్రీరామచంద్రుడి పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు..
పీఎంఎఫ్‌బీవైలో మార్పులకు కేబినెట్ ఆమోదం
ప్రతిష్టాత్మక రైతు బీమా పథకం ‘ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన(పీఎంఎఫ్‌బీవై)’లో మార్పులు చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఫిబ్రవరి 19న సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో పీఎంఎఫ్‌బీవైలో చేరడం రైతులకు తప్పనిసరి కాదు... రైతులు ఇకపై అందులో చేరడం స్వచ్ఛందమే. పంట రుణాలు తీసుకున్న రైతులు పీఎంఎఫ్‌బీవైలో కచ్చితంగా చేరాలన్న నిబంధన ఇప్పటివరకూ ఉండేది.
నిరోధించలేని ప్రకృతి విపత్తుల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఖరీఫ్ పంటలకు 2 శాతం, రబీ పంటలకు 1.5 శాతం, పండ్ల తోటలు, వ్యాపార పంటలకు 5 శాతం ప్రీమియంతో సమగ్రంగా బీమా సౌకర్యం కల్పించేలా పీఎంఎఫ్‌బీవైని రూపొందించారు.
కేబినెట్ సమావేశలోని మరికొన్ని నిర్ణయాలు...
ఏమిటి : పీఎంఎఫ్‌బీవైలో మార్పులకు ఆమోదం
ఎప్పుడు : ఫిబ్రవరి 19
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : పంట రుణాలు తీసుకున్న రైతులు పీఎంఎఫ్‌బీవైలో కచ్చితంగా చేరాలన్న నిబంధన సడలించేందుకు
అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ బిల్లుకు ఆమోదం
కృత్రిమ గర్భధారణ, ఇతర పునరుత్పత్తికి సంబంధించిన రంగంలోని వైద్య నిపుణులు, క్లినిక్‌లను నమోదు చేసేందుకు ప్రత్యేకంగా నేషనల్ రిజిస్రీన్టి,రిజిస్ట్రేషన్ అథారిటీని ఏర్పాటు చేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ‘అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ(నియంత్రణ) బిల్’కు కేంద్ర కేబెనెట్ ఫిబ్రవరి 19న ఆమోదం తెలిపింది.
బిల్లులోని ప్రతిపాదనలు...
ఏమిటి : అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ(నియంత్రణ) బిల్‌కు ఆమోదం
ఎప్పుడు : ఫిబ్రవరి 19
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : వైద్యరంగానికి సంబంధించి నేషనల్ రిజిస్రీన్టి,రిజిస్ట్రేషన్ అథారిటీని ఏర్పాటు చేసేందుకు
22వ న్యాయ కమిషన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం
క్లిష్టమైన అంశాల్లో ప్రభుత్వానికి సలహాలిచ్చేందుకు ఉద్దేశించిన ‘22వ న్యాయ కమిషన్’ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఫిబ్రవరి 19న ఆమోదం తెలిపింది. మూడేళ్ల కాల వ్యవధితో కొత్త కమిషన్‌ను న్యాయ శాఖ ఏర్పాటు చేయనుంది. ఈ కమిషన్‌లో ఒక చైర్‌పర్సన్, నలుగురు పూర్తిస్థాయి సభ్యులు(సభ్య కార్యదర్శి సహా), ఐదుగురికి మించకుండా తాత్కాలిక సభ్యులు, ఇద్దరు ఎక్స్ అఫిషియో సభ్యులు ఉంటారు.
స్వచ్ఛ భారత్ రెండో దశకు ఆమోదం..
స్వచ్ఛ భారత్ మిషన్(గ్రామీణ) రెండో దశకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ. 52,497 కోట్ల అంచనా బడ్జెట్‌తో(కేంద్రం, రాష్ట్రాలు కలిసి) 2020-21 నుంచి 2024-25 మధ్య ఈ రెండో దశను అమలు చేస్తారు. అధికారిక లెక్కల ప్రకారం, 2019, అక్టోబర్ 2 నాటికి, అన్ని రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాలు బహిరంగ మల విసర్జన రహితం(ఓడీఎఫ్) అయ్యాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 22వ న్యాయ కమిషన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం
ఎప్పుడు : ఫిబ్రవరి 19
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : క్లిష్టమైన అంశాల్లో ప్రభుత్వానికి సలహాలిచ్చేందుకు
బోడో శాంతి ఒప్పంద ఉత్సవాల్లో ప్రధాని మోదీ
అస్సాంలోని కోక్రాఝర్‌లో జరుపుకుంటోన్న బోడో శాంతి ఒప్పంద ఉత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 7న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ.. ఈశాన్య రాష్ట్రాల శాంతి, అభివృద్ధి కోసం కలిసిపనిచేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. బోడో ఒప్పందం ద్వారా శాంతి, అహింస విజయం సాధించాయనీ అది ప్రజల వల్లే సాధ్యమైందనీ పేర్కొన్నారు. బోడో శాంతి ఒప్పందం 21వ శతాబ్దంలో అస్సాం సహా మొత్తం ఈశాన్య ప్రాంతానికే ఒక నూతన ప్రారంభం అని మోదీ అన్నారు.
బోడోలాండ్ ప్రజలకు ప్రత్యేక రాజకీయ, ఆర్థిక హక్కులను కల్పించే ‘త్రైపాక్షిక ఒప్పందం’పై కేంద్రప్రభుత్వం, అస్సాం రాష్ట్ర ప్రభుత్వం, బోడో ఉద్యమ సంస్థలు 2020, జనవరి 27న సంతకాలు చేసిన విషయం తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బోడో శాంతి ఒప్పంద ఉత్సవాలు
ఎప్పుడు : ఫిబ్రవరి 7
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : కోక్రాఝర్, అస్సాం
దేశంలో చిరుతల సంఖ్య తగ్గింది: సీడబ్ల్యూఎస్
దేశవ్యాప్తంగా చిరుతల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు బెంగళూరులోని వన్య జీవుల అధ్యయన కేంద్రం (సెంటర్ ఫర్ వైల్డ్‌లైఫ్ స్టడీస్- సీడబ్ల్యూఎస్) వెల్లడించింది. వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఐఐ)తో కలిసి తాము నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైందని పేర్కొంది. పశ్చిమ కనుమలు, దక్కన్ పీఠభూమి, ఉత్తర భారత శివాలిక్ పర్వతాల్లో ఎక్కువగా సంచరించే చిరుతల సంఖ్య 70-90శాతం తగ్గినట్లు తెలిపింది. గత 120-200 ఏళ్లలో ఈ చిరుతల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు వివరించింది. ఆక్యుపెన్సీ మోడలింగ్ విధానంతో చిరుతలను లెక్కించగా అనువంశికత దృష్ట్యా చిరుతల సముదాయం వైవిధ్యతను కోల్పొయిందని సీడబ్ల్యూఎస్ చెప్పింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : చిరుతల సంఖ్య గణనీయంగా తగ్గింది
ఎప్పుడు : ఫిబ్రవరి 7
ఎవరు : వన్య జీవుల అధ్యయన కేంద్రం (సెంటర్ ఫర్ వైల్డ్‌లైఫ్ స్టడీస్- సీడబ్ల్యూఎస్)
ఎక్కడ : దేశవ్యాప్తంగా
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వారికి ఉద్యోగాల్లో, పదోన్నతుల్లో రిజర్వేషన్లను కల్పించడానికి సంబంధించి ఫిబ్రవరి 7న సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. నియామకాల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్రాలు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అలాగే, ప్రమోషన్లలో రిజర్వేషన్లను అమలు చేయాలని కోరడానికి సంబంధించి ఎలాంటి ప్రాథమిక హక్కు లేదని పేర్కొంది. ‘రిజర్వేషన్లు కల్పించాలని కోర్టులు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించలేవు’ అని జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ హేమంత్ గుప్తాల ధర్మాసనం తేల్చిచెప్పింది.
2012 సెప్టెంబర్ 5న ఉత్తరాఖండ్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు అందులో పేర్కొనలేదు. ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేయగా, ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రభుత్వ నోటిఫికేషన్‌ను కొట్టివేసింది. ఆ ఉత్తరాఖండ్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై తీర్పు వెలువరిస్తూ సుప్రీంకోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. ఉత్తరాఖండ్ ప్రభుత్వ నోటిఫికేషన్‌ను సమర్ధిస్తూ, హైకోర్టు ఆదేశాలను కొట్టివేసింది.
ఎస్సీ, ఎస్టీ చట్టం రాజ్యాంగబద్ధమే: సుప్రీంకోర్టు
ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక సవరణ చట్టం -2018 చట్టబద్ధతను సుప్రీంకోర్టు సమర్థించింది. ప్రాథమిక విచారణలో ఆరోపణలు నిరూపించలేకపోతే సదరు వ్యక్తికి బెయిల్ మంజూరు చేయవచ్చని కోర్టు పేర్కొంది. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి ముందే ప్రాథమిక విచారణ అవసరం లేదని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఫిబ్రవరి 10న పేర్కొంది. ముందస్తు బెయిల్ అవకాశాన్ని దుర్వినియోగం చేయడం పార్లమెంట్ ఉద్దేశాలకు విరుద్ధమని వ్యాఖ్యానించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక సవరణ చట్టం -2018 రాజ్యాంగబద్ధమే
ఎప్పుడు : ఫిబ్రవరి 10
ఎవరు : సుప్రీంకోర్టు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) మరోసారి ఘన విజయం సాధించింది. ఫిబ్రవరి 11న వెల్లడైన ఎన్నికల ఫలితాల ప్రకారం.. మొత్తం 70 స్థానాలకు గానూ 62 సీట్లలో విజయ కేతనం ఎగరేసింది. బీజేపీని 8 స్థానాలకు పరిమితం చేసింది. గతంలో వరుసగా మూడుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ఈసారి ఖాతా తెరవలేకపోయింది. ఈ ఎన్నికల్లో ఆప్‌కు 53.57 శాతం, బీజేపీకి 38.51 శాతం, కాంగ్రెస్‌కు 4.26 శాతం ఓట్లు లభించాయి. 2015 ఎన్నికల్లో ఆప్ 54.34 శాతం ఓట్లు సాధించింది. న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి కేజ్రీవాల్ బీజేపీ అభ్యర్థి సునీల్ కుమార్ యాదవ్‌పై గెలుపొందారు.
మూడోసారి సీఎం పీఠంపై..
తాజాఎన్నికల్లో ఘన విజయంతో మూడోసారి సీఎం కుర్చీపై కేజ్రీవాల్ కూర్చోబోతున్నారు. తొలిసారి 2013 డిసెంబర్ 28న కాంగ్రెస్ మద్దతుతో మైనారిటీ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేశారు. కానీ, 49 రోజులు మాత్రమే అధికారంలో ఉండి 2014, ఫిబ్రవరి 14న రాజీనామా చేశారు. ఆ తరువాత, 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 67 సీట్లతో దాదాపు క్లీన్‌స్వీప్ చేసింది. బీజేపీ 3 సీట్లలో మాత్రమే గెలుపొందింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం
ఎప్పుడు : ఫిబ్రవరి 11
ఎవరు : ఆమ్ ఆద్మీ పార్టీ
ఎన్నికల్లో బ్లాక్‌చైన్ వ్యవస్థ : సునీల్ అరోరా
ఎన్నికల్లో బ్లాక్‌చైన్ వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు ఐఐటీ మద్రాస్‌తో కలసి పనిచేస్తున్నామని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా తెలిపారు. ఢిల్లీలో ఫిబ్రవరి 12న జరిగిన ‘టైమ్స్ నౌ సమిట్’ కార్యక్రమంలో పాల్గొన్న అరోరా ఈ మేరకు వెల్లడించారు. బ్లాక్‌చైన్ వ్యవస్థ అందుబాటులోకి వస్తే ఒక ఓటర్ వేరే రాష్ట్రంలో ఉండి కూడా తమ రాష్ట్రంలోని ఎన్నికల్లో ఓటేయవచ్చని పేర్కొన్నారు. ఈ విధానం అమలులోకి తేవడం అంటే ఇంట్లో కూర్చొని ఓటు వేయడం కాదన్నారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లే.. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుందని చెప్పారు.
పెస్టిసైడ్స్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
పురుగుమందుల వ్యాపార క్రమబద్ధీకరణతో పాటు, నకిలీ పురుగుమందుల కారణంగా నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు ఉద్దేశించిన ‘పెస్టిసైడ్స్ మేనేజ్‌మెంట్ బిల్-2020’కు కేంద్ర కేబినెట్ ఫిబ్రవరి 12న ఆమోదం తెలిపింది. ఈ విషయమై కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం పురుగుమందుల వ్యాపారం ఇన్‌సెక్టిసైడ్ యాక్ట్ - 1968 నిబంధనల ప్రకారం జరుగుతోంది. ఆ నిబంధనలకు కాలం చెల్లింది. అందుకే కొత్త బిల్లును రూపొందించాం’ అని తెలిపారు. రైతుల ప్రయోజనాలే ధ్యేయంగా, వారికి సురక్షితమైన, ప్రభావశీలమైన పురుగుమందులు అందించడం, నకిలీ పురుగుమందులను అరికట్టడం లక్ష్యంగా ఈ బిల్లు రూపొందిందన్నారు.
పెస్టిసైడ్స్ బిల్లులోని అంశాలు...
ఏమిటి : పెస్టిసైడ్స్ మేనేజ్‌మెంట్ బిల్-2020కు ఆమోదం
ఎప్పుడు : ఫిబ్రవరి 12
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : రైతులకు సురక్షితమైన, ప్రభావశీలమైన పురుగుమందులు అందించడం, నకిలీ పురుగుమందులను అరికట్టడం లక్ష్యంగా
భారత్‌లో తొలి కరోనా కేసు నమోదు
ప్రాణాంతక కరోనా వైరస్‌కు సంబంధించి భారత్‌లో తొలి కేసు నమోదైంది. చైనాలోని వుహాన్ యూనివర్సిటీలో చదువుతున్న కేరళకు చెందిన విద్యార్థినికి ఈ వైరస్ సోకినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని జనవరి 30న భారత ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వైరస్‌కు సంబంధించి దేశంలోని పలు నగరాల్లో అనుమానిత కేసులు నమోదయ్యాయి. కానీ వైరస్ సోకినట్లు ధ్రువీకరించిన తొలి కేసు ఇదే. మరోవైపు చైనాలోని వుహాన్ నుంచి భారతీయులను తిరిగి వెనక్కి రప్పించేందుకు భారత ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.
170 మంది మృతి..
చైనాలో కరోనా వైరస్ బారినపడి జనవరి 30నాటికి 170 మంది మరణించారు. మరో 7,711 మందికి ఈ వైరస్ సోకినట్లు గుర్తించారు. ఈ ప్రాణాంతక వైరస్ ప్రపంచవ్యాప్తంగా 17 దేశాలకు విస్తరించింది. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు దాదాపు నాలుగు బిలియన్ డాలర్ల నిధులను చైనా ప్రభుత్వం కేటాయించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కరోనా వైరస్‌కు సంబంధించి భారత్‌లో తొలి కేసు నమోదు
ఎప్పుడు : జనవరి 30
ఎవరు : భారత ప్రభుత్వం
ఎక్కడ : కేరళ
ప్రతి పది మందిలో ఒకరికి కేన్సర్ : డబ్ల్యూహెచ్‌వో
భారతదేశంలో 2018లో దాదాపు 11.6 లక్షల కేన్సర్ కేసులు కొత్తగా నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. ప్రతి పది మంది భారతీయుల్లో ఒకరు తమ జీవిత కాలంలో ప్రాణాంతక కేన్సర్ వ్యాధి బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. కేన్సర్ బారిన పడిన వారిలో ప్రతి 15 మందిలో ఒకరు మరణించే అవకాశం ఉందని తెలిపింది. వరల్డ్ కేన్సర్ డే సందర్భంగా డబ్ల్యూహెచ్‌వో, ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ కేన్సర్ (ఐఏఆర్‌సీ) సంస్థలు ఫిబ్రవరి 4న రెండు నివేదికలు విడుదల చేశాయి. కేన్సర్ వ్యాధిపై ప్రపంచవ్యాప్తంగా ఎజెండా రూపొందించడంతో పాటు కేన్సర్‌పై పరిశోధన, నివారణలపై ఈ నివేదికలు ప్రధాన దృష్టి సారించాయి. సరైన జాగ్రత్తలు తీసుకోని పక్షంలో రాబోయే 20 ఏళ్లలో మధ్య ఆదాయ దేశాల్లో కేన్సర్ మరణాల రేటు 60 శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది.
వరల్డ్ కేన్సర్ డే 2020 థీమ్ : ఐ యామ్ అండ్ ఐ విల్
త్వరలో ఎయిర్ డిఫెన్స్ కమాండ్ ఏర్పాటు
భారత గగనతలంలో జరిగే వైమానిక దళ ఆపరేషన్లు అన్నింటినీ పర్యవేక్షించేలా ‘ఎయిర్ డిఫెన్స్ కమాండ్’ను త్వరలో ఏర్పాటు చేస్తామని భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ ఫిబ్రవరి 4న వెల్లడించారు. హిందూ మహాసముద్రం పరిసర ప్రాంతాల్లో జరిగే నేవీ ఆపరేషన్ల కోసం ద్వీపకల్ప కమాండ్‌ను, సైనికులకు వసతి, ఆయుధాలు సమకూర్చడం వంటి అవసరాలు తీరుస్తూనే, వారి సేవల్ని వినియోగించుకునేలా లాజిస్టిక్ కమాండ్‌ను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపారు.
సాయుధ బలగాలన్నీ సంఘటితం కావడానికి, సమన్వయంతో పనిచేయడానికి ఎయిర్ డిఫెన్స్ కమాండ్‌ను ఏర్పాటు చేస్తామని జనరల్ రావత్ పేర్కొన్నారు. వైమానిక దళానికి చెందిన విభాగాలన్నీ ఒకే కమాండ్ కిందకి వస్తే ఎదురయ్యే సమస్యల్ని నియంత్రించడం సులభం అవుతుందని అన్నారు. సిబ్బంది పని విభజన సక్రమంగా జరిగేలా లాజిస్టిక్స్ కమాండ్‌ను ఏర్పాటు చేయాలని అన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : త్వరలో ఎయిర్ డిఫెన్స్ కమాండ్ ఏర్పాటు
ఎప్పుడు : ఫిబ్రవరి 4
ఎవరు : చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్
ఎందుకు : భారత గగనతలంలో జరిగే వైమానిక దళ ఆపరేషన్లు అన్నింటినీ పర్యవేక్షించేందుకు
అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ట్రస్ట్
అయోధ్యలో రామ మందిర నిర్మాణ పర్యవేక్షణకు ఒక స్వతంత్ర సంస్థ(ట్రస్ట్) ఏర్పాటైంది. అత్యద్భుతంగా మందిర నిర్మాణం జరిపేందుకు ‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర’ పేరుతో ట్రస్ట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఫిబ్రవరి 5న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభలో ప్రకటించారు. మందిర నిర్మాణానికి ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలని ‘అయోధ్య’ తీర్పులో సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. 3 నెలల్లోగా ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించగా, ఆ గడువు 2020, ఫిబ్రవరి 9తో ముగియనున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
మందిర విషయమై మోదీ మాట్లాడుతూ... రామ మందిర అభివృద్ధి కోసం ఒక విసృ్తత పథకాన్ని సిద్ధం చేశామన్నారు. అయోధ్యలోని వివాదాస్పద స్థలం సహా మొత్తం 67.703 ఎకరాలను ఈ ట్రస్ట్‌కు బదిలీ చేస్తామన్నారు. అన్ని వర్గాల అభివృద్ధి లక్ష్యంగా ‘సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్’ మార్గంలో తన ప్రభుత్వం పయనిస్తోందన్నారు.
15 మంది ట్రస్టీలు..
రామ మందిర నిర్మాణం కోసం ఏర్పాటైన ట్రస్ట్‌లో 15 మంది సభ్యులుంటారని, వారిలో ఒకరు దళిత వర్గానికి చెందినవారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ ట్రస్ట్ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. అయితే, ట్రస్టీల పేర్లను ఇంకా ప్రభుత్వం ప్రకటించలేదు. ‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర’ ప్రధాన కార్యాలయం ఢిల్లీలోని గ్రేటర్ కైలాశ్ ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది.
సున్నీ వక్ఫ్ బోర్డ్‌కు ఐదెకరాలు
మసీదు నిర్మాణం కోసం అయోధ్య జిల్లాలో సున్నీ వక్ఫ్ బోర్డ్‌కు ఐదెకరాల స్థలాన్ని కేటాయిస్తూ యూపీ సర్కార్ నిర్ణయించింది. సున్నీ వక్ఫ్ బోర్డ్‌కు మసీదు నిర్మాణం కోసం ఐదెకరాల స్థలాన్ని కేటాయించాలని అయోధ్య తీర్పులో సుప్రీంకోర్టు ఆదేశించడం తెల్సిందే. అయోధ్య నుంచి 18 కి.మీల దూరంలో లక్నో హైవేపై ఈ స్థలాన్ని కేటాయించినట్లు యూపీ ప్రభుత్వం తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రామ మందిర నిర్మాణానికి ట్రస్ట్ ఏర్పాటు
ఎప్పుడు : ఫిబ్రవరి 5
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : అయోధ్య, ఉత్తరప్రదేశ్
లక్నోలో 11వ డిఫెక్స్‌పో ప్రారంభం
రక్షణ ఉత్పత్తుల ఎగ్జిబిషన్ ‘11వ డిఫెక్స్‌పో’ ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఫిబ్రవరి 5న ప్రధాని నరేంద్ర మోదీ ఈ డిఫెక్స్‌పోను ప్రారంభించారు. అనంతరం మోదీ మాట్లాడుతూ... రానున్న ఐదేళ్లలో భారత్ నుంచి 500 కోట్ల డాలర్ల(రూ. 35.6 వేల కోట్లు) విలువైన మిలటరీ ఉత్పత్తులను ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా భారత్‌లో తయారీ యూనిట్లను ప్రారంభించాలని ప్రపంచంలోని ప్రముఖ రక్షణ పరికరాల తయారీ సంస్థలను కోరారు. ఏ దేశాన్నో లక్ష్యంగా చేసుకుని భారత్ తన సైనిక శక్తిని పెంపొందించుకోవాలనుకోవడం లేదని స్పష్టం చేశారు. శాంతి, సుస్థిరతలను కాపాడే విషయంలో భారత్ నమ్మదగిన భాగస్వామి అన్నారు.
భారత్ రెండేళ్లకు ఒకసారి ఈ ‘డిఫెక్స్‌పో’ను నిర్వహిస్తుంది. ఈ సంవత్సరం జరుగుతోంది 11వ ప్రదర్శన. ఐదు రోజుల పాటు జరిగే 11వ డిఫెక్స్‌పోకు 38 దేశాల రక్షణ మంత్రులు, 172 విదేశీ, 856 స్వదేశీ మిలటరీ ఎక్విప్‌మెంట్ సంస్థల ఉన్నతస్థాయి ప్రతినిధులు హాజరవుతున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 11వ డిఫెక్స్‌పో ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 5
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : లక్నో, ఉత్తరప్రదేశ్
సరోగసీ బిల్లుపై సెలెక్ట్ కమిటీ నివేదిక
సరోగసీ(రెగ్యులేషన్) బిల్లు-2019పై రాజ్యసభ సెలెక్ట్ కమిటీ ఒక నివేదికను రూపొందించింది. ఈ నివేదికను కమిటీ చైర్మన్ భూపేందర్ యాదవ్ ఫిబ్రవరి 5న రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయడుకి అందజేశారు. సరోగసీ(రెగ్యులేషన్) బిల్లు-2019ని నవంబర్ 21, 2019న రాజ్యసభ సెలెక్ట్ కమిటీకి పంపించారు. అప్పటి నుంచి ఈ కమిటీ 10 సార్లు సమావేశమై తాజా నివేదికను రూపొందించింది. 23 మంది సభ్యుల సెలెక్ట్ కమిటీ బృందం సరోగసీ బిల్లులో పలు మార్పులను సూచించింది.
సరోగసీ బిల్లుపై సెలెక్ట్ కమిటీ సూచనలు
ఆటో ఎక్స్ పో 2020 మోటార్ షో ప్రారంభం
ఆటోమొబైల్ పరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఆటో ఎక్స్‌పో 2020 మోటార్ షో’ ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఫిబ్రవరి 5న లాంఛనంగా ప్రారంభమైంది. భారతీయ పరిశ్రమల సమాఖ్య సీఐఐతో పాటు ఏసీఎంఏ, సియామ్ కలిసి నిర్వహిస్తున్న ఈ ఎక్స్‌పోలో దేశ, విదేశాలకు చెందిన పలు దిగ్గజ ఆటోమొబైల్ సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నాయి. 15 పైగా స్టార్టప్ సంస్థలు, టెలికం, విద్యుత్ వాహనాల సంస్థలు, సోషల్ మీడియా సంస్థలు ఇందులో పాల్గొంటున్నాయి. సుమారు 60 దాకా ప్యాసింజర్ కార్లు, కమర్షియల్ వాహనాలు, ద్విచక్ర వాహనాలను కంపెనీలు ఈ 15వ ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించనున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆటో ఎక్స్‌పో 2020 మోటార్ షో ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 5
ఎక్కడ : గ్రేటర్ నోయిడా, ఉత్తరప్రదేశ్
మహారాష్ట్రలో రూ.65వేల కోట్లతో పోర్టు నిర్మాణం
మహారాష్ట్రలో రూ.65వేల కోట్లతో భారీ పోర్టు నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన ఫిబ్రవరి 5న సమావేశమైన మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ముంబైలోని జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ (జేఎన్‌పీటీ)కి 97 కిలోమీటర్ల దూరంలోని వధావన్ వద్ద ఈ భారీ పోర్టు నిర్మాణం చేపడతారు. ప్రైవేటు భాగస్వామ్యంతో (ల్యాండ్ లార్డ్ మోడల్‌లో) అభివృద్ధి చేసే ఈ ప్రాజెక్టుకు రూ.65,544.54 కోట్లు వ్యయం అవుతుందని అంచనా.
కేంద్ర కేబినెట్ మరికొన్ని నిర్ణయాలు
ఏమిటి : రూ.65వేల కోట్లతో పోర్టు నిర్మాణం
ఎప్పుడు : ఫిబ్రవరి 5
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎక్కడ : వధావన్, మహారాష్ట్ర
అయోధ్య మందిరానికి కేంద్ర ప్రభుత్వ విరాళం రూపాయి
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం తొలి విరాళంగా కేంద్ర ప్రభుత్వం ఒక రూపాయిని లాంఛనంగా ‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర’ ట్రస్ట్‌కు అందజేసింది. ప్రభుత్వం తరపున హోంశాఖలో అండర్ సెక్రటరీగా పనిచేస్తున్న డీ ముర్ము ఫిబ్రవరి 6న ఈ మొత్తాన్ని నగదు రూపంలో ట్రస్ట్‌కు అందించారు. నగదు రూపంలో కానీ, స్థిరచరాస్తుల రూపంలో కానీ ట్రస్ట్‌కు విరాళాలు అందజేయవచ్చని ప్రభుత్వ అధికారులు తెలిపారు. ట్రస్ట్ కార్యాలయాన్ని తాత్కాలికంగా గ్రేటర్ కై లాశ్ ప్రాంతంలోని సీనియర్ న్యాయవాది, ట్రస్ట్ సభ్యుడు పరాశరన్ ఇంట్లో ఏర్పాటు చేశామని, త్వరలో శాశ్వత కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
ఏప్రిల్‌లో మందిర నిర్మాణం..
అయోధ్యలో రామ మందిర నిర్మాణం శ్రీరామ నవమి(ఏప్రిల్ 2) రోజు కానీ, అక్షయ తృతీయ(ఏప్రిల్ 26)రోజు కానీ ప్రారంభమవుతుందని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర సభ్యుడు స్వామి గోవింద దేవగిరి మహారాజ్ చెప్పారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం 15 మంది సభ్యులతో కేంద్రం శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర పేరుతో ఒక ట్రస్ట్‌ను బుధవారం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర’ ట్రస్ట్‌కు తొలి విరాళం
ఎప్పుడు : ఫిబ్రవరి 6
ఎవరు : కేంద్రప్రభుత్వం
ఎందుకు : అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి..

- ఈ హెలికాప్లర్లను ముఖ్యంగా సబ్‌మెరైన్‌లను ధ్వంసం చేసేందుకు ఉపయోగిస్తారు.
- వీటిలో సబ్‌మెరైన్‌ను ధ్వంసం చేసేందుకు యాంటీ సబ్‌మెరైన్ టార్పెడోలు ఉంటాయి.
- అత్యాధునిక రాడార్ సెన్సార్లును కలిగి ఉన్నాయి. ఇవి నావిక దళం రాడార్ పరిమితిని దాటి శత్రు సబ్‌మెరైన్ లొకేషన్‌ని పసిగట్టడానికి ఉపయోగపడతాయి.
- హెవీ లిఫ్ట్ హెలీకాప్టర్ కావడం వల్ల బలమైన యుద్ధ యంత్రాలను మోయగలదు.
- సముద్రం ఒడ్డున అమర్చే ఆయుధ వ్యవస్థలను వీటి సాయంతో ధ్వంసం చేయవచ్చు.
ఏమిటి : అమెరికన్ మల్టీ-రోల్ ఎంహెచ్-60 సీహాక్ (రోమియో) హెలికాప్టర్లను కొనుగోలుకు ఆమోదం
ఎప్పుడు : ఫిబ్రవరి 19
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : భారత నావికా దళ సామర్థ్యాన్ని పెంచేందుకు
థల్ సేనా భవన్ నిర్మాణానికి శంకుస్థాపన
భారత సైన్యం కోసం దేశ రాజధాని న్యూఢిల్లీలో నూతన ప్రధాన కార్యలయం నిర్మించనున్నారు. ‘థల్ సేనా భవన్’ పేరుతో నిర్మించే ఈ భవనానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఫిబ్రవరి 21న శంకుస్థాపన చేశారు. రూ.700 కోట్లతో ఉదయించే సూర్యుడి ఆకృతిలో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. కొత్త భవనం 3-4 ఏళ్లలో సిద్ధమవుతుందని భారత సైన్యాధిపతి జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణె పేర్కొన్నారు. ఏడంతస్తుల ఈ భవనంలో సైన్యానికి చెందిన 2900 మంది, పౌర సిబ్బంది 3100 మంది పనిచేస్తారని ఉన్నతాధికారులు తెలిపారు. 250 మంది భద్రతా సిబ్బంది ఈ ప్రాంగణంలోనే బస చేస్తారని వివరించారు. 4వేల కార్ల పార్కింగ్‌కు ఏర్పాట్లు ఉంటాయన్నారు. ప్రస్తుతం సైనిక ప్రధాన కార్యాలయం సౌత్ బ్లాక్ భవనంలో ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : థల్ సేనా భవన్ నిర్మాణానికి శంకుస్థాపన
ఎప్పుడు : ఫిబ్రవరి 21
ఎవరు : రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
ఎక్కడ : న్యూఢిల్లీ
అంతర్జాతీయ న్యాయ సదస్సు ముగింపు
భారత సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఫిబ్రవరి 22న న్యూఢిల్లీలో మొదలైన అంతర్జాతీయ న్యాయ సదస్సు ఫిబ్రవరి 23న ముగిసింది. ఫిబ్రవరి 23న జరిగిన సదస్సు ముగింపు కార్యక్రమంలో ‘న్యాయవ్యవస్థ -మారుతున్న ప్రపంచం’అంశంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగించారు. లింగపరమైన న్యాయం అనే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని సాధించేందుకు భారత న్యాయవ్యవస్థ చేసిన కృషి అమోఘమని పేర్కొన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఎల్లప్పుడూ సానుకూల, ప్రగతిశీల దృక్పథంతోనే పనిచేసిందని కొనియాడారు.
ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 22న పాల్గొన్నారు. క్లిష్టమైన అంశాలపై ఇటీవలి కాలంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు ప్రపంచవ్యాప్త చర్చకు కారణమయ్యాయని ఈ సందర్భంగా మోదీ అన్నారు. సదస్సులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే మాట్లాడుతూ... పర్యావరణ సంబంధ అంశాలకు జాతీయ, అంతర్జాతీయ అనే భేదం లేదని, వీటిని పరిష్కరించడానికి చట్టాలతో కూడిన ఒకే వ్యవస్థ అవసరమని పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అంతర్జాతీయ న్యాయ సదస్సు ముగింపు
ఎప్పుడు : ఫిబ్రవరి 23
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఎక్కడ : న్యూఢిల్లీ
ఆలిండియా పోలీస్ వేడుకల్లో ఉపరాష్ట్రపతి
సికింద్రాబాద్‌లోని రైల్వే స్పోర్‌ట్స కాంప్లెక్స్ (ఆర్‌ఎస్‌సీ) గ్రౌండ్‌సలో ఫిబ్రవరి 23న 20వ ఆలిండియా పోలీస్ బ్యాండ్ కాంపిటీషన్ ముగింపు వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొని ప్రసంగించారు. సంగీతం సాయుధ దళాలలో ధైర్యాన్ని, శౌర్యాన్ని రేకెత్తిస్తుందని వెంకయ్య పేర్కొన్నారు. దేశభక్తిని, దేశ రక్షణపై నిబద్ధతను ప్రేరేపిస్తుందన్నారు. ఆలిండియా పోలీస్ బ్యాండ్ ఛాంపియన్‌షిప్ పోటీలను ఆర్‌పీఎఫ్ జాతీయ స్థాయిలో 3వసారి నిర్వహిస్తోందని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ డెరైక్టర్ జనరల్ అరుణ్‌కుమార్ అన్నారు.
సీఆర్‌పీఎఫ్‌కు విజేత ట్రోఫి
తాజా వేడుకల్లో బ్రాస్ బ్యాండ్ క్యాటగిరీలో 20వ ఆల్ ఇండియా పోలీస్ బ్యాండ్ ఛాంపియన్‌షిప్ విజేత ట్రోఫీని సీఆర్‌పీఎఫ్‌కు, పైప్ బ్యాండ్ ట్రోఫీని మహారాష్ట్ర పోలీసులకు అందజేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆలిండియా పోలీస్ బ్యాండ్ కాంపిటీషన్ 20వ ముగింపు
ఎప్పుడు : ఫిబ్రవరి 23
ఎవరు : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఎక్కడ : ఆర్‌ఎస్‌సీ గ్రౌండ్‌స, సికింద్రాబాద్
ఐదేళ్లలో 1.09 కోట్ల చెట్ల నరికివేతకు అనుమతి
2014-19 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం 1,09,75,000 చెట్ల నరికివేతకు కేంద్ర అటవీ, పర్యావరణశాఖ అనుమతిచ్చింది. ఇటీవల లోక్‌సభలో కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ సహాయమంత్రి బాబుల్ సుప్రియో ఈ విషయాన్ని తెలియజేశారు. తప్పని పరిస్థితుల్లో మాత్రమే చెట్లను తొలగిస్తున్నామని మంత్రి తెలిపారు. దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో 2016-19 మధ్యకాలంలో 12,12,753 లక్షల చెట్లను కొట్టేసేందుకు అనుమతినిచ్చినట్లు పేర్కొన్నారు. దాదాపు 11 లక్షల చెట్లతో మహారాష్ట్ర రెండో స్థానంలో, 10 లక్షల చెట్లతో మధ్యప్రదేశ్ మూడోస్థానంలో ఉన్నాయని పేర్కొన్నారు. గత మూడేళ్లలో 76,72,337 చెట్లను తొలగించగా, 7.87 కోట్ల కంటే ఎక్కువగా మొక్కలను కంపల్సరీ ఎఫారెస్టేషన్ కింద నాటినట్లు వెల్లడించారు.
చెట్ల నరికివేత
సంవత్సరం | చెట్లు(లక్షల్లో) |
2014-15 | 23.3 |
2015-16 | 16.9 |
2016-17 | 17.01 |
2017-18 | 25.5 |
2018-19 | 17.38 |
2018లో ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా చూస్తే వివిధ దేశాల్లో ఒక్కొక్కరికి ఉన్న చెట్ల నిష్పత్తి కంటే భారత్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కెనడాలో అత్యధికంగా ఒక్కో వ్యక్తికి 8,953, రష్యాలో 4,461, బ్రెజిల్‌లో 1,494, అమెరికాలో 716, చైనాలో 102 చెట్లు ఉండగా, మన దేశంలో మాత్రం ఒక్కొక్కరికి 28 చెట్లే ఉన్నాయి.
ఆ ఐదెకరాల్లో మసీదు, ఆసుపత్రి: వక్ఫ్ బోర్డు
అయోధ్య కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సంక్రమించిన ఐదెకరాల స్థలంలో మసీదు, ఆసుపత్రితో పాటు లైబ్రరీని నిర్మించనున్నట్లు ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు వెల్లడించింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కేటాయించనున్న ఐదెకరాల స్థలంలో మసీదు నిర్మించాలని నిర్ణయించినట్లు వక్ఫ్ బోర్డు చైర్మన్ జుఫర్ ఫారూకీ ఫిబ్రవరి 24న వెల్లడించారు. మసీదు నిర్మాణానికి సంబంధించి త్వరలో ట్రస్ట్‌ను ఏర్పాటుచేస్తామని పేర్కొన్నారు. మసీదుకు పేరు పెట్టే అంశంపై ట్రస్ట్ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
పీఎం కిసాన్ మొబైల్ యాప్ ప్రారంభం
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్ యోజన) పథకం ప్రారంభించి ఏడాది అవుతున్న సందర్భంగా పథకానికి సంబంధించిన మొబైల్ యాప్‌ను కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఫిబ్రవరి 24న ఢిల్లీలో ప్రారంభించారు. పథకం సేవలు మరింత విసృ్తతం చేసేందుకు ఈ యాప్‌ను ఆవిష్కరించినట్లు మంత్రి పేర్కొన్నారు. రైతుల ఆదాయం 2022 కల్లా రెట్టింపు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
14 కోట్ల మంది రైతులకు...
పీఎం-కిసాన్ పథకాన్ని పశ్చిమ బెంగాల్ తప్ప అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. 14 కోట్ల మంది రైతులకు ఈ పథకం చేరాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటివరకు 9.74 కోట్ల మంది రైతులు నమోదు చేసుకున్నారు. అందులో 8.45 కోట్ల మంది రైతులకు చెల్లింపులు చేసినట్లు అధికారికంగా నమోదైంది.
గోరఖ్‌పూర్‌లో ప్రారంభం...
ఐదెకరాల్లోపు భూమి ఉన్న రైతులకు ఏటా రూ.6వేలు ఆర్థిక సాయం అందించేందకు ఉద్దేశించిన పీఎం-కిసాన్ పథకంను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో 2019, ఫిబ్రవరి 24న జరిగిన ఈ కార్యక్రమంలో తొలి విడతగా 1.01 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి రూ.2,000ను మోదీ బదిలీ చేశారు. పీఎం-కిసాన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2019-20 ఆర్థిక సంవత్సర మధ్యంతర బడ్జెట్(ఓట్ ఆన్ అకౌంట్)లో ప్రకటించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పీఎం కిసాన్ మొబైల్ యాప్ ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 24
ఎవరు : కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : పీఎం-కిసాన్ యోజన పథకం ప్రారంభించి ఏడాది అవుతున్న సందర్భంగా
అత్యంత కాలుష్య నగరంగా ఘజియాబాద్
ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ నిలిచింది. ఘజియాబాద్ తర్వాతి స్థానాల్లో వరుసగా హోటన్ (చైనా), గుజ్రాన్‌వాలా(పాకిస్తాన్), ఫైస్లాబాద్ (పాకిస్తాన్), ఢిల్లీ(భారత్) ఉన్నాయి. ఈ విషయాన్ని వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్-2019 వెల్లడించింది.
ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్-ముఖ్యాంశాలు
- ప్రపంచంలోని అత్యంత 30 కాలుష్య నగరాల జాబితాలో 21 భారతీయ నగరాలు ఉన్నాయి.
- భారత్‌లోని 21 కాలుష్య నగరాల్లో.. ఘజియాబాద్, ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, గ్రేటర్ నోయిడా, బంధ్వారీ, లక్నో, బులంద్‌షెహర్, ముజఫర్ నగర్, బాఘ్‌పట్, జింద్, ఫరీదాబాద్, కోరౌత్, భివాడి, పట్నా, పాల్వాల్, ముజఫర్‌పూర్, హిసార్, కుటైల్, జోధ్‌పూర్, మొరాదాబాద్ ఉన్నాయి.
- అత్యంత కాలుష్య పూరిత వాతావరణం ఉన్న రాజధానుల్లో న్యూఢిల్లీ అగ్రస్థానంలో ఉంది.
- అత్యంత కాలుష్య దేశాల జాబితాలో భారత్ ఐదో స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ అగ్రస్థానంలో ఉండగా, పాకిస్తాన్, మంగోలియా, అఫ్ఘానిస్తాన్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ఏమిటి : అత్యంత కాలుష్య నగరంగా ఘజియాబాద్
ఎప్పుడు : ఫిబ్రవరి 25
ఎవరు : వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్-2019
ఎక్కడ : ప్రపంచంలో
అద్దె గర్భం నియంత్రణ బిల్లుకు కేబినెట్ ఆమోదం
మహిళలు తమ ఇష్టంతో గర్భాశయాన్ని ఇతరులకు అద్దెకివ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు అద్దె గర్భం నియంత్రణ బిల్లు-2020పై ఫిబ్రవరి 26న జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ఆమోద ముద్ర వేసింది. వితంతువులు, విడాకులు పొందిన వారూ ఇతరులకు తమ గర్భాన్ని అద్దెకు ఇవ్వొచ్చని బిల్లు స్పష్టం చేసింది.
సరోగసీ చట్టాలను సవరిస్తూ 2019, ఆగస్టులో లోక్‌సభ ఒక ముసాయిదా బిల్లును ఆమోదించింది. అయితే దగ్గరి బంధువులే అద్దెకు గర్భాన్ని ఇవ్వొచ్చనే నిబంధనపై విమర్శలొచ్చాయి. దీంతో బిల్లును రాజ్యసభ సెలెక్ట్ కమిటీకి పంపింది. బీజేపీ ఎంపీ భూపేందర్ యాదవ్ నేతృత్వంలోని కమిటీ సరోగసీకి సంబంధించి అన్ని వర్గాల వారితోనూ చర్చించి బిల్లులో సవరణలను ప్రతిపాదించింది. ఈ సవరణలను కేబినెట్ తాజాగా ఆమోదించింది.
అద్దె గర్భం బిల్లులోని ముఖ్యాంశాలు
- కేంద్రం, రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతాల స్థాయిల్లో జాతీయ సరోగసీ బోర్డుల ఏర్పాటు
- అద్దెకు గర్భాన్ని ఇచ్చే మహిళకు చేసే బీమా మొత్తాన్ని 36 నెలలకు పెంపు.
- మానవ పిండాలు, గామేట్స్ (బీజం) కొనుగోలు, విక్రయాలపై నిషేధం. నైతిక సరోగసికి మాత్రమే అనుమతి.
- భారతీయ దంపతులు, భారతీయ సంతతి దంపతులు, 35-45 ఏళ్ల వితంతు మహిళ లేదా విడాకులు పొందిన మహిళలకే సరోగసి అనుమతి
ఏమిటి : అద్దె గర్భం నియంత్రణ బిల్లు-2020కు ఆమోదం
ఎప్పుడు : ఫిబ్రవరి 26
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : మహిళలు తమ ఇష్టంతో గర్భాశయాన్ని ఇతరులకు అద్దెకివ్వడానికి వీలుకల్పించేందుకు
నేషనల్ టెక్స్‌టైల్ మిషన్‌కు కేబినెట్ ఆమోదం
టెక్నికల్ టెక్స్‌టైల్స్ రంగంలో అంతర్జాతీయస్థాయి ప్రమాణాలను అందుకోవడానికి వీలుగా రూ.1,480 కోట్లతో ‘నేషనల్ టెక్నికల్ టెక్స్‌టైల్ మిషన్’ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రదాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఫిబ్రవరి 26న సమావేశమైన మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకుంది. టెక్స్‌టైల్ మిషన్ కాలపరిమితి 2020-21 నుంచి 2023-24 వరకు ఉంటుంది. వ్యవసాయం, రహదారులు, రైల్వేట్రాక్‌లు, సాఫ్ట్‌వేర్,వైద్య-ఆరోగ్యం, బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు, అగ్నినిరోధక జాకెట్లు, రోదసీ ప్రయోగాల్లో ఈ టెక్స్‌టైల్స్‌ను ఉపయోగిస్తారు. ఉన్నత విద్యా సంస్థల్లోనూ ఇక మీదట టెక్నికల్ టెక్స్‌టైల్స్ కోర్సులు ప్రవేశపెడతారు.
కశ్మీర్‌లో కేంద్ర చట్టాల అమలు
కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌లో ఉమ్మడి జాబితాలోని 37 కేంద్ర చట్టాలు అమలు చేసే ఆదేశాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించింది. దీంతో జమ్మూ కశ్మీర్ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ కింద ఆదేశాలు జారీ చేసేందుకు మార్గం సుగమమైంది. 2019, ఆగస్టులో అవిభక్త కశ్మీర్ రాష్ట్రానికున్న ప్రత్యేక ప్రతిపత్తి హోదా(ఆర్టికల్ 370)ను రద్దుచేసి రాష్ట్రాన్ని ‘జమ్మూకశ్మీర్’, ‘లడాక్’ కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చడం తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నేషనల్ టెక్నికల్ టెక్స్‌టైల్ మిషన్ ఏర్పాటుకు ఆమోదం
ఎప్పుడు : ఫిబ్రవరి 26
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : టెక్నికల్ టెక్స్‌టైల్స్ రంగంలో అంతర్జాతీయస్థాయి ప్రమాణాలను అందుకోవడానికి వీలుగా
మార్కెట్ ఇంటెలిజెన్స్ వెబ్‌సైట్ ఆవిష్కరణ
టమాటా, ఉల్లిపాయలు, ఆలుగడ్డల ధరలు ఉన్నట్టుండి పతనమైతే ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసేందుకు రూపొందించిన ‘మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ (ఎంఐఈడబ్ల్యూఎస్)’ వెబ్‌సైట్‌ను కేంద్ర ఆహార శుద్ధి శాఖ మంత్రి హర్‌సిమ్రత్‌కౌర్ బాదల్ ఆవిష్కరించారు. ఢిల్లీలో ఫిబ్రవరి 26న ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. క్రితం ఏడాది అదే కాలంతో పోలిస్తే ధరలు 50 శాతం పతనమైనా, మూడేళ్ల కనిష్ట స్థాయికి ఈ మూడు కూరగాయల ధరలు క్షీణించినా ఎంఐఈడబ్ల్యూఎస్ పోర్టల్ హెచ్చరికలు పంపుతుంది. దేశవ్యాప్తంగా 1,200 మార్కెట్లలో వీటి ధరలను ఈ పోర్టల్ తెలియజేస్తుంది.
మంత్రి బాదల్ మాట్లాడుతూ.. ‘ప్రజలు అధికంగా వినియోగించే ఈ మూడు కూరగాయల టోకు ధరలను ఈ పోర్టల్ తెలియజేస్తుంది. అధిక సరఫరా కారణంగా ధరలు పడిపోతే ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తుంది. దీంతో ‘ఆపరేషన్స్ గ్రీన్’ పథకం కింద ప్రభుత్వం సకాలంలో స్పందించి.. అధికంగా ఉన్న ఉత్పత్తిని కోల్డ్ స్టోరేజ్‌లకు తరలించేందుకు వీలుగా రైతులకు సబ్సిడీ ఇస్తుంది. లేదా మిగులు ఉత్పత్తిని డిమాండ్ ఉన్న చోటుకు తరలించేందుకు సాయమందిస్తుంది’ అని తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎంఐఈడబ్ల్యూఎస్ వెబ్‌సైట్ ఆవిష్కరణ
ఎప్పుడు : ఫిబ్రవరి 26
ఎవరు : కేంద్ర ఆహార శుద్ధి శాఖ మంత్రి హర్‌సిమ్రత్‌కౌర్ బాదల్
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : టమాటా, ఉల్లిపాయలు, ఆలుగడ్డల ధరలు ఉన్నట్టుండి పతనమైతే ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసేందుకు
ఆన్‌లైన్‌లో చట్టసభ్యుల నేర చరిత్ర: సుప్రీంకోర్టు
దేశంలోని అన్ని ప్రాంతీయ, జాతీయ స్థాయి రాజకీయ పార్టీలు తమతమ అభ్యర్థులపై పెండింగులో ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను తమ వెబ్‌సైట్లలో ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్న వారిని ఎన్నికల్లో అభ్యర్థులుగా ఎందుకు నిర్ణయించారో రాజకీయ పక్షాలన్నీ వివరణ ఇవ్వాలని జస్టిస్ ఆర్.ఎఫ్.నారిమన్, జస్టిస్ రవీంద్రభట్‌ల బెంచ్ స్పష్టం చేసింది. రాజకీయాలు నేరపూరితం కావడంపై కోర్టు 2018 సెప్టెంబర్‌లో ఇచ్చిన తీర్పు(అభ్యర్థులపై ఉన్న క్రిమినల్ నేరాల వివరాలు బహిర్గతం చేయాలి) అమలు కావడం లేదని, ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని దాఖలైన పిటిషన్‌పై ధర్మాసనం ఫిబ్రవరి 13న విచారణ చేపట్టింది. రాజకీయ పార్టీలన్నీ అభ్యర్థులను ఎంపిక చేసిన 48 గంటల్లోగా లేదా నామినేషన్ల దాఖలు ప్రారంభమయ్యే తేదీకి కనీసం రెండు వారాల ముందు వారి నేర చరిత్రను ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటి అన్ని సోషల్ మీడియా వేదికలపై వెల్లడించాలని, జాతీయ, స్థానిక వార్తా పత్రికల్లోనూ ప్రకటనలు జారీ చేయాలని ఆదేశాలిచ్చింది.
పార్లమెంట్‌లో నేరచరిత్ర కలిగిన ఎంపీల సంఖ్య
సంవత్సరం | ఎంతమంది(శాతాల్లో..) |
2004 | 24 |
2009 | 30 |
2014 | 34 |
2019 | 43 |
పుల్వామా అమరుల స్మారక స్తూపం ఆవిష్కరణ
2019, ఫిబ్రవరి 14న పుల్వామా దాడి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 40 మంది సీఆర్‌పీఎఫ్ సిబ్బంది స్మృత్యర్థం లెత్‌పోరా సైనిక శిబిరంలో స్మారక స్తూపాన్ని ఆవిష్కరించారు. సీఆర్‌పీఎఫ్ జవాన్ల సేవ, నిజాయితీలకు గుర్తుగా 2020, ఫిబ్రవరి 14న ఈ స్థూపాన్ని ఆవిష్కరించారు. దాడిలో ప్రాణాలు కోల్పోయిన 40 మంది జవాన్ల ఫొటోలను వారి పేర్లతో సహా ఆ స్తూపంపై చెక్కారు.
మీ బలిదానాన్ని మరువలేం: ప్రధాని
‘పుల్వామా’అమరవీరులకు ఫిబ్రవరి 14న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఘనంగా నివాళులర్పించారు. దేశ రక్షణ కోసం జీవితాన్ని అంకితం చేసి, చివరికి ప్రాణత్యాగం చేసిన వారికి సాటి, పోటీ ఎవరూ లేరని కొనియాడారు. భారతీయులు ఎన్నటికీ ఆ వీర సైనికుల బలిదానాన్ని మరువలేరని మోదీ ట్వీట్ చేశారు.
2019 పుల్వామా దాడి
జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లా అవంతిపొరా పట్టణం సమీపంలోని లెత్‌పొరా వద్ద సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు 2019, ఫిబ్రవరి 14న ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఓ స్కార్పియో ఎస్‌యూవీలో దాదాపు 350 కేజీల అత్యాధునిక పేలుడు పదార్థాన్ని (ఐఈడీ) నింపుకున్న ఓ ఆత్మాహుతి దళసభ్యుడు జవాన్ల వాహన శ్రేణిని లక్ష్యంగా చేసుకున్నాడు. తన కారుతో కాన్వాయ్‌లోని ఓ బస్సును ఢీకొట్టి తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు వీర మరణం పొందగా, మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా సీఆర్పీఎఫ్ 76వ బెటాలియన్‌కు చెందిన వారు. ఈ దాడిని తామే చేశామని పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రసంస్థ జైషే మహమ్మద్ ప్రకటించుకుంది.
రామాయణ ఇతివృత్తంతో నూతన రైలు
రామాయణ ఇతివృత్త నేపథ్యంతో కూడిన రైలును మార్చి చివర్లోగా తీసుకొస్తామని రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ ఫిబ్రవరి 14న తెలిపారు. ఈ రైలు లోపలా బయటా రామాయణాన్ని జ్ఞప్తికి తెచ్చేలా తీర్చిదిద్దుతామని, రైల్లో రామాయణ కీర్తనలు ఉంటాయన్నారు. దేశం నలుమూలల నుంచి రామాయణంతో ముడిపడి ఉన్న ప్రాంతాలగుండా ఈ రైలు నడిపిస్తామని చెప్పారు. ‘రామాయణ్ ఆన్ వీల్స్’గా ఈ రైలు ప్రాముఖ్యత పొందుతుందన్నారు. మరోవైపు రైల్వేలు చేపట్టిన ‘జాతీయ ప్రాముఖ్యత’ కలిగిన ప్రాజెక్టులను 2023కల్లా పూర్తి చేస్తామని వీకే యాదవ్ చెప్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రామాయణ ఇతివృత్తంతో నూతన రైలు
ఎప్పుడు : ఫిబ్రవరి 14
ఎవరు : రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్
ఎక్కడ : దేశవ్యాప్తంగా రామాయణంతో ముడిపడి ఉన్న ప్రాంతాలగుండా
మద్రాసు ఐఐటీతో ఎన్నికల కమిషన్ ఒప్పందం
దేశంలో ఎక్కడినుంచైనా ఓటు వేయటానికి వీలు కల్పించే బ్లాక్‌చైన్ టెక్నాలజీపై కలసి పని చేసేందుకు భారత ఎన్నికల కమిషన్, మద్రాసు ఐఐటీతో ఒప్పందం కుదుర్చుకుంది.ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ప్రయోగ దశలో ఉందని ఎన్నికల కమిషన అధికారులు తెలిపారు. బ్లాక్‌చైన్ టెక్నాలజీతో ఓటింగ్‌లో పాల్గొనేందుకు ప్రజలు ప్రభుత్వం ఏర్పాటు చేసే నిర్దిష్ట ప్రదేశానికి రావాల్సి ఉంటుందని తెలిపారు. ‘ఉదాహరణకు చెన్నైకి చెందిన వ్యక్తి ఢిల్లీలో ఉంటే ఢిల్లీలోనే అధికారులు ఏర్పాటు చేసిన అధీకృత సెంటర్ ద్వారా చైన్నైలో జరుగుతున్న ఎన్నికల్లో ఓటు వేయవచ్చు. దీనికి ఈ-బాలెట్ పేపర్ జనరేట్ అవుతుంది’ అని చెప్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మద్రాసు ఐఐటీతో ఒప్పందం
ఎప్పుడు : ఫిబ్రవరి 15
ఎవరు : భారత ఎన్నికల కమిషన్
ఎందుకు : బ్లాక్‌చైన్ టెక్నాలజీపై కలసి పని చేసేందుకు
వారణాసిలో రూ.1,254 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సొంత నియోజకవర్గం వారణాసిలో ఫిబ్రవరి 16న పర్యటించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో రూ.1,254 కోట్లు విలువ చేసే 50 ప్రాజెక్టులకు సంబంధించి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఆరెస్సెస్ సిద్ధాంతకర్త పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ మెమోరియల్ సెంటర్‌ను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా 63 అడుగుల ఎత్తై దీన్‌దయాళ్ విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించారు. మరోవైపు వారణాసిలో శ్రీ జగద్గురు విశ్వారాధ్య గురుకుల్ శతాబ్ది ఉత్సవాల్లోనూ ప్రధాని పాల్గొన్నారు. 430 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని, కాశీ ఏక్ రూప్ అనేక్ పేరుతో ఏర్పాటైన హస్తకళల ప్రదర్శనను ఆయన ప్రారంభించారు.
సీఏఏను వెనక్కి తీసుకోం..
వారణాసి పర్యటన సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాలపై ఒత్తిళ్లకు తలొగ్గి పునరాలోచన చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. దళితులు, ఇతర అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పండిట్ దీన్ దయాళ్ అంత్యోదయ పథకం తెచ్చారని పేర్కొన్నారు. వారణాసిలో అయిదేళ్లలో రూ.25 వేల కోట్ల అభివృద్ధి పనులు జరుగు తున్నాయని తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రూ.1,254 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 16
ఎవరు : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఎక్కడ : వారణాసి, ఉత్తరప్రదేశ్
ఐఆర్‌సీటీసీ మహాకాళ్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం
ఐఆర్‌సీటీసీకి చెందిన మూడో ప్రైవేటు రైలు ‘మహాకాళ్ ఎక్స్‌ప్రెస్’ను ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 16న వీడియో లింక్ ద్వారా ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లోని కాశీ, మధ్యప్రదేశ్‌లో ఉజ్జయిని, ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగ క్షేత్రాలకు వెళ్లడానికి ఈ మహాకాళ్ ఎక్స్‌ప్రెస్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఈ ఎక్స్‌ప్రెస్‌లో శివుడికి ప్రత్యేకంగా ఓ సీటు రిజర్వ్ చేశారు. ఎవరూ కూర్చోకుండా అది శివుడిదని తెలిసేలా బీ5 కోచ్‌లోని 64వ సీటును శివుడికి కేటాయించినట్లు ఉత్తర రైల్వే అధికార ప్రతినిధి దీపక్ కుమార్ తెలిపారు. ఈ సీటు కేవలం ఒక్కసారికేనా లేక శాశ్వతంగా ఉంటుందా అన్న విషయంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మహాకాళ్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 16
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎందుకు : ఉత్తరప్రదేశ్‌లోని కాశీ, మధ్యప్రదేశ్‌లో ఉజ్జయిని, ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగ క్షేత్రాలకు వెళ్లడానికి
బాలికా విద్యపై మహీంద్రా, నాందీ ఫౌండేషన్ సర్వే
దేశంలో బాలికల అక్షరాస్యతపై ‘ది టీన్ ఏజ్ గర్ల్స్ (టీఏజీ)’ ప్రాజెక్టులో భాగంగా మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్, నాందీ ఫౌండేషన్ సంస్థలు దేశ వ్యాప్తంగా సర్వే నిర్వహించాయి. 2019-20 సంవత్సరంలో దేశంలోని 600కుపైగా జిల్లాల్లో 74 వేల మంది టీనేజీ బాలికల్ని సర్వేలో భాగం చేశారు. 13 నుంచి 19 ఏళ్ల మధ్య వయసు గల అమ్మాయిల్లో కేరళ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ రాష్ట్రాలు 100 శాతం అక్షరాస్యత సాధించి ముందంజలో ఉన్నాయని ఈ సర్వే వెల్లడించింది. అక్షరాస్యత శాతం పెరిగితే.. మాతా శిశు మరణాలను 50 శాతం వరకూ తగ్గించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.
టీఏజీ సర్వేలో వెల్లడైన అంశాలు..
- 13 నుంచి 19 ఏళ్ల మధ్య వయసు గల అమ్మాయిల్లో కేరళ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ రాష్ట్రాలు 100 శాతం అక్షరాస్యత సాధించి ముందంజలో ఉన్నాయి.
- ఏపీ బాలికల్లో 96.6 శాతం మందికి 19 ఏళ్లలోపు వివాహాలు చేయకుండా చదివిస్తుండగా.. పశ్చిమ బెంగాల్‌లో ఈ శాతం 88.9గా నమోదైంది.
- 86.6 శాతం మంది టీనేజ్ బాలికలు 21 ఏళ్ల తర్వాతే పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన కలిగి ఉన్నారు.
- 56.4 శాతం మంది టీనేజీ బాలికలు రుతుక్రమం సమయంలో పరిశుభ్రమైన పద్ధతులు పాటిస్తున్నారు.
- ఏపీలో 71 శాతం మంది ఉన్నత చదువులు చదవాలని ఆకాంక్షిస్తున్నారు.
ఏమిటి : దేశంలో బాలికల అక్షరాస్యతపై సర్వే
ఎప్పుడు : ఫిబ్రవరి 16
ఎవరు : మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్, నాందీ ఫౌండేషన్ సంస్థలు
మహిళా సైనికాధికారులకు శాశ్వత కమిషన్ ఏర్పాటు
భారత సైన్యంలో పనిచేస్తోన్న మహిళా అధికారులకు పురుషులతో సమానంగా ఉన్నత బాధ్యతలు నెరవేర్చే అవకాశం ఇవ్వకపోవడం రాజ్యాంగం ప్రసాదించిన సమానత్వ భావనను వ్యతిరేకించడమేనని సుప్రీంకోర్టు ఫిబ్రవరి 17న ప్రతిష్టాత్మక తీర్పునిచ్చింది. అందులో భాగంగానే షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ)లోని మహిళా సైనికాధికారులకు మూడు నెలల్లోగా శాశ్వత కమిషన్(పర్మనెంట్ కమిషన్-పీసీ) ఏర్పాటు చేయాలని కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించింది. శారీరక పరిమితులు, సామాజిక కట్టుబాట్ల పేరుతో సైనిక పటాలాల కమాండింగ్ బాధ్యతల్లో మహిళా అధికారులను నియమించకపోవడం తగదని స్పష్టం చేసింది.
తాజా తీర్పుతో..
సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పుతో... మహిళా సైనికాధికారులకు కమాండ్ పోస్టింగ్‌సతో పాటు పురుష అధికారులతో సమానంగా పదోన్నతులు, ర్యాంక్స్, పెన్షన్సు, ఇతర ప్రయోజనాలు దక్కనున్నాయి.
2010 నాటి ఢిల్లీ హైకోర్టు తీర్పుకు సమర్థన
మహిళా సైనికుల విషయంలో వివక్ష తగదంటూ 2010లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. పదేళ్లుగా ఈ ఆదేశం అమలుపై కేంద్రం శ్రద్ధ చూపలేదని తప్పు పట్టింది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ కేంద్రం వేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ.. జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అజయ్ రస్తోగీల ధర్మాసనం ఫిబ్రవరి 17న ఈ తీర్పునిచ్చింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మహిళా సైనికాధికారులకు శాశ్వత కమిషన్ ఏర్పాటు చేయాలి
ఎప్పుడు : ఫిబ్రవరి 17
ఎవరు : సుప్రీంకోర్టు
వెల్‌నెస్ సెంటర్ల నిర్వహణలో ఏపీకి అగ్రస్థానం
ఆయుష్మాన్ భారత్ పథకం అమలులో భాగంగా హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్ల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 66 మార్కులతో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి వికాస్ షీల్ రాష్ట్రానికి లేఖ రాశారు. గ్రామీణ ప్రాంతాల్లో పేద రోగులకు వైద్యసేవలు అందించడం, వారి వివరాలను నమోదు చేయడం, వాటిని కేంద్ర ఆరోగ్య శాఖ పోర్టల్‌కు అనుసంధానించడం వంటి విషయాల్లో ఏపీ మంచి ప్రతిభ కనబరిచినట్టు లేఖలో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా అమలవుతున్న ప్రధానమంత్రి మాతృవందన యోజనలోనూ ఇటీవల ఆంధ్రప్రదేశ్‌కు రెండో ర్యాంక్ వచ్చిన విషయం తెలిసిందే.
తెలంగాణకు 19వ స్థానం...
2019 డిసెంబర్, 2020 జనవరి నెలలకు సంబంధించి హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్ల నిర్వహణలో రాష్ట్రాల ప్రతిభను లెక్కించారు. ఇందులో 58 మార్కులతో గోవా, తమిళనాడు రెండో స్థానంలో, 57 మార్కులతో గుజరాత్ మూడో స్థానంలో నిలిచాయి. తెలంగాణ 37 మార్కులతో 19వ స్థానంలో నిలిచింది.
రెండు రకాల సేవలు...
ఆయుష్మాన్ భారత్ పథకం రెండు రకాల సేవలు ఉంటాయి. ఒకటి.. జన ఆరోగ్య యోజన (ఆరోగ్యశ్రీ తరహా) కాగా రెండోది హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్ల నిర్వహణ.
వెల్‌నెస్ సెంటర్ల నిర్వహణలో టాప్-10 రాష్ట్రాలు
రాష్ట్రం | మార్కులు |
ఆంధ్రప్రదేశ్ | 66 |
గోవా, తమిళనాడు | 58 |
గుజరాత్ | 57 |
ఒడిశా, పంజాబ్ | 54 |
హరియాణా | 53 |
ఛత్తీస్‌గఢ్ | 52 |
మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ | 48 |
అసోం | 47 |
కర్ణాటక, సిక్కిం | 44 |
త్రిపుర | 41 |
మార్చి 28న శ్రీరామాయణ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం
శ్రీరామచంద్రుడి పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు రైల్వేశాఖ ప్రారంభించనున్న ప్రత్యేక రైలు ‘శ్రీరామాయణ ఎక్స్‌ప్రెస్’ 2020, మార్చి 28న ఢిల్లీ నుంచి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని ఇండియన్ రెల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) ఫిబ్రవరి 19న వెల్లడించింది. మొత్తం 16 రాత్రులు -17 పగళ్ల పాటు ఈ యాత్ర సాగనుందని పేర్కొంది. రామాయణ ఇతివృత్త నేపథ్యంతో కూడిన ఈ రైలు లోపలా బయటా రామాయణాన్ని జ్ఞప్తికి తెచ్చేలా తీర్చిదిద్దుతామని, రైల్లో రామాయణ కీర్తనలు ఉంటాయని రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ తెలిపారు. దేశం నలుమూలల నుంచి రామాయణంతో ముడిపడి ఉన్న ప్రాంతాలగుండా ఈ రైలును నడిపిస్తామని చెప్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2020, మార్చి 28 నుంచి శ్రీరామాయణ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 19
ఎవరు : భారతీయ రైల్వే
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : శ్రీరామచంద్రుడి పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు..
పీఎంఎఫ్‌బీవైలో మార్పులకు కేబినెట్ ఆమోదం
ప్రతిష్టాత్మక రైతు బీమా పథకం ‘ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన(పీఎంఎఫ్‌బీవై)’లో మార్పులు చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఫిబ్రవరి 19న సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో పీఎంఎఫ్‌బీవైలో చేరడం రైతులకు తప్పనిసరి కాదు... రైతులు ఇకపై అందులో చేరడం స్వచ్ఛందమే. పంట రుణాలు తీసుకున్న రైతులు పీఎంఎఫ్‌బీవైలో కచ్చితంగా చేరాలన్న నిబంధన ఇప్పటివరకూ ఉండేది.
నిరోధించలేని ప్రకృతి విపత్తుల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఖరీఫ్ పంటలకు 2 శాతం, రబీ పంటలకు 1.5 శాతం, పండ్ల తోటలు, వ్యాపార పంటలకు 5 శాతం ప్రీమియంతో సమగ్రంగా బీమా సౌకర్యం కల్పించేలా పీఎంఎఫ్‌బీవైని రూపొందించారు.
కేబినెట్ సమావేశలోని మరికొన్ని నిర్ణయాలు...
- పీఎంఎఫ్‌బీవైతో పాటు రీస్ట్రక్చర్డ్ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ పథకంలోనూ కేబినెట్ మార్పులు చేసింది.
- పాడి రైతులకు ప్రయోజనం కలిగేలా రూ. 4,558 కోట్లతో రూపొందించిన పథకాన్ని కేబినెట్ ఆమోదించింది. పాడి రైతుల రుణాలకు కల్పించే వడ్డీ రాయితీని 2 శాతం నుంచి 2.5శాతానికి పెంచే ప్రతిపాదనకు కూడా ఆమోదం తెలిపిందన్నారు.
- రూ. 4,496 కోట్ల బడ్జెట్‌తో 2024 నాటికి కొత్తగా 10 వేల ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్‌లను ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే, 2024 నుంచి 2028 వరకు వీటి నిర్వహణ కోసం రూ. 2,369 కోట్లకు కేటాయించింది. రైతుల ఆదాయ పెంపు, దిగుబడి ఖర్చు తగ్గింపు లక్ష్యంగా ఇవి పనిచేయనున్నాయి.
ఏమిటి : పీఎంఎఫ్‌బీవైలో మార్పులకు ఆమోదం
ఎప్పుడు : ఫిబ్రవరి 19
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : పంట రుణాలు తీసుకున్న రైతులు పీఎంఎఫ్‌బీవైలో కచ్చితంగా చేరాలన్న నిబంధన సడలించేందుకు
అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ బిల్లుకు ఆమోదం
కృత్రిమ గర్భధారణ, ఇతర పునరుత్పత్తికి సంబంధించిన రంగంలోని వైద్య నిపుణులు, క్లినిక్‌లను నమోదు చేసేందుకు ప్రత్యేకంగా నేషనల్ రిజిస్రీన్టి,రిజిస్ట్రేషన్ అథారిటీని ఏర్పాటు చేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ‘అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ(నియంత్రణ) బిల్’కు కేంద్ర కేబెనెట్ ఫిబ్రవరి 19న ఆమోదం తెలిపింది.
బిల్లులోని ప్రతిపాదనలు...
- గర్భంలోని శిశువు లింగ నిర్ధారణకు, పిండం(ఎంబ్రియొ), బీజకణం(గామెట్) అమ్మకానికి కఠిన శిక్ష విధించాలి. వీటి అక్రమ వినియోగానికి, అమ్మకానికి మొదటి సారైతే రూ. 10 లక్షలు, మరో సారి అదే నేరానికి పాల్పడితే 12 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించాలి.
- కృత్రిమ గర్భధారణ కోరుకుంటున్న దంపతులు, అందుకు సహకరిస్తున్న మహిళ కుటుంబం వివరాలను రహస్యంగా ఉంచాలి. వారి పునరుత్పత్తి హక్కులను రక్షించాలి.
ఏమిటి : అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ(నియంత్రణ) బిల్‌కు ఆమోదం
ఎప్పుడు : ఫిబ్రవరి 19
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : వైద్యరంగానికి సంబంధించి నేషనల్ రిజిస్రీన్టి,రిజిస్ట్రేషన్ అథారిటీని ఏర్పాటు చేసేందుకు
22వ న్యాయ కమిషన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం
క్లిష్టమైన అంశాల్లో ప్రభుత్వానికి సలహాలిచ్చేందుకు ఉద్దేశించిన ‘22వ న్యాయ కమిషన్’ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఫిబ్రవరి 19న ఆమోదం తెలిపింది. మూడేళ్ల కాల వ్యవధితో కొత్త కమిషన్‌ను న్యాయ శాఖ ఏర్పాటు చేయనుంది. ఈ కమిషన్‌లో ఒక చైర్‌పర్సన్, నలుగురు పూర్తిస్థాయి సభ్యులు(సభ్య కార్యదర్శి సహా), ఐదుగురికి మించకుండా తాత్కాలిక సభ్యులు, ఇద్దరు ఎక్స్ అఫిషియో సభ్యులు ఉంటారు.
స్వచ్ఛ భారత్ రెండో దశకు ఆమోదం..
స్వచ్ఛ భారత్ మిషన్(గ్రామీణ) రెండో దశకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ. 52,497 కోట్ల అంచనా బడ్జెట్‌తో(కేంద్రం, రాష్ట్రాలు కలిసి) 2020-21 నుంచి 2024-25 మధ్య ఈ రెండో దశను అమలు చేస్తారు. అధికారిక లెక్కల ప్రకారం, 2019, అక్టోబర్ 2 నాటికి, అన్ని రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాలు బహిరంగ మల విసర్జన రహితం(ఓడీఎఫ్) అయ్యాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 22వ న్యాయ కమిషన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం
ఎప్పుడు : ఫిబ్రవరి 19
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : క్లిష్టమైన అంశాల్లో ప్రభుత్వానికి సలహాలిచ్చేందుకు
బోడో శాంతి ఒప్పంద ఉత్సవాల్లో ప్రధాని మోదీ
అస్సాంలోని కోక్రాఝర్‌లో జరుపుకుంటోన్న బోడో శాంతి ఒప్పంద ఉత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 7న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ.. ఈశాన్య రాష్ట్రాల శాంతి, అభివృద్ధి కోసం కలిసిపనిచేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. బోడో ఒప్పందం ద్వారా శాంతి, అహింస విజయం సాధించాయనీ అది ప్రజల వల్లే సాధ్యమైందనీ పేర్కొన్నారు. బోడో శాంతి ఒప్పందం 21వ శతాబ్దంలో అస్సాం సహా మొత్తం ఈశాన్య ప్రాంతానికే ఒక నూతన ప్రారంభం అని మోదీ అన్నారు.
బోడోలాండ్ ప్రజలకు ప్రత్యేక రాజకీయ, ఆర్థిక హక్కులను కల్పించే ‘త్రైపాక్షిక ఒప్పందం’పై కేంద్రప్రభుత్వం, అస్సాం రాష్ట్ర ప్రభుత్వం, బోడో ఉద్యమ సంస్థలు 2020, జనవరి 27న సంతకాలు చేసిన విషయం తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బోడో శాంతి ఒప్పంద ఉత్సవాలు
ఎప్పుడు : ఫిబ్రవరి 7
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : కోక్రాఝర్, అస్సాం
దేశంలో చిరుతల సంఖ్య తగ్గింది: సీడబ్ల్యూఎస్
దేశవ్యాప్తంగా చిరుతల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు బెంగళూరులోని వన్య జీవుల అధ్యయన కేంద్రం (సెంటర్ ఫర్ వైల్డ్‌లైఫ్ స్టడీస్- సీడబ్ల్యూఎస్) వెల్లడించింది. వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఐఐ)తో కలిసి తాము నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైందని పేర్కొంది. పశ్చిమ కనుమలు, దక్కన్ పీఠభూమి, ఉత్తర భారత శివాలిక్ పర్వతాల్లో ఎక్కువగా సంచరించే చిరుతల సంఖ్య 70-90శాతం తగ్గినట్లు తెలిపింది. గత 120-200 ఏళ్లలో ఈ చిరుతల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు వివరించింది. ఆక్యుపెన్సీ మోడలింగ్ విధానంతో చిరుతలను లెక్కించగా అనువంశికత దృష్ట్యా చిరుతల సముదాయం వైవిధ్యతను కోల్పొయిందని సీడబ్ల్యూఎస్ చెప్పింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : చిరుతల సంఖ్య గణనీయంగా తగ్గింది
ఎప్పుడు : ఫిబ్రవరి 7
ఎవరు : వన్య జీవుల అధ్యయన కేంద్రం (సెంటర్ ఫర్ వైల్డ్‌లైఫ్ స్టడీస్- సీడబ్ల్యూఎస్)
ఎక్కడ : దేశవ్యాప్తంగా
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వారికి ఉద్యోగాల్లో, పదోన్నతుల్లో రిజర్వేషన్లను కల్పించడానికి సంబంధించి ఫిబ్రవరి 7న సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. నియామకాల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్రాలు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అలాగే, ప్రమోషన్లలో రిజర్వేషన్లను అమలు చేయాలని కోరడానికి సంబంధించి ఎలాంటి ప్రాథమిక హక్కు లేదని పేర్కొంది. ‘రిజర్వేషన్లు కల్పించాలని కోర్టులు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించలేవు’ అని జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ హేమంత్ గుప్తాల ధర్మాసనం తేల్చిచెప్పింది.
2012 సెప్టెంబర్ 5న ఉత్తరాఖండ్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు అందులో పేర్కొనలేదు. ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేయగా, ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రభుత్వ నోటిఫికేషన్‌ను కొట్టివేసింది. ఆ ఉత్తరాఖండ్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై తీర్పు వెలువరిస్తూ సుప్రీంకోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. ఉత్తరాఖండ్ ప్రభుత్వ నోటిఫికేషన్‌ను సమర్ధిస్తూ, హైకోర్టు ఆదేశాలను కొట్టివేసింది.
ఎస్సీ, ఎస్టీ చట్టం రాజ్యాంగబద్ధమే: సుప్రీంకోర్టు
ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక సవరణ చట్టం -2018 చట్టబద్ధతను సుప్రీంకోర్టు సమర్థించింది. ప్రాథమిక విచారణలో ఆరోపణలు నిరూపించలేకపోతే సదరు వ్యక్తికి బెయిల్ మంజూరు చేయవచ్చని కోర్టు పేర్కొంది. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి ముందే ప్రాథమిక విచారణ అవసరం లేదని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఫిబ్రవరి 10న పేర్కొంది. ముందస్తు బెయిల్ అవకాశాన్ని దుర్వినియోగం చేయడం పార్లమెంట్ ఉద్దేశాలకు విరుద్ధమని వ్యాఖ్యానించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక సవరణ చట్టం -2018 రాజ్యాంగబద్ధమే
ఎప్పుడు : ఫిబ్రవరి 10
ఎవరు : సుప్రీంకోర్టు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) మరోసారి ఘన విజయం సాధించింది. ఫిబ్రవరి 11న వెల్లడైన ఎన్నికల ఫలితాల ప్రకారం.. మొత్తం 70 స్థానాలకు గానూ 62 సీట్లలో విజయ కేతనం ఎగరేసింది. బీజేపీని 8 స్థానాలకు పరిమితం చేసింది. గతంలో వరుసగా మూడుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ఈసారి ఖాతా తెరవలేకపోయింది. ఈ ఎన్నికల్లో ఆప్‌కు 53.57 శాతం, బీజేపీకి 38.51 శాతం, కాంగ్రెస్‌కు 4.26 శాతం ఓట్లు లభించాయి. 2015 ఎన్నికల్లో ఆప్ 54.34 శాతం ఓట్లు సాధించింది. న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి కేజ్రీవాల్ బీజేపీ అభ్యర్థి సునీల్ కుమార్ యాదవ్‌పై గెలుపొందారు.
మూడోసారి సీఎం పీఠంపై..
తాజాఎన్నికల్లో ఘన విజయంతో మూడోసారి సీఎం కుర్చీపై కేజ్రీవాల్ కూర్చోబోతున్నారు. తొలిసారి 2013 డిసెంబర్ 28న కాంగ్రెస్ మద్దతుతో మైనారిటీ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేశారు. కానీ, 49 రోజులు మాత్రమే అధికారంలో ఉండి 2014, ఫిబ్రవరి 14న రాజీనామా చేశారు. ఆ తరువాత, 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 67 సీట్లతో దాదాపు క్లీన్‌స్వీప్ చేసింది. బీజేపీ 3 సీట్లలో మాత్రమే గెలుపొందింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం
ఎప్పుడు : ఫిబ్రవరి 11
ఎవరు : ఆమ్ ఆద్మీ పార్టీ
ఎన్నికల్లో బ్లాక్‌చైన్ వ్యవస్థ : సునీల్ అరోరా
ఎన్నికల్లో బ్లాక్‌చైన్ వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు ఐఐటీ మద్రాస్‌తో కలసి పనిచేస్తున్నామని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా తెలిపారు. ఢిల్లీలో ఫిబ్రవరి 12న జరిగిన ‘టైమ్స్ నౌ సమిట్’ కార్యక్రమంలో పాల్గొన్న అరోరా ఈ మేరకు వెల్లడించారు. బ్లాక్‌చైన్ వ్యవస్థ అందుబాటులోకి వస్తే ఒక ఓటర్ వేరే రాష్ట్రంలో ఉండి కూడా తమ రాష్ట్రంలోని ఎన్నికల్లో ఓటేయవచ్చని పేర్కొన్నారు. ఈ విధానం అమలులోకి తేవడం అంటే ఇంట్లో కూర్చొని ఓటు వేయడం కాదన్నారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లే.. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుందని చెప్పారు.
పెస్టిసైడ్స్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
పురుగుమందుల వ్యాపార క్రమబద్ధీకరణతో పాటు, నకిలీ పురుగుమందుల కారణంగా నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు ఉద్దేశించిన ‘పెస్టిసైడ్స్ మేనేజ్‌మెంట్ బిల్-2020’కు కేంద్ర కేబినెట్ ఫిబ్రవరి 12న ఆమోదం తెలిపింది. ఈ విషయమై కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం పురుగుమందుల వ్యాపారం ఇన్‌సెక్టిసైడ్ యాక్ట్ - 1968 నిబంధనల ప్రకారం జరుగుతోంది. ఆ నిబంధనలకు కాలం చెల్లింది. అందుకే కొత్త బిల్లును రూపొందించాం’ అని తెలిపారు. రైతుల ప్రయోజనాలే ధ్యేయంగా, వారికి సురక్షితమైన, ప్రభావశీలమైన పురుగుమందులు అందించడం, నకిలీ పురుగుమందులను అరికట్టడం లక్ష్యంగా ఈ బిల్లు రూపొందిందన్నారు.
పెస్టిసైడ్స్ బిల్లులోని అంశాలు...
- పురుగు మందులకు సంబంధించిన సమస్త సమాచారం డీలర్ల నుంచి రైతులకు అందేలా చర్యలు
- సేంద్రియ పురుగుమందుల వాడకానికి ప్రోత్సాహం
- పురుగుమందుల ప్రచారం క్రమబద్దీకరణ
- నిబంధనలను అతిక్రమిస్తే పురుగుమందుల తయారీ సంస్థలకు రూ. 25 వేల నుంచి రూ. 50 లక్షల వరకు జరిమానా విధింపు
- నిబంధనలను అతిక్రమించేవారికి జైలు శిక్షను ఐదేళ్లవరకు పెంపు
- నకిలీ రసాయన మందుల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు ఒక సెంట్రల్ ఫండ్ ఏర్పాటు. పెస్టిసైడ్‌స కంపెనీల నుంచి వసూలు చేసిన జరిమానాకు, అవసరమైతే కొంత కలిపి కేంద్రం ఈ ఫండ్‌ను ఏర్పాటు చేస్తుంది.
ఏమిటి : పెస్టిసైడ్స్ మేనేజ్‌మెంట్ బిల్-2020కు ఆమోదం
ఎప్పుడు : ఫిబ్రవరి 12
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : రైతులకు సురక్షితమైన, ప్రభావశీలమైన పురుగుమందులు అందించడం, నకిలీ పురుగుమందులను అరికట్టడం లక్ష్యంగా
భారత్‌లో తొలి కరోనా కేసు నమోదు
ప్రాణాంతక కరోనా వైరస్‌కు సంబంధించి భారత్‌లో తొలి కేసు నమోదైంది. చైనాలోని వుహాన్ యూనివర్సిటీలో చదువుతున్న కేరళకు చెందిన విద్యార్థినికి ఈ వైరస్ సోకినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని జనవరి 30న భారత ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వైరస్‌కు సంబంధించి దేశంలోని పలు నగరాల్లో అనుమానిత కేసులు నమోదయ్యాయి. కానీ వైరస్ సోకినట్లు ధ్రువీకరించిన తొలి కేసు ఇదే. మరోవైపు చైనాలోని వుహాన్ నుంచి భారతీయులను తిరిగి వెనక్కి రప్పించేందుకు భారత ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.
170 మంది మృతి..
చైనాలో కరోనా వైరస్ బారినపడి జనవరి 30నాటికి 170 మంది మరణించారు. మరో 7,711 మందికి ఈ వైరస్ సోకినట్లు గుర్తించారు. ఈ ప్రాణాంతక వైరస్ ప్రపంచవ్యాప్తంగా 17 దేశాలకు విస్తరించింది. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు దాదాపు నాలుగు బిలియన్ డాలర్ల నిధులను చైనా ప్రభుత్వం కేటాయించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కరోనా వైరస్‌కు సంబంధించి భారత్‌లో తొలి కేసు నమోదు
ఎప్పుడు : జనవరి 30
ఎవరు : భారత ప్రభుత్వం
ఎక్కడ : కేరళ
ప్రతి పది మందిలో ఒకరికి కేన్సర్ : డబ్ల్యూహెచ్‌వో
భారతదేశంలో 2018లో దాదాపు 11.6 లక్షల కేన్సర్ కేసులు కొత్తగా నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. ప్రతి పది మంది భారతీయుల్లో ఒకరు తమ జీవిత కాలంలో ప్రాణాంతక కేన్సర్ వ్యాధి బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. కేన్సర్ బారిన పడిన వారిలో ప్రతి 15 మందిలో ఒకరు మరణించే అవకాశం ఉందని తెలిపింది. వరల్డ్ కేన్సర్ డే సందర్భంగా డబ్ల్యూహెచ్‌వో, ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ కేన్సర్ (ఐఏఆర్‌సీ) సంస్థలు ఫిబ్రవరి 4న రెండు నివేదికలు విడుదల చేశాయి. కేన్సర్ వ్యాధిపై ప్రపంచవ్యాప్తంగా ఎజెండా రూపొందించడంతో పాటు కేన్సర్‌పై పరిశోధన, నివారణలపై ఈ నివేదికలు ప్రధాన దృష్టి సారించాయి. సరైన జాగ్రత్తలు తీసుకోని పక్షంలో రాబోయే 20 ఏళ్లలో మధ్య ఆదాయ దేశాల్లో కేన్సర్ మరణాల రేటు 60 శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది.
వరల్డ్ కేన్సర్ డే 2020 థీమ్ : ఐ యామ్ అండ్ ఐ విల్
త్వరలో ఎయిర్ డిఫెన్స్ కమాండ్ ఏర్పాటు
భారత గగనతలంలో జరిగే వైమానిక దళ ఆపరేషన్లు అన్నింటినీ పర్యవేక్షించేలా ‘ఎయిర్ డిఫెన్స్ కమాండ్’ను త్వరలో ఏర్పాటు చేస్తామని భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ ఫిబ్రవరి 4న వెల్లడించారు. హిందూ మహాసముద్రం పరిసర ప్రాంతాల్లో జరిగే నేవీ ఆపరేషన్ల కోసం ద్వీపకల్ప కమాండ్‌ను, సైనికులకు వసతి, ఆయుధాలు సమకూర్చడం వంటి అవసరాలు తీరుస్తూనే, వారి సేవల్ని వినియోగించుకునేలా లాజిస్టిక్ కమాండ్‌ను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపారు.
సాయుధ బలగాలన్నీ సంఘటితం కావడానికి, సమన్వయంతో పనిచేయడానికి ఎయిర్ డిఫెన్స్ కమాండ్‌ను ఏర్పాటు చేస్తామని జనరల్ రావత్ పేర్కొన్నారు. వైమానిక దళానికి చెందిన విభాగాలన్నీ ఒకే కమాండ్ కిందకి వస్తే ఎదురయ్యే సమస్యల్ని నియంత్రించడం సులభం అవుతుందని అన్నారు. సిబ్బంది పని విభజన సక్రమంగా జరిగేలా లాజిస్టిక్స్ కమాండ్‌ను ఏర్పాటు చేయాలని అన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : త్వరలో ఎయిర్ డిఫెన్స్ కమాండ్ ఏర్పాటు
ఎప్పుడు : ఫిబ్రవరి 4
ఎవరు : చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్
ఎందుకు : భారత గగనతలంలో జరిగే వైమానిక దళ ఆపరేషన్లు అన్నింటినీ పర్యవేక్షించేందుకు
అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ట్రస్ట్
అయోధ్యలో రామ మందిర నిర్మాణ పర్యవేక్షణకు ఒక స్వతంత్ర సంస్థ(ట్రస్ట్) ఏర్పాటైంది. అత్యద్భుతంగా మందిర నిర్మాణం జరిపేందుకు ‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర’ పేరుతో ట్రస్ట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఫిబ్రవరి 5న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభలో ప్రకటించారు. మందిర నిర్మాణానికి ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలని ‘అయోధ్య’ తీర్పులో సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. 3 నెలల్లోగా ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించగా, ఆ గడువు 2020, ఫిబ్రవరి 9తో ముగియనున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
మందిర విషయమై మోదీ మాట్లాడుతూ... రామ మందిర అభివృద్ధి కోసం ఒక విసృ్తత పథకాన్ని సిద్ధం చేశామన్నారు. అయోధ్యలోని వివాదాస్పద స్థలం సహా మొత్తం 67.703 ఎకరాలను ఈ ట్రస్ట్‌కు బదిలీ చేస్తామన్నారు. అన్ని వర్గాల అభివృద్ధి లక్ష్యంగా ‘సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్’ మార్గంలో తన ప్రభుత్వం పయనిస్తోందన్నారు.
15 మంది ట్రస్టీలు..
రామ మందిర నిర్మాణం కోసం ఏర్పాటైన ట్రస్ట్‌లో 15 మంది సభ్యులుంటారని, వారిలో ఒకరు దళిత వర్గానికి చెందినవారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ ట్రస్ట్ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. అయితే, ట్రస్టీల పేర్లను ఇంకా ప్రభుత్వం ప్రకటించలేదు. ‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర’ ప్రధాన కార్యాలయం ఢిల్లీలోని గ్రేటర్ కైలాశ్ ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది.
సున్నీ వక్ఫ్ బోర్డ్‌కు ఐదెకరాలు
మసీదు నిర్మాణం కోసం అయోధ్య జిల్లాలో సున్నీ వక్ఫ్ బోర్డ్‌కు ఐదెకరాల స్థలాన్ని కేటాయిస్తూ యూపీ సర్కార్ నిర్ణయించింది. సున్నీ వక్ఫ్ బోర్డ్‌కు మసీదు నిర్మాణం కోసం ఐదెకరాల స్థలాన్ని కేటాయించాలని అయోధ్య తీర్పులో సుప్రీంకోర్టు ఆదేశించడం తెల్సిందే. అయోధ్య నుంచి 18 కి.మీల దూరంలో లక్నో హైవేపై ఈ స్థలాన్ని కేటాయించినట్లు యూపీ ప్రభుత్వం తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రామ మందిర నిర్మాణానికి ట్రస్ట్ ఏర్పాటు
ఎప్పుడు : ఫిబ్రవరి 5
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : అయోధ్య, ఉత్తరప్రదేశ్
లక్నోలో 11వ డిఫెక్స్‌పో ప్రారంభం
రక్షణ ఉత్పత్తుల ఎగ్జిబిషన్ ‘11వ డిఫెక్స్‌పో’ ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఫిబ్రవరి 5న ప్రధాని నరేంద్ర మోదీ ఈ డిఫెక్స్‌పోను ప్రారంభించారు. అనంతరం మోదీ మాట్లాడుతూ... రానున్న ఐదేళ్లలో భారత్ నుంచి 500 కోట్ల డాలర్ల(రూ. 35.6 వేల కోట్లు) విలువైన మిలటరీ ఉత్పత్తులను ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా భారత్‌లో తయారీ యూనిట్లను ప్రారంభించాలని ప్రపంచంలోని ప్రముఖ రక్షణ పరికరాల తయారీ సంస్థలను కోరారు. ఏ దేశాన్నో లక్ష్యంగా చేసుకుని భారత్ తన సైనిక శక్తిని పెంపొందించుకోవాలనుకోవడం లేదని స్పష్టం చేశారు. శాంతి, సుస్థిరతలను కాపాడే విషయంలో భారత్ నమ్మదగిన భాగస్వామి అన్నారు.
భారత్ రెండేళ్లకు ఒకసారి ఈ ‘డిఫెక్స్‌పో’ను నిర్వహిస్తుంది. ఈ సంవత్సరం జరుగుతోంది 11వ ప్రదర్శన. ఐదు రోజుల పాటు జరిగే 11వ డిఫెక్స్‌పోకు 38 దేశాల రక్షణ మంత్రులు, 172 విదేశీ, 856 స్వదేశీ మిలటరీ ఎక్విప్‌మెంట్ సంస్థల ఉన్నతస్థాయి ప్రతినిధులు హాజరవుతున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 11వ డిఫెక్స్‌పో ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 5
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : లక్నో, ఉత్తరప్రదేశ్
సరోగసీ బిల్లుపై సెలెక్ట్ కమిటీ నివేదిక
సరోగసీ(రెగ్యులేషన్) బిల్లు-2019పై రాజ్యసభ సెలెక్ట్ కమిటీ ఒక నివేదికను రూపొందించింది. ఈ నివేదికను కమిటీ చైర్మన్ భూపేందర్ యాదవ్ ఫిబ్రవరి 5న రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయడుకి అందజేశారు. సరోగసీ(రెగ్యులేషన్) బిల్లు-2019ని నవంబర్ 21, 2019న రాజ్యసభ సెలెక్ట్ కమిటీకి పంపించారు. అప్పటి నుంచి ఈ కమిటీ 10 సార్లు సమావేశమై తాజా నివేదికను రూపొందించింది. 23 మంది సభ్యుల సెలెక్ట్ కమిటీ బృందం సరోగసీ బిల్లులో పలు మార్పులను సూచించింది.
సరోగసీ బిల్లుపై సెలెక్ట్ కమిటీ సూచనలు
- సరోగసీ ద్వారా బిడ్డల్ని కనిచ్చేందుకు దగ్గరి బంధువులే కానక్కర్లేదనీ, ఆరోగ్యవంతులైన స్త్రీలెవ్వరైనా అందుకు సమ్మతిస్తే సరోగసీ పద్ధతుల్లో బిడ్డని కనివ్వొచ్చు.
- 35-45 ఏళ్ల మధ్య వయస్కులైన ఒంటరి స్త్రీలు సరోగసీని ఉపయోగించుకోవచ్చు.
- సరోగసీ ద్వారా బిడ్డని కనాలనుకునే జంట పెళ్ళైన ఐదేళ్ళ పాటు భార్యాభర్తలు కలిసి ఉండీ పిల్లల్ని కనలేని పరిస్థితుల్లోనే అద్దెగర్భాన్ని ఆశ్రయించాలన్న నిబంధన సడలింపు.
- అద్దెగర్భం దాల్చే మహిళలకు గతంలో ఉన్న 16 నెలల ఇన్సూరెన్స్ కవరేజ్‌ను 36 నెలలకు పెంచాలి.
- బిడ్డలు కావాలనుకునేవారు ఎప్పుడైనా సరోగసీ ద్వారా బిడ్డలను కనొచ్చనీ, అయితే అందుకు వైద్యపరమైన ఆమోదం పొందాల్సి ఉంటుంది.
- భారతీయ సంతతికి చెందిన వారెవ్వరైనా సరోగసీ బోర్డు ద్వారా అనుమతిపొందిన తరువాత దేశంలో సరోగసీ ద్వారా బిడ్డలను పొందే వీలుండేలా బిల్లులో మార్పులు చేయాలి.
ఆటో ఎక్స్ పో 2020 మోటార్ షో ప్రారంభం
ఆటోమొబైల్ పరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఆటో ఎక్స్‌పో 2020 మోటార్ షో’ ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఫిబ్రవరి 5న లాంఛనంగా ప్రారంభమైంది. భారతీయ పరిశ్రమల సమాఖ్య సీఐఐతో పాటు ఏసీఎంఏ, సియామ్ కలిసి నిర్వహిస్తున్న ఈ ఎక్స్‌పోలో దేశ, విదేశాలకు చెందిన పలు దిగ్గజ ఆటోమొబైల్ సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నాయి. 15 పైగా స్టార్టప్ సంస్థలు, టెలికం, విద్యుత్ వాహనాల సంస్థలు, సోషల్ మీడియా సంస్థలు ఇందులో పాల్గొంటున్నాయి. సుమారు 60 దాకా ప్యాసింజర్ కార్లు, కమర్షియల్ వాహనాలు, ద్విచక్ర వాహనాలను కంపెనీలు ఈ 15వ ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించనున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆటో ఎక్స్‌పో 2020 మోటార్ షో ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 5
ఎక్కడ : గ్రేటర్ నోయిడా, ఉత్తరప్రదేశ్
మహారాష్ట్రలో రూ.65వేల కోట్లతో పోర్టు నిర్మాణం
మహారాష్ట్రలో రూ.65వేల కోట్లతో భారీ పోర్టు నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన ఫిబ్రవరి 5న సమావేశమైన మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ముంబైలోని జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ (జేఎన్‌పీటీ)కి 97 కిలోమీటర్ల దూరంలోని వధావన్ వద్ద ఈ భారీ పోర్టు నిర్మాణం చేపడతారు. ప్రైవేటు భాగస్వామ్యంతో (ల్యాండ్ లార్డ్ మోడల్‌లో) అభివృద్ధి చేసే ఈ ప్రాజెక్టుకు రూ.65,544.54 కోట్లు వ్యయం అవుతుందని అంచనా.
కేంద్ర కేబినెట్ మరికొన్ని నిర్ణయాలు
- ఎయిరిండియా అనుబంధ సంస్థ అలయన్స్ ఎయిర్ ద్వారా భారత్-శ్రీలంకల మధ్య విమాన సర్వీసులు నడపడానికి ఆమోదం.
- సూరత్, భోపాల్, భాగల్పుర్, అగర్తల, రాయచూర్ ట్రిపుల్ ఐటీ (పీపీపీ)లకు జాతీయ ప్రాధాన్య సంస్థల హోదా కల్పించాలని నిర్ణయం.
- పీఎంసీ బ్యాంక్ తరహా సంక్షోభం మరోసారి తలెత్తకుండా డిపాజిట్‌దారుల ప్రయోజనాల పరిరక్షణ, సహకార బ్యాంకులను మరింత పటిష్టం చేసే దిశగా బ్యాంకింగ్ నియంత్రణ చట్టానికి సవరణకు ఆమోదం.
ఏమిటి : రూ.65వేల కోట్లతో పోర్టు నిర్మాణం
ఎప్పుడు : ఫిబ్రవరి 5
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎక్కడ : వధావన్, మహారాష్ట్ర
అయోధ్య మందిరానికి కేంద్ర ప్రభుత్వ విరాళం రూపాయి
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం తొలి విరాళంగా కేంద్ర ప్రభుత్వం ఒక రూపాయిని లాంఛనంగా ‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర’ ట్రస్ట్‌కు అందజేసింది. ప్రభుత్వం తరపున హోంశాఖలో అండర్ సెక్రటరీగా పనిచేస్తున్న డీ ముర్ము ఫిబ్రవరి 6న ఈ మొత్తాన్ని నగదు రూపంలో ట్రస్ట్‌కు అందించారు. నగదు రూపంలో కానీ, స్థిరచరాస్తుల రూపంలో కానీ ట్రస్ట్‌కు విరాళాలు అందజేయవచ్చని ప్రభుత్వ అధికారులు తెలిపారు. ట్రస్ట్ కార్యాలయాన్ని తాత్కాలికంగా గ్రేటర్ కై లాశ్ ప్రాంతంలోని సీనియర్ న్యాయవాది, ట్రస్ట్ సభ్యుడు పరాశరన్ ఇంట్లో ఏర్పాటు చేశామని, త్వరలో శాశ్వత కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
ఏప్రిల్‌లో మందిర నిర్మాణం..
అయోధ్యలో రామ మందిర నిర్మాణం శ్రీరామ నవమి(ఏప్రిల్ 2) రోజు కానీ, అక్షయ తృతీయ(ఏప్రిల్ 26)రోజు కానీ ప్రారంభమవుతుందని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర సభ్యుడు స్వామి గోవింద దేవగిరి మహారాజ్ చెప్పారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం 15 మంది సభ్యులతో కేంద్రం శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర పేరుతో ఒక ట్రస్ట్‌ను బుధవారం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర’ ట్రస్ట్‌కు తొలి విరాళం
ఎప్పుడు : ఫిబ్రవరి 6
ఎవరు : కేంద్రప్రభుత్వం
ఎందుకు : అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి..
Published date : 01 Mar 2020 02:58PM