నవంబర్ 2017 జాతీయం
Sakshi Education
బ్రిక్స్ టాప్-20 వర్సిటీల్లో నాలుగు భారతీయ విద్యాసంస్థలు
బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల్లోని టాప్-20 వర్సిటీల్లో భారత్‌కు చెందిన నాలుగు విద్యాసంస్థలు చోటు దక్కించుకున్నాయి. ప్రతిష్టాత్మక క్వాకరెల్లీ సైమండ్‌స(క్యూఎస్) సంస్థ 2017 సంవత్సరానికి విడుదల చేసిన ర్యాంకింగ్‌సలో ఐఐటీ బాంబే(9), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్‌స-బెంగళూరు (10), ఐఐటీ ఢిల్లీ(15), ఐఐటీ మద్రాస్(18) నిలిచాయి. చైనాకు చెందిన సింఘువా వర్సిటీ, పెకింగ్ వర్సిటీ, ఫుడాన్ వర్సిటీలు జాబితాలో తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. టాప్-10 విద్యాసంస్థల్లో చైనాకు చెందిన 8 విద్యాలయాలు ఉన్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బ్రిక్స్ టాప్-20 వర్సిటీల్లో నాలుగు భారత విద్యా సంస్థలు
ఎప్పుడు : నవంబర్ 22
ఎవరు : క్వాకరెల్లీ సైమండ్స్
ప్రధాన మంత్రి మహిళా శక్తి కేంద్రాల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం
దేశవ్యాప్తంగా బాగా వెనుకబడిన 115 జిల్లాల్లో 920 ప్రధాన మంత్రి మహిళా శక్తి కేంద్రాల’ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. గ్రామీణ మహిళల్లో ఆరోగ్యం, పోషణ, నైపుణ్యాభివృద్ధి, డిజిటల్ అక్షరాస్యత పెంపొందించేందుకు ఇవి దోహదపడతాయి. నవంబర్ 22న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ప్రస్తుతం 161 జిల్లాల్లో అమలవుతున్న బేటీ బచావో-బేటీ పడావో పథకాన్ని 640 జిల్లాలకు విస్తరించారు. లైంగిక హింస బాధితులకు సాంత్వన చేకూర్చేలా మరో 150 వన్‌స్టాప్ కేంద్రాల’ ఏర్పాటుకూ కేంద్రం ఆమోదం తెలిపింది. విస్తృత పథకమైన ది నేషనల్ మిషన్ ఫర్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ విమెన్’లో మరో ఏడు కార్యక్రమాల అమలుకు ఆమోదం తెలిపింది. ఈ పథకాలన్నింటికి 2017-20 మధ్య కాలంలో రూ.3,636.85 కోట్లు వెచ్చిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రధాన మంత్రి మహిళా శక్తి కేంద్రాల ఏర్పాటుకు ఆమోదం
ఎప్పుడు : నవంబర్ 22
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎక్కడ : దేశవ్యాప్తంగా బాగా వెనకబడిన 115 జిల్లాల్లో
ఎందుకు : గ్రామీణ మహిళల్లో ఆరోగ్యం, పోషణ, నైపుణ్యాభివృద్ధి, డిజిటల్ అక్షరాస్యత పెంపొందించేందుకు
సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల వేతనాల పెంపు
సుప్రీంకోర్టు, 24 హైకోర్టుల్లో పనిచేస్తున్న జడ్జీల వేతనాల పెంపునకు కేంద్ర కేబినెట్ నవంబర్ 22న అంగీకరించింది. ఇందుకు సంబంధించి పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెడతామని న్యాయ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. జడ్జీల వేతనాలు పెంచాలని విజ్ఞప్తి చేస్తూ 2016లో అప్పటి సీజేఐ టీఎస్ ఠాకూర్ కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. తాజా ప్రతిపాదన ప్రకారం...సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి నెలకు రూ.2.80 లక్షలు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రూ. 2.50 లక్షలు, హైకోర్టు న్యాయమూర్తికి రూ.2.25 లక్షల చొప్పున వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల వేతనాల పెంపునకు అంగీకారం
ఎప్పుడు : నవంబర్ 22
ఎవరు : కేంద్ర కేబినెట్
దివాళా చట్టాన్ని సవరించిన కేంద్రం
రుణ ఎగవేతదారులు, మోసపూరిత చరిత్ర ఉన్న ప్రమోటర్లకు చెక్ పెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్(ఐబీసీ)లో మార్పులు తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్‌సకు కేంద్ర కేబినెట్ నవంబర్ 22న ఆమోదం తెలిపింది. దీనికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది.
దేశ బ్యాంకింగ్ రంగంలో మొండి బకాయిలు (ఎన్‌పీఏ) నానాటికీ పెరిగిపోతుండడంతో ఆయా కేసుల త్వరితగతిన పరిష్కారం కోసం ఐబీసీని గతేడాది డిసెంబర్ నుంచి కేంద్రం అమల్లోకి తీసుకొచ్చింది. ఐబీసీలో పలు సవరణలు చేస్తూ ఆర్డినెన్‌స రూపొందించింది. ఈ ఆర్డినెన్‌స స్థానంలో సవరణలతో కూడిన చట్టాన్ని పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ)లో మార్పులు
ఎప్పుడు : నవంబర్ 22
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : రుణ ఎగవేతకు సంబంధించిన కేసుల సత్వర పరిష్కారానికి
భారత అటవీ చట్టం ఆర్డినెన్‌సకు రాష్ట్రపతి ఆమోదం
భారత అటవీ చట్టం-1927కు సవరణలు చేస్తూ కేంద్రం పంపిన ఆర్డినెన్‌సను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నవంబర్ 23న ఆమోదించారు. తాజా సవరణల్లో అటవీ ప్రాంతానికి బయట పెరిగే వెదురు చెట్లను వృక్షాల జాబితా నుంచి తొలగించారు. దీంతో అటవీ ప్రాంతం కాని చోట్ల పెరిగే వెదురు చెట్లను నరకడానికి, రవాణా చేయడానికి అనుమతులు అక్కర్లేదు. వెదురు చెట్ల సాగును పెంపొందించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత అటవీ చట్టం-1927 సవరణల ఆర్డినెన్స్‌కు ఆమోదం
ఎప్పుడు : నవంబర్ 23
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఎందుకు : అటవీ ప్రాంతానికి బయట పెరిగే వెదురు చెట్లను వృక్షాల జాబితా నుంచి తొలగించేందుకు
న్యూఢిల్లీలో జాతీయ న్యాయ దినోత్సవ సదస్సు
నవంబర్ 26న జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా న్యాయ కమిషన్, నీతి ఆయోగ్ సంయుక్తంగా నవంబర్ 25, 26 తేదీల్లో న్యూఢిల్లీలో సదస్సు నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ... న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు ఒకే కుటుంబానికి చెందినవనీ, అవి మూడు ఒకదానినొకటి బలోపేతం చేసుకునేలా పనిచేయాలని ఉద్ఘాటించారు. ఈ మూడు వ్యవస్థల మధ్య ఉండే సమన్వయమే రాజ్యాంగానికి వెన్నెముకని ఆయన పేర్కొన్నారు. సదస్సులో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ జాస్తి చలమేశ్వర్, న్యాయమంత్రి రవిశంకర్ ప్రసాద్ పాల్గొన్నారు.
జాతీయ న్యాయ దినోత్సవాన్ని రాజ్యాంగ దినోత్సవంగాను నిర్వహిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జాతీయ న్యాయ దినోత్సవ సదస్సు
ఎప్పుడు : నవంబర్ 25, 26
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : న్యూఢిల్లీలో
ఎందుకు : నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని (జాతీయ న్యాయ దినోత్సవం) పురస్కరించుకొని
హైదరాబాద్ చేరుకున్న షురువాత్’ బస్సు యాత్ర
ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు(జీఈఎస్)-2017 నేపథ్యంలో రోడ్ టు జీఈఎస్’ పేరిట ప్రారంభించిన దేశవ్యాప్త షురువాత్’ బస్సు యాత్ర హైదరాబాద్ నగరానికి చేరుకుంది. ఈ యాత్ర నవంబర్ 26న గచ్చిబౌలిలోని ఉర్దూ విశ్వవిద్యాలయ క్యాంపస్‌కు చేరింది. నీతిఆయోగ్, యునెటైడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ సంయుక్త ఆధ్వర్యంలో ది గ్లోబల్ ఎడ్యుకేషన్ అండ్ లీడర్‌షిప్ ఫౌండేషన్ చైర్మన్ శివ్‌విక్రమ్ ఖేమ్కా, సీఈవో గౌరీ ఈశ్వరన్, స్పెషల్ ప్రాజెక్ట్స్ లీడ్ క్షితిజ్ శరణ్ నేతృత్వంలో పది మంది సభ్యుల బృందం ఈ బస్సులో ప్రయాణం సాగిస్తోంది. ఐఐటీ ఢిల్లీలో ప్రారంభమైన ఈ షుర్వాత్ బస్సు ఐదు నగరాల్లో పర్యటిస్తూ హైదరాబాద్ చేరుకుంది. 14 రోజుల పర్యటనలో ఢిల్లీ, అహ్మదాబాద్, పుణే, ముంబై, బెంగళూరు నగరాల్లో పర్యటించి 500 వినూత్న ఆలోచనలతో కూడిన ప్రాజెక్టులను షురువాత్’ బస్సులోని బృందం సేకరించింది. వీటిలో అత్యుత్తమమైన ఆలోచనలకు ఫండింగ్ ఏర్పాటు చేయాలని సంకల్పించింది.
2030 నాటికి పట్టణాల్లోనే 40 శాతం జనాభా
2030 నాటికి దేశం మొత్తం జనాభాలో పట్టణ ప్రాంతాల్లో నివసించేవారు 40 శాతం ఉంటారని అమెరికాకు చెందిన ప్రఖ్యాత అధ్యయన సంస్థ బ్రూకింగ్‌స ఇన్‌స్టిట్యూషన్ వెల్లడించింది. వచ్చే పదేళ్లలో భారత్, చైనా, ఇండోనేసియా, థాయిలాండ్, వియత్నాం, ఫిలిప్పీన్‌స దేశాల నుంచి దాదాపు 30 కోట్ల జనం గ్రామాలను విడిచి పట్టణాలకు వలస వెళతారని తెలిపింది.
మధ్యతరగతి జనాభా విషయంలో 2027 కల్లా ఇండియా చైనాను వెనక్కు నెట్టనుందని అంచనా. 2014-50 మధ్య కాలంలో చైనా, భారత్‌లలో కలిపి కొత్తగా 70 కోట్ల జనం పట్టణాలకు తరలిపోయి మధ్య ఆదాయవర్గంగా ఎదుగుతారని బ్రూకింగ్‌సకు చెందిన హోమీ ఖరాస్ అంచనా వేస్తున్నారు. ఆసియాలో 2016 నాటికి పది లక్షలకు మించి జనాభా ఉన్న నగరాలు 275. 2030 నాటికి వాటి సంఖ్య 354కు పెరుగుతుందని భావిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పట్టణాల్లోనే 40 శాతం జనాభా
ఎప్పుడు : 2030
ఎవరు : బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూషన్, అమెరికా
ఎక్కడ : భారత్
ఎందుకు : వలసల వల్ల మధ్యతరగతి జనాభా పెరగడంతో
నెట్ న్యూట్రాలిటీకి ట్రాయ్ మద్ధతు
వివక్ష లేని ఇంటర్నెట్ సేవలను అందించే నెట్ న్యూట్రాలిటీకే తమ మద్దతు అని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా తేల్చిచెప్పింది. సర్వీసు ప్రొవైడర్లు, టెలికం కంపెనీలు సహా ఏ సంస్థలైనా ఇంటర్నెట్ సేవలు అందించడంలో వివక్ష చూపడాన్ని నిషేధించాలని సూచించింది. ఈ మేరకు నెట్‌న్యూట్రాలిటీపై సిఫార్సుల నివేదికను ట్రాయ్ నవంబర్ 28న కేంద్రానికి అందచేసింది.
ట్రాయ్ సిఫార్సులు
ఇంటర్నెట్ ద్వారా యూజర్లు చూసే, వాడుకునే కంటెంట్ విషయంలో సర్వీసు ప్రొవైడర్లు (టెలికం సంస్థలు, ఐఎస్‌పీలు ఇతరత్రా) వివక్ష చూపకుండా సమానత్వాన్ని పాటించడమే నెట్ న్యూట్రాలిటీ. అంటే కొన్ని వెబ్‌సైట్‌లకు డేటా చార్జీలు వసూలు చేయడం, కొన్నింటిని ఉచితంగా అందించడం లేదా కొన్నింటిని అధిక వేగం, కొన్నింటిని తక్కువ వేగంతో చూపించడం వంటి అసమానతలు నిరోధించడమే నెట్ న్యూట్రాలిటీ ప్రధానోద్దేశం.
రెండేళ్ల క్రితం ఫేస్‌బుక్ తన కంటెంట్‌ను ఎలాంటి డేటా చార్జీలు లేకుండా ఉచితంగా అందించేందుకు ఇంటర్నెట్.ఆర్గ్ పేరుతో టెలికం ఆపరేటర్లతో ఒప్పందం చేసుకుంది. అదేవిధంగా ఎయిర్‌టెల్ కూడా ‘ఎయిర్‌టెల్ జీరో’ ను ప్రకటించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నెట్ న్యూట్రాలిటీకి ట్రాయ్ సిఫార్సులు
ఎప్పుడు : నవంబర్ 28
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : నెట్ న్యూట్రాలిటీకి నియమ నిబంధనలు రూపొందించడానికి
ఆధార్ గడువు పొడిగింపునకు కేంద్రం రెడీ
సంక్షేమ పథకాల లబ్దిదారులు తమ ఖాతాలతో ఆధార్‌సంఖ్యను అనుసంధానించుకోవడానికి మరింత గడువు దొరికింది. వచ్చే ఏడాది మార్చి దాకా ఈ గడువును పొడగిస్తున్నట్టు కేంద్రం నవంబర్ 27న సుప్రీంకోర్టుకు తెలిపింది. పలు కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి లబ్ధి పొందడానికి ప్రజలు తమ ఆధార్‌ను తప్పనిసరిగా అనుసంధానం చేసుకోవాలన్న నిబంధనపై నవంబర్ 27న సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా 2018 మార్చి 31 వరకు వినియోగదారులు తమ ఆధార్‌ను అనుసంధానం చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తామని కేంద్రం ధర్మాసనానికి తెలిపింది. ప్రస్తుతం బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం ఈ ఏడాది డిసెంబరు 31 చివరి తేదీ కాగా మొబైల్ నంబర్లకు 2018 ఫిబ్రవరి 6 వరకు ఉంది.
ఢిల్లీ రాష్ర్టం కాదని సుప్రీంకు తెలిపిన కేంద్రం
కేంద్రపాలిత ప్రాంతాల్లో ఢిల్లీకి ప్రత్యేక హోదా ఉన్నప్పటికీ, రాజ్యాంగం ప్రకారం రాష్ర్టంగా పరిగణించలేమని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రానేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఎదుట కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ మణీందర్‌సింగ్ 2017 నవంబర్ 21న ఈ మేరకు వాదనలు వినిపించారు.
సిక్కిం అసెంబ్లీ స్థానాల పెంపునకు ప్రతిపాదన
సిక్కిం రాష్ర్ట శాసనసభ స్థానాల పెంపును కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 2017 నవంబర్ 23న ప్రతిపాదించింది. దీంతో ప్రస్తుతం ఉన్న 32 అసెంబ్లీ స్థానాలు 40కి చేరుతాయి. 1975లో సిక్కిం భారత్‌లో భాగమైన తర్వాత తొలిసారి ఆ రాష్ర్ట శాసనసభ స్థానాలు పెరుగుతున్నాయి.
ఇంటర్నెట్ స్వేచ్ఛలో 41వ స్థానంలో భారత్
ఇంటర్నెట్ స్వేచ్ఛ విషయంలో భారత్ 41వ స్థానంలో నిలిచింది. ఈ మేరకు ఫ్రీడం హౌస్ అనే సంస్థ.. ఫ్రీడమ్ ఆన్ ది నెట్ - 2017 నివేదికను విడుదల చేసింది. ప్రపంచంలో 87 శాతం ఇంటర్నెట్ సేవలను వినియోగించే 65 దేశాల్లో ఇంటర్నెట్ స్వేచ్ఛపై ఈ సంస్థ అధ్యయనం చేసింది. 2016 జూన్ నుంచి 2017 మే మధ్య చోటు చేసుకున్న పరిణామాలతోపాటు పలు తాజా అంశాలను చేర్చి ఈ నివేదికను రూపొందించింది.
నివేదిక ప్రధాన అంశాలు

- టెలికం కంపెనీలు, ఐఎస్‌పీలు ఇంటర్నెట్ ద్వారా అందించే కంటెంట్, సర్వీసులకు విభిన్న డేటా చార్జీలు, ఉచిత సేవలు ఉండకూడదు.
- ఆన్‌లైన్ వీడియోలను ఎక్కువ-తక్కువ స్పీడ్‌తో చూపకూడదు.
- ఇంటర్నెట్ యాక్సెస్(సేవలు)లో వివక్షను నిరోధించేందుకు ప్రొవైడర్ల లెసెన్‌స నిబంధనలను మార్చాలి.
- కంటెంట్‌ను అడ్డుకోవడం, స్పీడ్‌ను తగ్గించడం లేదా పెంచడం వంటివి వివక్షగా పరిగణించాలి.
- ఈ వివక్షరహిత ఇంటర్నెట్ విధానం విషయంలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్‌స (ఎలక్ట్రా నిక్ ఉపకరణాలను ఇంటర్నెట్‌తో అనుసంధానించడం) వంటి సేవల విషయంలో నిబంధనలు సడలించవచ్చు.
- కొత్త నిబంధనల పర్యవేక్షణతోపాటు ఉల్లంఘనలపై విచారణ జరిపేందుకు టెలికం శాఖ ఒక బహుళపక్ష మండలిని ఏర్పాటు చేయాలి. దీనిలో టెలికం ఆపరేటర్లు, ఐఎస్‌పీలు, కంటెంట్ ప్రొవైడర్లు, సామాజిక సంస్థలు, వినియోగదారుల ప్రతినిధులకు చోటు కల్పించాలి.
- టెలికం అపరేటర్లు తమ వెబ్ ట్రాఫిక్ నిర్వహణ విధానాలను ప్రకటించాలి. ప్రత్యేక సేవలు, కంటెంట్ ప్రొవైడర్లతో కుదుర్చుకునే ప్రత్యక్ష, పరోక్ష ఒప్పందాలు వంటివన్నీ బహిర్గతపరచాలి.
ఇంటర్నెట్ ద్వారా యూజర్లు చూసే, వాడుకునే కంటెంట్ విషయంలో సర్వీసు ప్రొవైడర్లు (టెలికం సంస్థలు, ఐఎస్‌పీలు ఇతరత్రా) వివక్ష చూపకుండా సమానత్వాన్ని పాటించడమే నెట్ న్యూట్రాలిటీ. అంటే కొన్ని వెబ్‌సైట్‌లకు డేటా చార్జీలు వసూలు చేయడం, కొన్నింటిని ఉచితంగా అందించడం లేదా కొన్నింటిని అధిక వేగం, కొన్నింటిని తక్కువ వేగంతో చూపించడం వంటి అసమానతలు నిరోధించడమే నెట్ న్యూట్రాలిటీ ప్రధానోద్దేశం.
రెండేళ్ల క్రితం ఫేస్‌బుక్ తన కంటెంట్‌ను ఎలాంటి డేటా చార్జీలు లేకుండా ఉచితంగా అందించేందుకు ఇంటర్నెట్.ఆర్గ్ పేరుతో టెలికం ఆపరేటర్లతో ఒప్పందం చేసుకుంది. అదేవిధంగా ఎయిర్‌టెల్ కూడా ‘ఎయిర్‌టెల్ జీరో’ ను ప్రకటించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నెట్ న్యూట్రాలిటీకి ట్రాయ్ సిఫార్సులు
ఎప్పుడు : నవంబర్ 28
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : నెట్ న్యూట్రాలిటీకి నియమ నిబంధనలు రూపొందించడానికి
ఆధార్ గడువు పొడిగింపునకు కేంద్రం రెడీ
సంక్షేమ పథకాల లబ్దిదారులు తమ ఖాతాలతో ఆధార్‌సంఖ్యను అనుసంధానించుకోవడానికి మరింత గడువు దొరికింది. వచ్చే ఏడాది మార్చి దాకా ఈ గడువును పొడగిస్తున్నట్టు కేంద్రం నవంబర్ 27న సుప్రీంకోర్టుకు తెలిపింది. పలు కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి లబ్ధి పొందడానికి ప్రజలు తమ ఆధార్‌ను తప్పనిసరిగా అనుసంధానం చేసుకోవాలన్న నిబంధనపై నవంబర్ 27న సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా 2018 మార్చి 31 వరకు వినియోగదారులు తమ ఆధార్‌ను అనుసంధానం చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తామని కేంద్రం ధర్మాసనానికి తెలిపింది. ప్రస్తుతం బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం ఈ ఏడాది డిసెంబరు 31 చివరి తేదీ కాగా మొబైల్ నంబర్లకు 2018 ఫిబ్రవరి 6 వరకు ఉంది.
ఢిల్లీ రాష్ర్టం కాదని సుప్రీంకు తెలిపిన కేంద్రం
కేంద్రపాలిత ప్రాంతాల్లో ఢిల్లీకి ప్రత్యేక హోదా ఉన్నప్పటికీ, రాజ్యాంగం ప్రకారం రాష్ర్టంగా పరిగణించలేమని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రానేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఎదుట కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ మణీందర్‌సింగ్ 2017 నవంబర్ 21న ఈ మేరకు వాదనలు వినిపించారు.
సిక్కిం అసెంబ్లీ స్థానాల పెంపునకు ప్రతిపాదన
సిక్కిం రాష్ర్ట శాసనసభ స్థానాల పెంపును కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 2017 నవంబర్ 23న ప్రతిపాదించింది. దీంతో ప్రస్తుతం ఉన్న 32 అసెంబ్లీ స్థానాలు 40కి చేరుతాయి. 1975లో సిక్కిం భారత్‌లో భాగమైన తర్వాత తొలిసారి ఆ రాష్ర్ట శాసనసభ స్థానాలు పెరుగుతున్నాయి.
ఇంటర్నెట్ స్వేచ్ఛలో 41వ స్థానంలో భారత్
ఇంటర్నెట్ స్వేచ్ఛ విషయంలో భారత్ 41వ స్థానంలో నిలిచింది. ఈ మేరకు ఫ్రీడం హౌస్ అనే సంస్థ.. ఫ్రీడమ్ ఆన్ ది నెట్ - 2017 నివేదికను విడుదల చేసింది. ప్రపంచంలో 87 శాతం ఇంటర్నెట్ సేవలను వినియోగించే 65 దేశాల్లో ఇంటర్నెట్ స్వేచ్ఛపై ఈ సంస్థ అధ్యయనం చేసింది. 2016 జూన్ నుంచి 2017 మే మధ్య చోటు చేసుకున్న పరిణామాలతోపాటు పలు తాజా అంశాలను చేర్చి ఈ నివేదికను రూపొందించింది.
నివేదిక ప్రధాన అంశాలు
- సర్వే చేసిన 65 దేశాలకుగాను 30 దేశాల్లోని ప్రభుత్వాలు సోషల్ మీడియాపై బలవంతపు ఆధిపత్యాన్ని సాధించాయి. చైనాలోని టిబెట్, ఇథియోపియాలోని ఒరోమో, భారత్‌లోని కశ్మీర్‌లలో ఈ సేవలపై తరచూ ఆంక్షలు పెడుతున్నారు.
- ఆయా అంశాల ప్రాధాన్యతను తగ్గించేందుకు ఇంటర్నెట్ స్వేచ్ఛపై 14 దేశాలు నియంత్రణలు విధించాయి.
- వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్‌లు (వీపీఎన్)లను అడ్డుకోవడం కోసం ప్రస్తుతం 14 దేశాలు సెన్సార్‌షిప్‌ను విధించాయి. ఆరుదేశాల్లో వీపీఎన్ నెట్‌వర్క్‌లను పూర్తిగా నిషేధించారు.
- ప్రతిపక్షాల విమర్శలను సామాజిక మాధ్యమాల ద్వారా తిప్పికొట్టేందుకు టర్కీలో ప్రభుత్వం ఆరు వేల మందిని నియామించుకుంది.
- రష్యా అనుకూల ప్రచారాన్ని అడ్డుకునేందుకు ఉక్రెయిన్ అధికారులు రష్యా ఆధారిత సేవలను నిలిపివేశారు.
- వరుసగా మూడో ఏడాది కూడా చైనా ఇంటర్నెట్ స్వేచ్ఛను అధికంగా నియంత్రించిన దేశంగా నిలిచింది. తర్వాతి స్థానాల్లో సిరియా, ఇథియోపియా ఉన్నాయి.
ఇంటర్నెట్ ఉన్నా.. స్వేచ్ఛలో వెనుకబాటే!
ఇంటర్నెట్ అందుబాటు, వేగం విషయంలో భారత్ ర్యాంకు మెరుగుపడింది. కానీ ఇంటర్నెట్ స్వేచ్ఛ విషయంలో మాత్రం భారత్ 41వ స్థానంలో నిలిచింది. పాకిస్తాన్, సౌదీ అట్టడుగున ఉన్నాయి. ఇంటర్నెట్ స్వేచ్ఛలో ఇస్టోనియా, ఐస్‌లాండ్ ప్రథమస్థానంలో ఉండగా, కెనడా 2, జర్మనీ, ఆస్ట్రేలియా, అమెరికా సంయుక్తంగా మూడోస్థానంలో నిలిచాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇంటర్నెట్ స్వేచ్ఛలో 41వ స్థానంలో భారత్
ఎప్పుడు : నవంబర్ 15
ఎవరు : ఫ్రీడమ్ ఆన్ ది నెట్-2017 సర్వే
ఎక్కడ : 65 దేశాల జాబితాలో
ప్రజాదరణలో తొలిస్థానంలో ప్రధాని మోదీ
దేశ రాజకీయాల్లో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా ప్రధాని మోదీ కొనసాగుతున్నారు. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ సర్వే సంస్థ ప్యూ నవంబర్ 15న వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ జాబితాలో 88 శాతం పాయింట్లతో మోదీ అగ్రస్థానంలో, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ 58 శాతంతో రెండో స్థానంలో ఉన్నారు. ఆ తరువాత వరుసగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి 57%, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు 39% పాయింట్లు దక్కాయి.
ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి మార్చి 10 మధ్య 2,464 భారతీయులపై ఈ సర్వే నిర్వహించించారు. దీని ప్రకారం.. ప్రతి పది మందిలో 8 మంది దేశ ఆర్థి క పరిస్థితులు మెరుగ్గా ఉన్నట్లు చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ రాష్ట్రాల్లో మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్‌గఢ్‌లలో ప్రతి 10 మందిలో 9 మంది మోదీపై సానుకూలంగా స్పందించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశ రాజకీయాల్లో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా ప్రధాని మోదీ
ఎప్పుడు : నవంబర్ 15
ఎవరు : ప్యూ రీసెర్చ్ సర్వే
నితీశ్ కుమార్‌కే జేడీ(యూ): ఈసీ
జేడీ(యూ)పై ఆధిపత్య పోరులో బిహర్ సీఎం నితీశ్ కుమార్ విజయం సాధించారు. పార్టీని, బాణం’ గుర్తును ఆయనకే కేటాయిస్తున్నట్లు నవంబర్ 17న ఎన్నికల కమిషన్ తేల్చి చెప్పింది. జేడీ(యూ) పార్టీలోని మెజారిటీ శాసనసభ్యులు, జాతీయ కౌన్సిల్ నితీశ్‌కే మద్దతు తెలిపినట్లు పేర్కొంది. ఈ మేరకు పార్టీని, గుర్తును తమకే కేటాయించాలంటూ శరద్ యాదవ్ వర్గం దాఖలు చేసిన పిటిషన్ ఈసీ తిరస్కరించింది.
బీజేపీకి మద్దతు, ఆర్జేడీతో తెగదెంపుల విషయంలో ఇరువురు నేతల మధ్య విభేదాలు రావడంతో పార్టీ రెండుగా చీలింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నితీశ్ కుమార్‌కే జేడీ(యూ)
ఎప్పుడు : నవంబర్ 17
ఎవరు : కేంద్ర ఎన్నికల కమిషన్
భారత్‌లో 73 కోట్ల మంది మరుగుదొడ్లకు దూరం
ప్రపంచంలో అత్యధిక మంది మరుగుదొడ్లకు దూరంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ మొదటి స్థానంలో ఉందని వాటర్ ఎయిడ్ సంస్థ వెల్లడించింది. నవంబర్ 19న వరల్డ్ టాయిలెట్ డే’ సందర్భంగా ఔట్ ఆఫ్ ఆర్డర్: ది స్టేట్ ఆఫ్ ద వరల్డ్స్ టాయ్‌లెట్స్-2017 పేరిట మూడో వార్షిక నివేదికను వెలువరించింది. దీని ప్రకారం భారత్‌లో ఏకంగా 73.22 కోట్ల మందికి మరుగుదొడ్డి సౌకర్యం లేదు. అంటే 130 కోట్లకుపైగా ఉన్న దేశ జనాభాలో సగానికిపైగా (56 శాతం) ప్రజలు ఆరు బయటే కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు.
ఈ జాబితాలో భారత్ తర్వాత చైనా రెండో స్థానంలో ఉంది. ఆ దేశంలో 34.35 కోట్ల మంది(జనాభాలో 25%)కి టాయిలెట్ సౌకర్యం లేదని నివేదిక తెలిపింది. తర్వాతి స్థానాల్లో వరుసగా నైజీరియా(12.28 కోట్లు- దేశ జనాభాలో 67%), ఇథియోఫియా(9.24 కోట్లు- జనాభాలో 93%), బంగ్లాదేశ్(8.55 కోట్లు- జనాభాలో 85.5%) నిలిచాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 230 కోట్ల మందికి టాయిలెట్ సౌకర్యం అందుబాటులో లేదని నివేదిక తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఔట్ ఆఫ్ ఆర్డర్: ది స్టేట్ ఆఫ్ ద వరల్డ్స్ టాయ్‌లెట్స్-2017 నివేదిక
ఎప్పుడు : నవంబర్ 18
ఎవరు : వాటర్ ఎయిడ్ సంస్థ
ఎక్కడ : ప్రపంచంలో అత్యధిక మందికి మరుగుదొడ్లు లేని దేశాల జాబితాలో మొదటి స్థానంలో భారత్
విశాఖ, ముంబైలో సీఈఎంఎస్ సంస్థలు
షిప్పింగ్ అవసరాలు తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ముంబై, విశాఖపట్నం నగరాల్లో ప్రపంచస్థాయి సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్‌స ఇన్ మారిటైమ్ అండ్ షిప్ బిల్డింగ్ (సీఈఎంఎస్) సంస్థలను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు కేంద్ర షిప్పింగ్‌శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కొచ్చిన్‌లో ప్రకటించారు. సాగర్‌మాల పథకంలో దీనిని ప్రధాన అంశంగా తీసుకోనున్నారు. షిప్పింగ్ పరిశ్రమ సంబంధిత నైపుణ్యంలో శిక్షణ ఇచ్చేందుకు రూ.766 కోట్లతో ఈ రెండు క్యాంపస్‌లను ఏర్పాటు చేయనున్నారు. బహుళజాతి సంస్థ సిమెన్‌స, ఇండియన్ రిజిస్టర్ ఆఫ్ షిప్పింగ్ (ఐఆర్‌ఎస్) సంస్థల భాగస్వామ్యంతో కేంద్ర షిప్పింగ్ శాఖ వీటిని ఏర్పాటు చేయనుంది. షిప్ డిజైన్, తయారీ, నిర్వహణ, మరమ్మతులు తదితర సేవల్లో అవసరమైన నైపుణ్యాలను అందించడం ఈ క్యాంపస్‌ల ప్రధాన లక్ష్యం.
సాంకేతికత, నైపుణ్యాలతో పాటు 87 శాతం నిధులను సిమెన్‌స సంస్థ గ్రాంటుగా అందిస్తోంది. విశాఖపట్నం క్యాంపస్ కోసం ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ (ఐఎంయూ) స్థలం, భవనం సమకూర్చింది. క్యాంపస్‌లను తొలి రెండేళ్లపాటు సీమెన్‌స సంస్థ నిర్వహిస్తుంది. తదుపరి ఐఆర్‌ఎస్ ఏర్పాటు చేసే ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ నిర్వహిస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : విశాఖ, ముంబైలో సీఈఎంఎస్ సంస్థలు
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : షిప్పింగ్ అవసరాలు తీర్చేందుకు
వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్స్‌లో భారత్‌కు 51వ స్థానం
ప్రముఖ గ్లోబల్ బిజినెస్ స్కూల్ ఐఎండీ’ వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్‌లో భారత్ 51వ స్థానంలో నిలిచింది. నైపుణ్యం కలిగిన వారిని నియమించుకోవడం, విదేశీ నిపుణులను ఆకర్షించడం, స్థానిక ప్రతిభను మెరుగుపరచుకోవడం వంటి అంశాల పరంగా భారత్ ఈ ర్యాంకును సొంతం చేసుకుంది. ఇక స్విట్జర్లాంట్ అగ్రస్థానం దక్కించుకుంది. దీని తర్వాతి స్థానంలో డెన్మార్క్, బెల్జియం ఉన్నాయి. ఆస్ట్రియా, ఫిన్‌లాండ్, నెదర్లాండ్‌స, నార్వే, జర్మనీ, స్వీడన్, లక్సెంబర్గ్ వంటివి టాప్-10లో నిలిచాయి.
ఇన్వెస్ట్‌మెంట్ అండ్ డెవలప్‌మెంట్, అప్పీల్, రెడీనెస్ వంటి అంశాల్లో భారత్ వరుసగా 62, 43, 29 ర్యాంకులను సొంతం చేసుకుందని ఐఎండీ తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వర ల్డ్ టాలెంట్ ర్యాంకింగ్స్ - 2017
ఎప్పుడు : నవంబర్ 21
ఎవరు : ఐఎండీ
ఎక్కడ : 51వ స్థానంలో భారత్
యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్‌లో చెన్నై
ప్రతిష్టాత్మక యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్‌లో భారత్‌లోని చెన్నై నగరం చోటు దక్కించుకుంది. ఈ మేరకు చెన్నైతో కలిపి 44 దేశాల నుంచి 64 నగరాలకు ఈ నెట్‌వర్క్‌లో చోటు కల్పిస్తూ యునెస్కో డెరైక్టర్ జనరల్ ఇరినా బొకొవా నవంబర్ 8న నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ జాబితాలో స్థానం పొందిన నగరాల సంఖ్య 180కి చేరింది.
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి(సిటీ ఆఫ్ మ్యూజిక్), రాజస్తాన్‌లోని జైపూర్(సిటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్) నగరాలు 2015 డిసెంబర్‌లోనే ఈ జాబితాలో స్థానం పొందాయి. యూనెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్‌ను 2004లో ప్రారంభించారు. ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, సంగీతం, పర్యావరణ అంశాల్లో గుర్తింపు పొందిన నగరాల అభివృద్ధి కోసం ఈ వేదికను ప్రారంభించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : యూసీసీఎన్‌లో స్థానం పొందిన చెన్నై
ఏమిటి : నవంబర్ 8
ఎవరు : యునెస్కో
ఎందుకు : సంగీతం విభాగంలో
ఢిల్లీలో వాతావరణ అత్యవసర పరిస్థితి
దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యంతో కూడిన పొగ మంచు కప్పేయడంతో జాతీయ కాలుష్య నియంత్రణ మండలి నవంబర్ 8న అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. వృద్ధులు, పిల్లలు ఇళ్లకే పరిమితం కావాలని సూచించింది. పాఠశాలలకు ఐదు రోజులు సెలవు ప్రకటించారు. ఢిల్లీ మీదుగా వెళ్లే కాలుష్య కారక భారీ వాహనాలను నియంత్రిస్తున్నారు. నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లో వాహన, పారిశ్రామిక కాలుష్యం ఎక్కువ. అందువల్ల అక్కడ అధిక క్యూబిక్ సెంటీ మీటర్ డీజిల్ వాహనాల వాడకంపై ఆంక్షలు అమలవుతున్నాయి. పదేళ్లు పైబడిన వాహనాలను నిషేధించారు. కాలుష్యం తీవ్రత దృష్ట్యా ఈ ఏడాది దీపావళికి టపాసులను సుప్రీంకోర్టు అనుమతించలేదు. ఢిల్లీ పొరుగు రాష్ట్రాలు పంజాబ్, హరియాణాల్లో రైతులు వరి పంటను కోసిన తర్వాత రెల్లు గడ్డిని, వరి మొదళ్లను పొలాల్లోనే తగలబెడుతున్నారు. దీంతో వెలువడే పొగ ఢిల్లీ మీదుగా వ్యాపిస్తోంది.
హిమాచల్‌ప్రదేశ్‌లో 74% పోలింగ్
హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీకి నవంబర్ 9న జరిగిన ఎన్నికల్లో ఆ రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా 74.45 శాతం పోలింగ్ నమోదయిందని ప్రధాన ఎన్నికల అధికారి పుష్పేందర్ రాజ్‌పుత్ తెలిపారు. మొత్తం 68 నియోజకవర్గాల్లోని 7,525 పోలింగ్ కేంద్రాల్లో 11,283 రసీదు ఇచ్చే ఓటింగ్ యంత్రాల (వీవీపీఏటీ)ను ఏర్పాటు చేశారు. హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను డిసెంబర్ 18న ప్రకటిస్తారు.
విపత్తు నిర్వహణకు ఫేస్‌బుక్ సాయం
విపత్తు నిర్వహణకు సాయం అందించేందుకు సిద్ధమని ఫేస్‌బుక్ ప్రకటించింది. భారత దేశంలోని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్‌డీఎమ్‌ఏ)తో కలిసి పనిచేయనున్నట్లు వెల్లడించిది. ఇందుకోసం డిజాస్టర్ మ్యాప్‌ను రూపొందించినట్లు తెలిపింది. ఇప్పటికే ఇది ఫేస్‌బుక్ వినియోగదారులందరికీ అందుబాటులోకి తెచ్చినట్లు ఇండియా, దక్షిణ, మధ్యఆసియా దేశాల ప్రాజెక్ట్ అధికారిగా వ్యవహరిస్తున్న రితేష్ మెహతా వెల్లడించారు.
సాధారణంగా విపత్తుల సమయంలో అందరూ ఆన్‌లైన్‌లో ఉంటారన్న గ్యారెంటీ లేదు, ఒకవేళ ఆన్‌లైన్‌లో ఉన్నా సర్వీసులన్నీ బిజీ అని రావచ్చు, అయితే ఇటువంటి సమయాల్లో కూడా సమాచారం అందుబాటులో ఉండేలా చూడడం కోసం ఫేస్‌బుక్ కొత్త సాధనాన్ని అందుబాటులోకి తెస్తోంది. ఈ మ్యాపులను జూన్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్ విపత్తు నిర్వహణకు డయాస్టర్ మ్యాప్‌లు
ఏమిటి : నవంబర్ 9
ఎవరు : ఫేస్‌బుక్
హోం శాఖ కింద రెండు కొత్త విభాగాలు
ఉగ్రవాదంవైపు యువత ఆకర్షితులు కాకుండా చూసేందుకు, సైబర్ మోసాలను అరికట్టేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కొత్తగా రెండు విభాగాలను ఏర్పాటు చేసింది. హోం శాఖ కింద పనిచేసే పలు విభాగాల్లో శుక్రవారం కొన్ని మార్పులు జరిగాయి. ఉగ్రవాదుల కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు అవసరమైన వ్యూహాలను రచించేందుకు CTCR (కౌంటర్ టైజం, కౌంటర్ ర్యాడికలైజేషన్)ను ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్ మోసాలు, హ్యాకింగ్ వంటి సైబర్ సవాళ్లను ఎదుర్కొనేందుకు సైబర్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ (CIS) కొత్తగా ఏర్పాటైంది. మరికొన్ని విభాగాలను ఒకదానిలో మరొకటి విలీనం చేశారు. ఇకపై హోం మంత్రిత్వ శాఖ కింద 18 విభాగాలు ఉంటాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కేంద్ర హోంశాఖ కింద 18 విభాగాలు
ఏమిటి : నవంబర్ 18
ఎవరు : కేంద్ర హోంశాఖ
ఎందుకు : కొత్తగా సీటీసీఆర్, సీఐఎస్ విభాగాల ఏర్పాటు
జడ్జీల వేతనాల పెంపుపై కమిషన్
దిగువ కోర్టుల్లో విధులు నిర్వహిస్తున్న 21 వేల మంది జడ్జీల వేతనాల పెంపును సిఫార్సు చేసే కమిషన్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నవంబర్ 10న జరిగిన భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి పి.వెంకట రామారెడ్డి నేతృత్వంలో ఏర్పాటుకానున్న ఈ కమిషన్‌లో కేరళ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఆర్.బసంత్ సభ్యుడిగా ఉంటారు. 18 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వాలకు కమిషన్ సిఫార్సుల్ని అందచేస్తుంది. జడ్జీలు, కింది కోర్టుల్లోని జ్యుడీషియల్ అధికారులకు 2010లో చివరిసారిగా జీతాలు పెంచినా.. జనవరి1, 2006 నుంచి జీతాల పెంపును అమలు చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి :జడ్జీల వేతనాల పెంపు కోసం జస్టిస్ వెంకట రామారెడ్డి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు
ఏమిటి : నవంబర్ 10
ఎవరు : కేంద్ర కేబినెట్
ఢిల్లీకి భారీ ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ కేంద్రం
ఎగ్జిబిషన్ మార్కెట్‌లో షాంఘై, హాంకాంగ్, సింగపూర్‌తో పోటీ పడేందుకు దేశ రాజధాని న్యూఢిల్లీ శివారు ప్రాంతం ద్వారకాలో రూ. 25,703 కోట్లతో ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ కేంద్రం(ఈసీసీ) ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ), నాన్-పీపీపీ పద్ధతిలో 2025 నాటికి ఈసీసీని పూర్తి చేయనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ కేంద్రం ఏర్పాటుకు ఆమోదం
ఏమిటి : నవంబర్ 10
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎక్కడ : న్యూఢిల్లీ శివారులో
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం
ఉన్నత విద్యా సంస్థల కోసం ప్రవేశ పరీక్షలు నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఏన్‌టీఏ) ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రారంభంలో సీబీఎస్‌ఈ నిర్వహిస్తున్న పరీక్షల్ని ఎన్‌టీఏ నిర్వహిస్తుందని, క్రమంగా మిగతా పరీక్షల్ని నిర్వహణను చేపడుతుందని ప్రభుత్వం అధికారిక ప్రకటనలో తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాటుకు ఆమోదం
ఏమిటి : నవంబర్ 10
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : ఉన్నత విద్యా సంస్థల కోసం ప్రవేశ పరీక్షలు నిర్వహించేందుకు
కశ్మీర్‌లోని కౌరిలో భూకంపాలను తట్టుకునే వంతెన
అత్యంత వినాశకర భూకంపాలు, పేలుళ్లను తట్టుకునేలా కశ్మీర్‌లోని చినాబ్ నదిపై అత్యంత ఎత్తయిన రైల్వే వంతెనను నిర్మిస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. రిక్టర్ స్కేలుపై ఎనిమిది తీవ్రత గత భూకంపాలను, 30 కేజీల పేలుడు పదార్థం సృష్టించే విస్ఫోటనాన్ని సైతం ఈ వంతెన తట్టుకోగలదని చెప్పారు. ఇందుకోసం ఐఐటీ రూర్కీ, బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సెన్సైస్, రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో)లకు చెందిన నిపుణుల పర్యవేక్షణలో వారు అందించిన డిజైన్‌తో వంతెన నిర్మాణాన్ని చేపట్టారు.
నదిపై 359 మీటర్ల ఎత్తులో నిర్మిస్తున్న ఈ వంతెన నిర్మాణ వ్యయం రూ.1250కోట్లు. పారిస్‌లోని ప్రఖ్యాతిగాంచిన ఈఫిల్ టవర్ కంటే ఈ వంతెన 30 మీటర్లు ఎత్తులో ఉంటుంది. 2019 మే నెలకల్లా ప్రాజెక్టు పూర్తిచేయాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. భారత భూభాగాన్ని కశ్మీర్ లోయను కలుపుతూ చేపట్టిన ఉధంపూర్-రేసి-అనంత్‌నాగ్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో భాగంగా ఈ వంతెనను నిర్మిస్తున్నారు. వంతెన మొత్తం పొడవు 1,315 మీటర్లుకాగా అందులో నదిపై పూర్తిగా ఉక్కుతో నిర్మిస్తున్న భాగం పొడవు 476 మీటర్లు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భూకంపాలను సైతం తట్టుకునే వంతెన నిర్మాణం
ఎక్కడ : కశ్మీర్‌లోని చినాబ్ నదిపై
ఎందుకు : భారత భూభాగాన్ని కశ్మీర్ లోయను కలుపుతూ చేపట్టిన ఉధంపూర్-రేసి-అనంత్‌నాగ్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో భాగంగా
వైష్ణోదేవీ ఆలయంలో రోజుకు 50 వేల మందికే దర్శనం
కశ్మీర్‌లోని ప్రఖ్యాత వైష్ణోదేవీ ఆలయంలోకి రోజుకు 50 వేల మంది భక్తులను మాత్రమే అనుమతించాలంటూ జాతీయ హరిత ట్రిబ్యునల్ నవంబర్ 13న ఆదేశాలు జారీచేసింది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ట్రిబ్యునల్ చైర్మన్ స్వతంతర్ కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
బ్యాటరీ కార్లతోపాటు కాలినడకన ఆలయానికి చేరుకునేవారి కోసం రూ.40 కోట్లతో ప్రత్యేకంగా నిర్మించిన రహదారిని నవంబర్ 24న ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రారంభించాలని ట్రిబ్యునల్ ఆదేశించింది. ఈ దారిలో యాత్రికుల, సరకు రవాణా కోసం గుర్రాలు, గాడిదలు తదితర జంతువులను అనుమతించకూడదంది. పాత మార్గం నుంచి కూడా జంతువుల చేత రవాణాను క్రమక్రమంగా తొలగిస్తామంది. రోడ్లపైన, కాట్రా పట్టణ బస్టాండ్ సమీపాన చెత్త వేసే వారికి రూ.2,000 జరిమానా విధించాలని ఆదేశించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వైష్ణోదేవీ ఆలయంలో రోజుకు 50 వేల మందికే దర్శనం
ఏమిటి : నవంబర్ 13
ఎవరు : జాతీయ హరిత ట్రిబ్యునల్
ఎందుకు : అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు
పశ్చిమ బెంగాల్‌కు రసగుల్లా జీఐ గుర్తింపు
రసగుల్లా స్వీట్ మా ప్రాంతానిదేనంటూ భౌగోళిక గుర్తింపు (జీఐ) కోసం పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలు పోటీపడ్డాయి. అయితే, ఈ రసగుల్లా పశ్చిమ బెంగాల్‌కే చెందుతుందని ప్రపంచ వాణిజ్య సంస్థకు చెందిన అనుబంధ సంస్థ జీఐ గుర్తింపునిచ్చింది. దీంతో పశ్చిమ బెంగాల్ తమతో పోటీ పడ్డ ఒడిశా మీద విజయం సాధించినట్లయింది. రసగుల్లా స్వీట్ పశ్చిమ బెంగాల్‌దేనని దీనికి భౌగోళిక గుర్తింపు లభించడం బెంగాలీ ప్రజలందరికీ తీయని వార్త అని ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ట్వీట్ చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రసగుల్లా భౌగోళిక గుర్తింపు
ఎప్పుడు : నవంబర్ 14
ఎవరు : పశ్చిమ బెంగాల్‌కు
న్యూఢిల్లీలో 37వ ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్
న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఏర్పాటు చేసిన 37వ ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నవంబర్ 14న ప్రారంభించారు. 14 రోజుల పాటు జరిగే ఈ ఫెయిర్‌ను ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ (ITPO) నిర్వహిస్తోంది. వియత్నాం భాగస్వామ్య దేశంగా.. జార్ఖండ్ భాగస్వామ్య రాష్ట్రంగా వ్యవహరిస్తున్నాయి. 22 దేశాలకు చెందిన 7 వేల మంది ప్రతినిధులు తమ ఉత్పత్తులను ఈ ఫెయిర్‌లో ప్రదర్శనకు ఉంచారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 37వ ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్
ఎప్పుడు : నవంబర్ 14 - 28
ఎవరు : ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్
ఎక్కడ : ప్రగతి మైదాన్, న్యూఢిల్లీ
దంతెవాడలో భారత తొలి గిరిజన ఎంట్రెప్రెన్యూర్‌షిప్ సదస్సు
భారత తొలి ఎంట్రెప్రెన్యూర్‌షిప్ సదస్సుని ఛత్తీస్‌గఢ్ బస్తర్ ప్రాంతంలోని దంతెవాడలో నవంబర్ 14న నిర్వహించారు. భారత్‌లో జరుగుతున్న 8వ గ్లోబల్ ఎంట్రెప్రెన్యూర్‌షిప్ సదస్సులో భాగంగా.. నీతి ఆయోగ్, అమెరికా ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో ఈ సదస్సు జరిగింది. గిరిజన యువతలో వ్యాపార దృక్పథాన్ని పెంపొందించేందుకు ఈ సదస్సు నిర్వహించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత తొలి గిరిజన ఎంట్రెప్రెన్యూర్‌షిప్ సదస్సు
ఎప్పుడు : నవంబర్
ఎవరు : నీతి ఆయోగ్, అమెరికా ప్రభుత్వం
ఎక్కడ : దంతెవాడ, ఛత్తీస్‌గఢ్
ఢిల్లీలో పేపర్ పరిశ్రమల అంతర్జాతీయ సమ్మేళనం
పేపర్ పరిశ్రమల 13వ అంతర్జాతీయ సమ్మేళనాన్ని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్ధన్ నవంబర్ 1న ఢిల్లీలో ప్రారంభించారు. సదస్సులో 22 దేశాల నుంచి ప్రముఖ సంస్థలు పొల్గొని పేపర్ తయారీలో ఆయా సంస్థలు అనుసరిస్తున్న సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రదర్శించాయి. ఈ సందర్భంగా పూర్తి స్థాయిలో వ్యర్థాల రీసైకిల్ ద్వారా పేపర్ తయారీ, దేశ ఆర్థిక ప్రగతి, ఉద్యోగ కల్పనలో పేపర్ పరిశ్రమల పాత్ర వంటి అంశాలపై చర్చించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పేపర్ పరిశ్రమల 13వ అంతర్జాతీయ సమ్మేళనం
ఎప్పుడు : నవంబర్ 2
ఎవరు : కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్ధన్
ఎక్కడ : ఢిల్లీ
ఎందుకు : పేపర్ తయారీలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడానికి
తొమ్మిది ప్రధాన బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం
ఎనిమిది రాష్ట్రాలకు సంబంధించిన తొమ్మిది కీలకమైన బిల్లులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. వీటిలో పశ్చిమ బెంగాల్ ఇండస్ట్రియల్ అమెండ్‌మెంట్ బిల్లు, గుజరాత్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ తదితరాలు ఉన్నట్లు రాష్ట్రపతిభవన్ వర్గాలు నవంబర్ 5న వెల్లడించాయి. గుజరాత్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం నిర్బంధ ఖైదీలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో మాట్లాడే అవకాశం కల్పిస్తారు. దీంతో కీలక కేసుల్లో శిక్ష పడిన ఖైదీల రక్షణ, వారిని కోర్టులకు తీసుకొచ్చే ఇబ్బందులు పోలీసులకు ఉండవు.
అంతర్రాష్ట్ర మండలి స్థాయీ సంఘం పునరుద్ధరణ
2016లో ఏర్పాటైన అంతర్రాష్ట్ర మండలి స్థాయీ సంఘం పదవీ కాలం ముగియడంతో దాన్ని పునరుద్ధరిస్తూ కేంద్ర హోం శాఖ అక్టోబర్ 31న ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఏర్పాటైంది. కేంద్ర మంత్రులు సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరీ, తావర్‌చంద్ గెహ్లట్; పంజాబ్, ఛత్తీస్‌గఢ్, త్రిపుర, ఒడిశా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు ఇతర సభ్యులు.
భారతీయ కిచిడీకి గిన్నిస్ రికార్డు
భారతీయుల సంప్రదాయ వంటకాల్లో ఒకటైన కిచిడీ గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించింది. ఢిల్లీలో నిర్వహించిన గ్రేట్ ఇండియన్ ఫుడ్ స్ట్రీట్ ఉత్సవంలో నవంబర్ 4న దాదాపు 918 కేజీల కిచిడీని తయారుచేసి చరిత్ర సృష్టించారు. అక్షయ పాత్ర అనే స్వచ్ఛంద సంస్థ, సంజీవ్ కపూర్ అనే పాకశాస్త్ర ప్రవీణుడి నేతృత్వంలో 50 మంది బృందం ఈ కిచిడీని తయారుచేసింది.
లడఖ్‌లో అత్యంత ఎత్తయిన రహదారి
బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్‌ఓ) జమ్మూ కశ్మీర్‌లోని లడఖ్‌లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రహదారిని విజయవంతంగా పూర్తి చేసింది. ఈశాన్య ప్రాంతంలోని ఇండో-చైనా సరిహద్దులోని చిసూమ్లే, డెమ్‌చోక్ గ్రామాలను కలుపుతూ 86 కి.మీ. పొడవుగల రోడ్డును భూ ఉపరితలానికి 19,300 అడుగుల ఎత్తులో నిర్మించింది.
వేసవిలో ఇక్కడి ఉష్ణోగ్రత మైనస్ 10 నుంచి 20 డిగ్రీలు ఉంటుంది. ఎత్తయిన ప్రాంతం కావడంతో ఆక్సిజన్ స్థాయి మిగతా ప్రాంతాలతో పోలిస్తే 50 శాతం తక్కువగా ఉంటుంది. తద్వారా ఇక్కడ పనిచేసేవారు ప్రతి పది నిమిషాలకు ఓసారి ఆక్సిజన్ కోసం కిందకు వెళ్లాల్సి వచ్చేది. చాలామంది జ్ఞాపక శక్తి లోపం, కంటిచూపు మందగించడం, అధిక రక్తపోటు వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారని రహదారి నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన చీఫ్ ఇంజనీర్, ప్రాజెక్ట్ హిమాంక్ అధికారి డీఎమ్ పుర్విమత్ తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచంలో అత్యంత ఎత్తై రహదారి
ఎప్పుడు : నవంబర్ 1
ఎవరు : బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్
ఎక్కడ : లడఖ్, జమ్మూకాశ్మీర్
ఫోర్ వీలర్లకు ఫాస్టాగ్ పరికరం తప్పనిసరి
డిసెంబర్ 1 నుంచి విక్రయించే కొత్త ఫోర్ వీలర్ వాహనాలన్నింటికి ‘ఫాస్టాగ్’ పరికరం తప్పనిసరిగా అమర్చాలని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ నవంబర్ 2న ఉత్తర్వులు జారీ చేసింది.
వాహనం విండ్‌స్క్రీన్‌పై అమర్చే ఈ డివైజ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్‌ఎఫ్‌ఐడీ) టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. దీనిని ఆయా వాహనదారుల సేవింగ్‌స ఖాతా లేదా ప్రీపెయిడ్ ఖాతాకు అనుసంధానం చేస్తారు. టోల్ గేట్ల నుంచి ప్రయాణించేటప్పుడు ఈ ఫాస్టాగ్‌లలో నిక్షిప్తమైన సమాచారం ఆధారంగా చెల్లింపు ప్రక్రియ పూర్తవుతుంది. ప్రస్తుతం జాతీయ రహదారులపై 370 టోల్ ప్లాజాల్లో ఫాస్టాగ్ విధానం అమల్లో ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఫోర్ వీలర్లకు ఫాస్టాగ్ తప్పనిసరి
ఎప్పుడు : డిసెంబర్ 1
ఎవరు : కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ
ఎందుకు : టోల్‌గేట్ల దగ్గర చెల్లింపుల ప్రక్రియను సులభతరం చేయడం కోసం
ఎత్తయిన వంతెనకు ఇండియన్ రైల్వే శ్రీకారం
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైలు వంతెన నిర్మాణ పనులను భారత్‌కు చెందిన కొంకణ్ రైల్వే నవంబర్ 6న ప్రారంభించింది. దీన్ని కశ్మీర్ లోయలోగల చినాబ్ నదిపై 359 మీటర్ల ఎత్తులో నిర్మిస్తున్నారు. ఇది కుతుబ్ మినార్ కంటే ఐదు రెట్లు ఎక్కువ ఎత్తులో ఉంటుంది. ఉధమ్‌పూర్- శ్రీనగర్- బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్టులో భాగంగా దీనిని ప్రారంభించారు. ప్రాజెక్టు వ్యయం రూ.5,005 కోట్లు. 1,315 మీటర్ల పొడవుగల వంతెన నిర్మాణానికి 25 వేల మిలియన్ టన్నుల స్టీల్‌ను ఉపయోగిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచంలోనే ఎత్తయిన రైల్వే వంతెన నిర్మాణం ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 6
ఎవరు : కొంకణ్ రైల్వే (భారతీయ రైల్వే)
ఎక్కడ : కశ్మీర్ లోయలోగల చినాబ్ నదిపై
ఎందుకు : ఉధమ్‌పూర్- శ్రీనగర్- బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్టులో భాగంగా

Published date : 15 Nov 2017 11:28AM