నవంబర్ 2018 జాతీయం
Sakshi Education
సీజీడీ నెట్‌వర్క్ పనులకు శంకుస్థాపన
దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో 129 జిల్లాల్లోని ఇళ్లకు పైప్‌లైన్ ద్వారా వంటగ్యాస్ అందించే సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్(సీజీడీ) నెట్‌వర్క్ పనులకు ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో నవంబర్ 22న వీడియోకాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు. అనంతరం 10వ రౌండ్ గ్యాస్ లెసైన్స్ బిడ్డింగ్‌ను ప్రారంభించారు. ఈ 129 జిల్లాలను 50 జియోగ్రాఫికల్ ఏరియాలుగా విభజించారు.
సీజీడీ నెట్‌వర్క్ పనుల శంకుస్థాపన సందర్భంగా మోదీ మాట్లాడుతూ... స్వేచ్ఛాయుత గ్యాస్ మార్కెట్, ధరల నియంత్రణ కోసం ట్రేడింగ్ ఎక్ఛ్సేంజ్‌తో పాటు స్వతంత్ర రవాణా వ్యవస్థను ఏర్పాటు చేస్తామని చెప్పారు. పంట వ్యర్థాలను బయో-సీఎన్‌జీగా మార్చే 5వేల ప్లాంట్లను ఏర్పాటుచేస్తామన్నారు. రాబోయే 2-3 ఏళ్లలో దేశవ్యాప్తంగా 400 జిల్లాల్లో పైప్‌లైన్ ద్వారా ఇళ్లకు గ్యాస్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తామని తెలిపారు. పారిస్ వాతావరణ సదస్సు(కాప్ 21) సందర్భంగా కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా కాలుష్య నియంత్రణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
10వ రౌండ్ బిడ్డింగ్ లో భాగంగా నెల్లూరు(ఏపీ), కొల్లామ్, అలప్పుజా(కేరళ), ఉజ్జయిని, గ్వాలియర్, మొరేనా(మధ్యప్రదేశ్), మైసూర్, గుల్బర్గా(కర్ణాటక), ముజఫర్‌పూర్(బిహార్) సహా 19 నగరాల్లో సీజీడీ నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ, రాజస్తాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్నికల నిబంధనల నేపథ్యంలో శంకుస్థాపనను నిలిపివేశారు. 2030 నాటికి దేశ విద్యుత్ అవసరాల్లో 40 శాతాన్ని సంప్రదాయేతర ఇంధన వనరుల నుంచి ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ పనులకు శంకుస్థాపన
ఎప్పుడు : నవంబర్ 22
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : ఢిల్లీ
కర్తార్‌పూర్‌కు ప్రత్యేక కారిడార్
భారత్-పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దుల్లోని కర్తార్‌పూర్ సాహిబ్ వెళ్లే సిక్కు తీర్థ యాత్రికులకు సౌలభ్యంగా ఉండేందుకు ప్రత్యేక కారిడార్ ఏర్పాటు చేయనున్నట్లు నవంబర్ 22న కేంద్రప్రభుత్వం తెలిపింది. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లా డేరాబాబా నానక్ నుంచి అంతర్జాతీయ సరిహద్దు వరకు ఈ కారిడార్ ను ఏర్పాటుచేయనున్నారు. ఈ కారిడార్‌కు నవంబర్ 26న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శంకుస్థాపన చేయనున్నారు.
గురునానక్ 550వ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. కర్తార్‌పూర్‌ను భారత్ యాత్రికులు వీక్షించేందుకు వీలుగా సరిహద్దుల వద్దే శక్తివంతమైన టెలిస్కోప్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. దీనికి స్పందనగా.. సరిహద్దు నుంచి గురుద్వారా వరకు తామూ కూడా కారిడార్ నిర్మిస్తామని పాకిస్థాన్ ప్రకటించింది. భారత్-పాక్ అంతర్జాతీయ సరిహద్దులకు పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలో 3 కి.మీ.ల దూరంలో కర్తార్‌పూర్ సాహిబ్ ఉంది. సిక్కు మత స్థాపకుడు గురు నానక్ తుది శ్వాస విడిచిన ఇదేచోట తొలి గురుద్వారా ఏర్పాటైంది.
కేబినెట్ కమిటీ మరికొన్ని నిర్ణయాలు...
నవంబర్ 22న సమావేశమైన కేబినెట్ కమిటీ కర్తార్‌పూర్ కారిడార్ ఏర్పాటుతోపాటు మరికొన్ని నిర్ణయాలు తీసుకుంది.
ఏమిటి : కర్తార్‌పూర్‌కు ప్రత్యేక కారిడార్
ఎప్పుడు : నవంబర్ 22
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దుల్లో
ఎందుకు : కర్తార్‌పూర్ సాహిబ్ వెళ్లే సిక్కు తీర్థ యాత్రికులకు సౌలభ్యంగా ఉండేందుకు
అన్ని పాఠశాలల్లో ‘భాషా పరిచయం’
దేశంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల్లో తప్పకుండా ‘భాషా పరిచయం’ కార్యక్రమంను అమలుచేయాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఆర్‌డీ) నిర్ణయించింది. ఈ మేరకు నవంబర్ 23న ఆదేశాలు జారీ చేసింది. దేశ భాషలపై విద్యార్థులకు కనీస అవగాహనను కల్పించేందుకు భాషా పరిచయం కార్యక్రమంను ఎంహెచ్‌ఆర్‌డీ రూపొందించింది. ఈ కార్యక్రమం ద్వారా పాఠశాల స్థాయిలోనే దేశ భాషలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తే... ముఖ్యమైన పదాలపై కొంతమేర పట్టు రావడంతో పాటు జాతీయ సమగ్రత పెంపొందుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రార్థన సమయంలో ఉచ్ఛారణ...
భాష పరిచయం కార్యక్రమంలో భాగంగా ప్రార్థనా సమయంలో కనీసం 5 పదాలను విద్యార్థులు ఉచ్ఛరించేలా ఎంహెచ్‌ఆర్‌డీ ప్రణాళిక రూపొందించింది. నమస్కారం, మీ పేరు ఏమిటి?, నా పేరు, మీరు ఎలా ఉన్నారు? వంటి ప్రశ్నలు, సమధానాలు ఇచ్చి వాటిపై అవగాహన కల్పించనుంది. నిర్దేశించిన వాక్యాలను రోజుకొక భాష వంతున డిసెంబర్ 21లోపు దేశంలోని అధికారిక భాషలైన 22 భాషల్లో పరిచయం పూర్తి చేయనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అన్ని పాఠశాలల్లో భాషా పరిచయం కార్యక్రమం అమలు
ఎప్పుడు : నవంబర్ 23
ఎవరు : కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఎక్కడ : దేశవ్యాప్తంగా
ఎందుకు : దేశ భాషలపై విద్యార్థులకు కనీస అవగాహనను కల్పించేందుకు
అయోధ్యలో 221 మీటర్ల రాముడి విగ్రహం
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో 221 మీటర్ల పొడవైన రాముడి కాంస్య విగ్రహం నిర్మించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు ఆ రాష్ట్ర సమాచార శాఖ ముఖ్య కార్యదర్శి అవనీశ్ అవస్థి నవంబర్ 25న తెలిపారు. ‘స్టాచ్యూ ఆఫ్ ది మర్యాద పురుషోత్తమ్’ పేరుతో ఈ విగ్రహాన్ని ఏర్పాటుచేయనున్నారు. రాముడి విగ్రహం 151 మీటర్ల పొడవు, దానిపై గొడుగు 20 మీటర్లు, విగ్రహం పునాది మరో 50 మీటర్ల ఎత్తు ఉంటుందని అవస్థి తెలిపారు. విగ్రహం కింద భాగంలో అయోధ్యతోపాటు ‘ఇక్ష్వాకు వంశం’ చరిత్రకు సంబంధించిన విశేషాలతో అధునాతన మ్యూజియం ఏర్పాటుచేస్తామని చెప్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘స్టాచ్యూ ఆఫ్ ది మర్యాద పురుషోత్తమ్’ పేరుతో రాముడి విగ్రహం ఏర్పాటు
ఎప్పుడు : నవంబర్ 25
ఎవరు : ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ : అయోధ్య, ఉత్తరప్రదేశ్
కర్తార్‌పూర్ కారిడార్‌కు శంకుస్థాపన
పాకిస్థాన్‌లోని గురుద్వార దార్బార్ సాహిబ్‌ను సందర్శించే సిక్కు యాత్రికుల సౌకర్యం కోసం ఏర్పాటుచేయనున్న కర్తార్‌పూర్ కారిడార్‌కు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నవంబర్ 26న శంకుస్థాపన చేశారు. 16వ శతాబ్దంలో రావి నది ఒడ్డున నిర్మితమైన సాహిబ్ గురుద్వార సిక్కులకు చాలా పవిత్రమైనది. దేశ విభజన అనంతరం పాకిస్థాన్‌కు వెళ్లిన ఈ గరుద్వారా భారత్‌లోని గురుదాస్‌పూర్ జిల్లా డేరా బాబా నానక్ నుంచి నాలుగు కిలో మీటర్ల దూరంలో ఉంది. ప్రస్తుతం ఈ మార్గంలో రహదారి నిర్మించేందుకే వెంకయ్య శంకుస్థాపన చేశారు.
సిక్కు మత స్థాపకుడు గురునానక్ 550వ జయంతి సందర్భంగా కర్తార్‌పూర్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కర్తార్‌పూర్ కారిడార్‌కు శంకుస్థాపన
ఎప్పుడు : నవంబర్ 26
ఎవరు : ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
ఎక్కడ : గురుదాస్‌పూర్ జిల్లా, పంజాబ్
ఒకటి, రెండు తరగతులకు ఇంటి పని ఇవ్వకూడదు
ఒకటి, రెండు తరగతుల పిల్లలకు ఇంటి పని (హోంవర్క్) ఇవ్వకూడదని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ(ఎమ్‌హెచ్‌ఆర్‌డీ) స్పష్టం చేసింది. ఈ మేరకు ఏ తరగతి చదివే పిల్లలకు పుస్తకాల సంచులు ఎంత బరువు ఉండాలో నిర్ధారిస్తూ నవంబర్ 27న అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.
ఎమ్‌హెచ్‌ఆర్‌డీ ఆదేశాలు ప్రకారం...
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఒకటి, రెండు తరగతులకు ఇంటి పని ఇవ్వకూడదు
ఎప్పుడు : నవంబర్ 27
ఎవరు : కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ
పౌల్ట్రీ ఇండియా సదస్సు ప్రారంభం
పౌల్ట్రీ ఇండియా 12వ సదస్సును కేంద్ర పశుసంవర్థక శాఖ సంయుక్త కార్యదర్శి డాక్టర్ ఓపీ చౌదరి హైదరాబాద్‌లో నవంబర్ 28న ప్రారంభించారు. మూడురోజులపాటు జరగనున్న ఈ సదస్సులో దేశ, విదేశాలకు చెందిన ప్రముఖ పౌల్ట్రీ పరిశ్రమలు, ఫీడ్, క్లీనింగ్, ఔషధ పరిశ్రమలు తమ ఉత్పత్తులు పదర్శిస్తున్నాయి. ఇటలీ, ఇజ్రాయెల్, చైనా, సింగపూర్, యూఎస్‌ఏ, జర్మనీ, బెల్జియం, సౌత్ కోరియా, నెదర్లాండ్‌స తదితర 75కుపైగా దేశాలకు చెందిన కంపెనీలు ఈ సదస్సులో పాల్గొంటున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పౌల్ట్రీ ఇండియా-2018 సదస్సు ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 28
ఎక్కడ : హైదరాబాద్
ఎంప్లాయబిలిటీ ర్యాంకింగ్‌లో బెంగళూరు ఐఐఎస్‌సీ
‘గ్లోబల్ యూనివర్సిటీ ఎంప్లాయబిలిటీ ర్యాంకింగ్’లో బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ) 28వ స్థానంలో నిలిచింది. ఈ మేరకు ఫ్రాన్స్ కు చెందిన హెచ్‌ఆర్ కన్సల్టెన్సీ కంపెనీ రూపొందించిన నివేదికను టైమ్స్ హయ్యర్ ఎడ్యేకేషన్ నవంబర్ 15న ప్రచురించింది. ఈ జాబితాలో 150కిగాను భారత్ నుంచి కేవలం మూడు విద్యా సంస్థలే చోటు దక్కించుకున్నాయి. బెంగళూరులోని ఐఐఎస్‌సీ 28వ స్థానంలో నిలవగా, ఐఐటీ-ఢిల్లీకి 53వ స్థానం, ఐఐఎం-అహ్మదాబాద్‌కి 144వ స్థానం దక్కింది. గతేడాది ఇదే ర్యాంకింగ్‌సలో ఐఐటీ-ఢిల్లీ 145వ స్థానం పొందింది. ఈ జాబితా తొలి మూడు ర్యాంకులను అమెరికా విశ్వవిద్యాలయాలు సొంతం చేసుకున్నాయి. హెచ్‌ఆర్ కన్సల్టెన్సీ ‘ఎమర్జింగ్’ అంశంపై సర్వే చేసి ప్రపంచవ్యాప్తంగా 150 విద్యా సంస్థలకు ర్యాంకులు ఇచ్చింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బెంగళూరులోని ఐఐఎస్‌సీ 28వ స్థానం
ఎప్పుడు : నవంబర్ 15
ఎవరు : హెచ్‌ఆర్ కన్సల్టెన్సీ కంపెనీ
ఎక్కడ : గ్లోబల్ యూనివర్సిటీ ఎంప్లాయబిలిటీ ర్యాంకింగ్లో
గజ తూపాను కారణంగా 26 మంది మృతి
తమిళనాడులోని నాగపట్టణం, వేదారణ్యంల మధ్య నవంబర్ 16న తీరం దాటిన గజ తుపాను కారణంగా తమిళనాడులో 26 మంది మృతి చెందారు. భారీ వర్షాలు, ఈదురుగాలులతో విరుచుకుపడిన గజ దాటికి దక్షిణ తమిళనాడు, పుదుచ్చేరిలు అతలాకుతలమయ్యాయి. తూపాను తీరం దాటే సమయంలో గంటకు 120 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి. తూపాను కారణంగా భారీ మొత్తంలో ఆస్తి, పంట నష్టం జరిగింది. వేలాది చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో అనేక ప్రాంతాలకు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. తూపాను ప్రభావిత ప్రాంతాల్లో జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్‌ఎఫ్) బృందాలు పడవలతో సహాయక చర్యలు చేపడుతున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గజ తూపాను కారణంగా 26 మంది మృతి
ఎప్పుడు : నవంబర్ 16
ఎక్కడ : తమిళనాడు
కేఎంపీ ఎక్స్‌ప్రెస్ వే ప్రారంభం
హరియాణాలోని గుర్‌గ్రామ్ జిల్లాలో 83 కిలోమీటర్ల కుండ్లి-మనేసర్-పల్వాల్ (కేఎంపీ) ఎక్స్‌ప్రెస్‌వేను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 19న ప్రారంభించారు. అలాగే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 3.2 కిలోమీటర్ల వల్లభ్‌గఢ్-ముజేసర్ మెట్రో రైల్ లింక్ ప్రారంభోత్సవం, పల్వాల్ జిల్లాలో శ్రీ విశ్వకర్మ స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు. మొత్తం 135 కిలోమీటర్ల పొడవైన కేఎంపీ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ.6,400 కోట్లు వెచ్చించింది. దీనిలోని 52 కిలోమీటర్ల రహదారి 2016లోనే అందుబాటులోకి వచ్చింది.
వల్లభ్‌గఢ్- ముజేసర్ మెట్రో రైల్ లింక్ నిర్మాణానికి రూ.580 కోట్లు ఖర్చు కాగా, శ్రీ విశ్వకర్మ స్కిల్ యూనివర్సిటీ నిర్మాణానికి రూ.989 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. జాతీయ రాజధాని ప్రాంతంలోని కేఎంపీ ఎక్స్‌ప్రెస్ వే అందుబాటులోకి రావడంతో ఢిల్లీకి వాహనాల రాకపోకల రద్దీ గణనీయంగా తగ్గడంతోపాటు రాజధాని ప్రాంతంలో కాలుష్యం కూడా తగ్గుముఖం పట్టనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కుండ్లి-మనేసర్-పల్వాల్ (కేఎంపీ) ఎక్స్‌ప్రెస్ వే ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 19
ఎవరు : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఎక్కడ : గుర్‌గ్రామ్, హరియాణ
ఢిల్లీ వాసుల ఆయుర్దాయం పదేళ్లు తగ్గుదల
వాయు కాలుష్యం కారణంగా ఢిల్లీవాసుల ఆయుర్దాయం పదేళ్లకుపైగా తగ్గిందని షికాగో విశ్వవిద్యాలయంలోని ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్ వెల్లడించింది. ఈ మేరకు ఢిల్లీ వాయుకాలుష్యంపై రూపొందించిన నివేదికను నవంబర్ 19న విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం... రెండు దశాబ్దాల కాలంలో 2016లో ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత దారుణస్థాయికి దిగజారింది. వాయుకాలుష్యం పెరిగి 1998తో పోల్చితే దేశంలో సూక్ష్మధూళి కణాలు ప్రస్తుతం సగటున 69 శాతం ఎక్కువయ్యాయి. దీంతో భారతీయుని ఆయుర్దాయం 4.3 సంవత్సరాలు తగ్గింది. దేశంలోని అత్యంత కాలుష్య నగరాల జాబితాలో ఢిల్లీ రెండోస్థానంలో ఉందని పాలసీ ఇన్‌స్టిట్యూట్ తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఢిల్లీ వాసుల ఆయుర్దాయం పదేళ్లు తగ్గుదల
ఎప్పుడు : నవంబర్ 19
ఎవరు : ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్, షికాగో విశ్వవిద్యాలయం, అమెరికా
ఎందుకు : వాయు కాలుష్యం కారణంగా
ఏనుగుల ప్రత్యేక ఆసుపత్రి ప్రారంభం
దేశంలోనే తొలిసారిగా ఏనుగుల కోసం ప్రత్యేకంగా నిర్మించిన ఆసుపత్రిని ఆగ్రా డివిజనల్ కమిషనర్ అనిల్ కుమార్ నవంబర్ 16న ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్(యూపీ)లో మథుర, ఆగ్రా సమీపంలో గల ఫరా బ్లాక్ ఛుర్మురా గ్రామంలో ఈ ఆసుపత్రిని ఆ రాష్ట్ర అటవీ శాఖ ఏర్పాటు చేసింది. ఏనుగులకు వైర్‌లెస్ ఎక్స్-రే, లేజర్ చికిత్స, డెంటల్ ఎక్స్-రే, థెర్మల్ ఇమేజింగ్, అల్టాస్రోనోగ్రఫీ, హైడ్రోథెరఫీ, క్వారంటైన్ సౌకర్యాలు ఈ ఆసుపత్రిలో అందుబాటులో ఉంటాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశంలో తొలి ఏనుగుల ఆసుపత్రి ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 16
ఎక్కడ : ఛుర్మురా గ్రామం, ఫరా బ్లాక్, ఉత్తరప్రదేశ్
గ్లోబల్ టాలెంట్ ర్యాంకింగ్‌లో భారత్‌కు 53వ స్థానం
గ్లోబల్ యాన్యువల్ టాలెంట్ ర్యాంకింగ్‌లో భారత్‌కు 53వ స్థానం లభించింది. ఈ మేరకు 63 దేశాలతో రూపొందించిన జాబితాను స్విట్జర్లాండ్‌కు చెందిన ఐఎండీ బిజినెస్ స్కూల్ నవంబర్ 20న విడుదల చేసింది. ఈ జాబితాలో అయిదోసారీ స్విట్జర్లాండ్ అగ్రస్థానం పొందగా డెన్మార్క్, నార్వే, ఆస్ట్రియా, నెదర్లాండ్‌స దేశాలు వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఆసియా దేశాల్లో మాత్రం సింగపూర్ (గ్లోబల్ లిస్టులో 13వ స్థానం)కు మొదటి స్థానం దక్కింది. ఈ జాబితాలో చైనా 39వ ర్యాంకు పొందింది.
భారత్... టాలెంట్ పూల్‌లో సగటు స్థాయి కన్నా మెరుగ్గా ఉందని (సంసిద్ధత ప్రాతిపదికన 30వ స్థానం), మరోవైపు టాలెంట్ అభివృద్ధిపై పెట్టుబడులో మాత్రం వెనుకబడి ఉందని (63వ స్థానం) ఐఎండీ బిజినెస్ స్కూల్ పేర్కొంది. టాలెంట్ అభివృద్ధిపై పెట్టుబడులు, ఆకర్షణ, సంసిద్ధత అనే మూడు అంశాల ప్రాతిపదికన ర్యాంకులను నిర్ణయిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గ్లోబల్ యాన్యువల్ టాలెంట్ ర్యాంకింగ్‌లో భారత్‌కు 53వ స్థానం
ఎప్పుడు : నవంబర్ 20
ఎవరు : ఐఎండీ బిజినెస్ స్కూల్, సింగపూర్
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ రద్దు
జమ్మూకశ్మీర్ అసెంబ్లీని రద్దు చేస్తూ ఆ రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్ నవంబర్ 21న ఉత్తర్వులు జారీ చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలు జరిగే అవకాశం ఉండటం, విరుద్ధ భావజాలాలున్న పార్టీలు స్థిర ప్రభుత్వాన్ని ఏర్పరచలేవన్న నమ్మకంతోనే అసెంబ్లీని రద్దుచేయాల్సి వచ్చిందని గవర్నర్ ప్రకటించారు. మెజారిటీని నిరూపించుకునేందుకు ఒకటి కన్నా ఎక్కువ వర్గాలు ముందుకు రావడం ప్రభుత్వ నిలకడపై ప్రభావం చూపుతుందని మరొక కారణంగా ఆయన పేర్కొన్నారు.
బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో పీడీపీ- బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిన నేపథ్యంలో జూన్ 19న జమ్మూకశ్మీర్‌లో గవర్నర్ పాలన విధించారు. ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఉండేందుకు అసెంబ్లీని సుప్త చేతనావస్థలో ఉంచారు. జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో మొత్తం 89(87+2 నామినేటెడ్) సభ్యులు ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జమ్మూకశ్మీర్ అసెంబ్లీ రద్దు
ఎప్పుడు : నవంబర్ 21
ఎవరు : గవర్నర్ సత్యపాల్ మాలిక్
రైల్వే సర్వీస్ ప్రొవైడర్‌గా జియో
దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ భారతీయ రైల్వేకు టెలికం సేవల ప్రొవైడర్‌గా రిలయన్స్ జియో వ్యవహరించనుంది. ఈ మేరకు నూతన సీయూజీ పథకంను జియోకి అందించనున్నట్లు నవంబర్ 21న రైల్‌టెల్ సంస్థ తెలిపింది. 2019 జనవరి 1 నుంచి ఇది అమల్లోకి రానుందని వెల్లడించింది. దీనివల్ల రైల్వే టెలిఫోన్ బిల్లుల భారం కనీసం 35 శాతం మేర తగ్గనుందని వివరించింది.
భారతీయ రైల్వేకు గత ఆరేళ్లుగా భారతీ ఎయిర్‌టెల్ టెలికం సేవలు అందిస్తోంది. 1.95 లక్షల మొబైల్ ఫోన్ కనెక్షన్లను సీయూజీ కింద రైల్వే ఉద్యోగులు వినియోగిస్తున్నారు. ఇందు కోసం ఏటా రూ.100 కోట్లను ఎయిర్‌టెల్‌కు రైల్వే చెల్లిస్తోంది. ఇరు సంస్థల మధ్య ఒప్పందం గడువు డిసెంబర్ 31తో ముగియనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రెల్వేకు టెలికం సేవల ప్రొవైడర్‌గా రిలయన్స్ జియో
ఎప్పుడు : నవంబర్ 21
ఎవరు : రైల్‌టెల్ సంస్థ
రక్షణ వ్యవస్థలోకి మూడు శతఘ్నులు
దేశ రక్షణ వ్యవస్థలోకి మూడు అధునాతన శతఘు్నలు చేరాయి. మహారాష్ట్రలోని దియోలాలి ఫీల్డ్ ఫైరింగ్ రేంజెస్‌లో నవంబర్ 9న జరిగిన కార్యక్రమంలో రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ వీటిని సైన్యంలో ప్రవేశపెట్టారు. వీటిలో ఎం777 ఏ2 అల్ట్రాలైట్ హోవిట్జర్లు, కె9 వజ్ర శతఘు్నలతో పాటు ఆయుధాలను సరిహద్దులకు చేరవేసే ఫీల్డ్ ఆర్టిలరీ ట్రాక్టర్(ఫ్యాట్)లు ఉన్నాయి. అమెరికా 2016 నవంబర్‌లో రూ.5,070 కోట్లతో నుంచి కొనుగోలు చేసిన ఎం777 ఏ2(155 ఎంఎం-39 క్యాలిబర్)హోవిట్జర్ శతఘు్నలు 30 కి.మీ దూరంలోని శత్రు స్థావరాలను తుత్తునియలు చేయగలవు. వీటిని ఎత్తైన ప్రాంతాలకు హెలికాప్టర్ల ద్వారా తేలికగా రవాణా చేయొచ్చు.
దక్షిణకొరియాకు చెందిన థండర్-9ను అభివృద్ధి చేసి కె9 వజ్ర(155 ఎంఎం-52 క్యాలిబర్) యుద్ధ ట్యాంకును రూపొందించారు. స్వీయచోదక శక్తితో కూడిన కె-9 వజ్ర వేరియంట్స్‌ను బట్టి ఈ ట్యాంకులు 30 కి.మీ నుంచి 58 కి.మీ దూరంలోని లక్ష్యాలను ఛేదించ గలవు. అలాగే శతఘు్నలను యుద్ధ సమయంలో సరిహద్దుకు తరలించేందుకు అవసరమైన 6x6 ఫీల్డ్ ఆర్టిలరీ ట్రాక్టర్(ఫ్యాట్)లను అశోక్ లేలాండ్ సంస్థ నుంచి సైన్యం కొనుగోలు చేసింది. 10 టన్నుల బరువును ఈ ట్రక్కులు అవలీలగా మోసుకెళ్తాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రక్షణ వ్యవస్థలోకి మూడు కొత్త శతఘు్నల ప్రవేశం
ఎప్పుడు : నవంబర్ 9
ఎవరు : రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్
ఎక్కడ : దియోలాలి ఫీల్డ్ ఫైరింగ్ రేంజెస్, మహారాష్ట్ర
జల మార్గాలపై తొలి టర్మినల్ ప్రారంభం
జల్ మార్గ్ వికాస్ ప్రాజెక్టులో భాగంగా దేశీయ జల మార్గాలపై నిర్మించిన తొలి మల్టీ-మోడల్ టర్మినల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 12న ప్రారంభించారు. అనంతరం కోల్ కతా నుంచి వారణాసికి వచ్చిన తొలి సరకు రవాణా నౌకకు మోదీ స్వాగతం పలికారు. వారణాసి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో గంగా నదిపై ఈ టర్మినల్ ను నిర్మించారు. టర్మినల్ సహా మొత్తం రూ. 2,413 కోట్ల విలువైన ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు. జాతీయ జల రహదారి-1 ప్రాజెక్టు కింద ప్రభుత్వం మొత్తం నాలుగు టర్మినళ్లను గంగా నదిపై నిర్మిస్తుండగా ప్రస్తుతం ప్రారంభమైన టర్మినల్ వాటిలో మొదటిది.
ప్రభుత్వాధీనంలోని భారత దేశీయ జలమార్గాల ప్రాధికార సంస్థ (ఐడబ్ల్యూఏఐ - ఇన్లాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా) ప్రపంచ బ్యాంకు సాయంతో ‘జల్ మార్గ్ వికాస్’ ప్రాజెక్టును చేపట్టింది. ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం 5,369.18 కోట్లు కాగా కేంద్ర ప్రభుత్వం, ప్రపచం బ్యాంకు చెరి సగం భరించనున్నాయి. జల మార్గాలను అభివృద్ధి చేయడం ద్వారా దేశీయంగా సరకు రవాణా ఖర్చులను తగ్గించడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తొలి మల్టీ-మోడల్ టర్మినల్ ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 12
ఎవరు : ప్రధానమంత్రి న రేంద్ర మోదీ
ఎక్కడ : వారణాసి, ఉత్తరప్రదేశ్
జాతీయవాద సందేశాలతో నకిలీ వార్తలు
దేశ నిర్మాణం, జాతీయవాద సందేశాలతో ఉన్న నకిలీ వార్తలను భారతీయులు సోషల్‌మీడియాలో పంచుకుంటున్నారని ప్రముఖ వార్తాసంస్థ బీబీసీ తెలిపింది. ఈ మేరకు భారత్, కెన్యా, నైజీరియాలో నకిలీ వార్తలపై అధ్యయనం చేసి రూపొందించిన నివేదికను నవంబర్ 12న బీబీసీ విడుదల చేసింది. హింసను రెచ్చగొట్టే సందేశాలను సోషల్‌మీడియాలో పంచుకునేందుకు భారతీయులు ఇష్టపడటం లేదనీ, అదే సమయంలో జాతీయవాద సందేశాలున్న వార్తలను షేర్ చేయడాన్ని తమ బాధ్యతగా భావిస్తున్నారని బీబీసీ చెప్పింది. వీటిలోని నిజానిజాలను పరిశీలించడం లేదని వెల్లడించింది. భావోద్వేగాల ఆధారంగా ఈ నకిలీ వార్తలు, వదంతులను వ్యాప్తి చేస్తున్నారని పేర్కొంది.
నకిలీ వార్తల్ని పూర్తిగా అరికట్టలేం: ట్విట్టర్
నకిలీ వార్తల వ్యాప్తి అన్నది చాలా అంశాలతో కూడుకున్న విషయమనీ, దాన్ని పరిమిత చర్యలతో అడ్డుకోలేమని ట్విట్టర్ వెల్లడించింది. ఈ మేరకు ఢిల్లీ-ఐఐటీలో నవంబర్ 12న జరిగిన కార్యక్రమంలో ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సీ తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జాతీయవాద సందేశాలతో నకిలీ వార్తలు
ఎప్పుడు : నవంబర్ 12
ఎవరు : బీబీసీ
ఎక్కడ : భారత్
సుప్రీంకోర్టులో ధర్మాసనాల సంఖ్య పెంపు
భారత సుప్రీంకోర్టులో ధర్మాసనాల సంఖ్య 11 నుంచి 14కి పెంచుతూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నవంబర్ 13న నిర్ణయించారు. కొత్తగా నలుగురు న్యాయమూర్తులు విధుల్లో చేరడంతో దేశ అత్యున్నత న్యాయస్థానంలో జడ్జీల సంఖ్య 28కి పెరిగింది. ఇప్పటివరకు 24 మంది న్యాయమూర్తులతో 11 బెంచ్‌ల ద్వారా కేసుల విచారణను నిర్వహిస్తున్నారు. ఇకపై ధర్మాసనాల సంఖ్య 14 కానుండటంతో కేసుల సత్వర విచారణకు కొంతవరకు అవకాశం లభించనుంది. కొత్త రోస్టర్ నవంబర్ 19 నుంచి అమల్లోకి రానుంది. సబ్జెక్టుల వారీగా రోస్టర్ విధానాన్ని మాజీ సీజేఐ దీపక్ మిశ్రా 2018 ఫిబ్రవరిలో ప్రారంభించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సుప్రీంకోర్టులో ధర్మాసనాల సంఖ్య 14కి పెంపు
ఎప్పుడు : నవంబర్ 13
ఎవరు : ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్
పోర్టుబ్లెయిర్‌లో ప్రారంభమైన ‘సింబెక్స్-2018’
సింబెక్స్ పేరుతో భారత్, సింగపూర్ దేశాల మధ్య ఒప్పంద విన్యాసాల సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు నవంబర్ 10న ఘనంగా ప్రారంభమయ్యాయి. నవంబర్ 21 వరకు జరిగే సింబెక్స్ - 2018లో పాల్గొనేందుకు ఇరుదేశాల నౌకలు పోర్టుబ్లెయిర్‌కు చేరుకున్నాయి. ఇప్పటికే భారత యుద్ధ నౌకలు చేరుకోగా... నవంబర్ 10న రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్ యుద్ధ నౌకలు పోర్టుబ్లెయిర్‌కు వచ్చాయి. ఆ దేశ నౌకాదళానికి భారత నేవీ బృందం ఘనంగా స్వాగతం పలికింది. నవంబర్ 12 వరకు పోర్టుబ్లెయిర్ తీరంలో జరిగే విన్యాసాల్లో భారత యుద్ధ నౌకలైన రణ్‌వీర్ క్లాస్ యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ రణ్‌విజయ్, ఐఎన్‌ఎస్ సాత్పురా, ఐఎన్‌ఎస్ సహ్యాద్రి, ఐఎన్‌ఎస్ కద్మత్, ఐఎన్‌ఎస్ కిర్చి, ఐఎన్‌ఎస్ సుమేధ, ఐఎన్‌ఎస్ సుకన్య, ఐఎన్‌ఎస్ శక్తి పాల్గొననున్నాయి. వీటితో పాటు సింధుఘోష్ తరగతికి చెందిన సబ్‌మెరైన్ ఐఎన్‌ఎస్ సింధుకీర్తితో పాటు ఎయిర్‌క్రాఫ్ట్‌లు, హెలికాఫ్టర్లు, రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్ నేవీ తరఫున ఆర్‌ఎస్‌ఎస్ ఫర్మిడబుల్, ఆర్‌ఎస్‌ఎస్ స్టెడ్‌ఫాస్ట్, ఆర్‌ఎస్‌ఎస్ యూనిటీ, ఆర్‌ఎస్‌ఎస్ విగార్, ఆర్‌ఎస్‌ఎస్ వాలియంట్, డీప్ సీ రెస్క్యూ వెహికల్ నౌకతో పాటు ఆర్చర్ క్లాస్ జలాంతర్గామి ఆర్‌ఎస్‌ఎస్ స్వార్డ్స్‌మాన్‌తో పాటు ఎయిర్‌క్రాఫ్ట్‌లు, హెలికాఫ్టర్లు విన్యాసాల్లో పాల్గొంటాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సింబెక్స్-2018 ఉత్సవాలు
ఎప్పుడు : నవంబర్ 10 నుంచి 22 వరకు
ఎందుకు : సింబెక్స్ పేరుతో భారత్, సింగపూర్ దేశాల మధ్య ఒప్పంద విన్యాసాలు
ఎక్కడ : పోర్టుబ్లెయిర్
25 ప్రాంతాల పేర్లు మార్పుకు కేంద్రం ఆమోదం
ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా దాదాపు 25 నగరాలు, గ్రామాల పేర్లను మార్చేందుకు కేంద్రం అనుమతులిచ్చింది. ఈ పేర్ల మార్పు ప్రతిపాదనల్లో పశ్చిమ బెంగాల్ కూడా ఒకటి. అయితే, పశ్చిమ బెంగాల్ పేరును ‘బంగ్లా’ గా మార్చాలన్న ప్రతిపాదన కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉంది. ఇటీవల అలహాబాద్‌ను ప్రయాగ్‌రాజ్‌గా, ఫైజాబాద్‌ను అయోధ్యగా పేరు మారుస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఏడాది కాలంలో ఆంధ్రపదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిని రాజమహేంద్రవరంగా, ఒడిశాలోని భద్రక్ జిల్లా ఔటర్ వీలర్‌ను ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్‌గా, కేరళలోని మలప్పుర జిల్లా అరిక్కోడ్‌ను అరీకోడ్‌గా, హరియాణాలోని జింద్ జిల్లా పిండారిని పందు-పిండారగా, నాగాలాండ్‌లోని కిఫిరె జిల్లా సాంఫూర్‌ని సాన్‌ఫూరెగా పేర్లు మార్చారు. ఈ ప్రతిపాదనలను నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం హోంశాఖ అమలు చేస్తుంది. కాగా, అహ్మదాబాద్‌ను కర్ణావతిగా పేరు మార్చాలన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నామని గుజరాత్ సీఎం విజయ్ రూపానీ వెల్లడించారు.
ఫైజాబాద్‌పై మిశ్రమ స్పందన..
ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్ జిల్లా పేరును అయోధ్యగా మార్చిన సీఎం యోగి ఆదిత్యనాథ్ నిర్ణయంపై స్థానికుల్లో మిశ్రమ స్పందన వ్యక్తమైంది. అవసరం లేకుండానే కేవలం రాజకీయ కారణాలతో పేరును మారుస్తున్నారని, దీని వల్ల చారిత్రక నగరానికి ఉన్న గుర్తింపు తెరమరుగవుతుందని కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ..అది అయోధ్య కీర్తిప్రతిష్టల్ని మరింత ఇనుమడింపజేస్తుందని మరికొందరు అభిప్రాయపడ్డారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశవ్యాప్తంగా 25 నగరాలు, గ్రామాల పేర్లను మార్చేందుకు కేంద్రం ఆమోదం
ఎప్పుడు : ఈ ఏడాది కాలంలో
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : భారతదేశ వ్యాప్తంగా
నాలుగు హైకోర్టుల సీజేలకు పదోన్నతి
నాలుగు వేర్వేరు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు సుప్రీంకోర్టు జడ్జీలుగా పదోన్నతి లభించింది. ఈ మేరకు కోర్టు కొలీజియం పంపిన సిఫార్సులను కేంద్రప్రభుత్వం నవంబర్ 1న ఆమోదించింది. దీంతో జస్టిస్ హేమంత్ గుప్తా(మధ్యప్రదేశ్ హైకోర్టు), జస్టిస్ అజయ్ రస్తోగి(త్రిపుర హైకోర్టు), జస్టిస్ ఎంఆర్ షా(పట్నా హైకోర్టు), జస్టిస్ ఆర్.సుభాష్ రెడ్డి(గుజరాత్ హైకోర్టు)లను సుప్రీం జడ్జీలుగా నియమిస్తూ న్యాయశాఖ ప్రకటన విడుదల చేసింది. కొత్త జడ్జీలు బాధ్యతలు చేపట్టాక కోర్టులో జడ్జీల సంఖ్య 28కి పెరగనుంది. తెలంగాణలోని మెదక్ జిల్లాకు చెందిన జస్టిస్ సుభాష్‌రెడ్డి 2002లో ఏపీ హైకోర్టులో అదనపు జడ్జిగా, 2016లో గుజరాత్ సీజేగా పదోన్నతి పొందారు.
ప్రజల సందర్శనకు సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టును సామాన్యప్రజలు కూడా సందర్శించేందుకు వీలు కల్పించాల్సిన అవసరం ఉందని సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ అన్నారు. ఇకపై సుప్రీంకోర్టు గదులు, జడ్జీల గ్రంథాలయాన్ని సెలవు దినాలు మినహాయించి ప్రతి శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అన్ని వర్గాల వారూ సందర్శించేందుకు వీలుంది. సందర్శకులు ముందుగా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే సదుపాయాన్ని, థింక్‌ట్యాంక్ ‘సెంటర్ ఫర్ రీసెర్చి అండ్ ప్లానింగ్’ను జస్టిస్ గొగోయ్ ప్రారంభించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నాలుగు హైకోర్టుల సీజేలకు సుప్రీంకోర్టు జడ్జీలుగా పదోన్నతి
ఎప్పుడు : నవంబర్ 1
ఎవరు : కేంద్రప్రభుత్వం
59 నిమిషాల్లోనే కోటి రూపాయల రుణం
లఘు, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్‌ఎంఈ)లు కేవలం 59 నిమిషాల వ్యవధిలోనే రూ.కోటి దాకా రుణాలు పొందవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన పోర్టల్‌ను (www.psbloanin59minutes.com) ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 2న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లడుతూ... నిబంధనలను అనుసరించి 2 శాతం దాకా వడ్డీ రాయితీ పొందవచ్చన్నారు. ఎంఎస్‌ఎంఈలు చేసే ఎగుమతులకు ముందస్తుగాను, ఆ తర్వాత ఇచ్చే వడ్డీ రాయితీని 3 శాతం నుంచి 5 శాతానికి పెంచినట్లు తెలిపారు. మొత్తం మీద ఎంఎస్‌ఎంఈలకు ఊతమిచ్చేలా 12 చర్యలు తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు.
ప్రస్తుతం రూ. 5 కోట్ల దాకా ఆదాయాలు ఉన్న సంస్థలను లఘు సంస్థలుగాను, రూ. 5-75 కోట్ల దాకా ఆదాయాలున్న వాటిని చిన్న సంస్థలుగా, అంతకు మించి రూ. 250 కోట్ల దాకా ఆదాయం ఉన్నవి మధ్య స్థాయి సంస్థలుగాను పరిగణిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 59 నిమిషాల్లోనే కోటి రూపాయల రుణం మంజూరుకు ప్రత్యేక పోర్టల్ ఆవిష్కరణ
ఎప్పుడు : నవంబర్ 2
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీలో సిగ్నేచర్ బ్రిడ్జి ప్రారంభం
ఢిల్లీలో యమునా నదిపై నిర్మించిన సిగ్నేచర్ బ్రిడ్జిని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ నవంబర్ 4న ప్రారంభించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఈ వంతెన ఉత్తర, ఈశాన్య ఢిల్లీల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది. దీంతోపాటు వజీరాబాద్ పాతవంతెనపై రద్దీ కూడా గణనీయంగా తగ్గనుంది. కేబుళ్లతో వేలాడే ఈ వంతెన పొడవు 675 మీటర్లు, ఎత్తు 165 మీటర్లు కాగా వెడల్పు 35 మీటర్లు. సిగ్నేచర్ బ్రిడ్జికి ఉన్న ప్రత్యేకతల కారణంగా పర్యాటక ప్రాంతంగా మారనుంది. ఎలివేటర్ల ద్వారా వంతెనపై 154 మీటర్ల ఎత్తైన ప్రాంతం నుంచి ఢిల్లీ నగరాన్ని చూడవచ్చు. మొట్టమొదటిసారిగా 1997లో అప్పటి ప్రభుత్వం ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని ప్రతిపాదించగా 2007లో ఢిల్లీ మంత్రివర్గం ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సిగ్నేచర్ బ్రిడ్జి ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 4
ఎవరు : అరవింద్ కేజ్రివాల్
ఎక్కడ : ఢిల్లీ
ఆడపులి ‘అవని’ ని కాల్చి చంపిన అటవీశాఖ
మ్యాన్ ఈటర్‌గా మారిన ఆడపులి ‘అవని’ అలియాస్ టీ-1 ని అటవీశాఖ అధికారులు కాల్చిచంపారు. మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లా బొరాటి అటవీ ప్రాంతంలో ఉన్న అవని గత రెండేళ్లలో సమీపంలోని పొలాలు, గ్రామాల్లో ఉండే 13 మంది రైతులు, ఆదివాసీలను చంపేసిందని అధికారులు భావిస్తున్నారు. పులిని పట్టుకునేందుకు గత మూడు నెలలుగా సిబ్బంది చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో మహారాష్ట్ర అటవీ శాఖ ఈ పులిని చంపేయాలని నిర్ణయించింది. ఈ మేరకు హైదరాబాద్‌కు చెందిన షార్ప్‌షూటర్ అస్ఘర్ అలీ సహాయంతో నవంబర్ 2న రాత్రి అడవిలో ఉన్న ‘అవని’ని వేటాడి కాల్చి చంపారు. అవనికి పది నెలల రెండు పిల్లలు ఉన్నాయి.
అవనిని మత్తు మందు ఇచ్చి బంధించడంలో విఫలమైన సందర్భాల్లో ఆఖరి యత్నంగా మాత్రమే కాల్చి చంపాలని 2018 సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆడపులి ‘అవని’ ని కాల్చి చంపిన అటవీశాఖ
ఎప్పుడు : నవంబర్ 2
ఎక్కడ : బొరాటి అటవీ ప్రాంతం, యావత్మాల్ జిల్లా, మహారాష్ట్ర
ఎందుకు : మ్యాన్ ఈటర్‌గా మారినందుకు
అరిహంత్ తొలి అణు నిరోధక గస్తీ పూర్తి
భారత నౌకాదళానికి చెందిన అణు జలాంతర్గామి ఐఎన్‌ఎస్ అరిహంత్ తన తొలి అణు నిరోధక గస్తీని విజయవంతంగా పూర్తి చేసింది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న వంబర్ 5న వెల్లడించారు. దేశీయంగా తయారైన తొలి అణు జలాంతర్గామి అయిన అరిహంత్ గరిష్టంగా 3,500 కిలో మీటర్ల దూరంలోని లక్ష్యాలపై అణు దాడి చేయగలదు.
అరిహంత్ విజయవంతం కావడంతో నీరు, భూమి, ఆకాశం.. ఈ మూడింటిలో ఎక్కడినుంచైనా అణ్వాయుధాలను ప్రయోగించే ఆరో దేశంగా భారత్ అవతరించింది. ఇప్పటికే ఆకాశం నుంచి మిరేజ్-2000 యుద్ధ విమానం ద్వారా, భూమి నుంచి అగ్ని బాలిస్టిక్ క్షిపణి ద్వారా అణ్వస్త్రాలను ప్రయోగించే సామర్థ్యాలు భారత్‌కు ఉన్నాయి. ప్రస్తుతం అమెరికా, రష్యా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్ లకు గాలి, నీరు, భూమి నుంచి అణ్వస్త్రాలను ప్రయోగించే సామర్థ్యం ఉంది.
అడ్వాన్స్ డ్ టెక్నాలజీ వెస్సెల్ (ఏటీవీ) అనే రహస్య ప్రాజెక్టు కింద ఐఎన్‌ఎస్ అరిహంత్‌తోపాటు మరో రెండు అణు జలాంతర్గాములను అభివృద్ధి చేయడం 1990ల్లోనే మొదలైంది. ఐఎన్‌ఎస్ అరిహంత్ మొదటిది కాగా, రెండోదైన ఐఎన్‌ఎస్ అరిధమన్ తయారీ 2018లోనే పూర్తయ్యే అవకాశం ఉంది. అరిహంత్‌ను అణు నిపుణులతో కలిసి రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) అభివృద్ధి చేసింది.
అరిహంత్ విశేషాలు...

- చారిత్రక సుల్తాన్‌పూర్ లోధి వారసత్వ పట్టణంగా అభివృద్ధి. ‘హెరిటేజ్ కాంప్లెక్స్’ ఏర్పాటు. సుల్తాన్‌పూర్ లోధి రైల్వేస్టేషన్ స్థాయి పెంపు.
- ఆరోగ్య సంరక్షణ అనుబంధ వృత్తుల ముసాయిదా బిల్లుకు ఆమోదం. ఆహార ధాన్యాలను ఇకపై తప్పనిసరిగా గన్నీ సంచుల్లో మాత్రమే ప్యాక్ చేయాలనే తీర్మానం వంటివి ఇందులో ఉన్నాయి.
- ఓబీసీ కులాల వర్గీకరణ అంశంపై అధ్యయనం చేస్తున్న ఓబీసీ వర్గీకరణ కమిషన్ కాలపరిమితి 2019 మే 31 వరకు పెంపు.
- ఆరోగ్య సంరక్షణ అనుబంధ సేవల ముసాయిదా బిల్లు-2018కు ఆమోదం. బిల్లు ద్వారా అత్యున్నత అలైడ్ అండ్ హెల్త్‌కేర్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతోపాటు రాష్ట్రాల్లో స్టేట్ అలైడ్ అండ్ హెల్త్‌కేర్ కౌన్సిల్స్ ఏర్పాటవుతాయి. ఈ కౌన్సిళ్ల పరిధిలోకి ఆరోగ్య సంరక్షణ రంగానికి సంబంధించిన 15 ప్రధాన వృత్తి విభాగాలతోపాటు న్యూట్రిషనిస్ట్ వంటి 53 వృత్తులు వస్తాయి.
- అన్ని రకాలైన ఆహార ధాన్యాలను ఇకపై జనపనార సంచుల్లో మాత్రమే ప్యాక్ చేయాలనే ప్రతిపాదనకు ఆమోదం. ఆహార ధాన్యాలను 100 శాతం, చక్కెరను 20 శాతం వరకు జనపనార సంచుల్లోనే తప్పనిసరిగా ప్యాక్ చేయాలి.
ఏమిటి : కర్తార్‌పూర్‌కు ప్రత్యేక కారిడార్
ఎప్పుడు : నవంబర్ 22
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దుల్లో
ఎందుకు : కర్తార్‌పూర్ సాహిబ్ వెళ్లే సిక్కు తీర్థ యాత్రికులకు సౌలభ్యంగా ఉండేందుకు
అన్ని పాఠశాలల్లో ‘భాషా పరిచయం’
దేశంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల్లో తప్పకుండా ‘భాషా పరిచయం’ కార్యక్రమంను అమలుచేయాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఆర్‌డీ) నిర్ణయించింది. ఈ మేరకు నవంబర్ 23న ఆదేశాలు జారీ చేసింది. దేశ భాషలపై విద్యార్థులకు కనీస అవగాహనను కల్పించేందుకు భాషా పరిచయం కార్యక్రమంను ఎంహెచ్‌ఆర్‌డీ రూపొందించింది. ఈ కార్యక్రమం ద్వారా పాఠశాల స్థాయిలోనే దేశ భాషలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తే... ముఖ్యమైన పదాలపై కొంతమేర పట్టు రావడంతో పాటు జాతీయ సమగ్రత పెంపొందుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రార్థన సమయంలో ఉచ్ఛారణ...
భాష పరిచయం కార్యక్రమంలో భాగంగా ప్రార్థనా సమయంలో కనీసం 5 పదాలను విద్యార్థులు ఉచ్ఛరించేలా ఎంహెచ్‌ఆర్‌డీ ప్రణాళిక రూపొందించింది. నమస్కారం, మీ పేరు ఏమిటి?, నా పేరు, మీరు ఎలా ఉన్నారు? వంటి ప్రశ్నలు, సమధానాలు ఇచ్చి వాటిపై అవగాహన కల్పించనుంది. నిర్దేశించిన వాక్యాలను రోజుకొక భాష వంతున డిసెంబర్ 21లోపు దేశంలోని అధికారిక భాషలైన 22 భాషల్లో పరిచయం పూర్తి చేయనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అన్ని పాఠశాలల్లో భాషా పరిచయం కార్యక్రమం అమలు
ఎప్పుడు : నవంబర్ 23
ఎవరు : కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఎక్కడ : దేశవ్యాప్తంగా
ఎందుకు : దేశ భాషలపై విద్యార్థులకు కనీస అవగాహనను కల్పించేందుకు
అయోధ్యలో 221 మీటర్ల రాముడి విగ్రహం
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో 221 మీటర్ల పొడవైన రాముడి కాంస్య విగ్రహం నిర్మించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు ఆ రాష్ట్ర సమాచార శాఖ ముఖ్య కార్యదర్శి అవనీశ్ అవస్థి నవంబర్ 25న తెలిపారు. ‘స్టాచ్యూ ఆఫ్ ది మర్యాద పురుషోత్తమ్’ పేరుతో ఈ విగ్రహాన్ని ఏర్పాటుచేయనున్నారు. రాముడి విగ్రహం 151 మీటర్ల పొడవు, దానిపై గొడుగు 20 మీటర్లు, విగ్రహం పునాది మరో 50 మీటర్ల ఎత్తు ఉంటుందని అవస్థి తెలిపారు. విగ్రహం కింద భాగంలో అయోధ్యతోపాటు ‘ఇక్ష్వాకు వంశం’ చరిత్రకు సంబంధించిన విశేషాలతో అధునాతన మ్యూజియం ఏర్పాటుచేస్తామని చెప్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘స్టాచ్యూ ఆఫ్ ది మర్యాద పురుషోత్తమ్’ పేరుతో రాముడి విగ్రహం ఏర్పాటు
ఎప్పుడు : నవంబర్ 25
ఎవరు : ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ : అయోధ్య, ఉత్తరప్రదేశ్
కర్తార్‌పూర్ కారిడార్‌కు శంకుస్థాపన
పాకిస్థాన్‌లోని గురుద్వార దార్బార్ సాహిబ్‌ను సందర్శించే సిక్కు యాత్రికుల సౌకర్యం కోసం ఏర్పాటుచేయనున్న కర్తార్‌పూర్ కారిడార్‌కు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నవంబర్ 26న శంకుస్థాపన చేశారు. 16వ శతాబ్దంలో రావి నది ఒడ్డున నిర్మితమైన సాహిబ్ గురుద్వార సిక్కులకు చాలా పవిత్రమైనది. దేశ విభజన అనంతరం పాకిస్థాన్‌కు వెళ్లిన ఈ గరుద్వారా భారత్‌లోని గురుదాస్‌పూర్ జిల్లా డేరా బాబా నానక్ నుంచి నాలుగు కిలో మీటర్ల దూరంలో ఉంది. ప్రస్తుతం ఈ మార్గంలో రహదారి నిర్మించేందుకే వెంకయ్య శంకుస్థాపన చేశారు.
సిక్కు మత స్థాపకుడు గురునానక్ 550వ జయంతి సందర్భంగా కర్తార్‌పూర్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కర్తార్‌పూర్ కారిడార్‌కు శంకుస్థాపన
ఎప్పుడు : నవంబర్ 26
ఎవరు : ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
ఎక్కడ : గురుదాస్‌పూర్ జిల్లా, పంజాబ్
ఒకటి, రెండు తరగతులకు ఇంటి పని ఇవ్వకూడదు
ఒకటి, రెండు తరగతుల పిల్లలకు ఇంటి పని (హోంవర్క్) ఇవ్వకూడదని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ(ఎమ్‌హెచ్‌ఆర్‌డీ) స్పష్టం చేసింది. ఈ మేరకు ఏ తరగతి చదివే పిల్లలకు పుస్తకాల సంచులు ఎంత బరువు ఉండాలో నిర్ధారిస్తూ నవంబర్ 27న అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.
ఎమ్‌హెచ్‌ఆర్‌డీ ఆదేశాలు ప్రకారం...
- జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి సూచించిన ప్రకారం ఒకటి, రెండు తరగతుల పిల్లలకు పాఠశాలల్లో సంబంధిత భాష, గణితం మాత్రమే ఉండాలి.
- 3 నుంచి 5 తరగతుల విద్యార్థులకు వీటితోపాటు పరిసరాల విజ్ఞానం మాత్రమే ఉండాలి.
- విద్యార్థులను ఎలాంటి అదనపు పుస్తకాలను తెచ్చుకోవాలని చెప్పకూడదు.
- ఎన్‌సీఈఆర్‌టీ నిర్ధారించిన సబ్జెక్టులను మాత్రమే మూడు నుంచి ఐదో తరగతి పిల్లలకు బోధించాలి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఒకటి, రెండు తరగతులకు ఇంటి పని ఇవ్వకూడదు
ఎప్పుడు : నవంబర్ 27
ఎవరు : కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ
పౌల్ట్రీ ఇండియా సదస్సు ప్రారంభం
పౌల్ట్రీ ఇండియా 12వ సదస్సును కేంద్ర పశుసంవర్థక శాఖ సంయుక్త కార్యదర్శి డాక్టర్ ఓపీ చౌదరి హైదరాబాద్‌లో నవంబర్ 28న ప్రారంభించారు. మూడురోజులపాటు జరగనున్న ఈ సదస్సులో దేశ, విదేశాలకు చెందిన ప్రముఖ పౌల్ట్రీ పరిశ్రమలు, ఫీడ్, క్లీనింగ్, ఔషధ పరిశ్రమలు తమ ఉత్పత్తులు పదర్శిస్తున్నాయి. ఇటలీ, ఇజ్రాయెల్, చైనా, సింగపూర్, యూఎస్‌ఏ, జర్మనీ, బెల్జియం, సౌత్ కోరియా, నెదర్లాండ్‌స తదితర 75కుపైగా దేశాలకు చెందిన కంపెనీలు ఈ సదస్సులో పాల్గొంటున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పౌల్ట్రీ ఇండియా-2018 సదస్సు ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 28
ఎక్కడ : హైదరాబాద్
ఎంప్లాయబిలిటీ ర్యాంకింగ్‌లో బెంగళూరు ఐఐఎస్‌సీ
‘గ్లోబల్ యూనివర్సిటీ ఎంప్లాయబిలిటీ ర్యాంకింగ్’లో బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ) 28వ స్థానంలో నిలిచింది. ఈ మేరకు ఫ్రాన్స్ కు చెందిన హెచ్‌ఆర్ కన్సల్టెన్సీ కంపెనీ రూపొందించిన నివేదికను టైమ్స్ హయ్యర్ ఎడ్యేకేషన్ నవంబర్ 15న ప్రచురించింది. ఈ జాబితాలో 150కిగాను భారత్ నుంచి కేవలం మూడు విద్యా సంస్థలే చోటు దక్కించుకున్నాయి. బెంగళూరులోని ఐఐఎస్‌సీ 28వ స్థానంలో నిలవగా, ఐఐటీ-ఢిల్లీకి 53వ స్థానం, ఐఐఎం-అహ్మదాబాద్‌కి 144వ స్థానం దక్కింది. గతేడాది ఇదే ర్యాంకింగ్‌సలో ఐఐటీ-ఢిల్లీ 145వ స్థానం పొందింది. ఈ జాబితా తొలి మూడు ర్యాంకులను అమెరికా విశ్వవిద్యాలయాలు సొంతం చేసుకున్నాయి. హెచ్‌ఆర్ కన్సల్టెన్సీ ‘ఎమర్జింగ్’ అంశంపై సర్వే చేసి ప్రపంచవ్యాప్తంగా 150 విద్యా సంస్థలకు ర్యాంకులు ఇచ్చింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బెంగళూరులోని ఐఐఎస్‌సీ 28వ స్థానం
ఎప్పుడు : నవంబర్ 15
ఎవరు : హెచ్‌ఆర్ కన్సల్టెన్సీ కంపెనీ
ఎక్కడ : గ్లోబల్ యూనివర్సిటీ ఎంప్లాయబిలిటీ ర్యాంకింగ్లో
గజ తూపాను కారణంగా 26 మంది మృతి
తమిళనాడులోని నాగపట్టణం, వేదారణ్యంల మధ్య నవంబర్ 16న తీరం దాటిన గజ తుపాను కారణంగా తమిళనాడులో 26 మంది మృతి చెందారు. భారీ వర్షాలు, ఈదురుగాలులతో విరుచుకుపడిన గజ దాటికి దక్షిణ తమిళనాడు, పుదుచ్చేరిలు అతలాకుతలమయ్యాయి. తూపాను తీరం దాటే సమయంలో గంటకు 120 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి. తూపాను కారణంగా భారీ మొత్తంలో ఆస్తి, పంట నష్టం జరిగింది. వేలాది చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో అనేక ప్రాంతాలకు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. తూపాను ప్రభావిత ప్రాంతాల్లో జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్‌ఎఫ్) బృందాలు పడవలతో సహాయక చర్యలు చేపడుతున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గజ తూపాను కారణంగా 26 మంది మృతి
ఎప్పుడు : నవంబర్ 16
ఎక్కడ : తమిళనాడు
కేఎంపీ ఎక్స్‌ప్రెస్ వే ప్రారంభం
హరియాణాలోని గుర్‌గ్రామ్ జిల్లాలో 83 కిలోమీటర్ల కుండ్లి-మనేసర్-పల్వాల్ (కేఎంపీ) ఎక్స్‌ప్రెస్‌వేను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 19న ప్రారంభించారు. అలాగే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 3.2 కిలోమీటర్ల వల్లభ్‌గఢ్-ముజేసర్ మెట్రో రైల్ లింక్ ప్రారంభోత్సవం, పల్వాల్ జిల్లాలో శ్రీ విశ్వకర్మ స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు. మొత్తం 135 కిలోమీటర్ల పొడవైన కేఎంపీ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ.6,400 కోట్లు వెచ్చించింది. దీనిలోని 52 కిలోమీటర్ల రహదారి 2016లోనే అందుబాటులోకి వచ్చింది.
వల్లభ్‌గఢ్- ముజేసర్ మెట్రో రైల్ లింక్ నిర్మాణానికి రూ.580 కోట్లు ఖర్చు కాగా, శ్రీ విశ్వకర్మ స్కిల్ యూనివర్సిటీ నిర్మాణానికి రూ.989 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. జాతీయ రాజధాని ప్రాంతంలోని కేఎంపీ ఎక్స్‌ప్రెస్ వే అందుబాటులోకి రావడంతో ఢిల్లీకి వాహనాల రాకపోకల రద్దీ గణనీయంగా తగ్గడంతోపాటు రాజధాని ప్రాంతంలో కాలుష్యం కూడా తగ్గుముఖం పట్టనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కుండ్లి-మనేసర్-పల్వాల్ (కేఎంపీ) ఎక్స్‌ప్రెస్ వే ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 19
ఎవరు : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఎక్కడ : గుర్‌గ్రామ్, హరియాణ
ఢిల్లీ వాసుల ఆయుర్దాయం పదేళ్లు తగ్గుదల
వాయు కాలుష్యం కారణంగా ఢిల్లీవాసుల ఆయుర్దాయం పదేళ్లకుపైగా తగ్గిందని షికాగో విశ్వవిద్యాలయంలోని ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్ వెల్లడించింది. ఈ మేరకు ఢిల్లీ వాయుకాలుష్యంపై రూపొందించిన నివేదికను నవంబర్ 19న విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం... రెండు దశాబ్దాల కాలంలో 2016లో ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత దారుణస్థాయికి దిగజారింది. వాయుకాలుష్యం పెరిగి 1998తో పోల్చితే దేశంలో సూక్ష్మధూళి కణాలు ప్రస్తుతం సగటున 69 శాతం ఎక్కువయ్యాయి. దీంతో భారతీయుని ఆయుర్దాయం 4.3 సంవత్సరాలు తగ్గింది. దేశంలోని అత్యంత కాలుష్య నగరాల జాబితాలో ఢిల్లీ రెండోస్థానంలో ఉందని పాలసీ ఇన్‌స్టిట్యూట్ తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఢిల్లీ వాసుల ఆయుర్దాయం పదేళ్లు తగ్గుదల
ఎప్పుడు : నవంబర్ 19
ఎవరు : ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్, షికాగో విశ్వవిద్యాలయం, అమెరికా
ఎందుకు : వాయు కాలుష్యం కారణంగా
ఏనుగుల ప్రత్యేక ఆసుపత్రి ప్రారంభం
దేశంలోనే తొలిసారిగా ఏనుగుల కోసం ప్రత్యేకంగా నిర్మించిన ఆసుపత్రిని ఆగ్రా డివిజనల్ కమిషనర్ అనిల్ కుమార్ నవంబర్ 16న ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్(యూపీ)లో మథుర, ఆగ్రా సమీపంలో గల ఫరా బ్లాక్ ఛుర్మురా గ్రామంలో ఈ ఆసుపత్రిని ఆ రాష్ట్ర అటవీ శాఖ ఏర్పాటు చేసింది. ఏనుగులకు వైర్‌లెస్ ఎక్స్-రే, లేజర్ చికిత్స, డెంటల్ ఎక్స్-రే, థెర్మల్ ఇమేజింగ్, అల్టాస్రోనోగ్రఫీ, హైడ్రోథెరఫీ, క్వారంటైన్ సౌకర్యాలు ఈ ఆసుపత్రిలో అందుబాటులో ఉంటాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశంలో తొలి ఏనుగుల ఆసుపత్రి ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 16
ఎక్కడ : ఛుర్మురా గ్రామం, ఫరా బ్లాక్, ఉత్తరప్రదేశ్
గ్లోబల్ టాలెంట్ ర్యాంకింగ్‌లో భారత్‌కు 53వ స్థానం
గ్లోబల్ యాన్యువల్ టాలెంట్ ర్యాంకింగ్‌లో భారత్‌కు 53వ స్థానం లభించింది. ఈ మేరకు 63 దేశాలతో రూపొందించిన జాబితాను స్విట్జర్లాండ్‌కు చెందిన ఐఎండీ బిజినెస్ స్కూల్ నవంబర్ 20న విడుదల చేసింది. ఈ జాబితాలో అయిదోసారీ స్విట్జర్లాండ్ అగ్రస్థానం పొందగా డెన్మార్క్, నార్వే, ఆస్ట్రియా, నెదర్లాండ్‌స దేశాలు వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఆసియా దేశాల్లో మాత్రం సింగపూర్ (గ్లోబల్ లిస్టులో 13వ స్థానం)కు మొదటి స్థానం దక్కింది. ఈ జాబితాలో చైనా 39వ ర్యాంకు పొందింది.
భారత్... టాలెంట్ పూల్‌లో సగటు స్థాయి కన్నా మెరుగ్గా ఉందని (సంసిద్ధత ప్రాతిపదికన 30వ స్థానం), మరోవైపు టాలెంట్ అభివృద్ధిపై పెట్టుబడులో మాత్రం వెనుకబడి ఉందని (63వ స్థానం) ఐఎండీ బిజినెస్ స్కూల్ పేర్కొంది. టాలెంట్ అభివృద్ధిపై పెట్టుబడులు, ఆకర్షణ, సంసిద్ధత అనే మూడు అంశాల ప్రాతిపదికన ర్యాంకులను నిర్ణయిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గ్లోబల్ యాన్యువల్ టాలెంట్ ర్యాంకింగ్‌లో భారత్‌కు 53వ స్థానం
ఎప్పుడు : నవంబర్ 20
ఎవరు : ఐఎండీ బిజినెస్ స్కూల్, సింగపూర్
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ రద్దు
జమ్మూకశ్మీర్ అసెంబ్లీని రద్దు చేస్తూ ఆ రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్ నవంబర్ 21న ఉత్తర్వులు జారీ చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలు జరిగే అవకాశం ఉండటం, విరుద్ధ భావజాలాలున్న పార్టీలు స్థిర ప్రభుత్వాన్ని ఏర్పరచలేవన్న నమ్మకంతోనే అసెంబ్లీని రద్దుచేయాల్సి వచ్చిందని గవర్నర్ ప్రకటించారు. మెజారిటీని నిరూపించుకునేందుకు ఒకటి కన్నా ఎక్కువ వర్గాలు ముందుకు రావడం ప్రభుత్వ నిలకడపై ప్రభావం చూపుతుందని మరొక కారణంగా ఆయన పేర్కొన్నారు.
బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో పీడీపీ- బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిన నేపథ్యంలో జూన్ 19న జమ్మూకశ్మీర్‌లో గవర్నర్ పాలన విధించారు. ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఉండేందుకు అసెంబ్లీని సుప్త చేతనావస్థలో ఉంచారు. జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో మొత్తం 89(87+2 నామినేటెడ్) సభ్యులు ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జమ్మూకశ్మీర్ అసెంబ్లీ రద్దు
ఎప్పుడు : నవంబర్ 21
ఎవరు : గవర్నర్ సత్యపాల్ మాలిక్
రైల్వే సర్వీస్ ప్రొవైడర్‌గా జియో
దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ భారతీయ రైల్వేకు టెలికం సేవల ప్రొవైడర్‌గా రిలయన్స్ జియో వ్యవహరించనుంది. ఈ మేరకు నూతన సీయూజీ పథకంను జియోకి అందించనున్నట్లు నవంబర్ 21న రైల్‌టెల్ సంస్థ తెలిపింది. 2019 జనవరి 1 నుంచి ఇది అమల్లోకి రానుందని వెల్లడించింది. దీనివల్ల రైల్వే టెలిఫోన్ బిల్లుల భారం కనీసం 35 శాతం మేర తగ్గనుందని వివరించింది.
భారతీయ రైల్వేకు గత ఆరేళ్లుగా భారతీ ఎయిర్‌టెల్ టెలికం సేవలు అందిస్తోంది. 1.95 లక్షల మొబైల్ ఫోన్ కనెక్షన్లను సీయూజీ కింద రైల్వే ఉద్యోగులు వినియోగిస్తున్నారు. ఇందు కోసం ఏటా రూ.100 కోట్లను ఎయిర్‌టెల్‌కు రైల్వే చెల్లిస్తోంది. ఇరు సంస్థల మధ్య ఒప్పందం గడువు డిసెంబర్ 31తో ముగియనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రెల్వేకు టెలికం సేవల ప్రొవైడర్‌గా రిలయన్స్ జియో
ఎప్పుడు : నవంబర్ 21
ఎవరు : రైల్‌టెల్ సంస్థ
రక్షణ వ్యవస్థలోకి మూడు శతఘ్నులు
దేశ రక్షణ వ్యవస్థలోకి మూడు అధునాతన శతఘు్నలు చేరాయి. మహారాష్ట్రలోని దియోలాలి ఫీల్డ్ ఫైరింగ్ రేంజెస్‌లో నవంబర్ 9న జరిగిన కార్యక్రమంలో రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ వీటిని సైన్యంలో ప్రవేశపెట్టారు. వీటిలో ఎం777 ఏ2 అల్ట్రాలైట్ హోవిట్జర్లు, కె9 వజ్ర శతఘు్నలతో పాటు ఆయుధాలను సరిహద్దులకు చేరవేసే ఫీల్డ్ ఆర్టిలరీ ట్రాక్టర్(ఫ్యాట్)లు ఉన్నాయి. అమెరికా 2016 నవంబర్‌లో రూ.5,070 కోట్లతో నుంచి కొనుగోలు చేసిన ఎం777 ఏ2(155 ఎంఎం-39 క్యాలిబర్)హోవిట్జర్ శతఘు్నలు 30 కి.మీ దూరంలోని శత్రు స్థావరాలను తుత్తునియలు చేయగలవు. వీటిని ఎత్తైన ప్రాంతాలకు హెలికాప్టర్ల ద్వారా తేలికగా రవాణా చేయొచ్చు.
దక్షిణకొరియాకు చెందిన థండర్-9ను అభివృద్ధి చేసి కె9 వజ్ర(155 ఎంఎం-52 క్యాలిబర్) యుద్ధ ట్యాంకును రూపొందించారు. స్వీయచోదక శక్తితో కూడిన కె-9 వజ్ర వేరియంట్స్‌ను బట్టి ఈ ట్యాంకులు 30 కి.మీ నుంచి 58 కి.మీ దూరంలోని లక్ష్యాలను ఛేదించ గలవు. అలాగే శతఘు్నలను యుద్ధ సమయంలో సరిహద్దుకు తరలించేందుకు అవసరమైన 6x6 ఫీల్డ్ ఆర్టిలరీ ట్రాక్టర్(ఫ్యాట్)లను అశోక్ లేలాండ్ సంస్థ నుంచి సైన్యం కొనుగోలు చేసింది. 10 టన్నుల బరువును ఈ ట్రక్కులు అవలీలగా మోసుకెళ్తాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రక్షణ వ్యవస్థలోకి మూడు కొత్త శతఘు్నల ప్రవేశం
ఎప్పుడు : నవంబర్ 9
ఎవరు : రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్
ఎక్కడ : దియోలాలి ఫీల్డ్ ఫైరింగ్ రేంజెస్, మహారాష్ట్ర
జల మార్గాలపై తొలి టర్మినల్ ప్రారంభం
జల్ మార్గ్ వికాస్ ప్రాజెక్టులో భాగంగా దేశీయ జల మార్గాలపై నిర్మించిన తొలి మల్టీ-మోడల్ టర్మినల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 12న ప్రారంభించారు. అనంతరం కోల్ కతా నుంచి వారణాసికి వచ్చిన తొలి సరకు రవాణా నౌకకు మోదీ స్వాగతం పలికారు. వారణాసి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో గంగా నదిపై ఈ టర్మినల్ ను నిర్మించారు. టర్మినల్ సహా మొత్తం రూ. 2,413 కోట్ల విలువైన ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు. జాతీయ జల రహదారి-1 ప్రాజెక్టు కింద ప్రభుత్వం మొత్తం నాలుగు టర్మినళ్లను గంగా నదిపై నిర్మిస్తుండగా ప్రస్తుతం ప్రారంభమైన టర్మినల్ వాటిలో మొదటిది.
ప్రభుత్వాధీనంలోని భారత దేశీయ జలమార్గాల ప్రాధికార సంస్థ (ఐడబ్ల్యూఏఐ - ఇన్లాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా) ప్రపంచ బ్యాంకు సాయంతో ‘జల్ మార్గ్ వికాస్’ ప్రాజెక్టును చేపట్టింది. ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం 5,369.18 కోట్లు కాగా కేంద్ర ప్రభుత్వం, ప్రపచం బ్యాంకు చెరి సగం భరించనున్నాయి. జల మార్గాలను అభివృద్ధి చేయడం ద్వారా దేశీయంగా సరకు రవాణా ఖర్చులను తగ్గించడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తొలి మల్టీ-మోడల్ టర్మినల్ ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 12
ఎవరు : ప్రధానమంత్రి న రేంద్ర మోదీ
ఎక్కడ : వారణాసి, ఉత్తరప్రదేశ్
జాతీయవాద సందేశాలతో నకిలీ వార్తలు
దేశ నిర్మాణం, జాతీయవాద సందేశాలతో ఉన్న నకిలీ వార్తలను భారతీయులు సోషల్‌మీడియాలో పంచుకుంటున్నారని ప్రముఖ వార్తాసంస్థ బీబీసీ తెలిపింది. ఈ మేరకు భారత్, కెన్యా, నైజీరియాలో నకిలీ వార్తలపై అధ్యయనం చేసి రూపొందించిన నివేదికను నవంబర్ 12న బీబీసీ విడుదల చేసింది. హింసను రెచ్చగొట్టే సందేశాలను సోషల్‌మీడియాలో పంచుకునేందుకు భారతీయులు ఇష్టపడటం లేదనీ, అదే సమయంలో జాతీయవాద సందేశాలున్న వార్తలను షేర్ చేయడాన్ని తమ బాధ్యతగా భావిస్తున్నారని బీబీసీ చెప్పింది. వీటిలోని నిజానిజాలను పరిశీలించడం లేదని వెల్లడించింది. భావోద్వేగాల ఆధారంగా ఈ నకిలీ వార్తలు, వదంతులను వ్యాప్తి చేస్తున్నారని పేర్కొంది.
నకిలీ వార్తల్ని పూర్తిగా అరికట్టలేం: ట్విట్టర్
నకిలీ వార్తల వ్యాప్తి అన్నది చాలా అంశాలతో కూడుకున్న విషయమనీ, దాన్ని పరిమిత చర్యలతో అడ్డుకోలేమని ట్విట్టర్ వెల్లడించింది. ఈ మేరకు ఢిల్లీ-ఐఐటీలో నవంబర్ 12న జరిగిన కార్యక్రమంలో ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సీ తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జాతీయవాద సందేశాలతో నకిలీ వార్తలు
ఎప్పుడు : నవంబర్ 12
ఎవరు : బీబీసీ
ఎక్కడ : భారత్
సుప్రీంకోర్టులో ధర్మాసనాల సంఖ్య పెంపు
భారత సుప్రీంకోర్టులో ధర్మాసనాల సంఖ్య 11 నుంచి 14కి పెంచుతూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నవంబర్ 13న నిర్ణయించారు. కొత్తగా నలుగురు న్యాయమూర్తులు విధుల్లో చేరడంతో దేశ అత్యున్నత న్యాయస్థానంలో జడ్జీల సంఖ్య 28కి పెరిగింది. ఇప్పటివరకు 24 మంది న్యాయమూర్తులతో 11 బెంచ్‌ల ద్వారా కేసుల విచారణను నిర్వహిస్తున్నారు. ఇకపై ధర్మాసనాల సంఖ్య 14 కానుండటంతో కేసుల సత్వర విచారణకు కొంతవరకు అవకాశం లభించనుంది. కొత్త రోస్టర్ నవంబర్ 19 నుంచి అమల్లోకి రానుంది. సబ్జెక్టుల వారీగా రోస్టర్ విధానాన్ని మాజీ సీజేఐ దీపక్ మిశ్రా 2018 ఫిబ్రవరిలో ప్రారంభించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సుప్రీంకోర్టులో ధర్మాసనాల సంఖ్య 14కి పెంపు
ఎప్పుడు : నవంబర్ 13
ఎవరు : ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్
పోర్టుబ్లెయిర్‌లో ప్రారంభమైన ‘సింబెక్స్-2018’
సింబెక్స్ పేరుతో భారత్, సింగపూర్ దేశాల మధ్య ఒప్పంద విన్యాసాల సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు నవంబర్ 10న ఘనంగా ప్రారంభమయ్యాయి. నవంబర్ 21 వరకు జరిగే సింబెక్స్ - 2018లో పాల్గొనేందుకు ఇరుదేశాల నౌకలు పోర్టుబ్లెయిర్‌కు చేరుకున్నాయి. ఇప్పటికే భారత యుద్ధ నౌకలు చేరుకోగా... నవంబర్ 10న రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్ యుద్ధ నౌకలు పోర్టుబ్లెయిర్‌కు వచ్చాయి. ఆ దేశ నౌకాదళానికి భారత నేవీ బృందం ఘనంగా స్వాగతం పలికింది. నవంబర్ 12 వరకు పోర్టుబ్లెయిర్ తీరంలో జరిగే విన్యాసాల్లో భారత యుద్ధ నౌకలైన రణ్‌వీర్ క్లాస్ యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ రణ్‌విజయ్, ఐఎన్‌ఎస్ సాత్పురా, ఐఎన్‌ఎస్ సహ్యాద్రి, ఐఎన్‌ఎస్ కద్మత్, ఐఎన్‌ఎస్ కిర్చి, ఐఎన్‌ఎస్ సుమేధ, ఐఎన్‌ఎస్ సుకన్య, ఐఎన్‌ఎస్ శక్తి పాల్గొననున్నాయి. వీటితో పాటు సింధుఘోష్ తరగతికి చెందిన సబ్‌మెరైన్ ఐఎన్‌ఎస్ సింధుకీర్తితో పాటు ఎయిర్‌క్రాఫ్ట్‌లు, హెలికాఫ్టర్లు, రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్ నేవీ తరఫున ఆర్‌ఎస్‌ఎస్ ఫర్మిడబుల్, ఆర్‌ఎస్‌ఎస్ స్టెడ్‌ఫాస్ట్, ఆర్‌ఎస్‌ఎస్ యూనిటీ, ఆర్‌ఎస్‌ఎస్ విగార్, ఆర్‌ఎస్‌ఎస్ వాలియంట్, డీప్ సీ రెస్క్యూ వెహికల్ నౌకతో పాటు ఆర్చర్ క్లాస్ జలాంతర్గామి ఆర్‌ఎస్‌ఎస్ స్వార్డ్స్‌మాన్‌తో పాటు ఎయిర్‌క్రాఫ్ట్‌లు, హెలికాఫ్టర్లు విన్యాసాల్లో పాల్గొంటాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సింబెక్స్-2018 ఉత్సవాలు
ఎప్పుడు : నవంబర్ 10 నుంచి 22 వరకు
ఎందుకు : సింబెక్స్ పేరుతో భారత్, సింగపూర్ దేశాల మధ్య ఒప్పంద విన్యాసాలు
ఎక్కడ : పోర్టుబ్లెయిర్
25 ప్రాంతాల పేర్లు మార్పుకు కేంద్రం ఆమోదం
ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా దాదాపు 25 నగరాలు, గ్రామాల పేర్లను మార్చేందుకు కేంద్రం అనుమతులిచ్చింది. ఈ పేర్ల మార్పు ప్రతిపాదనల్లో పశ్చిమ బెంగాల్ కూడా ఒకటి. అయితే, పశ్చిమ బెంగాల్ పేరును ‘బంగ్లా’ గా మార్చాలన్న ప్రతిపాదన కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉంది. ఇటీవల అలహాబాద్‌ను ప్రయాగ్‌రాజ్‌గా, ఫైజాబాద్‌ను అయోధ్యగా పేరు మారుస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఏడాది కాలంలో ఆంధ్రపదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిని రాజమహేంద్రవరంగా, ఒడిశాలోని భద్రక్ జిల్లా ఔటర్ వీలర్‌ను ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్‌గా, కేరళలోని మలప్పుర జిల్లా అరిక్కోడ్‌ను అరీకోడ్‌గా, హరియాణాలోని జింద్ జిల్లా పిండారిని పందు-పిండారగా, నాగాలాండ్‌లోని కిఫిరె జిల్లా సాంఫూర్‌ని సాన్‌ఫూరెగా పేర్లు మార్చారు. ఈ ప్రతిపాదనలను నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం హోంశాఖ అమలు చేస్తుంది. కాగా, అహ్మదాబాద్‌ను కర్ణావతిగా పేరు మార్చాలన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నామని గుజరాత్ సీఎం విజయ్ రూపానీ వెల్లడించారు.
ఫైజాబాద్‌పై మిశ్రమ స్పందన..
ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్ జిల్లా పేరును అయోధ్యగా మార్చిన సీఎం యోగి ఆదిత్యనాథ్ నిర్ణయంపై స్థానికుల్లో మిశ్రమ స్పందన వ్యక్తమైంది. అవసరం లేకుండానే కేవలం రాజకీయ కారణాలతో పేరును మారుస్తున్నారని, దీని వల్ల చారిత్రక నగరానికి ఉన్న గుర్తింపు తెరమరుగవుతుందని కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ..అది అయోధ్య కీర్తిప్రతిష్టల్ని మరింత ఇనుమడింపజేస్తుందని మరికొందరు అభిప్రాయపడ్డారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశవ్యాప్తంగా 25 నగరాలు, గ్రామాల పేర్లను మార్చేందుకు కేంద్రం ఆమోదం
ఎప్పుడు : ఈ ఏడాది కాలంలో
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : భారతదేశ వ్యాప్తంగా
నాలుగు హైకోర్టుల సీజేలకు పదోన్నతి
నాలుగు వేర్వేరు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు సుప్రీంకోర్టు జడ్జీలుగా పదోన్నతి లభించింది. ఈ మేరకు కోర్టు కొలీజియం పంపిన సిఫార్సులను కేంద్రప్రభుత్వం నవంబర్ 1న ఆమోదించింది. దీంతో జస్టిస్ హేమంత్ గుప్తా(మధ్యప్రదేశ్ హైకోర్టు), జస్టిస్ అజయ్ రస్తోగి(త్రిపుర హైకోర్టు), జస్టిస్ ఎంఆర్ షా(పట్నా హైకోర్టు), జస్టిస్ ఆర్.సుభాష్ రెడ్డి(గుజరాత్ హైకోర్టు)లను సుప్రీం జడ్జీలుగా నియమిస్తూ న్యాయశాఖ ప్రకటన విడుదల చేసింది. కొత్త జడ్జీలు బాధ్యతలు చేపట్టాక కోర్టులో జడ్జీల సంఖ్య 28కి పెరగనుంది. తెలంగాణలోని మెదక్ జిల్లాకు చెందిన జస్టిస్ సుభాష్‌రెడ్డి 2002లో ఏపీ హైకోర్టులో అదనపు జడ్జిగా, 2016లో గుజరాత్ సీజేగా పదోన్నతి పొందారు.
ప్రజల సందర్శనకు సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టును సామాన్యప్రజలు కూడా సందర్శించేందుకు వీలు కల్పించాల్సిన అవసరం ఉందని సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ అన్నారు. ఇకపై సుప్రీంకోర్టు గదులు, జడ్జీల గ్రంథాలయాన్ని సెలవు దినాలు మినహాయించి ప్రతి శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అన్ని వర్గాల వారూ సందర్శించేందుకు వీలుంది. సందర్శకులు ముందుగా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే సదుపాయాన్ని, థింక్‌ట్యాంక్ ‘సెంటర్ ఫర్ రీసెర్చి అండ్ ప్లానింగ్’ను జస్టిస్ గొగోయ్ ప్రారంభించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నాలుగు హైకోర్టుల సీజేలకు సుప్రీంకోర్టు జడ్జీలుగా పదోన్నతి
ఎప్పుడు : నవంబర్ 1
ఎవరు : కేంద్రప్రభుత్వం
59 నిమిషాల్లోనే కోటి రూపాయల రుణం
లఘు, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్‌ఎంఈ)లు కేవలం 59 నిమిషాల వ్యవధిలోనే రూ.కోటి దాకా రుణాలు పొందవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన పోర్టల్‌ను (www.psbloanin59minutes.com) ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 2న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లడుతూ... నిబంధనలను అనుసరించి 2 శాతం దాకా వడ్డీ రాయితీ పొందవచ్చన్నారు. ఎంఎస్‌ఎంఈలు చేసే ఎగుమతులకు ముందస్తుగాను, ఆ తర్వాత ఇచ్చే వడ్డీ రాయితీని 3 శాతం నుంచి 5 శాతానికి పెంచినట్లు తెలిపారు. మొత్తం మీద ఎంఎస్‌ఎంఈలకు ఊతమిచ్చేలా 12 చర్యలు తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు.
ప్రస్తుతం రూ. 5 కోట్ల దాకా ఆదాయాలు ఉన్న సంస్థలను లఘు సంస్థలుగాను, రూ. 5-75 కోట్ల దాకా ఆదాయాలున్న వాటిని చిన్న సంస్థలుగా, అంతకు మించి రూ. 250 కోట్ల దాకా ఆదాయం ఉన్నవి మధ్య స్థాయి సంస్థలుగాను పరిగణిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 59 నిమిషాల్లోనే కోటి రూపాయల రుణం మంజూరుకు ప్రత్యేక పోర్టల్ ఆవిష్కరణ
ఎప్పుడు : నవంబర్ 2
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీలో సిగ్నేచర్ బ్రిడ్జి ప్రారంభం
ఢిల్లీలో యమునా నదిపై నిర్మించిన సిగ్నేచర్ బ్రిడ్జిని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ నవంబర్ 4న ప్రారంభించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఈ వంతెన ఉత్తర, ఈశాన్య ఢిల్లీల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది. దీంతోపాటు వజీరాబాద్ పాతవంతెనపై రద్దీ కూడా గణనీయంగా తగ్గనుంది. కేబుళ్లతో వేలాడే ఈ వంతెన పొడవు 675 మీటర్లు, ఎత్తు 165 మీటర్లు కాగా వెడల్పు 35 మీటర్లు. సిగ్నేచర్ బ్రిడ్జికి ఉన్న ప్రత్యేకతల కారణంగా పర్యాటక ప్రాంతంగా మారనుంది. ఎలివేటర్ల ద్వారా వంతెనపై 154 మీటర్ల ఎత్తైన ప్రాంతం నుంచి ఢిల్లీ నగరాన్ని చూడవచ్చు. మొట్టమొదటిసారిగా 1997లో అప్పటి ప్రభుత్వం ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని ప్రతిపాదించగా 2007లో ఢిల్లీ మంత్రివర్గం ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సిగ్నేచర్ బ్రిడ్జి ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 4
ఎవరు : అరవింద్ కేజ్రివాల్
ఎక్కడ : ఢిల్లీ
ఆడపులి ‘అవని’ ని కాల్చి చంపిన అటవీశాఖ
మ్యాన్ ఈటర్‌గా మారిన ఆడపులి ‘అవని’ అలియాస్ టీ-1 ని అటవీశాఖ అధికారులు కాల్చిచంపారు. మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లా బొరాటి అటవీ ప్రాంతంలో ఉన్న అవని గత రెండేళ్లలో సమీపంలోని పొలాలు, గ్రామాల్లో ఉండే 13 మంది రైతులు, ఆదివాసీలను చంపేసిందని అధికారులు భావిస్తున్నారు. పులిని పట్టుకునేందుకు గత మూడు నెలలుగా సిబ్బంది చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో మహారాష్ట్ర అటవీ శాఖ ఈ పులిని చంపేయాలని నిర్ణయించింది. ఈ మేరకు హైదరాబాద్‌కు చెందిన షార్ప్‌షూటర్ అస్ఘర్ అలీ సహాయంతో నవంబర్ 2న రాత్రి అడవిలో ఉన్న ‘అవని’ని వేటాడి కాల్చి చంపారు. అవనికి పది నెలల రెండు పిల్లలు ఉన్నాయి.
అవనిని మత్తు మందు ఇచ్చి బంధించడంలో విఫలమైన సందర్భాల్లో ఆఖరి యత్నంగా మాత్రమే కాల్చి చంపాలని 2018 సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆడపులి ‘అవని’ ని కాల్చి చంపిన అటవీశాఖ
ఎప్పుడు : నవంబర్ 2
ఎక్కడ : బొరాటి అటవీ ప్రాంతం, యావత్మాల్ జిల్లా, మహారాష్ట్ర
ఎందుకు : మ్యాన్ ఈటర్‌గా మారినందుకు
అరిహంత్ తొలి అణు నిరోధక గస్తీ పూర్తి
భారత నౌకాదళానికి చెందిన అణు జలాంతర్గామి ఐఎన్‌ఎస్ అరిహంత్ తన తొలి అణు నిరోధక గస్తీని విజయవంతంగా పూర్తి చేసింది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న వంబర్ 5న వెల్లడించారు. దేశీయంగా తయారైన తొలి అణు జలాంతర్గామి అయిన అరిహంత్ గరిష్టంగా 3,500 కిలో మీటర్ల దూరంలోని లక్ష్యాలపై అణు దాడి చేయగలదు.
అరిహంత్ విజయవంతం కావడంతో నీరు, భూమి, ఆకాశం.. ఈ మూడింటిలో ఎక్కడినుంచైనా అణ్వాయుధాలను ప్రయోగించే ఆరో దేశంగా భారత్ అవతరించింది. ఇప్పటికే ఆకాశం నుంచి మిరేజ్-2000 యుద్ధ విమానం ద్వారా, భూమి నుంచి అగ్ని బాలిస్టిక్ క్షిపణి ద్వారా అణ్వస్త్రాలను ప్రయోగించే సామర్థ్యాలు భారత్‌కు ఉన్నాయి. ప్రస్తుతం అమెరికా, రష్యా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్ లకు గాలి, నీరు, భూమి నుంచి అణ్వస్త్రాలను ప్రయోగించే సామర్థ్యం ఉంది.
అడ్వాన్స్ డ్ టెక్నాలజీ వెస్సెల్ (ఏటీవీ) అనే రహస్య ప్రాజెక్టు కింద ఐఎన్‌ఎస్ అరిహంత్‌తోపాటు మరో రెండు అణు జలాంతర్గాములను అభివృద్ధి చేయడం 1990ల్లోనే మొదలైంది. ఐఎన్‌ఎస్ అరిహంత్ మొదటిది కాగా, రెండోదైన ఐఎన్‌ఎస్ అరిధమన్ తయారీ 2018లోనే పూర్తయ్యే అవకాశం ఉంది. అరిహంత్‌ను అణు నిపుణులతో కలిసి రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) అభివృద్ధి చేసింది.
అరిహంత్ విశేషాలు...
- అరిహంత్ అంటే శత్రు సంహారిణి అని అర్థం.
- జలాంతర్గాముల నుంచి ప్రయోగించే పన్నెండు కె-15 బాలిస్టిక్ క్షిపణులను అరిహంత్ మోసుకెళ్లగలదు.
- ఐఎన్‌ఎస్ అరిహంత్ పొడవు, వెడల్పులు వరుసగా 110 మీటర్లు, 11 మీటర్లు.
- నీటిలో 300 మీటర్ల లోతు వరకు వెళ్లగలదు. 83 మెగా వాట్ల అణు విద్యుత్తు రియాక్టర్ ఇందులో ఉంటుంది.
- ఉపరితలానికి రాకుండా సముద్ర గర్భంలోనే కొన్ని నెలలపాటు ప్రయాణించగలదు.
- కార్గిల్ విజయ దినోత్సవాన్ని పురస్కరించుకుని 2009 జూలైలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ విశాఖపట్నంలోని నౌకా నిర్మాణ కేంద్రం నుంచి అరిహంత్‌ను తొలిసారిగా సముద్రంలోకి పంపారు.
- అనేక పరీక్షల అనంతరం 2016లో ఐఎన్‌ఎస్ అరిహంత్‌ను నౌకా దళంలోకి తీసుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐఎన్‌ఎస్ అరిహంత్ తొలి అణు నిరోధక గస్తీ విజయవంతం
ఎప్పుడు : నవంబర్ 5
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
అయోధ్యగా ఫైజాబాద్ పేరు మార్పు
ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్ జిల్లా పేరును అయోధ్యగా మార్చనున్నారు. ఈ మేరకు అయోధ్యలో నవంబర్ 6న జరిగిన దీపోత్సవం కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. అలాగే అయోధ్యలో రాముడి పేరిట విమానాశ్రయాన్ని, దశరథుడి పేరుతో వైద్య కళాశాలను కూడా ఏర్పాటు చే యనున్నట్లు తెలిపారు. ఇప్పటికే అలహాబాద్ పేరును ప్రయాగ్‌రాజ్‌గా, లక్నోలోని ఏకనా అంతర్జాతీయ క్రికెట్ మైదానం పేరును అటల్ బిహారీ వాజ్‌పేయి మైదానంగా మార్చారు. ఫైజాబాద్ జిల్లాలోనే అయోధ్య ఉంది.
అయోధ్య దీపోత్సవ్ కు గిన్నిస్ రికార్డ్
దీపావళి సందర్భంగా అయోధ్యలో నిర్వహించిన ‘దీపోత్సవ్’ కార్యక్రమం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పిలుపు మేరకు సరయూ నది ఒడ్డు వద్ద అశేష జనవాహిని చేరుకుని 3,01,152 దీపాలను వెలిగించడంతో ’గిన్నిస్ రికార్డ్’ వరించింది. గిన్నెస్ నిర్వాహకుల ఇందుకు సంబంధించిన ధ్రువీకరణను యోగి ఆదిత్యనాథ్‌కు అందజేశారు. దీపోత్సవ్ వేడుకలకు ప్రత్యేక అతిథిగా దక్షిణ కొరియా ప్రథమ పౌరురాలు కిమ్-జుంగ్-సూక్ హాజరయ్యారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అయోధ్యగా ఫైజాబాద్ పేరు మార్పు
ఎప్పుడు : నవంబర్ 6
ఎవరు : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
ఎక్కడ : ఉత్తరప్రదేశ్
ఐటీయూలో భారత్‌కు సభ్యత్వం
అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్స్ యూనియన్ కౌన్సిల్ (ఐటీయూ)లో భారత్‌కు మరోసారి సభ్యత్వం లభించింది. ఈ మేరకు 2019 నుంచి 2022 దాకా నాలుగేళ్ల పాటు భారత్‌కు ఈ సభ్యత్వం ఉంటుందని కేంద్ర టెలికం శాఖ మంత్రి మనోజ్ సిన్హా నవంబర్ 6న తెలిపారు. దుబాయ్‌లో ఐటీయూ సదస్సు సందర్భంగా నిర్వహించిన ఎన్నికల్లో భారత్‌కు 165 ఓట్లు వ చ్చాయి. ఆసియా-ఆస్ట్రలేషియా ప్రాంతం నుంచి ఎన్నికై న 13 దేశాల్లో భారత్ మూడో ర్యాంక్‌లో నిలవగా అంతర్జాతీయంగా మొత్తం 48 దేశాల జాబితాలో ఎనిమిదో స్థానం దక్కించుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐటీయూలో భారత్‌కు మరోసారి సభ్యత్వం
ఎప్పుడు : నవంబర్ 6
ఎవరు : కేంద్ర టెలికం శాఖ మంత్రి మనోజ్ సిన్హా

Published date : 23 Nov 2018 04:44PM