Pension: 1975-77 మధ్య జైలుకెళ్లిన వారికి రూ.20 వేల పెన్షన్

ఈ పెన్షన్, వైద్య ఖర్చుల భారం కూడా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. జనవరి 1వ తేదీ నుంచి ఈ పథకం అమలులోకి వస్తుంది.
ఈ పథకం.. 1975 జూన్ 25 నుంచి 1977 మార్చి 21 మధ్య భారత ప్రధాని ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేసినవారికి వర్తించనుంది. ఆ సమయంలో జైలుకు వెళ్లినవారిలో ఎంతోమంది ఒడిశా రాష్ట్రం నుంచి కూడా ఉన్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ జైలుకు వెళ్లి ఇప్పటికీ ప్రాణాలతో ఉన్న వారికి ఈ పథకం ప్రకారం రూ.20,000 పింఛన్ ఇవ్వాలని ఒడిశా ప్రభుత్వం నిర్ణయించింది.
ఇంకా ఈ పథకం ద్వారా.. వారికి వైద్య ఖర్చుల భారం కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చింది. ముఖ్యంగా.. అర్హులైన వారు ఈ పథకం ద్వారా పెన్షన్, వైద్య సేవలు పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని సీఎం మోహన్ చరణ్ మాఝీ సూచించారు.
Yuva Udaan Yojana: నిరుద్యోగ యువతకు నెలకు రూ.8,500.. వీరికి మాత్రం..