Skip to main content

Civil Defence Mock Drill: భారత్‌లో రేపు మాక్ డ్రిల్.. ఈ డ్రిల్‌లో చేసేది ఏమిటంటే..?

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాక్ ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతూనే ఉన్నాయి.
Nationwide Civil Defence Drills in India Preparing for Emergencies

దీంతో కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేసింది. మే 7వ తేదీన (బుధవారం) ఈ డ్రిల్ నిర్వహించాల్సిందిగా మే 5న కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. 1971లో భారత్-పాకిస్తాన్ యుద్ధ సమయంలో  సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్‌ జరిగింది.

మాక్ డ్రిల్ ఉద్దేశ్యం 
ఈ మాక్‌ డ్రిల్లుల ప్రధాన ఉద్దేశ్యం, శత్రు దాడుల సమయంలో ప్రజలు ఎలా స్పందించాలి, ఎలా స్వీయరక్షణ పొందాలి, అనే అంశాలపై ప్రజలకు శిక్షణ ఇవ్వడం. ముఖ్యంగా విద్యార్థులు, యువత ఈ తరహా పరిస్థితుల్లో భయానికి లోనవకుండా, సరిగ్గా ఎలా స్పందించాలో తెలిసేలా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని కేంద్రం తెలిపింది. 

ఎయిర్‌ రైడ్‌ హెచ్చరికలు – స్పందన విధానాలు
ఈ డ్రిల్‌లో భాగంగా, ఎయిర్‌ రైడ్‌ హెచ్చరికల సైరన్లు మోగించి వాటి పనితీరును పరీక్షించాల్సిందిగా సూచించారు. సైరన్లు విన్న వెంటనే ప్రజలు కంట్రోల్ రూమ్స్, షెల్టర్స్, బంకర్లకు వెళ్లే విధానం, విద్యుత్‌ను నిలిపివేసే బ్లాక్‌అవుట్ చర్యలు, ముఖ్యమైన కేంద్రాలను కామోఫ్లేజ్ చేయడం వంటి చర్యలు కూడా ఇందులో భాగమవుతాయి.

India-Pakistan Crisis: ఇప్పటివరకు పాకిస్తాన్‌పై భారత్ తీసుకున్న చర్యలు ఇవే..

సరిహద్దు రాష్ట్రాలకు ప్రత్యేక సూచనలు
పాక్‌ రెచ్చగొట్టే చర్యలకు దిగే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని, పంజాబ్, గుజరాత్, రాజస్థాన్, జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ వంటి సరిహద్దు రాష్ట్రాలకు ప్రత్యేక సూచనలు చేశారు. ఈ రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పటికే పలు హెచ్చరికలు చేసిన కేంద్రం, ఇప్పుడు మాక్‌ డ్రిల్లులు కూడా అదే క్రమంలో చేపట్టాలన్నది దృష్టిలో పెట్టుకుంది.

మాక్ డ్రిల్‌లో చేసేది ఏమిటంటే..?
ఈ డ్రిల్‌లో వైమానిక దాడుల హెచ్చరికలపై సైరన్లు మోగించడం, బ్లాక్‌అవుట్ చర్యలు చేపట్టడం, పౌరులను తక్షణ చర్యల గురించి చైతన్య పరచడం వంటి అంశాలపై దృష్టి ఉంటుంది. ముఖ్యంగా..

  • ఎయిర్ రైడ్ సైరన్లు మోగించటం, ప్రజలకు హెచ్చరికలు అందించడం
  • హాట్‌లైన్/రేడియో కమ్యూనికేషన్ వ్యవస్థలు సజీవంగా ఉంచటం
  • కంట్రోల్ రూమ్‌లు మరియు షాడో కంట్రోల్ రూమ్‌ల ఏర్పాట్లు
  • పౌరుల తరలింపు ప్రణాళికలు ఆచరణలో పెట్టి పరీక్షించటం
  • విద్యుత్ సరఫరాను నిలిపివేసే క్రాష్ బ్లాక్‌అవుట్ చర్యలు
  • కీలక ప్లాంట్లు, సంస్థలు శత్రు దృష్టికి చిక్కకుండా కామోఫ్లేజింగ్ చేయడం
  • బంకర్లు, కందకాలను శుభ్రపరచడం, ఉపయోగించేందుకు సిద్ధంగా ఉంచడం

Pahalgam Terror Attack: ఉగ్రవాదంపై పోరులో ఏకమైన దేశం

Published date : 06 May 2025 03:27PM

Photo Stories