Mock Drill: మూడు కేటగిరీలుగా మాక్ డ్రిల్ ప్రాంతాల విభజన.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ జరగనుందంటే..

మే 7వ తేదీ దేశంలో ఎంపిక చేసిన ప్రాంతాల్లోని ముఖ్య ప్రదేశాలలో సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ మేరకు ఏయే ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలో అన్నీ రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేస్తోంది.
ఈ మాక్ డ్రిల్‌పై నేడు(మే 6వ తేదీ) కేంద్ర హోంశాఖ కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో అన్నీ రాష్ట్రాల సెక్రటరీలు, డీజీపీలు, ఫైర్ డీజీలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఏ ప్రాంతాల్లో ఎలా మాక్ డ్రిల్ నిర్వహించాలో ఉన్నతాధికారులకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
అదే సమయంలో దాడులకు అవకాశం ఉన్న జిల్లాలు మూడు కేటగిరీలుగా విభజించింది.
కేటగిరీ-1: ఢిల్లీ, ముంబై, సూరత్, వడోదర, కక్రాపర్, తారాపూర్, తాల్చేర్, కోటా, రావత్, చెన్నై, కల్పక్కం, నరోరా వంటి అణు విద్యుత్ కేంద్రాలున్న నగరాలు.
కేటగిరీ-2: హైదరాబాద్, విశాఖపట్నం సహా 201 జిల్లాలు, ఎయిర్‌పోర్టులు, కీలక మౌలిక సదుపాయాలున్న ప్రాంతాలు.
కేటగిరీ-3: 45 ఇతర జిల్లాలు, ప్రధానంగా సివిల్ డిఫెన్స్‌కు అవసరమైన వ్యూహాత్మక ప్రదేశాలు.
అలాగే, పాక్‌తో సరిహద్దు ఉన్న రాష్ట్రాలకు ప్రత్యేక సూచనలు చేసింది.
Civil Defence Mock Drill: భారత్‌లో మాక్ డ్రిల్.. ఈ డ్రిల్‌లో చేసేది ఏమిటంటే..?
రేపటి మాక్ డ్రిల్ నిర్వహించే విధానం ఇదే..
ఎయిర్ రైడ్ సైరన్స్: ప్రజల అప్రమత్తత కోసం ఎయిర్ రైడ్ సైరన్స్ మోగిస్తారు. వైమానిక దాడుల నుంచి రక్షించుకునేందుకు సురక్షిత ప్రదేశాలకి వెళ్ళాలి
క్రాష్ బ్లాక్ ఔట్స్: నగరాలలో సంపూర్ణంగా విద్యుత్ నిలిచిపోతుంది. వైమానిక దాడుల సమయంలో నగరాలను గుర్తించకుండా ఉండేందుకు ఈ ఎత్తుగడ అమలు. 1971 యుద్ధ సమయంలో బ్లాక్కౌట్ ఎత్తుగడను ఉపయోగించిన భారత్
కీలక సంస్థలు, ప్రాజెక్టుల రక్షణ: కమ్యూనికేషన్ టవర్స్, పవర్ ప్లాంట్స్, మిలిటరీ ఏరియాస్ ను గుర్తించకుండా ముందు జాగ్రత్త చర్యలు
తరలింపు చర్యలు: హై రిస్క్ జోన్లలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు. ఈ డ్రిల్ ద్వారా రెస్పాన్స్ టైం , లాజిస్టిక్స్ ఇష్యూస్ ను గుర్తించడం
పౌరులకు శిక్షణ: పాఠశాలలు, కాలేజీలు, కార్యాలయాలు కమ్యూనిటీ సెంటర్లలో శిక్షణ. సురక్షిత ప్రాంతాలను గుర్తించడం, ఫస్ట్ ఎయిడ్ చేయడం ఎలా, ఎమర్జెన్సీ సమయంలో ఆందోళనకు గురికాకుండా ఉండడం అంశాలపై శిక్షణ
India-Pakistan Crisis: ఇప్పటివరకు పాకిస్తాన్‌పై భారత్ తీసుకున్న చర్యలు ఇవే..
Tags
- Mock drill in India
- Mock Drill
- India-Pakistan Tensions
- Civil Defence Mock Drill
- Emergency Preparedness Drill
- civil defence training
- Civil Defence Mock Drill Work
- Pahalgam Terror Attack
- India-Pakistan war
- School Assembly News Headlines
- Sakshi Education News
- Latest News in Telugu
- India Blackout Mock Drill